‘సాగర్’లో తగ్గుతున్న నీటిమట్టం | Water-leveldecreasing in nizam sagar project | Sakshi
Sakshi News home page

‘సాగర్’లో తగ్గుతున్న నీటిమట్టం

Published Thu, Jan 23 2014 5:11 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM

Water-leveldecreasing in nizam sagar project

నిజాంసాగర్, న్యూస్‌లైన్ : నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు వదులుతున్న నీటిపై అధికారులు కాకి లెక్కలు వేస్తున్నారు. ఖరీఫ్ పూర్తవడంతో ఆయకట్టు కింద రబీ పంటల సాగు కోసం రైతులు ముందస్తుగా సమాయత్తమయ్యారు.  రబీ పంటలకు నాల్గు విడతల్లో 9 టీఎంసీల నీటిని అంది స్తామని ప్రకటించిన అధికారులు మొదటి విడతలోనే మూడు టీఎంసీల మేరనీటిని వదిలారు.

ఇంకా ప్రధాన కాలువకు నీటి విడుదల జరుగుతుండటంతో నిజాంసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం క్రమక్రమంగా తగ్గుతోంది. అయినా ఆయకట్టు కింద పంటల సాగు 60 శాతం పూర్తవలేదు. మొదటి ఆయకట్టు కింద పంటల సాగు కోసం రైతులు నారుమళ్లు వేసుకొని సాగు కోసం న్నద్ధమవుతున్నారు.

 డీఐబీ సమావేశంలో నాల్గు విడతలకు తీర్మానం
 నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ఆయ కట్టుకు నీటివిడుదల కోసం జిల్లా కేంద్రంలో రెండు నెలల క్రితం డీఐబీ (నీటిపారుదల శాఖ సలహా మండలి) సమావేశం నిర్వహించారు. చివరి ఆయకట్టు వరకు రబీ సీజన్‌లో పం టల సాగుకు అవసరం ఉన్న నీటి నిల్వలు జలాశయాలు, ఎత్తిపోతల పథకాల్లో పూర్తిస్థాయిలో ఉన్నా యి.

దీంతో  పంటల సాగు అవసరం ఉన్న నీటి తడులపైన జిల్లా నీటిపారుదల శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం  చేశారు. ఆయకట్టు కింద సమారు 2.10 లక్షల ఎకారల్లో పంటలను సాగు చేయనున్నట్లు వారు అంచనా వేశారు. అలీసాగర్ రిజర్వాయర్ ప్రాంతం వరకు ఉన్న సుమారు 1.38 లక్షల ఎకరాలకు నిజాంసాగర్ ప్రాజెక్టు నుం చి నాల్గు విడతల్లో 9 నుంచి 10 టీఎంసీల నీటి విడుదల కోసం వారు ప్ర తిపాదించారు. ఆయకట్టు కింద వరి, ఆరుతడి పంటల సాగు కోసం ప్రతి పాదించి అందుకు అనుగుణంగా షెడ్యూల్‌ను ఖరారు చేశారు.

 ఆరుతడి కోసం ప్రారంభించి..
 ఆరుతడి పంటల కోసం ప్రాజెక్టు నుంచి డిసెంబర్ 21న  ప్రధాన కాలువకు నీటివిడుదల చేపట్టారు. డిస్ట్రిబ్యూటరీ 28, 30 ప్రాంతాల్లో రైతులు పొద్దుతిరుగుడు, మొక్కజొన్న పంటలను సాగు చేస్తున్నారని నీటిని వదిలారు. అప్పటి నుంచి నిర్విరామంగా  నీటివిడుదల కొనసాగిస్తున్నారు. దీంతో ప్రాజెక్టులో నీటిమట్టం క్రమక్రమంగా తగ్గు తున్నా, ఆయకట్టు కింద పంటల సాగు 60 శాతం కూడా పూర్తికాలేనట్లు తెలుస్తోంది.

 మొదటి విడతలో 15 రోజుల పాటు ఆయకట్టుకు 1.5 నుంచి 2 టీఎంసీలు, రెండో విడతలో 15 రోజుల పాటు 1.5 నుంచి 2 టీఎంసీ లు, మూడో విడతలో 20 నుంచి 25 రోజుల పాటు 2 నుంచి 3 టీఎంసీలు, నాల్గో విడతలో  20 నుంచి 25 రోజుల పాటు 2 నుంచి 3 టీఎంసీల నీ టి విడుదలకు ప్రతిపాదించారు. ఆయకట్టు కింద సాగు చేస్తున్న పంటల ను గట్టెక్కించడానికి అవసరం ఉన్న నీటి నిల్వలు ప్రాజెక్టులో పుష్కలంగా ఉన్నాయి. కాని ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు వదులుతున్న నీరు వృథా కాకుండా పంటలకు ఉపయోగపడేలా అధికారులు చర్యలు తీసు కోకపోవడంతో నీరు వృథా అవుతున్నట్లు తెలుస్తోంది.

 తగ్గుతున్న నీటిమట్టం
 ఆయకట్టుకింద సాగు చేస్తున్న పంటల కోసం ప్రధాన కాలువకు నీటి విడుదల కొనసాగుతుండటంతో నిజాంసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం క్ర మక్రమంగా తగ్గుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1405.00 అడుగులు 17.8  టీఎంసీలకు గాను ప్రస్తుతం 1402.5 అడుగులతో 14.33 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement