మేడ్చల్ రూరల్: విద్యార్థులు ఇంజనీరింగ్ వైపు మాత్రమే వెళ్లకుండా అగ్రికల్చర్ రంగంపై వైపు దృష్టి సారించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. మైస మ్మగూడలోని మల్లారెడ్డి యూ నివర్సిటీలో అగ్రికల్చర్ ఎగ్జిబిషన్‌ను మంత్రి మల్లారెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం మల్లారెడ్డి ఉమెన్స్ కళాశాల సక్సెస్ మీట్ కార్యక్రమా ల్లో పాల్గొన్నారు. విద్యార్థుల ప్రదర్శనలను తిలకించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ అగ్రికల్చర్ రంగానికి మంచి భవిష్యత్తు ఉందని, విద్యార్థులు ఇంజనీరింగ్ విద్య వైపే వెళ్లకుండా అగ్రికల్చర్ సంబంధిత కోర్సులు చేయాలని సూచించారు. టెక్నాలజీలో వస్తున్న మార్పులకు అనుగుణంగా వ్యవసాయ రంగంలోని కూడా అనేక మార్పులు వస్తున్నాయన్నారు. కార్యక్రమంలో యూనివర్సిటీ వీసీ వీఎస్‌కే రెడ్డి, నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి మహేందర్‌రెడ్డి, మల్లారెడ్డి గ్రూప్స్ డైరెక్టర్ శాలినీ రెడ్డి, ప్రిన్సిపాల్ మాధవీలత పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment