ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు భర్తీ చేయాలి
- ఎమ్మెల్సీ యండపల్లి
తిరుపతి అర్బన్: టీటీడీతో పాటు రాషంలోని అ న్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను త క్షణం భర్తీ చేయాలని ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డి డిమాండ్ చేశారు. శనివారం టీటీడీ ఏడీ బిల్డింగ్ వద్ద నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీటీడీలోని 5300 పోస్టుల భర్తీని వెంటనే చేపట్టే లా పాలకమండలి చర్యలు తీసుకోవాలన్నారు. టీటీడీలోని అన్ని విభాగాల్లో సుమారు 10 వేల ఖాళీలను భర్తీ చేయాల్సి ఉందన్నారు. సీఎం చం ద్రబాబు ఎన్నికల హామీల్లో ప్రకటించిన విధంగా నిరుద్యోగ భృతి చెల్లించాలన్నారు.
టీటీడీలో కాం ట్రాక్టర్లకు, ఏజెన్సీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న విధానాన్ని రద్దు చేసి, పేదలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. సీఐటీయూ జిల్లా కా ర్యదర్శి కందారపు మురళి మాట్లాడుతూ బాబు వస్తే జాబు వస్తుందని ప్రకటించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆ దిశగా ఆలోచించకపోవ డం దారుణమన్నారు. జెఎస్పీ అధికార ప్రతినిధి నవీన్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ బాబుకు మాత్ర మే జాబ్‌వచ్చిందన్నారు. డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి జయచంద్ర, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి రవి తేజ, ఐద్వా జిల్లా కార్యదర్శి సాయిలక్ష్మి, యూటీఎఫ్ నేతలు మధుసూదన, నిర్మల, సీఐటీ యూ నగర కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.