నెల్లూరు(రెవెన్యూ): ‘నేను మారిన మ నిషిని..నన్ను నమ్మండి..నేను మాటల మనిషి కాదు చేతల మనిషిని..ఊహించని విధంగా దేశంలో ఏ రాష్ట్రంలోని పీ ఆర్‌సీ మంజూరు చేస్తాను’ అని ఉద్యోగులకు సీఎం చంద్రబాబు హామీ ఇ చ్చారు. ఈ హామీ అమలు విషయమై మాట్లాడేందుకు వెళ్లిన ఉద్యోగ నేతల తో ‘ముందు మీరు పనితీరు మెరుగుపరుచుకోండి..పీఆర్‌సీ తగిన విధంగా ఇస్తాం’ అని సలహా ఇచ్చి పంపారు. చంద్రబాబు తీరుపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్నా పీఆర్‌సీ విషయంలో కప్పదాటు వైఖరి అవలంభిస్తుండటంపై మండిపడుతున్నారు. తె లంగాణలో 43 శాతం పీఆర్‌సీ ఇవ్వడం తో అక్కడి ఉద్యోగులు ఆనందంలో ఉం డగా మన రాష్ట్రంలో మాత్రం చంద్రబాబు తీరుతో ఉద్యోగులు అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు.
రగులుతోన్న చిచ్చు
పీఆర్‌సీ విషయంలో ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య చిచ్చు రగులుతోంది. ప్రభుత్వం ప్రస్తుతం వేతనాలు ఇవ్వలేని స్థితిలో ఉంది. మార్చి రాకముందే ఖజానాకు ఫ్రీజింగ్ విధించింది.వేతనాలు రాని ఉద్యోగులు నానా ఇబ్బందులు ప డుతున్నారు. మరోవైపు పెరిగిన ధరలకు అనుగుణంగా 69 శాతం పీఆర్‌సీ ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై సీఎం ఇప్పటికి రెండు మార్లు సమావేశం నిర్వహించినా ఫలితం కరువైంది.
వేతనాల చాలక ఇబ్బందులు
జిల్లాలో వివిధ శాఖలకు చెందిన 35 వేల మంది ఉద్యోగులు, 25 వేల మంది విశ్రాంత ఉద్యోగులు ఉన్నారు. వీరం తా వేతనాలపై ఆధారపడి జీవనం సాగించేవారే. ఇటీవల కాలంలో ఖర్చులన్నీ పెరిగిపోవడంతో కుటుంబపోషణ వారికి కష్టతరంగా మారుతోంది. ఈ క్రమంలో 69 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. కనీసం తెలంగాణకు మించి ప్రకటించాలని కోరుతున్నారు. అంతకు తక్కువ ప్రకటిస్తే మాత్రం ఆందోళనబాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు.
ఇదేం ఆట..
Published Sun, Feb 8 2015 3:57 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
Advertisement