
హైదరాబాద్: యూపీఎల్ కంపెనీ గయానా ప్రభుత్వంతో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. రిపబ్లిక్ ఆఫ్ గయానా సహకారంతో 200 ఎకరాల్లో ‘మిల్లెట్స్ మోడల్ ఫార్మ్’’ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఒప్పందంపై యూపీఎల్ గ్రూప్ సీఈవో జైష్రాఫ్, గయానా వ్యవసాయ శాఖ మంత్రి జుల్ఫికర్ ముస్తఫా ఏప్రిల్ 21న అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసినట్టు తెలిపింది. ఈ పార్క్‌లో మిల్లెట్స్ సాగుకు కావాల్సిన సాంకేతిక సహకారం, వ్యవసాయ ముడి సరుకులను యూపీఎల్ అందించనుంది. సాగుకు కావాల్సిన 200 ఎకరాల భూమి, కార్మికులను గయానా ప్రభుత్వం సమకూర్చనుంది.