విభజన ఫీవర్‌తో ముందుకు సాగని పాలన
- జూన్2 వరకూ ఇదే పరిస్థితి జిల్లాలో ప్రభుత్వ శాఖల
- ఉన్నతాధికారులకు తెలంగాణ భయం
- ఉద్యోగుల సర్దుబాటులో ఎక్కడకు బదిలీ అవుతామో తెలియని అయోమయం
సాక్షి,విశాఖపట్నం : అధికారుల బదిలీ బెంగ కా రణంగా జిల్లాలో దాదాపు పాలన స్తంభించిపోయింది. అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారుల కు ఇప్పుడు తెలంగాణ భయం వెన్నాడుతోంది. జూన్ 2న తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఆవిర్భావం కారణంగా ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రి య జరుగుతుండడంతో ఎక్కడ తాము తెలంగాణకు బదిలీ అయ్యే ప్రమాదం ఉంటుందోనని కంగారు పుట్టిస్తోంది. రెండు రాష్ట్రాల్లోని ఆయా శాఖలకు సంబంధించిన ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియ ఊపందుకోవడంతో తాము ఎటువైపు వెళ్లాల్సి వస్తుందో అర్థంకాక అనేకమంది అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అసలు స్థాన చలనానికి ఏ అంశాన్ని ప్రా తిపదికగా తీసుకుంటారో తెలియక అయోమయానికి గురవుతున్నారు.
జిల్లాలో సుమారు అన్ని ప్రభుత్వ శా ఖల్లో డిప్యూటీ డెరైక్టర్, సూపరింటెండెంట్ ఇంజినీర్, ప్రాజెక్ట్ డెరైక్టర్, జాయిం ట్ డెరైక్టర్, డిప్యూటీ డెరైక్టర్ తదితర హోదాల్లో జిల్లా స్థాయి అధికారులు పని చేస్తున్నాయి. వీరేకాక ప్రాంతీయ ప్రభుత్వ కార్యాలయాల పేరుతో దే వాదాయ, విద్యా, పౌరసరఫరాలు,మార్కెటిం గ్, కార్మిక, వ్యవసాయ,గనులు,వైద్య ఆరోగ్యం, మున్సిపల్,స్టాంపులు రిజిస్ట్రేషన్లు, సహకారం తదితర శాఖల్లోనూ ఉన్నతాధికారులు విధులు నిర్వహిస్తున్నారు. వీరంతా రాష్ట్ర స్థాయి అధికారులే. వీరిలో అధిక శాతం మంది స్వస్థలం, విద్యాభ్యాసం పరంగా హైదరాబాద్, ఇతర తెలంగాణ జిల్లాల్లో ఎంతో కొంత స్వల్ప కాలం సంబంధం ఉంది.
వీరిలో చాలామందికి హైదరాబాద్, ఇతర తెలంగాణ జిల్లాల్లో పని చేసిన అనుభవం ఉంది. స్వతహాగా తమది సీమాంధ్ర అయినా తల్లిదండ్రులు తెలంగాణలో ఉద్యోగం కారణంగా అక్కడ జన్మించిన వారూ ఉన్నారు. ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియలో స్థానిక, స్థానికేతర విభాగాల్లో ఏది తమకు వర్తిస్తుందో వీరికి అర్థం కావడం లేదు. దీంతో తమ సర్వీసు, విద్యాభ్యాసం, తల్లిదండ్రుల సర్వీసు విభాగాల్లో తమను సీమాంధ్ర, లేదా తెలంగాణ రాష్ట్రాల్లో ఎటువైపు కదుల్చుతారో తెలియక వీరంతా భయపడుతున్నారు. తెలంగాణలో ఆ ప్రాంత ఉద్యోగులతో కలిసి పనిచేయాల్సి వస్తే ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందోనని సీమాంధ్ర ఉద్యోగులకు అంతుపట్టడంలేదు. మరోపక్క ఉద్యోగుల విభజన ప్రక్రియలో ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగుల కొరత ఉంటే సీమాంధ్రకు చెందిన ఉద్యోగులతో భర్తీ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది.
స్పష్టత లేక తిప్పలు
ఉద్యోగుల సర్దుబాటు, బదిలీలను రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించి మార్చుతారని ప్రచారం ఉంది. కానీ ప్రస్తుతం ఆచరణలో ఇది పూర్తిస్థాయిలో జరగడం లేదు. ఈ నేపథ్యంలో స్థానికత, విద్యాభ్యాసం, తల్లిదండ్రులు గతంలో చేసిన ఉద్యోగ ప్రాంతం వీటిలో దేన్ని ప్రాతిపదికగా పరిగణిస్తారో చాలామంది జిల్లా అధికారులకు అర్థం కావడం లేదు.
దీనిపై ఇప్పటికీ స్పష్టత లేకపోవడంతో జిల్లా అధికారులు సైతం అయోమయానికి గురవుతున్నారు. జూన్ 2 నాటికి ఈ బదిలీల ప్రక్రియ ముగియాల్సి ఉన్నందువల్ల ఈలోగా తమ పోస్టు జిల్లాలో ఉంటుందో తెలంగాణకు మారుతుందో తెలీక జిల్లా అధికారులు టెన్షన్ పడుతున్నారు.