కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లా పరిపాలన కేంద్రం కలెక్టరేట్‌లోని ప్రభుత్వశాఖలకు విద్యుత్‌షాక్ తగులుతోంది. మొండి బకాయిల వసూలుకు ట్రాన్స్‌కో మరోసారి కన్నెర్ర చేసిం ది. బకాయిలు పేరుకుపోయాయని ఇప్పటికే నాలుగు శాఖలకు కరెంట్ చేసిన ట్రాన్స్‌కో తాజాగా మరో 20 శాఖలకు సరఫరా నిలిపివేసింది.
కనీసం సంప్రదింపు లు కూడా జరపని సంబంధితశాఖలు బిల్లుల చెల్లింపు లో మొండిగా వ్యవహరిస్తుండడంతో ట్రాన్స్‌కో మరిం త వేగంగా చర్యలకు పూనుకుంది. కలెక్టరేట్‌లోని 42 ప్రభుత్వశాఖల కార్యాలయాలు రూ.3.93 కోట్లు బకాయిలుండగా ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఆదేశాల మేరకు కరెం ట్ కట్ చేస్తున్నట్లు ఏడీ సుగుణయ్య తెలిపారు. క్రిస్మస్ సందర్భంగా సెలవుదినం కావడంతో విధులకు ఆటంకం కలగనప్పటికీ గురువారం నుంచి ఇక్కట్లు తప్పేలా లేవు. బకాయిలు చెల్లించనిదే కరెంట్ పునరుద్ధరించేది లేదని ట్రాన్స్‌కో అధికారులు తేల్చిచెపుతున్నారు. ప్రభుత్వ నిధులు రాలేదనే కారణంతో కరెంట్ బిల్లు చెల్లింపులో జాప్యం జరుగుతుండడంతో ఆయా శాఖల సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు.
కనికరం కొంచెమే..
కలెక్టరేట్‌లో సోమవారం వ్యవసాయశాఖ జేడీ, డీఈవో, సీపీవో, పశుసంవర్ధకశాఖ జేడీ కార్యాలయా ల్లో కరెంటు తొలగించారు. ట్రెజరీలో కరెంటు తొల గించేందుకు సిద్ధమైనప్పటికీ లావాదేవీల్లో ఇబ్బందులెదురవుతాయని ఊరుకున్నారు. బకాయి ఉన్న వాటిలో కొంతమేర చెల్లిస్తామని డీఈవో, పశుసంవర్ధకశాఖ అధికారులు ట్రాన్స్‌కో అధికారులకు స్పష్టమైన హామీ ఇవ్వడంతో సంబంధిత కార్యాలయాలకు సరఫరా పునరుద్ధరించారు. బుధవారం తొలగించిన మరో 20 శాఖల్లో తహశీల్దార్ కార్యాలయం, పౌరసరఫరాల శాఖ, డీపీవో కార్యాలయాలు తక్కువ బకాయి ఉండగా సంప్రదింపులతో తిరిగి పునరుద్ధరించారు.
చీకట్‌ల శాఖలివే...
సోషల్ వెల్ఫేర్ డీడీ, బీసీ వెల్ఫేర్ డీడీ, బీసీ సర్వీస్ కో ఆపరేటివ్ సొసైటీ, ఆడిట్, సీపీవో, జిల్లా కో ఆపరేటివ్ అధికారి కార్యాలయం, డీపీవో, జిల్లా కోఆపరేటివ్ ఆడిట్, డ్వామా, ఐకేపీ, డీఆర్‌డీఏ, ఎస్సీ కార్పొరేషన్, హౌసింగ్, గిరిజన సంక్షేమశాఖ, బయో కెమికల్ ల్యాబ్, డీపీఆర్వో, ఎక్సైజ్ కార్యాలయం, వికలాంగులశాఖతో పాటు మూడు రోజులుగా వ్యవసాయశాఖ జేడీ కార్యాలయం చీకటిలోనే ఉండిపోయింది.
పెరిగిన చీ‘కట్’లు
Published Thu, Dec 26 2013 4:14 AM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM
Advertisement