Government department
-
మూడోసారి గ్రూప్–1 ప్రిలిమ్స్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని 563 గ్రూప్–1 ఉద్యోగ ఖాళీల భర్తీకి ఆదివారం జరగనున్న ప్రిలిమినరీ పరీక్షకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్విస్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. 31 జిల్లాల్లోని 897 పరీక్షా కేంద్రాల్లో ఆదివారం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 4.03 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాయనున్నారు. అభ్యర్థులు కనీసం గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని.. ఉదయం 10 గంటల తర్వాత పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని కమిషన్ స్పష్టం చేసింది. గుర్తింపు కార్డు చూపిస్తేనే అభ్యర్థులను అనుమతించనుంది. రెండుసార్లు రద్దు.. కమిషన్ తొలిసారిగా 2022 ఏప్రిల్‌లో గూప్–1 నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ తర్వాత అదే ఏడాది అక్టోబర్‌లో ప్రిలిమ్స్ నిర్వహించి మెయిన్ పరీక్షలకు 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసింది. అయితే ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో ఆ పరీక్షను కమిషన్ రద్దు చేసింది. ఆ తర్వాత గతేడాది జూన్ 11న రెండోసారి ప్రిలిమ్స్ నిర్వహించగా నిర్వహణ ప్రక్రియలో లోపాలు జరిగాయంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో ఆ పరీక్షను రద్దు చేయాలని కోర్టు తీర్పు ఇచ్చింది. తాజాగా అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం కమిషన్‌ను ప్రక్షాళన చేపట్టడంతోపాటు కొత్తగా 60 గ్రూప్–1 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. దీంతో కమిషన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో కొత్తగా 563 గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రతి 20 కేంద్రాలకు ఒక రీజినల్ కోఆర్డినేటర్... గ్రూప్–1 ప్రిలిమ్స్‌ను పకడ్బందీగా నిర్వహించే చర్యల్లో భాగంగా ప్రతి జిల్లాకు అదనపు కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారిని నోడల్ అధికారులుగా.. ప్రతి 20 కేంద్రాలకు ఒక రీజినల్ కోఆర్డినేటర్‌ను ప్రభుత్వం నియమించింది. బయోమెట్రిక్ హాజరు కోసం ప్రత్యేక వ్యవస్థను కమిషన్ ఏర్పాటు చేసింది. 897 కేంద్రాలకు చీఫ్ సూపరింటెండెంట్లు, లోకల్ రూట్ ఆఫీసర్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను ఇప్పటికే నియమించారు.ప్రతి కేంద్రానికి ఒక సిట్టింగ్ స్వా్కడ్ బృందం ఉంటుంది. ప్రతి 3 నుంచి 5 కేంద్రాలకు ఒక ఫ్లయింగ్ స్వా్క డ్ బృందం ఉంటుంది. ప్రతి వంద మంది అభ్యర్థులకు ఒక చెకింగ్ అధికారిని నియమించారు. గ్రూప్–1 పరీక్షా కేంద్రం చుట్టూ బందోబస్తు ఏర్పాటుతోపాటు ఆ ప్రాంతంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని కమిషన్ తెలిపింది.గ్రూప్–1 అభ్యర్థులకు సీఎం శుభాకాంక్షలుసాక్షి, హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) ఆదివారం నిర్వహిస్తున్న గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంతో కాలంగా కష్టపడి పరీక్షకు సిద్ధమైన అభ్య ర్థులు సమయానికి కేంద్రాలకు చేరుకుని ఎలాంటి ఒత్తిళ్లకు గురికాకుండా పరీక్ష రాయాలని సూచించారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు గ్రూప్–1 ప్రిలిమ్స్ అభ్యర్థుల సౌకర్యార్థం ఆర్టీసీ ఆదివారం ప్రత్యేక బస్సులు నడపనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 897 పరీక్ష కేంద్రాలకు బస్సులను నడపాల ని అధికారులను యాజమాన్యం ఆదేశించింది. హైదరాబాద్ నుంచి జిల్లాలకు శనివారం సాయంత్రం నుంచే ఎంజీబీఎస్, జేబీ ఎస్, ఉప్పల్, ఎల్బీ నగర్, ఆరాంఘర్ పాయింట్లనుంచి బస్సు సర్వీసులు నడిపింది. -
జూన్‌లో జాబ్‌ల జాతర
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగాల భర్తీలో భాగంగా జూన్ నెలలో అపాయింట్మెంట్, పోస్టింగ్‌లు ఇచ్చేందుకు టీఎస్ పీఎస్సీ కసరత్తు చేస్తోంది. పార్ల మెంట్ ఎన్నికల కోడ్ ముగియగానే జాబ్‌ల జాతరకు లైన్‌క్లియర్ కానుంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో గ్రూప్–4 కేటగిరీలో 9వేల ఉద్యో గాలకు సంబంధించి ఇప్పటికే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్(జీఆర్ఎల్)ను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. దీంతో పాటు అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కేటగిరీలో దాదాపు 2వేలకు పైబడి ఉద్యోగాలున్నాయి. వీటికి కూడా జీఆర్ఎల్ విడుదల చేశారు. భూగర్భ జలవనరుల శాఖలో గెజిటెడ్ అధికారులు, పట్టణ ప్రణాళిక విభాగం, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, ఇతర సంక్షేమ శాఖలు, ఇంటర్మీడియట్ విద్య, సాంకేతిక విద్య ఇలా పలు విభాగాల్లో దాదాపు 5వేల ఉద్యోగాలకు సంబంధించిన కసరత్తు ఓ కొలిక్కి వచ్చింది. హారిజాంటల్ రిజర్వేషన్లకు అనుగుణంగా ఆయా శాఖల నుంచి సవరించిన రోస్టర్ జాబితాలకు అనుగుణంగా ఖాళీల వివరాలను సైతం టీఎస్పీఎస్సీ తెప్పించింది. ఆ మేరకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ వేగవంతం చేసింది. తాజాగా ఒక్కో కేటగిరీలో జిల్లాస్థాయిలో 1:2 నిష్పత్తి, జోనల్, మల్టీ జోనల్ కేటగిరీల్లో 1:3 నిష్పత్తిలో ప్రాథమిక ఎంపిక జాబితాలను సైతం రూపొందిస్తోంది. ప్రాథమిక ఎంపిక జాబితాల ప్రక్రియ అనంతరం అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన పూర్తిచేసి తుది జాబితాలను విడుదల చేస్తుంది. ఈ ప్రక్రియ జూన్ రెండోవారంకల్లా పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. ఆలోపు పార్లమెంట్ ఎన్నికల ప్రవర్తనా నియమావళి సైతం తొలగిపోనుంది. దీంతో టీఎస్పీఎస్సీ తుది జాబితాలను బహిర్గతం చేసిన తర్వాత ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందిస్తారు. జూన్ మూడోవారం నుంచి నియామక పత్రాల పంపిణీ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. గురుకుల పోస్టుల్లో కూడా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన దాదాపు 1500 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వలేదు. పార్లమెంట్ కోడ్ ముగియగానే జూన్ మొదటివారం తర్వాత వీరికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారు. ఫిబ్రవరి నుంచే.. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా వివిధ కేటగిరీల్లో ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థులకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి నియామక పత్రాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి వరుసగా పోలీస్‌శాఖలో కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలతో పాటు వైద్య,ఆరోగ్య శాఖ పరిధిలో స్టాఫ్ నర్సులు, గురుకుల విద్యాసంస్థల్లో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్, లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్ తదితర కేటగిరీల్లో దాదాపు 33వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలను రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. ఇవన్నీ తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామకాల బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ), తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు(టీఆర్‌ఈఐఆర్‌బీ), తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు(టీఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) ద్వారా భర్తీ చేసినవే. మూడు బోర్డుల ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలు ఒక ఎత్తయితే... టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలు మరో ఎత్తు. ఎందుకంటే ఈ మూడు బోర్డుల పరిధిలోని ఉద్యోగాల సంఖ్యతో దాదాపు సమానంగా టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఉంటుంది. ప్రస్తుతం టీఎస్పీఎస్సీ పలు కేటగిరీల్లో అర్హత పరీక్షలు నిర్వహించి ఫలితాల విడుదలకు కసరత్తు చేస్తోంది. -
Siddaramaih: లంచం తీసుకున్నట్టు నిరూపిస్తే... రాజకీయాలకు గుడ్‌బై
బెంగళూరు: ప్రభుత్వ శాఖల్లో పోస్టింగులు, బదిలీల్లో తన కుమారుడు యతీంద్ర భారీగా లంచాలు తీసుకున్నారన్న జేడీ(ఎస్)చీఫ్ హెచ్డీ కుమారస్వామి ఆరోపణలను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదివారం తీవ్రంగా ఖండించారు. తాను గానీ, యతీంద్ర గానీ లంచాలు తీసుకున్నట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచే శాశ్వతంగా తప్పుకుంటానని ప్రకటించారు. లంచాలు తీసుకున్న చరిత్ర కుమారస్వామిదేనని ఎద్దేవా చేశారు. ఆయన హయాం పొడవునా అలాంటి వ్యవహారాలే జరిగాయని ఆరోపించారు. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సిద్ధరామయ్య–యతీంద్ర ఫోన్ సంభాషణ పోస్టింగులు, బదిలీల్లో లంచాల గురించేనని కుమారస్వామి ఆరోపిస్తుండటం తెలిసిందే. యతీంద్ర సూపర్ సీఎంగా మారారంటూ ఆయన మండిపడ్డారు. -
గ్రూప్–4పై తేల్చేదెప్పుడు?
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న గ్రూప్–4 కొలువుల ప్రకటనకు ఇప్పట్లో అడుగు ముందుకు పడే అవకాశం కనిపించడంలేదు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 9,163 గ్రూప్–4 ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన సన్నాహక సమావేశంలో తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి కదలిక లేదు. సీఎస్ ఆదేశాల ప్రకారం ఈనెల 29 నాటికి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయానికి శాఖల వారీగా ఇండెంట్లు (ఉద్యోగ ఖాళీలకు సంబంధించి రోస్టర్ వారీగాకొలువుల భర్తీకి ప్రతిపాదనలు) సమ ర్పించాల్సి ఉంది. ఈమేరకు సమావేశంలో ప్రభుత్వ శాఖలకు సీఎస్ డెడ్‌లైన్ కూడా విధించారు. అయినా ఒక్క శాఖ నుంచి కూడా టీఎస్పీఎస్సీకి ప్రతిపాదనలు చేరకపోవడం గమనార్హం. కారణం ఇదేనా? ప్రభుత్వ శాఖల వద్ద గ్రూప్–4 కేటగిరీలోకి వచ్చే కొలువుల ఖాళీలకు సంబంధించిన పూర్తిస్థాయి సమాచారం అందుబాటులో ఉంది. అయితే నూతన జోనల్ విధానం అమల్లోకి రావడంతో అందుకు అనుగుణంగా శాఖల వారీగా ఉద్యోగ ఖాళీలు, రిజర్వేషన్ల వారీగా పోస్టులు, రోస్టర్ వారీగా భర్తీ చేయాల్సినవెన్ని? తదితర సమాచారాన్ని సిద్ధం చేసుకుని ప్రతిపాదనలు తయారు చేసుకోవాలని సీఎస్ సోమేశ్‌కుమార్ ఇటీవల ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆదేశించారు. దీంతో చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వ శాఖలు ఆ దిశగా గణాంకాలను సిద్ధం చేసుకోగా, వాటిని టీఎస్పీఎస్సీకి సమర్పించాల్సి ఉంది. టీఎస్పీఎస్సీకి ప్రతిపాదనలు సమర్పించే ముందు ఆయా ఖాళీల భర్తీకి ప్రభుత్వం అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయాలి. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం నిర్దేశించిన ఖాళీలకు తగినట్లుగా టీఎస్పీఎస్సీకి ప్రతిపాదనలు సమర్పిస్తారు. సాధారణంగా ఇదే పద్ధతి ప్రకారం ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియ జరుగుతుంది. ఈనెల 29లోగా ప్రతిపాదనలు సమర్పించాలని సీఎస్ స్పష్టత ఇచ్చినప్పటికీ.. ఆమేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడలేదు. ప్రభుత్వ ఉత్తర్వుల కోసం వేచి చూసిన శాఖలు, నిర్దేశించిన గడువులోగా అవి వెలువడకపోవడంతో ప్రతిపాదనలు సమర్పించలేదని తెలుస్తోంది. హడావుడిగా సాగి.. వివిధ శాఖల్లో గ్రూప్–4 కేటగిరీలో 9,163 పోస్టులను ప్రభుత్వం నోటిఫై చేసింది. వీటిని రిజర్వేషన్లకు అనుగుణంగా విభజించి నూతన జోనల్ విధానం ప్రకారంభర్తీ చేయాలి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ సంబంధిత శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, హెచ్ఓడీలతో రెండు వారాల క్రితం ఓ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బి.జనార్దన్‌రెడ్డి కూడా హాజరయ్యారు. రాజ్యాంగబద్ధమైన కమిషన్ చైర్మన్ దీనికి హాజరు కావడంతో అన్ని ప్రభుత్వ శాఖల్లో సైతం హడావుడి నెలకొంది. ప్రభుత్వ సమావేశాలకు ఆయన రావడంపై సర్వత్రా విస్మయం వ్యక్తం అయినప్పటికీ.. ప్రభుత్వ ప్రాధాన్యతల దృష్ట్యా ఉద్యోగాల భర్తీ వేగిరమైందని భావించారు. దీంతో దాదాపు అన్ని శాఖలు నిబంధనల ప్రకారం నిర్దేశించిన గడువులోగా ప్రతిపాదనలు సిద్ధం చేసుకున్నాయి. కానీ తీరా గడువులోగా జీవోలు రాకపోవడంతో ఆ ప్రక్రియ ఎక్కడికక్కడే ఆగిపోయింది. -
‘ప్రత్యేక నిధి’పై పట్టింపేదీ?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో దళిత, గిరిజనుల సమగ్ర అభివృద్ధి కోసం తలపెట్టిన ‘ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్సీ ఎస్డీఎఫ్), గిరిజన ప్రత్యేక అభివృద్ధి నిధి(ఎస్టీ ఎస్డీఎఫ్) పర్యవేక్షణ గాడి తప్పింది. ఎస్డీఎఫ్ చట్టం ప్రకారం.. కనీసం ఆరు నెలలకోసారి కమిటీల సమావేశాలు జరగాలి. కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22)కుగాను ఎస్సీ, ఎస్టీ ఎస్‌డీఎఫ్‌ల పర్యవేక్షణ కమిటీల సమావేశాలు ఒక్కసారి కూడా జరగలేదు. గతేడాది జూన్ చివర్లో ఎస్టీ ఎస్డీఎఫ్ పర్యవేక్షణ కమిటీ సమావేశం ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా తూతూమంత్రంగా సాగింది. ఎస్సీ ఎస్డీఎఫ్ పర్యవేక్షణపై గత ఏడాదిగా ఒక్కసారి కూడా కమిటీ భేటీ కాలేదు. లెక్కలపై స్పష్టత ఏది? ‘ఎస్డీఎఫ్’చట్టం ప్రకారం.. ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీలకు వార్షిక బడ్జెట్లో నిధులు కేటాయిస్తుంది. వాటిని 42 ప్రభుత్వ శాఖల ద్వారా ఖర్చు చేస్తారు. శాఖల వారీగా ప్రభుత్వం లక్ష్యాలను నిర్దేశిస్తుంది. ఎస్సీ అభివృద్ధి శాఖ, గిరిజన సంక్షేమ శాఖ నోడల్ డిపార్ట్మెంట్లుగా ఉంటాయి. వీటిని నిర్దేశించిన వార్షిక సంవత్సరంలో పూర్తిస్థాయిలో ఖర్చు చేయాలి. ఏవైనా కారణాలతో నిధులు మిగిలితే వచ్చే ఆర్థిక సంవత్సరానికి క్యారీ ఫార్వర్డ్ చేయాలి. కానీ ప్రత్యేక అభివృద్ధి నిధుల ఖర్చు, ప్రణాళికలకు సరైన పర్యవేక్షణ లేకుండా పోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిస్తూ.. కొత్త వార్షిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ అంచనాల రూపకల్పన ప్రారంభమైనా.. ఎస్డీఎఫ్కు కేటాయించిన నిధులతో చేపట్టిన పనులు, చేసిన ఖర్చు, పూర్తయిన పనులు, మిగులుకు సంబంధించిన గణాంకాలపై స్పష్టత లేదు. రూ. 33,610.06 కోట్లు కేటాయించినా.. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద 2021–22 వార్షిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.33,610.06 కోట్లు కేటాయించింది. ఇందులో ఎస్సీ ఎస్డీఎఫ్ కింద రూ.21,306.84 కోట్లు కేటాయించగా, ఎస్టీ ఎస్డీఫ్ కింద రూ.12,304.22 కోట్లు కేటాయించింది. 2020–21 నాటికంటే రూ.7,303.81 కోట్లు అదనంగా కేటాయించడంతో.. అభివృద్ధి పనుల్లో వేగం పెరుగుతుందని ఎస్సీ, ఎస్టీ వర్గాలు ఆశలు పెట్టుకున్నాయి. కానీ పరిస్థితి భిన్నంగా తయారైంది. -
సులభతర వాణిజ్యంలో నం.1 కావాలి..
సాక్షి, హైదరాబాద్: సులభతర వాణిజ్య విధానం (ఈఓడీబీ) ర్యాంకుల్లో తెలంగాణను అగ్రస్థానంలో నిలిపేందుకు కలిసికట్టుగా పనిచేద్దామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు పిలుపునిచ్చారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వివిధ ప్రభుత్వ విభాగాల శాఖాధిపతులతో ఈఓడీబీ ర్యాంకుల ప్రక్రియపై మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో బుధవారం కేటీఆర్ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈఓడీబీ ర్యాంకుల్లో తెలంగాణ అగ్రస్థానం సాధించేందుకు వివిధ శాఖలకు సంబంధించిన సంస్కరణలు, సన్నాహక ప్రక్రియపై దిశానిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన వివిధ అంశాలకు సంబంధించి వంద శాతం సంస్కరణలు, చర్యలు పూర్తయినట్లు అధికారులు వివరించారు. ర్యాంకుల కేటాయింపుల్లో యూజర్ ఫీడ్‌బ్యాక్ (వినియోగదారుల ప్రతిస్పందన) అత్యంత కీలకమని, వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా అందుతున్న సేవలపై పారిశ్రామికవర్గాల నుంచి కేంద్ర ప్రభుత్వం సమాచారం తీసుకుంటోందని అధికారులు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, అధికారుల పనితీరుతో రాష్ట్రానికి అనేక పెట్టుబడులు వస్తూ, ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. గతంలోనూ ఈఓడీబీలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని, త్వరలో ప్రకటించే ర్యాంకుల్లోను మొదటి స్థానం సాధించేందుకు కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఈఓడీబీ కేవలం ర్యాంకుల కోసమే కాదని, ప్రభుత్వ శాఖల పనితీరు మెరుగుపరుచుకునేందుకు అద్భుతమైన అవకాశంగా కేటీఆర్ పేర్కొన్నారు. డిజిటల్ సేవలను ప్రారంభించిన మంత్రి మేధో సంపద పరిరక్షణకు సంబంధించిన అన్ని రకాల అంశాలపైనా విద్యార్థులు, స్టార్టప్ నిర్వాహకులు, సృజనాత్మక ఆవిష్కర్తలు...ఇలా ప్రతీ ఒక్కరికీ అందుబాటులో ఉండేలా రెజల్యూట్ సంస్థ భాగస్వామ్యంతో ప్రభుత్వం రూపొందించిన ‘ఐపీ బడ్డీ రచిట్’డిజిటల్ సేవలను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఐటీ పరిశ్రమ ప్రిన్సినల్ సెక్రెటరీ జయేశ్ రంజన్, రెజల్యూట్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ రమీందర్ సింగ్ సోయిన్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ ఎం.కొమరయ్య తదితరులు పాల్గొన్నారు. -
ట్రెండ్ మారింది.. ఎవ్వరూ నేరుగా లంచం తీసుకోవట్లే.. అంతా సెపరేటే!
సాక్షి, వరంగల్: కాలం మారింది. ఇప్పుడు అధికారులెవ్వరూ నేరుగా లంచం తీసుకోవట్లే. గోడకు సీసీ కెమెరాలు, ఫోన్లలో రికార్డింగులు వచ్చినప్పటి నుంచి బల్లాకింద చేతులు పెట్టట్లేదు. ఏది ఉన్నా.. సామరస్యంగానే అవినీతికి పాల్పడుతున్నారు. మధ్యవర్తులను పెట్టుకొని లంచాల పర్వం కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ విభాగాల్లో లంచానికి ఓ కొత్త టర్మినాలజీ కూడా ఉంది. ఉదాహరణకు ఆఫీస్ చార్జ్, ఫార్మాలిటీ, స్పెషల్ ఫీజు వంటి పదాలను విస్తృత అర్థంలో లంచానికి వాడుతున్నారు. మహానగరంలో ఇంటి పర్మిషన్ తీసుకునే సమయంలో పైన పేర్కొన్న పదాలు తరచూ వినిపిస్తాయి. ఆయా విభాగాల అధికారులకు మధ్యవర్తుల ద్వారా కనీసం లక్ష రూపాయలైనా చదివించుకోవాల్సిందే! రాష్ట్ర ప్రభుత్వం సేవల్లో సులభతరం, సత్వ రం, పారదర్శకం కోసం టీఎస్–బీపాస్‌ను తీసుకొ చ్చింది. స్వీయ «ధ్రువీకరణ (సెల్ఫ్ సర్టిఫికెట్) ఆధారంగా తక్షణమే భవన నిర్మాణ పర్మిషన్ తీసుకోవచ్చు. కానీ.. ప్రజలకు టీఎస్–బీపాస్‌పై అవగాహన లేక బల్దియా లైసెన్స్ సర్వేయర్లను ఆశ్రయిస్తున్నారు. దరఖాస్తులు, ప్లాన్లు, ఫీజుల సొమ్ము సైతం నెట్ బ్యాంకింగ్ ద్వారా స్వీకరిస్తున్నారు. వీటిని ఆన్లైన్లో అప్లోడ్ చేసే బాధ్యతను మహా నగర పాలక సంస్థ గుర్తింపు పొందిన ప్రైవేట్ లెసెన్స్ సర్వేయర్లకే అప్పగించింది. దీంతో ప్రైవేటు సర్వేయర్లు అదనపు వసూళ్లతో భవన నిర్మాణదారులకు చుక్కలు చూపిస్తున్నారు. కాస్త చదువుకున్న వారు, సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవారు సొంతంగా పర్మిషన్ కోసం దరఖాస్తు చేసుకున్నా.. అధికారులు పర్మిషన్ అప్రూవల్ చేయడం లేదనే ఆరోపణలు సైతం ఉన్నాయి. గంటల్లో పని.. వేలల్లో ఫీజు! కొత్తగా ఇంటికి పర్మిషన్ తీసుకోవాలంటే ఇంటి వైశాల్యాన్ని బట్టి కొంత రుసుము ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది. ఇది నేరుగా ప్రభుత్వానికి చేరుతుంది. కానీ.. నక్షాలు (ప్లాన్) గీసే లైసెన్స్డ్ సర్వేయర్లు ఒక ప్లాన్ గీస్తే ఎంత తీసుకోవాలి అనేదానిపై స్పష్టత లేదు. ఇదే అదనుగా ప్రైవేట్ సర్వేయర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మహానగరంలో కొత్త ఇంటి నిర్మాణ పనుల కోసం వచ్చే వారి నుంచి ఆన్లైన్ పేరుతో అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారు. బిల్డింగ్ ప్లాన్లు ఆన్లైన్లో అప్లోడ్ చేసేందుకు లైసెన్స్డ్ ప్రైవేట్ సర్వేయర్లు పెద్దమొత్తంలో నగదు వసూలు చేస్తున్నారు. ప్లాన్ గీసేందుకు ముందు ప్రైవేటు సర్వేయర్ ప్లాట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. ఆ తర్వాత కొలతల ప్రకారం ప్లాన్(నక్ష) గీసి ఇవ్వాల్సి ఉంటుంది. ఇదంతా రెండు, మూడు గంటల వ్యవధిలో పూర్తవుతుంది! కానీ.. ఇందుకు సర్వేయర్లు వేలల్లో ఫీజు వసూలు చేస్తుంటారు. చదవండి: హైదరాబాద్: భార్య కోసం ఇద్దరు భర్తల లొల్లి.. మీడియా సమావేశం పెట్టి మరీ.. అ‘ధనం’ కావాల్సిందే! సర్వేయర్ గీసిచ్చిన ప్లాన్ ఆధారంగా టౌన్ ప్లానింగ్ అధికారులు పర్మిషన్ ఫైల్‌ను ఉన్నతాధికారుల వద్దకు పంపిస్తారు. ఆ తర్వాత వారు డాక్యుమెంట్లు వెరిఫై చేసి అప్రూవల్ ఇస్తారు. పర్మిషన్ కోసం వచ్చిన వారి నుంచి సర్వేయర్లు ముందుగా తక్కువ మొత్తంలో నగదు తీసుకుంటారు. ఆ తర్వాత ఆన్లైన్, వివిధ కారణాల పేరుతో అదనపు పైకం కావాలని వేధిస్తారు. ప్రజలెవరైనా విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తే ప్రైవేట్ సర్వేయర్లు మాకేం సంబంధం? మీ ఇష్టం ఎంతైనా ఇవ్వండి.. అంటూ బల్దియా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు సైతం ఉన్నాయి. సర్వేయర్లు కాదు.. మధ్యవర్తులు మహా నగర పాలక సంస్థ నుంచి లైసెన్స్ పొందిన సర్వేయర్లు 85 మంది వరకు ఉంటారు. ఏడాదికోసారి లైసెన్స్ రెన్యూవల్ కోసం రూ.10వేలు చెల్లిస్తారు. భవన నిర్మాణాలు, నల్లా కనెక్షన్లకు సంబంధించిన ప్లాన్లు వీరు గీసి ఇవ్వాల్సి ఉంటుంది. టౌన్ ప్లానింగ్ అధికారుల పరిధిలో వీరంతా పని చేయాలి. పేరుకు మాత్రం ప్రైవేట్ సర్వేయర్లు అయినా.. తెర వెనుక మాత్రం సెటిల్మెంట్లు చేస్తున్నారు. భవన నిర్మాణ అనుమతులు తొందరంగా రావాలంటే వీరి ద్వారా వెళ్లాల్సిందే. టౌన్ ప్లానింగ్ అధికారులకు, ప్రజలకు మధ్య వారధిలా(మధ్యవర్తులుగా) పని చేస్తున్నారు. కాశిబుగ్గ, కాజీపేట సర్కిల్ కార్యాలయాల్లో కొందరు బడా సర్వేయర్ల కనుసన్నల్లో బిల్డింగ్ అనుమతుల ఫైళ్లు పరిష్కారమవుతున్నాయనేది బహిరంగ రహస్యమే. చదవండి: పెద్దలు పెళ్ళికి నిరాకరించారని ప్రేమ జంట ఆత్మహత్య వాస్తవానికి.. గతంలో మాన్యువల్ విధానం ఉన్నప్పుడు బిల్డింగ్ ప్లాన్ గీసేందుకు రూ.3వేల నుంచి రూ.4వేలు తీసుకునే వారు. గత నాలుగేళ్లుగా ఆన్లైన్ బిల్డింగ్ అప్లికేషన్ విధానం అమల్లోకి వచ్చింది. భవన నిర్మాణ ప్లాన్, దస్తావేజులు తదితర వివరాలన్నీ స్కాన్ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నామని చెప్పి ఒక్కో దరఖాస్తుదారుడి నుంచి రూ.15వేల నుంచి రూ.25వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇదేంటని అడిగితే ఆన్లైన్ సేవలకు అదనపు రుసుములని చెబుతున్నారు. ఇదే విషయమై గతంలో చాలామంది టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. కానీ.. తీసుకున్న చర్యలు మాత్రం శూన్యం. ఆధునిక సేవలు నగర ప్రజలకు అదనపు భారంగా మారాయి. లైసెన్స్ సర్వేయర్ అవసరం లేదు రాష్ట్ర ప్రభుత్వం పురపాలక చట్టం–2019 తీసుకొచ్చింది. భవన నిర్మాణ అనుమతులకు ఎవరి ప్రమేయం లేకుండా స్వీయ ధ్రువీకరణతో సాధారణ వ్యక్తి కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. 21 రోజుల్లోగా భవన నిర్మాణ దరఖాస్తు పరిష్కారం కాకపోయినా అనుమతి వచ్చినట్లుగా భావించవచ్చు. సర్వేయర్లను ఆశ్రయించాల్సిన పని లేదు. – వెంకన్ననాయక్, బల్దియా సిటీ ప్లానర్ అధికారులకూ తాయిలాలు! ఫైల్ అప్రూవల్ కావాలంటే చాలా పెద్ద తతంగం ఉంటుంది. ప్రైవేట్ సర్వేయర్లు వివిధ శాఖల అధికారులకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందని పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతారు. ఈ క్రమంలో నోటికెంతొస్తే అంత వసూలు చేస్తారు. ఏదైనా అడిగితే నాలుగైదు విభాగాల అధికారులకు చెల్లించగా నాకేం మిగలదు! అని సమాధానం చెబుతారు. అంటే ఈ లెక్కన అన్ని విభాగాల అధికారులకు తాయిలాలు అందుతున్నట్లే కదా! చదవండి: పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు.. వ్యర్ధాలపై తస్మాత్ జాగ్రత్త.. -
కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఆర్థిక భరోసా
సాక్షి, అమరావతి: లక్ష్మి అనే మహిళ ఓ ప్రభుత్వ శాఖలో ఐదేళ్లుగా కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగం చేస్తోంది. తొలి మూడేళ్లలో నిత్యం భయం భయంగా పని చేయాల్సి వచ్చేది. అనారోగ్యంగా ఉన్నప్పటికీ సెలవులు ఇచ్చే వారు కాదు. టైమ్ స్కేల్ ఇవ్వాలని అడుగుతున్న వారిలో నీ పేరూ ఉందని, ఇలాగైతే ఉద్యోగం పోగొట్టుకుంటావని హెచ్చరించారు. సరిపోని జీతంతో, సమస్యల నడుమ ఉద్యోగ జీవితాన్ని నెట్టుకొచ్చింది. ఇక ఈ జీవితం ఇంతేనా అని ఓ దశలో నిరాశతో కుంగిపోయింది. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పరిస్థితి మారుతుందని పలువురు అంటుంటే.. ఆ రోజు త్వరగా రావాలని తనూ కలలు కనింది. ఇప్పుడు ఆ కల నిజం అయిందని ఆనందంతో చెబుతోంది. జగన్ ప్రభుత్వ చర్యల వల్ల తనకు ఏకంగా రూ.13 వేల వరకు జీతం పెరిగిందని సంబరపడుతోంది. ఇలా లక్ష్మి ఒక్కరే కాదు.. వేలాది మంది కాంట్రాక్టు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో వేతనాలు పెంచాలని, మినిమమ్ టైమ్ స్కేలు ఇవ్వాలని గత ప్రభుత్వ హయాంలో పలుమార్లు కాంట్రాక్టు ఉద్యోగులు ప్రభుత్వానికి విన్నవించుకున్నా ఫలితం లేకపోయింది. ఆందోళన బాట పట్టిన వారిని ఉద్యోగాల నుంచి తొలగించారు. అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా 20 రోజుల ముందు 2019 జనవరి 28న జీఓ 12, ఫిబ్రవరి 18న జీఓ 24 ఇచ్చారు కానీ అమలు చేయకుండా మోసం చేశారు. కేవలం ఓట్లు దండుకోవాలనేదే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎత్తుగడ. అప్పట్లో ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ తన సుదీర్ఘ పాదయాత్రలో కాంట్రాక్టు ఉద్యోగుల వెతలను కళ్లారా చూసి.. ఈ పరిస్థితి మారుస్తానని హామీ ఇచ్చారు. ఆ మేరకు వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని దాదాపు అన్ని విభాగాల్లోని కాంట్రాక్టు ఉద్యోగులకు ఎంటీఎస్ (మినిమం టైమ్ స్కేలు) వర్తించేలా జీఓ 40ని అమల్లోకి తెచ్చారు. ప్రభుత్వ ఉద్యోగినులతో సమానంగా కాంట్రాక్టు ఉద్యోగినులకు కూడా మెటర్నిటీ లీవు, ఇతర సదుపాయాలు కల్పించారు. కాంట్రాక్టు ఉద్యోగులు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షలు, సహజ మరణానికి రూ.2 లక్షలు పరిహారం అందించేలా ఉత్తర్వులు జారీ చేశారు. రూ.249.35 కోట్ల మేర వేతనాల పెంపు ► తెలుగుదేశం ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల కోసం ఏటా రూ.330.54 కోట్లు వెచ్చించేది. ఈ లెక్కన ఒక్కో కాంట్రాక్టు ఉద్యోగికి సగటు వేతనం రూ.15 వేలు మాత్రమే. ► వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక వేతనాల పెంపుతో కాంట్రాక్టు ఉద్యోగుల జీతాల కోసం ఏడాదికి వెచ్చించే మొత్తం రూ.579.89 కోట్లకు చేరింది. అంటే గత ప్రభుత్వ హయాంలో వెచ్చించిన మొత్తం కన్నా దాదాపు రూ.249.35 కోట్లు అదనం. ► ఫలితంగా 18,060 మంది కాంట్రాక్టు ఉద్యోగులకు లబ్ధి కలిగింది. సగటున ఒకొక్కరికి నెలకు సరాసరిన అందే వేతనం దాదాపు రూ.26,758. ఈ ప్రభుత్వ చర్యల వల్ల 18 శాతం నుంచి 82 శాతం వరకు వేతనాలు పెరిగాయి. విద్యా శాఖ ఉద్యోగులకు భారీగా లబ్ధి ► ఎంటీఎస్ అమలు అవుతున్న శాఖల్లో విద్యాశాఖకు సంబంధించిన వివిధ విభాగాల కాంట్రాక్టు టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది కూడా ఉన్నారు. ఉన్నత విద్యా శాఖ కాలేజీ ఎడ్యుకేషన్లోని జూనియర్ లెక్చరర్లు, లెక్చరర్లు, లైబ్రేరియన్లు, ఫ్రొఫెసర్/ ఇతర ఫ్యాకల్టీకి సంబంధించి 691 మందికి మినిమమ్ టైమ్ స్కేలు అమలవుతోంది. ► ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి జూనియర్ అసిస్టెంట్, జూనియర్ లెక్చరర్లు, ల్యాబ్ అసిస్టెంటు, లెక్చరర్లు ఇతర ఫ్యాకల్టీలో 3,728 మందికి వేతనాల పెంపు ద్వారా లబ్ధి చేకూరింది. సాంకేతిక విద్యా శాఖలోని ఎలక్ట్రీషియన్లు, ల్యాబ్ అసిస్టెంట్లు, లెక్చరర్లు, ఫార్మాసిస్టులు, వర్కుషాప్ అటెండెంట్లు తదితరులు 432 మందికి మేలు చేకూరుతోంది. ► సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యా సంస్థలు, గిరిజన సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయాలు, ఏపీ గురుకుల విద్యా సంస్థలు, కస్తూరిబా బాలికా విద్యాలయాలు, బీసీ సంక్షేమ శాఖ గురుకుల విద్యా సంస్థలు, ఏపీ వైద్య విధాన పరిషత్, స్పోర్ట్సు అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విభాగాల్లోని 6,026 మందికి వేతనాల పెంపును అమలు చేస్తున్నారు. ► యూనివర్సిటీల్లోని కాంట్రాక్టు అధ్యాపకులకు ఎంటీఎస్ అమల్లో గత ప్రభుత్వ తప్పిదాల వల్ల ఆటంకాలు ఎదురవుతున్నాయి. అధ్యాపకులకు యూజీసీ రివైజ్డ్ పేస్కేళ్లు వర్తించనుండగా జీఓల్లో 2015 స్టేట్ రివైజ్డ్ పే స్కేళ్లను అమలు చేయాలని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన జీఓల్లో కొన్ని అంశాలు గందరగోళంగా ఉండడం, కోర్టు కేసులు వీరికి ఎంటీఎస్ అమలుకు ఆటంకంగా మారాయి. మొత్తంగా ఏదోఒక రీతిలో వేతనాలను పెంచింది. యూనివర్సిటీల్లోని కాంట్రాక్టు ఉద్యోగులు 4,077 మంది ఉండగా ఇప్పటికే జేఎన్టీయూ కాకినాడ, జేఎన్టీయూ అనంతపురం, ఆదికవి నన్నయ్య, శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీల్లో వేతనాలను రూ.40 వేల వరకు పెంచి అందిస్తున్నారు. అవుట్సోర్సింగ్ సిబ్బందికి తొలగిన కష్టాలు ► గత ప్రభుత్వ హయాంలో అవుట్ సోర్సింగ్ సిబ్బంది విషయంలో అనేక అక్రమాలు, భారీగా అవినీతి చోటుచేసుకుంది. ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఎంపికను అప్పటి సీఎం చంద్రబాబు తనకు సన్నిహితులైన వారి ఏజెన్సీలకు కట్టబెట్టారు. ► ఈ అవుట్సోర్సింగ్ పోస్టులను ఆ సంస్థలు లక్షలు వసూలు చేసి అమ్ముకున్నాయి. వారికి వేతనాలు కూడా సరిగా ఇవ్వలేదు. కమిషన్ల కింద భారీగా కోత పెట్టి అరకొరగా తమకు నచ్చినప్పు చెల్లించే వారు. ఈ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత అసలు ఉండేది కాదు. పీఎఫ్, ఈఎస్ఐ వంటి సదుపాయాలు అమలు చేయలేదు. ► వీరి ఆవేదనను కళ్లారా చూసిన వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే ఏజెన్సీలను రద్దు చేసి ప్రత్యేకంగా అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ (ఏపీసీఓఎస్ – ఏపీ కార్పొరేషన్ ఫర్ అవుట్ సోర్స్డ్ సర్వీసెస్) ఏర్పాటు చేసి లక్షకు పైగా ఉద్యోగులను దాని పరిధిలోకి చేర్చారు. ► తద్వారా వారికి ప్రతి నెల మొదటి తేదీన నయాపైసా కోత లేకుండా నేరుగా వారి అకౌంట్లలో వేతనం పడేలా చేశారు. ఈఎస్ఐ, ఈపీఎఫ్ వంటి సదుపాయాలు కల్పించడంతో పాటు కార్పొరేషన్ నియామకాలు కావడంతో వారికి ఉద్యోగ భద్రత కూడా ఏర్పడింది. -
ఏపీలో మరో కొత్త ప్రభుత్వ శాఖ
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త ప్రభుత్వ శాఖ ఏర్పాటయింది. నైపుణాభివృద్ధి, శిక్షణ విభాగం పేరిట కొత్త పాలనా శాఖను ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. రాష్ట్రంలో ఏర్పాటైన పరిశ్రమల్లో స్థానిక యువతకు 75 శాతం రిజర్వేషన్లు, యువతకు నైపుణ్యాభివృద్ధి, శిక్షణ అంశాలను ఈ శాఖ పర్యవేక్షించనుంది. అలాగే గతంలో ఏర్పాటైన నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, ఆవిష్కరణల విభాగాన్ని కొత్త శాఖలో విలీనం చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. కొత్త శాఖ కోసం కార్యదర్శి, అదనపు కార్యదర్శి, ఇతర సిబ్బందిని కేటాయిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. దీంతో రాష్ట్రంలో 37వ శాఖగా నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ఏర్పడింది. -
‘మాజీ’లకు ఉద్వాసన
సాక్షి, హైదరాబాద్: కుర్చీలకు అతుక్కుపోయిన ‘మాజీ’లకు ఉద్వాసన పలకాలని రాష్ట్ర ప్రభుత్వం దాదాపు నిర్ణయించింది. పదవీ విరమణ పొందినా ఆయా శాఖల్లో సలహాదారులుగా, ప్రత్యేక అధికారులుగా కొనసాగుతున్న వారిని తొలగించేందుకు రంగం సిద్ధం చేసింది. ప్రభుత్వ శాఖల్లో ఇలా తిష్ట వేసిన వారితో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని నిర్ధారణకు వచ్చింది. అన్ని శాఖల్లో ఇలా కొనసాగుతున్న వారిని గుర్తించి తొలగించాలని నిర్ణయించింది. ఇంటర్మీడియట్ మార్కుల వ్యవహారమే దీనికి కారణంగా కనిపిస్తోంది. పదవీ విరమణ పొందినా అదే శాఖలో కొనసాగుతున్న కొందరితోనే ఇంటర్ మార్కుల వ్యవహారంలో తప్పులు జరిగినట్లు నిఘా వర్గాలు ప్రభుత్వానికి నివేదిక అందజేసినట్లు తెలిసింది. తాజాగా ఇంటర్ ఫలితాల వెల్లడిలో జరిగిన రాద్ధాంతం వెనుక ఈ అధికారుల పాత్ర ఉందని నిఘా వర్గాలు సీఎం కేసీఆర్ నివేదిక సమర్పించాయి. మాజీ అధికారులే బోర్డు పాలనా వ్యవహారాల్లో కీలక భూమిక పోషిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో పదవీ విరమణ పొందినా... అదే పోస్టుల్లో కొనసాగుతున్న ఉద్యోగులను తొలగించాలని అధికారులను ఆదేశించారు. అదే సమయంలో శాఖల వారీగా ఈ తరహాలో పనిచేస్తున్న ఉద్యోగుల లెక్కతీయాలని సీఎం స్పష్టం చేశారు. మెరుగైన సేవలు అందిం చేందుకు అనుభవజ్ఞులను కొన్ని శాఖల్లో కొనసాగించాలని రాష్ట్రం ఏర్పాటైన కొత్తలో ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని అవకాశంగా తీసుకుని పలు శాఖల్లో కొందరు పదవీ విరమణ పొందినా రకరకాల కారణాలతో అదే శాఖలో విధులు నిర్వహిస్తూ వస్తున్నారు. దీంతో ఆయా శాఖల్లోని రెగ్యులర్ ఉద్యోగులు, ‘విరమణ’ఉద్యోగుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం లాంటి పరిస్థితులు నెలకొన్నాయి. 1,127 మంది ఉన్నట్లు లెక్క... రాష్ట్రవ్యాప్తంగా అన్ని విభాగాల్లో 1,127 మంది ఉద్యోగులు కన్సల్టెంట్, ఓఎస్డీ పోస్టుల పేరు తో పాత విధులనే నిర్వర్తిస్తున్నారని తేలింది. ఇందులో మాజీ ఐఏఎస్, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు మొదలు కిందిస్థాయి ఉద్యోగుల వరకు ఉన్నట్లు స్పష్టమైంది. వీరందరిని తొలగించాలని నిర్ణయించింది. పదవీ విరమణ చేసినా కన్సల్టెంట్లుగా అవే సీట్లలో కొనసాగుతుండడంతో పదోన్నతులు, పోస్టింగ్‌లలో దిగువ శ్రేణి అధికారులకు అన్యాయం జరుగుతోంది. శాఖలో వారి పెత్తనమే కొనసాగడంతో రెగ్యు లర్ ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. -
ఫైళ్లు, ఉద్యోగుల వివరాలు ఆన్‌లైన్‌లోకి
ఇందూరు: జిల్లాల పునర్విభజనలో భాగంగా అన్ని ప్రభుత్వ శాఖల్లో ఫైళ్ల విభజన ప్రక్రియ దాదాపు ముగిసింది. వాటి స్కానింగ్, ఫైళ్ల అప్పగింత అనంతరం రసీదులు తీసుకునే పని కూడా చకచకా సాగుతోంది. అందులో భాగంగానే నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల వారీగా ఫైళ్లు, శాఖల వారిగా ఉద్యోగుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని జాయింట్ కలెక్టర్ రవీందర్‌రెడ్డి సంబంధిత అధికారులు, ఉద్యోగులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన ప్రగతిభవన్‌లో ఆయా శాఖల అధికారులు, ఉద్యోగులతో సమీక్షించారు. newdistrictformation.telangana.gov.in అనే వెబ్‌సైట్‌ను ప్రభుత్వం రూపొందించిందని, ఇందులో వెంటనే వివరాలను నమోదు చేయాలని తెలిపారు. కామారెడ్డి జిల్లాకు సంబంధించిన ఫైళ్లు ఎన్ని పంపించారు..? శాఖల వారీగా పని చేస్తున్న ఉద్యోగుల వివరాలతో పాటు ఖాళీల వివరాలను మొత్తం అందులో నమోదు చేయాలని సూచించారు. శాఖల వారీగా అధికారులకు వారి రాష్ట్ర శాఖల నుంచి పాస్వర్డ్, యూజర్ ఐడీ వస్తుందని, తదనంతరం వివరాలు ఆ వెబ్సైట్లో నమోదు చేయాలన్నారు. ఇంకా ఫైళ్ల విభజన, స్కానింగ్ చేయని శాఖలు వెంటనే ఆ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. డీఆర్వో పద్మాకర్, కలెక్టరేట్ ఏవో గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ శాఖలకు స్టార్ రేటింగ్‌లు
- ఎనిమిది శాఖలకు నో స్టార్ స్టేటస్ - త్రీస్టార్ దక్కించుకున్నవి పది - కోర్ డ్యాష్బోర్డుకిచ్చే డేటా ఆధారంగా రేటింగ్ సాక్షి, విజయవాడ బ్యూరో : మార్కెట్లో వస్తువులకు ఇచ్చినట్లు ప్రభుత్వ శాఖలకు ముఖ్యమంత్రి కార్యాలయం రేటింగ్‌లు ఇచ్చింది. పనితీరును బట్టి త్రీస్టార్, టూ స్టార్, వన్ స్టార్, నో స్టార్ రేటింగ్లను ప్రకటించింది. మొత్తం 34 శాఖలకు ఇలా రేటిం గ్లు ఇచ్చింది. సీఎం కోర్ డ్యాష్‌బోర్డులో ఈ వివరాలు ఉంచింది. తక్కువ స్కోర్ పొందిన ఆర్థిక, ఉన్నత విద్య, రోడ్లు- భవనాలు, పర్యాటక, గృహ నిర్మాణం, మత్స్య, మైన్స్ అండ్ జియాలజీ, పాఠశాల విద్యా శాఖలకు నో స్టార్ రేటింగ్ ఇచ్చారు. ఆధార్ సీడింగ్, ఐటీఈ అండ్ సీ, పంచాయతీరాజ్ శాఖలు వ న్ స్టార్ గుర్తింపు పొందాయి. వ్యవసాయం, పశుసంవర్థకం, వాణిజ్య పన్నులు, పరిశ్రమలు, జలవనరులు, ఎక్సైజ్, అటవీ, కార్మిక, రిజిస్ట్ర్రేషన్లు అండ్ స్టాంపులు, మహిళా-శిశు సంక్షేమం, మై బ్రిక్- మై అమరావతి (సీఆర్డీఏ), సంక్షేమ శాఖలు టూ స్టార్ రేటింగ్ దక్కించుకున్నాయి. ప్రణాళిక, భూగర్భజల, విద్యుత్, పౌరసరఫరాలు, వైద్య-ఆరోగ్య-కుటుంబ సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, మున్సిపల్ పరిపాలన-పట్టణాభివృద్ధి, ఏఈబీఏఎస్ (ఆధార్ ఎనేబిల్డ్ బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్), పోలీసు, రెవెన్యూ శాఖలు త్రీ స్టార్ రేటింగ్ దక్కించుకున్నాయి. రేటింగ్ ఇలా: సీఎం కోర్ డ్యాష్ బోర్డులో సమాచారాన్ని షేర్ చేసే విధానాన్ని బట్టి మూడు అంశాల ఆధారంగా స్కోర్ ఇచ్చి ఈ రేటింగ్లను ఐటీ శాఖ రూపొందించింది. ఆయా శాఖలు తమ సమాచారాన్ని రియల్ టైమ్‌లో షేర్ చేస్తే 40 శాతం మార్కులు, డేటా రూపకల్పన (కిందిస్థాయి లబ్ధిదారుడు, పనుల స్థాయిలో)కు 30 శాతం, డేటా కచ్చితత్వం, విశ్లేషణ, గ్రాఫ్‌లు, చారిత్రక వివరాల పోలికకు 30 శాతం మార్కులు ఇచ్చారు. 80 శాతం కంటే ఎక్కువ మార్కులొస్తే త్రీస్టార్, 70 నుంచి 80 శాతం వస్తే టూ స్టార్, 60 నుంచి 69 శాతం వస్తే వన్ స్టార్, 60 శాతం కంటే తక్కువొస్తే నో స్టార్ రేటింగ్ ఇచ్చారు. 34 శాఖల పరిధిలోని 75 విభాగాలకు మొద ట మార్కులిచ్చి వాటిని శాఖలవారీ క్రోడీకరించగా వచ్చిన తుది స్కోరును పరిగణనలోకి తీసుకున్నారు. ఈ విభాగాల్లో కొన్నింటి కి సున్నా మార్కులు రాగా, మరికొన్నింటికి 10, 25, 40 వచ్చాయి. జలవనరుల శాఖలో ని నీరు-చెట్టు, గ్రామీణాభివృద్ధి శాఖలోని ఇసుక తవ్వకాలకు సున్నా పడ్డాయి. -
వెతలు
♦ జీతాలు పెరగక ఎన్ఎంఆర్ ఉద్యోగుల అవస్థలు చివరగా 2013లో పెంపు ♦ ఈ ఉత్తర్వులు రెండేళ్లకే పరిమితం ♦ తాజా ఉత్తర్వుల కోసం 15 నెలలుగా నిరీక్షణ సత్వరం పెంచాలని విజ్ఞప్తి ♦ పట్టించుకోని అధికారులు సంగారెడ్డి టౌన్: వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేసే దినసరి వేతన జీవుల జీతాలు పెరగక అవస్థలు పడుతున్నారు. జీతాలు పెంచుతూ 2013లో ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వులు రెండేళ్లకే పరిమితం. గడువు ముగిసి 15 నెలలు దాటినా తాజా ఉత్తర్వులు రావడం లేదు. ప్రస్తుత ధరలను సమీక్షించి అందుకు అనుగుణంగా కొత్తగా వేతనాలు నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ఎన్ఎంఆర్ ఉద్యోగులు కోరుతున్నారు. ఇందుకోసం కార్మిక శాఖ కార్యాలయం చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. జీతాల పెంపుకోసం ఎదురు చూపులతో కాలం గడుపుతున్నారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో దినసరి వేతనంతో పనిచేస్తోన్న నాన్ మస్టర్ రోల్ స్టాఫ్ (ఎన్ఎంఆర్) ఉద్యోగులు జీతాలు పెరగక ఇబ్బందులు పడుతున్నారు. జీతాల పెంపునకు సంబంధించిన అప్పటి కలెక్టర్, డిప్యూటీ లేబర్ కమిషనర్లు జారీ చేసిన ఉత్తర్వుల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. కార్మిక శాఖ కార్యాలయం చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా లాభం లేకపోయింది. నాటి ధరలకు అనుగుణంగా 2013లో అప్పటి కలెక్టర్ స్మితా సబర్వాల్ ఉత్తర్వులు జారీ చేశారు. నిత్యావసర ధరలు రెండేళ్లలో పదింతలు పెరిగాయని, జీతాలు సరిపోక ఇబ్బందులు పడుతున్నామని ఎన్ఎంఆర్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా వేతనాలు పెంపు ఉత్తుర్వుల కోసం గత 15 నెలలుగా ఎదురు చూస్తున్నామన్నారు. ప్రభుత్వం శాఖల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలు పెంచారని, తమ జీతాలు కూడా పెంచాలని వారు కోరుతున్నారు. ఈ విషయమై కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా.. పాత ఉత్తర్వులు కొనసాగుతున్నాయని చెప్పారు. జిల్లాలో మొత్తం ఎంతమంది ఎన్ఎంఆర్ ఉద్యోగులు ఉన్నారో తమ వద్ద సమాచారం అందుబాటులో లేదని చెప్పడం గమనార్హం. చివరిసారిగా 2013 నవంబరులో ఉత్తర్వులు... ఎన్ఎంఆర్ ఉద్యోగులకు సంబంధించిన కమిటీకి కలెక్టర్ చైర్మన్, కన్వీనర్‌గా కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్, వివిధ శాఖలకు చెందిన అధికారులు సభ్యులుగా ఉంటారు. డిసెంబర్ 2011లో ఈ ఉద్యోగుల జీతాలు పెంచారు. ఆపై రెండేళ్లకోసారి అప్పటి నిత్యావసర ధరలకు అనుగుణంగా జీతాలు పెంచుతూ 19 నవంబర్ 2013న అప్పటి కలెక్టర్ ఆదేశాలతో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ ఉత్తర్వులు నం.సి/1393/2013 విడుదల చేశారు. ఈ ఉత్తర్వులు మార్చి 2015 వరకు అమలులో ఉంటుందని అందులో సూచించారు. ఆ ఉత్తర్వుల గడువు అయిపోయి 15 నెలలుగడిచింది. దాంతో సదరు ఉద్యోగులు జీతాల పెంపు కోసం ఎదురుచూస్తున్నారు. 2013లో నిర్ణయించిన రోజువారి వేతనాలు.. అన్‌స్కిల్డ్ ఉద్యోగులైన మజ్దూర్, చౌకీదార్, అటెండర్, స్వీపర్, క్యాజువల్ లేబర్లకు గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు రూ. 245, పట్టణ ప్రాంతంలో రూ. 255గా నిర్ణయించారు. సెమీ స్కిల్డ్ ఉద్యోగుల రికార్డ్ అసిస్టెంట్, మిల్క్ రికార్డర్, మిల్క్ మ్యాన్, మిల్కర్, ఇతరులకు గ్రామీణ ప్రాంతంలో రూ. 295, పట్టణం ప్రాంతంలో 305, స్కిల్డ్ ఉద్యోగులైన కార్పెంటర్, క్లర్క్, టైపిస్ట్, స్టెనో, ఎలక్ట్రిషియన్, డ్రైవర్లకు గ్రామీణ ప్రాంతాల్లో రూ. 330, పట్టణ ప్రాంతాల్లో రూ. 345గా నిర్ణయించారు. ఇప్పటికీ ఇవే వేతనాలను చెల్లిస్తున్నారు. పాత ఉత్తర్వులే అమల్లో.. ఇప్పటికీ పాత ఉత్తర్వులే కొనసాగుతున్నాయి. ఈ ఉత్తర్వులు 2013లో జారీ అయ్యాయి. జిల్లాలో ఎంతమంది ఎన్ఎంఆర్ ఉద్యోగులు పనిచేస్తున్నారో పూర్తి వివరాలు మా దగ్గర ఉండవు. - కోటేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ కార్మిక కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాం... గతంలో ఇచ్చిన ఉత్తర్వుల కాలం చెల్లింది. 15 నెలలు దాటినా కొత్తగా ఉత్తర్వులు జారీ కాలేదు. పెరిగిన ధరలకు అనుగుణంగా కొత్తగా జీతాలు నిర్ణయించాలని పలుమార్లు అధికారులకు విన్నవించాం. కార్మిక శాఖ అధికారులను చాలాసార్లు కలిసాం. అయినా పట్టించుకోవడం లేదు. - శివకుమార్, ఎన్ఎంఆర్ ఉద్యోగి -
5 భవంతులు.. 41 శాఖలు
- 1వ భవనంలో సీఎం, సీఎస్ కార్యాలయాలు - 4 భవనాల్లో 25 మంది మంత్రుల ఆఫీసులు - ఇద్దరు సలహాదారుల కార్యాలయాలు - తాత్కాలిక సచివాలయ సమగ్ర స్వరూపమిది - ఏ శాఖ ఎక్కడో స్పష్టం చేసిన సర్కారు సాక్షి, హైదరాబాద్: ఐదు భవంతులు.. అన్నింటిలో గ్రౌండ్‌ఫ్లోర్, ఫస్ట్‌ఫ్లోర్.. సీఎం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయాలతో పాటు 25 మంది మంత్రులకు కార్యాలయాలు.. 41 ప్రభుత్వ శాఖలకు తాత్కాలిక సచివాలయంలో చోటు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఏ ప్రభుత్వ శాఖకు ఏ భవనంలో కేటాయించేదీ తెలిపింది. ► భవనం-1 మొదటి అంతస్తులో సీఎం కార్యాలయం (సీఎంవో), సీఎస్ కార్యాలయం, గ్రౌండ్ ఫ్లోర్లో సాధారణ పరిపాలన విభాగం (2,307 చదరపు అడుగులు), న్యాయశాఖ (6,850 చ.అ.), సీఎం హామీల పరిష్కారాల కోసం ఒక హాల్ ఉంటాయి. ► భవనం-2 గ్రౌండ్ ఫ్లోర్లో ఐదుగురు మంత్రుల కార్యాలయాలు, హోం శాఖ (7,400 చ.అ.) విద్యుత్తు శాఖ (2,590), పరిశ్రమల శాఖ (5,310), మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ (808), పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ (2,970), మొదటి అంతస్తులో ఐదుగురు మంత్రుల కార్యాలయాలు, ఆర్థికశాఖ (18,470 చ.అ.), ప్రణాళిక విభాగం (13,200) ఉంటాయి. ► భవనం-3 గ్రౌండ్ ఫ్లోర్లో టెలికాం ఆఫీసు, బీఎస్ఎన్ఎల్ సర్వర్ (1,000 చ.అ.), ఏపీటీఎస్ సచివాలయ సపోర్ట్ యూనిట్ (1,000), పే అండ్ అకౌంట్స్ (1,000), సాధారణ సౌకర్యాలైన మీ సేవ, ఈ సేవ కౌంటర్లు, రైలు/బస్ రిజర్వేషన్ కౌంటర్లు, పోస్ట్ ఆఫీసు, బ్యాంకు, రెండు ఏటీఎంలు, షాపులు, కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఆఫీసులు (27,500), ప్లే స్కూల్ (1,000), మూడు పడకల డిస్పెన్సరీ (2,000), రిక్రియేషన్ (3,000), లైబ్రరీ (1,000), రెస్టారెంట్ (12,000) ఏర్పాటు చేస్తారు. మొదటి అంతస్తులో ఐదుగురు మంత్రుల కార్యాలయాలు, సాంఘిక, గిరిజన సంక్షేమశాఖలు (7,950 చ.అ.), బీసీ సంక్షేమం (3,770 ), మైనార్టీ సంక్షేమం (2,870), మహిళా శిశు సంక్షేమం (3,450), స్కిల్ డెవలప్మెంట్ (2,500), యువజన సంక్షేమం, టూరిజం, కల్చర్ (3,600) ఉంటాయి. ► భవనం-4 గ్రౌండ్ ఫ్లోర్లో ఐదుగురు మంత్రుల కార్యాలయాలు, రెవెన్యూ (11,910 చ.అ.), రెవెన్యూ విపత్తుల శాఖ (1,070), ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ (3,910), వ్యవసాయ, సహకారశాఖ (6,780), పశుసంవర్ధక, డెయిరీ డెవలప్మెంట్, మత్య్సశాఖ (2,870), పౌరసరఫరాలశాఖ (2,820) ఉంటాయి. మొదటి అంతస్తులో ఐదుగురు మంత్రులు, ఇద్దరు సలహాదారుల కార్యాలయాలు, వాటర్ రిసోర్సెస్ (10,550 చ.అ.), రెయిన్ షాడో ఏరియా డెవలప్మెంట్ (1,400), పాఠశాల విద్య (4,310), ఉన్నత విద్య (4,720), ఐటీ, డేటా సెంటర్ (8,450) ఏర్పాటు చేస్తారు. ► భవనం-5 గ్రౌండ్ ఫ్లోర్లో పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (11,320 చ.అ.), వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ (7,510), కార్మిక, ఉపాధిశాఖ (3,770), గృహ నిర్మాణశాఖ (3,570), మొదటి అంతస్తులో ట్రాన్స్‌పోర్టు, రోడ్లు, భవనాలశాఖ (5,750), విజిలెన్స్ కమిషన్ (3,700), కాన్ఫరెన్స్ హాలు (400 చదరపు అడుగులు) ఉంటాయి. -
జూన్ 2న కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ
సాక్షి, హైదరాబాద్: క్రమబద్ధీకరణకు అర్హత గల కాంట్రాక్టు ఉద్యోగుల జాబితాలను ఈ నెల 21వ తేదీలోగా ఆర్థిక శాఖకు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్ శర్మ అన్ని ప్రభుత్వ శాఖలను ఆదేశించారు. రాష్ట్ర ఆవిర్భావ దినం జూన్ 2 సమీపిస్తున్న నేపథ్యం లో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. రాష్ట్ర ఆవిర్భావ దినం కానుకగా జూన్ 2న సీఎం కేసీఆర్ కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై ఉత్తర్వులు జారీ చేయనున్నారని తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, సమాచార హక్కు చట్టం అమలు తదితర అంశాలపై మంగళవారం సచివాలయంలో అన్ని ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో రాజీవ్ శర్మ సమీక్ష నిర్వహించారు. జీవో 16లో పేర్కొన్న మార్గదర్శకాల ప్రకారం అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగుల జాబితాలను ఆయా శాఖల కార్యదర్శులు స్వయంగా పరిశీలించి ప్రభుత్వ ఆమోదం కోసం ఆర్థిక శాఖకు పంపాలని సూచించారు. ఈ జాబితాలను పరిశీలించి అంతా సవ్యంగా ఉంటే తక్షణమే ఆమోదించాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో 30 ప్రభుత్వ శాఖల పరిధిలో దాదాపు 100కు పైగా విభాగాధిపతి(హెచ్‌వోడీ) కార్యాలయాలున్నాయి. శాఖల వారీగా కాకుండా హెచ్‌వోడీ కార్యాలయాల వారీగా రోజుకు రెండు మూడు జాబితాలే వస్తున్నాయని ఆర్థిక శాఖ వర్గాలు సీఎస్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. దీంతో శనివారంలోగా అన్ని శాఖలు అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగుల జాబితాలను సమర్పించాలని సీఎస్ గడువు విధించారు. అన్ని జాబితాలు వస్తే స్పష్టమైన లెక్క! వాస్తవానికి గత నెలతోనే గడువు పూర్తి కాగా.. కొన్ని హెచ్‌వోడీల నుంచే కాంట్రాక్టు ఉద్యోగుల జాబితాలు అందాయి. రాష్ట్రంలోని 30 ప్రభుత్వ శాఖల పరిధిలో దాదాపు 25 వేల మంది వరకు కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నట్లు ఆర్థిక శాఖ వర్గాలు తెలి పాయి. అయితే జీవో 16లో పేర్కొన్న మార్గదర్శకాల ప్రకారం అర్హులైన ఉద్యోగులనే ప్రభుత్వం క్రమబద్ధీకరించనుంది. అన్ని శాఖ ల నుంచి జాబితాలు వచ్చిన తర్వాతే కచ్చితమైన లెక్కలు వస్తాయని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున క్రమబద్ధీకరణ పొందే ఉద్యోగుల జాబితాలను ప్రకటిస్తూ శాఖల వారీగా జీవోలు జారీ కానున్నాయి. ఆ వెంటనే సంబంధిత హెచ్వోడీలు అపాయింట్మెంట్ ఆదేశాలు జారీ చేయనున్నాయి. కాగా, సమాచార హక్కు చట్టం అమలుపై ప్రతినెలా నివేదికలను సమర్పించాలని అన్ని ప్రభుత్వ శాఖలను సీఎస్ ఆదేశించారు. కొన్ని శాఖలు ఆలస్యం చేస్తుండటంతో సమాచార కమిషనర్ల నుంచి రిమైండర్లు వస్తున్నాయని ఆయన అన్నారు. అన్నింటికీ అఫిడవిట్లు అవసరమా? ప్రభుత్వ సేవల కోసం పౌరుల నుంచి ప్రమాణ పత్రాలు(అఫిడవిట్)ల స్వీకరణ అంశంపై పునఃసమీక్ష జరపాలని అన్ని ప్రభుత్వ శాఖలను సీఎస్ కోరారు. అవసరం ఉన్నా.. లేకున్నా ప్రతి పనికీ అఫిడవిట్లు కోరకుండా పంజాబ్ అమల్లోకి తెచ్చిన కొత్త విధానంపై అధ్యయనం జరపాలని సూచించారు. అఫిడవిట్ అవసరమైన, అవసరం లేని ప్రభుత్వ సేవలను శాఖల వారీగా గుర్తించాలని సూచించారు. అయితే మన రాష్ట్రంలో అనవసర విషయాల్లో అఫిడవిట్లను కోరడం లేదని పలు శాఖల అధికారులు సీఎస్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. -
చెవిలో పూలు
అడ్డదారిలో గ్రేడ్లు * ప్రభుత్వ శాఖల్లో అధికారుల లీలలు * సమస్యలు పక్కన పెట్టి రికార్డుల సృష్టి * ప్రజా దరఖాస్తుల దారి మళ్లింపు * ఒక్కసారిగా ‘ఏ’ గ్రేడ్‌కు ఎగబాకిన వైనం గుంటూరు ఈస్ట్ : జిల్లా యంత్రాంగం వివిధ శాఖల అధికారుల పనితీరుపై నిర్ణయించిన గ్రేడింగ్ విధానం నిరు పేదలకు కష్టాలను మిగుల్చుతోంది. వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బంది, అధికారులు తమ పనితీరు మెరుగ్గా ఉందని పెండింగ్ దరఖాస్తుల సంఖ్యను తక్కువ చేసి ఉన్నతాధికారులకు చూపిస్తున్నారు. సాంకేతిక సమస్యలు చూపి ప్రజల నుంచి వస్తున్న దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. ఇలాంటి తప్పుడు వివరాలతో కూడిన నివేదికను సోమవారం విజయవాడలో జరిగిన ముఖ్యమంత్రి సమావేశంలో జిల్లా ఉన్నతాధికారులు అందించారని ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు. అమల్లోకి గ్రేడింగ్ విధానం.. మూడు నెలల క్రితం ఉద్యోగులు, అధికారుల పనితీరును పరిశీలించి గ్రేడింగ్ ఇచ్చే విధానాన్ని జిల్లా యంత్రాంగం అమలులోకి తీసుకువచ్చింది. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిష్కరించడంలో జిల్లా వెనుకబడి ఉండడంతో ముఖ్యమంత్రి కార్యాలయం జిల్లాకు ‘సి’గ్రేడ్‌ను నిర్ణయించింది. ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది ఆన్లైన్లో ఆయా ప్రభుత్వశాఖల పనితీరును పరిశీలిస్తోంది. ప్రతినెలా ఆయా జిల్లాలకు గ్రేడింగ్ ఇవ్వడం ప్రారంభించారు. ఈ క్రమంలో జనవరి నెలలో సమస్యల పరిష్కారంపై పరిశీలన చేసిన ముఖ్యమంత్రి కార్యాలయం జిల్లాకు ‘సి’ గ్రేడ్ ఇచ్చింది. దీంతో జిల్లా యంత్రాంగం అందుకు కారణమైన 10 మంది ఎంఆర్ఓలకు మెమోలు ఇచ్చి, అక్షింతలు వేసింది. ఈ గ్రేడ్ల గండం నుంచి బయటపడేందుకు అడ్డదారిని ఆశ్రయించారు. జనవరి నెలలో మీసేవ ద్వారా వచ్చిన గడువు దాటిన దరఖాస్తులు 84 వేలు ఉంటే, ఒక్క నెలలోనే 15వేలు పరిష్కరించి 69 వేలకు చేరినట్లు చూపారు. జన్మభూమి, మీకోసం ద్వారా వచ్చి గడువు దాటిన దరఖాస్తులు ఒక నెలలోనే సుమారు 40 వేల వరకు పరిష్కరించినట్లు చూపారు. నాలుగు నెలలకు కూడా పరిష్కారం కానివి జనవరి నెలలోనే పరిష్కారం అయినట్టు అధికారులు చూపారు. అసలేం జరిగిందంటే.. గడువు దాటినవి, గడువులోపు ఉన్న దరఖాస్తులు జిల్లాలో సుమారు లక్షన్నరకు పైగా ఉన్నట్లు సమాచారం. ఈ గండం నుంచి బయటపడేందుకు జిల్లా వ్యాప్తంగా మీసేవ సెంటర్లలో వివిధ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను సర్వర్ పనిచేయడం లేదంటూ తీసుకోవడం లేదు. దీంతో దరఖాస్తుల సంఖ్య పెరగకుండా చేశారు. తీసుకున్న దరఖాస్తులను పరిష్కరించే క్రమంలో అవసరమైన డాక్యుమెంట్లు, ఇతర వివరాలు లేవంటూ వాటిని ఆన్లైన్ నుంచి తిరస్కరించారు. అలాగే సాంకేతిక ఇబ్బందులు చూపించి భవిష్యత్తులో పరిష్కరిస్తామంటూ రాజీమార్గంలో ఒప్పించి ఆన్లైన్ నుంచి తొలగించారు. మొత్తం మీద జనవరి నెలలో జిల్లాలో 90 శాతం తహశీల్దారు కార్యాలయాలు సి గ్రేడ్‌లో ఉండగా, ఫిబ్రవరి నాటికి 90 శాతం ఏ గ్రేడ్‌కు చేరినట్లు చూపించారు. సమస్యలను పరిష్కరించి ప్రజల ఇబ్బందులు తొలగించే అంశం పక్కన బెట్టి రికార్డు పరంగా సంఖ్యను తగ్గించుకోవడానికే అధికారులు శ్రద్ధ చూపిస్తున్నారు. ఈ విషయమై కలెక్టరేట్ పరిపాలనాధికారి ప్రసాద్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా, అటువంటి అక్రమ మార్గాలు అనుసరించే అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి
-ఏపీ నిరుద్యోగుల ఐక్యవేదిక డిమాండ్ ఒంగోలు టూటౌన్ : ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను వెంటనే భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఏపీ నిరుద్యోగుల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. ఏపీ నిరుద్యోగుల ఐక్యవేదిక జిల్లా కార్యాలయంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు పి. వంశీకృష్ణ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామిని నెరవేర్చడంలో నిర్లక్ష్యం వహించడం తగదన్నారు. అధికారంలోకి వచ్చి ఒకటిన్న సంవత్సరం దాటినా నేటికీ ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయకపోవడం నిరుద్యోగులను మోసం చేయడమేనని అన్నారు. మొత్తం 13 జిల్లాల్లో లక్షా 40 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. వీటిని భర్తీచేయడంలో సర్కార్ మీనమేషాలు లెక్కించడం తగదని సంఘం కార్యదర్శి ఎన్. గోవిందరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని కోరుతూ సోమవారం జిల్లా కేంద్రమైన ఒంగోలులో ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. జిల్లాలోని నిరుద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. -
పదేళ్లుగా ప్రభుత్వ శాఖతో పోరాటం!
-
చంద్రపాలన ఇకలోకల్
సీఎస్ ఆఫీస్‌గా కలెక్టర్ క్యాంపు కార్యాలయం మిగిలిన శాఖలూ నగరానికి.. కేబినెట్, ప్రభుత్వ శాఖల సమీక్షలు ఇక్కడే విజయవాడ బ్యూరో : అతి త్వరలో నగరం నుంచే పరిపాలన కార్యకలాపాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఉన్నత స్థాయి సమీక్షలు, కేబినెట్ సమావేశాలు, ప్రముఖులతో భేటీలు.. వీటన్నింటినీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడి నుంచే నిర్వహించనున్నారు. దీనికనుగుణంగా ప్రభుత్వంలోని కీలక యంత్రాంగం నగరంలో తాత్కాలిక కార్యాలయాలు ఏర్పాటుచేసుకుంటోంది. సూర్యారావుపేటలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు క్యాంప్ ఆఫీసుగా మారనుంది. గతంలోనే ఈ కార్యాలయాన్ని తన క్యాంపుగా మార్చుకుంటానని ప్రధాన కార్యదర్శి కలెక్టర్‌కు చెప్పడంతో ఆయన వేరే చోట క్యాంపు కార్యాలయాన్ని చూసుకుంటున్నారు. దీనిపై సోమవారం హైదరాబాద్‌లో నిర్ణయం జరగడంతో ప్రధాన కార్యదర్శి క్యాంపు కార్యాలయం ఏర్పాటుపై స్పష్టత వచ్చింది. వారంలో మూడు, నాలుగు రోజులు ఇక్కడే ఉంటానని ముఖ్యమంత్రి చాలాకాలం నుంచి చెబుతున్నారు. ఇందుకోసం జలవనరుల శాఖ ప్రాంగణంలో తన క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటుచేసుకుని తరచు నగరానికి వస్తూ అక్కడే సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇటీవల రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అందులోనే జరిగింది. ఈ కార్యాలయానికి అందుబాటులో ఉండే విధంగా సీఎస్ కృష్ణారావు సమీపంలోనే క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటుచేసుకుంటున్నారు. ఆయనతోపాటు పలువురు ముఖ్య కార్యదర్శులు, వివిధ శాఖల కమిషనర్లు సైతం నగరంలో క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసుకోనున్నారు. సీఎం క్యాంపు కార్యాలయం పక్కనే డీజీపీ క్యాంపు కార్యాలయం కూడా సిద్ధమైంది. రోజుల వ్యవధిలోనే ఈ కార్యాలయాల్లో అధికారులు, సిబ్బందిని నియమించి పనిచేయడానికి అనువుగా మార్చడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. సీఎంతోపాటు వీరంతా ఇక్కడే ఉండి పరిపాలన వ్యవహారాలు నిర్వహిస్తారు. తాత్కాలిక సచివాలయం? ముఖ్యమంత్రి, అత్యున్నత అధికార యంత్రాంగం ఇక్కడి నుంచే పనిచేస్తున్న నేపథ్యంలో తాత్కాలిక సచివాలయాన్ని కూడా నగరంలో ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కీలక సమావేశాలన్నీ ఇక్కడే జరిగినప్పుడు అందుకనుగుణంగా ఫైళ్లు క్లియర్ చేసేందుకు సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని తాత్కాలిక సచివాలయంగా మార్చే అవకాశం ఉందని అధికార వర్గాల ద్వారా తెలిసింది. కొన్ని సెక్షన్లను ఇక్కడకు తరలించాలనే యోచన ఉన్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదన ఇంకా చర్చల దశలోనే ఉందని దీనిపై ఇంకా నిర్ణయం జరగలేదని చెబుతున్నారు. అయితే ఇది సాధ్యమయ్యే పనికాదనే వాదనా వినిపిస్తోంది. కానీ ప్రొటోకాల్ విధులు, కీలక కార్యక్రమాలు నిర్వహించే సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) త్వరలోనే నగరంలో ఏర్పాటుకానుంది. సేట్ గెస్ట్‌హౌస్‌లో జీఏడీ క్యాంపు కార్యాలయం ఏర్పాటుకావడం దాదాపు ఖాయమైంది. పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో ఈ నెల 15 నఆర్టీసీ ఎండీ కార్యాలయం ప్రారంభం కానుంది. దీంతోపాటు కీలక శాఖలను గుంటూరు, విజయవాడకు తరలించడానికి ప్రభుత్వం ఏర్పాట్లుచేస్తున్న విషయం తెలిసిందే. తొలి విడత ఆరు నుంచి పది శాఖలు తరలివచ్చే అవకాశం ఉంది. ఇందుకవసరమైన ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం ఆఘమేఘాల మీద చేస్తోంది. అవసరమైన కార్యాలయాలు, వసతి గృహాలు అన్వేషిస్తోంది. ఈ నెలాఖరు నాటికి తాత్కాలిక పాలనా యంత్రాంగమంతా నగరంలో ఏర్పాటయ్యే అవకాశం ఉంది. -
ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు భర్తీ చేయాలి
- ఎమ్మెల్సీ యండపల్లి తిరుపతి అర్బన్: టీటీడీతో పాటు రాషంలోని అ న్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను త క్షణం భర్తీ చేయాలని ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డి డిమాండ్ చేశారు. శనివారం టీటీడీ ఏడీ బిల్డింగ్ వద్ద నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీటీడీలోని 5300 పోస్టుల భర్తీని వెంటనే చేపట్టే లా పాలకమండలి చర్యలు తీసుకోవాలన్నారు. టీటీడీలోని అన్ని విభాగాల్లో సుమారు 10 వేల ఖాళీలను భర్తీ చేయాల్సి ఉందన్నారు. సీఎం చం ద్రబాబు ఎన్నికల హామీల్లో ప్రకటించిన విధంగా నిరుద్యోగ భృతి చెల్లించాలన్నారు. టీటీడీలో కాం ట్రాక్టర్లకు, ఏజెన్సీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న విధానాన్ని రద్దు చేసి, పేదలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. సీఐటీయూ జిల్లా కా ర్యదర్శి కందారపు మురళి మాట్లాడుతూ బాబు వస్తే జాబు వస్తుందని ప్రకటించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆ దిశగా ఆలోచించకపోవ డం దారుణమన్నారు. జెఎస్పీ అధికార ప్రతినిధి నవీన్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ బాబుకు మాత్ర మే జాబ్వచ్చిందన్నారు. డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జయచంద్ర, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రవి తేజ, ఐద్వా జిల్లా కార్యదర్శి సాయిలక్ష్మి, యూటీఎఫ్ నేతలు మధుసూదన, నిర్మల, సీఐటీ యూ నగర కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. -
కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలపై పోరాటం
ఏపీఎస్జీవోఈఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు విజయవాడ : వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తామని ఏపీ గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (ఏపీఎస్జీవోఈఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు ఏవీ నాగేశ్వరరావు హెచ్చరించారు. స్థానిక రాఘవయ్య పార్కు సమీపంలోని యూటీఎఫ్ హాలులో జిల్లా కాంట్రాక్టు ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆదివారం నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, పీఆర్సీ ఇవ్వాలని కోరుతూ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ఈనెల 29న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల వద్ద ధర్నా చేస్తున్నామని పేర్కొన్నారు. ఆగస్టు వరకు దశల వారీగా ఆందోళనలు కొనసాగిస్తామన్నారు. ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నియమించిన కమిటీ జిల్లాలో కేవలం 442 మంది కార్మికులే ఉన్నారని పేర్కొందని తెలిపారు. అన్ని శాఖల్లో కాంట్రాక్టు కార్మికులను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇ.విజయ్‌కుమార్ మాట్లాడుతూ జిల్లాలో అన్ని ప్రభుత్వ శాఖల్లో 15వేల మంది కాంట్రాక్టు సిబ్బంది ఉన్నారని తెలిపారు. రాజకీయ కారణాలతో కొన్ని శాఖల్లో కార్మికులను తొలగిస్తున్నారని ఆరోపించారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో సిబ్బందిని ఫెడరేషన్‌గా ఏర్పాటు చేసి, వారికి న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు. ఈ సదస్సులో ఫెడరేషన్ నాయకులు నాంచారయ్య, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
అవినీతికి అంతేలేదు..
ఉదయగిరి: జిల్లాలో అవినీతికి అడ్డూఅదుపు లేకుండా పోయింది. ముఖ్యంగా రెవెన్యూ, రిజిస్ట్రేషన్లలో అంతే లేదు. తీవ్ర ఆరోపణలు, కచ్చితమైన సమాచారమిస్తే తప్ప వారంతట వారు వివిధ ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్న అవినీతి బాగోతంపై ఏసీబీ దృష్టిపెట్టడం లేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత మండలాలపై ఈ శాఖ దృష్టిసారించకపోవడంతో అక్కడ అవినీతి అధికారులతో కార్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వర్ణణాతీతం. అవినీతి శాఖ అధికారులు అడపాదడపా దాడులు చేసి కిందిస్థాయి సిబ్బందిని పట్టుకుంటున్నప్పటికీ, పైస్థాయి అధికారులపై దృష్టిపెట్టడం లేదు. ఉదయగిరి చరిత్రలో లేనివిధంగా బుధవారం రాత్రి ఉదయగిరి సబ్‌రిజిస్ట్రార్ శ్రీరామమూర్తిని దారికాచి ఏసీబీ అధికారులు దుత్తలూరు వద్ద పట్టుకొని పెద్ద మొత్తంలో సొమ్ము స్వాధీనం చేసుకోవడం సంచలనం సృష్టించింది. ఈప్రాంతంలో కొందరు అవినీ తి అధికారులు జనాలను పీల్చి పిప్పిచేస్తున్నప్పటికీ ఏసీబీ అధికారులు ఆవైపు కన్నెత్తిచూడటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సబ్‌రిజిస్ట్రార్ విషయంలో కూడా ఓ భూమి లావాదేవీలకు సంబంధించి గుంటూరుకు చెందిన ఓ పోలీసు అధికారి ఉండటంతో ఆయన ఒత్తిడి మేరకు ఏసీబీ అధికారులు దాడిచేసి పట్టుకున్నారనే ఆరోపణలున్నాయి. కొనసాగుతున్న అవినీతి జిల్లాలో వివిధ శాఖల్లో అవినీతి రాజ్యమేలుతోంది. 2012లో 127 అవినీతి కేసులు నమోదుకాగా, 2013లో 8 కేసులు, 2014లో 11 కేసులు మాత్రమే నమోదుకావడం చూస్తే ఈ శాఖ పనితీరు స్పష్టంగా అర్ధమవుతోంది. అంటే అవినీతి జరగక కేసులు నమోదుకావడం లేదా, లేక అవినీతిపై ఏసీబీ దృష్టిపెట్టడం లేదా అనే విషయం ప్రశ్నార్థకంగా మారింది. ఏసీబీ డీఎస్పీగా జె.భాస్కరరావు ఉన్న సమయంలో జిల్లాలో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి. ఆయన పలు సంచలనాత్మక కేసులను నమోదుచేశారు. ఆయన బదిలీతో ఆశాఖ ఈ పరిస్థితి నత్తను తలపిస్తోంది. ప్రస్తుతం జిల్లాలో డీఎస్పీ పోస్టు ఖాళీగావుంది. ప్రకాశం జిల్లా ఒంగోలు డీఎస్సీ డివిఎన్ మూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ముగ్గురు సీఐ లు ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్లు, పదిమంది కానిస్టేబుళ్లు ప్రస్తుతం పనిచేస్తున్నారు. గతం లో వలపన్ని రెడ్‌హ్యాండెడ్‌గా పెద్ద చేపలను పట్టిన ఏసీబీ ఇప్పుడు నిద్రావస్థలో ఉండటానికి కారణమేమిటో అంతుచిక్కడం లేదు. ఇప్పటికైనా నిద్రమత్తు వదిలేనా? ప్రస్తుతం జిల్లాలో అన్ని శాఖల్లో అవినీతి విలయతాండవం చేస్తోంది. చిన్న పనికి కూ డా పెద్ద మొత్తంలో అప్పజెప్పందే పని కావ డం లేదు. దీంతో లంచం ఇచ్చుకోలేని అనేకమంది పేదవారు కార్యాలయాల చుట్టూ తిరిగి వేసారి మిన్నకుండిపోతున్నారు. మరి కొంతమంది జిల్లా అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ముఖ్యంగా నీటిపారుదల, రెవెన్యూ శాఖ, పోలీసు శాఖల్లో చేయి తడపందే పనికావడం లేదని విమర్శలు పెద్దఎత్తున వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఉదయగిరి నియోజకవర్గంలోని పలు మండలాలలో రెవెన్యూ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున లంచాలు గుంజుతున్నారన్న విషయం బహిరంగ రహస్యమే. దుత్తలూరు, కొండాపురం, కలిగిరి, జలదంకి రెవెన్యూకార్యాలయాల్లో కూడా చేయి తడపందే పనులు కావడం లేదని ప్రజలు బోరుమంటున్నారు. పట్టాదార్ పాస్‌పుస్తకం నుంచి అడంగళ్‌లో పేరు నమోదు వరకు పెద్ద మొత్తంలో డిమాండ్ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నెల్లూరు నగరపాలక సంస్థతో పాటు ఆత్మకూరు, గూడూరు, కావలి మున్సిపాలిటీల్లో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందనే విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ఉలిక్కిపడ్డ ఉదయగిరి ఉదయగిరి సబ్‌రిజిస్ట్రారు బుధవారం రాత్రి ఏసీబీకి పట్టుబడడంతో ఈ ప్రాంతంలో అధికారులు ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. గురువా రం నియోజకవర్గంలోని పలు కార్యాలయా ల్లో ఈ విషయం కలకలం సృష్టించింది. అనేకమంది అధికారులు, సిబ్బంది ముడుపుల విషయంలో జాగ్రత్తపడ్డారు. -
‘ఉత్తములు’ వీరే..
హన్మకొండ అర్బన్ : గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలోని పలు ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉత్తమ ఉద్యోగులను ఎంపిక చేశారు. హన్మకొండలోని పోలీస్‌పరేడ్ గ్రౌండ్లో సోమవారం నిర్వహించనున్న కార్యక్రమంలో వీరికి కలెక్టర్ వాకాటి కరుణ ప్రశంసపత్రాలు అందజేయనున్నారు. ఈ మేరకు ఉత్తమ ఉద్యోగుల జాబితాను ఆదివారం రాత్రి కలెక్టర్ విడుదల చేశారు. అర్బన్ పోలీస్ : ఎం.యాదయ్య(అదనపు ఎస్పీ), పి.శోభన్‌కుమార్(డీఎస్పీ, హన్మకొండ), రవీందర్రావు(సీఎస్బీ డీఎస్పీ), దేవేందర్‌రెడ్డి(కేయూ సీఐ), పి.కిషన్(సీఐ, ఘన్పూర్), ఎ.విద్యాసాగర్(సీఐ, సీఎస్బీ), బి.రవిచంద్ర(సీఐ, హసన్‌పర్తి), పి.డేవిడ్‌రాజ్(సీఐ, మడికొండ), ఎల్.ఆదినారాయణ(సీఐ, సీసీఎస్), వి.కిరణ్‌కుమార్(సీఐ, హన్మకొండ), పి.మోజెస్(సీఐ, వర్ధన్నపేట), ఎన్.శ్రీనివాస్(సూపరింటెండెంట్), వి.కల్పన(సూపరింటెండెంట్), ఎం. కోటేశ్వర్రావు(మట్టెవాడ ఎస్సై), ఎండీ.మహమూద్‌అలీ(ఎస్సై , డీసీఆర్బీ), పి.ప్రవీణ్(ఎస్సై,కమ్యూనికేషన్), ఎన్.సోమయ్య(ఎస్సై, సీఎస్బీ), వి.క్రాంతికుమార్(ఎస్సై, ఆత్మకూ రు), వై.కనకయ్య(ఎస్సై, హన్మకొండ ట్రాఫి క్), ఎ.ప్రవీణ్‌కుమార్(సంగెం ఎస్సై), ఐ. చం ద్రశేఖర్‌రెడ్డి(ఆర్ఎస్సై), ఎం.సంపత్‌కుమార్(ఆర్ఎస్సై), పి.ఉపేందర్‌రావు(ఏఎస్సై, హసన్‌పర్తి), వి.దేవేందర్‌రెడ్డి(ఏఎస్సై, సీఎస్బీ), పి.సూర్యకుమార్(ఏఎస్సై , సుబేదారి), వి.సదానందం(ఏఎస్సై , డీసీఆర్బీ), బి.మహేందర్‌రెడ్డి(కాజీపేట ట్రాఫిక్), జి.నర్సయ్య(హెచ్‌సీ), పి.బాలరాజు(హెచ్‌సీ), ఎల్ ప్రభాకర్‌రావు(హెచ్‌సీ), ఎస్డీ జకీర్ హుస్సేన్(హెచ్‌సీ), డి.సదయ్య(హెచ్‌సీ), సీహెచ్.సుధీర్(హెచ్‌సీ), ఎం.యాదగిరి(హెచ్‌సీ), జి.నారాయణదాసు(హెచ్‌సీ), కె.పరమేశ్వరి(హెచ్‌సీ), ఎస్.ఇమ్మానియేల్(హెచ్‌సీ), పి.కొమురయ్య(హెచ్ సీ), వి.వేణుగోపాల్‌రెడ్డి(హెచ్‌సీ), యాదగిరిరెడ్డి(హెచ్‌సీ). పీసీలు : జె.మధుసూదన్, ఎండి.యాకుబ్‌ఖాన్, సీహెచ్.కుమారస్వామి, ఎండి.సాల్మన్పాషా, ఎండి.ఉస్మాన్, కె.వంశీకృష్ణ, కె.శ్యాంసుందర్, కె.శ్రీనివాస్, కె.రమణయ్య, బానోతు శ్రీకాం త్, ఇ.హరిప్రసాద్, ఎండీ అన్వర్, హెచ్.పర్సునాయక్, జి.మహేందర్, జె.మహేందర్, పి.యుగంధర్, పి.ప్రభాకర్, పి.కృష్ణ, ఎల్.రాజు, ఎండి.యూసుఫ్, కె.శ్రీనివాస్, ఎండి.మహబూబ్‌బేగ్, ఎం.సుమన్, వి.ఎల్లయ్య, ఎండి.మహ్మద్పాష, ఎం.కుమారస్వామి, ఎం.రాజు, ఎం.మహేశ్వర్ రూరల్ పోలీస్ : ఎస్.జాన్‌వెస్లీ(ఏఎస్పీ), పి.సంజీవరావు(ఎస్డీపీఓ, పరకాల), కె.సురేందర్(ఎస్డీపీఓ, జనగామ), బి.నందిరాంనాయక్(మహబూబాద్టౌన్ సీఐ), బి.తిరుపతి(పాలకుర్తి సీఐ), ఎస్పీ.రవీందర్(చిట్యాల సీఐ), ఎండీ శాహిర్అలీ(మహిళా స్టేషన్ సీఐ), ఎన్ఎస్ మోహన్‌రాజ్(ఎస్బీ సీఐ), ఐ.రాగ్యానాయక్(డీటీసీ సీఐ), ఎం.కరుణాకర్(జనగామ ఎస్సై), వై.సత్యనారాయణ(రఘునాథపల్లి ఎస్సై), ఎస్.రవీందర్(చేర్యాల ఎస్సై), కె.సుధాకర్(ఏఎస్సై), జె.మొగిళి(ఏఎస్సై), ఆర్.రాజిరెడ్డి (ఏఎస్సై), బి.రమేష్(హెచ్‌సీ), బి.వేణుగోపాల్ (పీసీ), జి.రంజిత్‌కుమార్(హెచ్‌సీ), బి.కుమారస్వామి(హెచ్‌సీ, జనగామ), ఎం.ఈశ్వరయ్య (హెచ్‌సీ, పాలకుర్తి), పి.వెంకటేశ్వర్రావు(హెచ్‌సీ, నర్మెట), వి.సారయ్య(హెచ్‌సీ, చేర్యాల), జి.నర్సయ్య(పీసీ, బచ్చన్నపేట), సీహెచ్.మిథున్(ఎస్సై, నెక్కొండ), పి.శ్రీవందనం(ఏఎస్సై నర్సంపే ట), పి.లక్ష్మణమూర్తి(హెచ్‌సీ, నల్లబెల్లి), ఎం.మల్లేశం(పీసీ చెన్నారావుపేట), వి.అశోక్(పీసీ, ఖానాపూర్), బి.రమేష్(పీసీ, కొత్తగూడ), ఎస్.సాంబమూర్తి(ఎస్సై తాడ్వాయి), కె.సునీల్(పీసీ, ములుగు), కె.వెంకటేశ్వర్రావు(చిట్యాల ఎస్సై), జి.నరేష్(భూపాలపల్లి ఎస్సై), సీహెచ్.సత్యనారాయణ(చిట్యాల ఎస్సై), ఎస్.డేవిడ్ (ఏఎస్సై పరకాల), ఎం.చెన్నకేశవులు(హెచ్‌సీ, మొగుళ్లపల్లి), కె.రాజు(పీసీ శాయంపేట), ఎం.వీరన్న(పీసీ, రేగొండ), ఎం.ప్రభాకర్(పీసీ, భూపాలపల్లి), ఇ.మధుకర్(ఎస్సై , ఖానాపూర్), జి.సత్యనారాయణ(హెచ్‌సీ మరిపెడ), డి.మనోహర్‌స్వామి(హెచ్‌సీ,మహబూబాబాద్), కె.రమేష్(డోర్నకల్), ఎ.రాజనరేందర్(పీసీ, కేసముద్రం), హెచ్.దేవ్‌సింగ్(పీసీ, మహబాద్), ఎం.రుద్రయ్య(పీసీ, డోర్నకల్), డి.దయాసాగర్(పీసీ, తొర్రూర్), వి.సువర్ణ(హెచ్‌సీ), టి.వివేకానంద్(పీసీ ఐటీ కోర్‌టీం), డి.శ్రీనివాస్(ఏఎస్సై , నర్సంపేట), జి.ఆంజనేయులు(హెచ్‌సీ,జనగామ), సీహెచ్.రాజయ్య(హెచ్‌సీ), బి.వెంక్యా(హెచ్‌సీ), ఇ.జయపాల్‌రెడ్డి(హెచ్‌సీ), జాన్‌విల్సన్(పీసీ), ఎండి.పాషా(పీసీ), బి.వెంకటేశ్వర్లు(పీసీ), జె.రమేష్(పీసీ), ఎ.శ్రీనివాస్(పీసీ), బి.శ్రీను(పీసీ)ఎం.మల్లేష్(ఆర్ఎస్సై), ఎంఏ(ఖయ్యూం ఆర్ఎస్సై), ఎం.అంజయ్య(ఏఆర్ఎస్సై), ఎ.బాబురావు(హెచ్‌సీ), అబ్దుల్ ఖదీర్(పీసీ), డీవీ పని(ఏఎస్సై, సీహెచ్.రవీందర్ప్రసాద్యాదవ్(ఏఆర్ హెచ్‌సీ), కె.రాంచందర్(పీసీ), ఎం.జితేందర్(ఏఆర్పీసీ), ఎస్.సత్యనారాయణ(హెచ్‌సీ), జి.శంకర్లింగం(హెచ్‌సీ), బి.అశోక్(పీసీ), బి.శయశంకర్(పీసీ), ఎన్.చైతన్యచందర్(ఎస్సై డీసీఆర్బీ), పి.చంద్రయ్య(ఎస్సై, డీసీఆర్బీ), ఎం.విజయ్‌కుమార్(పీసీ), ఎ.లింగయ్య(పీసీ), సయ్యద్‌గౌస్(సీసీఎస్ ఎస్సై), ఎం.సంజీవరెడ్డి(హెచ్‌సీ), సీహెచ్.వేణుగోపాల్(పీసీ), ఎం.ఏ.జలీల్(ఏఆర్ఎస్సై), ఆర్.రత్నాకర్‌రావు(ఏఎస్సై), ఎం.డేవిడ్‌రాజ్(సీనియర్ అసిస్టెంట్), సఫియా సుల్తానా(సీనియ ర్ అసిస్టెంట్), అనిసాభేగం(సీనియర్ అసిస్టెంట్), ఎంఏ.అలీం(జూ.అ), కె.ప్రశాంతి(జూ.అ), ఈశ్వర్గడ్(జూ.అ), సంతోష్‌కుమార్(జూ.అ), ఎన్.లక్ష్మి(అటెండర్), పి.శోభారాాణి(డబ్ల్యూహెచ్‌సీ), జి.సురేష్‌కుమార్(డాక్టర్),రమాదేవి(సూపరింటెండెంట్) పీసీలు : డి.శ్రీనివాస్, ఎం.రంజిత్, కె.కౌశల్‌కుమార్, ఎండి.ఫహిమోద్దిన్, కె.ఉప్పలయ్య, టి.ఉదయ్‌కుమార్, జి.రామారావు, ఎం.అంజయ్య, బి.రవి, ఎ.రాజేందర్, పి.శ్రీనివాస్, పి.విజయ్‌కుమార్, జి.మహేందర్, జి.శ్రీనివాస్. హెడ్ గార్డులు : జి.ప్రదీప్‌కుమార్, వి.రాంబాబు, ఎస్.రమేష్, ఎస్.రాజశేఖర్, ఎండీ సదత్, ఎస్.సతీష్, ఎం.విజేందర్, ఎస్.సత్యనారాయణ, యుగంధర్, వి.మొగిలయ్య, కె.నరేష్, వి.కుమార్, ఎం.రామస్వామి, యాకుబ్‌పాషా, సీహెచ్.మాధవ్‌కుమార్, సీహెచ్.బాలరాజు, కె.శ్రీ కాంత్, కె.సారంగపాణి, పి.శ్రీనివాస్‌రెడ్డి, పి.ఎర్రయ్య, వి.సంపత్‌కుమార్, ఎల్లగౌడ్, ఎ.భాస్కర్, వెంకట్‌నారాయణ, ఎండి.అంజద్, ఎండి.రఫిక్, శ్యాం, ఎస్.రాజశేఖర్, ఎన్.సాగర్. ఇంటెలిజెన్స్ విభాగం : పి.తిరుమల్(జోనల్ ఇన్స్పెక్టర్), జి.సంపత్‌రావు(ఎస్సై), ఎన్.శ్రీనివాస్(పీసీ), ఆర్.గోపాల్‌రెడ్డి(హెచ్‌సీ) పోలీసు ట్రైనింగ్ కాలేజీ : ఎస్కే.ముజాయిద్ అలీ(పీసీ), కె.తిరుపతి(రి.అ), పి.బాబుప్రసాద్(ఎంన్‌ఓ) జిల్లా అధికారులు: వీఎన్.సురేందర్‌కరణ్(డీఆర్ఓ), ఎం.బాలాదాస్(ఏడీ మైన్స్), ఎం.శివాజి(టూరిజం అధికారి), డాక్టర్ ఎం.విజయ్‌కుమార్(ఆర్జేడీ ఆయుష్), డాక్టర్ కె.మనోహర్(ఎంజీఎం సూపరింటెండెంట్), జె.సుధాకర్‌రావు(జేడీ, సెరికల్చర్), టి.రాము(డీఆర్డీఏ పీడీ), కె.ప్రసాద్‌రావు(పీడీ మెప్మా), రామారావు(డీఎం సివిల్‌సప్లయ్), ఎం.వెంకటమాధవరావు(వరంగల్ ఆర్డీఓ), అగ్నిమాపక శాఖలో బి.నాగేశ్వర్రావు(ఫైర్ ఆఫీసర్, పరకాల), పి.సురేందర్(డ్రైవర్), పి.కృష్ణకుమార్(ఫైర్‌మెన్), అటవీ శాఖ నార్త్‌లో జి.సారయ్య(ఎఫ్ఆర్ఓ, మహబాద్), ఎన్.రాజేందర్(డీఆర్ఓ మహబాద్), కె.రాధిక(టీఏ), ఆర్.గణేష్(ఎఫ్ఆర్ఓ, జనగామ), బి.సతీష్(ఎస్ఓ ములుగు), ఎల్.అరుణ(ఎస్ఓ, జనగామ), నార్త్ డివిజన్లో ఎ.రమేష్(ఎఫ్ఆర్ఓ, తాడ్వాయి) హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్స్: ఎస్.రాజేశ్వర్‌రావు(ఏడీఓ), హార్టికల్చర్‌లో వి.ఐలయ్య(హెచ్ఓ) హెల్త్ డిపార్ట్మెంట్ : ఎ.స్వరాజ్యలక్ష్మి(ఫార్మసిస్టు, సీకేఎం), ఎంజీఎంలో డాక్టర్ అనిల్ బాలరాజ్, పి.అరుణ్‌రాజ్(సూపరింటెండెంట్), ఎన్.సువర్ణ(హెచ్ఎన్), కె.హేమంత్‌కుమార్(డీసీఎస్), ఎస్.మల్లయ్య(ఫార్మసీ) ఆయుర్వేదిక్ ఆస్పత్రి :నిర్మల(స్టాఫ్‌నర్సు), వెంకటనర్సయ్య కేఎంసీ : డాక్టర్ ఎస్.రవీందర్, కె.కుమారస్వామి(డ్రైవర్), జి.రవీందర్(ఫార్మసిస్టు) డీఎంహెచ్ఓ కార్యాలయం : ఎస్.శ్రీనివాస్(హెచ్ఈఓ), డాక్టర్ సీహెచ్.వెంకటరమణ(ఈఎన్టీ), ఎ.చందునాయక్ (ఆర్థో), ఎ.లక్ష్మి(ఓఎస్), బి.వీరిన్(పీఎస్, జీఎంహెచ్‌లో పి.కళావతి(హెచ్వీ), ఇ.బాబు(ఎస్ఐ) జోనల్ మలేరియా ఆఫీస్ : పి.పలినాకుమార్(ఎస్ఏ), ఎస్కే.హసనోద్దిన్(ఎంపీహెచ్), ఆయష్ ఆర్డీడీలో డాక్టర్ వి.సత్యనారాయణ(ఎంఓ), టీ.ఎల్లగౌడ్(కంటి ఆస్పత్రి), డాక్టర్ హరిదేవ్కుమార్, డి.రాజ్యలక్ష్మి(స్టాఫ్ నర్సు) ఇరిగేషన్ : పి.శివప్రసాద్ (సి.అ), గౌసియా భేగం(ఓఎస్ ఓ), బి.వెంకటేశ్వర్లు(ఏపీడీ), కె.అమ్రాపలి(ఏఈఈ), టి.నవీన్‌కుమార్(టీఏ), జి.గౌరిలక్ష్మి(ఏఈఈ), ఎస్.శ్రీనివాస్(జేటీఓ), కె.శ్రీనివాస్(సీ.అ), సి.రవిప్రసాద్ (టైపిస్టు), బి. రాంమోహన్(ఈఈ), రవీందర్‌రెడ్డి(సూపరింటెండెంట్), ఎండీ.దస్తగిరి(డీఈఈ) సమాచార శాఖ : ప్రభాకర్, బి.శ్రీధర్(ిసీ.అ), దేవిప్రసాద్ ఐటీడీఏ ఏటూరునాగారం : బి.రాజేంద్రప్రసాద్(ఏపీడీ), బి.పుల్లయ్య(ఏఈ), ఎన్.మహేష్(పీఓసీసీ), జి.విజయ్(ఆర్ఐ), కె.చంద్రశేఖర్(జూ.అ) పీఆర్ సర్కిల్ (వరంగల్) : కె.ప్రసన్నకుమార్(డీఈఈ), ఆర్.వెంకటేశ్వర్రావు(డీఈఈ), ఎస్.సత్యనారాయణ(ఏఈఈ), ఎండీ.మసూద్ అలీ(ఏఈ), వి.ధర్మేందర్రావు(ఏఈ), వైవీ.కృష్ణారావు(డీఈ), సీహెచ్.కృష్ణారెడ్డి(జేపీఓ) ఆర్డబ్ల్యూఎస్ : ఎన్.సుభాషన్‌రెడ్డి(డీఈఈ), పి.కిషన్(ఏఈ), ఎం.అంజ(ఏఈ), జె.శ్రీనివాస్(ఏఈఈ), సర్వ శిక్ష అభియాన్ : జీవీ రామచంద్రమౌళి (డీఈఈ), యు.కుమార్క్రాంతి(సీ.అ), సెట్వార్లో చింతల రాజేందర్(అటెండర్), ఎస్సీ కార్పొరేషన్లో జె.జయరాజ్(జు.అ), సెరికల్చర్‌లో కె.వెంకటేశ్వర్లు(ఏఓ), ఎ.రాజు(జూ.అ), సర్వే ల్యాండ్ రికార్డ్స్ : అబ్దుల్ హై(సూపరింటిండెంట్), ఆర్.రమేష్‌బాబు(సీడీ), షేక్మాన్సుర్ అలి(చైన్‌మెన్) దళిత సంక్షేమ శాఖ : జె.రమాదేవి(ఏఎస్డబ్ల్యూఓ),ఎన్.వరలక్ష్మి(సూపరింటెండెంట్), కె.కృష్ణ(అటెండర్) డీటీసీ : పి.రంగారావు(ఎంవీఐ, మహబాద్), జి.వేణుగోపాల్(ఏఎంవీఐ), ఎండీ.దస్తగిరి(జూ.అ) ఆర్టీసీ : ఇ.యాదగిరి(ఆర్ఎం), జె.సుగుణాకర్(డీఎం వరంగల్ -1), ఎం.సరస్వతి(సూపరింటెండెంట్), కె.శ్రీనివాస్(మెకానిక్), కె.వనిత(కండక్టర్), కెఎస్.నారాయణ(డ్రైవర్) ఎన్పీడీసీఎల్ : పి.శ్రీకాంత్(డీఈ), ఎం.మధుసూధన్(ఏఈ), కె.సాంబమూర్తి(ఎల్ఐ), టీఎస్ఎంఐపీలో జె.జనార్దన్(సూపరింటెండెంట్) నగర పాలక సంస్థ : అబ్దుల్ రహమాన్(ఎస్ఈ), పి.శాం తికుమార్(టీఓ), జి.రాజు(సూపరింటిడెంట్), ఎండి.సమద్(జు.అ), శేఖర్(డ్రైవర్), ప్రభావతి(జవాన్) సేవా రంగం : ఎస్.సుజాత (అతిథి మనోవికాస), రడపాక పద్మశ్రీ (అతిథి మనోవికాస),ఎం.సోమయ్య(ఎన్ఎస్), కె.స్వరూపరాణి(వైద్యసేవలు), ఎండీ.మహబూబ్అలీ(కరా టే కోచ్), బాల వెంకటేశం( స్వచ్ఛంద సేవ), ఎన్.రమణాచారి(గోపాలమిత్ర), జి.నరేష్(సేవా యూత్), మిరి యాల గణేష్‌కుమార్ (రేడియో), ఎండీ.సాధిక్ అలీ(ఆర్టీఐ), అచ్చ తైశిక్వర్మ(వెలుగు ఆర్గనైజేషన్), ఎంఏ.వహీద్ గుల్షన్(జర్నలిస్టు), కుసుమ దయాసాగర్(లయన్స్ క్లబ్), సీహెచ్.సంతోష్(స్పందన), కె.కళ్యాణి(స్పందన), గడ్డం కేశవమూర్తి(జర్నలిస్టు), పి.సత్యనారాయణ(జవహర్ నవోదయ), బోల్ల సుజాత(ఓరుగల్లు మహిళా మండలి), ప్రొఫెసర్ దేవ ప్రతాప్(ఇన్టాక్), జె.శ్రీధర్‌రావు(హెరిటేజ్), ఎన్.సువిధ(స్టాఫ్ నర్సు, రెడ్ క్రాస్), జగదీశ్వర్ ఎల్టీ (రెడ్ క్రాస్) డీఎంహెచ్ఓ : 108లో ఓ.భాస్కర్, కె.రాజేష్, ఎం.మల్లయ్య, ఆర్.రాజు, స్టేట్ అవార్డు ఎ.కార్తిక్(ఎలక్షన్) వ్యవసాయశాఖ : ఎం.లక్ష్మీనారాయణ (ఏడీ, మహబాద్), ఎస్.కృష్ణారెడ్డి(ఏడీ, వరంగల్), గౌస్ హైదర్ (ఏడీ, మరిపెడ), ఎం.సంతోష్ (ఏఓ, ములుగు), ఎం.శ్రీధర్(ఏఓ), పి.మాధవి(ఏఓ, శాయంపేట), ఎన్.అంజనీ(ఏఓ మద్దూర్), జి.సునీల్‌కుమార్(సి.అ), రజిత(ఏఈఓ ధర్మసాగర్), బి.జగదీశ్(ఏఈఓ), ఉమర్ అహ్మద్ (అటెండర్), బి.జగదీశ్వర్(ఏఈఓ) వ్యవసాయ మార్కెట్ : సీహెచ్.కృష్ణయ్య(సూపర్వైజర్, కేసముద్రం), డాక్టర్ వెంకన్న(సైంటిస్టు), ఎస్వీ.భాస్కర్(సీ.అ), ఎం.శ్రీనివాస్ (ఏఈఓ) పశు సంవర్థకశాఖ : డాక్టర్ కె.గోపాల్‌రావు(ఏడీ, వరంగల్), డాక్టర్ పరంజ్యోతిబాబు(ఏడీ, గూడూరు), డాక్టర్ ఎన్.రణధీర్‌రెడ్డి(వీఏఎస్ వేలేరు), పి.రాజయ్య, ఆర్.రామానుజం(డ్రైవర్), డాక్టర్ తిరుపతి, ఎన్.రమణాచారి(గోపాలమిత్ర), సీహెచ్.సాయిలు(గోపాలమిత్ర) ఆయుర్వేద కళాశాల : ఫిలిప్ ఆనంద్‌కుమార్ (ప్రిన్సిపాల్), బీసీ వెల్ఫేర్ : జి.రమాదేవి(వార్డెన్, జనగామ) జిల్లా పరిషత్ : పి.బాలకృష్ణ (ఎంపీడీఓ, జనగామ), ఇ.మోహనకృష్ణ(ఎంపీడీఓ, రాయపర్తి), ఎ.సుదర్శన్(ఎంపీడీఓ, మరిపెడ), ఎ.సుదర్శన్ (ఎంపీడీఓ, మంగపేట), కె.శ్రీనివాస్‌రెడ్డి(సూపరింటెండెంట్, చెన్నారావుపేట), పి.సారంగపాణి (సూ., గూడూరు), ఎ.వెంకటస్వామి, ఎస్.విజయశ్రీ (సూ. జెడ్పీ), సయ్యద్ రసూల్(సీ.అ, మరిపెడ), ఇ.నాగభూషణం, బి.శ్రీను (సీ.అ, గూడూరు), బి.శ్రీను( సీ.అ, ములుగు), ఎన్.రవీందర్ (జూ.అ, జెడ్పీఎస్ఎస్, జంగాలపల్లి), ఎం.సోమనర్సయ్య(జూ.అ, జెడ్పీ), జి.రామలింగయ్య(టైపిస్టు, భూపాలపల్లి), ఐలయ్య (టైపిస్టు, గీసుకొండ), ఎండీ.యాకుబ్జాని(రి.అ), ఇ.రాధమ్మ (ఆఫీస్ సబార్డినేట్), ఎస్కే.మాషుక్(ఎంపీపీ, వర్ధన్నపేట), వి.కిషన్(డీఓ), వి.యెలిషా(ఏఎస్ఓ), సాంబయ్య (ఏఎస్ఓ). కేంద్ర కారాగారం : సీహెచ్.సత్తయ్య, ఎం.సుధాకర్‌రెడ్డి, పి.ప్రకాశం, పి.రమాదేవి, ఎం.రవీందర్, ఆర్.రాజేశం. డ్వామా : సీహెచ్.హన్మంతరావు (ఏపీడీ, వర్ధన్నపేట), ఎంఏ.ఖలీద్ (ఏఓ) డీఆర్డీఏ : వసుమతి (ఎంపీడీఓ, తాడ్వాయి), శ్యాంసుందరమూర్తి(ఎంపీడీఓ, మరిపెడ), బి.సరిత(ఎంపీడీఓ, రఘునాథపల్లి), వల్స తిరుపతి(ఏపీఓ, పెన్షన్స్) జిల్లా పరిశ్రమల శాఖ : వి.వీరేశం(ఏడీ), ఎ.కోటేశ్వర్రావు(జు.అ), బి.వెంకటేశ్వర్లు(అటెండర్) డీపీఓ ఆఫీస్ : కె.నారాయణ్‌రెడ్డి(ఈఓపీఆర్డీ, జఫర్‌గఢ్), ప్రభాకర్(బీసీ, కేసముద్రం), రాజేంద్రం(డీఎల్పీఓ, వరంగల్),ఎన్ఐసీ(అప్పిరెడ్డి, ఏఈడీఐఓ), శ్రీధర్(ఈడీఎం) కో ఆపరేటివ్ ఆఫీస్ : జె.సత్యానందం(సీ.అ), కె.జయప్రద(చైన్‌మెన్), జి.లచ్చయ్య(ఏఆర్) డైరీ డెవలప్మెంట్ : పీఆర్.కృష్ణస్వామి(డీడీ) అంధుల పాఠశాల : డాక్టర్ అపర్ణారెడ్డి(సర్జన్), ఎ.తిరుపతి(అఫ్తాలమిక్ ఆఫీసర్) గిరిజన సంక్షేమశాఖ : జ్యోతి(జూలైవాడ వార్డెన్), వి.సారంగపాణి(జూ.అ) ప్రొహిబిషన్, ఎక్సైజ్ : జి.దేవేందర్‌రావు(సీఐ), పి.వీరభద్రరావు(ఎస్సై , జనగామ), వి.మంజులత(సీ.అ), పి.సురేష్(పీసీ), కె.బాబురావు(ఎస్ఓ), కె.సంధ్య(జూ.అ), సి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి(సీఐ, ఏటూరునాగారం), చంద్రమోహన్(సీఐ, తొర్రూర్), రవికుమార్ (ఎస్సై, మహబూబాబాద్), వెంకటేశ్వర్లు(హెచ్‌సీ, గూడూరు), రాజ్‌మోహన్‌రెడ్డి(పీసీ, మహబూబాబాద్), బాలకృష్ణ(పీసీ, పరకాల), సురేష్(పీసీ, నర్సంపేట), మహేంద్రనాథ్(జూ.అ), ఆర్.మహిపాల్‌రెడ్డి (సూపరింటెండెంట్), టి.మల్లేశం(హెచ్‌సీ), ఎన్.రాజ్‌కిరణ్(పీసీ) -
అయినా సరే... టెండర్లకే మొగ్గు
చిత్తూరు(ఎడ్యుకేషన్): ఉద్యోగ భద్రత కోసం పక్షం రోజులుగా దీక్షలు చేస్తున్న పంచాయతీ కార్మికుల కడుపు కొట్టడానికి రంగం సిద్ధమైం ది. ఇప్పటికే దాదాపు అన్ని ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు ఉద్యోగుల్ని తొలగించిన ప్రభుత్వం ఇప్పుడు పల్లెల్లో పారిశుధ్య పనులు చేస్తున్న వారిని ఇంటికి సాగనంపనుంది. సోమవారం చిత్తూరులోని జిల్లా పంచాయతీ కార్యాలయంలో నూతన కార్మికుల కోసం టెండర్లను దాఖలు చేయనుండడమే తరువాయి. జిల్లాలోని 42 మండలాల్లో 1192 మంది కాంట్రాక్టు పద్ధతిన పారిశుధ్య పనులు చేస్తున్నా రు. ఇప్పటి వరకు వీళ్లంతా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో పనులను రెన్యూవల్ చేసుకుని ఏళ్ల తరబడిగా పనిచేస్తున్నారు. అయితే కలెక్టర్ సిద్దార్థజైన్ కల్పించుకుంటూ ఈ పద్ధతి సరికాదని, కార్మికులంతా కాంట్రాక్టర్ కింద పనిచేయాలని కొత్తగా టెండర్లు పిలవాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. కలెక్టర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 15 నుంచి జిల్లా వ్యాప్తంగా పంచాయతీల్లో పనిచేసే కాంట్రాక్టు కార్మికులు ఉద్యోగాలకు వెళ్లకుండా సమ్మె బాట పట్టారు. అయితే ఇంతలోపు అధికారులు కొత్త టెండర్ల కోసం ఏర్పాట్లు చకచకా చేసుకున్నారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు టెండర్లు వేయడానికి చివరి గడువుగా అధికారులు నిర్ణయించారు. టెండర్ల ప్రక్రియ పూర్తవుతుండటంతో తమ ఉద్యోగాలకు భద్రత లేకుండా పోతుండటంపై కార్మికులు ఆందోళన చెందుతున్నారు. కాంట్రాక్టర్ చేతికి తమను అప్పగిస్తే అతనికి నచ్చకపోతే ఉద్యోగాల్లోంచి తీసేస్తాడని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు పనిచేస్తున్న వాళ్లను సైతం తొలగించడం ఎంత వరకు సమంజసమని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. కోర్టు ఆదేశాల మేరకే టెండర్ల ప్రక్రియను నిరసిస్తూ కార్మిక సంఘ నాయకులు కోర్టును ఆశ్రయించారు. అయితే టెండర్లకు నోటిఫికేషన్ ఇచ్చేయడంతో టెండర్ల ప్రక్రియ జరిగినా తుదిగా తమ అనుమతి లేనిదే కాంట్రాక్టర్‌కు వర్క్ ఆర్డర్ ఇవ్వకూడదని న్యాయస్థానం షరతు పెట్టింది. సంక్రాతి సెలవుల తరువాత న్యాయస్థానం ఇచ్చే తదుపరి ఉత్తర్వుల వరకు టెండర్లను ఓపెన్ చేయకుండా అలాగే ఉంచుతాం. -ప్రభాకరరావు, జిల్లా పంచాయతీ అధికారి -
పింఛన్ పాట్లు
తిరుపతి క్రైం: అధికారుల్లో ముందుచూపు లేకపోవడం, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం కొరవడ్డం పింఛనుదారుల పాలిట శాపంగా మారుతోంది. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు గంటల తరబడి పింఛన్ కోసం ఎదురు చూసేలా, రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగేలా చేస్తోంది. గురువారం తిరుపతిలోని ప్రధాన తపాలా కార్యాలయాన్ని చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో తపాలశాఖ ద్వారా పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో సైతం తపాలాశాఖ ఆధ్వర్యంలోనే పింఛన్లు పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయకపోవడంతో గందరగోళం నెలకొంది. తిరుపతితో పాటు జిల్లాలోని దాదాపు 32వేల మందికి పింఛన్ మంజూరు చేయాల్సి ఉంది. ఏపీ ఆన్లైన్, డీఆర్డీఏ నగర పాలక సంస్థ అవగాహన చేస్తూ బయోమెట్రిక్ యంత్రాలను తపాలాశాఖకు అందించాయి. తిరుపతిలో 10 తపాలా కార్యాలయాల్లో బయోమెట్రిక్ సిస్టమ్స్ ఏర్పాటు చేశారు. అయితే కేటాయింపుల్లో నిర్లక్ష్యం చూపారు. నివాసం ఉన్న ప్రాంతం ఒకటైతే పింఛన్ ఇచ్చే కార్యాలయం మరో ప్రాంతంలో కేటాయించారు. దీంతో పింఛన్‌దారులు ఏ కార్యాలయానికి పోవాలో తెలియక హెడ్‌పోస్టాఫీస్‌కు చేరుకుంటున్నారు. ఎక్కడ పింఛన్ తీసుకోవాలో తెలియకే... తిరుపతిలో దాదాపు 4,800 మంది లబ్ధిదారులున్నారు. ఏపీ ఆన్లైన్లో ఇచ్చిన సమాచారం మేరకు వారికి ఖాతాలు తెరిచి పాస్ పుస్తకాలు ఇచ్చారు. ఈ సోమవారం నుంచి పాస్ పుస్తకాల పంపిణీ ప్రారంభించారు. సమాచారం తెలుసుకున్న పింఛన్ పొందే వృద్ధులు, వికలాంగులు తిరుపతిలోని ప్రధాన కార్యాలయానికి నాలుగు రోజులుగా తండోపతండాలుగా చేరుకుంటున్నారు. ఇటు తపాలాశాఖ అధికారులు ఏమి చేయాలో అర్థం కాక ప్రతి ఒక్కరికీ నచ్చజెప్పుకుంటూ వారికి మార్గనిర్దేశం చేసి పంపిస్తున్నారు. అయినా గంటల తరబడి వృద్ధులు, వికలాంగులు పింఛన్ల కోసం తపాలా కార్యాలయం వద్ద పడిగాపులు పడాల్సి వస్తోంది. తమ ఇళ్ల వద్దకే వచ్చి పింఛను పంపిణీ చేస్తే బాగుంటుందని పింఛన్లు పొందే వృద్ధులు, వితంతువులు వికలాంగులు కోరుతున్నారు. -
సర్కారు బంగళా
ముకరంపుర: కలెక్టరేట్ ఓ చోట.. పలు జిల్లా కార్యాయాలు మరోచోట.. ప్రజలు పనుల నిమిత్తం ఆఫీసులు తిరగాలంటే సహనానికి పరీక్ష.. ఫలితంగా పనుల్లో జాప్యం.. పర్యవేక్షణలో లోపం.. కరీంనగర్లో ప్రస్తుతమున్న పరిస్థితి ఇది. ఇలాకాకుండా ప్రభుత్వ కార్యాలయాన్ని ఒకేచోట ప్రజలకు, అధికారులు, సిబ్బందికి అందుబాటులో ఉండాలని భావించిన ప్రభుత్వం ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించింది. ఈ మేరకు జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాల భవన సముదాయం ప్రణాళిక రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుత కలెక్టరేట్ హెలిప్యాడ్ పార్కులోని ఖాళీస్థలంలో నూతన భవనాన్ని నిర్మించాలని అధికార యంత్రాంగం నిర్ణయానికి వచ్చింది. రూ.వంద బడ్జెట్ అంచనాలతో ప్రతిపాదనలు సిద్ధం ప్రభుత్వానికి పంపించింది. దీనికి ప్రభుత్వ ఆమోదం లభిస్తే బహుళ అంతస్థుల్లో జిల్లా ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకేచోట కొలువుదీరనున్నాయి. ప్రస్తుతం జిల్లాస్థాయిలో నగరంలో ఎనభై ప్రభుత్వ శాఖలు వేర్వేరు సముదాయాల్లో ఉన్నాయి. జిల్లా పరిపాలనా కేంద్రం కలెక్టరేట్లో 42 శాఖలుండగా యాభైకి పైగా ఆఫీసులున్నాయి. కలెక్టరేట్లో 1200 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తుండగా, జిల్లా కేంద్రంతో పాటు ఇతర ప్రాంతంలో ఉన్న జిల్లా కార్యాలయాల్లో మరో నాలుగు వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. నూతన భవనం పూర్తయితే మొత్తం ఐదు వేలకు పైగా ఉద్యోగులంతా ఈ పది అంతస్తుల భవనంలోనే కొలువులు నిర్వర్తించనున్నారు. ఆధునిక హంగులతో.. ఆధునిక హంగులతో పది అంతస్థులతో భవనాన్ని నిర్మించేందుకు అర్అండ్బీ ఇంజినీరింగ్ అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. విశాలమైనపదహారు ఎకరాల స్థలంలో ఈ భవన సముదాయాన్ని కార్పొరేట్ ఆఫీసుల తరహా నిర్మించనున్నారు. విద్యుత్ అవసరాల కోసం పూర్తిగా సోలార్ విద్యుత్ సిస్టంను ఉపయోగించనున్నారు. సెమీ ఆటోమేటిక్ లిఫ్టులు, ఇంటర్నెట్, వైఫై సౌకర్యంతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. బయోమెట్రిక్ ద్వారా ఉద్యోగుల హాజరు శాతాన్ని పరిశీలించనున్నారు. భవనం మొత్తం రాజసం ఉట్టిపడేలా కనిపించనుంది. ప్రస్తుత కలెక్టరేట్ భవనాన్ని 1984లో నిర్మించారు. ఈ భవనం పలుచోట్ల పగుళ్లు తేలి, పెచ్చులూడుతూ, పైపుల నుంచి నీళ్లు కారుతూ శిథిలావస్థకు చేరుకుంటోంది. ఆగస్టులో జిల్లాకు వచ్చిన సీఎం కేసీఆర్ కలెక్టరేట్లో జిల్లా సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన సమయంలో ఈ భవనం దుస్థితిని కళ్లారా చూశారు. ఆధునాత హంగులతో నూతన భవనం నిర్మిస్తామని ఆనాడే ప్రకటించారు. కొత్త బంగళా నిర్మిస్తే ఇప్పుడున్న కలెక్టరేట్ సముదాయాన్ని ఏం చేస్తారనేది ఇంకా నిర్ణయించలేదు. రెవెన్యూ డివిజన్లలో సైతం.. రెవెన్యూ డివిజన్లలో సైతం ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే చోట నిర్మించాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు ఆదేశాలు రావడంతో శుక్రవారం కరీంనగర్, పెద్దపెల్లి, మంథని, సిరిసిల్ల, జగిత్యాల డివిజన్ కేంద్రాల్లో నూతన భవనాల నిర్మాణాల కోసం అధికారులను స్థలాలను పరిశీలించారు. ఇప్పటికే స్థలాలు గుర్తించిన మంథని, సిరిసిల్లలో నూతన భవనాల నిర్మాణానికి రూ.2.32 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు పంపించారు. మంథని, సిరిసిల్ల ఆర్డీవో కార్యాలయాలు శిథిలావస్థకు చేరుకుని ఏళ్లు గడుస్తున్నాయి. మిగిలిన మూడు చోట్ల త్వరలో ప్రతిపాదనలు పంపనున్నారు. జగిత్యాల ఆర్డీవో కార్యాలయాన్ని ధరూర్ క్యాంపునకు తరలించాలని భావిస్తున్నారు. ఇదే వరుసలో అన్ని మండలాల్లో తహశీల్దార్ కార్యాలయ భవన నిర్మాణాలకు సైతం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. -
జిల్లాలో బదిలీల సందడి
జిల్లాలోని పలు ప్రభుత్వ శాఖల్లో బదిలీల సందడి నెలకొంది. ఉన్నతాధికారుల నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకూ బదిలీలకు సంబంధించి హడావిడిగా గడుపుతున్నారు. ఏ ప్రాంతానికి బదిలీ అవుతామోనని ఉత్కంఠగా ఉన్నారు. శనివారం జిల్లా పంచాయతీ, సహకార శాఖల్లో పలువురు అధికారులు, ఉద్యోగులు బదిలీ అయ్యారు. ఒంగోలు టూటౌన్ : జిల్లా పంచాయతీ కార్యాలయం (డీపీవో)లో బదిలీల సందడి నెలకొంది. బదిలీల ప్రక్రియలో భాగంగా శనివారం ఉదయం జిల్లావ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్లు, బిల్ కలెక్టర్లు, అటెండర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లాలో 1,028 పంచాయతీలుండగా, వాటిలో పనిచేస్తున్న పర్మినెంట్ ఉద్యోగులు బదిలీల కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. ఉదయం నుంచి మధ్నాహ్నం వరకు జిల్లా పంచాయతీ ఇన్చార్జి అధికారి జి.సుమతికళ, సూపరింటెండెంట్ విజయలక్ష్మిలు ఉద్యోగులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఉద్యోగులు కోరుకున్న చోట ఖాళీ ఉంటే అక్కడికే వారిని బదిలీ చేశారు. ఏడుగురు జూనియర్ అసిస్టెంట్లు, దీర్ఘకాలికంగా ఒకేచోట పనిచేస్తున్న బిల్లు కలెక్టర్లు, అటెండర్లను బదిలీ చేశారు. బీసీ కేడర్‌లో ఉన్న 9 మంది ఉద్యోగులను ఉన్నచోట నుంచి వేరే పంచాయతీలకు బదిలీ చేశారు. ముగ్గురు అటెండర్లు, ఒక శానిటరీ ఇన్స్పెక్టర్, ముగ్గురు శానిటేషన్ మేస్త్రీలను కౌన్సెలింగ్‌లో కోరుకున్న చోటకు బదిలీ చేశారు. మధ్నాహ్నం నుంచి ఈవోఆర్డీలకు కౌన్సెలింగ్ నిర్వహించగా 21 మంది హాజరయ్యారు. ఆయా గ్రామ పంచాయతీల్లో ఖాళీలను సూచించి కౌన్సెలింగ్ నిర్వహించారు. కౌన్సెలింగ్ అనంతరం బదిలీలకు సంబంధించిన ఫైలును కలెక్టర్ అనుమతి కోసం పంపినట్లు జిల్లా ఇన్చార్జి అధికారి సుమతికళ తెలిపారు. ఆత్మ డిప్యూటీ ప్రాజెక్టు డెరైక్టర్‌గా వజ్రశ్రీ ఆత్మ జిల్లా డిప్యూటీ ప్రాజెక్టు డెరైక్టర్‌గా వజ్రశ్రీని ప్రభుత్వం నియమించింది. ఈమె విశాఖపట్నం ఉద్యానవనశాఖ డిప్యూటీ డెరైక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈమె నియామకాన్ని వ్యవసాయ, సహకార ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్రపునీతా ఆన్లైన్లో ఉంచారు. తన బదిలీ విషయంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం రాలేదని ప్రస్తుత ఆత్మ పీడీ బీజీవీ ప్రసాద్ తెలిపారు. తాత్కాలికంగా తెలంగాణ కు బదిలీ ఒంగోలు : ఆర్‌అండ్‌బీలో పనిచేస్తున్న ఆరుగురిని తెలంగాణ ప్రభుత్వంలో ఏడాదిపాటు పనిచేయాలంటూ డిప్యుటేషన్ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి బి.శ్యాంబాబు విడుదల చేశారు. ఈ ఆరుగురిలో ప్రకాశం జిల్లా కనిగిరి పరిధిలో పనిచేస్తున్న ఆర్అండ్బీ ఈఈ జి.లక్ష్మీనారాయణరెడ్డి కూడా ఉన్నారు. డీఆర్డీఏ పీడీ పద్మజ రెవెన్యూకు... డీఆర్డీఏ పీడీగా ఎంఎస్ మురళిని నియమిస్తూ ఉత్తర్వులు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు డీఆర్డీఏ పీడీగా పనిచేసిన పద్మజను ఆమె మాతృ సంస్థ అయిన రెవెన్యూ శాఖకు బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ఎస్పీ ఠక్కర్ శనివారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒంగోలు: జిల్లా పరిషత్ పరిధిలో పనిచేసే జెడ్పీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో పనిచేసే బోధనేతర సిబ్బంది బదిలీల వ్యవహారం భారీ పోలీసు బందోబస్తు మధ్య అధికారులు శనివారం ప్రారంభించారు. తొలుత జెడ్పీ ఉద్యోగులు నిరాకరించినా ... కొంతమంది కౌన్సెలింగ్‌కు హాజరుకావడంతో తమకు దక్కాల్సిన స్థానాలు వారికి వెళ్లే అవకాశం ఉందని భీష్మించిన ఉద్యోగులు కూడా చివరకు కౌన్సెలింగ్ బాట పట్టారు. ప్రతి విభాగంలోను 20 శాతం మంది అంటే కనీసంగా 300 మందికిపైగా బదిలీలు జరగనున్నాయి. తొలుత ఆగ్రహం జెడ్పీ చైర్మన్‌తోనే కౌన్సెలింగ్ నిర్వహించాలంటూ కౌన్సెలింగ్‌కు హాజరైన ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దాదాపు గంటపాటు ఈ ఉత్కంఠ కొనసాగింది. ఈ క్రమంలో కొంతమంది ఉద్యోగులు కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు సుముఖత వ్యక్తం చేస్తూ కౌన్సెలింగ్ హాలులోకి వెళ్లడం, పోలీసులు వారికి పూర్తిస్థాయి భద్రత కల్పించడంతో కౌన్సెలింగ్‌కు అభ్యంతరం వ్యక్తం చేసిన ఉద్యోగుల్లో కూడా అలజడి ప్రారంభమైంది. ముందుగా వెళ్లిన వారికి కౌన్సెలింగ్‌లో మంచి ప్లేస్‌మెంట్స్ దొరికితే చివరకు మా గతేమిటన్న భయం నెలకుంది. దీంతో ఉద్యోగ సంఘాల నాయకులతో మాట్లాడి, ఒప్పించి చివరకు తొలుత వ్యతిరేకించిన ఉద్యోగులు కూడా కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. దీంతో జెడ్పీ మినిస్టీరియల్ ఉద్యోగుల బదిలీల ప్రక్రియను అధికారులు నిర్విఘ్నంగా కొనసాగించారు. నిలదీత పాత జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారని తెలుసుకున్న ఈదర హరిబాబు శనివారం ఉదయం కౌన్సెలింగ్ ప్రారంభించే సమయంలో అక్కడకు చేరుకున్నారు. జెడ్పీ చైర్మన్‌గా తాను ఉన్నపుడు తనకు తెలియకుండా, తనను పిలవకుండా బదిలీలు చేయడం ఏమిటంటూ జెడ్పీ సీఈవో ఎ.ప్రసాద్‌ను ప్రశ్నించారు. జెడ్పీ చైర్మన్ సమక్షంలోనే బదిలీలు చేయాలని జీవో స్పష్టంగా చెబుతున్నప్పటికీ అందుకు విరుద్ధంగా ఇలా చేయడమేమిటని ప్రశ్నించారు. కోర్టు తనకు జడ్పీ చైర్మన్‌గా అవకాశం కల్పించినా ధిక్కరిస్తున్నారు..రెవెన్యూ అధికారులంతా కలిసి జెడ్పీ వ్యవస్థనే భ్రష్టు పట్టిస్తున్నారు. మీరు చెబుతున్నట్లు జడ్పీ చైర్మన్‌గా నూకసాని బాలాజీ సమక్షంలోనైనా బదిలీలు ఎందుకు నిర్వహించడం లేదంటూ కేకలేశారు. కలెక్టర్ ఉత్తర్వులున్నాయి: సీఈఓ కలెక్టర్ ఉత్తర్వులున్నాయని, జెడ్పీ చైర్మన్‌తో సంబంధం లేకుండా కమిటీతో నిర్వహిస్తున్నట్లు జెడ్పీ సీఈవో బదులిచ్చారు. అలా అని తనకు రాసివ్వాలని ఈదర కోరగా ప్రస్తుతం కౌన్సెలింగ్‌లో ఉన్న దృష్ట్యా తరువాత ఇస్తామని స్పష్టం చేశారు. ఈ నెల 10వ తేదీ నుంచి జెడ్పీ ఛైర్మన్‌గా తాను బాధ్యతలు నిర్వహిస్తున్నానని, ఆ కాగితంపై తనకు ఎక్నాలెడ్జ్మెంట్ ఇవ్వాలంటూ జెడ్పీ సీఈవోని అడగడంతో సంతకం చేసి సీఈఓ ఇవ్వడంతో ఈదర కౌన్సెలింగ్ హాలు నుంచి బయటకు వచ్చేశారు. అనంతరం జిల్లా అదనపు జేసీ ప్రకాష్‌కుమార్, జెడ్పీ సీఈవో ప్రసాద్, డిప్యూటీ సీఈవో నరశింహారావులు తదుపరి బదిలీల కౌన్సెలింగ్ ప్రారంభించారు. కౌన్సెలింగ్ నేరమే : బాలాజీ కౌన్సెలింగ్ నిర్వహించడం నేరమే: జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీజిల్లా పరిషత్‌లో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు నాకు జిల్లా పరిషత్ అధికారులు ఎవరూ చెప్పలేదు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం తప్పనిసరిగా బదిలీల కౌన్సెలింగ్జెడ్పీ చైర్మన్ అనుమతితోనే జరగాలి. దీనిపై పంచాయతీరాజ్ కమిషనర్‌కు కూడా ఈమెయిల్ చేయడంతోపాటు ఫోన్లో కూడా తెలియజేశా. ఆయన కూడా జెడ్పీ చైర్మన్ సమక్షంలోనే నిర్వహించాలని అన్నారు. కానీ జెడ్పీ అధికారులు మాత్రం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నామనడం చట్టాన్ని అవమానించడమే. ఇది పూర్తిగా నేరమే. జీవో నెంబర్ 707 ప్రకారమే బదిలీలు... జీవో నెంబర్ 707 ప్రకారమే తాము బదిలీలు నిర్వహిస్తున్నాం. జిల్లా కలెక్టర్ ఆదేశాలమేరకు కమిటీ ద్వారా బదిలీల పక్రియ చేపట్టాం. ఇందులో ఎటువంటి అన్యాయానికి, అవమానానికి తావులేదు. మొత్తం 300 మందికిపైగా బదిలీలు చేయాల్సి ఉంది. అంతా సజావుగా నిర్వహిస్తాం. నవంబరు 22 ఓ బ్లాక్ డే: ఈదర హరిబాబు ప్రకాశం జిల్లా పరిషత్ చరిత్రలో 2014 నవంబరు 22వ తేదీ బ్లాక్‌డే. న్యాయస్థానం ఉత్తర్వులను సైతం అమలు చేయకుండా జెడ్పీ సీఈవో కోర్టుని అవమానించారు. జెడ్పీకి ఎన్నికైన పాలకవర్గం ఉన్నప్పటికీ చైర్మన్, వైస్ చైర్మన్లకు సంబంధం లేకుండా రెవెన్యూ ప్రతినిధులతో కమిటీగా ఏర్పడి బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించి జెడ్పీ వ్యవస్థనే అపహాస్యం చేశారు. నైతికంగా జడ్పీ సీఈవోగా పనిచేసే హక్కు, అధికారం ఆయన కోల్పోయారు. మరోవైపు బదిలీల కౌన్సెలింగ్‌కు సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ వాటినీ ధిక్కరించారు. అధికారుల వ్యవహార శైలిపై న్యాయపరంగా పోరాటం చేస్తాం. భారీ బందోబస్తు కౌన్సెలింగ్ ఆవరణలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఒంగోలు డీఎస్పీతోపాటు పలువురు సీఐలు కూడా అక్కడే విధి నిర్వహణలో ఉండి పర్యవేక్షించారు. -ఒంగోలు -
విభాగ స్థాయిలోనే బదిలీలు..
సీఎం ఫడ్నవిస్ ఆదేశం రీజియన్ స్థాయి అధికారులకు అధికారాలు మంత్రాలయ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదంటూ వ్యాఖ్య స్వాగతించిన అధికారుల సంఘాలు సాక్షి, ముంబై: వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అధికారులు, ఇతర సిబ్బంది బదిలీల కోసం మంత్రాలయ చుట్టూ తిరగనవసరం లేదు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ బదిలీల అధికారాన్ని వారు ఉద్యోగం చేస్తున్న విభాగ స్థాయికే అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి బదిలీల కోసం ఉద్యోగులు మంత్రాలయలోని మంత్రుల క్యాబిన్ల చుట్టూ తిరగాల్సిన అవసరముండదని ఫడ్నవిస్ స్పష్టం చేశారు. ఈ బదిలీల పర్వాన్ని తొలుత ఇరిగేషన్, ఆహార, ఔషధ శాఖ నుంచి ప్రారంభించారు. విడతల వారీగా త్వరలో ఇతర శాఖల బదిలీలను కూడా రీజియన్ స్థాయిలో జరిగేలా చూస్తామని ఆయన అన్నారు. ‘మినిమం గవర్నమెంట్, మేగ్జిమం గవర్నెన్స్’ అనే సూత్రంపై ఇక నుంచి ప్రభుత్వ పనులు కొనసాగుతాయని ఫడ్నవిస్ తెలిపారు. ఇరిగేషన్ శాఖలో పెద్ద సంఖ్యలో ఏ, బి. స్ధాయి అధికారులు ఉన్నారు. ఇందులో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ల బదిలీల అధికారం గతంలో ముఖ్యమంత్రి వద్ద ఉండేది. ఇక నుంచి బదిలీల అధికారం ఆ శాఖకు చెందిన విభాగ స్థాయిలో ఉండే ప్రధాన కార్యదర్శికి అప్పగించారు. డిప్యూటీ ఇంజినీర్ల బదిలీల అధికారం ఇరిగేషన్ శాఖ మంత్రుల నుంచి తొలగించి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లకు అప్పగించారు. అదేవిధంగా ఇంజినీరు, జూనియర్ ఇంజినీరు, అసిస్టెంట్ ఇంజినీర్ల బదిలీలు ఇకనుంచి సూపరింటెండెంట్ ఇంజినీరు సలహాల ప్రకారం ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు చేస్తారు. ఇదివరకు ఈ అధికారాలు ఇరిగేషన్ శాఖ సహాయ మంత్రివద్ద ఉండేవి. ఆహార, ఔషధ శాఖ ఇన్స్పెక్టర్, సైంటిస్టులు, అహార భద్రత అధికారులు, పరిపాలన విభాగం అధికారుల బదిలీల అధికారం ఈ శాఖకు చెందిన కేబినెట్ మంత్రి నుంచి తొలగించి కమిషనర్‌కు అప్పగించారు. 161 మంది ఫుడ్ ఇన్స్పెక్టర్లు, 265 మంది ఆహార భద్రత అధికారులు ఉన్నారు. వీరందరి బదిలీల అధికారం మంత్రాలయ స్థాయి నుంచి తొలగించి రీజియన్ స్థాయికి అప్పగించారు. ఇలా ఒక్కొక్క శాఖను మంత్రాలయ నుంచి విభాగ స్థాయికి అప్పగించే ప్రక్రియ ప్రారంభించారు. ఫడ్నవిస్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని మహారాష్ట్ర స్టేట్ గెజిటెడ్ అధికారుల మహాసంఘం స్వాగతించింది. దీని కారణంగా గత అనేక దశాబ్దాలుగా బదిలీల ప్రక్రియలో జరుగుతున్న అవినీతి, పైరవీల సంస్కృతికి కళ్లెం పడనుందని మహాసంఘం నాయకుడు జి.డి.కుల్తే అభిప్రాయపడ్డారు. -
‘కొలువు’ పొందువరకూ అలుపు లేదు మాకు
ఇంటికి చెప్పకుండా బ్యాటు పట్టుకుని దొంగచాటుగా గ్రౌండుకు వెళ్లే రోజులు పోయాయి. నాన్న ఏమంటారో అని భయపడుతూ రన్నింగ్ షూష్ ఇంటి వద్దే తొడుక్కుని పెరటి గోడ దూకి మైదానం వైపు పరిగెత్తే రోజులూ పోయాయి. దెబ్బ తగిలిన చేతిని అమ్మకు చూపించకుండా నక్కినక్కి పడుకునే రోజులు కూడా సెలవు తీసుకున్నాయి. ఇప్పుడు ఆడడానికి, ఆడుతున్నామని చెప్పడానికి ఎవరూ సందేహించడం లేదు, భయపడడం లేదు. చదువుతో పాటు క్రీడలకు యువత పెద్దపీట వేస్తోంది. ప్రభుత్వ కొలువులు ఆటల ద్వారా సాధ్యమవుతున్న వేళ ఆటలను తారకమంత్రంగా ఎంచుకుంది. అమ్మానాన్నలను ఒప్పించి, అనుకున్న లక్ష్యాన్ని అందుకునే వరకూ అలుపెరగని పోరుసాగిస్తోంది. జిల్లా యువతా ఆ దారిలోనే ఉపాధికి బాటలు వేసుకుంటోంది... * క్రీడలపై మక్కువ చూపిస్తున్న జిల్లా యువత * పేరు ప్రఖ్యాతులతో పాటు, ఉన్నత కొలువుల సాధనకు సరైన మార్గం * ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగావకాశాలకు 2శాతం కోటా * ప్రతిభ గల క్రీడాకారులకు ఆఫర్లు కురిపిస్తున్న ప్రైవేటు కంపెనీలు విజయనగరం మున్సిపాలిటీ: రోహిత్ శర్మ డబుల్ సెంచరీ... ఎక్కడ చూసినా అదే చర్చ. అంతకుముందు రాయుడు కళాత్మక శతకం. అప్పుడు కూడా ఎక్కడ చూసినా రాయుడు టాపిక్కే. ఇంకొంచెం ముందు కామన్వెల్త్లో పతకం కొల్లగొట్టిన మత్స సంతోషి. ఆ సమయంలో జిల్లాలో సంతోషి పేరు వినబడని ఊరు, వీధి లేవంటే అతిశయోక్తి కాదు. జనాలను సమ్మోహితులను చేసే ఏదో శక్తి ఆటల్లో ఉంది. అందుకే జిల్లా యువత ఇప్పుడు ఆటల బాటలో నడుస్తోంది. సెలబ్రిటీగా వెలుగొందడంతో పాటు క్రీడల కోటాలో ఉద్యోగాలు కూడా లభిస్తుండడంతో ఈ దారిలో పయనించడానికి యువతరం ఆసక్తి చూపుతోంది. అంతేకాదు నిరుపేద కుటుంబాల వారు కూడా క్రీడల మార్గంలో పయనించడానికి భయపడడం లేదు. జిల్లాలో ప్రధానంగా ఖోఖో, రెజ్లింగ్ (కుస్తీ) కబడ్డీ, వాలీబాల్ క్రీడలకు ఆదరణ ఉండేది. కానీ ఇప్పుడు ఆ లిస్ట్ పెద్దదైంది. షటిల్ బ్యాడ్మింటన్, బ్యాడ్మింటన్, తైక్వాండో, అథ్లెటిక్స్, ఫుట్‌బాల్, ఆర్చరీ, బాక్సింగ్ క్రీడాంశాల్లో జిల్లా క్రీడాకారులు మంచి ప్రతిభ చూపిస్తున్నారు. తద్వారా వారు ఏర్పర్చుకున్న ల క్ష్యాన్ని చేరుకుంటున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు కబడ్డీలో రాణించిన 30 మంది వరకు క్రీడాకారులు వివిధ రంగాల్లో స్థిరపడటంతో పాటు ఉన్నత చదువులను క్రీడల కోటాలోనే అభ్యసించారు. * ఖోఖోలో 40 మంది , వాలీబాల్‌లో 20 మంది, వ్యాయామ ఉపాధ్యాయుల రంగంలో 50 మంది వరకు స్థిరపడ్డారు. * ఇటీవల అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొని దేశ కీర్తిని చాటి చెప్పిన కొండవెలగాడ గ్రామానికి చెందిన మత్స సంతోషిని ఇందుకు ఉదాహరణగా పేర్కొనవచ్చు. క్రీడలతో ప్రయోజనాలు ఎన్నో... * క్రీడల్లో రాణించటం ద్వారా బహుళ ప్రయోజనాలు దక్కుతున్నాయి. ఈ రంగంలో రాణించేవారికి ప్రభుత్వ శాఖలైన బ్యాంకింగ్, రైల్వే, పోలీస్, ఉపాధ్యాయ, పోస్టల్ విభాగాల్లో ప్రభుత్వమే నేరుగా ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది. పలు ప్రైవేటు సంస్థలైతే ప్రతిభ గల క్రీడాకారుల కోసం వెతుక్కుంటూ వచ్చి మంచి ప్రోత్సాహాకాలతో ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. చదువుతో పాటు క్రీడలూ ముఖ్యమే.. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలూ ముఖ్యమే. కేవలం చదువులోనే కాకుండా క్రీడల్లో రాణించటం ద్వారా అనతి కాలంలోనే మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. అంతేకాకుండా ఉన్నత అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు. గ్రామీణ ప్రాంతంలో పుట్టిన నేను అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటానని అనుకోలేదు. పట్టుదలతో శిక్షణ తీసుకున్నా తల్లిదండ్రులు, దేశ ప్రజలంతా గర్వించే విధంగా అంతర్జాతీయ పోటీల్లో పతకం సాధించాం. క్రీడల్లో కనబరుస్తున్న ప్రతిభను గుర్తించిన రైల్వే అధికారులు విజయనగరం రైల్వే స్టేషన్లో టీసీగా ఉద్యోగం ఇచ్చారు. చదువుతో పాటు క్రీడల్లో పట్టుదలతో రాణిస్తే సాధించలేనిదంటూ ఉండదు. -మత్స.సంతోషి, అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టర్, కొండగుంపాం. పట్టుదలతో రాణిస్తే ప్రయోజనం... ఏ రంగంలోనైనా పట్టుదలతో రాణిస్తే తప్పక ప్రయోజనం ఉంటుంది. నేను ఎనిమిదేళ్లుగా ఖోఖో ఆడుతున్నాను. మాది నిరుపేద కుటుంబం. చిన్నతనంలో నాన్న చనిపోయారు. మావయ్య గోపాల్ ప్రోత్సాహంతో చదువుకుంటూనే క్రీడల్లో అడుగుపెట్టాను. ఇప్పటి వరకు 10 జాతీయ పోటీల్లో పాల్గొన్నా ఒక సారి జాతీయ గోల్డ్ మెడల్ దక్కించుకున్నా. 2010లో క్రీడలో రైల్వేలో క్లర్క్ ఉద్యోగం సాధించాను. ప్రస్తుతం బిలాస్పూర్లో ఉంటున్నా. నాకు ఉపాధి కల్పించిన ఖోఖో క్రీడను రైల్వే శాఖ తరఫున , ఆంధ్రరాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నా. - నమ్మి నరేష్, దాసన్నపేట, విజయనగరం. రైల్వేలో ఉద్యోగం చిన్నతనం నుంచి క్రీడలంటే నాకు ఇష్టం. కస్పా హైస్కూల్లో చదువుతున్న రోజుల్లో ఖోఖో నేర్చుకున్నాను. అప్పటి వ్యాయామ ఉపాధ్యాయులు చిన్నంనాయుడు, గోపాల్ మాస్టార్లు అన్ని విధాలుగా ప్రోత్సహించారు. వారి ఆశీర్వాద బలం, నా నిరంతర శిక్షణతో పలు జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నాను. సౌత్ ఆసియా అంతర్జాతీయ స్థాయిలో జరిగిన పోటీల్లో దేశం తరఫున ఆడాను. 2009లో చేసిన మొదటి ప్రయత్నంలోనే రైల్వే శాఖలో ఉద్యోగం లభించింది. ఇప్పటికీ ఆ క్రీడను కొనసాగిస్తున్నా. -కరగాన.మురళీకృష్ణ, దాసన్నపేట, విజయనగరం. జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తెస్తా... మాది నిరుపేద కుటుంబం. కేవలం కూలి చేసుకుంటూ జీవన ం సాగిస్తాం. తల్లిదండ్రులు నన్ను పెంచి, చదివించేందుకు ఎంతో కష్టపడుతున్నారు. వారిని ఎప్పటికైనా మంచి స్థానంలో ఉంచాలన్నదే నా ధ్యేయం. ఓ వైపు చదువుతూ మరో వైపు వాలీబాల్ క్రీడను నేర్చుకున్నాను. ఇప్పటి వరకు పలు జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నా. పతకాలు దక్కించుకున్నాను. డిగ్రీ పూర్తియ్యే సరికి జాతీయ స్థాయిలో ఉత్తమ క్రీడాకారుడిగా ఎదిగి జిల్లామంచి పేరు ప్రఖ్యాతలు తేవటంతో పాటు క్రీడల కోటాలో ఉద్యోగం సంపాదిస్తా. నా ఆశయాన్ని నెరవేర్చుకుంటా. - నరేష్, బలిజిపేట, విజయనగరం క్రీడల కోటాలో ఇంజినీరింగ్ సీటు... మాది సాధారణ కుటుంబం. మా ఊరిలో స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థి ఏదో ఒక ఆటలో రాణిస్తుంటాడు. ఎక్కువ మంది కబడ్డీ అంటే ఇష్టపడతారు. నేనూ అదే క్రీడలో శిక్షణ పొందాను. ఇంటర్ తర్వాత క్రీడల కోటా కలిసిరావటంతో ఉచితంగా కళాశాల యాజమాన్యం సీటిచ్చింది. ఇంజినీరింగ్ విద్యను పూర్తి చేసి ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా. - టి.భాస్కరరావు, సారిపల్లి, విజయనగరం. ఇప్పటికీ ఖోఖో అడుతున్నా... మాది నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులు కష్టపడి పని చేసి చదివించారు. ఎలాగైనా ప్రభుత్వ శాఖలో ఉద్యోగం సాధించాలన్నది నా చిన్ననాటి నుంచి సంకల్పం. క్రీడల్లో రాణించటం ద్వారా ఆ నా కలను నిజం చేసుకోవాలని అనుకున్నాం. మున్సిపల్ కస్పా ఉన్నత పాఠశాలలో చదువుతున్న సమయంలో చిన్నంనాయుడు (పీఈటీ), గోపాల్ (పిఈటీ)లు నాలో ఉత్సుకతను గమనించి ఖోఖోలో ప్రోత్సహించారు. ఇప్పటి వరకు ఆరువరకు జాతీయ స్థాయి టోర్నీలు పాల్గొన్నా. క్రీడలో కోటాలో 2011 సంవత్సరంలో పోలీస్ శాఖలో సివిల్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం లభించింది. ప్రస్తుతం విజయనగరం వన్‌టౌన్‌లో విధులు నిర్వహిసున్నా. ఇప్పటికీ ఖోఖో ఆడుతూ పలువురు విద్యార్ధులకు నేర్పిస్తున్నా. ఈ ఏడాది డిసెంబర్లో బెంగళూరులో జరగనున్న సీనియర్స్ జాతీయ ఖోఖో పోటీల్లో రాష్ట్రం తరఫున ఆడతాను. - పొంతపల్లి.హరీష్, కొత్తపేట, విజయగనరం. -
వాయిదా మంత్రం
* బదిలీలపై తొలగని ప్రతిష్టంభన * జన్మభూమి కార్యక్రమాలు పూర్తికాక గందరగోళం ఏలూరు : ప్రభుత్వ శాఖల్లో బదిలీల ప్రక్రియ కొలిక్కి రావడం లేదు. సాంకేతిక కారణాల పేరిట ప్రభుత్వం తరచూ వాయిదా వేస్తోంది. జన్మభూమి-మా ఊరు కార్యక్రమం చాలా జిల్లాల్లో వాయిదా పడటంతో ఈ నెలాఖరు నాటికి పూర్తి కావాల్సిన బదిలీల ప్రక్రియపై ప్రతిష్టంభన నెలకొంది. వాస్తవంగా ఈ నెల 20 నాటికి జన్మభూమి సభలు పూర్తి కావాల్సి ఉండగా, అదే రోజున బదిలీలు చేపడతామని ప్రభుత్వం ఇంతకుముందు ప్రకటించింది. హుదూద్ తుపాను నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో జన్మభూమి సభలను వారుుదా వేశారు. పొరుగు జిల్లాల అధికారులు, ఉద్యోగులు సహాయ, పునరావాస కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లడంతో ఆయూ జిల్లాల్లోనూ వాయిదా పడ్డాయి. తుపాను ప్రభావం లేని జిల్లాల్లో సోమవారం నుంచి జన్మభూమి కార్యక్రమాలు ప్రారంభించినప్పటికీ.. తుపాను బాధి త ప్రాంతాల్లో ఈ నెల 30లోగా పూర్తవుతాయూ లేదా అనేది సందేహంగానే ఉంది. మరోవైపు తుపాను బాధిత ప్రాంతాల్లో నష్టాలను అంచనా వేయూల్సి ఉంది. ఈ కార్యక్రమం పూర్తి కావడానికి కనీసం నెల రోజుల సమయం పడుతుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అన్ని జిల్లాల్లో శాఖల వారీగా బదిలీలను ఒకేసారి చేపట్టాల్సి ఉండటం, ఉత్తరాంధ్ర జిల్లాలు ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేకపోవడంతో బదిలీల ప్రక్రియను వాయిదా వేసే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఈ వ్యవహారం ఎప్పటికి కొలిక్కివస్తుందో తెలియక ఉద్యోగులు త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారు. సూపరింటెండెంట్ల పరిస్థితి ఏమిటో! జిల్లాలోని ప్రభుత్వ శాఖల్లో కొంతమంది సూపరింటెండెంట్ స్థాయి అధికారులను ఇతర జిల్లాలకు ఇటీవల బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. వారందరినీ జన్మభూమి కార్యక్రమాలు పూర్తయ్యూక ప్రస్తుత స్థానాల నుంచి రిలీవ్ చేయూలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో జన్మభూమి కార్యక్రమాలు ఈ నెల 25 వరకు వాయిదా పడ్డాయి. ఈ పరిస్థితుల్లో వారిని 25వ తేదీ తరువాత రిలీవ్ చేస్తారా, జన్మభూమి కార్యక్రమాలతో సంబంధం లేని, కార్యక్రమాలు పూర్తయిన ప్రాంతాల్లోని సూపరింటెండెంట్ స్థాయి అధికారుల సంగతి ఏమిటనేది నేటికీ స్పష్టం కాలేదు. దీంతో వారంతా కొత్త స్థానాల్లో చేరాలా, వద్దా అనే విషయమై గందరగోళం నెలకొంది. ఇలా ప్రతి సందర్భంలోనూ బదిలీల ప్రక్రియ వాయిదా పడుతూ వస్తోంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే వాయిదాల పర్వం కొనసాగే అవకాశం ఉందని సమాచారం. -
‘సకాల’లో స్పందించకపోతే కఠిన చర్యలు
సాక్షి, బెంగళూరు : సకాల దరఖాస్తులను పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి టీ.బీ జయచంద్ర హెచ్చరించారు. ‘సకాల’ పనితీరుకు సంబంధించిననివేదికను విధానసౌధాలో మీడియాకు సోమవారం వివరించారు. నిర్ధిష్ట గడువులోగా దరఖాస్తులు పరిష్కరించడంలో ఏడుసార్లు విఫలమైన అధికారులపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు రూపొందించిన నిబంధనలకు గవర్నర్ కార్యాలయం అనుమతిచ్చిందన్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువరిస్తామని అన్నారు. రాష్ట్రంలో సకాల ప్రారంభించి రెండేళ్లు పూర్తయిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన 669 సేవలు సకలా ద్వారా ప్రజలకు అందిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకూ 5.78 కోట్ల దరఖాస్తులు సకాల కింద ప్రభుత్వానికి రాగా అందులో 7.70 కోట్ల దరఖాస్తులను పరిష్కరించినట్లు వివరించారు. 524 దరఖాస్తులకు సంబంధించి నిర్ధిష్ట వ్యవధిలోగా పనులు పూర్తిచేయకపోవడం వల్ల సంబంధిత దరఖాస్తుదారునికి రూ.67,440 పరిహారంగా అందించాల్సి వచ్చిందని గుర్తు చేశారు. కామన్వెల్త్ అసోషియేషన్ ఫర్ పబ్లిక్ అడ్మినిష్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ ప్రశస్తి పోటీల్లో సకాల తుది దశలో ఉందన్నారు. త్వరలో మలేషియాలోని కౌలాలంపూర్‌లో జరిగే ఫైనల్ పోటీల్లో తప్పక ‘సకాల’కు ప్రశస్తి దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలకు చట్టప్రకారం సహకరిస్తానని గవర్నర్ వజుభాయ్రుడాభాయ్ వాలా భరోసా ఇచ్చారన్నారు. అయితే ప్రభుత్వం, రాజ్‌భవన్ మధ్య సఖ్యత లేదని కొన్ని మీడియాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు. -
‘అధికార’ జులుం
సాక్షి, ఒంగోలు: ‘అధికారంలోకి వచ్చాక కూడా చేతులు కట్టుకుని కూర్చోవాలా..? మీరు గ్రామంలో ఏమేం చెయ్యాలో ముందుగా మాకు చెప్పాల్సిందే.. మీ ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోకూడదు. మేం చెప్పిన వారికి పనులు చేసిపెట్టాల్సిందే. అందుకు ఇష్టమైతేనే ఉండాలి. లేకుంటే, ఇంకోచోట పోస్టింగ్ వేయించుకోవడమే.. ఆల్రెడీ.. మాకు మంత్రిగారు, ఎమ్మెల్యే గారు చెప్పారు. మాకు నచ్చని పనులు జరిగితే, వాళ్లకు చెప్పి ఊడబీకిస్తాం’ జిల్లా కేంద్రం నుంచి గ్రామస్థాయి పరిపాలనా కార్యాలయం వరకు ప్రస్తుతం వినిపిస్తోన్న బెదిరింపులు, హెచ్చరికల పర్వం ఇది.. అధికార పార్టీ నేతలు, పార్టీలో చోటామోటా గుర్తింపున్న కార్యకర్తలు సైతం ప్రభుత్వ పరిపాలనలో తమ పెత్తనం ఉండాలని కోరుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వశాఖల ఉన్నతాధికారులు, కింది స్థాయి సిబ్బంది అధికారపార్టీ నేతల ఫోన్లంటేనే ఉలికిపాటుకు గురవుతున్నారు. ఇదేక్రమంలో స్థానిక మంత్రితో పలువురు జిల్లా పర్యటనలకొస్తున్న ప్రభుత్వ పెద్దలు పార్టీకేడర్‌ను పక్కన నిల్చోబెట్టుకుని మరీ అధికారులతో సమీక్షలు చేయడం సమస్యగా మారింది. కొన్ని సందర్భాల్లో మంత్రులు అధికారులను పలు విషయాలపై ప్రశ్నిస్తున్నప్పుడు అక్కడున్న పార్టీ వ్యక్తులు జోక్యం చేసుకుని సమాధానాలు, ఫిర్యాదులు చేయడం గందరగోళానికి గురిచేస్తోంది. గ్రామ, మండల స్థాయిల్లో చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగి, రేషన్‌డీలర్, అంగన్వాడీ టీచర్ దగ్గర్నుంచి ఆయాపోస్టుల్లో పనిచేస్తున్న వారిని సైతం బెదిరిస్తూ హల్చల్ చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. సంతనూతలపాడు, దర్శి, అద్దంకి, యర్రగొండపాలెం, మార్కాపురం, కనిగిరి, కొండపి నియోజకవర్గాలతో పాటు ఒంగోలు నగరంలోనూ అధికారపార్టీ నేతల దందా పెచ్చుమీరుతోంది. ప్రకాశం భవన్ వద్ద నిత్యం తిష్టవేస్తున్న ఇద్దరు తెలుగు తమ్ముళ్లు సందర్శకులపై ప్రత్యేక నిఘా ఉంచి .. వివరాలను ఆరాతీస్తుండటం గమనార్హం. జిల్లా ఉన్నతాధికారులను ఎవరెవరు కలుస్తున్నారు..? ఏఏ విషయాలు మాట్లాడుతున్నారనే.. సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. అదేవిధంగా దర్శి తాలూకా కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే, మంత్రికి చెందిన వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే నిత్యం వచ్చిపోతున్నారు. వారు సిఫార్సు చేసిన వారికే లబ్ధిచేకూర్చాలని.. వైరిపార్టీలకు చెందిన వారిని దూరంగా పెట్టాలంటూ బహిరంగంగా అధికారులకు చెబుతున్నట్లు తెలుస్తోంది. సగానికిపైగా అనధికార డీలర్‌షిప్పులు.. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకుందామనే ఎత్తుగడతో నిన్నటిదాకా టీడీపీలో చోటామోటా నేతలుగా ఎదిగిన వారు నేడు ఎవరికివారు గ్రామాల్లో పవర్ పాలిట్రిక్స్‌కు పాల్పడుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా ప్రజాపంపిణీ దుకాణాలపై కన్నేసిన తెలుగు తమ్ముళ్లు రేషన్డీలర్లను బెదిరించి.. నెలవారీ సరుకుల డీడీలు తీయించకుండా అడ్డుకుంటున్నారు. ఇకనుంచి, ప్రజాపంపిణీ దుకాణాలను తామే నడుపుకుంటామని.. డీడీలు కూడా తామే చెల్లించుకుంటామని ఆర్డర్ జారీచేస్తున్నారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా సగానికిపైగా దుకాణాలను అధికార పార్టీకి చెందిన వ్యక్తులే అనధికారికంగా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. డీలర్షిప్ లెసైన్స్ ఉండి కూడా వ్యాపారం చేయలేని బాధితులు కలెక్టర్, పౌరసరఫరాల అధికారికి మొరపెట్టుకుంటున్నా.. ఫలితం ఉండటం లేదు. అంగన్వాడీ, ఉపాధిహామీ పోస్టుల పరిస్థితీ అంతే. కొన్ని మండలాల్లో ప్రభుత్వ టీచర్లు, ఎంఈవో స్థాయి అధికారులపైనా అధికారపార్టీ పెత్తనం చేస్తోంది. మాటవినని సిబ్బందిపై ఆకస్మిక తనిఖీల పేరుతో వేటేసేందుకు సిద్ధపడుతున్నారు. ఇటీవల కనిగిరి నియోజకవర్గం సీఎస్‌పురంలో ఇటువంటి సంఘటన చోటుచేసుకోగా, అద్దంకి, బల్లికురవ మండలాల్లో రేషన్ దుకాణాల్లో రిజిస్టర్లనే కొందరు మాయం చేసి.. డీలర్లును ఇరికించిన ఘటనలు వెలుగులోకొచ్చాయి. అధికారుల మనస్తాపం.. రెవెన్యూ కార్యాలయాల్లో పాగా వేస్తున్న తెలుగు తమ్ముళ్లు అధికారుల విధుల్లో జోక్యం చేసుకోవడం వివాదానికి దారితీస్తోంది. పట్టాదారు పాస్‌పుస్తకాల జారీ, ఇంటిపట్టా, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల విషయంలో తాము చెప్పిన వారికే అందజేయాలంటూ హుకుం జారీచేస్తున్నారు. పనిఒత్తిడి నేపథ్యంలో సిబ్బంది ఒకట్రెండు విషయాల పట్ల నెమ్మదిస్తే... వారిని వైరిపార్టీకి చెందిన వ్యక్తులుగా చిత్రీకరిస్తూ రాద్ధాంతం చేయడం రివాజైంది. ఇటీవల ఒంగోలు తాలూకా రెవెన్యూ కార్యాలయంలో పట్టాదారు పాసుపుస్తకాల మంజూరుకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యే సమక్షంలోనే తెలుగుతమ్ముళ్లు ప్రభుత్వ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా, అధికారులు తమపార్టీకి చెందిన వారు కాదని కావాలనే తమ పనుల విషయంలో జాగు చేస్తున్నారంటూ ఆరోపణలకు దిగారు. ఇలాంటప్పుడు సీనియర్ అధికారులు సైతం తప్పుచేసిన వారిలాగా తలొంచుకుని ఉండాల్సి వస్తోంది. వారి ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక.. మౌనంగా మనస్తాపానికి గురవుతున్నారు. ఇదేవిధంగా టీడీపీ తమ్ముళ్ల చర్యలు కొనసాగితే, అన్నివర్గాల్లో మూకుమ్మడి అసంతృప్తి రగులుతుందని ప్రజాసంఘాల నేతలంటున్నారు. -
ఖాళీ పోస్టులన్నింటినీ భర్తీ చేస్తాం
నిజాంసాగర్: నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తూ, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేస్తామని వ్యవసాయ శాఖమంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. చాలా పోస్టులు ఖాళీగా ఉండటంతో ఇన్చార్జిలతో పరిపాలన నెట్టుకొస్తున్నామన్నారు. శనివారం సాయంత్రం నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు ఆయన నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 కేడర్‌తో పాటు అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న అధికారుల పోస్టులను భర్తీ చేస్తామన్నా రు. నీటి పారుదల శాఖ, ట్రాన్స్‌కో, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా వంటి శాఖల్లో అధికారులతోపా టు కిందిస్థాయి సి బ్బందిని నియమిస్తున్నామన్నారు. ఆదర్శ రైతుల అవినీతిని కక్కిస్తాం బీర్కూర్ : గత ప్రభుత్వం ఆదర్శ రైతుల పేరుతో ప్రజా ధనాన్ని వృథా చేసిందని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. ఒక్క ఎకరం భూమి లేనివారు కూడా ఆదర్శ రైతులుగా నియమితులయ్యారని, వారి అవినీతిని కక్కిస్తామని హెచ్చరించారు. శనివారం ఆయన బీర్కూర్‌లో విలేకరులతో మాట్లాడారు. ఆదర్శ రైతులు డబ్బులకు కక్కుర్తి పడి పంట నష్టపోని రైతులకు కూడా నష్టపోయినట్లు వివరాలు అందించారని అన్నారు. వారి పెత్తనం ఎక్కువ కా వడం తో ప్రభుత్వానికి సరైన నివేదిక అందలేదని, దీంతో నిజమైన లబ్ధిదారులకు ఇన్పుట్ సబ్సిడీ అందలేదన్నారు. తీవ్ర విమర్శలకు కారణమవుతున్న ఆదర్శ రైతుల వ్యవస్థను వెంటనే తొలగిస్తున్నామని పేర్కొన్నారు. దీనిపై సంతకం కూడా అయిపోయిందన్నారు. గత ఐదేళ్లుగా తెలంగాణ జిల్లాలలో పంట నష్టపోయి న 26 లక్షల మంది రైతులకు రూ. 482.52 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. భూమి లేనివారికి రుణాలు మాఫీ కుదరదు ప్రభుత్వం సుమారు రూ. 18 వేల కోట్ల పంట రుణాలను మాఫీ చేసిందని మంత్రి తెలిపారు. కొంత మంది దొంగ పాస్ బుక్‌లు రూపొందించి బ్యాంక్‌లలో రుణా లు పొందారని, అలాంటి వారికి రుణాలు మాఫీ కావ ని అన్నారు. భూమి లేనివారు తీసుకున్న రుణాలను మాఫీ చేయబోమన్నారు. కొందరు అధికారులు డబ్బులకు కక్కుర్తి పడి దొంగ పట్టాలు మంజూరు చేశారని, అలాంటి వారిని గుర్తిస్తామన్నారు. ప్రభుత్వం నుంచి మంజూరైన ప్రతీ రూపాయి పేదలకు చెందాలని అ న్నారు. భూమి లేనివారికి పంట రుణాలు మాఫీ అయినట్లు తెలిస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన 80 రోజులలోనే అ నేక హామీలను నెరవేర్చామన్నారు. విలేకరుల సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ దఫేదార్ రాజు తదితరులు పాల్గొన్నారు. -
అవుట్ సోర్సింగ్ సిబ్బందికి ‘ఎసరు’
- జిల్లాలో 6వేల మంది ఉద్యోగుల తొలగింపునకు యత్నం - నెలాఖరుతో ముగియనున్న అవుట్ సోర్సింగ్ గడువు ఏలూరు : జిల్లాలో ప్రభుత్వ శాఖల్లో అవుట్ సోర్సింగ్ పద్ధతిన పనిచేస్తున్న సిబ్బంది ఉద్యోగాలకు ఎసరు పెట్టేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ప్రభుత్వ నిర్ణయం మీద సుమారు 6వేల కుటుంబాల భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఏ శాఖలోనైనా వీరు లేనిదే పని నడవని పరిస్థితి. నెలనెలా సకాలంలో జీతం అందకపోయినా ఇబ్బందులు పడుతూనే ఉద్యోగాలు చేస్తున్నారు. జీతం ఎప్పుడు ఇస్తారో తెలియదు. పోరాటాలు చేస్తే నాలుగైదు నెలల జీతం ఒకేసారి ఇస్తున్నారు. తమ ఉద్యోగాలకు మంగళం పాడితే కుటుంబంతో సహా రోడ్డున పడతామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటికో ఉద్యోగం వంటి హామీలతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చారు. ఆయన ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టాక ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతున్నారని చిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కాంట్రాక్టు గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. వీరి సర్వీసును మరో ఏడాది పొడిగిస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ కావాల్సి ఉంది. ప్రభుత్వంలో చలనం లేదు. దీంతో తమను తొలగించడం ఖాయమన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. .దీనిపై ఉద్యోగ సంఘాల నాయకులు వివిధ దశల్లో ఆందోళనలకు రూపకల్పన చేస్తున్నారు. అవుట్సోర్సింగ్ సేవలందిస్తున్న ఉద్యోగులు ఇలా గ్రామీణాభివృద్ధి సంస్థలో జిల్లా వ్యాప్తంగా అవుట్ సోర్సింగ్ సిబ్బంది సుమారు 100 పనిచేస్తున్నారు. రెవెన్యూశాఖలో కలెక్టరేట్ నుంచి ఆర్డీవో, తహసిల్దార్ కార్యాలయాల్లో 43మంది కంప్యూటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు విధులు నిర్వహిస్తున్నారు. జిల్లా పరిషత్‌లో ఆరుగురు, జిల్లా నీటి యాజమాన్య సంస్థలో 80మంది ,ఉపాధి హామీ పథకంలో 300 మంది, వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని 108, 104, జాతీయ ఆరోగ్యమిషన్ లలో 150 మంది ల్యాబ్ టె క్నీషియన్లు, కంప్యూటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు పనిచేస్తున్నారు. మహిళ శిశు అభివృద్ధి సంస్థలో 40 మంది ,విద్యాశాఖలో కంప్యూటర్ టీ చర్లు, టీఆర్సీలు, డ్రాయింగ్ టీచర్లుగా 2000 మంది, జిల్లాలో ఏలూరు కార్పొరేషన్‌తో పాటు అన్ని మునిసిపాలిటీల్లో కలిపి సుమారు 1000 మంది సిబ్బంది కాంట్రాక్టు పద్ధతిలో ఏళ్ల తరబడి సేవలందిస్తున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో డేటా ఎంట్రీ, ల్యాబ్ అసిస్టెంట్లు, ఇతర ఆపరేటర్లు 400 మంది, గ్రామాల్లో, పీహెచ్‌సీల్లో సెకండ్ ఏఎన్ఎంలు 600 మంది, ఇరిగేషన్ శాఖ ,పోలవరం ప్రాజె క్టు పరిధిలో హెల్పర్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, సర్వేయర్లు, 200 మంది, పశుసంవర్థకశాఖలో గోపాలమిత్ర, ఇతర సేవల కింద 100 మంది, రోడ్లు, భవనాల శాఖ, పంచాయతీ రాజ్ శాఖల్లో 200 మంది క్షేత్ర స్థాయిలోను సేవలందిస్తున్నారు. ఉద్యాన శాఖలో క్షేత్ర స్థాయిలో 100 మంది, ఇందిర క్రాంతి పథం కింద ధాన్యం కోనుగోలు, భూములు గుర్తింపు పనుల కింద 200 మంది అవుట్ సోర్సింగ్‌లో పనిచేస్తున్నారు. వీరందరికి మంగళం పాడితే ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీలు భర్తీకాక ఇప్పుడున్న సిబ్బందే నానాపాట్లు పడుతున్నారు. ఇక వీరి కష్టాలు మరింత పెరిగిపోతాయి. ఖాళీలు భర్తీ చేయకపోగా అవుట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగిస్తే ప్రభుత్వ కార్యక్రమాల నివేదికలను అందించటం కష్టం అవుతుందని అన్ని శాఖల్లోను గుబులు రేగుతోంది. క్రమబద్ధీకరించాల్సి వస్తుందని ప్రభుత్వం ఎత్తుగడ! అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సేవలకు పూర్తిస్ధాయిలో మంగ ళం పాడకపోతే వారు తమ సర్వీసులను క్రమబద్ధీకరించాలని ఆందోళన మొదలెడతారని టీడీపీ సర్కార్ ఈ ఎత్తుగడకు దిగిందన్న విమర్శలు వస్తున్నాయి. దశలవారీగా వీరిసేవలకు ఫుల్స్టాప్ పెట్టి, కొత్త వారిని తీసుకుంటారని భావిస్తున్నారు. ఉద్వాసనకు గురయ్యే వారిలో అతి తక్కువ మందికి మాత్రమే తిరిగి ఉద్యోగాలు లభిస్తాయని ప్రస్తుత అవుట్ సోర్సింగ్ సిబ్బందిలో ఆందోళన వ్యక్తమవుతోంది -
శాఖలపైమంత్రి సమీక్ష
కలెక్టరేట్ : ప్రభుత్వ శాఖలలో అమలవుతున్న పథకాలపై అటవీ, పర్యావరణశాఖ మంత్రి జోగు రామన్న సమీక్షించారు. మంగళవారం అటవీశాఖ కార్యాలయంలోని అతిథి గృహం లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వ్యవసాయ, ఆత్మ, వెటర్నరీ, ఉద్యానవన, గ్రామీణ నీటి సరఫరాపై అధికారులతో మంత్రి సమావేశమయ్యారు. ముందుగారా మన్నను ఆయా శాఖల ఆధ్వర్యంలో పుష్పగుచ్చాలు, శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భం గా మంత్రి మాట్లాడుతూ ముఖ్యంగా ఆయా శాఖల్లో ఉన్న ఖాళీల వివరాలు, గతేడాదిలో శాఖలవారీగా లక్ష్యం, సాధించిన ప్రగతి నివేదిక లు తనకు సమర్పించాలని సూచించారు. పెండింగ్ బడ్జెట్ పూర్తి సమాచారాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. శాఖల మీద అవగాహన కోసం సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నార్నూర్ మం డలంలోని వెటర్నరీ భవనానికి సంబంధించి నిధులు రాలేదని అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వెట ర్నరీ శాఖలో ఉద్యోగుల ఖాళీలు తదితర వివరాలు తన కు పంపించాలన్నారు. వ్యవసాయ శాఖకు అనుబంధంగా ఉన్న పౌల్ట్రీ, డెయిరీఫాంలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. వాటర్షెడ్లు జిల్లాలో ఎన్ని ఉన్నాయని అడగగా, జిల్లాలో 30 చోట్ల వాటర్షెడ్లు ఉన్నాయని అధికారులు తెలిపారు. రైతులకు శిక్షణ అందించడంలో ఆత్మ వెనుకబాటుగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆత్మకు సంబంధించిన వివరాలు తనకు పంపాలన్నారు. హార్టికల్చర్ పంటలకు సంబంధించి మామిడి, పసుపు, మిర్చి, అరటి, కూరగాయల పంటలను పండిం చే విధానం, జిల్లాలో ఎక్కడెక్కడ పండిస్తున్నారో తెలుసుకున్నారు. 21,673 హెక్టార్లలో మామిడి, 2,600 హెక్టార్లలో పసుపు పండిస్తున్నారని ఏడీ రమణ పవర్‌పాయిం ట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి అమలులో జిల్లా వెనుకబడి ఉందన్నారు. వ్యవసాయానికి సంబంధించి ఈ ఏడాది 27 కంపెనీలకు చెందిన 20.63 లక్షల ప్యాకెట్ల విత్తనాలు మన జిల్లాకు వచ్చాయని జేడీఏ రోజ్‌లీల తెలిపారు. నష్టపరిహారం వచ్చిందా? ఇంకేంత రా వాల్సి ఉంది? అనే విషయాలు మంత్రి అడిగి తెలుసుకున్నారు. విత్తనాల ఉత్పత్తిపై సీఎం కేసీఆర్ దృష్టి సారించినట్లు తెలిపారు. అయితే జిల్లాలో గోదాముల నిర్మాణానికి కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం జాతీయ ఆహార భద్రత పథకం, గ్రామీణ నీటి సరఫరాపై సమీక్షించారు. అంతకు ముందు వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అమలవుతున్న జననీ సురక్ష యోజన తదితర పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. పేద రోగుల కు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. రోగులకు చికిత్స అందించేందుకు ఆసుపత్రుల్లో సౌకర్యాలు, నిధుల వినియోగంపై తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ఎడీఎహెచ్ రామరావు, కుమారస్వామి, నర్సింగ్‌రావు, హార్టికల్చర్ ఏడీ రమణ, ఆత్మ పీడీ మనోహర్, జేడీ ఏ రోజ్‌లీల, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
బకాయిల షాక్
సాక్షి, అనంతపురం : జిల్లాలో విద్యుత్ పంపిణీ సంస్థకు బకాయిల భారం ఎక్కువైపోయింది. ప్రధానంగా వివిధ ప్రభుత్వ శాఖల నుంచి కోట్లాది రూపాయల బకాయిలు పేరుకుపోయాయి. జిల్లాలోని 12 ప్రభుత్వ శాఖలు, మునిసిపాలిటీలు, మేజర్, మైనర్ పంచాయతీల నుంచి మే 30వ తేదీ 2014 నాటికి రూ.95.07 కోట్ల బకాయిలు ఉన్నట్లు ఆ శాఖ అధికారులు తేల్చారు. ఇందులో సింహభాగం మేజర్, మైనర్ పంచాయతీల నుంచే రావాల్సి ఉందని గణాంకాలు చెబుతున్నాయి. మైనర్ పంచాయతీల నుంచి రూ.52.86 కోట్లు, మేజర్ పంచాయతీల నుంచి 25.86 కోట్లు బకాయిలు పేరుకుపోయినట్లు రికార్డులు చెబుతున్నాయి. దీంతో చేసేది లేక అప్పుడప్పుడు విద్యుత్తు శాఖ పంచాయతీలకు ఝలక్ ఇస్తోంది. ఈ సంవత్సరంలో ఇప్పటికే ఒకసారి విద్యుత్ వాడకం బిల్లు చెల్లించలేదని సోమందేపల్లి, పెనుకొండ పంచాయతీల వీధి దీపాలకు సరఫరా నిలిపివేసింది. పంచాయతీలు కూడా చేసేది లేక ఎంతో కొంత కట్టి మళ్లీ సర్వీసును పునర్దురించుకుంటున్నాయి. ఇదీ పరిస్థితి జిల్లాలో మేజర్ పంచాయతీల వీధి దీపాల విద్యుత్ వాడకం, రక్షిత నీటి సరఫరా విద్యుత్ వాడకం బిల్లు సుమారు రూ.25.86 కోట్లు పేరుకుపోయింది. మైనర్ పంచాయతీల్లో కూడా విద్యుత్తు వాడకం, రక్షిత నీటి సరఫరా వాడకం బిల్లు రూ.52.86 కోట్లు ఉన్నాయని అధికారులు లెక్కలు వేస్తున్నారు. రెండేళ్లుగా ఈ లెక్కలు తగ్గడం లేదని విద్యుత్ పంపిణీ సంస్థ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ శాఖల పరంగా చూస్తే..పశుసంవర్ధశాఖ రూ.3.19 లక్షలు, ఉన్నత విద్యాశాఖ రూ.4.86 లక్షలు, వైద్య ఆరోగ్యశాఖ రూ.82.04 లక్షలు, పోలీసుశాఖ రూ.37.19 లక్షలు, పంచాయతీ రాజ్ శాఖ రూ.1.02 కోట్లు, నీటి సరఫరా విభాగం రూ.2.51 కోట్లు, రెవిన్యూ రూ.16.21 లక్షలు, సోషల్ వెల్ఫేర్ రూ. 11.77లక్షలు, కేంద్ర ప్రభుత్వ శాఖలు రూ.37 వేల బకాయిలు ఉన్నాయి. 8,97,512 గృహ కనెక్షన్ల ద్వారా 41.52 కోట్లు, 1,93,859 వ్యవసాయ కనెక్షన్ల నుంచి రూ.20.66 కోట్లు.. 79,464 వాణిజ్య కనెక్షన్ల నుంచి 4.64 కోట్లు, భారీ తరహా పరిశ్రమలు 2.51 కోట్లు, చిన్నతరహా పరిశ్రమల నుంచి 26 లక్షలు, ఆలయాలు, చర్చిలు, మసీదులు, ప్రభుత్వ పాఠశాలల నుంచి రూ.92 లక్షలు, ఎగ్జిబిషన్లు తదితర తాత్కాలిక కనెక్షన్ల ద్వారా రూ.66 వేలు బకాయిలు విద్యుత్తు పంపిణీ సంస్థకు రావాల్సి ఉంది. అధికారులు ఏమంటున్నారంటే..? జిల్లా అంతటా వాడుకున్న విద్యుత్తుకు బకాయిలు పేరుకుపోయాయని ట్రాన్స్‌కో అధికారులు చెబుతున్నారు. మేజర్ పంచాయతీల వారికి విద్యుత్తు బిల్లుల్లో ఎటువంటి రాయితీలు ఉండవు. వారే సొంతంగా బిల్లులు చెల్లించాలి. మైనర్ పంచాయతీలకై తే ప్రభుత్వమే బిల్లులు చెల్లిస్తుంది. ఈ దశలో ఫిబ్రవరి నెలలో ఆయా పంచాయతీలకు ట్రాన్స్‌కో అధికారులు బిల్లులు అందజేసి కొంతైనా కట్టకపోతే ఫీజులు తొలగిస్తాం అని సిబ్బంది ద్వారా తెలియజేస్తున్నారు. అయినా అతి తక్కువ మంది మాత్రమే స్పందించారని అంటున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఉన్నతాధికారుల సూచనల మేరకు గత ఫిబ్రవరిలో కొన్ని పంచాయతీలకు విద్యుత్ సరఫరా నిలిపివేశామని అధికారులు చెప్పారు. పస్తుతం తిరిగి బకాయిల వసూళ్ల కోసం ప్రభుత్వ శాఖలతో పాటు గృహ, వాణిజ్య కనెక్షన్ వినియోగదారులకు సైతం నోటీసులు అందజేస్తున్నామని చెబుతున్నారు. రక్షిత నీటి పథకాలకు వేసవిలో నీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకుని ప్రజల సౌలభ్యం కోసం ప్రస్తుతం మేజర్, మైనర్ పంచాయతీల్లో కనెక్షన్లు తొలగించడం లేదని, అయితే పరిస్థితి అర్థం చేసుకుని బిల్లులు చెల్లించాలని కోరుతూ ముందస్తు సూచనగా నోటీసులు జారీ చేస్తున్నామని తెలిపారు. పంచాయతీలకు మంజూరవుతున్న 13వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ఫైనాన్స్ నిధుల నుంచి కొంతైనా బకాయిలు తీర్చాలని వారంటున్నారు. నోటీసులకు స్పందించి బిల్లులు చెల్లించకపోతే వ్యవసాయ, గృహ వినియోగదారులపై ఆర్ఆర్ యాక్టు ప్రయోగిస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వమే భరించాలి అసలే అంతంత మాత్రం ఆర్థిక వనరులతో పంచాయతీలు నడుస్తున్నాయి. ఈ సమయంలో పంచాయతీ నిధుల నుంచి బిల్లుల చెల్లింపు తలకు మించిన భారంగా మారిందని పంచాయతీల సర్పంచులు అంటున్నారు. వస్తున్న కొద్దిపాటి నిధులు వీటికే సరిపోతుంటే ఇక గ్రామాల్లో అభివృద్ధి పనులెలా చేయాలని అంటున్నారు. మైనర్ పంచాయతీలకు ఇస్తున్నట్లే మేజర్ పంచాయతీలకు కూడా ప్రభుత్వమే విద్యుత్ బిల్లులను భరించాలని ఆయా గ్రామ సర్పంచులు డిమాండ్ చేస్తున్నారు. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో లోటు బడ్జెట్‌తో పాలన ఎలా సాగించాలని కాబోయే సీఎం చంద్రబాబునాయుడు తల పట్టుకుంటుండగా, ఇప్పుడు ఈ పంచాయతీలకు బిల్లులు ఎక్కడ మంజూరు చేస్తారని మరోవైపు టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులే బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నారు. -
కొత్త..కొత్తగా..
జూన్ 2 నుంచి జిల్లాలో అన్ని ప్రభుత్వ శాఖల్లో కొత్త పాలన అకౌంట్లు, రికార్డులు నిర్వహణ అన్నీ కొత్తగానే ప్రారంభం మారనున్న వాహన రిజిస్ట్రేషన్ సిరీస్ సాక్షి, విశాఖపట్నం: జూన్ 2 నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా ఏర్పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వ పాలన కూడా కొత్తగా ప్రారంభం కాబోతోంది. జిల్లాలోని సుమారు 52 ప్రభుత్వ శాఖలు ఆ రోజు నుంచి పూర్తిగా అకౌంట్లు, రికార్డుల నిర్వహణ అంతా కొత్తగా మొదలు పెట్టనున్నాయి. జిల్లాకు సంబంధించిన వివిధ గణాంకాలు మినహా ప్రభుత్వం నుంచి రావలసిన నిధులు, అవసరమైన నిధులు అన్ని వివరాలు ఇప్పటికే కొత్తగా నమోదు చేశారు. ప్రస్తుత పాత రికార్డులన్నీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి నిర్వహించగా, ఇకపై నూతన ఆంధ్రప్రదేశ్‌ను దృష్టిలో ఉంచుకుని తయారు చేస్తున్నారు. ఇప్పటికే ఆయా ప్రభుత్వ శాఖల కొత్త వెబ్సైట్లు కూడా తయారవుతున్నాయి. సర్వర్లు కూడా వేటికవే విడివిడిగా సిద్ధం చేస్తుండడంతో ఆ మేరకు జిల్లా ప్రభుత్వ కార్యాలయాల్లో సాంకేతిక విధానాన్ని మార్చుతున్నారు. రవాణా, ట్రెజరీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖల్లో మరిన్ని భారీ మార్పులు వస్తున్నాయి. రెండో తేదీ నుంచి కొత్త పాలన మొదలు కానుండడంతో జిల్లాలో అన్ని కొత్త వాహనాలకు ఇకపై కొత్త తరహా రిజిస్ట్రేషన్ నంబర్లు కేటాయించనున్నారు. ప్రస్తుతమున్న రిజిస్ట్రేషన్ సిరీస్‌లు కూడా మారబోతున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇటువంటి మార్పుల కోసమే శుక్రవారం నుంచి పలు సర్వర్లు, మీసేవా కేంద్రాలు సైతం మూతపడ్డాయి. ఇంకో పక్క జిల్లాలోని అన్ని ప్రభుత్వశాఖల అధికారులు తక్షణ నిధుల కోసం ప్రస్తుతం నివేదికలు తయారుచేసే పనిలో పడ్డారు. వ్యవసాయశాఖ, పశుసంవర్థక, విద్యా, వైద్య శాఖలు నూతన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొలువైన తర్వాత తక్షణ నిధులు తెచ్చుకునేందుకు వీలుగా ప్రతిపాదనలు తయారు చేస్తున్నాయి. ప్రాంతీయ కంటి ఆస్పత్రి, వైద్య ఆరోగ్యశాఖ, రిజిస్ట్రేషన్ల శాఖ, ఎక్సయిజ్, పోలీసు విభాగాలు విభజన నేపథ్యంలో జిల్లాలో తమ తమ విభాగాలను బలోపేతం చేసేందుకు ఇప్పటికే ప్రతిపాదనలను ఆయా రాష్ట్ర ఉన్నతాధికారులకు పంపించాయి. ఇకపై హైదరాబాద్‌కు ఫోన్ చేయాల్సిన ఉన్నతాధికారుల వివరాలు, ఫోన్ నంబర్లు, ల్యాండ్ నంబర్లు మారుతుండడంతో ఆ వివరాలను శాఖల వారీగా జిల్లాలో మార్చారు. ప్రజలకు, ఇతర ముఖ్యులకు వాటిని ఇవ్వాల్సిన అవసరమున్నచోట అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. పలు రికార్డులు, ఫైళ్లపై వేసే స్టాంపులను సైతం ఇప్పటికే మార్చే పనిలో పడ్డారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, హైదరాబాద్ చిరునామాతో స్టాంపింగ్ వేస్తుండగా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పేరును కొనసాగించి రాజధాని పేరును మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కొత్త రాజధాని ఖరారైన వెంటనే స్టాంపింగ్‌లో మార్పులు చేయనున్నారు. అటు రిజిస్ట్రేషన్ల శాఖలోనూ వెండింగ్ పేపర్లపైనా చిరునామాలు మార్చి అమల్లోకి తీసుకువస్తున్నారు. పరిశ్రమలశాఖ, ఉపాధి, బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లలో ఇప్పటికే స్వయం ఉపాధి రుణాల కోసం చేసుకున్న నిరుద్యోగ యువత, కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేసి ప్రభుత్వ రాయితీల కోసం ఆయా వర్గాలు కొన్నాళ్ల కిందట జిల్లా అధికారులకు దరఖాస్తులు పెట్టుకున్నారు. వీటిని హైదరాబాద్‌లోని ఉన్నతాధికారులకు పంపారు. కానీ ఇప్పుడు శాఖల విభజన జరగడం, ఉన్నతాధికారులు మారడంతో పెట్టుకున్న దరఖాస్తులన్నీ రద్దుకానున్నాయి. దీంతో నిరుద్యోగులు, చిన్న తరహా పారిశ్రామిక వేత్తలు ఇప్పుడు తమ పరిస్థితి ఏంటోనని అధికారులు చుట్టూ తిరుగుతున్నారు. -
విభజన ఫీవర్‌తో ముందుకు సాగని పాలన
- జూన్2 వరకూ ఇదే పరిస్థితి జిల్లాలో ప్రభుత్వ శాఖల - ఉన్నతాధికారులకు తెలంగాణ భయం - ఉద్యోగుల సర్దుబాటులో ఎక్కడకు బదిలీ అవుతామో తెలియని అయోమయం సాక్షి,విశాఖపట్నం : అధికారుల బదిలీ బెంగ కా రణంగా జిల్లాలో దాదాపు పాలన స్తంభించిపోయింది. అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారుల కు ఇప్పుడు తెలంగాణ భయం వెన్నాడుతోంది. జూన్ 2న తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఆవిర్భావం కారణంగా ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రి య జరుగుతుండడంతో ఎక్కడ తాము తెలంగాణకు బదిలీ అయ్యే ప్రమాదం ఉంటుందోనని కంగారు పుట్టిస్తోంది. రెండు రాష్ట్రాల్లోని ఆయా శాఖలకు సంబంధించిన ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియ ఊపందుకోవడంతో తాము ఎటువైపు వెళ్లాల్సి వస్తుందో అర్థంకాక అనేకమంది అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అసలు స్థాన చలనానికి ఏ అంశాన్ని ప్రా తిపదికగా తీసుకుంటారో తెలియక అయోమయానికి గురవుతున్నారు. జిల్లాలో సుమారు అన్ని ప్రభుత్వ శా ఖల్లో డిప్యూటీ డెరైక్టర్, సూపరింటెండెంట్ ఇంజినీర్, ప్రాజెక్ట్ డెరైక్టర్, జాయిం ట్ డెరైక్టర్, డిప్యూటీ డెరైక్టర్ తదితర హోదాల్లో జిల్లా స్థాయి అధికారులు పని చేస్తున్నాయి. వీరేకాక ప్రాంతీయ ప్రభుత్వ కార్యాలయాల పేరుతో దే వాదాయ, విద్యా, పౌరసరఫరాలు,మార్కెటిం గ్, కార్మిక, వ్యవసాయ,గనులు,వైద్య ఆరోగ్యం, మున్సిపల్,స్టాంపులు రిజిస్ట్రేషన్లు, సహకారం తదితర శాఖల్లోనూ ఉన్నతాధికారులు విధులు నిర్వహిస్తున్నారు. వీరంతా రాష్ట్ర స్థాయి అధికారులే. వీరిలో అధిక శాతం మంది స్వస్థలం, విద్యాభ్యాసం పరంగా హైదరాబాద్, ఇతర తెలంగాణ జిల్లాల్లో ఎంతో కొంత స్వల్ప కాలం సంబంధం ఉంది. వీరిలో చాలామందికి హైదరాబాద్, ఇతర తెలంగాణ జిల్లాల్లో పని చేసిన అనుభవం ఉంది. స్వతహాగా తమది సీమాంధ్ర అయినా తల్లిదండ్రులు తెలంగాణలో ఉద్యోగం కారణంగా అక్కడ జన్మించిన వారూ ఉన్నారు. ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియలో స్థానిక, స్థానికేతర విభాగాల్లో ఏది తమకు వర్తిస్తుందో వీరికి అర్థం కావడం లేదు. దీంతో తమ సర్వీసు, విద్యాభ్యాసం, తల్లిదండ్రుల సర్వీసు విభాగాల్లో తమను సీమాంధ్ర, లేదా తెలంగాణ రాష్ట్రాల్లో ఎటువైపు కదుల్చుతారో తెలియక వీరంతా భయపడుతున్నారు. తెలంగాణలో ఆ ప్రాంత ఉద్యోగులతో కలిసి పనిచేయాల్సి వస్తే ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందోనని సీమాంధ్ర ఉద్యోగులకు అంతుపట్టడంలేదు. మరోపక్క ఉద్యోగుల విభజన ప్రక్రియలో ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగుల కొరత ఉంటే సీమాంధ్రకు చెందిన ఉద్యోగులతో భర్తీ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. స్పష్టత లేక తిప్పలు ఉద్యోగుల సర్దుబాటు, బదిలీలను రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించి మార్చుతారని ప్రచారం ఉంది. కానీ ప్రస్తుతం ఆచరణలో ఇది పూర్తిస్థాయిలో జరగడం లేదు. ఈ నేపథ్యంలో స్థానికత, విద్యాభ్యాసం, తల్లిదండ్రులు గతంలో చేసిన ఉద్యోగ ప్రాంతం వీటిలో దేన్ని ప్రాతిపదికగా పరిగణిస్తారో చాలామంది జిల్లా అధికారులకు అర్థం కావడం లేదు. దీనిపై ఇప్పటికీ స్పష్టత లేకపోవడంతో జిల్లా అధికారులు సైతం అయోమయానికి గురవుతున్నారు. జూన్ 2 నాటికి ఈ బదిలీల ప్రక్రియ ముగియాల్సి ఉన్నందువల్ల ఈలోగా తమ పోస్టు జిల్లాలో ఉంటుందో తెలంగాణకు మారుతుందో తెలీక జిల్లా అధికారులు టెన్షన్ పడుతున్నారు. -
విభజన కసరత్తు
నల్లగొండ, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో విభజన కసరత్తు శరవేగంగా జరుగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో లెక్కల విభజన ఈ నెల 24తో ముగియనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థ్ధిక బడ్జెట్ పరిధిలో ఉన్న చెల్లింపులన్నీ 24వ తేదీతో పూర్తికానున్నాయి. ప్రభుత్వ శాఖల పరిధిలోని అన్ని శాఖల ఉద్యోగులకు, పెన్షన్‌దారులకు ఇతరత్రా అన్ని చెల్లింపులు అదే రోజు తెగదెంపులు కానున్నాయి. దీని కోసం అధికారులు లెక్కలు సిద్ధం చేయడంలో మునిగితేలుతున్నారు. చెల్లింపులకు సంబంధించిన ఏర్పాట్లను ట్రెజరీ శాఖలో అధికారులు పూర్తి చేస్తున్నారు. జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కానుండడంతో వచ్చే నెల నుంచి బడ్జెట్ విధానం ప్రత్యేక రాష్ట్ర పరిధిలోకి రానున్నాయి. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో భాగంగా విభజన లెక్కలు వేగవంతమయ్యాయి. మే 24 తర్వాత నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లెక్కలు వేటికవేనంటూ జిల్లా ట్రెజరీ శాఖకు ముందస్తు ఉత్తర్వులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులు, పెన్షన్‌దారులకు నిర్ణీత సమయానికి వేతనాలు, పెన్షన్లు ఇచ్చేందుకు కసరత్తు వేగవంతం చేస్తున్నారు. ఉద్యోగులకు, పెన్షనర్లకు 24నే వేతనాలు అందించనున్నారు. జూన్ 2 నుంచి తెలంగాణ ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించనుండడంతో 24న తీసుకునే వేతనం ఆంధ్రప్రదేశ్‌లో చివరిది కానుంది. జిల్లాలో మొత్తం ప్రభుత్వ ఉద్యోగులు 29,462, పింఛన్‌దారులు 19,405 మంది ఉన్నారు. ప్రభుత్వ వేతనం కింద ఉద్యోగులకు నెలకు సుమారు రూ.300 కోట్లు, పెన్షనర్లకు రూ. 29.80 కోట్లు చెల్లించాలి. ఈ మేరకు జీఓ నెం. 86 విడుదల చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఖాతా నుంచి తెలంగాణలోని ఉద్యోగులకు వేతనం చెల్లించనున్నట్లు పేర్కొంది. ఈ ఉత్తర్వులు అందుకున్న ట్రెజరీ శాఖ ఉద్యో గుల జాబితా, బ్యాంకు ఖాతాలను సిద్ధం చేస్తోంది. జిల్లాలో పింఛన్‌దారులకు కూడా మే నెల చెల్లింపును ఈ నెల 24నే చేయనున్నారు. నిధులు సర్దుబాటయ్యేనా..! ప్రభుత్వ పథకాల అమలుకు వివిధ శాఖలకు ఖజానా శాఖ ద్వారా నిధులు విడుదలవుతాయి. ఉద్యోగుల జీతాల మాదిరిగానే నిధుల ఖర్చుకు కూడా ఈ నెల 24 తుది గడువుగా నిర్ణయించారు. ఆలోగా వెచ్చించిన మొత్తాన్ని అప్పజెప్పాలంటూ ఆదేశాలు వచ్చే సూచనలు ఉన్నాయని అ ధికారులు చెబుతున్నారు. ఎన్నికల హడావిడిలో ఉన్న అధికారులు నిధుల వినియోగం ఎలా..? అని తలలు పట్టుకుంటున్నారు. 13వ ఆర్థిక సంవత్సరం నిధులు గత ఆర్థిక సంవత్సరం చివరి మాసం అయిన ఏప్రిల్‌లోనే విడుదల కావాల్సి ఉంది. ఆ మేరకు జిలా పంచాయితీ శాఖ బిల్లులు కూడా ట్రెజరీకి పంపింది. కానీ ఆర్థిక శాఖ నుంచి నిధులు రాకపోవడంతో బిల్లులు నిలిచిపోయాయి. ఈ నిధులకు సంబంధించి శనివారం జిల్లాకు రూ.19 కోట్లు వచ్చినట్లు పంచాయతీ అధికారులు చెబుతున్నారు. వీటిని రెండు, మూడు రోజుల్లోగా ట్రెజరీ నుంచి విడుదల చేయించి ఆ తర్వాత జిల్లా జనాభా, పంచాయతీ జనాభా ప్రాతిపదికన గ్రామాలకు నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. ఫీజులు, ఉపకార వేతనాలు అందేనా..? ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఇప్పటి వరకు పనులకు గ్రహణం ఏర్పడింది. 24వ తేదీ లోగా ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు విడుదల కావాలి. అంతే వేగంగా అధికారులు వాటి చెల్లింపులు పూర్తి చేయాలి. ముఖ్యంగా విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపులు ప్రధా నం. ముందుగా విద్యార్థుల ఉపకార వేతనాలు విడుదల చేసిన తర్వాతే కాలేజీలకు ఫీజు రీ యింబర్స్‌మెంట్ చెల్లించాల్సి ఉంటుంది. ఇంకా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల ఫీజులు కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి విడుదల కావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ వారాంతంలోగా ఫీజుల బకాయిలు విడుదలయ్యే అవకాశం ఉందని సంక్షేమ శాఖల అధికారులు పేర్కొంటున్నారు. కానీ ఇంత స్వల్ప వ్యవధిలో భారీ మొత్తంలో నిధులు విడుదల చేసేందుకు ఆర్థిక శాఖ లేనిపోని కొర్రీలు పెడితే మాత్రం విద్యార్థులు ఇరకాటంలో పడతారు. -
లక్ష్యం..సమైక్యం
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు సమైక్యాంధ్ర నినాదంతో సమ్మె బాట పట్టారు. దీంతో జిల్లా కేంద్రమైన కర్నూలుతో సహా అన్ని నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాల్లో ప్రభుత్వకార్యాలయాలు మూతపడ్డాయి. రాష్ట్ర విభజనను నిరసిస్తూ ఉద్యోగులు ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. కోవెలకుంట్లలో రాష్ట్ర ఎన్జీఓ అసోసియేషన్ జి.రామక్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో తహశీల్దారు, ఎంపీడీఓ తదితర కార్యాలయాల సిబ్బంది విధులు బహిష్కరించి బైక్ ర్యాలీ నిర్వహించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. ఆదోనిలో నియోజకవర్గ ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్‌రెడ్డి, రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రజనీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. ఆర్డీఓ కార్యాలయం ఎదుట రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. డోన్ నియోజకవర్గ ఎన్జీఓ అసోసియేషన్ కృష్ణమోహన్ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకే అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోని ఉద్యోగులు కార్యాలయాల నుంచి బయటికి వచ్చి సమ్మెలో పాల్గొన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. నంద్యాలలో సమైక్య నినాదం హోరెత్తింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఎన్జీఓలు విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. రాష్ట్ర విభజనను నిరశిస్తూ ఆందోళనలు చేపట్టారు. రాష్ట్ర విభజనను సీమాంధ్ర జిల్లాల ఎంపీలు, కేంద్ర మంత్రులు అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. ఆందోళన కార్యక్రమాల్లో ఎన్జీఓ నేతలు, రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకులు పాల్గొన్నారు. ఆళ్లగడ్డ, నందికొట్కూరు, ఆత్మకూరు, ఎమ్మిగనూరు తదితర పట్టణాల్లోను సమైక్య సెగలు రాజుకున్నాయి. అన్ని ఉద్యోగ సంఘాల నేతలు ఏకమై ఆందోళనలు నిర్వహించారు. కర్నూలులో ఉత్కంఠ భరితంగా ఆందోళనలు వెల్లువెత్తాయి. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక జిల్లా అధ్యక్షుడు వీసీహెచ్.వెంగళ్‌రెడ్డి, ఎన్జీఓ అసోసియేషన్ కోశాధికారి పి.రామక్రిష్ణారెడ్డి, జిల్లా నేతలు శ్రీరాములు, లక్ష్మన్న, సుధాకర్‌రెడ్డి, బలరామిరెడ్డి, జిల్లా రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షుడు సంపత్‌కుమార్, ప్రధాన కార్యదర్శి రామన్న, ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం అధ్యక్షుడు సర్దార్ అబ్దుల్ హమీద్, అసోసియేట్ అధ్యక్షుడు మౌలాలి, ఉపాధ్యక్షుడు నాగేశ్వరరావు తదితరుల ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని అన్ని శాఖల ఉద్యోగులు విధులు బహిష్కరించి సమ్మెలోకి వచ్చారు. రెవెన్యూలో వీఆర్ఏ మొదలుకొని తహశీల్దార్ల వరకు సమ్మె బాట పట్టారు. వైద్యారోగ్య శాఖ సిబ్బంది, మునిసిపల్ ఎంప్లాయిస్, పంచాయితీరాజ్, వాణిజ్య పన్నుల శాఖ తదితర శాఖల అధికారులు కూడా విధులు బహిష్కరించి జిల్లా ఎన్జీఓ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనతో పాల్గొన్నారు. ఎన్జీఓ నేతలు కలెక్టరేట్లోని అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లో కలియదిరిగి విధులు నిర్వహిస్తున్న వారందరినీ బయటికి తీసుకువచ్చారు. జేసీ చాంబర్ పక్కనున్న రూములో స్త్రీ శిశు సంక్షేమ శాఖకు చెందిన వీడియో కాన్ఫరెన్స్ జరుగుతుండగా అడ్డుకున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న వారందరినీ బయటికి తరలించారు. కుర్చీలను నేలకేసి కొట్టారు. సమ్మె ముగిసే వరకు వీడియో కాన్ఫరెన్స్ రూము తెరిస్తే కబడ్దార్ అంటూ సిబ్బందిని హెచ్చరించారు. జిల్లా ఎన్జీఓ నేతల ఆందోళనలతో వీడియో కాన్ఫరెన్స్‌ను అర్ధాంతరంగా ముగించుకొని వెళ్లిపోయారు. సునయన ఆడిటోరియంలో ఈనెల 9వ తేది జరిగే టెట్ పరీక్ష సంబంధించి చీఫ్ సూపరింటెండెంట్లు, రూట్ ఆఫీసర్లు తదితరులకు నిర్వహించిన తలపెట్టిన అవగాహన సదస్సు రసాభాసగా మారింది. డీఈఓ ఆధ్వర్యంలో టెట్ అవగాహన సదస్సును వీసీహెచ్.వెంగళ్‌రెడ్డి ఆధ్వర్యంలో పలువురు నేతలు అడ్డుకున్నారు. ఈసందర్భంగా కొంత ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. మేము మా స్వార్థం కోసం సమ్మె చేయడం లేదని, ప్రజా ప్రయోజనాలు ఉద్యోగ, ఉపాధి, విద్య అవకాశాల కోసం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండుతో సమ్మె చేస్తున్నామని, ఇందుకు అందరూ సహకరించాలని వెంగళ్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. కొంత ఉత్కంఠ తర్వాత టెట్ సమావేశానికి వచ్చిన వారందరినీ బయటికి పంపారు. సమైక్యాంధ్ర నినాదాలతో కలెక్టరేట్ మారుమోగింది. ఉదయం 10.30 గంటలకు కలెక్టరేట్ మొత్తం ఖాళీ అయింది. కలెక్టర్ కార్యాలయంతో సహా పలు ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు పడ్డాయి. సమ్మె సందర్భంగా మొదటి రోజు కలెక్టరేట్లో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు భారీగా మొహరించారు. కలెక్టరేట్‌లోనికి ఎవ్వరినీ అనుమతించలేదు. విధులు బహిష్కరించిన అన్ని శాఖల ఉద్యోగులు కలెక్టరేట్ ఎదుట ఏకమై రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పెద్దఎత్తున ఆందోళన నిర్వహించారు. జిల్లా ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షుడు వీసీహెచ్.వెంగళ్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో రెవెన్యూ, పంచాయతీ రాజ్, వ్యవసాయం, పశు సంవర్ధక శాఖ, ఆడిట్, ట్రెజరీ, సివిల్ సప్లయ్, వైద్యారోగ్య శాఖ, వాణిజ్య పన్నుల శాఖ, పబ్లిక్ సెక్టారు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగుల సమ్మె కారణంగా పరిపాలన స్తంభించిపోయింది. కాగా శుక్రవారం సమ్మె మరింత తీవ్రంగా ఉంటుందని జిల్లా సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక అధ్యక్షుడు వెంగళ్‌రెడ్డి, కో-ఛైర్మన్ సంపత్‌కుమార్ తెలిపారు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వకార్యాలయాలను ముట్టడించి పాలనను నిలిపివేస్తామన్నారు. ఈనెల 21వ తేది వరకు జరిగే సమ్మెకు అన్ని శాఖల ఉద్యోగులు, అధికారులు సహకరించాలని కోరారు. ఈనెల 21వ తేది వరకు రాష్ట్ర విభజనను అడ్డుకుంటే సమైక్యాంధ్ర లక్ష్య సాధన పూర్తయినట్లు అవుతుందని తెలిపారు. -
సమ్మె పాక్షికం
కడప రూరల్, న్యూస్‌లైన్: రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించాలనే డిమాండుతో సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో గురువారం కొనసాగిన సమ్మె పాక్షికంగా జరిగింది. మునుపటి సమ్మెతో పోల్చుకుంటే ఆ వాడి, వేడి ప్రస్తుతం కనిపించలేదు. 100 రోజుల క్రితం జరిగిన సమైక్య ఉద్యమంలో అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులతోపాటు ప్రధానంగా ఆర్టీసీ, ఉపాధ్యాయులు పాల్గొనడంతో సమ్మె తీవ్ర రూపం దాల్చింది. ప్రస్తుతం తెలంగాణా బిల్లు కేంద్రం చేతుల్లోకి వెళ్లిన తరుణంలో చేపడుతున్న సమ్మెలో పూర్తి స్థాయిలో ఉద్యోగులు పాల్గొనలేదు. రెండు రోజుల్లో మిగతా ఉద్యోగులు సమ్మె బాట పట్టనున్నట్లు తెలుస్తోంది. కడపలో... కడపలో సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక జిల్లా కన్వీనర్, ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శివారెడ్డి ఆధ్వర్యంలో సమ్మెను పర్యవేక్షించారు. ఇరిగేషన్, రెవెన్యూ, మెడికల్, ఎంఆర్వో, మున్సిపల్, పాత రిమ్స్‌లోని ప్రభుత్వ కార్యాలయాలు మూత పడ్డాయి. కలెక్టరేట్లో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఉద్యోగులు సమైక్య నినాదాలు చేశారు. రాజంపేటలో రాజంపేటలో ఏపీ ఎన్జీఓ చైర్మన్ వెంకటరమణ ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యాలయాలను మూసివేశారు. పట్టణంలోఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శరత్‌కుమార్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులను బహిష్కరించారు. ట్రెజరీతోపాటు పలు కార్యాలయాలు పనిచేశాయి. రైల్వేకోడూరులో ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు పులిచెర్ల ఓబులేసు ఆధ్వర్యంలో సమ్మెను పర్యవేక్షించారు. వైఎస్సార్ సర్కిల్ వద్ద నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి సిల్వర్ బెల్ట్ పాఠశాల విద్యార్థులు సంఘీభావం తెలిపి మానవహారం నిర్మించారు. కొన్ని కార్యాలయాలు మూతపడగా, మరికొన్ని కార్యాలయాలు పనిచేశాయి. బద్వేలులో ఎన్జీఓ నాయకుడు సాంబశివారెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. రెవెన్యూ, ఎంపీడీఓ, ట్రెజరీ కార్యాలయాలు పనిచేశాయి. జమ్మలమడుగులో జమ్మలమడుగు ఎన్జీఓ అధ్యక్షుడు నారాయణరెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక్కడ దాదాపుగా ఉద్యోగులు సమ్మెలో పాల్గొనడంతో చాలావరకు కార్యాలయాలు మూతపడ్డాయి. కమలాపురంలో కమలాపురంలో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ కార్యాలయాలు మినహా చాలా కార్యాలయాలు పనిచేశాయి. ఎర్రగుంట్లలో మున్సిపల్ సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి కార్యాలయం నుంచి నాలుగురోడ్ల కూడలి వరకు ర్యాలీగా వచ్చారు. సమైక్య నినాదాలు చేశారు. కార్యక్రమంలో మేనేజర్ నరేంద్రప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ గంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. దాదాపుగా కార్యాలయాలన్నీ పనిచేయగా, సిబ్బంది మాత్రం తక్కువ సంఖ్యలో విధులకు హాజరయ్యారు. పులివెందులలో పులివెందులలో సమ్మె ప్రభావం కనిపించలేదు. యధావిధిగా కార్యాలయాలు పనిచేశాయి. ప్రొద్దుటూరులో ప్రొద్దుటూరు ఎన్జీఓ అధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం నుంచి పుట్టపర్తి సర్కిల్ వరకు ర్యాలీగా వెళ్లారు. అక్కడ మానవహారం నిర్వహించారు. బార్ కౌన్సిల్ నాయకుడు భాస్కర్‌రావు ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులను బహిష్కరించారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. మైదుకూరులో మైదుకూరులో ఎంపీడీఓ, వ్యవసాయశాఖ, మున్సిపల్ కార్యాలయాలు పనిచేశాయి. కొన్ని కార్యాలయాలు మూతపడగా, మరికొన్నింటిలో తక్కువ సిబ్బంది హాజరయ్యారు. రాయచోటిలో రాయచోటిలో రెవెన్యూ, ఆరోగ్యశాఖ వారు విధులను బహిష్కరించారు. చాలావరకు వివిధ శాఖల సిబ్బంది సమ్మెకు దూరంగా ఉన్నారు. -
అధికార యంత్రాంగం అధ్వానం
సాక్షి, నెల్లూరు : వివిధ ప్రభుత్వ శాఖల అధికారుల పనితీరుపై ప్రజాభిప్రాయం కోరడం సాహసం. నెల్లూరు కలెక్టర్ శ్రీకాంత్ ఆ సాహసానికి పూనుకున్నారు. ‘మా అధికారుల పనితీరుపై తీర్పు చెప్పండి’ అని జన సభలు వేదికగా ఓటింగ్ కోరారు. ఇది రాష్ట్ర చరిత్రలో ప్రప్రథమం. కలెక్టర్ పిలుపుతో స్పందించిన జిల్లాలోని 937 పంచాయతీల ప్రజలు నిర్మొహమాటంగా తమ అభిప్రాయాలు వెల్లడించారు. జిల్లాలో ప్రభుత్వ శాఖల అధికారుల పనితీరు అధ్వానంగా ఉందని తీర్పు చెప్పారు. ముఖ్యంగా కీలక శాఖలు, అధికారుల పనితీరు మరింత అధ్వానమన్నారు. వారి వల్ల ప్రజలకు నామమాత్రంగా కూడా మేలు జరగడం లేదని తేల్చి చెప్పారు. ప్రజాభిప్రాయం ద్వారా జిల్లా అధికారుల పనితీరును తాను తెలుసుకోవడంతో పాటు అధికారులకు కూడా తెలియచెప్పడం కలెక్టర్ ఉద్దేశంగా కనపడుతోంది. సాక్షికి అందిన సమాచారం మేరకు.. జిల్లాలో అధికారుల పనితీరు అధ్వానంగా ఉందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన గ్రామసభల్లో కలెక్టర్ ఎన్.శ్రీకాంత్ అధికారుల పనితీరుపై ఓటింగ్ ద్వారా ప్రజాభిప్రాయం సేకరించారు. వివిధ శాఖల్లో అధికారుల పనితీరుపై నమ్మశక్యం కాని నిజాలు వెలుగులోకి వచ్చాయి. సుమారు 32 శాఖల్లో సగానికి పైగా అధికారుల పనితీరుపై ప్రజలు ఆగ్రహావేశాలను వ్యక్తం చేశారు. పనితీరు ఏ మాత్రం బాగాలేదని ఆయా గ్రామసభల్లో చేతులెత్తారు. జిల్లా వ్యాప్తంగా 46 మండలాల్లో జరిగిన 940 పంచాయతీలకు గాను 937 పంచాయతీల్లో జరిగిన గ్రామ సభల్లో ప్రజా ఓటింగ్ ద్వారా వెలువడిన వివరాల ప్రకారం 18 మంది తహశీల్దార్లను, 9 మంది ఎంపీడీఓలను, 26 మంది ఎస్ఐలను ప్రజలు పూర్తిగా వ్యతిరేకించారు. మిగిలిన శాఖల్లో 50 శాతానికి పైగా అధికారులు సరిగా పనిచేయడం లేదని ప్రజలు తీర్మానించారు. మొత్తం 32 శాఖల్లో పశుసంవర్థక శాఖ, మత్స్యశాఖ, అటవీశాఖ, తాగునీరు, రోడ్లు, గ్రామీణ విద్యుద్దీకరణ, పేదరిక నిర్మూలన, ఆరోగ్యం, స్త్రీ శిశు సంక్షేమం, ప్రజా పంపిణీ వ్యవస్థ,భూమి, అభివృద్ధి, భూ సంస్కరణల అమలు, చిన్నతరహా పరిశ్రమలు, వయోజన విద్య, గ్రంథాలయాలు, బలహీన వర్గాల సంక్షేమం, గ్రామీణ పంచాయతీలు తదితర శాఖల పనితీరును ప్రజలు తీవ్రంగా నిరసిస్తున్నారు. కాగా విద్యాశాఖపై ప్రజలు స్పందించక పోవడం గమనార్హం. రెవెన్యూ, రక్షణ శాఖలపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గ్రామ సభల్లో అధికారులను నిలదీసిన సందర్భాలు, గ్రామ సభలకు హాజరు కాకుండా అడ్డుకున్న సందర్భాలు ఈ గణాంకాలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా 500 మందికి పైగా అవార్డులను (ప్రశంసా పత్రాలు) అందచేయడం హాస్యాస్పదమని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. పైరవీలకే ప్రశంసలు తమ ఉన్నతాధికారుల అడుగులకు మడుగులొత్తిన అధికారులు, సిబ్బంది మాత్రమే అవార్డులు పొందుతున్నారు. మెరుగైన పనితీరు ప్రదర్శించి ఆదర్శ ప్రాయంగా అవార్డులు అందుకునేవారు అరుదని చెప్పక తప్పదు. గతంలో ప్రశంసా పత్రాలు అందుకున్న ఉన్నతాధికారులు అవినీతిలో ఇరుక్కు పోయిన సందర్భాలు అనేకం. అవినీతిలో కూరుకుపోయిన అటవీశాఖాధికారులు, కోర్టు కేసులు ఎదుర్కొంటున్న విద్యాశాఖాధికారి, డీఎంఅండ్ హెచ్ఓ, గత మున్సిపల్ కమిషనర్ ఇలాంటి ప్రశంసా పత్రాలు అందుకున్నవారే. ఏ ప్రాతిపదికన ప్రభుత్వ అధికారులకు, ఉద్యోగులకు ప్రశంసలను అందచేస్తున్నారో అర్థం కాక ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. -
ఉత్తమ ఉద్యోగి ఎవరో..!
స్వాతంత్య్ర... గణతంత్ర దినోత్సవాల రోజున ఉత్తమ అధికారిగా పురస్కారం అందుకోవడం గతంలో ఓ పెద్దగౌరవం. పక్కాగా ఉత్తముల ఎంపిక జరిగేది. రాను రాను...‘ఉత్తముల జాబితా’పై ఆసక్తి తగ్గింది. సింహభాగం శాఖాధికారులకు అనుకూలంగా ఉండేవారికే స్థానం దక్కుతోందని, నిజమైన ఉత్తములకు గౌరవం దక్కడం లేదని కొంతమంది ఉత్తమ సేవలు అందించినవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఏడాది వీటికి చెక్‌పెట్టేందుకు కలెక్టర్ కోనశశిధర్ ఉపక్రమించారు. సాక్షి, కడప: జనవరి 26 గణతంత్ర వేడుకలకు అయిదు రోజుల వ్యవధి ఉంది. జిల్లాలో ఉత్తమ ఉద్యోగులకు పురస్కారాలపై మళ్లీ ఉత్కంఠ మొదలైంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏటా 18వతేదీ లోగా ఉత్తమ ఉద్యోగుల జాబితా అందజేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించడం, చాలామంది అధికారులు 25వ తేదీ కూడా జాబితా ఇవ్వడం జరుగుతోంది. ఈక్రమంలో ఈ ఏడాది ఉత్తమ అధికారుల ఎంపికను పక్కాగా సిద్ధం చేసేందుకు జిల్లా అధికారులు కుస్తీలు పడుతున్నారు. గతేడాది స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉద్యోగుల జాబితా ఇవ్వాలని కలెక్టరు కోరినప్పుడు కూడా ఇదే సందిగ్ధం నెలకొంది. నిబంధనలను నిక్కచ్చిగా చూస్తారనే భయంతో ముందురోజు రాత్రి వరకూ కూడా కొన్ని ప్రభుత్వశాఖల అధికారులు జాబితాలు అందజేయలేదు. స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకుని ఏటా 450 నుంచి 500 మంది వరకూ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు ఇస్తున్నారు. అందులో ఎందరు ఉత్తములనే ది గుర్తించడం కష్టంగా మారింది. దీంతో కలెక్టర్ శశిధర్ ఈ పురస్కారాల వ్యవహారాన్ని గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అందరూ బాగా పనిచేస్తున్నారని భావిస్తే, ఉత్తముల్లో ఉత్తములను గుర్తించాలని అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో ఎంపిక జాబితాలో ఆరోపణలున్నవారు ఉంటే ఎలా?అని పలు శాఖల అధికారులు జంకుతున్నారు. ఈ నెల 18లోపే జాబితాను సమర్పించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు అందాయి. జిల్లాలో 104 ప్రభుత్వ శాఖలు ఉన్నాయి. వీరిలో కొంతమంది మాత్రమే జాబితాను పంపారు. ముహూర్తం ముంచుకొచ్చాక ఆగమేఘాల మీద తయారుచేసే జాబితాల్లో తప్పులుదొర్లి అర్హులకు ఏటా అన్యాయమే జరుగుతోందని కొందరు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
చిన్నచూపు!
జిల్లా పరిపాలనకు కేంద్ర బిందువైన కలెక్టరేట్లో 36 ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఉన్నాయి. ప్రతి సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి వికలాంగులే కనీసం 50 మంది వరకు వస్తారు. సునయన ఆడిటోరియం బయట మెట్లు ఏర్పాటు చేశారు తప్ప ర్యాంపు మరిచారు. కీలకమైన జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయానికి ర్యాంపు లేదు. ప్రతిరోజు ఎంతో మంది వికలాంగులు, అంధులు ఈ కార్యాలయానికి వస్తూ ర్యాంపులు లేక ఇక్కట్లు పడుతుండటం నిత్యం చూస్తూనే ఉన్న అధికారుల మనసు కరగడం లేదు. కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్:విభిన్న ప్రతిభావంతులపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో ర్యాంపుల ఏర్పాటు చేయడం లేదు. దీంతో వికలాంగులకు ఇబ్బందులు తప్పడం లేదు. నిధుల కొరత సాకుతో ర్యాంపుల నిర్మాణంలో అలసత్వం వహిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలు ప్రభుత్వ కార్యాలయాలను కింది భాగం(గ్రౌండ్ ఫ్లోర్)లోనే గాక ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్లలో కూడా నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా నిధులు వెచ్చింది ర్యాంపులు నిర్మించాల్సి ఉన్న ఆ దిశగా చర్యలు తీసుకునే నాథులు లేరు.జిల్లా కేంద్రమైన కర్నూలులోనే వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ర్యాంపులు లేవంటే ఆశ్చర్యం కలగకమానదు. జిల్లాలో వికలాంగులు దాదాపు 1.50 లక్షల మంది ఉన్నారు. ఇందులో శారీరక వికలాంగులు దాదాపు 50 వేల మంది, మిగతావారు లక్షమంది ఉన్నారు. వీరందరికీ ర్యాంపులు అవసరమే. కానీ నిర్మించడంలోనే అధికారులు నిర్లక్ష్యాన్ని చాటుకుంటున్నారు. సంక్షేమ భవన్లో కీలకమైన సంక్షేమ శాఖల కార్యాలయాలు, హౌసింగ్ కార్పొరేషన్, ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్లు ఉన్నాయి. కానీ ర్యాంపులు లేవంటే వికలాంగుల పట్ల సానుభూతి ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. కీలకమైన కార్యాలయాల్లో జిల్లా పరిషత్ కూడా ఒకటి. జిల్లా పరిషత్‌తో వికలాంగులకు ఎన్నో అవసరాలు ఉంటాయి. కానీ ర్యాంపు నిర్మించడంలో అధికారులో నిర్లక్ష్యం చోటు చేసుకుంది. ఏపీసీపీడీసీఎల్(విద్యుత్) కార్యాలయానికి ర్యాంపు లేక వికలాంగులు అవస్థలు పడుతున్నారు. తపాల, ఆర్ఐఓ, టెలికాం, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ తదితర కార్యాలయాల్లో ర్యాంపులు లేవు. ఆదోనిలో పాఠశాలలను పోలింగ్ బూత్‌లకు వినియోగిస్తుననందున ఎన్నికల సమయంలో కొన్ని పాఠశాలలకు మాత్రం ర్యాంపులను ఏర్పాటు చేశారు. కానీ చాలా పాఠశాలలకు ఏర్పాటు చేయలేదు. పట్టణంలోని మెప్మా కార్యాలయం తప్ప ఇతర కార్యాలయాల్లో ఎక్కడా ర్యాంపులు లేవు. గత ఎన్నికల సమయంలో మండల పరిధిలోని సాంబగల్, దిబ్బనగల్, సంతెకుళ్ళూరు తదితర గ్రామాల పాఠశాలల్లో స్థానిక ప్రజాప్రతినిధులు నిర్మించగా అధికారులు బిల్లులు చెల్లించలేదు. మండల పరిధిలోని విరుపాపురం, దొడ్డనగేరి తదితర జిల్లా పరిషత్ పాఠశాలలకు ర్యాంపులు నిర్మించినప్పటకి రైలింగ్ ఏర్పాటు చేయలేదు. ఆళ్లగడ్డ మండలంలోని 54 పాఠశాలలో ఎక్కడా ర్యాంప్ లేవు. రుద్రవరం, చాగలమర్రి, శిరివెళ్ల మండలాల్లోనూ ఇదే పరిస్థితి. బనగానపల్లె మండలంలో అధికారుల లెక్కల ప్రకారం మండలంలో 862 మంది వికలాంగులు ఉన్నారు. వీరిలో పూర్తిగా 40శాతం వికలాంగులు 367, 60 శాతం వికలాంగులు 276, 70 శాతం వికలాంగులు 199 మంది ఉన్నారు. పట్టణంలోని 50 పడకల ఆసుపత్రి వద్దను, 24 గంటలు పని చేయు పలుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్దను తప్పనిసరిగా ర్యాంప్‌లు ఏర్పాటు అవసరం. మద్దికెర మండలంలో బురుజుల, మద్దికెర, పెరవలి, బొమ్మనపల్లి, అగ్రహరం గ్రామాలలో 10 స్కూళ్లకు ర్యాంప్‌లు లేక వికలాంగులు అవస్థలు పడుతున్నారు. అలాగే ఎంపీడీఓ, ఎంఈఓ కార్యాలయాల్లో వీటిని ఏర్పాటు చేయడం అధికారులు పూర్తిగా మరిచారు. పాఠశాలాలు, కార్యాలయాలకు వెళ్లడానికి వికలాంగులు జంకుతున్నారు. గోనెగండ్లలో ప్రభుత్వ కార్యాలయాల్లో మెట్ల పక్కనే సీసీ ర్యాంపులు కనిపించడం లేదు. స్థానిక మండల పరిషత్ కార్యాలయానికి సొంత భవనం వున్నా వికలాంగులు వెళ్లేందుకు సరైన సౌకర్యాలు లేవు. అలాగే అద్దె గృహంలో నిర్వహిస్తున్న ఐకేపీ కార్యాలయంలోపలికి వెళ్లాలంటే వికలాంగులు ఇబ్బందులు పడాల్సిందే. ఈకార్యాలయానికి సీసీ ర్యాంప్ నిర్మించలేదు. కోడుమూరులోని మండల పరిషత్ తహశీల్దార్, తదితర ప్రభుత్వ కార్యాలయాలతో పాటు పాఠశాలల్లోనూ ఇదే దుస్థితి. పగిడ్యాల మండల రిసోర్స్ భవనంలో నిర్వహించే ఫిజియోథెరపి క్యాంప్‌లకు వచ్చే విభిన్న ప్రతిభావంతులు కార్యాలయం మెట్లు ఎక్కడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆత్మకూరులో తహశీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల వద్దకు ఎక్కువ సంఖ్యలో వికలాంగులు పింఛన్ల మంజూరు కోసం, కుల, ఆదాయ, నెటివిటీ, ఇతర ధృవీకరణ పత్రాల మంజూరు కోసం వస్తుంటారు. అయితే వీరు మెట్లు ఎక్కేందుకు ఇబ్బందులు పడుతున్నారు. -
‘మార్పు’ నిరంతరం
విశాఖపట్నం, న్యూస్‌లైన్: ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పని చేసి గ్రామీణులకు అన్ని సంక్షేమ పథకాలను అందించాలని జిల్లా కలెక్టర్ ఆరోఖ్యరాజ్ అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం జరిగిన ‘మార్పు’ జిల్లా స్థాయి సమీక్ష సమావేశాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ పథకాల అమలుకు సర్పంచ్‌లు చైర్మన్లుగా కమిటీలను నియమించాలని సూచించారు. నెల రోజుల్లో కమిటీలను ఏర్పాటు చేసి గ్రామ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో సమీక్షలు నిర్వహించాలన్నారు. ఈ కమిటీలలో అంగన్వాడీ కార్యకర్త, ఏఎన్ఎం, ఆశావర్కర్, ఆర్డబ్ల్యూఎస్ ఉద్యోగి, ఐకేపీ వలంటీర్ ఉంటారన్నారు. వారంతా ‘మార్పు’ 20 సూత్రాల అమలుకు నిరంతరం పాటుపడాలన్నారు. ఇక మీదట గ్రామాల్లో పౌష్టికాహార లోపం సమస్య రాకూడదన్నారు. అతిసార డయేరియా వంటి వ్యాధులు ప్రబలకూడదని, పురిట్లోనే పిల్లలు మృతి చెందడం అనే వార్తలు రాకూడదని, గర్భిణులకు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్టు ప్రచారం జరుగకూడదన్నారు. అంతా సమిష్టిగా గ్రామగ్రామాన తిరిగి అందరికీ ‘మార్పు’ ఉద్దేశ్యం ఇప్పుడు..ఎల్లప్పుడూ వివరించాల్సిన బాధ్యత అధికారులదేనని పేర్కొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి(డీఎంహెచ్‌వో) డాక్టర్ రెడ్డి శ్యామల అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఐటీడీఏ పీవో వినయ్‌చంద్, సబ్‌కలెక్టర్ శ్వేత తెవతియ, ట్రైనీ కలెక్టర్ కృష్ణభాస్కర్, వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ సంచాలకులు డాక్టర్ ఎన్‌ఆర్‌వి సోమరాజు, డీఆర్డీఏ ప్రాజెక్టు డెరైక్టర్ మహేశ్వర్ రెడ్డి, ఐసీడీఎస్ ప్రాజెక్టు డెరైక్టర్ రాబర్ట్స్, వైద్య విధాన పరిషత్ జిల్లా ఆస్పత్రుల సమన్వయాధికాారి డాక్టర్ నాయక్, మలేరియా అధికారి ప్రసాద్ పాల్గొన్నారు. ఆస్పత్రిలో ప్రసవిస్తే రూ. వెయ్యి ఇవ్వాల్సిందే..! ఆస్పత్రులలో ప్రసవించిన బాలింతలకు వెంటనే రూ. వెయ్యి ఇవ్వాల్సిందేనని జిల్లా కలెక్టర్ ఆరోఖ్య రాజ్ స్పష్టం చేశారు. రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు అంటూ నిబంధనలు పెట్టరాదన్నారు. ఎంసీపీ కార్డు ఆధారంగా ప్రసవించిన వారికి ఆ మొత్తాన్ని చెల్లించాలన్నారు. బాలింతలకు ఇచ్చే మొత్తంలో కక్కుర్తి పడొద్దని, దీనిపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా పరిశీలిస్తోందని స్పష్టం చేశారు. -
పెరిగిన చీ‘కట్’లు
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లా పరిపాలన కేంద్రం కలెక్టరేట్లోని ప్రభుత్వశాఖలకు విద్యుత్‌షాక్ తగులుతోంది. మొండి బకాయిల వసూలుకు ట్రాన్స్‌కో మరోసారి కన్నెర్ర చేసిం ది. బకాయిలు పేరుకుపోయాయని ఇప్పటికే నాలుగు శాఖలకు కరెంట్ చేసిన ట్రాన్స్‌కో తాజాగా మరో 20 శాఖలకు సరఫరా నిలిపివేసింది. కనీసం సంప్రదింపు లు కూడా జరపని సంబంధితశాఖలు బిల్లుల చెల్లింపు లో మొండిగా వ్యవహరిస్తుండడంతో ట్రాన్స్‌కో మరిం త వేగంగా చర్యలకు పూనుకుంది. కలెక్టరేట్లోని 42 ప్రభుత్వశాఖల కార్యాలయాలు రూ.3.93 కోట్లు బకాయిలుండగా ట్రాన్స్‌కో ఎస్ఈ ఆదేశాల మేరకు కరెం ట్ కట్ చేస్తున్నట్లు ఏడీ సుగుణయ్య తెలిపారు. క్రిస్మస్ సందర్భంగా సెలవుదినం కావడంతో విధులకు ఆటంకం కలగనప్పటికీ గురువారం నుంచి ఇక్కట్లు తప్పేలా లేవు. బకాయిలు చెల్లించనిదే కరెంట్ పునరుద్ధరించేది లేదని ట్రాన్స్‌కో అధికారులు తేల్చిచెపుతున్నారు. ప్రభుత్వ నిధులు రాలేదనే కారణంతో కరెంట్ బిల్లు చెల్లింపులో జాప్యం జరుగుతుండడంతో ఆయా శాఖల సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. కనికరం కొంచెమే.. కలెక్టరేట్లో సోమవారం వ్యవసాయశాఖ జేడీ, డీఈవో, సీపీవో, పశుసంవర్ధకశాఖ జేడీ కార్యాలయా ల్లో కరెంటు తొలగించారు. ట్రెజరీలో కరెంటు తొల గించేందుకు సిద్ధమైనప్పటికీ లావాదేవీల్లో ఇబ్బందులెదురవుతాయని ఊరుకున్నారు. బకాయి ఉన్న వాటిలో కొంతమేర చెల్లిస్తామని డీఈవో, పశుసంవర్ధకశాఖ అధికారులు ట్రాన్స్‌కో అధికారులకు స్పష్టమైన హామీ ఇవ్వడంతో సంబంధిత కార్యాలయాలకు సరఫరా పునరుద్ధరించారు. బుధవారం తొలగించిన మరో 20 శాఖల్లో తహశీల్దార్ కార్యాలయం, పౌరసరఫరాల శాఖ, డీపీవో కార్యాలయాలు తక్కువ బకాయి ఉండగా సంప్రదింపులతో తిరిగి పునరుద్ధరించారు. చీకట్ల శాఖలివే... సోషల్ వెల్ఫేర్ డీడీ, బీసీ వెల్ఫేర్ డీడీ, బీసీ సర్వీస్ కో ఆపరేటివ్ సొసైటీ, ఆడిట్, సీపీవో, జిల్లా కో ఆపరేటివ్ అధికారి కార్యాలయం, డీపీవో, జిల్లా కోఆపరేటివ్ ఆడిట్, డ్వామా, ఐకేపీ, డీఆర్డీఏ, ఎస్సీ కార్పొరేషన్, హౌసింగ్, గిరిజన సంక్షేమశాఖ, బయో కెమికల్ ల్యాబ్, డీపీఆర్వో, ఎక్సైజ్ కార్యాలయం, వికలాంగులశాఖతో పాటు మూడు రోజులుగా వ్యవసాయశాఖ జేడీ కార్యాలయం చీకటిలోనే ఉండిపోయింది. -
‘రియల్’ దందా...
భద్రాచలం, న్యూస్‌లైన్: ఏజెన్సీ కేంద్రమైన భద్రాచలం పట్టణంలో రియల్ దందా యథేచ్ఛగా సాగుతోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు పెద్ద ఎత్తున స్థలాలు కొనుగోలు చేస్తున్నారు. గిరిజన చట్టాలు అమల్లో ఉన్నప్పటికీ జోరుగా క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. ‘అధికార’ అండ చూసుకుని అక్రమార్కులు చెలరేగిపోతుండడంతో...భవిష్యత్తులో తలనొప్పులు వస్తాయని ఓ రెవెన్యూ అధికారి ఏకంగా సెలవుపై వెళ్లిపోయారంటే ఏమేరకు దందా సాగుతోందో అర్థం చేసుకోవచ్చనే చర్చ ఇక్కడ నడుస్తోంది. ప్రముఖ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న భద్రాచలం వ్యాపారపరంగా కూడా దినాదినాభివృద్ధి చెందుతోంది. ఐటీడీఏ కార్యాలయంతో పాటు, వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన జిల్లా స్థాయి కార్యాలయాలు కూడా ఇక్కడే ఉన్నాయి. దీంతో వివిధ మండలాల్లో పనిచేసే ఉద్యోగులు, వ్యాపారస్తులు పట్టణంలో సిర్థ నివాసం ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. అంతేకాకుండా భద్రాచలం జిల్లా కేంద్రమవుతుందనే ప్రచారం కూడా ఇక్కడ జరుగుతోంది. సందర్శకుల తాకిడి అధికంగా ఉండడం, పర్యాటకంగా కూడా అభివృద్ధి చెందటంతో భద్రాచలంపై రియల్‌వ్యాపారుల కన్నుపడింది. దీంతో భూముల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. శివారు ప్రాంతాల్లో సెంటు భూమి రూ.2 లక్షలు ఉండగా, భద్రాచలం నడిబొడ్డున సెంటు భూమి రూ.30 లక్షల వరకూ పలుకుతోంది. సామాన్యుడు చిన్నపాటి ఇంటి జాగా కొనుక్కోలేని పరిస్థితి ఉంది. 1/70 చట్టం ప్రకారం ఏజెన్సీలో గిరిజనేతరుల మధ్య ఎటువంటి భూ లావాదేవీలు జరగడానికి వీల్లేదు. కానీ ప్రస్తుతం యథేచ్ఛగా గిరిజన చట్టాల ఉల్లంఘన జరుగుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కూనవరం రోడ్డులో కరకట్టకు ఆనుకొని, అదేవిధంగా గుండాల కాలనీ సమీపంలో ప్లాట్ల క్రయవిక్రయాలు జోరుగా సాగుతున్నాయి. భద్రాచలం శివారు ప్రాంతంలో ప్లాట్లు చేసి విక్రయాలు చేపడుతున్నప్పటికీ రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తుండటం విమర్శలకు తావిస్తోంది. చెలరేగుతున్న మాఫియా : ఓ రాజకీయ పార్టీ అండతో భద్రాచలంలో మాఫియా చెలరేగుతోంది. జిల్లా ఎస్పీ రంగనాథ్ గతంలో ఇదే విషయమై ప్రస్తావించారు. సెటిల్మెంట్లకు అడ్డగా మారుతున్న భద్రాచలంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని కూడా ప్రకటించారు. కానీ కొంతమంది రె వెన్యూ అధికారుల అండతో ఈ మాఫియా ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోందనే విమర్శలు ఉన్నాయి. పట్టణంతో పాటు శివారు ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములను వీరు దర్జాగా ఆక్రమిస్తున్నారు. చర్ల రోడ్డులో గల పాలకేంద్రం, దానికి ఎదురుగా ఉన్న భూములు కూడా ప్రస్తుతం వివాదంగా మారుతున్నాయి. ప్రభుత్వ భూములను ఆక్రమించి గుడిసెలు వేస్తున్నప్పటికీ రెవెన్యూ అధికారులు దృష్టి సారించకపోవటంతో ఆ స్థలాల్లో కొద్ది రోజులకే భవనాలు లేస్తున్నాయి. వాటికి విద్యుత్ మీటర్లు కూడా మంజూరవుతున్నాయి. గిరిజన చట్టాలు ఇక్కడి కొన్ని శాఖల అధికారులకు కాసుల వర్షం కురుపిస్తున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. విద్యుత్ మీటర్ కోసం దరఖాస్తు చేసుకునే సామాన్య, మధ్యతరగతి కుటుంబాల వారికి ఎక్కడ లేని నిబంధనలు వల్లెవేసే విద్యుత్ శాఖ అధికారులకు రూ.20 వేలు చెల్లిస్తే మీటరు మంజూరు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. పాలకేంద్రం వద్ద ప్రభుత్వ భూముల్లో వేసిన ఇళ్లకు ఏ ప్రాతిపదికన విద్యుత్ మీటర్లు ఇచ్చారనే దానిపై విచారణ జరిపిస్తే అవినీతి అధికారులు బాగోతం బట్టబయలు అయ్యే అవకాశం ఉందని పట్టణవాసులు అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారం ‘అధికార’ అండ కలిగిన కొంతమంది వ్యక్తుల కనుసన్నుల్లోనే సాగుతున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. రియల్ దందాలు, ఆక్రమణలు జోరుగా సాగుతున్న తరుణంలోనే భద్రాచలం తహశీల్దార్‌గా పనిచేస్తున్న వెంకటేశ్వరరావు అనారోగ్య కారణాలతో సెలవుపై వెళ్లిపోవటంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని గిరిజన చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న భూ లావాదేవీల్లో ఇరుక్కోవటం ఇష్టం లేకనే తహశీల్దార్ సెలవుపై వెళ్లిపోయినట్లు పట్టణంలో ప్రచారం సాగుతోంది. ఆ శాఖలో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తుండటం గమనార్హం. అధికారుల హడావిడి వెనుక ఆంతర్యమేమిటో..? భద్రాచలం డివిజన్‌కు కొత్తగా రెవెన్యూ అధికారులు వచ్చినప్పడల్లా 1/70 చట్టాన్ని వెలికితీస్తుండం ఆనవాయితీగా మారుతోంది. గతంలో ఓ సబ్‌కలెక్టర్ విధులు చేపట్టిన కొత్తలో చట్టాల పరిరక్షణ పేరుతో నిర్మాణంలో ఉన్న ఇళ్ల వద్దకు వెళ్లి సామాన్లు కూడా సీజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ తరువాత ఆయన కార్యాలయం ముందరే బహుళ అంతస్తుల వాణిజ్య సముదాయాలు నిర్మిస్తున్నా మౌనం దాల్చారు. ఇలా అధికారి వచ్చినప్పడల్లా చట్టాలు గుర్తొస్తుండటం, ఆనక వీటి గురించి పూర్తిగా మరిచిపోవటంపై గిరిజనుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రస్తుతం గత రెండు రోజులుగా పట్టణంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై రెవెన్యూ అధికారులు దృష్టి సారించి సర్వేలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం పట్టణంలోని చర్ల రోడ్లో గల పాలకేంద్రం భూములు, అదే విధంగా దానికి ఎదురుగా ఉన్న భూములను పరిశీలించారు. ఇన్చార్జి తహశీల్దార్ కనకదుర్గ, ఆర్ఐ మోహన్‌రావు ఆధ్వర్యంలో పలువురు వీఆర్వోలు ఆ స్థలాలను సర్వే చేశారు. దీంతో ఆ స్థలాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్న నిరుపేద వర్గాల వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆర్డీవో ఆదేశాల మేరకు తాము సర్వే చేస్తున్నామని తహశీల్దార్ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. హడావిడి సర్వేలు కాకుండా గిరిజన చట్టాలను పరిరక్షించేందుకు రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తే బాగుంటుందని గిరిజన సంఘాల వారు కోరుతున్నారు. -
నేటి నుంచి సర్పంచ్‌లకు శిక్షణ
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: ఇటీవల ఎన్నికైన కొత్త సర్పంచ్‌లకు అన్ని ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 28 నుంచి శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో వచ్చే నెల 28వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఇందుకు జిల్లా పరిషత్ సహకరిస్తుందని డ్వామా పీడీ హరినాథరెడ్డి తెలిపారు. జిల్లాలో మొత్తం సర్పంచ్‌లు 883 మంది కాగా.. స్త్రీలకు, పురుషులకు వేర్వేరుగా శిక్షణ ఇవ్వనున్నారు. పురుషులకు ఆరు బ్యాచ్‌లుగా కర్నూలు శివారులోని డ్వామా శిక్షణ కేంద్రంలో.. మహిళలకు తొమ్మిది బ్యాచ్‌లుగా ఓర్వకల్లులోని సీఎల్ఆర్సీలో శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ఒక్కో బ్యాచ్‌కు మూడు రోజుల పాటు గ్రామ పంచాయతీలకు ఆదాయ వనరులను పెంచడం.. అధికార వికేంద్రీకరణ, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, పారిశుద్ధ్యం, తాగునీరు, ఇంటి పన్నుల మదింపు, ఎన్ఆర్ఈజీఎస్లో పంచాయతీల పాత్ర, తదితర అంశాలపై సమగ్రంగా శిక్షణ ఇవ్వనున్నట్లు డ్వామా పీడీ వెల్లడించారు. షెడ్యుల్ ప్రకారం సర్పంచ్‌లు శిక్షణకు హాజరై చట్టాలు, ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై అవగాహన పెంచుకొని గ్రామాభివృద్ధికి తోడ్పడాలని ఆయన కోరారు. -
అవినీతి వధ జరిగేనా!
నెల్లూరు(క్రైమ్), న్యూస్‌లైన్: అప్పట్లో నరకాసురుడనే రాక్షసుడు అందరినీ పీక్కుతింటూ ప్రజలతో పాటు దేవతలకు సమస్యగా మారాడు. అతని బాధితుల మొర విని స్పందించిన సత్యభామ నరకాసురుడ్ని వధించి వారి జీవితాల్లో వెలుగులు నింపింది. ఆ రోజుల్లో నరకాసురుడు ఒక్కడే ప్రజలను హిం సించాడు. ఈ రోజుల్లో మాత్రం అవినీతికి అలవాటు పడిన పలువురు అధికారులు, ఉద్యోగులు నరకాసురుడ్ని మరిపించేలా జనాన్ని బాదుతున్నారు. వీరికి లంచం బాధ నుంచి విముక్తి కల్పించేందుకు అవినీ తి నిరోధక శాఖ అధికారులు శ్రమిస్తున్నా, వారు పూర్తి స్థాయిలో జూలు విదిలించాల్సిన సమయం ఆ సన్నమైంది. సమాజంలో అవినీతిని పూర్తిగా అరికట్టినపుడే ప్రజలకు నిజమైన దీపావళి. అవినీతిమయం: జిల్లాలోని దాదాపు అన్ని ప్రభు త్వ శాఖలు అవినీతిమయంగా మారాయి. ప్రజల అ వసరాలు, బలహీనతలను ఆసరాగా చేసుకున్న పలువురు అధికారులు, సిబ్బంది జలగల్లా పీల్చేస్తున్నారు. అవినీతి పరుల ఆటకట్టించేందుకు ఏసీబీ డీఎస్పీ జె.భాస్కర్‌రావు నేతృత్వంలో ఇన్స్పెక్టర్లు సీహెచ్ చంద్రమౌళి, టి.వి.శ్రీనివాసరావు, కృపానందం, వెంకటేశ్వర్లు చర్యలు చేపట్టారు. వరుస దాడులు : ఈ ఏడాదిలో ఏసీబీ అధికారులు 22 కేసులు నమోదుచేసి పలువురిని కటకటాల వెనక్కునెట్టారు. డీఎంహెచ్ఓ కార్యాలయంపై ఏసీబీ దా డులు జరగడం సంచలనం సృష్టించింది. అవినీతికి మారుపేరుగా మారిన ఆర్టీఏ కార్యాలయంపై మా ర్చి 13న మెరుపుదాడి చేశారు. అదే నెల 15న నెల్లూరులోని పరిశ్రమల శాఖ కార్యాలయంపై, 30న సూళ్లూరుపేట రిజిస్ట్రార్ కార్యాలయంపై దాడులు నిర్వహించారు. మార్చి 17వ తేదీన వింజమూరు ఉన్నత పాఠశాల హెచ్ఎం లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు. స్థల విషయమై క్లియరెన్స్ ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసినా ఏఎస్మండలంలోని ఓ సర్వేయర్‌ను ఏప్రిల్ 16న పట్టుకున్నారు. అక్రమంగా నిర్మించిన భవనాన్ని కూల్చకుండా ఉండేందుకు లంచం తీసుకుంటున్న నెల్లూ రు కార్పొరేషన్ టీపీసీ అధికారులను ఏప్రిల్ 22న అరెస్ట్ చేశారు. ఇందిరమ్మ ఇంటి బిల్లు మంజూరు చేసేం దుకు లంచం డిమాండ్ చేసిన హౌసింగ్ అధికారి మేనెలలో ఏసీబీకి దొరికిపోయాడు. జూలై 9న ఓజిలి ఎస్సైని, లెసైన్స్ రెన్యూవల్ విషయంలో వ్యాపారి నుంచి లంచం తీసుకుంటున్న వాణిజ్యపన్నుల శాఖ లోని ఓ అధికారిని జూలై 28న నెల్లూరు లో, ఇందిరమ్మ ఇంటికి పొజిషన్ సర్టిఫికెట్ ఇచ్చేం దుకు లంచం తీసుకుంటున్న నారాయణరెడ్డిపేట వీఆర్వో శ్రీనివాసులును ఆగస్టు 6న పట్టుకున్నారు. కాంట్రాక్టర్‌కు బిల్లు చెల్లింపు విషయంలో రూ.50 వేలు లంచం తీసుకుంటూ అటవీశాఖలోని ఓ అధికారి ఆగస్టు 21న దొరికిపోయారు. వైద్యఆరోగ్య శా ఖ కార్యాలయంలోని సూపరింటెండెంట్ సెప్టెంబ ర్లో ఏసీబీకి చిక్కాడు. అనంతరం నెల్లూరులోని పె ద్దాసుపత్రిపై అధికారులు దాడులు నిర్వహించారు. గత నెల 29న వాకాడులోని ప్రభుత్వ ఐటీఐపై దాడి చేసి భారీ స్థాయిలో నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇలా వరుస దాడులు జరుగుతున్నా అవినీతిపరుల్లో మార్పురాకపోవడం దురదృష్టకరం. -
పండుగ పూట ఆకలికేకలు
సాక్షి, మంచిర్యాల : జిల్లాలోని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల, సిబ్బంది పరిస్థితి దీనంగా ఉంది. నెలల తరబడి వేతనాలు అందక, కుటుంబపోషణ భారమై అప్పుల పాలవుతున్నారు. వీరు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వర్తిస్తున్నా పాలకులు గుర్తించడం లేదు. వేతనాల కోసం ఆందోళనలు చేపట్టాలని ఉన్నా ఉద్యోగాలు పోతాయనే భయంతో బాధిత ఉద్యోగులు, సిబ్బంది వెనుకంజ వేస్తున్నారు. ఈ నెల 14న దసరా, 16న బక్రీద్, నవంబర్ 2న దీపావళి పండుగల సందర్భంగానైనా పాలకులు వేతనాలు విడుదల చేస్తారని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. జిల్లాలోని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికుల దుస్థితిపై ‘న్యూస్‌లైన్’ కథనం. చితికిన సాక్షర భారత్ కో-ఆర్డినేటర్లు గ్రామీణ మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడానికి కేంద్ర ప్రభుత్వం సాక్షర భారత్ పథకాన్ని ప్రవేశపెట్టింది. పర్యవేక్షణ బాధ్యత వయోజన విద్యాశాఖకు అప్పగించింది. జిల్లా వ్యాప్తంగా 52 మంది మండల కో-ఆర్డినేటర్లు, గ్రామ పంచాయతీకి ఇద్దరి చొప్పున 1,732 గ్రామ కో-ఆర్టినేటర్లు ఉన్నారు. మండల కో-ఆర్టినేటర్లకు నెలకు రూ.6 వేలు, గ్రామ కో-ఆర్డినేటర్లకు రూ.2 వేల వేతనం. వీరికి 11 నెలలుగా వేతనాలు అందడం లేదు. మండల కో-ఆర్టినేటర్లకు రూ.34.32 లక్షలు, గ్రామ కో-ఆర్డినేటర్లు రూ. 3,81,04,000 మొత్తం రూ.4,15,36,000 ప్రభుత్వం బకాయి ఉంది. నిరాశలో ‘ఆయుష్’ జిల్లావ్యాప్తంగా 91 ఆయుష్ డిస్పెన్సరీలు ఉన్నాయి. ఒక్కో డిస్పెన్సరీకి ఒక్కో వైద్యుడి చొప్పున 91 మెడికల్ ఆఫీసర్ల పోస్టులున్నాయి. నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ (ఎన్ఆర్హెచ్ఎం) కింద కాంట్రాక్టు పద్ధతిలో 10 మంది వైద్యులు, 23 మంది కాంపౌండర్లు, 39 మంది ఎస్‌ఎన్‌వోలు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి ఆగస్టు, సెప్టెంబర్ వేతనం రావాల్సి ఉంది. వైద్యులకు ఒక్కొక్కరికి నెలకు రూ.18 వేల చొప్పున రూ.3.60 లక్షలు, కాంపౌండర్లకు రూ.9,200 చొప్పున రూ.4,23,200, ఎస్ఎన్వోలకు రూ.6,700 చొప్పున రూ. 5,22,600.. అందరికి కలిపి రూ.13,05,800 రావాల్సి ఉంది. అధ్యాపకులకు అందని వేతనాలు ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అధ్యాపకుల కొరతతో ప్రభుత్వం 150 మంది కాంట్రాక్టు అధ్యాపకులను నియమించింది. వీరికి నెలకు రూ.21 వేలు వేతనం. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల వేతనాలు రావడం లేదు. 150 మందికి కలిపి నెలకు రూ.31.50 లక్షల చొప్పున మూడు నెలలకు రూ.94.50 లక్షల వేతనం రావాలి. పంచాయతీ కార్మికులు పస్తులే.. జిల్లాలో 866 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో కారోబార్లు, ఎన్‌ఎంఆర్‌లు, పారిశుధ్య కార్మికులు, ఎలక్ట్రీషియన్లు, ఫిట్టర్లు, పంపు మెకానిక్‌లు, అటెండర్లు 3 వేల మంది పని చేస్తున్నారు. వీరిలో 2,490 మందికి నెలల తరబడి వేతనాలు లేవు. అత్యధికంగా రూ.3,500.. అత్యల్పంగా రూ.1000 వరకు వేతనాలు ఉంటాయి. సగటున రూ.1500 తీసుకుంటే నెలకు 2,490 మందికి రూ. 37.35 లక్షలు, మూడు నెలలకు కలిపి రూ.1,12,05,000 బకాయి ఉంది. ఐకేపీ వీవోఏ మండల సమాఖ్య కమ్యూనిటీ కో-ఆర్డినేటర్(విలేజ్ ఆర్గనైజర్ అసిస్టెంట్లు) ఇందిరాక్రాంతి పథంలో కీలక ప్రాత పోషిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 1,600 మంది ఉన్నారు. వీరికి ప్రతి నెల రూ.2 వేలు ఇవ్వాల్సి ఉంది. కానీ మూడు నెలల నుంచి వేతనాలు అందలేదు. నెలకు రూ.32 లక్షల చొప్పున, మూడు నెలలకు కలిపి రూ.96 లక్షలు రావాలి. 104కు ఆగిన వేతనం, డీఏ.. 104 సర్వీసులు జిల్లా వ్యాప్తంగా 25 ఉన్నాయి. ఫార్మసిస్టు, డ్రైవర్, ల్యాబ్ టెక్నీషియన్, డాటా ఎంట్రీ ఆపరేటర్లు 80 మంది ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కో వేతనం ఉంటుంది. అందరికీ కలిపి ప్రతి నెల రూ.25 లక్షల వేతనం రావాలి. దీంతోపాటు ప్రతి సిబ్బందికి రోజుకు రూ.75 చొప్పున నెలలో 24 రోజులపాటు రూ.1,800 డీఏ రావాల్సి ఉంది. కానీ ఆగస్టు, సెప్టెంబర్ నెలల వేతనం, జూలై నుంచి డీఏ అందలేదు. రూ.50 లక్షల వేతనం, రూ.4.32 లక్షల డీఏ కలిపి రూ. 54.32 లక్షలు రావలి. విద్యుత్ ఆపరేటర్లదీ గోసే.. 33/11 కెవి విద్యుత్ స్టేషన్లు జిల్లావ్యాప్తంగా 130 వరకు ఉన్నాయి. ఆపరేటర్లకు ప్రతి నెల రూ.7,400, వాచ్మెన్లకు రూ.3,500 వేతనం. ఆరు నెలల నుంచి వేతనాలు రావడం లేదు. ఆపరేటర్లకు రూ.2,30,88,000, వాచ్మెన్లకు రూ.27.30 లక్షలు, మొత్తం రూ. 2,58,18,000 రావాలి. బోధకులకు తప్పని తిప్పలు జిల్లాలో ప్రభుత్వ ఇంటర్, డిగ్రీ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్యకు అనుణంగా అధ్యాపకులు లేవు. దీంతో ప్రభుత్వం ఐదేళ్ల క్రితమే ఇంటర్ కాలేజీల్లో 500 మంది.. డిగ్రీ కాలేజీల్లో 99 మంది కాంట్రాక్టు లెక్చరర్లను నియమించింది. ఇంటర్ అధ్యాపకులకు ప్రతి నెల రూ.18 వేలు, డిగ్రీ అధ్యాపకులకు రూ. 21 వేలు ఇవ్వాలి. మూడు నెలల నుంచి నయాపైసా విదిల్చలేదు. ఇంటర్ అధ్యాపకులకు రూ.2.70 కోట్లు, డి గ్రీ అధ్యాపకులకు రూ.62.37 లక్షలు రావాలి. పంపు మెకానిక్‌ల బాధలు.. జిల్లావ్యాప్తంగా అన్ని మండల పరిషత్ కార్యాలయాల్లో కాంట్రాక్టు పద్ధతిలో 55 మంది పంప్ మెకానిక్‌లు పనిచేస్తున్నారు. వీరికి ఆర్‌డబ్ల్యూఎస్‌కు వచ్చే గ్రాంట్ల నుంచి వేతనాలు ఇవ్వాలి. ఒక్కొక్కరికి ప్రతి నెల రూ.5 వేల చొప్పున రూ. 2.75 లక్షల వేతనం. కొందరికి 16 నెలల నుంచి వేతనాలు అందకపోతే ఇంకొందరికి ఆరు నెలల నుంచి లేవు. వేమనపల్లి మండల కార్యాలయంలో పని చేసే సిబ్బందికి, కోటపల్లి సిబ్బందికి 15 నెలల నుంచి వేతనాలు అందలేదు. సగటున 8 నెలల వేతనాలు లెక్కిస్తే.. దాదాపు రూ. 22 లక్షల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. అప్పులతో నెట్టుకొస్తున్న.. నా పేరు గాందర్ల సాయిబాబ. రెబ్బెన మండల సాక్షరభారత్ కో-ఆర్డినేటర్ గా పని చేస్తున్నా. పీజీ వరకు చదివా. చేసేందుకు ఎన్నో ఉద్యోగాలున్నా నిరక్షరాస్య మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు కేంద్రం ప్రారంభించిన సాక్షరభారత్లో మండల కో-ఆర్డినేటర్‌గా చేరా. నెలకు రూ.6 వేల గౌరవ వేతనం ఇవ్వాల్సి ఉంది. కానీ 11 నెలల నుంచి అందలేదు. నాకు పెళ్లయింది. వే తనాలు అందక ఆర్థికంగా ఇబ్బందిపడుతున్నా. దసరా, దీపావళి పండుగ ఉంది. ఇప్పటికే అప్పులు చేశా. పండుగ జరుపుకోవాలంటే మళ్లీ అప్పు చేయక తప్పదు. అధికారులు చర్యలు తీసుకుని మాకు వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలి. ఆరు నెలలుగా రావడం లేదు.. నా పేరు ఆత్రం బాపు. బెజ్జూరు మండల పరిషత్ కార్యాలయం లో బోరు మెకానిక్‌గా పని చేస్తు న్నా. గ్రామాల్లో బోర్లు పాడైతే వెళ్లి మరమ్మతు చేస్తా. అధికారు లు ప్రతిరోజు రూ.285 ఇస్తారు. కానీ అవి ప్రతి నెల అందవు. ఆరు నెలలకోసారి వస్తాయి. అప్పటి వరకు అప్పులు చేయక తప్ప దు. బోర్లు మర మ్మతు చేసినప్పుడు సర్పంచులు రూ.50, రూ.100 ఇస్తారు. అవి పెట్రోల్‌కే అయిపోతాయి. కుటుంబ పోషణ భారంగా ఉంది. ప్రతి నెల వేతనాలందేలా చర్యలు తీసుకోవాలి. -
తడిసి మోపెడు!
సాక్షి, అనంతపురం : సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో అన్ని ప్రభుత్వ శాఖల సేవలు స్తంభించిపోతే విద్యుత్ శాఖ మాత్రం వినియోగదారులకు బిల్లుల రూపంలో ‘షాక్’ ఇస్తోంది. ఉద్యమం పుణ్యమా అని రెండు నెలలకు కలిపి ఒకే బిల్లు ఇస్తున్నారు. సాధారణంగా ప్రతి నెలా వాడే విద్యుత్‌కు రీడింగ్ తీస్తారు. సమైక్యాంధ్ర ఉద్యమం వల్ల ఆగస్టులో వాడిన విద్యుత్ రీడింగ్ తీయలేదు. బిల్లులు ఇవ్వలేదు. కొన్ని చోట్ల బిల్లులు ఇచ్చినా.. కట్టించుకోలేదు. ఇప్పుడు ఆగస్టు, సెప్టెంబర్ రెండు నెలల రీడింగ్ తీయడంతో స్లాబ్ మారిపోయి బిల్లులో అత్యధిక విద్యుత్ రీడింగ్ జరిగినట్లు వినియోగదారుల చేతికి బిల్లులు ఇచ్చి కంగుతినిపిస్తున్నారు. ఈ డబుల్ ధమాకా బిల్లులు చూసి వినియోగదారుల గుండెలు బాదుకుంటున్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుపై జూలై 30న కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేసిన వెంటనే జిల్లాలో సమైక్యవాదులు ఉద్యమ బాటపట్టారు. ఇందులో భాగంగా జిల్లాలోని విద్యుత్ ఉద్యోగులు జేఏసీగా ఏర్పడి ఉద్యమ బాటపట్టారు. దీంతో జిల్లా విద్యుత్ శాఖలో సేవలు స్తంభించిపోయాయి. ప్రతి నెలా 2వ తేదీ నుంచి 11వ తేదీ లోపు ఇళ్లకు వెళ్లి రీడింగ్ తీసి.. వినియోగదారులకు బిల్లులు అందజేసే సిబ్బంది ఉద్యమంలో ఉండడంతో వినియోగదారులకు బిల్లులు అందలేదు. అయితే గడువు పూర్తయినా విద్యుత్ బిల్లులు అందకపోవడంతో వినియోగదారుల్లో దడ మొదలైంది. రెండు నెలలకు సంబంధించిన రీడింగ్ ఒకేసారి తీస్తే.. స్లాబు మారిపోయి బిల్లులు అధిక మొత్తంలో వస్తాయని భయాందోళన వ్యక్తం చేశారు. వినియోగదారుల ఆందోళన నేపథ్యంలో ట్రాన్స్‌కో ఎస్ఈ రమణమూర్తి, విద్యుత్ జేఏసీ నాయకులు విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి.. ‘జిల్లాలో విద్యుత్ వినియోగదారులు బిల్లులపై భయపడాల్సిన అవసరం లేదు. సిబ్బంది సమైక్య ఉద్యమంలో ఉన్నందున బిల్లులు అందజేయలేకపోతున్నాము. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బిల్లులు అందజేసే సమయంలో ఏ నెలకు సంబంధించి ఆ నెల బిల్లును సరాసరి వేసి.. ఎవరికీ ఇబ్బంది లేకుండా చేస్తాం. ఫైన్ కూడా చెల్లించాల్సిన అవసరం లేద’ని స్పష్టం చేశారు. అయితే విద్యుత్ ఉద్యోగులు ఉద్యమంలో పాల్గొంటూనే విధులకు కూడా హాజరౌతున్నారు. దీంతో ఈ నెల మొదటి వారం నుంచి బిల్లులు పంపిణీ చేస్తున్నారు. ట్రాన్స్‌కో ఎస్ఈ, జేఏసీ నాయకులు చెప్పిన మేరకు కాకుండా.. ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు సంబంధించిన రీడింగ్ కలిపి తీస్తుండడంతో స్లాబులో తేడాలు వచ్చి.. బిల్లులు పేలిపోతున్నాయి. స్లాబు ఇలా.. విద్యుత్ వినియోగంలో స్లాబులు మారే కొద్దీ బిల్లు పెరుగుతుంది. 50 యూనిట్ల వరకు రూ.1.45 ఉండగా 100 నుంచి 199 వరకు రూ.2.80, 200 నుంచి రూ.3.05 పైసలు ఇలా.. ప్రతి వంద యూనిట్లకు సరాసరి రూపాయి పెరుగుతుంది. అయితే విద్యుత్ ఉద్యోగులు చెప్పిన మేరకు ఆగస్టు నెలకు సంబంధించి యావరేజ్ యూనిట్లు వేసి బిల్లు ఇవ్వాల్సి ఉండగా.. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు సంబంధించి రీడింగ్‌ను తీస్తుండడంతో విద్యుత్ వినియోగం అధికంగా జరిగినట్లు రీడింగ్‌లో చూపిస్తోంది. దీంతో స్లాబు మారిపోయి వేలకు వేలు బిల్లులు వచ్చి పడుతున్నాయి. ఏమీ చేయలేము.. బిల్లులు అధికంగా వస్తున్నాయంటే మేము ఏమీ చేయలేము. ఆగస్టు నెలకు సంబంధించి తొలుత కొన్ని బిల్లులకు యావరేజ్ యూనిట్లు వేసి ఇచ్చాము. అయితే సిబ్బంది ఈ నెల 4 తరువాత తిరిగి సమ్మెలోకి వెళ్లడంతో కాస్త ఇబ్బంది కలిగింది. దీంతో ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు సంబంధించి రీడింగ్ తీసి ఇస్తున్నారు. దీంతో బిల్లులు అధికంగా వస్తుంటాయి. దీనికి మేము ఏమీ చేయలేము. బిల్లులు చెల్లించక తప్పదు. అయితే ఈ నెలలో ఎక్కువ బిల్లు చెల్లించినా వచ్చే నెల బిల్లులో ఈ మొత్తం అడ్జస్టు అవుతుంది. - రమణమూర్తి, ట్రాన్స్‌కో ఎస్ఈ, అనంతపురం -
పల్లెవాణి ఢిల్లీలో ప్రతిధ్వనించాలి
కర్నూలు(అర్బన్), న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమాన్ని పల్లె ప్రాంతాలకు తీసుకెళ్లి గ్రామీణులను మమేకం చేసినప్పుడే కేంద్రం దిగి వస్తుందని అభిప్రాయపడిన ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల జేఏసీ ఆ దిశగా చర్యలు ప్రారంభించింది. గ్రామీణ ప్రాంతాల్లో వివిధ ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులందరూ, ముఖ్యంగా ఉపాధ్యాయులు గ్రామ సభలు నిర్వహించి విభజన వల్ల మనకు జరిగే నష్టాలను ప్రజలకు వివరించాలని నిర్ణయించింది. ఈ మేరకు శనివారం స్థానిక జిల్లాపరిషత్ సమావేశ భవనంలో తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఈఓఆర్డీ, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలతో జరిగిన సమావేశం తీర్మానించింది. ఈ సందర్భంగా సూర్యప్రకాష్ మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా 46 రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నా పాలకుల్లో స్పందన లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఉద్యమాన్ని ఉద్ధృతం చేయడంలో భాగంగా జిల్లాలోని అన్ని పంచాయతీల్లో ఈ నెల 16వ తేదీన సర్పంచు అధ్యక్షతన గ్రామ సభలు నిర్వహించి సమైక్యాంధ్రకు మద్దతుగా తీర్మానాలు చేయాలని పిలుపునిచ్చారు. చేసిన తీర్మానాలను 8 ప్రతులుగా చేసి దేశ ప్రధాని, రాష్ట్రపతి, కేంద్ర హోం మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి, గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జిల్లా కలెక్టర్‌కు వేర్వేరుగా పోస్ట్ చేయాలన్నారు. మిగతా ఒక తీర్మాన ప్రతిని పంచాయతీ రికార్డుల్లో భద్రపరచాలని సూచించారు. మండల స్థాయిల్లో విధులు నిర్వహిస్తున్న అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు, ముఖ్యంగా ఉపాధ్యాయులు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నారు. రాయలసీమతోపాటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు అత్యంత వెన కబాటుతో ఉన్నాయని, వాటిని అభివృద్ధి చేసిన తర్వాతే విభజన గురించి ఆలోచించాలని శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో సూచించినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. రాష్ట్ర విభజన జరిగితే నదీ జలాల సమస్య తీవ్ర రూపం దాల్చుతుందన్నారు. విద్య, ఉపాధి, వైద్య రంగాల్లో కూడా రాయలసీమ ప్రజలు తీవ్ర నష్టాలకు గురవుతారన్నారు. ఉద్యమాన్ని మరింత బలోపేతం చేద్దాం కలిసివచ్చే రాజకీయ పార్టీలను కూడా కలుపుకొని ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని డీఆర్ఓ వేణుగోపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. జెడ్పీ సీఈఓ సూర్యప్రకాష్ అధ్యక్షతన జరిగిన సమైక్యాంధ్ర పరిరక్షణ సమావేశానికి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఈశ్వర్, జెడ్పీ డిప్యూటి సీఈఓ జయరామిరెడ్డి, ఏఓ భాస్కర్‌నాయుడు, పంచాయతీరాజ్ ఇంజనీర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రవీంద్రారెడ్డి, పీఆర్ మినిస్ట్రీయల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు దస్తగిరిబాబు, ఈఓఆర్డీల సంఘం నాయకులు ఏలీషా, ఉపాధ్యాయ జేఏసీ నాయకులు తిమ్మన్న, పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు, అన్ని శాఖల ఉద్యోగులు హాజరయ్యారు. -
మరో పోరాటం
సాక్షి, మచిలీపట్నం : సమైక్యాంధ్ర ఉద్యమ ప్రభావం స్వాతంత్య్రదిన వేడుకలపై గట్టిగా పడనుంది. ఈ వేడుకల్లో ప్రభుత్వ ఉద్యోగుల హాజరు తగ్గే అవకాశముంది, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమబాట పట్టడంతో సందడి లేకపోవచ్చు. అవనిగడ్డ ఉపఎన్నిక నేపథ్యంలో ప్రభుత్వ ప్రచారం లేకుండా వేడుకలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఆదేశించింది. అందుకే ఆడంబరాలు లేకుండా అత్యంత సాదాసీదాగా వేడుకలను నిర్వహించేందుకు అధికారులు నిర్ణయించారు. ఈసారి ప్రభుత్వ శాఖలకు చెందిన శకటాల ప్రదర్శనకు కూడా అనుమతి లేదు. గత ఏడాది సుమారు రూ. 10 లక్షలు ఖర్చుపెట్టి ప్రభుత్వ పథకాల గొప్పతనం వివరిస్తూ శకటాలను ఏర్పాటుచేశారు. ప్రస్తుత ఉపఎన్నిక కారణంగా పథకాల బాకాలు లేకుండానే వేడుకలు నిర్వహించాల్సి ఉంది. దీనికితోడు పలు రంగాల్లో విశిష్ట సేవలు అందించినవారికిచ్చే ప్రశంసాపత్రాల సంఖ్యను కూడా కుదించారు. సుమారు 67 ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, సేవా సంస్థలకు చెందిన వారు అందించిన ఉత్తమ సేవలకు గుర్తింపుగా ఆగస్టు 15న ప్రశంసాపత్రాలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. గత ఏడాది దాదాపు 300 మందికి ఉత్తమ సేవా ప్రశంసాపత్రాలను ఇవ్వగా, ఈసారి వాటిని 150కి కుదించారు. ప్రశంసాపత్రానికి విలువ పెంచేందుకే తక్కువమందికి ఇస్తున్నట్టు అధికారులు ధ్రువీకరించారు.వేడుకల్లో కలెక్టర్ బుద్ధప్రకాష్ ఎం.జ్యోతి ప్రసంగంలో సైతం ఎన్నికల కోడ్ కారణంగా ప్రభుత్వ పథకాల ప్రస్తావన ఉండదు. స్వాతంత్య్ర దినోత్సవ ప్రాముఖ్యత, సమరయోధుల త్యాగం వంటి విషయాలకు మాత్రమే కలెక్టర్ ఉపన్యాసం పరిమితం కానుంది. జాతీయ పతాకావిష్కరణ, పోలీసుల గౌరవ వందనం, ఉత్తమ సేవలకు ప్రశంసాపత్రాలు, బాలల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉదయం తొమ్మిది నుంచి 11 గంటల వరకు వేడుకలు నిర్వహిస్తారని జిల్లా రెవెన్యూ అధికారి ఎల్.విజయచందర్ ‘సాక్షి’కి చెప్పారు. బుధవారం డీఆర్వో, ఎస్పీ జె.ప్రభాకర్, డీఆర్డీఏ పీడీ కె.శివశంకర్, బందరు ఆర్డీవో పి.సాయిబాబు, ఏఎస్పీ షిమోశి బాజ్‌పాయ్, ఏఆర్ డీఎస్పీ చంద్రశేఖర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రశంసాపత్రాలకు దూరం.. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా మూడు రోజులుగా సమ్మె చేస్తున్న ఉపాధ్యాయులు, ఉద్యోగులు జాతీయ పతాకానికి వందనం చేయాలని నిర్ణయించారు. ఆయా పాఠశాలలు, పంచాయతీ కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద జెండా ఎగురవేయాలని సమైక్యాంధ్ర ఉద్యోగ సంఘాల జేఏసీ తీర్మానించింది. ఉద్యోగులెవరూ ప్రశంసాపత్రాలను తీసుకోకూడదని పిలుపునిచ్చింది. పతాకావిష్కరణ అనంతరం మరో స్వాతంత్య్ర పోరాటం మాదిరిగా సమైక్య ఉద్యమంలోకి వెళ్లాలని జేఏసీ నేతలు నిర్ణయించారు.