బెంగళూరు: ప్రభుత్వ శాఖల్లో పోస్టింగులు, బదిలీల్లో తన కుమారుడు యతీంద్ర భారీగా లంచాలు తీసుకున్నారన్న జేడీ(ఎస్)చీఫ్ హెచ్‌డీ కుమారస్వామి ఆరోపణలను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదివారం తీవ్రంగా ఖండించారు. తాను గానీ, యతీంద్ర గానీ లంచాలు తీసుకున్నట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచే శాశ్వతంగా తప్పుకుంటానని ప్రకటించారు.
లంచాలు తీసుకున్న చరిత్ర కుమారస్వామిదేనని ఎద్దేవా చేశారు. ఆయన హయాం పొడవునా అలాంటి వ్యవహారాలే జరిగాయని ఆరోపించారు. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సిద్ధరామయ్య–యతీంద్ర ఫోన్ సంభాషణ పోస్టింగులు, బదిలీల్లో లంచాల గురించేనని కుమారస్వామి ఆరోపిస్తుండటం తెలిసిందే. యతీంద్ర సూపర్ సీఎంగా మారారంటూ ఆయన మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment