Minister of Agriculture
-
200 ఎకరాల్లో మిల్లెట్స్ మోడల్ ఫార్మ్ - ఒప్పందానికి గ్రీన్ సిగ్నెల్
హైదరాబాద్: యూపీఎల్ కంపెనీ గయానా ప్రభుత్వంతో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. రిపబ్లిక్ ఆఫ్ గయానా సహకారంతో 200 ఎకరాల్లో ‘మిల్లెట్స్ మోడల్ ఫార్మ్’’ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఒప్పందంపై యూపీఎల్ గ్రూప్ సీఈవో జైష్రాఫ్, గయానా వ్యవసాయ శాఖ మంత్రి జుల్ఫికర్ ముస్తఫా ఏప్రిల్ 21న అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసినట్టు తెలిపింది. ఈ పార్క్‌లో మిల్లెట్స్ సాగుకు కావాల్సిన సాంకేతిక సహకారం, వ్యవసాయ ముడి సరుకులను యూపీఎల్ అందించనుంది. సాగుకు కావాల్సిన 200 ఎకరాల భూమి, కార్మికులను గయానా ప్రభుత్వం సమకూర్చనుంది. -
విద్యార్థులు వ్యవసాయ రంగంపై దృష్టి సారించాలి
మేడ్చల్ రూరల్: విద్యార్థులు ఇంజనీరింగ్ వైపు మాత్రమే వెళ్లకుండా అగ్రికల్చర్ రంగంపై వైపు దృష్టి సారించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. మైస మ్మగూడలోని మల్లారెడ్డి యూ నివర్సిటీలో అగ్రికల్చర్ ఎగ్జిబిషన్‌ను మంత్రి మల్లారెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం మల్లారెడ్డి ఉమెన్స్ కళాశాల సక్సెస్ మీట్ కార్యక్రమా ల్లో పాల్గొన్నారు. విద్యార్థుల ప్రదర్శనలను తిలకించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ అగ్రికల్చర్ రంగానికి మంచి భవిష్యత్తు ఉందని, విద్యార్థులు ఇంజనీరింగ్ విద్య వైపే వెళ్లకుండా అగ్రికల్చర్ సంబంధిత కోర్సులు చేయాలని సూచించారు. టెక్నాలజీలో వస్తున్న మార్పులకు అనుగుణంగా వ్యవసాయ రంగంలోని కూడా అనేక మార్పులు వస్తున్నాయన్నారు. కార్యక్రమంలో యూనివర్సిటీ వీసీ వీఎస్కే రెడ్డి, నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జి మహేందర్‌రెడ్డి, మల్లారెడ్డి గ్రూప్స్ డైరెక్టర్ శాలినీ రెడ్డి, ప్రిన్సిపాల్ మాధవీలత పాల్గొన్నారు. -
రైతుల ‘చలో ఢిల్లీకి’ అనుమతి
న్యూఢిల్లీ/చండీగఢ్: నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో రైతు సంఘాలు, రైతులు తలపెట్టిన ‘చలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని తొలిరోజు అడ్డుకున్న ప్రభుత్వం రెండోరోజు శుక్రవారం దిగి వచ్చింది. రైతులు శాంతియుతంగా ధర్నా చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఢిల్లీకి దారి తీసే మార్గాలపై విధించిన ఆంక్షలను పోలీసులు ఎత్తివేశారు. దీంతో పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల రైతులు పెద్ద సంఖ్యలో ఢిల్లీకి చేరుకున్నారు. రాజధానిలో అతి పెద్దదైన నిరంకారీ మైదానంలో ధర్నా నిర్వహించారు. సాగును కార్పొరేట్లకు అప్పగిస్తూ రైతులను దగా చేసే కొత్త వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గురువారం పంజాబ్–హరియాణా సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఢిల్లీకి బయలుదేరిన రైతులపైహరియాణా పోలీసులు భాష్పవాయువు, జల ఫిరంగులు ప్రయోగించారు. హరియాణాలో పలుచోట్ల రైతులపై దాష్టీకం ప్రదర్శించారు. శుక్రవారం పరిస్థితి చాలావరకు సద్దుమణిగింది. ఆంక్షలను ఎత్తివేయడంతో అన్నదాతలు తిక్రీ బోర్డర్ నుంచి పోలీసు ఎస్కార్ట్‌తో నిరంకారీ మైదానానికి చేరుకున్నారు. ధర్నాతో ఢిల్లీలో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. హరియాణాలోని భీవానిలో జరిగిన ప్రమాదంలో ర్యాలీలో పాల్గొనేందుకు వస్తున్న పంజాబ్ రైతు తాన్నాసింగ్(40) మృతి చెందాడు. రైతులతో చర్చించేందుకు సిద్ధం రైతులతో అన్ని అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ చెప్పారు. రైతన్నలు ఆందోళన విరమించుకోవాలని కోరారు. కొత్త సాగు చట్టాలతో అన్నదాతల జీవితాల్లో పెను మార్పులు వస్తాయన్నారు. 3న జరిగే భేటీకి రైతు నేతలను ఆహ్వానించామన్నారు. సింఘు సరిహద్దు వద్ద రైతుపై లాఠీచార్జ్ చేస్తున్న జవాను -
రబీ పంటల ‘మద్దతు’ పెంపు
న్యూఢిల్లీ: గోధుమ సహా ఆరు రబీ పంటల కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)ను 6% వరకు పెంచుతూ కేంద్రం సోమవారం నిర్ణయం తీసుకుంది. తాజాగా పార్లమెంటు ఆమోదం పొందిన వ్యవసాయ బిల్లుల ద్వారా ఎంఎస్పీ వ్యవస్థను దశలవారీగా తొలగించాలనుకుంటోందన్న రైతుల ఆందోళనకు తాజా చర్య ద్వారా ప్రభుత్వం సమాధానమిచ్చింది. గోధుమ కనీస మద్దతు ధరను క్వింటాల్‌కు రూ. 50 పెంచారు. దాంతో క్వింటాల్ గోధుమ ఎంఎస్పీ రూ. 1,975కి చేరింది. 2020–21 పంట సంవత్సరానికి(జూన్–జూలై), 2021–22 మార్కెటింగ్ సీజన్‌కు ఆరు రబీ పంటల ఎంఎస్పీ పెంపును ప్రధాని మోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదించిందని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ లోక్‌సభకు తెలిపారు. బార్లీ కనీస మద్దతు ధరను క్వింటాల్‌కు రూ.75 పెంచారు. దాంతో క్వింటాల్ బార్లీ ధర రూ.1,600కు చేరింది. ఎంఎస్పీ రూ.225 పెరగడంతో, కందుల ధర క్వింటాల్‌కు రూ. 5,100కి చేరింది. మసూర్‌దాల్ ధర క్వింటాల్‌కు రూ.300 పెరిగింది. దాంతో వాటి ధర క్వింటాల్‌కు రూ. 5,100కి చేరింది. ఆవాల ధర క్వింటాల్‌కు రూ.225 పెరిగి, రూ. 4,650కి చేరింది. కుసుమల ధర క్వింటాల్‌కు రూ.112 పెరిగి, రూ.5,327కి చేరింది. కనీస మద్దతు ధర కొనసాగుతుందనేందుకు తాజా పెంపే నిదర్శనమని తోమర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇప్పటికైనా తప్పుడు ప్రచారం మానుకోవాలని విపక్ష పార్టీలకు సూచించారు. గత ఆరేళ్లలో రైతులకు రూ. 7 లక్షల కోట్లను ఎంఎస్పీగా అందించామన్నారు. -
రైతులు నష్టపోకుండా అన్ని చర్యలు తీసుకున్నాం
-
సీషెల్స్‌కు రాష్ట్ర ఉద్యాన శాఖ టెక్నాలజీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యాన శాఖ టెక్నా లజీని సీషెల్స్ దేశం అందిపుచ్చుకోనుంది. అధునాతన సాంకేతికతతో పాలీహౌస్‌లు నిర్మించి కూరగాయలు, పండ్ల తోటలు, పూలసాగును తమ దేశంలో చేపట్టేందుకు సహకరించాలని ఆ దేశ వ్యవసాయ మంత్రి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరగా అందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి అనుమతించారు. త్వరలోనే ఆ దేశ వ్యవసాయాధికారులు ఎనిమిది మంది రాష్ట్రంలో పర్యటించి పాలీహౌస్‌లు, పండ్ల తోటలు, ఇతర టెక్నాలజీపై శిక్షణ తీసుకోనున్నారు. సీషెల్‌లో 4 పాలీహౌస్‌ల నిర్మాణం చేపట్టి, వాటి పనితీరును కూడా వివరించాలని చేసిన విజ్ఞప్తి పై కూడా ఉద్యానశాఖ సంచాలకులు ఎల్.వెంకట్రామ్రెడ్డి కస రత్తు చేస్తున్నారు. వ్యవసాయ, ఉద్యాన, మత్స్య శాఖల పనితీరు, పంటల సాగుపై అధ్యయనం చేయడానికి సీషెల్స్ వ్యవసాయశాఖ బృందం ఇటీవల మన దేశ పర్యటనకు వచ్చింది. రాష్ట్ర ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో జీడిమెట్లలో నడుస్తున్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని సందర్శించింది. -
ఖాళీ పోస్టులన్నింటినీ భర్తీ చేస్తాం
నిజాంసాగర్: నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తూ, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేస్తామని వ్యవసాయ శాఖమంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. చాలా పోస్టులు ఖాళీగా ఉండటంతో ఇన్చార్జిలతో పరిపాలన నెట్టుకొస్తున్నామన్నారు. శనివారం సాయంత్రం నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు ఆయన నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 కేడర్‌తో పాటు అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న అధికారుల పోస్టులను భర్తీ చేస్తామన్నా రు. నీటి పారుదల శాఖ, ట్రాన్స్‌కో, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా వంటి శాఖల్లో అధికారులతోపా టు కిందిస్థాయి సి బ్బందిని నియమిస్తున్నామన్నారు. ఆదర్శ రైతుల అవినీతిని కక్కిస్తాం బీర్కూర్ : గత ప్రభుత్వం ఆదర్శ రైతుల పేరుతో ప్రజా ధనాన్ని వృథా చేసిందని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. ఒక్క ఎకరం భూమి లేనివారు కూడా ఆదర్శ రైతులుగా నియమితులయ్యారని, వారి అవినీతిని కక్కిస్తామని హెచ్చరించారు. శనివారం ఆయన బీర్కూర్‌లో విలేకరులతో మాట్లాడారు. ఆదర్శ రైతులు డబ్బులకు కక్కుర్తి పడి పంట నష్టపోని రైతులకు కూడా నష్టపోయినట్లు వివరాలు అందించారని అన్నారు. వారి పెత్తనం ఎక్కువ కా వడం తో ప్రభుత్వానికి సరైన నివేదిక అందలేదని, దీంతో నిజమైన లబ్ధిదారులకు ఇన్పుట్ సబ్సిడీ అందలేదన్నారు. తీవ్ర విమర్శలకు కారణమవుతున్న ఆదర్శ రైతుల వ్యవస్థను వెంటనే తొలగిస్తున్నామని పేర్కొన్నారు. దీనిపై సంతకం కూడా అయిపోయిందన్నారు. గత ఐదేళ్లుగా తెలంగాణ జిల్లాలలో పంట నష్టపోయి న 26 లక్షల మంది రైతులకు రూ. 482.52 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. భూమి లేనివారికి రుణాలు మాఫీ కుదరదు ప్రభుత్వం సుమారు రూ. 18 వేల కోట్ల పంట రుణాలను మాఫీ చేసిందని మంత్రి తెలిపారు. కొంత మంది దొంగ పాస్ బుక్‌లు రూపొందించి బ్యాంక్‌లలో రుణా లు పొందారని, అలాంటి వారికి రుణాలు మాఫీ కావ ని అన్నారు. భూమి లేనివారు తీసుకున్న రుణాలను మాఫీ చేయబోమన్నారు. కొందరు అధికారులు డబ్బులకు కక్కుర్తి పడి దొంగ పట్టాలు మంజూరు చేశారని, అలాంటి వారిని గుర్తిస్తామన్నారు. ప్రభుత్వం నుంచి మంజూరైన ప్రతీ రూపాయి పేదలకు చెందాలని అ న్నారు. భూమి లేనివారికి పంట రుణాలు మాఫీ అయినట్లు తెలిస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన 80 రోజులలోనే అ నేక హామీలను నెరవేర్చామన్నారు. విలేకరుల సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ దఫేదార్ రాజు తదితరులు పాల్గొన్నారు.