5 భవంతులు.. 41 శాఖలు
- 1వ భవనంలో సీఎం, సీఎస్ కార్యాలయాలు
- 4 భవనాల్లో 25 మంది మంత్రుల ఆఫీసులు
- ఇద్దరు సలహాదారుల కార్యాలయాలు
- తాత్కాలిక సచివాలయ సమగ్ర స్వరూపమిది
- ఏ శాఖ ఎక్కడో స్పష్టం చేసిన సర్కారు
సాక్షి, హైదరాబాద్: ఐదు భవంతులు.. అన్నింటిలో గ్రౌండ్‌ఫ్లోర్, ఫస్ట్‌ఫ్లోర్.. సీఎం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయాలతో పాటు 25 మంది మంత్రులకు కార్యాలయాలు.. 41 ప్రభుత్వ శాఖలకు తాత్కాలిక సచివాలయంలో చోటు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఏ ప్రభుత్వ శాఖకు ఏ భవనంలో కేటాయించేదీ తెలిపింది.
► భవనం-1 మొదటి అంతస్తులో సీఎం కార్యాలయం (సీఎంవో), సీఎస్ కార్యాలయం, గ్రౌండ్ ఫ్లోర్‌లో సాధారణ పరిపాలన విభాగం (2,307 చదరపు అడుగులు), న్యాయశాఖ (6,850 చ.అ.), సీఎం హామీల పరిష్కారాల కోసం ఒక హాల్ ఉంటాయి.
► భవనం-2 గ్రౌండ్ ఫ్లోర్‌లో ఐదుగురు మంత్రుల కార్యాలయాలు, హోం శాఖ (7,400 చ.అ.) విద్యుత్తు శాఖ (2,590), పరిశ్రమల శాఖ (5,310), మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ (808), పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ (2,970), మొదటి అంతస్తులో ఐదుగురు మంత్రుల కార్యాలయాలు, ఆర్థికశాఖ (18,470 చ.అ.), ప్రణాళిక విభాగం (13,200) ఉంటాయి.
► భవనం-3 గ్రౌండ్ ఫ్లోర్‌లో టెలికాం ఆఫీసు, బీఎస్‌ఎన్‌ఎల్ సర్వర్ (1,000 చ.అ.), ఏపీటీఎస్ సచివాలయ సపోర్ట్ యూనిట్ (1,000), పే అండ్ అకౌంట్స్ (1,000), సాధారణ సౌకర్యాలైన మీ సేవ, ఈ సేవ కౌంటర్లు, రైలు/బస్ రిజర్వేషన్ కౌంటర్లు, పోస్ట్ ఆఫీసు, బ్యాంకు, రెండు ఏటీఎంలు, షాపులు, కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఆఫీసులు (27,500), ప్లే స్కూల్ (1,000), మూడు పడకల డిస్పెన్సరీ (2,000), రిక్రియేషన్ (3,000), లైబ్రరీ (1,000), రెస్టారెంట్ (12,000) ఏర్పాటు చేస్తారు. మొదటి అంతస్తులో ఐదుగురు మంత్రుల కార్యాలయాలు, సాంఘిక, గిరిజన సంక్షేమశాఖలు (7,950 చ.అ.), బీసీ సంక్షేమం (3,770 ), మైనార్టీ సంక్షేమం (2,870), మహిళా శిశు సంక్షేమం (3,450), స్కిల్ డెవలప్‌మెంట్ (2,500), యువజన సంక్షేమం, టూరిజం, కల్చర్ (3,600) ఉంటాయి.
► భవనం-4 గ్రౌండ్ ఫ్లోర్‌లో ఐదుగురు మంత్రుల కార్యాలయాలు, రెవెన్యూ (11,910 చ.అ.), రెవెన్యూ విపత్తుల శాఖ (1,070), ఎన్విరాన్‌మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ (3,910), వ్యవసాయ, సహకారశాఖ (6,780), పశుసంవర్ధక, డెయిరీ డెవలప్‌మెంట్, మత్య్సశాఖ (2,870), పౌరసరఫరాలశాఖ (2,820) ఉంటాయి. మొదటి అంతస్తులో ఐదుగురు మంత్రులు, ఇద్దరు సలహాదారుల కార్యాలయాలు, వాటర్ రిసోర్సెస్ (10,550 చ.అ.), రెయిన్ షాడో ఏరియా డెవలప్‌మెంట్ (1,400), పాఠశాల విద్య (4,310), ఉన్నత విద్య (4,720), ఐటీ, డేటా సెంటర్ (8,450) ఏర్పాటు చేస్తారు.
► భవనం-5 గ్రౌండ్ ఫ్లోర్‌లో పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (11,320 చ.అ.), వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ (7,510), కార్మిక, ఉపాధిశాఖ (3,770), గృహ నిర్మాణశాఖ (3,570), మొదటి అంతస్తులో ట్రాన్స్‌పోర్టు, రోడ్లు, భవనాలశాఖ (5,750), విజిలెన్స్ కమిషన్ (3,700), కాన్ఫరెన్స్ హాలు (400 చదరపు అడుగులు) ఉంటాయి.