Engeneering
-
Anupam Kumar: 'మినీ మైన్స్'తో.. క్లీన్ ఎనర్జీ అండ్ క్లైమెట్ చేంజ్..
‘లో కాస్ట్ – జీరో వేస్ట్’ నినాదంతో ‘మినీ మైన్స్’ స్టార్టప్‌కు శ్రీకారం చుట్టారు అనుపమ్ కుమార్, అరవింద్ భరద్వాజ్. ఈ–వ్యర్థాల నుంచి లిథియం ఎక్స్ట్రాక్షన్ చేస్తూ ఎలక్ట్రిక్ వెహికిల్(ఈవి) పరిశ్రమకు ఖర్చులు తగ్గిస్తున్నారు. దిగుమతులకు ప్రత్నామ్యాయంగా స్వావలంబనకు ప్రాధాన్యత ఇస్తూ విజనరీ ఫౌండర్స్‌గా పేరు తెచ్చుకున్నారు.. ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీ)కి సంబంధించి అతి పెద్ద ఖర్చు లిథియం–అయాన్ బ్యాటరీ. మన దేశంలో లిథియం వోర్ తక్కువగా ఉంది. దీంతో దిగుమతులపై ఆధారపడాల్సిన పరిస్థితి. మరోవైపు చూస్తే ఎలక్ట్రిక్ వాహనాలు, మొబైల్ ఫోన్లు, లాప్టాప్ల బ్యాటరీలకు సంబంధించి ఈ–వ్యర్థాలు కొండలా పేరుకు పోయాయి. ఈ కొండల్లో నుంచి లిథియం వెలికి తీయగలిగితే నికెల్, కోబాల్టును సేకరించగలిగితే దిగుమతులపై అతిగా ఆధారపడాల్సిన అవసరం ఉండదు. బ్యాటరీల ఖర్చు తగ్గుతుంది. బెంగళూరు కేంద్రంగా అనుపమ్ కుమార్, అరవింద్ భరద్వాజ్లుప్రారంభించిన ‘మినీ మైన్స్’ మన దేశంలోని ఈ–వ్యర్థాల నుంచి లిథియం, నికెల్, కోబాల్ట్‌లను సేకరించి వాటిని బ్యాటరీ తయారీదారులకు విక్రయిస్తుంది. మైనింగ్ కంటే లీ–అయాన్ బ్యాటరీల నుండి భాగాలను వెలికితీయడం మంచి రాబడి ఇస్తుంది. ఒక టన్ను లిథియం ఖనిజాన్ని తవ్విప్రాసెసింగ్ చేయడం వల్ల 2–3 కిలోల లిథియం లభిస్తుందని, ఒక టన్ను బ్యాటరీలను రీసైక్లింగ్ చేయడం వల్ల 20–30 కిలోల లిథియం లభిస్తుందని, నీటిని ఆదా చేస్తుందని, కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గిస్తుందని అంటున్నారు అనుపమ్, అరవింద్. ‘మన దేశంలోని స్పెంట్ బ్యాటరీల నుంచి 66 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలకు సరిపడా లిథియం అయాన్, నికెల్, కోబాల్ట్‌లను వెలికితీయవచ్చు’ అంటున్నాడు అనుపమ్ కుమార్. మొబైల్ ఫోన్, బటన్ సెల్స్, ల్యాప్‌టాప్ బ్యాటరీల తయారీకి కూడా లి–అయాన్‌ను ఉపయోగిస్తారు. లిథియం కార్బోనేట్‌ను ఫార్మాస్యూటికల్ రంగంలో, గ్లాస్ మాన్యుఫాక్చరింగ్లో ఉపయోగిస్తారు. బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కెమికల్ ఇంజనీరింగ్ చేసిన అనుపమ్ కుమార్ బాబా ఆటోమిక్ రిసెర్చ్ సెంటర్లో కెరీర్ప్రారంభించాడు. అక్కడ రియాక్టర్ల వ్యర్థాల నుంచి యురేనియం, నికెల్లను వేరు చేసేవాడు. ‘లాగ్9 మెటరీయల్స్’లో అనపమ్, అరవింద్ భరద్వాజ్‌లకు పరిచయం జరిగింది. అక్కడ భరద్వాజ్ లిథియం–అయాన్ బ్యాటరీస్ డివిజన్ హెడ్‌గా ఉండేవాడు. వీరి మధ్య జరిగిన సంభాషణల్లో ‘యురేకా’ మూమెంట్ ఆవిష్కారం అయింది. అది ‘మినీ మైన్స్’ స్టార్టప్ అయింది. తమ పొదుపు మొత్తాలు 6.5 కోట్లతో కంపెనీప్రారంభించారు. మినీమైన్స్ టెక్నాలజీని నీతి ఆయోగ్ ధృవీకరించింది. ఆయిల్ ఇండియా లిమిటెడ్, ది యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రీయల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లు గ్రాంట్ ఇచ్చాయి. ‘ఎలక్ట్రిక్ వెహికిల్స్ రంగం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో మినీ మైన్స్ విలువైన లోహాలను పునర్వినియోగ రూపంలో ఈవీ పరిశ్రమకు మేలు చేస్తుంది’ అంటున్నాడు ఆవాజ్ ఫౌండేషన్ కన్వీనర్ సుమైరా అబ్దులాలీ. కమాడిటీ సేల్స్, లైసెన్సింగ్/రాయల్టీ....మొదలైన వాటితో కంపెనీకి సంబంధించిన రెవెన్యూ మోడల్‌ను రూపొందించుకుంది మినీ మైన్స్. ‘ఈ–వ్యర్థాలను రీసైకిల్ చేయగలిగితే మన దేశం మరింత స్వావలంబన దిశగా పయనించడమే కాదు ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమకు ఖర్చును తగ్గించవచ్చు అనుకున్నాం’ అంటాడు కంపెనీ సీయివో అనుపమ్ కుమార్. అతడి మాటలు వృథా పోలేదు అని చెప్పడానికి ‘మినీ మైన్స్’ సాధించిన విజయమే సాక్ష్యం. ఇవి చదవండి: Shambhavi Choudhary: అతి చిన్న వయసు దళిత అభ్యర్థి -
ట్రక్కు డ్రైవర్‌గా మారిన ఇంజినీర్.. సంపాదన రూ. 50 లక్షల కంటే ఎక్కువే!
భారతదేశంలో ఉన్నత చదువులు చదివిన చాలా మంది విదేశలకు వెళ్ళాలి, అక్కడ ఉద్యోగం చేసి బాగా సంపాదించి జీవితంలో స్థిరపడాలని కలలు కంటూ ఉంటారు. అయితే కెనడాలో ఉన్నత చదువు చదివిన భారతీయుడు ట్రక్కు డ్రైవర్ జాబ్ చేస్తూ సంవత్సరానికి ఏకంగా రూ. 50 లక్షలు సంపాదిస్తున్నట్లు తెలిసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, 2012లో కెనడాకు ఉన్నత విద్య కోసం వచ్చి చాలా కాలంగా అక్కడే స్థిరపడిన ఒక ఇండియన్ చదువు పూర్తయిన తరువాత ట్రక్కు డ్రైవర్ ఉద్యోగాన్ని ఎంచుకున్నాడు. అయితే యితడు ఇంజినీరింగ్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఒక వీడియో గగన్ కల్రా - కెనడా అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశారు. చదువు పూర్తయిన తరువాత ఉపాధి అవకాశాల కోసం చాలా అన్వేషించినట్లు, అందులో అతనికి ట్రక్కింగ్ చాలా ఆసక్తికరంగా అనిపించడంతో దానిని ఎంచుకున్నట్లు వివరించాడు. కెనడాలో చాలా ట్రక్కింగ్ కంపెనీలు తమ డ్రైవర్లకు, వారు కవర్ చేసే దూరాన్ని బట్టి డబ్బు చెల్లిస్తారు. ఒక మైలుకి 55 సెంట్లు చొప్పున ఈ ఇంజినీరింగ్ ట్రక్ డ్రైవర్ నెలకు 1700 కెనడియన్ డాలర్లను సంపాదిస్తున్నాడు. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ సుమారు నెలకు రూ. 4 లక్షలు, సంవత్సరానికి రూ. 50 లక్షల కంటే ఎక్కువ. ఒక వేళా కెనడాలో సొంత ట్రక్కుని కలిగి ఉంటే అంతకు మించి సంపాదించవచ్చని అతడు చెబుతున్నాడు. (ఇదీ చదవండి: ఖాతాదారులు ఎగిరి గంతేసే వార్త చెప్పిన ఆర్బిఐ.. జీరో బ్యాలెన్స్ ఉన్నా నో వర్రీస్!) కెనడాలో డ్రైవింగ్ చేయాలంటే లైసెన్స్ పొందడం కోసం ప్రావిన్సుల వారీగా రిక్వైర్మెంట్ మూరుతూ ఉంటాయని కూడా ప్రస్తావించారు. మొదట అతడు సుదీర్ఘ ప్రయాణాలు చేసాడు. ఇందులో భాగంగానే కెనడాలోని వివిధ ప్రాంతాలు మాత్రమే కాకుండా.. కెనడా నుంచి అమెరికాకు కూడా వెళ్ళాడు. వృత్తి రీత్యా ఇంజినీర్ అయినప్పటికీ ట్రక్కు డ్రైవింగ్ చేయడం చాలా ఆనందంగా ఉందన్నాడు. అంతే కాకుండా కెనడాలో ఉన్నత విద్య చదివినవారి సంఖ్య చాలా ఎక్కువని పేర్కొన్నాడు. (ఇదీ చదవండి: వ్యాపార రంగంలో 'తల్లీ కూతుళ్ళ' విజయ ప్రస్థానం!) ట్రక్కింగ్ విషయానికి వస్తే సుదూర ప్రాంతాలకు మాత్రమే కాకుండా తక్కువ దూరాలకు ప్రయాణించే వెసులు బాట్లు ఉంటాయి. ట్రక్కు డ్రైవ్ చేసే డ్రైవర్లు చాలా వరకు ట్రక్కుల్లోనే జీవితం గడిపేస్తారు. కుటుంబాలతో గడిపే సమయం కూడా చాలా పరిమితంగానే ఉంటుంది. ఈ వీడియోలో ట్రక్కు డ్రైవర్ జీవితం గురించి మాత్రమే కాకుండా ట్రక్కు లోపల భాగాన్ని కూడా చూడవచ్చు. ఒక డ్రైవర్ వారానికి గరిష్టంగా 70 గంటలు డ్రైవ్ చేసిన తరువాత మళ్ళీ డ్రైవ్ ప్రారభించాలంటే విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని ఇంజనీర్ ట్రక్కు డ్రైవర్ వివరించాడు. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్‌లో సగం సీట్లు ఖాళీ
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ , సాంకేతిక వృత్తి విద్యా కోర్సుల్లో సగం సీట్లు భర్తీ కావడంలేదు. గత పదేళ్లుగా కన్వీనర్ కోటాతోపాటు మేనేజ్మెంట్ కోటాలోనూ సీట్లు భారీగా మిగిలిపోతున్నాయి. కొన్ని ప్రముఖ కాలేజీల్లో మినహా చాలా కాలేజీల్లో సగానికి పైగా సీట్లు మిగిలిపోతున్నట్టు ఏఐసీటీఈ గణాంకాలు చెబుతున్నాయి. ఏఐసీటీఈ ఏటా ప్రకటించే గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా గత పదేళ్లలో 40 నుంచి 48 శాతం వరకు సీట్లు మిగిలిపోతున్నాయి. 2013–14లో 39 శాతం సీట్లు మిగిలిపోగా, 2016–18 నాటికి 48 శాతానికి పెరిగింది. ఆ తరువాత రెండేళ్లూ ఇదే పరిస్థితి. కరోనా తరువాత చేరికలు కొంతమేర పెరగడంతో మిగులు సీట్లు 42 శాతానికి చేరాయి. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే గత మూడేళ్లుగా 80 శాతానికి పైగా సీట్లు భర్తీ అవుతున్నాయి. 2022–23 విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్ కన్వీనర్ కోటాలో 85 శాతం సీట్లు భర్తీ అవడం విశేషం. ఇన్‌టేక్ తగ్గినా చేరికలు మాత్రం అంతే వాస్తవానికి దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీల్లో మొత్తం సీట్ల సంఖ్య గత పదేళ్లలో భారీగా తగ్గింది. పదేళ్లక్రితం 30 లక్షల నుంచి 31 లక్షల వరకు సీట్లు ఉండగా ఇప్పుడది 23 లక్షలకు తగ్గింది. సీట్ల సంఖ్య తగ్గినా చేరికల్లో మాత్రం మార్పు లేదు. గతంలో పలు విద్యా సంస్థలు సదుపాయాలు లేకున్నా కోర్సులకు అనుమతులు తెచ్చుకొనేవి. వీటివల్ల సాంకేతిక విద్య నాసిరకంగా మారుతుండడంతో సదుపాయాలున్న వాటికే ఏఐసీటీఈ అనుమతులిస్తోంది. ప్రమాణాల మేరకు సదుపాయాలు లేకున్నా, చేరికలు వరుసగా మూడేళ్లు 25 శాతానికి లోపు ఉన్నా వాటికి అనుమతులను రద్దు చేస్తోంది. దీంతో పలు కాలేజీలు మూతపడ్డాయి. కంప్యూటర్ సైన్సు సీట్లకే డిమాండ్ విద్యార్థులు ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉన్న కంప్యూటర్ సైన్సు, తత్సంబంధిత కోర్సులవైపు దృష్టి సారిస్తున్నారు. దానికోసం కాలేజీలు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నా వెనక్కు తగ్గడం లేదు. ఇతర కోర్సుల్లో చేరికలు అంతంతమాత్రమే. ఒకప్పుడు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సీఎస్ఈ) కోర్సుకే పరిమితమైన ఈ డిమాండ్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెరి్నంగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ), బ్లాక్ చైన్, రోబోటిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, 3డీ ప్రింటింగ్ అండ్ డిజైన్, వర్చువల్ రియాలిటీ, ఆగ్యుమెంటెడ్ రియాలిటీ (ఏఆర్), బిగ్ డేటా వంటి అంశాలలో నేరుగా లేదా కాంబినేషన్లో వివిధ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. అయితే వీటి బోధనకు అవసరమైన సదుపాయాలను కొన్ని ప్రముఖ కాలేజీలు మాత్రమే కల్పిస్తున్నాయి. మిగతా కళాశాలలు సంప్రదాయ కోర్సులతోనే నెట్టుకొస్తున్నాయి. సంప్రదాయ కోర్ గ్రూప్ కోర్సుల వైపు విద్యార్థులను మళ్లించడానికి ఇతర అంశాలను వీటికి మైనర్ కోర్సులుగా జతచేయాలని ఏఐసీటీఈ ఆలోచిస్తోంది. ఈ కోర్సుల్లోని నూతన అంశాలపై అధ్యాపకులకు శిక్షణ కూడా ఇస్తోంది. లెక్చరర్ల కోసం ఇంటర్న్‌షిప్ కోర్సులు కూడా నిర్వహిస్తోంది. రాష్ట్రంలో చేరికలు 80 శాతం పైనే దేశంలోని పరిస్థితులకు భిన్నంగా రాష్ట్రంలో చేరికలు 80 శాతానికి పైగా ఉండటం విశేషం. గత మూడేళ్లుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న చర్యలతో చేరికలు భారీగా పెరుగుతున్నాయి. జగనన్న విద్యా దీవెన కింద రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసించే వారందరికీ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నారు. ఆర్థిక భారం లేకపోవడంతో విద్యార్థులు ఎక్కువగా ఇంజనీరింగ్‌లో చేరుతున్నారు. జగనన్న వసతి దీవెన కింద ప్రతి విద్యార్థికి ఏటా రూ.20 వేలు అదనంగా ఇస్తున్నారు. ఇంజనీరింగ్ సిలబస్‌ను సంస్కరించి ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా కొత్త అంశాలను జోడించారు. ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేశారు. విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి మైక్రోసాఫ్ట్ వంటి అంతర్జాతీయ సంస్థలతో శిక్షణ, సర్టిఫికేషన్ కోర్సులను అందుబాటులోకి తెచ్చారు. జగనన్న విద్యా దీవెన కింద ఇప్పటివరకు రూ.9051.57కోట్లు అందించారు. దీని ద్వారా ఇంజనీరింగ్‌తో పాటు ఇతర కోర్సులకు చెందిన 24,74,544 మంది విద్యార్థులకు మేలు చేకూరింది. జగనన్న వసతి దీవెన కింద ఇప్పటివరకు రూ.3,349.57కోట్లు అందించగా 18,77,863 మందికి లబ్ధి చేకూరింది. కాలేజీలకు న్యాక్ గుర్తింపును తప్పనిసరి చేశారు. ప్రమాణాలు మెరుగుపరుచుకోని కాలేజీలకు అనుమతులు రద్దు చేస్తున్నారు. గత ఏడాది ప్రవేశాలు సరిగా లేని 28 కాలేజీల్లో ప్రవేశాలు నిలిపివేశారు. ఒక్క విద్యార్థీ చేరని మరో 22 కాలేజీల అనుమతులు రద్దు చేశారు. దీంతో కాలేజీల్లో వసతులు, బోధనలో నాణ్యత మెరుగుపడుతున్నాయి. ఈ చర్యలతో విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోంది. 2022–23 విద్యా సంవత్సరంలో కన్వీనర్ కోటా సీట్లు 1,13,403 కాగా, అందులో 95,968 (85 శాతం) భర్తీ అయ్యాయి. యాజమాన్య కోటా, స్పాట్ అడ్మిషన్లతో పాటు చూస్తే 1,21,836 (76 శాతం) సీట్లు భర్తీ అయ్యాయి. గత నాలుగేళ్ల గణాంకాలు చూస్తే ఏటా భర్తీ అయ్యే సీట్ల సంఖ్య పెరుగుతుండడం విశేషం. -
Hyderabad: వానలకే కాదు.. ఇక అధికారులు సైతం వణికే పరిస్థితులు
సాక్షి, హైదరాబాద్: నగరంలో వానలంటేనే ప్రజలు వణికే పరిస్థితి. అది నిన్నటి వరకు. ఇప్పుడిక అధికారులు సైతం వణికే పరిస్థితులేర్పడ్డాయి. గత రెండేళ్లుగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులతోపాటు ప్రాణాపాయాలు కూడా చోటు చేసుకోవడంతో సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించే ఇంజినీర్లపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరించింది. వర్షాకాలం ప్రారంభమయ్యేలోపునే అన్ని మ్యాన్‌హోళ్లకు మూతలు సక్రమంగా ఉండటం దగ్గరనుంచి నాలాల పనులు జరుగుతున్న ప్రాంతాల్లో తగిన హెచ్చరికలు, సైనేజీలు, రాత్రుళ్లు లైటింగ్ వంటివి ఉండాలని స్పష్టం చేసింది. పనుల పూర్తికి జూన్ 5 వరకు గడువునిచ్చింది. గడువులోగా పనులు చేయని వారికి షోకాజ్ నోటీసులు సైతం ఉంటాయని హెచ్చరించింది. అయినప్పటికీ ఇప్పటి వరకు చాలా ప్రాంతాల్లో అవి అమలు కాలేదు. మరోవైపు రెండేళ్ల క్రితం కురిసిన భారీ వర్షాల సందర్భంగా నాలాలు ప్రమాదకరంగా ఉండకుండా తగిన చర్యల కోసం రూ. 298 కోట్లు మంజూరు చేసింది. ఏడాది క్రితం వరద సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా ఎస్ఎన్డీపీ వింగ్‌ను ఏర్పాటు చేయడంతోపాటు పనులు చేసేందుకు దాదాపు రూ. 985 కోట్లు మంజూరు చేసింది. వీటితో పాటు ఇతరత్రా పనుల కోసం మరికొన్ని నిధులు మంజూరు చేసింది. అయినప్పటికీ ఏవీ పూర్తికాలేదు. పనులు జరుగుతున్న ప్రాంతాల్లో తగిన రక్షణ ఏర్పాట్లు సైతం లేవు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు 18 మంది ఇంజినీర్లకు మెమోలు జారీ చేసినట్లు తెలిసింది. మెమోలు జారీ అయిన వారిలో మ్యాన్‌హోళ్లకు మూతలు వేయడం వంటి పనులు కూడా పూర్తిచేయని వారున్నారు. నాలాల వద్ద పనులు జరుగుతున్న ప్రాంతాల్లో రక్షణ ఏర్పాట్లు పట్టించుకోని వారికి సైతం మెమోలు జారీ అయినట్లు తెలిసింది. పనుల్లో నిర్లక్ష్యం, అశ్రద్ధ కనిపిస్తే చర్యలు తప్పవని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. మరిన్ని తనిఖీలు చేసి నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం ఇక నిరంతర ప్రక్రియగా కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. గత సంవత్సరం వర్షాకాలం ప్రారంభమయ్యేలోపునే రెండు మీటర్ల వరకు వెడల్పున్న నాలాలకు పై కప్పులు, అంతకంటే ఎక్కువ వెడల్పున్నవాటికి కంచె తదితరమైన భద్రత ఏర్పాట్లు పూర్తి కావాల్సి ఉండగా నేటికీ పూర్తికాలేదు.ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు ఎస్ఈలతో సహా ఇంజినీర్లను గట్టిగా హెచ్చరించారు. పనులు పూర్తికాకపోవడానికి పలు కారణాలున్నప్పటికీ, ఎప్పుడు ఎవరికి ముప్పు ముంచుకొస్తుందోనని ఇంజినీర్లు ఆందోళన చెందుతున్నారు. -
విద్యార్థులు వ్యవసాయ రంగంపై దృష్టి సారించాలి
మేడ్చల్ రూరల్: విద్యార్థులు ఇంజనీరింగ్ వైపు మాత్రమే వెళ్లకుండా అగ్రికల్చర్ రంగంపై వైపు దృష్టి సారించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. మైస మ్మగూడలోని మల్లారెడ్డి యూ నివర్సిటీలో అగ్రికల్చర్ ఎగ్జిబిషన్‌ను మంత్రి మల్లారెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం మల్లారెడ్డి ఉమెన్స్ కళాశాల సక్సెస్ మీట్ కార్యక్రమా ల్లో పాల్గొన్నారు. విద్యార్థుల ప్రదర్శనలను తిలకించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ అగ్రికల్చర్ రంగానికి మంచి భవిష్యత్తు ఉందని, విద్యార్థులు ఇంజనీరింగ్ విద్య వైపే వెళ్లకుండా అగ్రికల్చర్ సంబంధిత కోర్సులు చేయాలని సూచించారు. టెక్నాలజీలో వస్తున్న మార్పులకు అనుగుణంగా వ్యవసాయ రంగంలోని కూడా అనేక మార్పులు వస్తున్నాయన్నారు. కార్యక్రమంలో యూనివర్సిటీ వీసీ వీఎస్కే రెడ్డి, నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జి మహేందర్‌రెడ్డి, మల్లారెడ్డి గ్రూప్స్ డైరెక్టర్ శాలినీ రెడ్డి, ప్రిన్సిపాల్ మాధవీలత పాల్గొన్నారు. -
అమేకా.. యురేకా!
సాధారణంగా రోబోలంటే ఎలా కనిపిస్తాయి? మర మనిషి అనే పేరుకు తగ్గట్లే గంభీరమైన ముఖం, కృత్రిమ నడకతో దర్శనమిస్తాయి. కృత్రిమ మేధ(ఏఐ) సాయంతో ముందే సిద్ధం చేసిన మాడ్యూల్‌కు అనుగుణంగా పనిచేస్తాయి. కానీ ప్రపంచంలోకెల్లా తొలిసారి అత్యాధునిక హ్యూమనాయిడ్ రోబో ‘అమేకా’ రూపు దాల్చింది. సహజ స్పందనలతో అందరినీ కనువిందు చేసింది. అచ్చం మనిషి ముఖ కవళికలు, కదలికలు, హావభావాలు ప్రదర్శించగలగడం దీని ప్రత్యేకత! యూకేకు చెందిన ఇంజనీర్డ్ ఆర్ట్స్ అనే రోబోల తయారీ సంస్థ యూట్యూబ్ వేదికగా దీన్ని ఆవిష్కరించింది. ఆ వీడియోలో అమేకా తనను తాను చూసుకొని తెగ మురిసిపోయింది! కనురెప్పలను పదేపదే ఆర్పడంతోపాటు తనకు అమర్చిన చేతులను అటూఇటూ కదిలిస్తూ ముఖానికి దగ్గరగా పెట్టుకొని చూసి సంభ్రమాశ్చర్యానికి లోనైంది!! తలను పక్కలకు కదిలిస్తూ నిజంగానే నోరెళ్లబెట్టింది! నెటిజన్ల జేజేలు... అమేకాను చూసిన నెటిజన్లంతా తెగ మెచ్చుకుంటున్నారు. అది ప్రదర్శించిన హావభావాలు అత్యంత సహజంగా ఉన్నాయని తెగ పొగిడేస్తున్నారు. ప్రత్యేకించి అమేకా కళ్లను కదిలించిన తీరు ముచ్చటగొలిపిందన్నారు. మామూలుగా రోబోల కళ్లు కాస్త భయంకరంగా కనిపిస్తాయని... కానీ అమేకా కళ్లు అచ్చం మనిషిని పోలినట్లు ఉన్నాయని పేర్కొన్నారు. మరికొందరేమో అమేకా ముఖ కవళికలను ఈ స్థాయిలో మారుస్తుండటం చూసి తొలుత నమ్మలేదని... అదంతా కంప్యూటర్ గ్రాఫిక్స్‌గా భావించామని చెప్పుకొచ్చారు. ఇంకొందరేమో 2004లో వచ్చిన హాలీవుడ్ చిత్రం ‘ఐ రోబో’లో హావభావాలు ప్రదర్శించిన రోబోతో అమేకాను పోల్చారు. భావి టెక్నాలజీ ఆవిష్కారానికి వేదిక... ఈ రోబో ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నందున దీని తయారీకి ఎంత ఖర్చయిందో ఇంజనీర్డ్ ఆర్ట్స్ వెల్లడించలేదు. అయితే మనిషి తరహాలో దాన్ని నడిచేలా చేయడం సవాల్‌తో కూడుకున్నదని పేర్కొంది. భవిష్యత్ రోబో సాంకేతికతల అభివృద్ధికి వేదికగా అమేకాను రూపొందించినట్లు సంస్థ పేర్కొంది. 2005లో ఏర్పాటైన ఇంజనీర్డ్ ఆర్ట్స్... తమ తొలి మెకానికల్ రోబో ‘థెస్పియన్’ను రూపొందించింది. స్టేజీలపై నటించగలగడం, 30 భాషలు మాట్లాడగలగడం దాని ప్రత్యేకతలు. గతంలో ‘సోఫీ’.. మనిషి తరహాలో ఒక రోబో ముఖ కవళికలు మార్చగలగడం ఇది తొలిసారి కాదు. 2016లోనే మానవ ముఖాకృతితోపాటు అత్యంత తెలివితేటలు ప్రదర్శించగల ‘సోఫీ’ అనే హ్యూమనాయిడ్ రోబోను హాంకాంగ్ సంస్థ హాన్సన్ రొబోటిక్స్ తయారు చేసింది. కనురెప్పలు వాల్చడం, పరికించి చూడటం, తలను పక్కకు తిప్పడంతోపాటు గలగలా మాట్లాడటం సోఫీ సొంతం! ప్రత్యేకించి తనతో మాట కలిపే మనుషులతో ఎంతసేపైనా ముచ్చట్లలో మునిగితేలడం, కొంటెగా నవ్వడం, జోకులు వేయడం కూడా చేసేది. సోఫీ పనితీరుకు సౌదీ అరేబియా ప్రభుత్వం ఎంతగానో ముచ్చటపడింది. దానికి 2017లో చట్టబద్ధ పౌరసత్వం కల్పించడంతో ఈ తరహా ఘనతను సాధించిన రోబోగా సోఫీ చరిత్ర సృష్టించింది. సోఫీలో ఎన్నో సామర్థ్యాలు ఉన్నప్పటికీ దానికన్నా మరింత మెరుగ్గా అమేకా ఉంది. – సాక్షి, సెంట్రల్‌డెస్క్ -
ఏపీ: ఇంజనీరింగ్, ఫార్మసీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
సాక్షి, విజయవాడ: ఏపీలో ఇంజనీరింగ్, ఫార్మసీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇంజినీరింగ్, ఫార్మసీ అడ్మిషన్లు నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. దీని ప్రకారం.. ఈ నెల 25 నుంచి 30 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఫీజుల చెల్లింపుకు అవకాశం ఉంది. 26 నుంచి 31 వరకు అభ్యర్థులు సర్టిఫికెట్ల పరిశీలించనున్నారు. నవంబర్ 1నుంచి 5 వరకు వెబ్ ఆప్షన్లు అవకాశం కల్పించారు. వెబ్ ఆప్షన్ల మార్పులకు నవంబర్ 6 వరకు అవకాశం ఉంది. నవంబర్ 10న ఇంజనీరింగ్, ఫార్మసీ సీట్ల కేటాయించగా.. నవంబర్ 10 నుంచి నవంబర్15 వరకు కాలేజీల్లో రిపోర్టింగ్‌కు అవకాశం కల్పించారు. ఇక నవంబర్ 15 నుంచి ఇంజనీరింగ్, ఫార్మసీ తరగతులు ప్రారంభం కానునున్నాయి. -
60,941 ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో కన్వీనర్ కోటా కింద మొదటి దశ సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. తొలి దశలో 61,169 సీట్లు ఎంసెట్ అర్హులకు కేటాయించినట్టు సాంకేతిక విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 23వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని స్పష్టం చేశారు. ఆయా కాలేజీల ఫీజుల వివరాలు వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. ఇంజనీరింగ్, ఫార్మా కోర్సుల కోసం మొత్తం 71,216 మంది సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. 69,793 మంది వెబ్ ఆప్షన్స్ నమోదు చేశారు. అయితే ఇంజనీరింగ్ విభాగంలో 15 ప్రభుత్వ, రెండు ప్రైవేటు యూనివర్సిటీ కళాశాలలు, 158 ప్రైవేటు కాలేజీలతో కలిపి మొత్తం 175 ఇంజనీరింగ్ కాలేజీల్లో 74,071 సీట్లున్నాయి. మొదటి దశ కౌన్సెలింగ్ ద్వారా 60,941 సీట్లు (82.27 శాతం) భర్తీ చేశారు. ఫార్మసీలో 115 కాలేజీల్లో 4,199 సీట్లు అందుబాటులో ఉంటే 228 సీట్లను భర్తీ చేశారు. ఈడబ్ల్యూస్ కోటా కింద తొలిదశలో 5,108 సీట్లు (ఇంజనీరింగ్, ఫార్మా) కేటాయించారు. -
శెబ్బాష్ ఆకాంక్ష.. అండర్మైన్ తొలి మహిళా ఇంజనీర్‌గా!
బొగ్గు గనుల్లో ఒక వజ్రం మెరిసింది. చీకటి గుయ్యారం వంటి లోలోపలి గనుల్లో ఇక మీద ఒక మహిళ శిరస్సున ఉన్న లైట్ దిశను చూపించనుంది. ఇది మొదటిసారి జరగడం. ఇది చరిత్ర లిఖించడం. కోల్ ఇండియా మొట్టమొదటిసారిగా అండర్మైన్ ఇంజనీర్‌గా ఒక యువతిని నియమించింది. ఆడవాళ్లు కొన్ని పనులకు పనికి రారు అనేది గతం. ‘మేము ఏమైనా చేయగలం’ అని ఆకాంక్ష కుమారి దేశానికి సందేశం పంపింది. అత్యంత శ్రమ, ప్రమాదం ఉన్న ఈ పనిలో సాహసంతో అడుగుపెట్టిన ఆ ఆకాంక్ష ఎవరు? గనులు మగవారి కార్యక్షేత్రాలు. గనులు తవ్వడం, ఆక్సిజన్ అందనంత లోతుకు వెళ్లి ఖనిజాన్ని బయటకు తేవడం, దానిని రవాణా చేయడం... ఇవన్నీ శ్రమ, బలంతో కూడుకున్న పనులు కనుక అవి మగవాడి కార్యక్షేత్రాలు అయ్యాయి. అందుకే కాదు... గనుల్లో 24 గంటలు పని జరుగుతుంది. రాత్రింబవళ్లు చేయాలి. భద్రత గురించి జాగ్రత్తలు ఎలా ఉన్నా ప్రమాదం పొంచి ఉంటుంది. అందుకని కూడా స్త్రీలకు ఆ ప్రాంతాలు నిరోధించబడ్డాయి. గని కార్మికుడు అంటే మగవాడే. ఆ కార్మికుడు గనికి బయలుదేరితే స్త్రీ క్యారేజీ కట్టి ఇచ్చి ఇల్లు కనిపెట్టుకుని ఉండటం ఇప్పటి వరకూ సాగిన ధోరణి. అయితే గత దశాబ్ద కాలంలో మైనింగ్ ఇంజనీరింగ్ చదివేందుకు యువతులు ముందుకు వచ్చారు. మైనింగ్ చదివితే ఉపాధి గనులలోనే దొరుకుతుంది కనుక తల్లిదండ్రులు ఆ చదువును నిరుత్సాహపరుస్తూ వచ్చినా ఈ కాలపు యువతులు మేము ఆ చదువు చదవగలం... భూమి గర్భం నుంచి ఖనిజాన్ని బయటకు తీయగలం అని ముందుకొచ్చారు. దేశంలో ఆ విధంగా ఫస్ట్‌క్లాస్ మైనింగ్ ఇంజనీర్లుగా గుర్తింపు పొందిన మొదటి మహిళలు సంధ్య రసకట్ల... మన తెలంగాణ అమ్మాయి, మరొకరు యోగేశ్వరి రాణె (గోవా). వీళ్లిద్దరూ హిందూస్తాన్ జింక్‌లో ఉపరితల మేనేజర్ స్థాయిలో పని చేసి ఇప్పుడు వేదాంత రిసోర్స్ తరఫున కార్యకలాపాలు సాగిస్తున్నారని సమాచారం. అయితే వీరి తర్వాత నేరుగా అండర్‌గ్రౌండ్ మైనింగ్ విధులను స్వీకరించిన తొలి మహిళ మాత్రం ఆకాంక్ష కుమారి. 50 ఏళ్లలో తొలిసారి కేంద్ర బొగ్గుగని శాఖ ఆధ్వర్యంలో 50 ఏళ్లుగా నడుస్తున్న ‘కోల్ ఇండియా లిమిటెడ్’కు అనుబంధ సంస్థ అయిన ‘సెంట్రల్ కోల్‌ఫీల్డ్ లిమిటెడ్’ సెప్టెంబర్ 1న తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఆకాంక్ష కుమారి నియామకాన్ని వెల్లడి చేసింది. ‘చురి మైన్స్’ లో ఆమెను అండర్‌గ్రౌండ్ కార్యకలాపాలకు నియమించి మైనింగ్ చరిత్రలో కొత్త పుటకు చోటు కల్పించామని చెప్పింది. రాంచీకి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉండే చురీలో అండర్‌గ్రౌండ్ గనుల్లో ఆకాంక్ష పని చేయాల్సి ఉంటుంది. ఆమె తన ట్రయినింగ్‌ను ముగించుకుని విధులు మొదలెట్టింది కూడా. అంత సులభం కాలేదు భారత గనుల చట్టం 1952లోని సెక్షన్ 46 ప్రకారం బొగ్గు గనుల్లో స్త్రీలకు అండర్‌గ్రౌండ్ కార్యకలాపాలు నిరోధించబడ్డాయి. 2017 వరకూ ఈ చట్టం ఇలా సాగినా అదే సంవత్సరం జరిగిన చట్ట సవరణ వల్ల స్త్రీలకు భూగర్భ కార్యకలాపాలలో ఉద్యోగం పొందే హక్కు ఏర్పడింది. కాని ఆ తర్వాత కూడా కోల్ ఇండియాలో స్త్రీలు ఉపరితల కార్యకలాపాలలో ఉద్యోగాలు పొందుతూ ఇప్పటికి తమ శాతాన్ని కేవలం 7.5కు మాత్రమే పెంచగలిగారు. కాని వారికే కాదు, దేశంలోని ఇతర యువతులకు, విద్యార్థులకు స్ఫూర్తినిచ్చేలా మొదటిసారి ఆకాంక్ష భూగర్భ విధులను స్వీకరించింది. భిన్న విద్యార్థి జార్ఘండ్‌లోని హజారీబాగ్‌కు చెందిన ఆకాంక్ష చిన్నప్పటి నుంచి చురుకైన భిన్న విద్యార్థి. ఇద్దరు తోబుట్టువులు, ఒక సోదరుడు ఉన్నారు. జవహర్ నవోదయ విద్యాలయాలలో హైస్కూల్ వరకూ చదివి సింద్రి (జార్ఖండ్) బిట్స్‌లో మైనింగ్ ఇంజనీరింగ్ చదివింది. ఆ వెంటనే ఆమెకు హిందూస్థాన్ జింక్ రాజస్థాన్ శాఖలో ఉద్యోగం దొరికింది. మూడేళ్లు అక్కడ ఉద్యోగం చేసి కోల్ ఇండియా లిమిటెడ్‌లో మేనేజ్మెంట్ ట్రైనీగా ఉద్యోగం పొంది తాజాగా అండర్‌గ్రౌండ్ మైనింగ్ ఇంజనీరుగా డిజిగ్నేషన్ పొందింది. అయినా జాగ్రత్తలే ఆకాంక్ష కుమారి అండర్‌గ్రౌండ్ మైనింగ్ డ్యూటీని స్వీకరించినా గనుల చట్టం ప్రకారం మహిళా ఉద్యోగులకు సంబంధించిన షరతులు ఆమెకు వర్తిస్తాయి. వాటిలో ముఖ్యమైనవి ఆకాంక్ష ఉదయం 6 నుంచి రాత్రి 7 లోపు ఉండే షిఫ్టుల్లో మాత్రమే పని చేయాలి. ఏ ఫిష్ట్ చేసినా ఆమెకు 11 గంటల రెగ్యులర్ విశ్రాంతి ఇవ్వాలి. రాత్రి ఆమె పని చేయడానికి వీల్లేదు. రాత్రి 10 నుంచి ఉదయం 5 మధ్య ఒక్కోసారి ఎమర్జన్సీ డ్యూటీ పడవచ్చు. అయినా సరే ఆమెకు డ్యూటీ వేయకూడదు. ఇవన్నీ మహిళా ఉద్యోగుల రక్షణ కోసం తీసుకున్న జాగ్రత్తలు. ఈ జాగ్రత్తలు ఆమె వొత్తిడిని తగ్గిస్తాయి. కాని సాహసం యథాతథమే. హెడ్‌లైట్ ధరించి ఆమె గనుల్లోకి దిగే సన్నివేశం, అజమాయిషీ చేసే సన్నివేశం ఇప్పటికిప్పుడు ఒక పెద్ద ధైర్యం, తేజం... నల్ల బొగ్గు మధ్యలో ఏర్పడిన వెలుగు దారి. ఆమెకు శుభాకాంక్షలు. -
రోజూ 60 వేల మంది వీక్షణ
సాక్షి, హైదరాబాద్: ‘టి సాట్’ఇంజనీరింగ్ పాఠ్యాంశ ప్రసారాలపై విద్యార్థులు విపరీతంగా ఆసక్తి చూపిస్తున్నారు. జూలై 26న ప్రారంభమైన ఈ శిక్షణ కార్యక్రమాలు 15 రోజుల పాటు కొనసాగనున్నాయి. ప్రతీ రోజూ ఉదయం 8.15 నుంచి 10.30 వరకు ‘టి సాట్ యాప్, విద్య, నిపుణ చానళ్లు, టి సాట్ ఫేస్బుక్ పేజీ, యూ ట్యూబ్ చానళ్ల ద్వారా విద్యార్థులు వీక్షిస్తున్నారు. వివిధ మాధ్యమాల ద్వారా ఇప్పటి వరకు రోజూ సుమారు 60 వేల మంది ఇంజనీరింగ్ పాఠ్యాంశాలను వీక్షిస్తున్నట్లు ‘టి సాట్’లెక్కలు వేస్తోంది. ‘వెరీ లార్జ్‌స్కేల్ ఇంటిగ్రేషన్’(వీఎల్ఎస్ఐ) ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్స్ అనే అంశంపై ఇప్పటి వరకు 12 పాఠ్యాంశాలను ‘టి సాట్’ప్రసారం చేసింది. ఇంజనీరింగ్ విద్యార్థులకు తరగతి గదులు, ఆఫ్‌లైన్‌లో విద్యాబోధన జరుగుతున్నా తమ కెరీర్ నిర్మాణంలో అత్యం త కీలకమైన నైపుణ్యాలను విద్యార్థి దశలో సాధించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖకు అనుబంధంగా పనిచేస్తున్న ‘తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్’ (టాస్క్) ఇతర సంస్థల భాగస్వామ్యంతో పాఠ్యాం శాలను రూపొందిస్తోంది. ఫొటోనిక్స్ వాలీ కార్పొరేషన్, వేద ఐఐటీ పాఠ్యాంశాల రూపకల్పనలో పా లుపంచుకుంటున్నాయి. పరిశ్రమల అవసరాలు, నైపుణ్యాల పెంపు, ఉద్యోగ అవకాశాలు, సంస్థాగత సాంకేతికత, ఇతర అంశాలపై ‘వీఎల్ఎస్ఐ’ప్రత్యేక్ష శిక్షణ కార్యక్రమాలు రూపొందుతున్నాయి. -
మార్పులు లేవు! తెలంగాణ విద్యామండలి కీలక నిర్ణయం..
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో చేరాలంటే మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులు తప్పనిసరిగా చదివి ఉండాల్సిన అవసరం లేదన్న అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) మార్గదర్శకాలను 2021–22 విద్యా సంవత్సరంలో అమలు చేయబోమని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి స్పష్టం చేసింది. కరోనా నేపథ్యంలో విద్యార్థులపై ఒత్తిడికి గురిచేసే ఎలాంటి మార్పులను, సంస్కరణలను అమలు చేయబోమని చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. ఏఐసీటీఈ దాదాపు 15 రకాల సబ్జెక్టులను పేర్కొందని, రాష్ట్రంలో ఇంటర్మీడియట్లో ఐదారు రకాల బ్రాంచీలే (గ్రూపులు) ఉన్నాయని, వాటిల్లో ఏఐసీటీఈ పేర్కొన్న సబ్జెక్టులు పెద్దగా లేవని పేర్కొన్నారు. మంగళవారం తనను కలసిన మీడియాతో పాపిరెడ్డి మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్ర ఇంటర్మీడియట్లో ఇంజనీరింగ్ కోసం మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో కూడిన ఎంపీసీ బ్రాంచీ ఉందని, మెడికల్, అగ్రికల్చర్ కోర్సుల కోసం బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో కూడిన బైపీసీ బ్రాంచీ ఉందని వివరించారు. ఏఐసీటీఈ ఇటీవల జారీ చేసిన కాలేజీల అనుమతుల మార్గదర్శకాల్లో.. 2021–22 విద్యా సంవత్సరంలో విద్యార్థులు బీఈ/ బీటెక్‌లో చేరాలంటే ఇంటర్మీడియట్లో ఫిజిక్స్/ మ్యాథమెటిక్స్/ కెమిస్ట్రీ/ కంప్యూటర్ సైన్స్/ ఎలక్ట్రానిక్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ బయాలజీ/ ఇన్ఫర్మాటిక్స్ ప్రాక్టీసెస్/ బయోటెక్నాలజీ/ టెక్నికల్ వొకేషనల్ సబ్జెక్టు/ ఆర్కిటెక్చర్/ ఇంజనీరింగ్ గ్రాఫిక్స్/ బిజినెస్ స్టడీస్/ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సబ్జెక్టుల్లో ఏవేనీ మూడు సబ్జెక్టులను చదివి ఉంటే చాలని పేర్కొందని వెల్లడించారు. వారు నాలుగేళ్ల ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కోర్సుల్లో చేరేందుకు అర్హులేనని తెలిపిందని, మన రాష్ట్రంలో ఇంటర్మీడియట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వంటి సబ్జెక్టులే ప్రధానంగా ఉన్నాయని, మిగతా సబ్జెక్టులేవీ లేవని వివరించారు. సబ్జెక్టు అర్హతల విషయంలో సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు/ యూనివర్సిటీలు తీసుకునే నిర్ణయ మే ఫైనల్ అని ఏఐసీటీఈ పేర్కొన్న నేపథ్యంలో తాము ఈసారి వాటిని అమలు చేయబోమని వివరించారు. ఎంసెట్ ర్యాం కుల ఖరారులో ఇంటర్మీడియట్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉందని, ఈ పరిస్థితుల్లో మార్పులు చేస్తే విద్యార్థుల్లో గందరగోళం నెలకొంటుందని వివరించారు. పైగా ఇప్పటికే ఎంసెట్ పరీక్ష తేదీలను ప్రకటించామని పేర్కొన్నారు. ఈసారి ఎంసెట్‌లో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో 100 శాతం సిలబస్, ద్వితీయ సంవత్సరంలో 70 శాతం సిలబస్‌నే ప్రామాణికంగా తీసుకొని ఎంసెట్‌ను నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఏఐసీటీఈ మార్గదర్శకాలను అమలు చేయాల నుకుంటే నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసి, ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. 20 నుంచి ఎంసెట్ దరఖాస్తులు ఎంసెట్–2021 నోటిఫికేషన్‌ను ఈనెల 18న జారీచేసేందుకు సెట్ కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 20 నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. మే నెల 18 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనుంది. ఆలస్య రుసుముతో జూన్ 28 వరకు దరఖాస్తులు స్వీకరించనుంది. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఈనెల 20 నుంచి మే 18 వరకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు మే 19 నుంచి 27 వరకు దరఖాస్తుల్లో పొరపాట్లను సవరించుకునే అవకాశం కల్పించనుంది. ఇక జూలై 5 నుంచి ఎంసెట్ పరీక్షలు ఆన్లైన్లో నిర్వహించనుంది. జూలై 5, 6 తేదీల్లో అగ్రికల్చర్, మెడికల్ స్ట్రీమ్ పరీక్షలు, జూలై 7, 8, 9 తేదీల్లో ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఎంసెట్‌ను నిర్వహించనుంది. ప్రతిరోజూ రెండు విడతల్లో ఈ పరీక్షలను నిర్వహించనుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తొలి విడత, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో విడత పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని 23 టెస్ట్ జోన్ల పరిధిలోని 58 పట్టణాల్లో పరీక్షలను నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తోంది. -
డిసెంబర్ 1 నుంచి ఇంజనీరింగ్ ఫ్రెషర్లకు కొత్త విద్యా సంవత్సరం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కళాశాలలు, సాంకేతిక విద్యా సంస్థల్లో చేరే కొత్తగా చేరే విద్యార్థులకు విద్యా సంవత్సరం ఈ ఏడాది డిసెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. కోవిడ్ నేపథ్యంలో ప్రవేశాల డెడ్‌లైన్‌ను పొడిగించినట్లు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకు ఇంజనీరింగ్ కాలేజీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో మొదటి సంవత్సరంలో అడ్మిషన్ల తుది గడువును నవంబర్ 30వ తేదీ వరకు పొడిగించామని ఏఐసీటీఈ కార్యదర్శి రాజీవ్ కుమార్ తెలిపారు. కోవిడ్ మార్గదర్శకాలను అమలు చేస్తూ ఆన్లైన్, ఆఫ్‌లైన్ ద్వారా తరగతులను ప్రారంభించవచ్చని సూచిం చారు. కరోనా విజృంభణ కారణంగా మార్చి 16 నుంచి యూనివర్సిటీలు, కాలేజీలు, స్కూళ్లు మూతపడిన సంగతి తెలిసిందే. వర్సిటీలు, కాలేజీల్లో ఫ్రెషర్లకు నూతన విద్యా సంవత్సరాన్ని ప్రారంభించేందుకు యూజీసీ ఇటీవల అనుమతినిచ్చింది. తరగతులు ఆలస్యంగా ప్రారంభం అవుతున్న కారణంగా 2021లో వేసవి సెలవులను భారీగా కుదిస్తామని యూజీసీ పేర్కొంది. -
ఇంజనీరింగ్ కాలేజీల్లో ‘ఏఐ’
సాక్షి, హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను (ఏఐ) ఒక సబ్జెక్టుగా ప్రవేశపెట్టేందుకు ఉన్నత విద్యా మండలి కసరత్తు ప్రారంభించింది. దీనికి సంబంధించిన సిలబస్‌ను రూపొందించడంతోపాటు ఏయే కాలేజీల్లో ప్రారంభించాలో నిర్ణయించేందుకు ఉన్న త స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. సబ్జెక్టుగానే కాకుండా వీలైతే ప్రత్యేక కోర్సుగా ప్రవేశపెట్టే అంశాన్ని కూడా పరిశీలించాలని కమిటీని కోరాలని భావిస్తోంది. ఏఐని సబ్జెక్టుగా ప్రారంభిస్తే అందుకు అవసరమయ్యే అధ్యాపకులు, ల్యాబ్‌లు, ఇతర సదుపాయాలు, సిలబస్ రూపకల్పన, ఎన్ని క్రెడిట్స్ కేటాయించాలన్న తదితర అంశాలను కమిటీ తేల్చుతుందని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి పేర్కొన్నారు. ఏఐపై అవగాహన కలిగిన నిపుణులకు ఆ కమిటీలో స్థానం కల్పించనుంది. కమిటీ నివేదిక ఆధారంగా రాష్ట్రంలో ఏఐ సబ్జెక్టును వచ్చే ఏడాది నుంచి ప్రారంభించేందుకు తగిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందజేయాలని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. ఈ నెలాఖరులోగా కమిటీని ఏర్పాటు చేసి నివేదికను త్వరగా తెప్పించుకోవాలని నిర్ణయించింది. ఇంజనీరింగ్‌లో ఏఐని ప్రవేశపెట్టేందుకు ఇప్పటికే జేఎన్టీయూ సెనేట్ నిర్ణయం తీసుకుంది. మరోవైపు రాష్ట్ర ఐటీ శాఖ కూడా ఏఐ పాలసీని రూపొందించేందుకు చర్యలు చేపట్టింది. ప్రారంభమైన కసరత్తు.. జేఎన్టీయూ మాత్రమే కాకుండా రాష్ట్రంలోని అన్ని కాలేజీల్లో ఏఐని ప్రవేశపెట్టేలా ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకునేలా మండలి కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే ఈ విషయాన్ని విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించాలని ఆయన సూచించినట్లు తెలిసింది. కోర్సుగా ప్రవేశపెడితే అన్ని ప్రైవేటు కాలేజీల్లో అమలు సాధ్యం అవుతుందా? లేదా? అనేది కమిటీ తేల్చనుంది. కోర్సును కేవలం యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీల్లోనే ప్రవేశపెట్టడంతోపాటు ముందుకు వచ్చే ప్రైవేటు కాలేజీలకు అనుమతి ఇస్తే బాగుంటుందన్న ఆలోచనలు చేస్తోంది. అయితే నిపుణులతో కూడిన కమిటీ చేసే సిఫారసుల ఆధారంగానే ముందుకు వెళ్లాలని భావిస్తోంది. -
శాంసంగ్‌లో 1,200 నియామకాలు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఏడాదిలో 1200 మంది ఇంజినీరింగ్ పట్టభద్రులను ఉద్యోగాల్లోకి తీసుకోనున్నట్లు ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజ సంస్థ శాంసంగ్ బుధవారం ప్రకటించింది. పరిశోధన, అభివృద్ధి కేంద్రాల్లో పనిచేయడం కోసం వీరిని ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఎస్సీల నుంచి ఎంపికచేయనున్నట్లు వెల్లడించింది. బెంగళూరు, నోయిడా, ఢిల్లీ కేంద్రాల్లో నియామకాలు ఉంటాయని వివరించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఇమేజ్ ప్రాసెసింగ్, క్లౌడ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రికగ్నిషన్ సిస్టమ్స్, డేటా అనాలిసిస్, ఆన్‌డెవైస్ ఏఐ, మొబైల్ కమ్యూనికేషన్స్, నెట్వర్క్స్, యూజర్ ఇంటర్ఫేస్ వంటి విభాగాల్లో వీరు పనిచేయాల్సి ఉంటుందని పేర్కొంది. -
డాక్టర్, ఇంజనీర్ అయినా సంతృప్తి చెందని యువత
సాక్షి, హైదరాబాద్ : ఉద్యోగాలపట్ల యువత ఆలోచనా సరళిలో మార్పు వస్తోంది. వచ్చిన జీతంలో కంటే నచ్చిన జీవితంలోనే సంతృప్తిని వెతుక్కుంటున్నారు. రూ.లక్షల సంపాదన కంటే లక్ష్యం ముఖ్యమంటున్నారు. ఇంజనీరింగ్, మెడిసిన్ చదివామా.. క్యాంపస్ ప్లేస్మెంట్లలో జాబులు కొట్టామా.. ఒకటో తారీఖు జీతం తీసుకున్నామా.. అనే ధోరణి మారుతోంది. ఇంజనీర్, డాక్టర్ ఉద్యోగాలను సైతం పక్కనబెట్టి సివిల్స్ వైపు అడుగులు వేస్తున్నారు. 2017 ఐపీఎస్ బ్యాచ్‌లో 57 మంది ఇంజనీర్లు, 11 మంది డాక్టర్లు ఉన్నారంటే యువత అభిరుచి ఏమిటో అర్థమవుతుంది. ఎవరెవరు ఏమేం చదివారు.. ఈసారి బ్యాచ్‌లో విద్యార్హతల పరంగా ఇంజనీర్లు, డాక్టర్లదే పైచేయిగా నిలిచింది. మొత్తం 92 మంది ఐపీఎస్ అధికారుల విద్యానేపథ్యాన్ని పరిశీలిస్తే.. ఆర్ట్స్ 7, సైన్స్ 5, కామర్స్ 02, ఇంజనీరింగ్ 57, మెడిసిన్ 11, ఎంబీఏ 7 ఇతరులు ముగ్గురు ఉన్నారు. 2017 ఐపీఎస్ బ్యాచ్.. ఇంజనీర్లు : 57మంది డాక్టర్లు : 11 మంది మైక్రోబయాలజీలో పీజీ చేశాను. నెట్, జీఆర్‌ఈలోనూ మంచి స్కోర్ చేశాను. పీహెచ్‌డీలో కూడా ప్రవే శం వచ్చింది. పలు వర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా అవకాశాలు వచ్చినా సివిల్స్ రాసి ఐపీఎస్‌కు సెలెక్టయ్యాను. – రిచా తోమర్ ఎంబీబీఎస్ తరువాత ఎంఎస్ ఆర్థో చదివాను. ప్రభుత్వాసుపత్రిలో చేరా. పేదలకు మరింత సాయం చేయడానికి డాక్టర్‌గా నా పరిధి సరిపోదు. అందుకే, సివిల్స్ రాశాను. – డాక్టర్ వినీత్ ఐఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివాను. ఏడాదిపాటు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశాను. మా తండ్రి స్ఫూర్తితో సివిల్స్ రాశా. ఆ ఉత్సాహంతోనే ట్రైనింగ్‌లో బెస్ట్ ఐపీఎస్ ప్రొబేషనర్‌గా నిలిచాను. ప్రజల సమస్యలు గమనించి ఆ మేరకు పనిచేస్తా. – గౌస్ ఆలం -
ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్లు వాయిదా
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్‌లో వెబ్ ఆప్షన్ల ప్రక్రియ మరోసారి వాయిదా పడింది. జూలై 5 నుంచి నిర్వహించేలా ప్రవేశాల కమిటీ ఆదివారం రివైజ్డ్ షెడ్యూల్‌ను జారీ చేసింది. ఇంజనీరింగ్ కాలేజీల ఫీజుల వ్యవహారం పూర్తిగా తేలకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ ప్రకారం జూన్ 27 నుంచి జూలై 4 వరకు ఆప్షన్లకు అవకాశం కల్పించేలా కమిటీ షెడ్యూల్ జారీ చేసింది. అయితే కాలేజీల ఫీజుల వ్యవహారం తేలకపోవడం, యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించడంతో 27 నుంచి ప్రారంభం కావాల్సిన ఆప్షన్లను జూలై 1కి వాయిదా వేసింది. ఆదివారం వరకూ కోర్టును ఆశ్రయించిన కాలేజీల ఫీజుల వ్యవహారం తేలకపోవడంతో సోమవారం నుంచి ప్రారంభం కావాల్సిన ఆప్షన్లను 5 నుంచి ప్రారంభిస్తామని ప్రవేశాల కమిటీ కన్వీనర్ నవీన్ మిట్టల్ ప్రకటించారు. అంటే 5వ తేదీ నుంచి మరో నాలుగైదు రోజులు వెబ్ ఆప్షన్లకు, చివరి రోజున ఆప్షన్ల ఎడిట్‌కు అవకాశమిస్తారు. ఈ లెక్కన 10వ తేదీ నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేస్తారు. ఈలోగా ఫీజులు ఖరారు! సవరించిన షెడ్యూల్ ప్రకారం మొత్తానికి 10 రోజుల సమయం ఉండనుంది. ఈలోగా కోర్టును ఆశ్రయించిన కాలేజీల ఫీజులను ఖరారు చేయాలన్న నిర్ణయానికి ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్ఆర్సీ) వచ్చింది. శనివారం కాలేజీ యాజమాన్యాలతో సమావేశం నిర్వహించిన ఏఎఫ్ఆర్సీ.. రూ. 50 వేల లోపు ఫీజు ఉన్న కాలేజీలకు 20%, రూ. 50 వేలకు పైగా ఫీజు ఉన్న కాలేజీలకు 15% ఫీజులను పెంచుతామని ప్రతిపాదించగా.. మెజారిటీ కాలేజీలు అంగీకరించాయి. కోర్టును ఆశ్రయించిన కాలేజీల్లోనూ చాలావరకు అంగీకారం తెలిపాయి. కోర్టును ఆశ్ర యించిన 81 కాలేజీల్లో ఏఎఫ్ఆర్సీ ప్రతిపాదిత ఫీజుకు గరిష్టంగా 20 కాలేజీలు అంగీకరించే పరిస్థితి లేదు. కాబట్టి ఆ 20 కాలేజీలకు నాలుగైదు రోజుల్లో ఫీజులను ఖరారు చేసే అవకాశం ఉంది. వీలైతే అన్నింటి ఫీజు ఖరారు.. తాజా షెడ్యూల్ ప్రకారం ఈ నెల 10 వరకు సమయం లభించనుంది. దీంతో కోర్టును ఆశ్రయించినవే కాకుండా వీలైతే మిగతా అన్ని కాలేజీల ఫీజులనూ ఖరారు చేయాలన్న ఆలోచనల్లో ఏఎఫ్ఆర్సీ ఉంది. ప్రతి రోజూ ఉదయం 8 నుంచి రాత్రి 12 వరకు పనిచేసేలా షెడ్యూల్ సిద్ధం చేసుకొని ముందుకు సాగుతోంది. ఇప్పటికే అన్ని కాలేజీల రెండేళ్ల ఆదాయ వ్యయాలు, ఇప్పటి నుంచి మూడేళ్లు వసూలు చేయాల్సిన కొత్త ఫీజుల ప్రతిపాదనలు ఏఎఫ్ఆర్సీ వద్ద ఉన్నాయి. కాలేజీల వారీగా అన్ని లెక్కలను క్రోడీకరించి ఏఎఫ్ఆర్సీ తరఫున ఉన్నత విద్యా మండలి సిద్ధం చేసి ఉంచింది. దీంతో 197 ఇంజనీరింగ్, 122 బీఫార్మసీ కాలేజీల ఫీజుల ఖరారుకు పెద్దగా సమయం పట్టదన్న ఆలోచనల్లో ఉంది. కోర్టునాశ్రయించిన కాలేజీలే కాదు.. వీలైతే కోర్టును ఆశ్రయించని కాలేజీల ఫీజులనూ త్వరగా ఖరారు చేసేలా కసరత్తు ప్రారంభించింది. తాత్కాలిక పెరుగుదల కాకుండా తరువాత ఎంత పెరుగుతుందోనన్న ఆందోళన లేకుండా చూడాలని ఆలోచిస్తోంది. చివరి తేదీ నాటికి కాకపోతే.. ఈ నెల 10 నాటికి అన్ని కాలేజీల ఫీజు ఖరారు చేయలేకపోతే యాజమాన్యాలు అంగీకరించిన 20 శాతం, 15 శాతం ఫీజు పెంపును అమలు చేయాలని భావి స్తోంది. కోర్టును ఆశ్రయించిన కాలేజీలతోనూ సోమ వారం భేటీ కావాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇందులో తమ పెంపునకు అంగీకరిస్తే సులభంగా ముందుకు వెళ్లవచ్చని, కౌన్సెలింగ్ సజావుగా నిర్వ హించవచ్చని యోచిస్తోంది. లేదంటే వాటికి ఫీజును నిర్ణయించి, మిగతా వాటికి తాము ప్రతిపాదించిన పెంపును అమలు చేయనుంది. యాజమాన్య ప్రతిపాదిత ఫీజును అమలు చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్‌కు ఉన్నత విద్యా మండలి చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు 53,364 మంది విద్యార్థులు ఫీజు చెల్లించి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు స్లాట్ బుక్ చేసుకోగా, ఆదివారం నాటికి 37,413 మంది వెరిఫికేషన్ చేయించుకున్నారు. ఈ నెల 3 వరకు వెరిఫికేషన్‌కు సమయం ఉంది. -
ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్-2019 ఫలితాలను విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండలి ప్రిన్సిపల్ కార్యదర్శి విజయరాజు సోమవారం ఉదయం 11.30 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. ఎంసెట్‌లో 74.39 శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. తెలుగు రాష్ట్రల నుంచి మొత్తం 2,82,711 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఎంసెట్ ఇంజనీరింగ్‌కు 1,85,711 మంది రాయగా.. 1,35,160 (74.39శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. వ్యవసాయ, వైద్య విభాగ పరీక్షకు 81,916 మంది విద్యార్థులు హాజరకాగా 68, 512 (83.64శాతం) మంది క్యాలీఫై అయినట్లు అధికారులు వెల్లడించారు. పులిశెట్టి రవిశ్రీ తేజ ఎంసెట్ ఇంజనీరింగ్‌లో స్టేట్ ర్యాంకు, వేద ప్రణవ్ రెండో ర్యాంకు సాధించారు. మెడికల్‌లో సుంకర సాయి స్వాతి స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించారు. ఆయా ర్యాంకుల వివరాలను విద్యార్థుల నంబర్లకు పంపనున్నట్లు విజయరాజు తెలిపారు. కాగా ఏపీ ఎంసెట్‌కు 36,698 మంది తెలంగాణ విద్యార్థులు పరీక్ష రాశారు. ( ఏపీ ఎంసెట్ ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి ) సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇంజనీరింగ్ టాప్‌టెన్ ర్యాంకర్లు 1. కరిశెటి రవి శ్రీతేజ 2.వేద ప్రణవ్ 3.గొర్తి భాను దత్తు 4. హేథవావ్య 5. బట్టెపాటి కార్తికేయ 6.రిషి షర్రష్ 7.సూర్య లిఖిత్ 8. అప్పలకొండ అభిజిత్ రెడ్డి 9. ఆర్యన్ లద్దా 10.హేమ వెంటక అభినవ్ అగ్రికల్చర్, మెడికల్ టాప్‌టెన్ ర్యాంకర్లు 1.సుంకర సాయి స్వాతి 2. దాసరి కిరణ్‌కుమార్ రెడ్డి 3. అత్యం సాయి ప్రవీణ్ గుప్తా 4. తిప్పరాజు రెడ్డి 5.జీ మాధురి రెడ్డి 6. గొంగటి కృష్ణ వంశీ 7. కంచి జయశ్రీ వైష్ణవీ వర్మ 8. భీ. సుభిక్ష 9. కొర్నెపాటి హరిప్రసాద్ 10. ఎంపటి కుశ్వంత్ -
రేపటి నుంచి ఎంసెట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్–2019 ఆన్లైన్ పరీక్షలు ఈనెల 3 నుంచి ప్రారంభం కానున్నా యి. 3, 4, 6 తేదీల్లో ఇంజనీరింగ్, 8, 9 తేదీల్లో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ ప్రవేశ పరీక్షలు జరుగనున్నాయి. ఇందుకు ఎంసెట్ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 3 గం టల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు సెషన్లుగా పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపట్టింది. 18 పట్టణాల పరిధిలోని 94 పరీక్ష కేంద్రాలను ఏర్పా టు చేసింది. తెలంగాణలో 15 పట్టణాల పరిధిలోని 83 కేంద్రాల్లో, ఏపీలో మూడు పట్టణాల పరిధిలోని 11 కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహించేలా చర్యలు చేపట్టింది. ఈ పరీక్షలకు 2,17,199 మంది విద్యా ర్థులు హాజరు కానున్నారు. అందులో రెండింటికీ హాజరయ్యే వారు 235 మంది ఉన్నారు. దరఖాస్తుదారుల్లో ఈసారి ఐదుగురు ట్రాన్స్జెండర్లు ఉన్నారు. వారిలో నలుగురు ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షకు హాజ రు కానుండగా, ఒకరు అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ పరీక్షకు హాజరయ్యేందుకు దరఖాస్తు చేసుకున్నారు. గంటన్నర ముందునుంచే పరీక్ష హాల్లోకి.. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఎంసెట్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ యాదయ్య తెలిపారు. విద్యార్థులను పరీక్ష సమయానికికంటే గంటన్నర ముందునుంచే పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని పేర్కొన్నారు. పరీక్ష ప్రారంభం అయ్యాక నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని వెల్లడించారు. విద్యార్థులు చివరి క్షణంలో ఇబ్బందులు పడకుండా వీలైనంత ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. మొదటి విడత పరీక్ష ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుండగా ఆ పరీక్షకు ఉదయం 8:30 గంటల నుంచే విద్యార్థులను పరీక్ష హాల్లోకి అనుమతిస్తామన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం అయ్యే పరీక్ష కోసం విద్యార్థులను 1:30 గంటల నుంచే పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని వెల్లడించారు. అగ్రికల్చర్ కోర్సులవైపు బాలికల మొగ్గు అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో చేరేందుకు అత్యధికంగా బాలికలే దరఖాస్తు చేసుకున్నారు. ఇంజనీరింగ్ కోసం బాలురు ఎక్కువ మంది దరఖాస్తు చేసుకోగా, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో చేరేందుకు బాలికలు ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష రాసేందుకు 87,804 మంది బాలురు దరఖాస్తు చేసుకోగా, 54,410 మంది బాలికలే దరఖాస్తు చేసుకున్నారు. అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్ష రాసేందుకు బాలురు 23,316 మంది దరఖాస్తు చేసుకోగా, బాలికలు 51,664 మంది దరఖాస్తు చేసుకున్నారు. విద్యార్థులకు సూచనలు ∙విద్యార్థులు తమ పరీక్ష కేంద్రాన్ని ఒక రోజు ముందుగానే చూసుకోవాలి. పరీక్ష రోజు ఇబ్బంది పడకుండా వీలైనంత ముందుగా చేరుకునేలా ప్లాన్ చేసుకోవాలి. ∙పరీక్ష హాల్లోకి హాల్‌టికెట్, పూర్తి చేసిన ఆన్లైన్ దరఖాస్తు ఫారం, బ్లాక్/బ్లూ బాల్ పాయింట్ పెన్, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులైతే అటెస్ట్ చేసిన కుల ధ్రువీకరణ పత్రాలు వెంట తీసుకెళ్లాలి. ∙విద్యార్థులు పరీక్ష కేంద్రంలోకి వెళ్లగానే తమ బయోమెట్రిక్ డేటాను నమోదు చేసుకోవాలి. ∙హాల్‌టికెట్ లేకుండా విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లో పరీక్ష కేంద్రంలోకి, హాల్లోకి అనుమతించరు. ∙విద్యార్థులు తమ వెంట తెచ్చుకున్న ఆన్లైన్ దరఖాస్తు ఫారాన్ని పరీక్ష హాల్లో అందజేయాలి. ∙పరీక్ష ప్రారంభం అయ్యాక వచ్చే విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లో పరీక్ష హాల్లోకి అనుమతించరు. వచ్చిన వారిని పరీక్ష పూర్తయ్యే వరకు బయటకు పంపించరు. ∙కాలిక్యులేటర్లు, మ్యాథమెటికల్ లాగ్ టేబుల్స్, పేపర్లు, సెల్ఫోన్లు, వాచీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ నిషేధం. వాటిని పరీక్ష హాల్లోకి తీసుకెళ్లకూడదు. రఫ్ వర్క్ కోసం బుక్‌లెట్‌ను పరీక్ష హాల్లోనే అందజేస్తారు. ఆ బుక్‌లెట్‌ను తర్వాత ఇన్విజిలేటర్‌కు ఇచ్చేయాలి. మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. స్ట్రీమ్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ విద్యార్థుల సంఖ్య 1,42,218 74,981 బాలురు 87,804 23,316 బాలికలు 54,410 51,664 ట్రాన్స్‌జెండర్స్ 4 1 -
హీరోయిన్ చాన్స్ ఇస్తానని కారులో..
చెన్నై , పెరంబూరు: సినీ నిర్మాతనంటూ ఒక ఇంజినీరింగ్ యువతికి హీరోయిన్ ఆశ చూపి మోసం చేసిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వివరాలు.. తిరు పోరూర్, ఓల్డ్ మహాబలిపురానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థిని(25) భవన నిర్మాణం సంస్థలో సలహాదారిణిగా పనిచేస్తోంది. ఈమె గత 8న ఉదయం తిరుప్పోరూర్ నుంచి సెమ్మంజేరికి వెళ్లడానికి ఆ ప్రాంతంలోని బస్టాప్‌లో నిలబడింది. ఆ సమయంలో అటుగా ఒక ఖరీదైన కారు వచ్చి ఆగింది. అందులోంచి ఒక వ్యక్తి దిగి ఆమెతో తాను సినీనిర్మాతగా పరిచయం చేసుకున్నాడు. హీరోయిన్ కోసం వెతుకుతున్నానని చెప్పి.. హీరోయిన్గా నటిస్తారా? అని అడిగాడు. అందుకు ఆ యువతి ఒప్పుకుంది. అతను మాట్లాడదామని ఆ యువతిని కారులో మహాబలిపురానికి తీసుకెళ్లాడు. అక్కడ ఒక గదిని అద్దెకు తీసుకుని కథా చర్చలంటూ ఇద్దరూ సన్నిహితంగా మెలిగారు. అనంతరం ఆ వ్యక్తి 17వ తేదీన మళ్లీ కలుద్దామని, అప్పుడు డబ్బుతో రావాలని చెప్పాడు. అమె కూడా ఈ నెల 17న రూ.60 వేలు తీసుకుని అతన్ని కలిసింది. ఇద్దరూ కలిసి కారులో కోవైకు వెళ్లి సన్నిహితంగా మెలిగారు. అప్పుడు ఆ యువతి సినిమా చాన్స్ గురించి అతన్ని అడిగింది. దీంతో అతను ఆ ఆయువతిని అక్కడే వదిలి పరారయ్యాడు. మోసపోయానని గ్రహించిన ఆ యువతి ఇంటికి తిరిగి వచ్చి జరిగిందంతా తన తల్లికి చెప్పింది. ఫిర్యాదు మేరకు సెమ్మంజేరి పోలీసుల కేసు నమోదు చేసి అతని కోసం గాలిస్తున్నారు. -
సీబీఐటీ, శ్రీనిధి, వాసవి, ఎంజీఐటీ.. ఫీజు మోత?
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రం లోని నాలుగు ప్రధాన ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులపై అదనపు ఫీజుల భారం తప్పేలా లేదు. సీబీఐటీ, శ్రీనిధి, వాసవి, ఎంజీఐటీ కాలేజీల్లో చేరిన విద్యార్థులంతా అదనపు ఫీజుల నుంచి తప్పించుకునే పరిస్థితి కన్పించట్లేదు. శ్రీనిధి, వాసవి కాలేజీల్లో ఫీజులపై హైకోర్టు శుక్రవారం ఇచ్చిన తాజా ఉత్తర్వులతో పెంచిన ఫీజులను చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే పెరిగిన ఫీజుల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుందా.. లేదా మళ్లీ సుప్రీం కోర్టును ఆశ్రయిస్తుందా అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ఈ విషయంలో ఇప్పటికే ఓసారి సుప్రీం కోర్టుకు వెళ్లినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో ప్రభుత్వం ఏం చేస్తుందనేది ప్రశ్నగా మిగిలింది. ఒకవేళ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లకపోతే ఆయా కాలేజీల్లో చేరిన 12 వేల మందికి పైగా విద్యార్థులు ఏటా రూ.40 వేల నుంచి రూ.86,500 వరకు అదనపు ఫీజు చెల్లించాల్సి వస్తుంది. అసలేం జరిగింది..: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో 2016–17, 2017–18, 2018–19 విద్యా సంవత్సరాల్లో వార్షిక ఫీజులను తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) 2016లో ఖరారు చేసింది. అయితే అందులో సీబీఐటీ, ఎంజీఐటీ, శ్రీనిధి కాలేజీలకు తక్కువ పెంపును ప్రతిపాదించింది. వాసవి కాలేజీకి గతంలో ఉన్న ఫీజులో రూ.12 వేల కోత విధించి రూ.97 వేలకు పరిమితం చేసింది. దీంతో ఆయా యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. తమ వాస్తవ ఆదాయ వ్యయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఇష్టానుసారం ఏఎఫ్ఆర్సీ ఫీజులు ఖరారు చేసిందని పేర్కొంది. దీంతో వారి ఆదాయ వ్యయాలను పరిశీలించి హైకోర్టు గతేడాది ఆయా కాలేజీల ఫీజులు పెంచారు. ఏఎఫ్ఆర్సీ ముందుగా సీబీఐటీకి రూ.1,13,500 ఫీజుగా నిర్ణయిస్తే హైకోర్టు దానికి అదనంగా రూ.86500 పెంపునకు ఓకే చెప్పి రూ.2 లక్షలకు పెంచింది. ఎంజీఐటీలో రూ.1 లక్ష ఉన్న ఫీజును రూ.1.6 లక్షలకు పెంచింది. వాసవిలో రూ.97 వేల నుంచి రూ.1.6 లక్షలకు పెంచింది. శ్రీనిధిలో రూ.91 వేల నుంచి రూ.46 వేలు పెంచి రూ.1.37 లక్షలు చేసింది. అయితే వాటిని ప్రభుత్వం అమలు చేయలేదు. దానిపై యాజమాన్యాలు కోర్టు ధిక్కార పిటీషన్ దాఖలు చేయగా, రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ విషయాన్ని కింది కోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీం కోర్టు తేల్చిచెప్పడంతో ప్రభుత్వం హైకోర్టులో మళ్లీ అప్పీల్ దాఖలు చేసింది. అయితే అందులో శ్రీనిధి, వాసవి కాలేజీలకు సంబంధించి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పాత ఫీజుల పెంపును అమలు చేయాలని చెప్పడంతో గందరగోళంలో పడింది. విద్యార్థులపై ఒత్తిళ్లు హైకోర్టు గతేడాది ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం పెరిగిన ఫీజులను చెల్లించాల్సిందేనంటూ యాజమాన్యాలు తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నాయి. అదనపు ఫీజు చెల్లించని విద్యార్థులను పరీక్షలకు హాజరు కానివ్వకపోవడం వంటి చర్యలతో ఇబ్బందులకు గురిచేశాయి. దీంతో తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలు తీవ్ర ఆందోళనకు దిగాయి. అయినా యాజమాన్యాలు పెరిగిన ఫీజులను వసూలు చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. ప్రభుత్వం వాటి అమలుకు ఉత్తర్వులు జారీచేస్తే టాప్ పది వేల ర్యాంకులతో కన్వీనర్ కోటాలో చేరిన విద్యార్థుల ఫీజులను వంద శాతం ప్రభుత్వమే ఫీజు రీయింబర్స్మెంట్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. కారకులెవరు? ఫీజల ఖరారు వ్యవహరంలో ఏఎఫ్ఆర్సీ నియమించిన కన్సల్టెంట్ వైఖరే ఈ వివాదానికి దారితీసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కమిటీ సభ్యుల ఆమోదం, సంతకం లేకుండానే ఆ కన్సల్టెంట్ కాలేజీల ఫీజుల ఖరారు చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. భారీ మొత్తం చేతులు కూడా మారినట్లు ఆరోపణలు అప్పట్లో వెల్లువెత్తాయి. గతంలో రూ.77 వేలు దాటని కాలేజీల వార్షిక ఫీజును ఆ కన్సల్టెంట్ వ్యవహారం వల్ల రూ.లక్షకు పైగా పెంచినట్లు ఆరోపణలు వచ్చాయి. టాప్ కాలేజీల్లో ఒకటైన వాసవి కాలేజీలో వార్షిక ఫీజు కోత విధించడంపైనా విమర్శలొచ్చాయి. ఈ కాలేజీల ఫీజులను కమిటీ సభ్యుల ఆమోదం లేకుండానే జరిగిపోయినట్లు సమాచారం. ముడుపులు ఇచ్చిన వారికి పెంచి.. ఇవ్వని వారి కాలేజీల ఫీజులో కోత విధించిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇదీ ఆ నాలుగు కాలేజీల్లో ఫీజుల పరిస్థితి.. విద్యా సంస్థ 2013–16ఫీజు 2016–19ఫీజు అదనపుపెంపు మొత్తంఫీజు సీబీఐటీలో 1,13,300 1,13,500 86,500 2,00,000 వాసవి 1,09,300 97,000 63,000 1,60,000 శ్రీనిధి 79,900 91000 46,000 137000 ఎంజీఐటీ 82,400 1,00,000 60,000 1,60,000 -
ఓయూలో రూ.20 కోట్లతో ట్రైనింగ్ సెంటర్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఏటా వేలాది మంది విద్యార్థులు ఇంజనీరింగ్ కోర్సులు పూర్తి చేసుకుంటున్నా సాంకేతిక నైపుణ్యం లేకపోవడంతో ఇంటర్వ్యూల్లో రాణించలేక పోతున్నారు. ఉన్నత చదువులు చదువుకున్నప్పటికీ నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఈ దుస్థితికి తెరదించాలని ఉస్మానియా విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థులు నిర్ణయించారు. సాంకేతికపరంగా ఎప్పటికప్పుడు చోటు చేసుకుంటున్న మార్పులు, పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలు, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని శిక్షణ ఇవ్వనున్నారు. అధ్యాపకులకే కాకుండా ఇప్పటికే ఇంజనీరింగ్ పూర్తిచేసుకున్న విద్యార్థులకూ శిక్షణ ఇచ్చి, ఫ్యూచర్ టెక్నాలజీపై వారిని ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఇందుకోసం ‘సెంటర్ ఫర్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ ఫర్ ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్స్’ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే యూనివర్సిటీ పాలక మండలి ఇందుకు అవసరమైన ఐదెకరాల భూమిని కేటాయించింది. ఇందుకు రూ.20 కోట్ల వరకు ఖర్చు అవుతున్నట్లు అంచనా. ఇందులో భవనాలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు రూ.15 కోట్లు ఖర్చు అవుతుండగా, భవిష్యత్తులో బిల్డింగ్ నిర్వహణ, ఇతర అబివృద్ధి పనుల కోసం రూ.5 కోట్లు కార్పస్‌ఫండ్‌గా జమ చేయనున్నారు. ఫ్యూచర్ టెక్నాలజీపై శిక్షణ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇటీవలే వందేళ్ల ఉత్సవాలను పూర్తి చేసుకుంది. ఇక్కడి ఇంజనీరింగ్ కాలేజీలో ఇప్పటివరకు పాతిక వేల మందికి పైగా విద్యార్థులు చదువుకున్నారు. వీరిలో పదివేలకుపైగా వివిధ దేశాల్లో మంచి హోదాల్లో స్థిరపడ్డారు. ఇంజనీరింగ్ అలుమ్నీ అసోసియేషన్‌లో ఇప్పటికే ఆరువేల మందికిపైగా సభ్యత్వం పొంది ఉన్నారు. శతాబ్ది ఉత్సవాల వేళ వీరంతా ఉస్మానియా క్యాంపస్‌ను సందర్శించారు. వర్సిటీలో అలుమ్నీ అసోసియేషన్ తరపున ఏదైనా చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం తెలంగాణలో ఏటా లక్ష మందికిపైగా ఇంజనీరింగ్ విద్యార్థులు బయటికి వస్తున్నారు. వీరిలో ఉపాధి పొందుతుంది చాలా తక్కువే. విద్యార్థులు పారిశ్రామిక, భవిష్యత్తు సాంకేతిక అవసరాలపై ముందే శిక్షణ ఇస్తే.. ఇంటర్వ్యూల్లో సులభంగా రాణించగలుగుతారని భావించారు. ఇక్కడ కేవలం ఉస్మానియా వర్సిటీలో చదువుకున్న ఇంజనీరింగ్ విద్యార్థులకే కాకుండా తెలంగాణలోని ఇతర యూనివర్సిటీల్లో చదువుకున్న విద్యార్థులకు, అధ్యాపకులకు శిక్షణ ఇవ్వనున్నారు. లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో... ఇంజనీరింగ్ ట్రైనింగ్ సెంటర్ భవనాన్ని సుమారు లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. ఇందులో 40 గదులతో పాటు నాలుగు సెమినార్ హాళ్లు, ఏడెనిమిది క్లాసు రూమ్‌లు నిర్మించనున్నారు. విదేశాల నుంచి వచ్చే అతిథులు, పూర్వ విద్యార్థులు బస చేసేందుకు అవసరమైన గెస్ట్‌హౌస్‌ను కూడా ఇందులో ఏర్పాటు చేయనున్నారు. శిక్షణ కోసం అవసరమై కంప్యూటర్లు, సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. అంతేకాదు ఈ భవనానికి సమీపంలో ఉన్న మోయిని చెరువును అభివృద్ధి చేసి కబ్జారాయుళ్ల బారి నుంచి రక్షించనున్నారు. ఇదిలా ఉంటే ఈ భవనం కోసం కేటాయించిన భూమిలో ఏపుగా పెరిగిన భారీ చెట్లను సైతం నరికి వేయడం వివాదాస్పదంగా మారింది. క్యాంపస్‌లో ప్రధాన రహదారి వెంట ఖాళీ స్థలాలు ఉన్నప్పటికీ.. వాటిని కేటాయించకుండా ఏపుగా చెట్లు పెరిగిన ప్రాంతాన్ని ఈ భవనానికి కేటాయించడం ఎంతవరకు సమంజసమని పలువురు ప్రశ్నిస్తున్నారు. -
ఇంజినీరింగ్‌లో 73 శాతం ప్రవేశాలు
ఎచ్చెర్ల క్యాంపస్ : ఇంజినీరింగ్ సీట్ల అలాట్మెంట్ను ఉన్నత విద్యా మండలి మంగళవారం ప్రకటించింది. జిల్లాలోని ఆరు ఇంజినీరింగ్ కాలేజీల్లో 2217 సీట్లకు గాను 1626 సీట్లలో(73.24 శాతం) ప్రవేశాలు జరిగాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో ఈ ఏడాది తొలిసారి ప్రారంభించిన ఇంజినీరింగ్ కాలేజీలో 180కి 169 సీట్లు అలాట్ అయ్యాయి. రెండో కౌన్సెలింగ్ శత శాతం ప్రవేశాలు జరిగాయి. మూడు బ్రాంచ్‌లు ప్రారంభించగా సీఎస్ఈలో 60కి 57, ఈసీఈ, మెకానికల్‌లో 60కి 56 చొప్పున ప్రవేశాలు జరిగాయి. రెండు ప్రైవేట్ కళాశాలల్లో 50 శాతం లోపు ప్రవేశాలు నమోదయ్యాయి. ఈ ఏడాది 7886 మంది ఎంసెట్ రాశారు. గత ఏడాది 1953కి 1496 సీట్లలో ప్రవేశాలు జరిగాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది మెరుగైన ఫలితాలు వచ్చాయి. గత ఏడాది అరు ప్రైవేట్ కళాశాలు ఉండగా, ఒక ప్రైవేట్ కళాశాల మూత పడింది. గత ఏడాది తుదివిడత కౌన్సెలింగ్‌లో ఈ కళాశాల తప్పుకుంది. ప్రత్యేక కేటగిరీ విద్యార్థుల సీట్లు కాలేజీల్లో రిజర్వ్ మొదటి విడత కౌన్సెలింగ్‌లో ప్రత్యేక కేటగిరీకి చెందిన ఆంగ్లో ఇండియన్ దివ్యాంగులు క్రీడలు క్యాప్, ఎన్సీసీ విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలు పరిశీలించలేదు. రెండో విడత కౌన్సెలింగ్‌లో ఈ ప్రత్యేక కేటగిరీలకు సంబంధించి ధ్రువీకరణ పత్రాలు పరిశీలిస్తారు. ఈ నేపథ్యంలో యూనివర్సిటీతో పాటు ప్రైవేటు కళాశాలల్లో ఈ సీట్లకు ప్రవేశాలు కల్పించకుండా వదిలేశారు. -
18న ఎంసెట్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ ఈ నెలాఖరుకు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. సోమవారం ఎంసెట్ పరీక్షలు పూర్తయినందున ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 2, 3 తేదీల్లో అగ్రికల్చర్ కోర్సులకు ఎంసెట్, 4, 5, 7 తేదీల్లో ఇంజనీరింగ్‌కు ఎంసెట్‌ను జేఎన్టీయూహెచ్ నిర్వహించింది. వాటికి సంబంధించిన ప్రాథమిక కీలను మంగళవారం వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ యాదయ్య తెలిపారు. విద్యార్థులు తమ రెస్పాన్స్ షీట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. అభ్యంతరాలను ఈ నెల 10వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. ఎంసెట్ ర్యాంకులను ఈ నెల 18వ తేదీన ప్రకటించనున్నారు. ఇప్పటికే కాలేజీల్లో తనిఖీలు నిర్వహించి ఏయే కాలేజీల్లో ఎలాంటి లోపాలు ఉన్నాయి...వాటి ఆధారంగా ఏయే కోర్సుల్లో ఎన్ని సీట్లకు అనుబంధ గుర్తింపు ఇవ్వాలన్న ప్రక్రియను జేఎన్టీయూహెచ్ పూర్తి చేసింది. ఫలితాలను వెల్లడించిన వెంటనే ప్రవేశాల కౌన్సెలింగ్‌కు కాలేజీలు, సీట్ల జాబితాను అందజేయనుంది. మొత్తానికి ఈ నెలాఖరులో ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో ఇంజనీరింగ్ కోసం 94.25 శాతం హాజరు తెలంగాణలో ఎంసెట్ రాసేందుకు 1,26,547 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా వారిలో 1,19,270 మంది (94.25 శాతం) హాజరయ్యారు. అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎంసెట్ రాసేందుకు 63,653 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 58,744 మంది (92.29 శాతం) విద్యార్థులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంజనీరింగ్ కోసం 21365 మంది దరఖాస్తు చేసుకోగా 17,041 మంది (79.06 శాతం) హాజరయ్యారు. అగ్రికల్చర్ కోసం 9,425 మంది దరఖాస్తు చేసుకోగా 8,113 మంది (86.08 శాతం) విద్యార్థులు హజరయ్యారు. -
కల్పిత కొలువులు!
నెల్లూరు నగరానికి చెందిన ఒక విద్యార్థి (పేరు వెల్లడించడానికి ఇష్టపడని) ఓ ఇంజినీరింగ్ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ప్రాంగణ ఎంపికల ద్వారా ఉద్యోగం పొందేందుకు ఆ కళాశాల యాజమాన్యానికి రూ. లక్ష చెల్లించాడు. ఉద్యోగం వస్తుందని బంధు, మిత్రులకు చెప్పి సంబరపడిపోయాడు. అయితే కొద్ది రోజులకే ఇంటికి చేరడంతో అదేమని అడిగితే నష్టపోయానని, నాలాగా ఎందరో ఉన్నారని వాపోయాడు. ప్రాంగణ ఎంపికల సమయంలో ఉపాధి ఏ విధంగా ఉంటుందో, విధులు ఏమిటో సంబంధిత కంపెనీ ప్రతినిధులు వివరించారు. తీరా చేరిన తర్వాత ముందు చెప్పిన దానికి, ఇచ్చే వేతనానికి, పనికి పొంతన లేకపోవడంతో వెనక్కి వచ్చేసినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రీతిలో మోసపోయిన అనేక మంది విద్యార్థులు ఇప్పటికి ఆయా కళాశాలల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. నెల్లూరు (టౌన్) : ఒకప్పుడు ఇంజినీరింగ్ విద్య అంటే క్రేజీగా ఉండేది. ప్రస్తుతం కొంత మేర ప్రాధాన్యత తగ్గినా మెజార్టీ విద్యార్థులు ఇంజినీరింగ్ వైపే చూస్తున్నారు. నాలుగేళ్లు చదువు పూర్తయిందంటే యువ ఇంజినీర్ చూపులన్నీ ఉపాధి వైపే ఉంటాయి. ఈ డిమాండ్‌ను మెజార్టీ ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు క్యాష్ చేసుకుంటున్నాయి. క్యాంపస్ సెలెక్షన్స్ పేరుతో ఉద్యోగాలు కల్పిస్తామని, ఇందులో పాల్గొనేందుకు ఒక్కో విద్యార్ధి నుంచి రూ.15 వేల నుంచి రూ.35 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఆయా ఇంజినీరింగ్ కళాశాలల్లో సీట్లు భర్తీ కోసం విస్తృత ప్రచారానికి కొన్ని ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు ఛీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నాయనే ఆరోపణలు లేకపోలేదు. బోగస్ కంపెనీలు, డబ్బా కంపెనీలతో గొప్ప కంపెనీలుగా భ్రమింప చేసి క్యాంపస్ సెలెక్షన్స్ నిర్వహించి (అంతా పకడ్బందీగా) ఉద్యోగాలకు ఎంపిక చేస్తున్నారు. తీరా ఉద్యోగ ఒప్పంద పత్రాలు తీసుకుని ఉద్యోగాలకు వెళ్లితే కానీ.. ఆయా కంపెనీల డొల్లతనం బయటపడుతుంది. చదివిన చదువుకు, అక్కడి ఉద్యోగ బాధ్యతలకు పొంతన లేకపోవడంతో కొద్ది నెలల్లోనే ఉద్యోగాలకు గుడ్‌బై చెబుతున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చిందని గొప్పగా చెప్పుకుని.. తిరిగి ఇంటికి రాలేక ఇంకొందరు అరకొర జీతాలకు సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాలకు వేట సాగిస్తున్నారు. సాధారణంగా చివరి సంవత్సరం పూర్తయ్యే నాటికి ఉద్యోగం కల్పించే దిశగా కళాశాలల యాజమాన్యాలు దృష్టి సారిస్తాయి. అందుకు దేశ, విదేశీ బహుళజాతి కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటాయి. ఆయా కంపెనీలకు అవసరమైన ఇంజినీర్లను ఎంపిక చేసుకునేందుకు ఆయా కళాశాలలకు వచ్చి ప్రాంగణ ఎంపికలు నిర్వహిస్తుంటాయి. నిజమైన, గుర్తింపు ఉన్న కంపెనీలు విద్యార్థుల్లో ఉన్న ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసుకుని ఉద్యోగాన్ని కల్పిస్తున్నాయి. ఇలాంటి కొన్ని కంపెనీల పేర్లు చెప్పి యాజమాన్యాలు విద్యార్థుల భవిష్యత్‌ను డొల్ల కంపెనీలకు తాకట్టుపెడుతున్నాయి. ఇటీవల కాలంలో కళాశాలలకు వచ్చే కంపెనీలను పరిశీలిస్తే ఏఏ ప్రాంతాల్లో బ్రాంచ్‌లు ఉన్నాయో, కంపెనీ వివరాలు తెలియకుండా గోప్యంగా ఉంచుతుండటం చర్చనీయింశంగా మారింది. కొందరికే అవకాశం జిల్లాలో ప్రతి ఏటా వేలాది మంది ఇంజినీరింగ్ పూర్తి చేస్తున్నారు. కానీ వారిలో చాలా మంది ఉత్తీర్ణత కావడం లేదు. ప్రతిభ ఉన్న విద్యార్థులను మాత్రమే కొన్ని కంపెనీలు ఎంపిక చేసుకుంటున్నాయి. జిల్లాలో కొన్ని కళాశాలల వైపు కార్పొరేట్, బహుళజాతి కంపెనీలు కన్నెత్తి చూడకపోయినా, మా కళాశాలలో ప్రాంగణ ఎంపికలు నిర్వహించి వేలాది మందికి ఉద్యోగాలు కల్పించామని చెప్పుకుని వచ్చే ఏడాదికి అడ్మిషన్లుకు సిద్ధమవుతున్నాయి. ప్రాంగణ ఎంపికలంటే మౌఖిక పరీక్ష, వ్యక్తిత్వ వికాసం వంటివి కొలమానం కాదని, నేరుగా డబ్బులు చెల్లిస్తే సరిపోతాయంటూ మోసం చేస్తున్నాయి. రూ.15 వేలకు పైగానే .. ప్రాంగణ ఎంపికలు అనగానే ఇంజినీరింగ్ విద్యార్థుల్లో నూతనోత్సవం వస్తుంది. దీన్ని పెట్టుబడిగా మలుచుకునేందుకు కొన్ని కళాశాలలు ప్రయత్నిస్తున్నాయి. ప్రాంగణ ఎంపికలకు అడ్మిషన్ చార్జీల కింద ఒక్కో విద్యార్థి నుంచి రూ.15 వేల నుంచి రూ.35 వేల వరకు వసూలు చేస్తున్నాయి. మరికొన్ని కళాశాలలు రూ. 50 వేలు వసూలు చేసిన ఘటనలు కూడా ఉన్నాయిని విద్యార్థులే చెబుతున్నారు. అంత ఎందుకుని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తుంటే ఉద్యోగం ఇచ్చే కంపెనీకి ముందుగా కొంత మొత్తంను చెల్లించితే వెంటనే ఉద్యోగంలో చేరే అవకాశం ఉంటుందని, లేకంటే కళాశాల నుంచి బయటకు వెళ్లిన తర్వాత ఉపాధి పొందడం కష్టమని చెబుతున్నారు. ముందే అంగీకార పత్రాలతో ముప్పతిప్పలు ప్రాంగణ ఎంపికలు నిర్వహించే కొన్ని కంపెనీలు ముందే కొన్ని షరతులు విధిస్తున్నాయి. రెండేళ్ల పాటు వారి కంపెనీలోనే పనిచేయాలని, ఎక్కడికి పంపితే అక్కడే ఉండి ఉద్యోగం చేయాలని అంగీకార పత్రాలను విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులతో కూడా రాయించుకుంటున్నారు. కంపెనీలో చేరిన తర్వాత తొలి నెల జీతం తమ అకౌంట్ల్లో వేయాలని విద్యార్థితో రాయించుకుంటున్నారు. ఇది పలువురు విద్యార్థులకు శాపంగా మారుతుంది. ఒక వేళ ఆ కంపెనీలో ఉద్యోగం నచ్చకుంటే బయటకు వచ్చే వీలుండదు. గట్టిగా కాదంటే ఒప్పందం ప్రకారం విద్యార్హత పత్రాలను వెనక్కి ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అన్ని విషయాలు తెలుసుకుంటే మంచిది ఉద్యోగం పేరు చెప్పి కళాశాలలకు ప్రాంగణ ఎంపికల కోసం వస్తున్న కంపెనీ వివరాలు, ఎంత వరకు వేతనం ఇవ్వగలదు, ఏ ప్రాంతంలో విధులు నిర్వర్తించాలో తదితర విషయాలను ముందుగానే విద్యార్థులు తెలుసుకోవాలని విద్యా నిపుణులు చెబుతున్నారు. కొన్ని కళాశాలల్లో తాము ప్రాంగణ ఎంపికలు నిర్వహించి ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించామంటూ హడావుడి చేస్తున్నాయి. అలాంటి వాటిపై జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. శిక్షణకు కొద్ది మొత్తాన్ని చెల్లించినా పెద్దగా నష్టం ఉండబోదంటున్నారు. రాత పరీక్షలు, ఇంటర్వ్యూలు, నిబంధలు పాటించడం తదితర విషయాలు తెలసుకోవచ్చు. ఉద్యోగం పేరు చెప్పి రూ.లక్షలు చెల్లించమని అడిగారంటే అది గ్యారంటీగా నకిలీ కంపెనీగా తెలుసుకోవాలని విద్యా వేత్తలు పేర్కొంటున్నారు. -
కిరాక్ కార్
ఇబ్రహీంపట్నంరూరల్ : నాలుగేళ్లు తరగతి గదిలో నాలుగు గోడల మధ్యన నేర్చుకున్న ఇంజనీరింగ్ చదువుకు నాలుగో ఏడాది చేసే ప్రాజెక్టు వర్క్‌తోనే సార్థకత లభిస్తుంది. ఆ నాలుగేళ్లు ఏం నేర్చుకున్నా ఆ పరిజ్ఞానాన్ని చేతల్లో చూపెట్టినప్పుడే వారికి తగిన గుర్తింపు కూడా దక్కుతుంది. వారు చేసే ప్రాజెక్టు వర్కుల ఆధారాంగా ఉద్యోగ అవకాశాలు కూడా వస్తుంటాయి. అందుకే ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రాజెక్టు వర్క్ అంత ముఖ్యం. ఏవీఎన్ కళాశాలలో ఇంజనీరింగ్ మెకానికల్ విభాగంలో ఫైనల్ ఇయర్ విద్యార్థులు ప్రాజెక్టు వర్కులో భాగంగా గోకాటింగ్ స్పీడ్ కారును రూపొందించారు. కళాశాల యాజమాన్యం, అధ్యాపకుల సహకారంతో నూతన ఆవిష్కరణ చేశారు. తక్కువ ఖర్చుతో 40 రోజుల పాటు శ్రమించి ఈ ఆవిష్కరణ చేశారు. గోకాటింగ్ కారుకు ద్విచక్ర వాహనం ఇంజన్‌ను ఉపయోగించారు. సాధారణంగా గోకాటింగ్ కార్లు 100 సీసీ ఇంజన్‌తో తయారు చేస్తారు. కానీ ఈ విద్యార్థులు మాత్రం 125 సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. మార్కెట్లో 4బీహెచ్పీతో గోకాటింగ్ తయారు చేస్తే వీళ్లు గోకాటింగ్ యంత్రాల తయారీ నిబంధనల మేరకు 10 బీహెచ్పీ సామర్థ్యంతో తయారు చేశారు. నాలుగు గేర్లతో నడిచే ఈ కారు వేగం లీటర్ పెట్రోల్‌కు 80 కిలో మీటర్లు. ఈ గోకాటింగ్ కారును జూన్– జులై నెలలో జరగబోయే రేస్లల్లో పాల్గొనబోతుంది. ప్రస్తుతం గుర్రంగూడలో మొదటగా పాల్గొని అనంతరం బెంగళూర్‌లో జరగబోయే జాతీయ పోటీల్లో పాల్గొంటారు. అక్కడ క్వాలిఫై అయితే పుణెలో జరగబోయే అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంటారు.