నెల్లూరు(క్రైమ్), న్యూస్‌లైన్: అప్పట్లో నరకాసురుడనే రాక్షసుడు అందరినీ పీక్కుతింటూ ప్రజలతో పాటు దేవతలకు సమస్యగా మారాడు. అతని బాధితుల మొర విని స్పందించిన సత్యభామ నరకాసురుడ్ని వధించి వారి జీవితాల్లో వెలుగులు నింపింది. ఆ రోజుల్లో నరకాసురుడు ఒక్కడే ప్రజలను హిం సించాడు. ఈ రోజుల్లో మాత్రం అవినీతికి అలవాటు పడిన పలువురు అధికారులు, ఉద్యోగులు నరకాసురుడ్ని మరిపించేలా జనాన్ని బాదుతున్నారు. వీరికి లంచం బాధ నుంచి విముక్తి కల్పించేందుకు అవినీ తి నిరోధక శాఖ అధికారులు శ్రమిస్తున్నా, వారు పూర్తి స్థాయిలో జూలు విదిలించాల్సిన సమయం ఆ సన్నమైంది. సమాజంలో అవినీతిని పూర్తిగా అరికట్టినపుడే ప్రజలకు నిజమైన దీపావళి.
అవినీతిమయం: జిల్లాలోని దాదాపు అన్ని ప్రభు త్వ శాఖలు అవినీతిమయంగా మారాయి. ప్రజల అ వసరాలు, బలహీనతలను ఆసరాగా చేసుకున్న పలువురు అధికారులు, సిబ్బంది జలగల్లా పీల్చేస్తున్నారు. అవినీతి పరుల ఆటకట్టించేందుకు ఏసీబీ డీఎస్పీ జె.భాస్కర్‌రావు నేతృత్వంలో ఇన్‌స్పెక్టర్లు సీహెచ్ చంద్రమౌళి, టి.వి.శ్రీనివాసరావు, కృపానందం, వెంకటేశ్వర్లు చర్యలు చేపట్టారు.
వరుస దాడులు : ఈ ఏడాదిలో ఏసీబీ అధికారులు 22 కేసులు నమోదుచేసి పలువురిని కటకటాల వెనక్కునెట్టారు. డీఎంహెచ్‌ఓ కార్యాలయంపై ఏసీబీ దా డులు జరగడం సంచలనం సృష్టించింది. అవినీతికి మారుపేరుగా మారిన ఆర్టీఏ కార్యాలయంపై మా ర్చి 13న మెరుపుదాడి చేశారు. అదే నెల 15న నెల్లూరులోని పరిశ్రమల శాఖ కార్యాలయంపై, 30న సూళ్లూరుపేట రిజిస్ట్రార్ కార్యాలయంపై దాడులు నిర్వహించారు. మార్చి 17వ తేదీన వింజమూరు ఉన్నత పాఠశాల హెచ్‌ఎం లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు. స్థల విషయమై క్లియరెన్స్ ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసినా ఏఎస్‌మండలంలోని ఓ సర్వేయర్‌ను ఏప్రిల్ 16న పట్టుకున్నారు. అక్రమంగా నిర్మించిన భవనాన్ని కూల్చకుండా ఉండేందుకు లంచం తీసుకుంటున్న నెల్లూ రు కార్పొరేషన్ టీపీసీ అధికారులను ఏప్రిల్ 22న అరెస్ట్ చేశారు. ఇందిరమ్మ ఇంటి బిల్లు మంజూరు చేసేం దుకు లంచం డిమాండ్ చేసిన హౌసింగ్ అధికారి మేనెలలో ఏసీబీకి దొరికిపోయాడు. జూలై 9న ఓజిలి ఎస్సైని, లెసైన్స్ రెన్యూవల్ విషయంలో వ్యాపారి నుంచి లంచం తీసుకుంటున్న వాణిజ్యపన్నుల శాఖ లోని ఓ అధికారిని జూలై 28న నెల్లూరు లో, ఇందిరమ్మ ఇంటికి పొజిషన్ సర్టిఫికెట్ ఇచ్చేం దుకు లంచం తీసుకుంటున్న నారాయణరెడ్డిపేట వీఆర్వో శ్రీనివాసులును ఆగస్టు 6న పట్టుకున్నారు.
కాంట్రాక్టర్‌కు బిల్లు చెల్లింపు విషయంలో రూ.50 వేలు లంచం తీసుకుంటూ అటవీశాఖలోని ఓ అధికారి ఆగస్టు 21న దొరికిపోయారు. వైద్యఆరోగ్య శా ఖ కార్యాలయంలోని సూపరింటెండెంట్ సెప్టెంబ ర్‌లో ఏసీబీకి చిక్కాడు. అనంతరం నెల్లూరులోని పె ద్దాసుపత్రిపై అధికారులు దాడులు నిర్వహించారు. గత నెల 29న వాకాడులోని ప్రభుత్వ ఐటీఐపై దాడి చేసి భారీ స్థాయిలో నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇలా వరుస దాడులు జరుగుతున్నా అవినీతిపరుల్లో మార్పురాకపోవడం దురదృష్టకరం.
అవినీతి వధ జరిగేనా!
Published Sat, Nov 2 2013 5:33 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement