nizam sagar project
-
నిధులు దోపిడీ చేస్తున్న కేసీఆర్: భట్టి
సాక్షి, నిజామాబాద్ : కొన్నిలక్షల ఎకరాలకు నీళ్లు పారేలా.. ఈ ప్రాంతానికి శ్రీరాంసాగర్ ప్రాజెక్టును నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు అందించారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. రైతులతో ముఖాముఖీలో భాగంగా ఆయన ఆదివారం శ్రీరామ్ ప్రాజెక్టును సందర్శించారు. ఆయనతోపాటు మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ఇంత పెద్ద ప్రాజెక్టును అందించిన నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు, కాంగ్రెస్ పార్టీకి ప్రజలు రుణపడి ఉండాలని అన్నారు. నేడు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, జీవన స్థితిగతులు పెరిగిన అందుకు ఆధునిక దేవాలయాలైన ఇలాంటి ప్రాజెక్టులు కారణం అని అన్నారు. ఇలాంటి ప్రాజెక్టులు పెరు చెప్పి, వాటికి కాస్త సున్నం వేసి.. వాటికి వారి పేర్లు పెట్టుకునే సంస్కృతికి టీఆర్ఎస్ నాయకులు దిగజారారని భట్టి విమర్శించారు. తెలంగాణలో టీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టు ఒక్కటి కూడా లేదని భట్టి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొదలు పెట్టిన బాబాసాహెబ్ అంబేడ్కర్ ప్రాజెక్టును కేసీఆర్ తన ధనదాహంతో రీ డిజైన్ పేరుతో మార్చారని మండి పడ్డారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి 7 జిల్లాలకు మంచి నీరు, పరిశ్రమలకు నీటి సదుపాయంతో సహా 16 లక్షల ఎకరాలకు నీరు అందేదని భట్టి వివరించారు. కేసీఆర్ కేవలం ధనదాహంతో నీళ్లు తెలంగాణలో పారకుండా రీ డిజైన్ పేరుతో అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక ప్రాజెక్టు అంచనాలను విపరీరంగా పెంచి రూ. లక్ష 15 వేల కోట్లకు పెంచారని చెప్పారు. కేసీఆర్ అత్యాశ వల్ల తెలంగాణ నష్టపోతోందని అన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టిన ప్రాజెక్టుల వద్ద పసుపు కుంకుమ జల్లి.. మా వల్లే ఈ నీళ్లు పారుతున్నాయని చెప్పుకోవడం.. అత్యంత బాధాకరమని భట్టి చెప్పారు. రాష్ట్ర నిధులు.. నీళ్లు దోపిడీకి గురి అవుతున్నాయని భట్టి విక్రమార్క మీడియాతో అన్నారు. -
ప్రాణాలు తీసిన సెల్ఫీ సరదా
సాక్షి, నిజాంసాగర్ (జుక్కల్) : దీపావళి నాడు సరదా కోసం నిజాంసాగర్ ప్రాజెక్టుకు వచ్చిన ఇద్దరు స్నేహితులు సెల్ఫీ మోజులోపడి ప్రాణాలు పోగొట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లా కల్హెర్ మండల కేంద్రానికి చెందిన మహమ్మద్ మన్నన్, పిట్ల ప్రశాంత్, సయ్యద్ సుమేర్, చెగుళ్ల బాలరాజు, కటికె శివ స్నేహితులు. శనివారం కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టుకు వచ్చిన వీరు నీటి మడుగుల వద్ద బండరాళ్లపైకి వెళ్లారు. ప్రాజెక్టు వరద గేట్ల నుంచి దిగువకు నీరు జాలు వారుతుండటంతో మడుగుల్లో సెల్ఫీలు దిగుతూ స్నానాలకు ఉపక్రమించారు. ఈ క్రమంలో మడుగుల లోతు అధికంగా ఉండటంతో శివ, సయ్యద్ సుమేర్ ఈతరాక నీటమునిగి పోయారు. అనంతరం పోలీ సులు గజ ఈతగాళ్లతో గాలించగా ఇరువురి మృతదేహాలు లభ్యమయ్యాయి. విహారయాత్రకు వచ్చి... ఎడపల్లి(బోధన్): సెల్ఫీమోజు ముగ్గురు బాలికల ప్రాణాలను బలితీసుకుంది. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం అలీసాగర్ ఉద్యానవనంలోని చెరువులో ఆదివారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. బోధన్ రాకాసిపేటకు చెందిన జుబేరా (10) ఇంటికి నిజామాబాద్ నుంచి మీరజ్ బేగం(16), హైదరాబాద్ నుంచి బషీరా బేగం (16) తమ కుటుంబసభ్యులతో వచ్చారు. ముగ్గురి కుటుంబాలకు చెందిన మొత్తం ఎనిమిది మంది అలీసాగర్ ఉద్యానవనానికి విహార యాత్రకు వెళ్లారు. అబ్దుల్‌తో పాటు ఈ ముగ్గురు పిల్లలు స్నానాలు చేయడానికి చెరువులోకి దిగారు. ఈ క్రమంలో సెల్ఫీలు తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు లోతైన ప్రదేశంలోకి జారిపోయి నీట మునిగారు. వీరిని గమనించిన కుటుంబ సభ్యులు సహాయం కోసం కేకలు వేయడంతో సమీపంలో ఉన్న బోటింగ్ పాయింట్ సభ్యుడు నగేష్ , చెరువులో చేపలుపడుతున్న జాలరి గంగాధర్ నీట మునుగుతున్న యువకుణ్ణి రక్షించగలిగారు. అప్పటికే బాలికలు నీట మునిగి మృతి చెందారు. పుట్టినరోజు వేడుకల్లో విషాదం వెంకటాపురం(కె): ములుగు జిల్లా వెంకటాపురం (కె) మండలం మరికాల గ్రామ సమీపంలోని గోదావరిలో మునిగి నలుగురు యువకులు మృతి చెందారు. వెంకటాపురం మండల పరిధి రంగరాజాపురం కాలనీకి చెందిన శశికుమార్ పుట్టినరోజు వేడుక జరుపుకోవడానికి శనివారం గ్రామానికి చెందిన 21 మంది యువకులు పాతమరికాల గ్రామ సమీపంలోని గోదావరి వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా 16 మంది సరదాగా నదిలోకి ðదిగారు. కొంతసేపటికి ప్రవాహం పెరగడంతో తుమ్మ కార్తీక్ (21), సంఖ్యా శ్రీకాంత్ (22), రాయవరపు ప్రకాశ్ (22), కోడిరెక్కల అన్వేశ్ (21) నీటిలో మునిగిపోవడాన్ని గమనించిన మిగతా మిత్రులు ఒడ్డుకు వచ్చారు. సాయంకోసం అరుపులు, కేకలు పెట్టడంతో చుట్టు పక్కల రైతులు అక్కడికి చేరుకున్నారు. వారు వచ్చసరికే ఆ నలుగురు పూర్తిగా మునిగిపోయారు. అనంతరం గజ ఈతగాళ్లతో గాలించగా.. శనివారం రాత్రి రెండు, ఆదివారం ఉదయం మరో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. చెక్‌డ్యాంలో పడి ఇద్దరి మృతి న్యాల్కల్(జహీరాబాద్) : ప్రమాదవశాత్తు చెక్‌డ్యాంలో పడి ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల పరిధిలోని రేజింతల్‌లో శనివారం చోటు చేసుకుంది. ఈనెల 13న గ్రామానికి చెందిన ఫకీర్ ఇస్మాయిల్ కుమారుడు సాజిద్, నాగేందర్ కుమారుడు రాకేష్ మేకలు మేపడానికి వెళ్లారు. రాత్రి వరకు ఇద్దరూ ఇంటికి తిరిగి రాలేదు. కానీ మేకలు మాత్రం ఇంటికి వచ్చాయి. దీంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికారు. కాగా 14వ తేదీ ఉదయం గ్రామ శివారులోని చెక్‌డ్యాంలో సాజిద్ (14) మృతదేహం కనిపించింది. చెక్‌డ్యాంలో నీళ్లు ఎక్కువ ఉండడం వల్ల రాకేశ్ కోసం ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. చివరకు ఆదివారం ఉదయం రాకేష్ (18) మృతదేహం లభించింది. -
ఆరిపోయిన దీపం.. శవమైన సౌమ్య
ఎల్లారెడ్డిరూరల్(ఎల్లారెడ్డి) : అల్లారుముద్దుగా పెంచుకున్న ఆ ఇంటి దీపం ఆరిపోయింది.. హాయిగా నవ్వుకుంటూ.. నవ్వి స్తూ నట్టింట్లో తిరుగాడిన ఆ చిన్నారి అనంతలోకాలకు వెళ్లిపోయింది. మంగళవారం ఉదయం ఎల్లారెడ్డి మండలంలోని మత్తమాల గ్రామంలో ఉదయం అదృశ్యమైన చిన్నారి మృతదేహం బుధవారం తన ఇంటికి సుమారు 2కి.మీ దూరంలో ఉన్న నిజాంసాగర్ బ్యాక్‌వాటర్‌లో లభ్యమైంది. ఈ సందర్భంగా ఎస్సై శ్వేత తెలిపిన వివరాల ప్రకారం ఎల్లారెడ్డి మండలంలోని మత్తమాల గ్రామానికి చెందిన కిష్టయ్య, స్వరూప దంపతుల మూడో సంతానమైన మాల సౌమ్య(2) మంగళవారం ఉదయం ఇంటి ఎదుట ఆడుకుంటుండగానే అకస్మాత్తుగా అదృశ్యం కావడంతో కుటుంబ సభ్యులు, గ్రా మస్తులందరు గ్రామంలో గాలించినప్పటికి ఎలాంటి ఆచూ కీ లభ్యం కాలేదన్నారు. దీంతో వారు మధ్యాహ్నం చిన్నారి కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎల్లారెడ్డి డీఎస్పీ శశాంక్‌రెడ్డి, సీఐ రాజశేఖర్‌లతో కలిసి బృందాలుగా ఏర్పడి గ్రామంలో గాలించామన్నారు. చివరికి కామారెడ్డి నుంచి డాగ్ స్క్వాడ్‌ను రప్పించగా అది గ్రామ శివారులో కొంతదూరం వెళ్లి ఆగి పోయిందన్నారు. రాత్రి వరకు ఎలాంటి ఆచూకీ లభించకపోవడంతో వెనుదిరిగామని, బుధవారం ఉదయం గ్రామ శివారులోని నిజాంసాగర్ బ్యాక్ వాటర్‌లో చిన్నారి సౌమ్య మృతదేహం తేలడంతో గ్రామస్తులు తమకు సమాచారం అందించారన్నారు. చిన్నారి మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని, 174 సెక్షన్ కింద కేసు నమోదు చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. కిష్ట య్య, స్వరూప దంపతులకు ముగ్గు రు సంతానంలో ఇద్దరు ఆడపిల్లలు ఒక బాలుడు ఉన్నారు. బ్యాక్‌వాటర్ వరకు వెళ్లడం సాధ్యమేనా..? ఎల్లారెడ్డి మండలంలోని మత్తమాల గ్రామంలో రెండేళ్ళ చిన్నారి సౌమ్య మృతిపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ఆడుకుంటున్న చిన్నారి అకస్మాత్తుగా అదృశ్యమై నిజాంసాగర్ బ్యాక్ వాటర్‌లో మృతదేహమై తేలడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామానికి 2కి.మీ దూరంలో ఉండే నిజాంసాగర్ బ్యాక్‌వాటర్ వరకు రెండేళ్ల చిన్నారి ఎలా నడవగలుగుతుందనే సందేహం ప్రతిఒక్కరిలో కలుగుతోంది. మరో వైపు చిన్నారి మంగళవారం తప్పిపోయి ఉండి నీళ్లలో పడి ఉంటే నీటిలో శవం ఉబ్బి ఉండాల్సి ఉండేది. కాని చిన్నారి నిజాంసాగర్ బ్యాక్ వాటర్‌లో కొద్ది గంటల క్రితమే పడినట్లు ఆనవాళ్ళు కనిపించాయని స్థానికులు పేర్కొన్నారు. చిన్నారి కుటుంబానికి ఎవరైనా హాని కలిగించాలనే ఉద్దేశంతో జరిగిందా లేదా కావాలనే చిన్నారిని హత్యచేసి బ్యాక్ వాటర్‌లో పడేశారా అనే సందేహాలను గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు త్వరగా చిన్నారి మృతి కేసు ను ఛేదించి హంతకులకు శిక్ష పడేలా చర్యలను తీసుకోవాల ని గ్రామస్తులు కోరుతున్నారు. -
సీఎం దృష్టికి నిజాంసాగర్ రివర్స్ పంపింగ్
సాక్షి, నిజామాబాద్ : రబీ సీజన్లో ఉమ్మడి జిల్లాలోని అన్ని సాగునీటి ప్రాజెక్టుల ద్వారా మొత్తం 2.45 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించాలని జిల్లా సాగునీటి పారుదల సలహాబోర్డు(డీఐఏబీ) నిర్ణయించింది. మొత్తం 20.08 టీఎంసీల నీటిని వినియోగించుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్లో బోర్డు సమావేశం జరిగింది. కలెక్టర్ ఎం.ఆర్.ఎం.రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు హన్మంత్ సింధే, నల్లమడుగు సురేందర్, ఎమ్మెల్సీ వీజీ గౌడ్, ఆకుల లలిత, జెడ్పీ చైర్పర్సన్లు దాదన్నగారి విఠల్‌రావు, దఫేదార్ శోభ, కామారెడ్డి కలెక్టర్ సత్యనారాయణ, నీటి పారుదల, రెవెన్యూశాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి శ్రీరాంసాగర్, నిజాంసాగర్, పోచారం, రామడుగు, కౌలాస్‌నాలా ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేసే తేదీలు, తడులను ప్రకటించారు. నేను స్పీకర్‌గా ఈ సమావేశానికి రాలేదు. బాన్సువాడ ఎమ్మెల్యేగా హాజరయ్యాను. నిజాంసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వ అతి తక్కువగా ఉంది. దీనిని దృష్టిలోఉంచుకుని నీటి విడుదలపై నిర్ణయం తీసుకుంటున్నాం. రైతులు సహకరించాలి. నిజాంసాగర్ ఆయకట్టు పరిస్థితిని సీఎం కేసీఆర్‌కు వివరించి రానున్న రోజుల్లో పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటాం. – స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి శ్రీరాంసాగర్ ద్వారా 37,449 ఎకరాలకు నీరు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాల్వల ద్వారా డిసెంబర్ 25 నుంచి నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. ఆయకట్టుకు ఏడు తడుల్లో నీటిని అందిస్తారు. లక్ష్మి కాలువకు మూడు టీఎంసీలు, కాకతీయకు 0.7 టీఎంసీలు, చౌట్పల్లి హన్మంత్‌రెడ్డి ఎత్తిపోతల పథకానికి 0.8 టీఎంసీల కేటాయింపులు జరిపారు. మొత్తం 4.5 టీఎంసీల నీటిని 37,449 ఎకరాలకు విడుదల చేయాలనే నిర్ణయం జరిగింది. ‘గుత్ప, అలీసాగర్’ల ద్వారా ఎనిమిది తడులు గుత్ప, అలీసాగర్ ఎత్తిపోతల ద్వారా ఈ నెల 26 నుంచి నీటిని విడుదల చేస్తారు. మొత్తం ఎనిమిది తడుల్లో నీటిని అందిస్తారు. అలీసాగర్‌కు 4.5 టీఎంసీల నీటిని 45వేల ఎకరాలకు, గుత్ప ఎత్తిపోతల ద్వారా 3.5 టీఎంసీల నీటిని 35వేల ఎకరాలకు అందించనున్నారు. తొలి తొమ్మిది డి్రస్టిబ్యూటరీలకే.. నిజాంసాగర్ ప్రాజెక్టులో కేవలం 3.99 టీఎంసీలే నీరున్నందున మొదటి నుంచి తొమ్మిది డి్రస్టిబ్యూటరీలకే విడుదల చేయాలని నిర్ణయించింది. ఆరు తడులు.. ఆన్ఆఫ్ విధానంలో రోజుకు 200 క్యూసెక్కుల నీటిని ప్రధాన కాలువకు విడుదల చేయనున్నారు. 10 నుంచి 40వ డిస్ట్రిబ్యూటరీల పరిధిలోని ఆయకట్టుకు పంట చివరలో కేవలం రెండు తడుల్లో నీటిని ఇవ్వాలని భావిస్తున్నారు. రామడుగు ఆయకట్టుకు ఏడు తడులు రామడుగు ప్రాజెక్టులోని 0.74 టీఎంసీల నీటిని ఏడు తడుల్లో అందిస్తారు. డిసెంబర్ 26 నుంచి కాలువలకు నీటి విడుదల ప్రారంభమవుతుంది. పది రోజుల వ్యవధికి ఒక తడి చొప్పున విడుదల చేస్తారు. కౌలాస్‌నాలా ద్వారా ఆరుతడి పంటలకే.. కౌలాస్‌నాలా ఆయకట్టు కింద కేవలం ఆరుతడి పంటలకే సాగు నీటిని విడుదల చేయాలని సమావేశంలో నిర్ణయించారు. డిసెంబర్ 16 నుంచే నీటి విడుదల ప్రారంభమవుతుంది. ఐదు తడులు ఇవ్వనున్నారు. బీ–జోన్‌కే సాగునీళ్లిస్తామంటున్న అధికారులు పోచారం ప్రాజెక్టు నీటి విడుదల విషయంలో నీటి పారుదలశాఖ అధికారుల తీరుపై సమావేశంలో చర్చ జరిగింది. పోచారం ప్రాజెక్టు 1.82 టీఎంసీల నీళ్లతో నిండుకుండలా ఉంది. సుమారు పది వేలకు పైగా ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించవచ్చు. కానీ అధికారులు మాత్రం కేవలం బీ–జోన్ పరిధిలోని 3,500 ఎకరాలకు మాత్రమే సాగునీటిని అందించగలమని తేల్చి చెప్పారు. దీనిపై స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్‌లు అభ్యంతరం వ్యక్తం చేశారు. బీ జోన్‌తో పాటు, ఏ జోన్ పరిధిలోని 7,500 ఎకరాలకు కూడా సాగునీరందించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అవసరమైతే రెవెన్యూ అధికారులు, సిబ్బంది నిరంతరం పర్యవేక్షించి పూర్తి ఆయకట్టుకు నీటిని అందించాలని ఆదేశించారు. నిజాంసాగర్ ప్రాజెక్టుకు సంబంధించి అలీసాగర్‌కు ఎగువ ప్రాంతంలో ఉన్న ఆయకట్టుకు సాగునీటిని అందించే అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తాం. సాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం.రివర్స్ పంపింగ్ కోసం ఎస్సారెస్పీ నుంచి శివం కమిటీలో కేటాయించిన 2.78 టీఎంసీలను రిజర్వులో ఉంచుతాం. – మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి -
మిషన్ లీకేజీ!
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకంలో లోపాలు బయటపడుతున్నాయి. సింగూరు ప్రాజెక్టు నుంచి ప్రధాన పైపులైన్లకు నీటిని సరఫరాచేస్తూ ట్రయల్‌రన్ చేస్తుండగా.. నిత్యం ఎక్కడోచోట పైపులైన్ల జాయింట్లు, ఎయిర్‌వాల్వ్‌లు ఊడిపోతున్నాయి. మిషన్ భగీరథ పనులతో పాటు, లీకేజీలతో రోడ్లన్నీ ధ్వంసం అవుతున్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సాక్షి, నిజాంసాగర్: మిషన్ భగీరథ పథకంలో భాగంగా సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టునుంచి జుక్కల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బోధన్ నియోజవర్గాలకు ఇంటింటికి తాగునీటిని అందించడానికి పనులు చేపట్టారు. రెండేళ్లుగా పనులు కొనసాగుతున్నాయి. జూన్ నెలాఖరు నాటికి ఇంటింటికి తాగునీరందిస్తామని ముఖ్యమంత్రితో పా టు మంత్రులు పేర్కొంటున్నారు. ప్రధాన పైప్‌ౖ లెన్ పనులు పూర్తవడంతోపాటు బీపీటీ ట్యాం కు నిర్మాణ పనులు పూర్తికావచ్చాయి. దీంతో సింగూరు జలాశయం నుంచి ప్రధాన పైపుౖ లెన్లు, బీపీటీ ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేస్తూ ట్రయల్‌రన్ చేస్తున్నారు. ఇరవై రోజుల నుంచి నిజాంసాగర్, పిట్లం, మద్నూర్, పెద్దకొడప్గల్, బిచ్కుంద, జుక్కల్, బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్, వర్ని మండలాల్లో ట్రయల్‌రన్ నిర్వహిస్తున్నారు. కాగా నాందేడ్– సంగారెడ్డి, బోధన్– హైదరాబాద్, నిజాంసాగర్ –ఎల్లారెడ్డి ప్రధాన రోడ్డు మార్గాల గుండా వేసిన పైపులైన్లకు తరచూ లీకేజీలు ఏర్పడుతున్నాయి. ప్రధాన పైపులైన్ల ద్వారా మంజీరా జలాలు రోడ్లపైకి వస్తుండడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. పైపులైన్లకు లీకేజీలు మిషన్ భగీరథ ట్రయల్‌రన్ నిర్వహిస్తుండడంతో పైపులైన్ల పనుల్లో లోపాలు బట్టబయలు అవుతున్నాయి. పది రోజుల క్రితం నిజాంసాగర్ మండలంలోని బొగ్గుగుడిసె చౌరస్తా వద్ద ప్రధాన పైపులైన్ జాయింట్ ఊడిపోవడంతో సింగూరు జలాలు వృథా అయ్యాయి. వారం క్రి తం బాన్సువాడ మండలంలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చేతుల మీదుగా మిషన్ భగీరథ నీటికి ట్రయల్‌రన్ నిర్వహించారు. రాత్రి వేళ మండలంలోని తున్కిపల్లి తండా వద్ద కట్వాల్ మూసుకుపోవడంతో వేలక్యూసెక్కుల నీరు రోడ్డుపైకి వచ్చింది. ప్రధాన పైపులైన్ ద్వారా నీరు బయటకు రావడంతో నీటి ప్రవాహ ఉధృతికి బోధన్– హైదరాబాద్ రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో అర్థరాత్రి వరకు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. సుమారు 2 గం టల పాటు ట్రాఫిక్ స్తంభించింది. నీటి సరఫరా ను నిలిపివేసి, కోతకు గురైన రోడ్డుకు తాత్కా లిక మరమ్మతులు చేపట్టి రాకపోకలు పునరుద్ధరించారు. నీటి ఉధృతికి సమీపంలోని ఇళ్లలోకి నీరు చేరింది. పంటపొలాలు నీట మునిగి అన్న దాతలకు నష్టం వాటిల్లింది. ఈ సంఘటనను మరువకముందే తున్కిపల్లి తండా వద్ద మరో సారి గురువారం ఉదయం పైపులైన్ల ద్వారా నీరు రోడ్డుపైకి వచ్చింది. వందల క్యూసెక్కుల నీరు పైపులైన్ల ద్వారా రోడ్డుపైకి రావడంతో తండా వాసులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తండా వద్ద నిర్మిస్తున్న బీపీటీ ట్యాంకు పనులు పూర్తికాక పోవడంతో ప్రధాన పైపులైన్ కనెక్షన్ పూర్తి కాలేదు. దీంతో బాన్సువాడకు వెళ్లే ప్రధాన పైపులైన్ ద్వారా మంజీరా జలాలు వృథా అవుతూ, రోడ్డుపైనుం చి పారుతున్నాయి. తండా వద్ద కట్వాల్ ఆన్ఆఫ్ చేయడంతో నిర్లక్ష్యం వల్ల సింగూరు జలా లు వృథా అవుతున్నాయి. గుట్టపై నుంచి జలా లు పారడంతో మట్టి, మొరం రోడ్డుపైకి కొట్టుకు వచ్చింది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నీటి వృథాను అరికట్టడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
యాసంగి జోరు!
జిల్లాలో యాసంగి పంటల సాగు జోరుగా సాగుతోంది. రైతులు పెద్ద ఎత్తున పంటలు సాగు చేశారు. రబీలో పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1,83,426 ఎకరాలు కాగా.. ఇప్పటి వరకు 1,73,305 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. పంటల సాగు విస్తీర్ణం 94 శాతంగా నమోదైంది. మరో వారం రోజుల్లో వంద శాతం పంటలు సాగయ్యే అవకాశాలు న్నాయని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. సాక్షి, కామారెడ్డి: జిల్లాలో వరి సాగు లక్ష్యానికి మించి నాట్లు వేశారు. 54,360 ఎకరాల్లో వరి పంట సాగవుతుందని అధికారులు అంచనా వేయగా.. 61,510 ఎకరాల్లో వరి సాగైంది. మరో ఐదారువేల ఎకరాల్లో నాట్లు పడే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు కింద 31,913 ఎకరాల్లో, పోచారం ప్రాజెక్టు కింద 3,806 ఎకరాల్లో, కౌలాస్‌నాలా ప్రాజెక్టు కింద 3,500 ఎకరాల్లో వరి నాట్లు వేశారు. జిల్లాలో వరి సాగు విస్తీర్ణంలో సగం ప్రాజెక్టుల కిందనే ఉండగా.. మిగతా సాగు విస్తీర్ణం బోర్లు, బావులపై ఆధారపడి ఉంది. తగ్గిన మొక్కజొన్న సాగు... జిల్లాలో మొక్కజొన్న సాగు విస్తీర్ణం సాధారణానికం టే తగ్గింది. యాసంగిలో సాధారణ సాగు విస్తీర్ణం 44,043 ఎకరాలుకాగా 39,554 ఎకరాల్లో మక్క వేశారు. మక్క దాదాపు బోర్లు, బావుల దగ్గరే సాగవుతోంది. 10,933 ఎకరాల్లో జొన్న సాగవుతుందని అంచనా వేయగా.. 7832 ఎకరాల్లో సాగైంది. శనగ పంట 44,903 ఎకరాల్లో సాగవుతుందని అంచనా వేస్తే 49,316 ఎకరాల్లో సాగు చేశారు. పొద్దుతిరుగుడు సాగు గణనీయంగా తగ్గిపోయింది. సాధారణ సాగు విస్తీర్ణం 2,458 ఎకరాలు కాగా.. 440 ఎకరాల్లో మాత్రమే పంట సాగు చేశారు. చెరుకు సాగు విస్తీర్ణం ఈసారి పెరిగింది. సాధారణ విస్తీర్ణం 5,883 ఎకరాలు కాగా 7,643 ఎకరాల్లో చెరుకు సాగు చేశారు. తగ్గుతున్న భూగర్భ జలాలు.. ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తుండడంతో బోర్లు ఎక్కువ సేపు నడుపుతున్నారు. దీంతో బోర్లలో నీటి ఊటలు తగ్గుతున్నాయి. ఇప్పటికే భూగర్భజలాలు అడుగంటిపోతున్న పరిస్థితుల్లో 24 గంటల కరెంటు మరింత దెబ్బతీస్తోంది. కొన్నిచోట్ల ఇప్పటికే భూగర్భ జలమట్టం దెబ్బతిని యాసంగి పంటలకు నష్టం కలుగుతోంది. ఇదే పరిస్థితి ముందుముందు ఉంటే మరింత నష్టం తప్పదంటున్నారు. ఎకరం వరి వేసిన... ఎకరం వరి పంట వేసిన. బోరు మంచిగనే పోసేది. ఈ మధ్యన బోర్ల ఊట తగ్గింది. నీళ్లకు తిప్పలైతదనే కొంత బీడు పెట్టినం. వేసిన ఎకరం పంట గూడ ఎట్ల గట్టెక్కుతదోననే భయం ఉన్నది. 24 గంటల కరెంటుతోని కొంత ఇబ్బంది అయితుంది. – నాగరాజు, రైతు, పోల్కంపేట, లింగంపేట మండలం ఇప్పుడైతే మంచిగనే ఉన్నది... బోర్లు మంచిగ పోస్తున్నయని మూడెకరాలల్లో వరి వేసిన. అవసరం ఉన్నంత మేరకు బోరు నడుపుతున్నం. మిగతా సమయం బందు పెడుతున్నం. ఈసారి పంట మంచిగనే ఉన్నది. మా ఊళ్లె అన్ని బోర్లు బాగానే ఉన్నయి. బోర్లు ఎత్తిపోకుంటే ఏ ఇబ్బంది ఉండదు. – దేవేందర్‌రెడ్డి, రైతు, ఒంటరిపల్లి, లింగంపేట మండలం -
పది టీఎంసీలకు చేరిన ‘సాగర్’
నిజాంసాగర్(జుక్కల్): ఉభయ జిల్లాల వరప్రదాయిని నిజాంసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం సోమవారం సాయంత్రానికి పది టీఎంసీలకు చేరింది. సింగూరు ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కొనసాగుతుండడంతో నిజాంసాగర్ నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఎగువ నుంచి 18,933 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1405 (17.8 టీఎంసీలు) అడుగులు కాగా, ప్రస్తుతం 1398.66 (9.9 టీఎంసీలు) అడుగుల నీరు వచ్చి చేరింది. కొనసాగుతున్న నీటి విడుదల ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సంగారెడ్డి జి ల్లాలోని సింగూరు ప్రాజెక్టులోకి 11,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో వస్తుండ టంతో ఒక వరద గేటు ఎత్తి 8,106 క్యూసెక్కుల నీటిని, టర్బయిన్ గేట్ ద్వారా 1,460 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. నీటి విడుదల కొనసాగు తుండడంతో మంజీరా నది పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. నల్లవాగుకు తగ్గని వరద సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్, కల్హేర్, కంగ్టి మండలాల్లో కురుస్తున్న వర్షాలకు మండలంలోని నల్లవాగు మత్తడిలోకి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. గత వారం రోజుల నుంచి నల్లవాగు మత్తడిలోకి వరదనీరు పోటెత్తడంతో అలుగుపై నుంచి నీరు పొంగిపొర్లుతోంది. సోమవారం సాయంత్రం మత్తడి అలుగుపై నుంచి సుమారు 1,000 క్యూసెక్కుల వరద నీరు కిందకు వెళ్తోంది. మత్తడి ద్వారా పొర్లుతున్న వరదనీటితో మంజీరా ఉప నదికి జలకళ సంతరించుకుంది. -
ఆధునీకరిస్తేనే వెలుగు
కామారెడ్డి నుంచి సేపూరి వేణుగోపాలచారి : రాష్ట్రంలోనే తొలి జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఆధునీకరిస్తే మరిన్ని వెలుగులు వెదజల్లుతుంది. నిజాంసాగర్ ప్రాజెక్టు వద్ద మొదటి జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటైంది. 1954లో ప్రాజెక్టు హెడ్‌స్లూయిస్ వద్ద జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పారు. 1954 ఫిబ్రవరి 23న తొలి యూనిట్‌ను, 1955 నవంబర్ 28న రెండో యూనిట్‌ను, తర్వాత కొంతకాలానికే మూడో యూనిట్‌ను ప్రారంభించారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు అప్పట్లో రూ.2.27 కోట్లు ఖర్చు చేశారు. ఇంగ్లండ్‌లో తయారైన మూడు టర్బయిన్లు తీసుకొచ్చి 15 మెగావాట్ల సామర్థ్యంతో దీన్ని నెలకొల్పారు. ఒక్కో టర్బయిన్ ద్వారా ఐదు మెగావాట్ల లెక్కన రోజుకు 15 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగేలా నిర్మించారు. మూడో టర్బయిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తి 1968 నుంచి పది మెగావాట్ల కరెంటు మాత్రమే ఉత్పత్తి అవుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండి పంటలకు విడుదల చేసే నీటి ఆధారంగా ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. కొద్దిపాటి మరమ్మతులు చేస్తే.. నిజాంసాగర్ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి కొద్దిపాటి నిధులు సమకూర్చి ఆధునీకరించాల్సి ఉంది. మూలన పడిన మూడో టర్బయిన్‌ను వినియోగంలోకి తీసుకొస్తే మరో ఐదు మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చు. పూర్తిస్థాయి నీటి వనరులు అందుబాటులో ఉండడం, విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థ నిర్మితమై ఉండడంతో ఇక్కడ అదనపు విద్యుత్ ఉత్పత్తి సులభం. -
నిజామాబాద్ జిల్లాలో పోచారం పర్యటన
బాన్సువాడ: నిజామాబాద్ జిల్లాలో బుధవారం వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూరు, నస్రుల్లాబాద్ మండలాల పరిధిలోని నిజాంసాగర్ కాలువలను పరిశీలించారు. నీటి అందుబాటు, పంటసాగు గురించి రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రబీ సాగుకు సరిపడా నీటిని అందిస్తామని రైతులు అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు -
పొంగిపొర్లుతున్న గోదారి
రెంజల్/బాల్కొండ/నిజాంసాగర్: నిజామాబాద్ జిల్లాలోని నిజాం సాగర్ ప్రాజెక్టు గేట్లతో పాటు ఎగువన మహారాష్ట్రలో గల విష్ణుపురి ప్రాజెక్టు గేట్లను ఎత్తడంతో ఆదివారం వేకువ జామునుంచి గోదావరి నది పొంగిపొర్లుతోంది. రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమం వద్ద మంజీర, హరిద్ర, గోదావరి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వంతెన పైనుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. వంతెనకు ఆనుకుని రోడ్డు పై నుంచి వరద నీరు ప్రవహించడంతో రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలను నిలిపివేశారు. రెవెన్యూ, పోలీసు శాఖలు స్పందించి గోదావరి పరవళ్లను పరిశీలించేందుకు వచ్చే సందర్శకులను గ్రామసరిహద్దులోనే నిలిపివేస్తున్నారు. నదిలోని పురాతన శివాలయం పూర్తిగా నీటమునిగింది. గోదావరి వరద ఉధృతి పెరగడంతో కందకుర్తిలో వేలాది ఎకరాల పంటలు పూర్తిగా నీటమునిగాయి. మంజీర, హరిద్ర నదుల పరీవాహకం వెంట వేసిన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అలాగే, నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి శనివారం అర్ధరాత్రి నుంచి వరద నీరు పోటెత్తింది. ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి మూడున్నర లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్ట్ 42 వర ద గేట్లను ఎత్తి గోదావరిలోకి 3 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. -
'జనాల పాదాలు కడిగి రుణం తీర్చుకుంటాం'
నిజామాబాద్: గోదావరి జలాలతో జనాల పాదాలు కడిగి రుణం తీర్చుకుంటామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, మిషన్ భగరీథ వైస్ ఛైర్మన్ ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నిజాం సాగర్ ప్రాజెక్టులో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో మల్లన్న సాగర్ సాధన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎవరూ అడ్డుకున్న వచ్చే రెండేళ్లలో నిజాం సాగర్‌కు నీళ్లు అందిస్తామని స్పష్టం చేశారు. మల్లన్నసాగర్ పూర్తైతే గ్రామాల్లోకి రానివ్వరని, ఓట్లు వేయరనే భయంతోనే టీడీపీ, కాంగ్రెస్‌లు నాటకాలాడుతున్నాయని వారు మండిపడ్డారు. -
పచ్చబాస్ బాగోతం అందరికీ తెలుసు
* టీటీడీపీపై ఎంపీ కవిత, మంత్రి జూపల్లి మండిపాటు * పాలమూరుకు అడ్డం కాదని కేంద్రానికి లేఖ రాయాలి * కేసీఆర్‌ను ఆవహించింది తెలంగాణ ఆత్మ మాత్రమే సాక్షి, హైదరాబాద్: ‘పచ్చ బాస్ బాగోతం అందరికీ తెలుసు. గతంలో నీటి వనరుల విషయంలో తెలంగాణకు తీరని అన్యాయం చేసిండు... పులిచింతల, దేవాదుల ప్రాజెక్టుల్లో ఈపీసీ పేరిట కమిషన్ల విధానానికి తెరలేపిండు... ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్లను ప్రైవేటు పరం చేసిన చరిత్రా ఆయనదే.. ఇప్పుడు తెలంగాణలో కొత్త ప్రాజెక్టులు కమీషన్ల కోసమే చేపడుతున్నరని విమర్శలు చేస్తున్నరు.. మీలా కమీషన్లు తీసుకునే సంస్కృతి మాది కాదు.’ అంటూ తెలంగాణ టీడీపీ నేతలపై ఎంపీ కవిత మండిపడ్డారు. పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలసి శనివారం తెలంగాణ భవన్లో ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘నిజామాబాద్ జిల్లాకు చంద్రబాబు అన్యాయం చేశాడు. హైదరాబాద్‌కు సింగూ రు జలాల్ని తరలించి నిజాం సాగర్ ప్రాజెక్టు కింద 2.70 లక్షల ఎకరాలను ఎండబెట్టాడు. పులిచింతల ప్రాజెక్టు కోసం నల్లగొండ జిల్లాలో 10 వేల ఎకరాల భూముల్ని లాక్కున్నడు’ అని కవిత ఆరోపించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 40 లక్షల ఎకరాల ఆయకట్టు సాగుకు అనుకూలంగా ఉన్నా.. ఇప్పుడున్న ప్రాజెక్టుల కింద 7, 8 లక్షల ఎకరాలకు మించి నీరందడం లేదన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల పరిధిలో 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందుతుందన్నారు. అయినా పాలమూరు జిల్లా ప్రతినిధులు బాబుకు వంత పాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డీఎస్ ఆధునికీకరణ పనులు కేఈ కృష్ణమూర్తి అడ్డుకుంటున్నా టీటీడీపీ నేతలు భయపడి నోరు మెదపడం లేద న్నారు. కొత్త ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలంటూ మీ చిరకాల మిత్రుడు కిరణ్‌కుమార్‌రెడ్డి అప్పట్లో లేఖ రాశారన్నారు. కేసీఆర్‌ను ఆవహించింది తెలంగాణ ఆత్మ మాత్రమేనన్నారు. ఏడాది పొడవునా 160 టీఎంసీల నీటిని తీసుకోవచ్చనే ఉద్దేశంతోనే ప్రాణహిత- చేవెళ్ల రిజ ర్వాయర్‌ను కాళేశ్వరంనకు మార్చారన్నారు. తెలంగాణ ప్రజల పక్షాన నిలబడేందుకే గాంధీభవన్ నుంచి తెలంగాణ భవన్‌కు వచ్చానని జూపల్లి అన్నారు. -
నమ్మక ద్రోహం చేయలేనంటూ...తనువు చాలించాడు
నిజాంసాగర్(నిజామాబాద్): సుమారు మూడున్నర కోట్ల రూపాయల అప్పు తీర్చలేక, నమ్మిన వారిని మోసం చేయలేక రియల్ ఎస్టేట్ వ్యాపారి నాయిని సత్యనారాయణ రెడ్డి (65) నిజాంసాగర్ ప్రాజెక్టులో దూకాడు. పోలీసుల కథనం.. నిజామాబాద్ జిల్లా గాంధారి మండలం గండివేట్ గౌరారం గ్రామానికి చెందిన సత్యనారాయణరెడ్డి కొన్నేళ్ల కిందట హైదరాబాద్‌లోని పాత బోయినపల్లిలో స్థిరపడ్డారు. సర్దార్ కళాశాలలో లెక్చరర్‌గా పని చేసి, ఐదేళ్ల కిందట ఉద్యోగ విరమణ చేశారు. అప్పటి నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి అడుగు పెట్టారు. ఇందుకోసం స్నేహితులు, బంధువుల వద్ద రూ.3 కోట్ల వరకు అప్పు చేశారు. రుణదాతలు తరచూ ఫోన్లు చేస్తుండటంతో రెండు రోజుల కిందట హైదరాబాద్ నుంచి నిజామాబాద్ జిల్లా బాన్సువాడ, పిట్లం మండలాలలో ఉన్న బంధువుల వద్దకు వచ్చారు. వారితో మాట్లాడిన అనంతరం మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌కు బయలుదేరారు. అప్పటికే ఆత్మహత్య కోసం సిద్ధమైన సత్యనారాయణరెడ్డి ఇందుకు గల కారణాలను తన వద్ద ఉన్న నోట్‌బుక్కులో రాసుకున్నారు. ఎల్లారెడ్డి బస్టాండ్‌లో బస్సు దిగినిజాంసాగర్ ప్రాజెక్టుకు చేరుకొని అందులో దూకాడు. బుధవారం మృతదేహమై కనిపించాడు. సత్యనారాయణరెడ్డికి భార్య భాగ్యమ్మ, కూతుళ్లు సరిత, స్వప్న, సబిత ఉన్నారు. వీరి వివాహాలు కావడంతో ఆమెరికా, దుబాయిలో స్థిరపడ్డారు. వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి ఈయన బంధువు కూడా. మృతదేహాన్ని అంత్యక్రియల కోసం హైదరాబాద్‌కు తరలించారు. -
అన్నదాత అరిగోస
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ఖరీఫ్ ఆరంభంలో కురిసిన చిరు జల్లుల అనంతరం వేసిన పంటలు ఆ తర్వాత వర్షాభావం, కరెంట్ కోతలతో చాలా వరకు దెబ్బతిన్నాయి. రైతుల పంటలను తగుల బెట్టే పరిస్థితి ఎదురైంది. ఖరీఫ్ సాగు రైతులకు అప్పులనే మిగల్చగా, సకాలంలో పంటరుణాలు ఇచ్చి ఆదుకోవాల్సిన బ్యాంకర్లు నిబంధనల పేరిట ఇబ్బందులకు గురి చేశారు. 25 శాతం రుణమాఫీ రైతులకు ఉపశమనం కలిగించలేదు. ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కోసం ఐకేపీ, పీఏసీఎస్‌ల ద్వారా 287 కేంద్రాలను ఏర్పాటు చేయాలని ల క్ష్యంగా పెట్టుకోగా, 92 కేంద్రాలనే ఏర్పాటు చేశారు. 3,20,500 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 5,080 మె.టన్నులే కొనుగోలు చేశారు. దళారులు, రైసుమిల్లర్లు కొందరు రంగంలోకి దిగడంతో రైతులకు గిట్టుబాటు ధర అందని ద్రాక్షలా మారుతోంది. ఊరట ఏదీ? రుణమాఫీ రైతులకు ఊరట కలిగించలేదు. ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించేనాటికి 4,33,132 మంది రైతులు రూ.1863.65 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ రుణాలన్నింటినీ రద్దు చేస్తామని సర్కారు చెప్పినప్పటికీ, 25 శాతం మాత్రమే రుణాలను మాఫీ చేశారు. 1,26,539 మందికి చెందిన రూ.465.19 కోట్ల రుణాలు మొదటి విడతగా మాఫీ అయ్యాయి. 3,06,593 మంది రైతులకు చెందిన రూ.1,398.46 కోట్లు ఇంకా మాఫీ కావాల్సి ఉంది. ఇదిలా వుంటే, వ్యవసాయ సీజన్ ప్రారంభానికి ము ందే ప్రభుత్వం రుణ ప్రణాళికలను సిద్ధం చేయాల్సి ఉంది. ఖరీఫ్‌లో 2,86,540 మంది రైతులకు రూ.1,300 కోట్లు పంట రుణాలుగా ఇవ్వాలని బ్యాంకులు లక్ష్యంగా పెట్టుకున్నాయి. అక్టోబర్ 15 నాటికి రూ.479.29 కోట్లు పంట రుణాలుగా ఇచ్చినట్లు రికార్డులు చెప్తున్నాయి. పంటల రుణాలను కనిష్టంగా, గరిష్టంగా ఎకరానికి ఇంత ఇవ్వచ్చన్న ప్రతిపాదనలను సైతం అక్కడక్కడ బ్యాంకర్లు పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. పంటలపై ఇచ్చే రుణ మొత్తం (స్కేల్ ఆఫ్ ఫైనాన్స్)విధానాన్ని పాటించలేదని రైతులు వాపోతున్నారు. తగ్గిన వర్షపాతం ఖరీఫ్‌లో సాధారణ సాగు లక్ష్యం 3,20,931 హెక్టార్లు కాగా, 3,10,679 హెక్టార్లలో వివిధ పంటలు సాగు చేశారు. గతేడాదితో పోలిస్తే ఈ సారి జిల్లా సాధారణ వర్షపాతం 49.8 శాతం తగ్గిపోగా చెరువులు, కుంటలు ఎండిపోయి భూగర్భజలాలలో 10.37 మీటర్లకు పడిపోయాయి. 22,375 హెక్టార్లలో వరి, సోయాబీన్ పంటలు ఎండిపోగా, సుమారుగా పదివేల హెక్టార్ల వరకు రైతులు సోయా, వరి పంటలను తగులబెట్టారు. శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టుల్లో నీటిమట్టం పూర్తిగా తగ్గిపోయింది. నిజాంసాగర్ ప్రాజెక్టు నీటి సామర్థ్యం 1405.00 అడుగులు. గతేడాది ప్రాజెక్టు జలకళతో ఉట్టిపడితే, ఈసారి నీటిమట్టం 1381.78 అడుగులకు పడిపోయింది. శ్రీరాంసాగర్‌లో గతేడాది ఇదే సీజన్లో రిజర్వాయర్ లెవెల్ 1091.00 అడుగులుంటే, ఈసారి 1067.40 అడుగులకు పడిపోయింది. గతేడాది ఇదే సీజన్ శ్రీరాంసాగర్‌లో 90.31 టీఎంసీల నీళ్లుంటే ప్రస్తుతం 24.28 టీఎంసీలే ఉన్నాయి. నిజాంసాగర్‌లో గతేడాది 17.80 టీఎంసీలుంటే ప్రస్తుతం1.67 టీఎంసీలకు పడిపోవడం ఆందోళన కల్గిస్తోంది. కరెంట్ కోతలు, ఎండిపోయిన పంటలు, అప్పుల బాధలు భరించలేక మూడు నెలల వ్యవధిలో 21 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఖరీఫ్‌లో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కున్న రైతులు రబీసాగుపై అనాసక్తితో ఉన్నారు. రబీలో 1,78,684 హెక్టార్లు సాగు లక్ష్యం కాగా ఇప్పటి వరకు 6,877 హెక్టార్లలోనే పంటలు వేశారు. మొత్తంగా జిల్లాలో కరువు కరాళనృత్యం చేస్తుండగా.. కష్టాన్ని నమ్ముకున్న రైతులు కాడిని వదిలే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
చిగురించిన ఆశలు
- జలాశయాలను ఆదుకుంటున్న వర్షాలు - లక్షల ఎకరాల్లో పంటలకు మేలు - ప్రాజెక్టుల్లో పెరుగుతున్న నీటిమట్టాలు - ఆయకట్టుదారుల్లో ఉత్సాహం నిజాంసాగర్ : తుఫాను పుణ్యమాని కురుస్తున్న వర్షాలకు జిల్లాలో జలాశయాలు, చెరువులు, కుంటల్లోకి భారీగా వర్షం నీరు వచ్చి చేరుతోంది. దీంతో కొత్తనీటితో జల వనరులు కళకళలాడుతున్నాయి. రైతులు సంబరపడి పోతున్నారు. జిల్లా వరప్రదాయిని నిజాంసాగర్ ప్రాజెక్టుతో పాటు ప్రధాన జలాశయాలు, చెరువులు, కుంటల కింద పంటలు పండిస్తున్న రైతుల్లో ఆశలు చిగురించాయి. వరుణుడిపై భారంతో ఆయకట్టుల కింద సాగుచేస్తున్న ఖరీఫ్ పంటలను వరుణుడు తుఫాను రూపంలో ఆదుకుంటున్నాడు. రెండుమూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో ప్రధాన జలాశయాలు, చెరువులు, కుంటల్లోకి కొత్తనీరు వచ్చి చేరుతోంది. దీంతో ఆయకట్టు కింద సాగుచేస్తున్న లక్షల ఎకరాల పంటలకు మేలు చేకూరుతోంది. ముఖ్యంగా నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువ పరిధిలో సాగుచేస్తున్న సుమారు 1.4 లక్షల ఎకరాల పంటలు గట్టెక్కినట్లే. అలీసాగర్ రిజర్వాయర్ వరకు 8 మండలాల్లో రైతులు వరిపంట సాగుచేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో సాగుచేస్తున్న వరి పంటలకు సాగునీరు అత్యవసరంగా మారిన సమయంలో వరుణుడు కరుణించి వర్షాలు కురిపించాడు. ఆయకట్టు పంటల కోసం ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు నీటి విడుదల చేపట్టిన రెండు రోజుల్లో వర్షాలు కురిశాయి. దీంతో ప్రాజెక్టు నీటి విడుదలతో పాటు ఆయకట్టు పంటలకు సాగునీటి అవసరాలు తప్పాయి. అంతేకాకుండా ఎగువ ప్రాంతాల నుంచి వరదనీరు వస్తుండటంతో ప్రాజెక్టులో నీటిమట్టం స్వల్పంగా పెరుగుతోంది. వర్షాల వల్ల వరదనీరు వస్తుండటంతో ప్రాజెక్టు నీటిమట్టం పెరగడంతో పాటు ఆయకట్టు కింద సాగుచేస్తున్న పంటలకు నీరు అందుతోంది. అందువల్ల ప్రాజెక్టు నీటి అవసరం లేకపోవడంతో పాటు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీరు ప్రాజెక్టులో నిల్వ అవుతోంది. వర్షాభావ పరిస్థితుల్లో ఆయకట్టు కింద సాగుచేస్తున్న పంటలు గట్టెక్కుతాయో లేవోనన్న అనుమానంతో ఉన్న రైతులను వరుణుడి గట్టెక్కిస్తున్నాడు. అంతేకాకుండా సింగితం, కళ్యాణి రిజర్వాయర్లతో పాటు చెరువులు, కుంటల కింద, వ్యవసాయ బోరుబావులు, లిఫ్ట్ ఇరిగేషన్ల వద్ద సాగుచేస్తున్న వేల ఎకరాల్లో పంటలను వర్షాలు ఆదుకుంటున్నాయి. మరో పదిహేను రోజుల పాటు వర్షాలు ఇలాగే కురుస్తూ జలాశయాలను, చెరువులు, కుంటలను పూర్తిస్థాయి నీటిమట్టంతో నింపాలని ఆయకట్టు రైతులు వరుణుడిని వేడుకుంటున్నారు. -
ఖాళీ పోస్టులన్నింటినీ భర్తీ చేస్తాం
నిజాంసాగర్: నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తూ, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేస్తామని వ్యవసాయ శాఖమంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. చాలా పోస్టులు ఖాళీగా ఉండటంతో ఇన్చార్జిలతో పరిపాలన నెట్టుకొస్తున్నామన్నారు. శనివారం సాయంత్రం నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు ఆయన నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 కేడర్‌తో పాటు అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న అధికారుల పోస్టులను భర్తీ చేస్తామన్నా రు. నీటి పారుదల శాఖ, ట్రాన్స్‌కో, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా వంటి శాఖల్లో అధికారులతోపా టు కిందిస్థాయి సి బ్బందిని నియమిస్తున్నామన్నారు. ఆదర్శ రైతుల అవినీతిని కక్కిస్తాం బీర్కూర్ : గత ప్రభుత్వం ఆదర్శ రైతుల పేరుతో ప్రజా ధనాన్ని వృథా చేసిందని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. ఒక్క ఎకరం భూమి లేనివారు కూడా ఆదర్శ రైతులుగా నియమితులయ్యారని, వారి అవినీతిని కక్కిస్తామని హెచ్చరించారు. శనివారం ఆయన బీర్కూర్‌లో విలేకరులతో మాట్లాడారు. ఆదర్శ రైతులు డబ్బులకు కక్కుర్తి పడి పంట నష్టపోని రైతులకు కూడా నష్టపోయినట్లు వివరాలు అందించారని అన్నారు. వారి పెత్తనం ఎక్కువ కా వడం తో ప్రభుత్వానికి సరైన నివేదిక అందలేదని, దీంతో నిజమైన లబ్ధిదారులకు ఇన్పుట్ సబ్సిడీ అందలేదన్నారు. తీవ్ర విమర్శలకు కారణమవుతున్న ఆదర్శ రైతుల వ్యవస్థను వెంటనే తొలగిస్తున్నామని పేర్కొన్నారు. దీనిపై సంతకం కూడా అయిపోయిందన్నారు. గత ఐదేళ్లుగా తెలంగాణ జిల్లాలలో పంట నష్టపోయి న 26 లక్షల మంది రైతులకు రూ. 482.52 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. భూమి లేనివారికి రుణాలు మాఫీ కుదరదు ప్రభుత్వం సుమారు రూ. 18 వేల కోట్ల పంట రుణాలను మాఫీ చేసిందని మంత్రి తెలిపారు. కొంత మంది దొంగ పాస్ బుక్‌లు రూపొందించి బ్యాంక్‌లలో రుణా లు పొందారని, అలాంటి వారికి రుణాలు మాఫీ కావ ని అన్నారు. భూమి లేనివారు తీసుకున్న రుణాలను మాఫీ చేయబోమన్నారు. కొందరు అధికారులు డబ్బులకు కక్కుర్తి పడి దొంగ పట్టాలు మంజూరు చేశారని, అలాంటి వారిని గుర్తిస్తామన్నారు. ప్రభుత్వం నుంచి మంజూరైన ప్రతీ రూపాయి పేదలకు చెందాలని అ న్నారు. భూమి లేనివారికి పంట రుణాలు మాఫీ అయినట్లు తెలిస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన 80 రోజులలోనే అ నేక హామీలను నెరవేర్చామన్నారు. విలేకరుల సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ దఫేదార్ రాజు తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టరే నిర్ణేత
ప్రగతినగర్ : కలెక్టరెట్లోని ప్రగతిభవన్ సమావేశ మందిరంలో శుక్రవారం సాయంత్రం నీటి సలహాబోర్డు సమావేశం జరిగింది. వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్యెల్యేలు షకీల్, హన్మంత్‌షిండే, ఎమ్మెల్సీ అరికెల నర్సారెడి, జడ్పీ చైర్మన్ దఫేదర్ రాజ్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టులో 5.09 టీఎంసీల నీరు నిలువకు పోగా, తాగు నీటికి రెండు టీఎంసీలు కేటాయిస్తారు. మిగితా నీటిని వృథాపోకుండా, పంటల కనుగుణంగా సమయానుసారంగా నిర్ణయం తీసుకోవడానికి కలెక్టర్‌కు సర్వాధికారాలు ఇస్తున్నట్లు మొదటి తీర్మానం చేశారు. అదేవిధంగా అలీసాగర్ ఎత్తిపోతల పథకం నుంచి 0.8 టీఎంసీల నీటి ని వ్యవసాయానికి విని యోగించుకునేందుకు ప్రభుత్వ అనుమతి కోరుతూ 2వ తీర్మానం, గుత్ప ఎత్తిపోతల నుంచి అవకాశం ఉన్నం త వరకు నీటిని వినియోగించుకోవడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడానికి 3వ తీర్మానం, కౌలాస్‌నాలా ప్రాజెక్టు నుంచి అవసరానికనుగుణంగా నీటిని విడుదల చేయడానికి కలెక్టర్‌కు అధికారం ఇస్తూ 4వ తీర్మానాన్ని బోర్డు ఆమోదిం చింది. క్షేత్ర స్థాయిలో పంటను పరిశీలించాలి - మంత్రి పోచారం అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి స్వయంగా వివరాలు సేకరించాలని, ఆదర్శరైతుల రిపోర్టులపైనే ఆధారపడడం మానుకోవాలని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు. వ్యవసాయ, సహాయ వ్యవసాయాధికారులు, ఉపసంచాలకులు పంటల విస్తీర్ణాన్ని పరిశీలించాలన్నారు. వ్యవసాయ అధికారులు, నీటిపారుదల అధికారులు, రెవెన్యూ అధికారులు సమాచార సేకరణకు స్వయంగా కృషి చేయాలని మంత్రి సూచించారు. సాగు చేస్తున్న పంటలకు విద్యుత్ ఏమేరకు అందించాలో నిర్ణయించాలని, పంటలను కాపాడడానికి రైతులకు చేయూతనందించాలన్నారు. పంటనష్టం, పంటరుణాల నిధులు ఎట్టిపరిస్థితుల్లోను దుర్వినియోగం కాకూడదన్నారు. రాష్ట్రానికి 2400 మెగావాట్ల విద్యుత్ అవసరం కాగా ప్రస్తుతం 1400 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి జరుగుతోందని, పరిశ్రమలకు కోత విధించి వ్యవసాయ పంటలు కాపాడడానికి అవసరమైన విద్యుత్‌ను అందిస్తామన్నారు. 2009 నుంచి 2014 వరకు పంటనష్టం పరిహారం కింద 482.52 కోట్ల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిందని తద్వారా 26 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. జిల్లాలో 51 వేల మంది రైతులకు 20.06 కోట్ల రూపాయలను విడుదల చేశామన్నారు. జుక్కల్ శాసనసభ్యులు హన్మంత్‌షిండే మాట్లాడుతూ 300 క్యూసెక్కుల నీటిని నిజాంసాగర్ మండలానికి విడుదలచేయాలని కోరారు. నియోజక వర్గంలో తీవ్ర వర్షభా వ పరిస్థితులు తట్టుకొని రైతులు వేసిన పంటలను కాపాడుకోవడానికి ఈనీరైన ఉపయోగపడుతుందన్నారు. బోధన్ ఎమ్మెల్యే షకీల్ మాట్లాడుతూ ఆద ర్శ రైతుల నుంచి వీఆర్ఓలు వారి ద్వారా వ్యవసా య అధికారులు వివరాలను సేకరించడం ద్వారా సరైన పద్ధతిలో న్యాయం జరుగడం లేదన్నారు. దీని ద్వారా అర్హులకు అన్యాయం జరుగుతుందని షకీల్ సమావేశం దృష్టికి తీసుకు వచ్చారు. ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి మాట్లాడుతూ వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు ఏర్పడుతున్నం దున తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో సహకార బ్యాంకు చైర్మన్ గంగాధర్పట్వారి, నీటిపారుదల శాఖ పర్యవేక్షక ఇంజనీర్ షకీల్ ఉర్ రహమాన్, జేడీఏ నర్సింహ, ఆర్డీఓలు యాది రెడ్డి, వెంకటేశ్వర్లు, అధికారులు పాల్గొన్నారు. -
జలాశయాలువెలవెల
నిజాంసాగర్/బాల్కొండ: కోటి ఆశలతో ఖరీఫ్‌కు సిద్ధమైన రైతాంగం ఆశలు అడియాసలవుతున్నాయి. బలమైన కార్తెల కాలం వెళ్లిపోతున్నా వరుణుడు కరుణించకపోవడంతో అన్నదాతలు యాగాలు చేస్తున్నారు. నారుమళ్లు వేసుకొని నెలలు గడుస్తున్నా వానల జాడ కానరాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని ప్రధాన జలాశయాలు నిజాం సాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుతోపాటు పోచారం, కళ్యాణి, సింగితం, కౌలాస్ ప్రాజెక్టులలో నీటిమట్టాలు నిరాశాజనకంగా ఉన్నాయి. వర్షాకాలం ఆరంభం నుంచి బలమైన వానలు కురవకపోవడంతో ఖరీఫ్ పంటల సాగు భవితవ్యం ప్రశ్నార్థకంగా మా రింది. ప్రధాన జలాశయాలు, చెరువులు, కుంటలను నమ్ముకొని పంటల సాగు కోసం రైతులు ముందుగా సమాయత్తమయ్యారు. నారుమడులను సిద్ధం చేసుకున్నారు. చినుకు లు రాలకపోవడంతో చింతపడుతున్నారు. సుమారు నెల న్నర కిందట అలికిన నారుమళ్లు నాట్ల సమయాన్ని మించి పోతున్నాయి. తగ్గుతున్న నీటిమట్టాలు జిల్లాకు వరప్రదాయినిగా పేరున్న నిజాంసాగర్ ప్రాజెక్టుతో పాటు పలు ప్రధాన జలాశయాలు, చెరువులు, కుంటలు బోసిపో యి ఉన్నాయి. నిజాంసాగర్ ప్రాజె క్టు కింద ఈ ఖరీఫ్ సీజన్లో సుమారు 2.10 లక్షల ఎకరాలలో పంటలను సాగు చేయాలి. ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ర్ట, పొరుగు జిల్లాలలో వర్షాలు లేకపోవడంతో ప్రాజెక్టులోకి చుక్క నీరు చేరలేదు. దీనికి అనుసంధానంగా ఉన్న సింగితం రిజర్వాయర్, కళ్యాణి ప్రాజెక్టులలోనూ నీరు లేకపోవడంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడా అంతే శ్రీరాంసాగర్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి ఎలాంటి వరద నీరు రాక పోవడంతో ప్రాజెక్ట్ నీటి మట్టం నిరాశాజనకంగా ఉంది. ఏటా జూలై 20 నుంచి వరద నీరు ప్రాజెక్ట్‌లోకి ప్రారంభమయ్యేది. కాని ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా బిన్నంగా ఉంది. నీటి మట్టం పెరగవలసిన సమయంలో క్రమంగా తగ్గుతోంది. దీంతో రైతులు కలవర పడుతున్నారు. 18 లక్షల ఎకరాల పరిస్థితి దయనీయంగా మారింది. ఎగువ ప్రాంతాల నుంచి రావల్సిన వరదలకు బాబ్లీ ప్రాజెక్ట్‌ను, అనేక చెక్‌డ్యాములను అడ్డుగా కట్టారు. దీంతో ప్రాజెక్ట్ నీటిమట్టం పెరగడం లేదు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా శనివారం సాయంత్రానికి 1067.40 అడుగులు నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు. గతేడాది ఇదే రోజున ప్రాజెక్ట్ లో 1,076 అడుగుల నీరు నిల్వ ఉంది. -
సింగూరు జలాల విడుదల
నిజాంసాగర్, న్యూస్‌లైన్ : నిజాంసాగర్ ప్రాజెక్టులోకి మెదక్ జిల్లాలోని సింగూరు జలాశయం నుంచి టర్బయిన్ గేట్ ద్వారా శనివారం ఉదయం 1,360 క్యూసెక్కుల నీటిని వదిలారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో వరద గేట్ల ద్వారా 10 వేల క్యూసెక్కుల మేర నీటిని విడుదల చేయనున్నారు. ఏడుపాయల దుర్గామాత ఉత్సవాలు, ఘనపూర్ ఆనకట్ట అవసరాల కోసం సింగూరు జలాశయం ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు టర్బయిన్ గేట్ ద్వారా వదులుతున్న నీరు మంజీర నదిలో ప్రవహిస్తోంది. అందులో భాగంగానే నిజాంసాగర్ ప్రాజెక్టుకు 7 టీఎంసీల నీటిని సింగూరు జలాశయం వరద గేట్ల ద్వారా వదలనున్నట్లు అక్కడి అధికారులు పేర్కొంటున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు, ఆయకట్టు పంటల అవసరాల కోసం సింగూరు జలాశయం నుంచి నీటి విడుదలకు రాష్ట్ర ప్రభుత్వాన్ని మంత్రి సుదర్శన్‌రెడ్డి ఒప్పించారు. ప్రభుత్వం మెమో విడుదల చేసి పదిహేను రోజులైనా సింగూరు ప్రాజెక్టు అధికారులు మాత్రం జలాశయం నుంచి నీటిని విడుదల చేయలేదు. మరోసారి జిల్లా నీటిపారుదల శాఖ అధికారులు, మంత్రి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా ఎట్టకేలకు జలాలు విడుదలకానున్నాయి. సింగూరు ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేయనుండటంతో మంజీర పరీవాహక ప్రాంతానికి రైతులు,పశువుల కాపరులు వెళ్లవద్దని సంబంధిత అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం సింగూరు జలాశయంలో 522.339 మీటర్లతో 23.277 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నిజాంసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 1,398.88 అడుగులతో 10.189 టీఎంసీల నీరు నిల్వ ఉంది. -
‘సాగర్’లో తగ్గుతున్న నీటిమట్టం
నిజాంసాగర్, న్యూస్‌లైన్ : నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు వదులుతున్న నీటిపై అధికారులు కాకి లెక్కలు వేస్తున్నారు. ఖరీఫ్ పూర్తవడంతో ఆయకట్టు కింద రబీ పంటల సాగు కోసం రైతులు ముందస్తుగా సమాయత్తమయ్యారు. రబీ పంటలకు నాల్గు విడతల్లో 9 టీఎంసీల నీటిని అంది స్తామని ప్రకటించిన అధికారులు మొదటి విడతలోనే మూడు టీఎంసీల మేరనీటిని వదిలారు. ఇంకా ప్రధాన కాలువకు నీటి విడుదల జరుగుతుండటంతో నిజాంసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం క్రమక్రమంగా తగ్గుతోంది. అయినా ఆయకట్టు కింద పంటల సాగు 60 శాతం పూర్తవలేదు. మొదటి ఆయకట్టు కింద పంటల సాగు కోసం రైతులు నారుమళ్లు వేసుకొని సాగు కోసం న్నద్ధమవుతున్నారు. డీఐబీ సమావేశంలో నాల్గు విడతలకు తీర్మానం నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ఆయ కట్టుకు నీటివిడుదల కోసం జిల్లా కేంద్రంలో రెండు నెలల క్రితం డీఐబీ (నీటిపారుదల శాఖ సలహా మండలి) సమావేశం నిర్వహించారు. చివరి ఆయకట్టు వరకు రబీ సీజన్లో పం టల సాగుకు అవసరం ఉన్న నీటి నిల్వలు జలాశయాలు, ఎత్తిపోతల పథకాల్లో పూర్తిస్థాయిలో ఉన్నా యి. దీంతో పంటల సాగు అవసరం ఉన్న నీటి తడులపైన జిల్లా నీటిపారుదల శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆయకట్టు కింద సమారు 2.10 లక్షల ఎకారల్లో పంటలను సాగు చేయనున్నట్లు వారు అంచనా వేశారు. అలీసాగర్ రిజర్వాయర్ ప్రాంతం వరకు ఉన్న సుమారు 1.38 లక్షల ఎకరాలకు నిజాంసాగర్ ప్రాజెక్టు నుం చి నాల్గు విడతల్లో 9 నుంచి 10 టీఎంసీల నీటి విడుదల కోసం వారు ప్ర తిపాదించారు. ఆయకట్టు కింద వరి, ఆరుతడి పంటల సాగు కోసం ప్రతి పాదించి అందుకు అనుగుణంగా షెడ్యూల్‌ను ఖరారు చేశారు. ఆరుతడి కోసం ప్రారంభించి.. ఆరుతడి పంటల కోసం ప్రాజెక్టు నుంచి డిసెంబర్ 21న ప్రధాన కాలువకు నీటివిడుదల చేపట్టారు. డిస్ట్రిబ్యూటరీ 28, 30 ప్రాంతాల్లో రైతులు పొద్దుతిరుగుడు, మొక్కజొన్న పంటలను సాగు చేస్తున్నారని నీటిని వదిలారు. అప్పటి నుంచి నిర్విరామంగా నీటివిడుదల కొనసాగిస్తున్నారు. దీంతో ప్రాజెక్టులో నీటిమట్టం క్రమక్రమంగా తగ్గు తున్నా, ఆయకట్టు కింద పంటల సాగు 60 శాతం కూడా పూర్తికాలేనట్లు తెలుస్తోంది. మొదటి విడతలో 15 రోజుల పాటు ఆయకట్టుకు 1.5 నుంచి 2 టీఎంసీలు, రెండో విడతలో 15 రోజుల పాటు 1.5 నుంచి 2 టీఎంసీ లు, మూడో విడతలో 20 నుంచి 25 రోజుల పాటు 2 నుంచి 3 టీఎంసీలు, నాల్గో విడతలో 20 నుంచి 25 రోజుల పాటు 2 నుంచి 3 టీఎంసీల నీ టి విడుదలకు ప్రతిపాదించారు. ఆయకట్టు కింద సాగు చేస్తున్న పంటల ను గట్టెక్కించడానికి అవసరం ఉన్న నీటి నిల్వలు ప్రాజెక్టులో పుష్కలంగా ఉన్నాయి. కాని ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు వదులుతున్న నీరు వృథా కాకుండా పంటలకు ఉపయోగపడేలా అధికారులు చర్యలు తీసు కోకపోవడంతో నీరు వృథా అవుతున్నట్లు తెలుస్తోంది. తగ్గుతున్న నీటిమట్టం ఆయకట్టుకింద సాగు చేస్తున్న పంటల కోసం ప్రధాన కాలువకు నీటి విడుదల కొనసాగుతుండటంతో నిజాంసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం క్ర మక్రమంగా తగ్గుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1405.00 అడుగులు 17.8 టీఎంసీలకు గాను ప్రస్తుతం 1402.5 అడుగులతో 14.33 టీఎంసీల నీరు నిల్వ ఉంది.