భారతదేశంలో ఉన్నత చదువులు చదివిన చాలా మంది విదేశలకు వెళ్ళాలి, అక్కడ ఉద్యోగం చేసి బాగా సంపాదించి జీవితంలో స్థిరపడాలని కలలు కంటూ ఉంటారు. అయితే కెనడాలో ఉన్నత చదువు చదివిన భారతీయుడు ట్రక్కు డ్రైవర్ జాబ్ చేస్తూ సంవత్సరానికి ఏకంగా రూ. 50 లక్షలు సంపాదిస్తున్నట్లు తెలిసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం, 2012లో కెనడాకు ఉన్నత విద్య కోసం వచ్చి చాలా కాలంగా అక్కడే స్థిరపడిన ఒక ఇండియన్ చదువు పూర్తయిన తరువాత ట్రక్కు డ్రైవర్ ఉద్యోగాన్ని ఎంచుకున్నాడు. అయితే యితడు ఇంజినీరింగ్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఒక వీడియో గగన్ కల్రా - కెనడా అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశారు.
చదువు పూర్తయిన తరువాత ఉపాధి అవకాశాల కోసం చాలా అన్వేషించినట్లు, అందులో అతనికి ట్రక్కింగ్ చాలా ఆసక్తికరంగా అనిపించడంతో దానిని ఎంచుకున్నట్లు వివరించాడు. కెనడాలో చాలా ట్రక్కింగ్ కంపెనీలు తమ డ్రైవర్లకు, వారు కవర్ చేసే దూరాన్ని బట్టి డబ్బు చెల్లిస్తారు. ఒక మైలుకి 55 సెంట్లు చొప్పున ఈ ఇంజినీరింగ్ ట్రక్ డ్రైవర్ నెలకు 1700 కెనడియన్ డాలర్లను సంపాదిస్తున్నాడు. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ సుమారు నెలకు రూ. 4 లక్షలు, సంవత్సరానికి రూ. 50 లక్షల కంటే ఎక్కువ. ఒక వేళా కెనడాలో సొంత ట్రక్కుని కలిగి ఉంటే అంతకు మించి సంపాదించవచ్చని అతడు చెబుతున్నాడు.
(ఇదీ చదవండి: ఖాతాదారులు ఎగిరి గంతేసే వార్త చెప్పిన ఆర్‌బిఐ.. జీరో బ్యాలెన్స్ ఉన్నా నో వర్రీస్!)
కెనడాలో డ్రైవింగ్ చేయాలంటే లైసెన్స్ పొందడం కోసం ప్రావిన్సుల వారీగా రిక్వైర్మెంట్ మూరుతూ ఉంటాయని కూడా ప్రస్తావించారు. మొదట అతడు సుదీర్ఘ ప్రయాణాలు చేసాడు. ఇందులో భాగంగానే కెనడాలోని వివిధ ప్రాంతాలు మాత్రమే కాకుండా.. కెనడా నుంచి అమెరికాకు కూడా వెళ్ళాడు. వృత్తి రీత్యా ఇంజినీర్ అయినప్పటికీ ట్రక్కు డ్రైవింగ్ చేయడం చాలా ఆనందంగా ఉందన్నాడు. అంతే కాకుండా కెనడాలో ఉన్నత విద్య చదివినవారి సంఖ్య చాలా ఎక్కువని పేర్కొన్నాడు.
(ఇదీ చదవండి: వ్యాపార రంగంలో 'తల్లీ కూతుళ్ళ' విజయ ప్రస్థానం!)
ట్రక్కింగ్ విషయానికి వస్తే సుదూర ప్రాంతాలకు మాత్రమే కాకుండా తక్కువ దూరాలకు ప్రయాణించే వెసులు బాట్లు ఉంటాయి. ట్రక్కు డ్రైవ్ చేసే డ్రైవర్లు చాలా వరకు ట్రక్కుల్లోనే జీవితం గడిపేస్తారు. కుటుంబాలతో గడిపే సమయం కూడా చాలా పరిమితంగానే ఉంటుంది. ఈ వీడియోలో ట్రక్కు డ్రైవర్ జీవితం గురించి మాత్రమే కాకుండా ట్రక్కు లోపల భాగాన్ని కూడా చూడవచ్చు. ఒక డ్రైవర్ వారానికి గరిష్టంగా 70 గంటలు డ్రైవ్ చేసిన తరువాత మళ్ళీ డ్రైవ్ ప్రారభించాలంటే విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని ఇంజనీర్ ట్రక్కు డ్రైవర్ వివరించాడు. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి.
Comments
Please login to add a commentAdd a comment