గోకాటింగ్ స్పీడ్ కారుతో విద్యార్థులు, కళాశాల యాజమాన్యం
ఇబ్రహీంపట్నంరూరల్ : నాలుగేళ్లు తరగతి గదిలో నాలుగు గోడల మధ్యన నేర్చుకున్న ఇంజనీరింగ్ చదువుకు నాలుగో ఏడాది చేసే ప్రాజెక్టు వర్క్‌తోనే సార్థకత లభిస్తుంది. ఆ నాలుగేళ్లు ఏం నేర్చుకున్నా ఆ పరిజ్ఞానాన్ని చేతల్లో చూపెట్టినప్పుడే వారికి తగిన గుర్తింపు కూడా దక్కుతుంది. వారు చేసే ప్రాజెక్టు వర్కుల ఆధారాంగా ఉద్యోగ అవకాశాలు కూడా వస్తుంటాయి. అందుకే ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రాజెక్టు వర్క్ అంత ముఖ్యం.
ఏవీఎన్ కళాశాలలో ఇంజనీరింగ్ మెకానికల్ విభాగంలో ఫైనల్ ఇయర్ విద్యార్థులు ప్రాజెక్టు వర్కులో భాగంగా గోకాటింగ్ స్పీడ్ కారును రూపొందించారు. కళాశాల యాజమాన్యం, అధ్యాపకుల సహకారంతో నూతన ఆవిష్కరణ చేశారు. తక్కువ ఖర్చుతో 40 రోజుల పాటు శ్రమించి ఈ ఆవిష్కరణ చేశారు. గోకాటింగ్ కారుకు ద్విచక్ర వాహనం ఇంజన్‌ను ఉపయోగించారు. సాధారణంగా గోకాటింగ్ కార్లు 100 సీసీ ఇంజన్‌తో తయారు చేస్తారు. కానీ ఈ విద్యార్థులు మాత్రం 125 సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు.
మార్కెట్‌లో 4బీహెచ్‌పీతో గోకాటింగ్ తయారు చేస్తే వీళ్లు గోకాటింగ్ యంత్రాల తయారీ నిబంధనల మేరకు 10 బీహెచ్‌పీ సామర్థ్యంతో తయారు చేశారు. నాలుగు గేర్లతో నడిచే ఈ కారు వేగం లీటర్ పెట్రోల్‌కు 80 కిలో మీటర్లు. ఈ గోకాటింగ్ కారును జూన్– జులై నెలలో జరగబోయే రేస్‌లల్లో పాల్గొనబోతుంది. ప్రస్తుతం గుర్రంగూడలో మొదటగా పాల్గొని అనంతరం బెంగళూర్‌లో జరగబోయే జాతీయ పోటీల్లో పాల్గొంటారు. అక్కడ క్వాలిఫై అయితే పుణెలో జరగబోయే అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంటారు.
Comments
Please login to add a commentAdd a comment