ముంబై వేదికగా 4 మెడల్స్ సాధించిన తెలుగు విద్యార్థులు
త్వరలో దుబాయ్ వేదికగా అంతర్జాతీయ పోటీలకు అర్హత
సాక్షి, హైదరాబాద్: జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే యోగా ఛాంపియన్‌షిప్‌లలో నగరానికి చెందిన యోగా విద్యార్థులు ప్రత్యేకత చాటుకుంటున్నారు. ముంబై వేదికగా నిర్వహించిన ఇండియా లెవెల్ యోగాసన ఛాంపియన్‌షిప్–2024లో నగర విద్యార్థులు 4 మెడల్స్‌తో రాణించారు. ఈ ఛాంపియన్‌షిప్‌లో 28 రాష్ట్రాల నుంచి యోగా విద్యార్థులు పాల్గొనగా.. నగరం నుంచి వెళ్లిన విద్యార్థుల్లో నలుగురు మెడల్స్ సాధించారు.
ఈ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా బాలికల అండర్ 9–11 విభాగంలో ప్రదీప్తి ద్వితీయ స్థానంలో నిలవగా, హన్సినీ తృతీయ స్థానం సాధించింది. అండర్ 12–15 విభాగంలో మనస్వీ 5వ స్థానంలో నిలిచింది. అంతేగాకుండా బాలు అండర్ 9–11 విభాగంలో విద్వాన్ తృతీయ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఈ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా వివిధ విభాగాల్లో రాష్ట్రం నుంచి 18 మంది యోగా విద్యార్థులు పాల్గొన్నారు.
ఇందులో నగరం వేదికగా జి.రాకేష్ కుమార్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న ముగ్గురు విద్యార్థులు మెడల్స్ అందుకున్నారు. మెడల్స్ సాధించిన విద్యార్థులు త్వరలో దుబాయ్ వేదికగా జరగనున్న అంతర్జాతీయ యోగా ఛాంపియన్íÙప్‌లో పాల్గొంటారని యోగా ట్రైనర్ రాకేష్‌కుమార్ పేర్కొన్నారు. భవిష్యత్‌లో నగర విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించి రాష్ట్రానికి, దేశానికి ఖ్యాతిని తీసుకువస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment