సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త ప్రభుత్వ శాఖ ఏర్పాటయింది. నైపుణాభివృద్ధి, శిక్షణ విభాగం పేరిట కొత్త పాలనా శాఖను ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. రాష్ట్రంలో ఏర్పాటైన పరిశ్రమల్లో స్థానిక యువతకు 75 శాతం రిజర్వేషన్లు, యువతకు నైపుణ్యాభివృద్ధి, శిక్షణ అంశాలను ఈ శాఖ పర్యవేక్షించనుంది. అలాగే గతంలో ఏర్పాటైన నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, ఆవిష్కరణల విభాగాన్ని కొత్త శాఖలో విలీనం చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. కొత్త శాఖ కోసం కార్యదర్శి, అదనపు కార్యదర్శి, ఇతర సిబ్బందిని కేటాయిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. దీంతో రాష్ట్రంలో 37వ శాఖగా నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ఏర్పడింది.
ఏపీలో మరో కొత్త ప్రభుత్వ శాఖ
Published Mon, Dec 9 2019 3:27 PM | Last Updated on Mon, Dec 9 2019 6:23 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment