ఖాళీ పోస్టులన్నింటినీ భర్తీ చేస్తాం
నిజాంసాగర్: నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తూ, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేస్తామని వ్యవసాయ శాఖమంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. చాలా పోస్టులు ఖాళీగా ఉండటంతో ఇన్‌చార్జిలతో పరిపాలన నెట్టుకొస్తున్నామన్నారు. శనివారం సాయంత్రం నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు ఆయన నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 కేడర్‌తో పాటు అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న అధికారుల పోస్టులను భర్తీ చేస్తామన్నా రు. నీటి పారుదల శాఖ, ట్రాన్స్‌కో, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా వంటి శాఖల్లో అధికారులతోపా టు కిందిస్థాయి సి బ్బందిని నియమిస్తున్నామన్నారు.
ఆదర్శ రైతుల అవినీతిని కక్కిస్తాం
బీర్కూర్ : గత ప్రభుత్వం ఆదర్శ రైతుల పేరుతో ప్రజా ధనాన్ని వృథా చేసిందని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. ఒక్క ఎకరం భూమి లేనివారు కూడా ఆదర్శ రైతులుగా నియమితులయ్యారని, వారి అవినీతిని కక్కిస్తామని హెచ్చరించారు. శనివారం ఆయన బీర్కూర్‌లో విలేకరులతో మాట్లాడారు. ఆదర్శ రైతులు డబ్బులకు కక్కుర్తి పడి పంట నష్టపోని రైతులకు కూడా నష్టపోయినట్లు వివరాలు అందించారని అన్నారు.
వారి పెత్తనం ఎక్కువ కా వడం తో ప్రభుత్వానికి సరైన నివేదిక అందలేదని, దీంతో నిజమైన లబ్ధిదారులకు ఇన్‌పుట్ సబ్సిడీ అందలేదన్నారు. తీవ్ర విమర్శలకు కారణమవుతున్న ఆదర్శ రైతుల వ్యవస్థను వెంటనే తొలగిస్తున్నామని పేర్కొన్నారు. దీనిపై సంతకం కూడా అయిపోయిందన్నారు. గత ఐదేళ్లుగా తెలంగాణ జిల్లాలలో పంట నష్టపోయి న 26 లక్షల మంది రైతులకు రూ. 482.52 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని ప్రభుత్వం విడుదల చేసిందన్నారు.
భూమి లేనివారికి రుణాలు మాఫీ కుదరదు
ప్రభుత్వం సుమారు రూ. 18 వేల కోట్ల పంట రుణాలను మాఫీ చేసిందని మంత్రి తెలిపారు. కొంత మంది దొంగ పాస్ బుక్‌లు రూపొందించి బ్యాంక్‌లలో రుణా లు పొందారని, అలాంటి వారికి రుణాలు మాఫీ కావ ని అన్నారు. భూమి లేనివారు తీసుకున్న రుణాలను మాఫీ చేయబోమన్నారు. కొందరు అధికారులు డబ్బులకు కక్కుర్తి పడి దొంగ పట్టాలు మంజూరు చేశారని, అలాంటి వారిని గుర్తిస్తామన్నారు. ప్రభుత్వం నుంచి మంజూరైన ప్రతీ రూపాయి పేదలకు చెందాలని అ న్నారు. భూమి లేనివారికి పంట రుణాలు మాఫీ అయినట్లు తెలిస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన 80 రోజులలోనే అ నేక హామీలను నెరవేర్చామన్నారు. విలేకరుల సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ దఫేదార్ రాజు తదితరులు పాల్గొన్నారు.