విద్యుత్ సంస్థల్లో బదిలీల కోసం అధికారులపై నేతల ఒత్తిళ్లు
ముందిచ్చిన ఆదేశాలను మారుస్తున్న సీఎండీలు
సాక్షి, అమరావతి: విద్యుత్ సంస్థల్లో తాము చెప్పినట్లే బదిలీలు జరగాలని కూటమి నేతలు పట్టుబడుతున్నారు. దీంతో గడువు ముగిసినప్పటికీ గత్యంతరం లేక పాత తేదీలతో అధికారులు బదిలీలు చేస్తున్నారు. ఈ శాఖలో బదిలీలకు ముందే ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు బయటకు రావడంతో ఉలిక్కిపడ్డ ఉన్నతాధికారులు నేతల సిఫారసులు ఉన్నప్పటికీ, కనీస అర్హత ఉన్న ఉద్యోగుల బదిలీలలనే ఆమోదించారు.
ఆ మేరకు కొందరికి పోస్టింగ్‌లు కూడా ఇచ్చారు. అలాగే రాజకీయ నేతల కోరిక మేరకు కొందరిని బదిలీ చేసినప్పటికీ డిప్యూటేషన్ పేరుతో ప్రస్తుత స్థానంలోనే కొనసాగేలా ఆదేశాలిచ్చారు. అయినా తృప్తి పడని కొందరు నేతలు ఇంకా ఒత్తిళ్లు తేవడంతో విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల సీఎండీలు వారిచ్చిన బదిలీలను సైతం పాత తేదీలతో మార్చి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.
బదిలీలకు ఈ నెల 22వ తేదీతో గడువు ముగిసినప్పటికీ, ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఏపీఈపీడీసీఎల్‌లో ఆరుగురు డిప్యూటీ ఎలక్ట్రికల్ ఇంజనీర్లకు ఇచ్చిన బదిలీ ఉత్తర్వులను నిలిపివేసి, కొత్త పోస్టింగ్‌లతో మంగళవారం మళ్లీ ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment