
(ఫైల్ ఫోటో)
సాక్షి, విజయవాడ: ఏపీలో ఇంజనీరింగ్, ఫార్మసీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇంజినీరింగ్, ఫార్మసీ అడ్మిషన్లు నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. దీని ప్రకారం.. ఈ నెల 25 నుంచి 30 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ఫీజుల చెల్లింపుకు అవకాశం ఉంది. 26 నుంచి 31 వరకు అభ్యర్థులు సర్టిఫికెట్ల పరిశీలించనున్నారు.
నవంబర్ 1నుంచి 5 వరకు వెబ్ ఆప్షన్లు అవకాశం కల్పించారు. వెబ్ ఆప్షన్ల మార్పులకు నవంబర్ 6 వరకు అవకాశం ఉంది. నవంబర్ 10న ఇంజనీరింగ్, ఫార్మసీ సీట్ల కేటాయించగా.. నవంబర్ 10 నుంచి నవంబర్15 వరకు కాలేజీల్లో రిపోర్టింగ్‌కు అవకాశం కల్పించారు. ఇక నవంబర్ 15 నుంచి ఇంజనీరింగ్, ఫార్మసీ తరగతులు ప్రారంభం కానునున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment