త్వరలో కేఎస్పీకి జూరాల నీళ్లు | jurala water to ksp | Sakshi
Sakshi News home page

త్వరలో కేఎస్పీకి జూరాల నీళ్లు

Published Tue, Jan 21 2014 2:15 AM | Last Updated on Fri, Mar 22 2019 2:57 PM

jurala water to ksp

 రాజన్న కల సాఫల్యం కానుంది. మహబూబ్‌నగర్ పట్టణవాసుల దాహార్తిని తీర్చేందుకు ఆయన చేపట్టిన కోయిల్ సాగర్ పైపులైనుకు డ్రై ట్రయల్ రన్‌ను అధికారులు సోమవారం విజయవంతంగా నిర్వహించారు. ఎన్నో ఒడిదొడుకులను అధిగమించి ప్రాజెక్టు పనులను పూర్తిచేయడంతో ఇప్పుడు ఈ ప్రాజెక్టు ద్వారా తాగునీరు, కొన్ని ప్రాంతాలకు సాగునీరు వచ్చేనెలనాటికి అందనుంది.
 
 పాలమూరు, మరికల్ న్యూస్‌లైన్:
 ఫిబ్రవరిలో జూరాల  బ్యాక్ వాటర్‌ను కోయిల్‌సాగర్ ప్రాజెక్టుకు పంపింగ్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రాజెక్ట్  ఎసీఈ శ్రీరామకృష్ణ, ఏఈ కె.కరుణకర్‌రెడ్డిలు తెలిపారు. సోమవారం సాయంత్రం నర్వ మండలం  ఉద్యాల సమీపంలో చేపడుతున్న స్టేజీ 1లో 7.5 మోగవాట్స్ సామర్థ్యం గల పంపునకు విజయవంతంగా ప్రాజెక్ట్ ఆధికారులు ట్రయల్న్ ్ర నిర్వహించారు. ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ స్టేజీ 1,2లో రెండు 7.5 మోగవాట్స్ సామర్థ్యం గల మోటార్లు ట్రాయాల్న్ ్ర మొదటి పేజీ తరువాయి
 పూర్తికావడంతో ఫిబ్రవరి మొదటి వారంలో స్టేజీ 1దగ్గర జూరాల బ్యాక్ వాటర్ పంపింగ్‌కు చర్యలు ముమ్మరం చేశామని తెలిపారు.పది రోజుల్లో ఒక పంపు ద్వారా జూరాల నీటీని ట్రాయిల్న్ ్రనిర్వహించి. మరో పది రోజుల్లో స్టేజీ 2 దగ్గర నీటి పంపింగ్ చేపడతామన్నారు. మొదటి ప్రయత్నంగా రెండు మోటార్ల ద్వారా నీటి పంపింగ్ పూర్తయిన వెంబడే మిగతా రెండు 7.5 మెగావాట్స్ సామర్థ్య గల మోటార్ల బిగింపు పనులు ప్రారంభించి మార్చి నాటికి పూర్తి స్థాయిలో నీటిని తోడేందుకు చర్యలు తీసుకుంటున్నమన్నారు.ఈకార్యక్రమంలో బిహెఎల్ ఆధికారి ప్రసాద్, ప్రాజెక్ట్ ఆధికారులు సీద్ధీక్, మెహన్‌రెడ్డి,పురోషత్తంరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
 
 పాలమూరుకు తీరనున్న దాహం
 పాలమూరు పట్టణ ప్రజలను ఏళ్లతరబడి తాగునీటి సమస్యకు తగిన పరిష్కారం చూపేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రత్యేక దృష్టి నిలిపి 2005లో కోయిల్‌సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు కేటాయించారు ఆయన మరణానంతరం ఏళ్లతరబడి జాప్యం నెలకొంది. నిధుల మంజూరులో ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నప్పటికీ.. ఉన్న నిధులతోనే నిర్మాణ పనులను జిల్లా ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్ ప్రకాష్ ఆధ్వర్యంలో సంబంధిత అధికారులు తుది దశకు చేర్చారు. ఈ నేపథ్యంలోనే డ్రై రన్ ప్రక్రియ కూడా ప్తూయింది. రామన్‌పాడు పథకం పుణ్యమా అని కొంతమేరకు ఇబ్బంది తొలగినా పూర్తి స్థాయిలో పట్టణ జనాభాకు అనుగుణంగా తాగునీటిని అందించేందుకు ఉద్దేశించిన కోయిల్‌సాగర్ ప్రాజెక్టు  కూడా అందుబాటులోకి రావడంతో అయోమయం తొలగి పోయింది. ఈ వేసవిలో పట్టణ వాసులకు తాగునీటి సమస్య దూరమయ్యే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. చివరి అంకానికి చేరుకున్న ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు, తాగునీరు సమృద్ధిగా అందితే  మహానేత కల సాకారం అవుతుందని ఆయన అభిమానులు పేర్కొన్నారు.
 
 ప్రాజెక్టు ఇలా..!
 కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా 3.90 టీఎంసీల నీటిని వినియోగానికి తీసుకురావాల్సి ఉంటుంది. 50,250 ఎకరాల మేర సాగునీటిని మళ్లించాలి. అంతే కాకుండా పాలమూరు పట్టణంలోని దాదాపు 3 లక్షల జనాభాకు సరిపడ తాగునీటిని ఇవ్వాలి. జూరాల బ్యాక్ వాటర్ పరిధిలో నిర్మించే రెండు లిఫ్టుల ద్వారా నిర్మించే  ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 360.18 కోట్లు తొలి దశలో నిధులు సమృద్ధిగా విడుదలైనప్పటికీ.. ప్రస్తుతం రూ. 40 కోట్ల వరకు మంజూరు కావాల్సి ఉంది. 2005లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు పనులు 2009లో పూర్తి కావాల్సి ఉండగా.. ఈ ఏడాది తుది దశకు చేరుకున్నాయి. పూర్తిస్థాయిలో నీరందించ గలిగితే మహబూబ్‌నగర్ పట్టణానికే కాకుండా హన్వాడ మండల ప్రజలకు కూడా తాగునీటిని అందించే అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రాజెక్టు పరిధిలోని దేవరకద్ర, చిన్నచింతకుంట, ధన్వాడ, కొయిలకొండ, మక్తల్, నర్వ మండలాల పరిధిలో 50, 250 హెక్టార్లలో పంటల సాగుకు నీటిని వినియోగించేందుకు వీలవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement