Yatindra
-
Siddaramaih: లంచం తీసుకున్నట్టు నిరూపిస్తే... రాజకీయాలకు గుడ్‌బై
బెంగళూరు: ప్రభుత్వ శాఖల్లో పోస్టింగులు, బదిలీల్లో తన కుమారుడు యతీంద్ర భారీగా లంచాలు తీసుకున్నారన్న జేడీ(ఎస్)చీఫ్ హెచ్డీ కుమారస్వామి ఆరోపణలను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదివారం తీవ్రంగా ఖండించారు. తాను గానీ, యతీంద్ర గానీ లంచాలు తీసుకున్నట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచే శాశ్వతంగా తప్పుకుంటానని ప్రకటించారు. లంచాలు తీసుకున్న చరిత్ర కుమారస్వామిదేనని ఎద్దేవా చేశారు. ఆయన హయాం పొడవునా అలాంటి వ్యవహారాలే జరిగాయని ఆరోపించారు. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సిద్ధరామయ్య–యతీంద్ర ఫోన్ సంభాషణ పోస్టింగులు, బదిలీల్లో లంచాల గురించేనని కుమారస్వామి ఆరోపిస్తుండటం తెలిసిందే. యతీంద్ర సూపర్ సీఎంగా మారారంటూ ఆయన మండిపడ్డారు. -
సిద్దరామయ్యపై యడ్డీ కుమారుడు పోటీ?
బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ దిగ్గజ నాయకుడు సిద్దరామయ్య మే 10న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడనున్న వరుణ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున బి.ఎస్. యడియూరప్ప కుమారుడు బరిలో దిగుతారని ప్రచారం జరుగుతోంది. తన కుమారుడు బి.వై. విజయేంద్ర వరుణ నియోజకవర్గం నుంచి పోటీ పడే అవకాశాలను కొట్టి పారేయలేమని యడియూరప్ప చెప్పడంతో రాజకీయంగా ఈ స్థానంపై ఆసక్తి పెరిగింది. మైసూరు జిల్లాలో ముఖ్య నియోజకవర్గాల్లో ఒకటైన వరుణకి ప్రస్తుతం సిద్దరామయ్య కుమారుడు యతీంద్ర ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో వరుణ నుంచి సిద్ధరామయ్య పోటీ చేస్తున్నట్టు కాంగ్రెస్ అధికారికంగా ప్రకటించింది. సిద్దరామయ్యపై మీ కుమారుడు విజయేంద్ర పోటీ పడతారా అని గురువారం యడియూరప్పని విలేకరులు ప్రశ్నించగా ‘‘దీనిపై చర్చలైతే సాగుతున్నాయి. వరుణలో నెగ్గడం సిద్దరామయ్యకు అంత సులభం కాదు. మేము మంచి అభ్యర్థినే నిలబెట్టి గట్టి పోటీ ఇస్తాం. చూద్దాం ఏమవుతుందో’’ అని వ్యాఖ్యానించారు. దీనిపై సిద్దరామయ్య స్పందిస్తూ తనపై ఎవరు పోటీకి దిగినా పట్టించుకోనని అన్నారు. యడియూరప్ప పోటీకి దిగినా స్వా గతిస్తామని కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు డి.కె. శివకుమార్ పేర్కొనడం విశేషం. -
‘వరుణలో కాంగ్రెస్‌పైనే ఓటర్ల కరుణ’
సాక్షి, బెంగళూర్ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టినీ ఆకర్షించిన వరుణ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన సీఎం సిద్ధరామయ్య కుమారుడు డాక్టర్ యతీంద్ర పార్టీ విజయంపై ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో గత ఏడాదిన్నరగా అన్ని గ్రామాల్లో తాను పర్యటించానని కాంగ్రెస్ సర్కార్ పనితీరు పట్ల ప్రజల్లో సంతృప్తి వ్యక్తమవుతోందని విశ్వాసం వ్యక్తం చేశారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్‌లో దేవాలయాల సందర్శనపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. కర్ణాటకలో పోలింగ్ జరుగుతున్న క్రమంలో ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందునే ఓటర్లను ఆకట్టుకునేందుకు మోదీ నేపాల్‌లో దేవాలయాల చుట్టూ తిరిగారని కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని, ఆలయాల సందర్శనకు మోదీ ఈ రోజే ఎందుకు ఎంచుకున్నారని ఆయన ప్రశ్నించారు. కాగా, బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా తలపడుతున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపును మే 15న చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. -
సీఎం కుమారుడిపై లోకాయుక్తలో ఫిర్యాదు
విచారణ చేయాలని ఆప్ ఫిర్యాదు బెంగళూరు: మ్యాట్రిక్స్ సంస్థ ల్యాబ్‌ల ఏర్పాటుకు సంబంధించి అనుమతులు పొందడంపై సీఎం సిద్ధరామయ్య కుమారుడు డాక్టర్ యతీంద్రపై లోకాయుక్తలో ఫిర్యాదు నమోైదె ంది. వివరాలు... ప్రభుత్వ ఆస్పత్రుల్లో ల్యాబ్‌ల ఏర్పాటుకు సంబంధించి మ్యాట్రిక్స్ సంస్థకు నిబంధనలకు విరుద్దంగా అనుమతులు మంజూరు చేశారని, సీఎం కుమారుడు యతీంద్ర డెరైక్టర్‌గా ఉన్నందువల్లే ఆ కంపెనీకి అనుమతులను కట్టబెట్టారని ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అనుమతుల మంజూరు విషయంలో డాక్టర్ యతీంద్ర పాత్రపై విచారణ జరపాలని కోరుతూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సభ్యులు సోమవారమిక్కడ లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆప్ రాష్ట్ర శాఖ ప్రతినిధి శివకుమార్ చెంగల్రాయ మాట్లాడుతూ... కేవలం స్వజనపక్షపాతంతోనే ఈ టెండర్లను మ్యాట్రిక్స్‌కు కట్టబెట్టినట్లు ఇప్పటికే తేటతెల్లమైందని విమర్శించారు. డాక్టర్ యతీంద్ర తన తండ్రి పదవిని అడ్డుపెట్టుకొని ఈ టెండర్‌ను దక్కించుకున్నారని ఆరోపించారు. అందువల్ల ఈ విషయంపై నిష్పక్షపాత విచారణను జరిపించాలని లోకాయుక్తను కోరినట్లు చెప్పారు. లోకాయుక్తలో నిష్పక్షపాత విచారణ జరగకపోతే తాము న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయిస్తామని పేర్కొన్నారు. ఇక ఇదే సందర్భంలో తన కుమారుడి కోసం నిబంధనలను పక్కకు పెట్టిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని శివకుమార్ డిమాండ్ చేశారు.