J.Bhaskar rao
-
బాలల హక్కులపై అవగాహన అవసరం
గుంటూరు క్రైం : బాలల హక్కులు, వారి రక్షణ గురించి పోలీసు అధికారులు అవగాహనను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని అర్బన్ జిల్లా అదనపు ఎస్పీ జె.భాస్కరరావు సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాలులో శుక్రవారం హెల్త్ స్వచ్ఛంద సంస్థ, సీఐడీ పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో బాలల న్యాయ, రక్షణ చట్టం, మానవ అక్రమ రవాణా చట్టం గురించి జిల్లా వ్యాప్తంగా ఉన్న సీఐ, ఎస్ఐలకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ భాస్కరరావు మాట్లాడుతూ బాలల పట్ల లైంగిక వేధింపులు లాంటి సంఘటనలు జరుగకుండా ఉండేలా పిల్లల తల్లిదండ్రులు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఏదైనా నష్టం జరిగిన సందర్భాల్లో పోలీసులను ఆశ్రయించిన వెంటనే వెంటనే స్పందించి బాలలను పరిరక్షించాలని చెప్పారు. రూరల్ జిల్లా అదనపు ఎస్పీ జి.రామాంజనేయులు మాట్లాడుతూ సామాజిక, ఆర్థిక, అసమానతల కారణంగా కొందరు యువతులను అక్రమ రవాణాదారులు పసిగట్టి వారిని వ్యభిచార కూపంలోకి దింపే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా మానవ అక్రమ రవాణాదారులను గుర్తించి వెంటనే అరెస్టు చేయాలని సూచించారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ రోషన్‌కుమార్ మాట్లాడుతూ 18 ఏళ్లలోపు ఉన్న మైనర్లందరినీ బాలలుగానే పరిగణించాలని, వారి అన్నిరకాల హక్కులు పొందడంతో పాటు, వారు అక్రమ రవాణాదారుల బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులతో పాటు, పోలీసులపై ఉంటుందని చెప్పారు. సమావేశంలో హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఆనంద్, ట్రైనర్ కిస్మత్కుమార్, డీఎస్పీలు బి.ప్రసాద్, జి.లక్ష్మయ్య, చైల్డ్‌లైన్, హెల్ప్ స్వచ్ఛంద సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఏసీబీ డీఎస్పీగా నంజుండప్ప
నెల్లూరు(క్రైమ్), న్యూస్‌లైన్: నెల్లూరు ఏసీబీ డీఎస్పీగా నంజుండప్పను నియమిస్తూ డీజీపీ ప్రసాద్‌రావు ఆదివారం ఉత్తర్వులిచ్చారు. ఇటీవల నెల్లూరు ఏసీబీ డీఎస్పీ జె.భాస్కర్‌రావును విశాఖ రూరల్ ఓఎస్డీగా బదిలీ చేసిన విషయం తెలిసిందే. రెండు రోజుల కిందట ఆయన రిలీవ్ అయ్యారు. ఆయన స్థానంలో హైదరాబాద్‌లో ఇంటెలిజెన్స్‌లో ఉన్న 1985వ బ్యాచ్‌కు చెందిన నంజుండప్పను నియమించారు. గతంలో తిరుమల డీఎస్పీగా ఆయన పని చేశారు. -
ఏసీబీ వలలో సీనియర్ ఆడిటర్
సాక్షి, ఒంగోలు: ‘అవినీతి అధికారులను పట్టుకునేందుకు మేము రెడీ... సమాచారం అందించేందుకు ఆలస్యం మీదే..’ అని ఏసీబీ డీఎస్పీ జె.భాస్కరరావు పేర్కొన్న మరుసటి రోజే జిల్లాలో ఒక అవినీతి అధికారి వారి వలలో చిక్కాడు. జిల్లా ఆడిట్ కార్యాలయంలో సీనియర్ ఆడిటర్‌గా పనిచేస్తున్న ఎస్.విజయభాస్కర్ ఒక వ్యక్తి నుంచి * 5 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఇకపై ఏసీబీ అధికారులు తమ దూకుడును మరింతగా పెంచనున్నట్లు స్పష్టమవుతోంది. రెండు రోజులుగా ఏసీబీ డీఎస్పీ జిల్లాలో ఉంటూ ఈ కేసుకు సంబంధించి పక్కాగా ప్రణాళిక రూపొందించి అవినీతి అధికారిని పట్టుకున్నారు. కేసు వివరాలను డీఎస్పీ భాస్కరరావు శనివారం మధ్యాహ్నం ప్రకాశం భవనంలోని ఆడిట్ కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. పొదిలి పంచాయతీ కార్యాలయంలో స్వీపర్‌గా పనిచేస్తున్న కుంకాల సుబ్బయ్య 2009లో పదవీవిరమణ చేసి, 2010లో మృతి చెందారు. ఆయనకు సంబంధించి పీఆర్సీ అరియర్స్ సుమారు రూ 1.35 లక్షలు ఆడిట్ కార్యాలయం నుంచి, మరో లక్ష రూపాయల వరకు పొదిలి ట్రెజరీ నుంచి రావాల్సి ఉంది. ఈమేరకు సుబ్బయ్య కుమారుడు నాగరాజు 45 రోజులుగా జిల్లా ఆడిట్ కార్యాలయం చుట్టూ అరియర్స్ బిల్లు మంజూరు కోసం క్రమం తప్పకుండా తిరుగుతున్నాడు. బిల్లు మంజూరు చేయాలంటే తనకు రూ 6 వేలు లంచంగా ఇవ్వాలని సీనియర్ ఆడిటర్ విజయభాస్కర్ నాగరాజును డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వడం ఇష్టంలేని నాగరాజు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు రూ 5 వేలు ఇస్తానని ఆడిటర్‌ని ఒప్పించుకున్నాడు. ఈమేరకు నాగరాజు రూ 5 వేలు నగదును శనివారం మధ్యాహ్నం విజయభాస్కర్‌కు ఇస్తుండగా అప్పటికే అక్కడ పొంచి ఉన్న ఏసీబీ అధికారులు ఒక్కసారిగా దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆడిటర్‌ను ఆదివారం నెల్లూరులోని ఏసీబీ జడ్జి ముందు ప్రవేశపెట్టనున్నట్లు డీఎస్పీ జె.భాస్కరరావు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది లంచం కోసం డిమాండ్ చేస్తే తమకు సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా డీఎస్పీ కోరారు. ఈ దాడిలో డీఎస్పీతో పాటు ఒంగోలు ఏసీబీ సీఐ టీవీ శ్రీనివాసరావు, నెల్లూరు సీఐలు కృపానందం, వెంకటేశ్వర్లు, ఒంగోలు ఎస్సై వెంకటేశ్వరరావు, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు, కానిస్టేబుళ్లు కూద్దుస్, షఫీ, రాగబాబు, సుధాకర్ పాల్గొన్నారు. లంచం ఇవ్వడం ఇష్టం లేకనే: నాగరాజు తన తండ్రికి సంబంధించి పీఆర్సీ బిల్లు మంజూరు కోసం ఆడిట్ కార్యాలయంలోని సీనియర్ ఆడిటర్ విజయభాస్కర్ తనను 45 రోజులుగా తిప్పుతుండడమే కాకుండా * 6 వేలు లంచంగా ఇస్తే బిల్లు మంజూరు చేస్తానని చెప్పినట్లు బాధితుడు కుంచాల నాగరాజు విలేకరులకు తెలిపాడు. లంచం ఇవ్వడం ఇష్టం లేకపోవడంతో ఈ విషయాన్ని ఏసీబీ అధికారుల దృష్టికి తెచ్చి వారి సలహా మేరకు * 5 వేలను విజయభాస్కర్‌కు ఇచ్చి ఏసీబీ అధికారులకు పట్టించినట్లు నాగరాజు పేర్కొన్నారు. -
అవినీతి వధ జరిగేనా!
నెల్లూరు(క్రైమ్), న్యూస్‌లైన్: అప్పట్లో నరకాసురుడనే రాక్షసుడు అందరినీ పీక్కుతింటూ ప్రజలతో పాటు దేవతలకు సమస్యగా మారాడు. అతని బాధితుల మొర విని స్పందించిన సత్యభామ నరకాసురుడ్ని వధించి వారి జీవితాల్లో వెలుగులు నింపింది. ఆ రోజుల్లో నరకాసురుడు ఒక్కడే ప్రజలను హిం సించాడు. ఈ రోజుల్లో మాత్రం అవినీతికి అలవాటు పడిన పలువురు అధికారులు, ఉద్యోగులు నరకాసురుడ్ని మరిపించేలా జనాన్ని బాదుతున్నారు. వీరికి లంచం బాధ నుంచి విముక్తి కల్పించేందుకు అవినీ తి నిరోధక శాఖ అధికారులు శ్రమిస్తున్నా, వారు పూర్తి స్థాయిలో జూలు విదిలించాల్సిన సమయం ఆ సన్నమైంది. సమాజంలో అవినీతిని పూర్తిగా అరికట్టినపుడే ప్రజలకు నిజమైన దీపావళి. అవినీతిమయం: జిల్లాలోని దాదాపు అన్ని ప్రభు త్వ శాఖలు అవినీతిమయంగా మారాయి. ప్రజల అ వసరాలు, బలహీనతలను ఆసరాగా చేసుకున్న పలువురు అధికారులు, సిబ్బంది జలగల్లా పీల్చేస్తున్నారు. అవినీతి పరుల ఆటకట్టించేందుకు ఏసీబీ డీఎస్పీ జె.భాస్కర్‌రావు నేతృత్వంలో ఇన్స్పెక్టర్లు సీహెచ్ చంద్రమౌళి, టి.వి.శ్రీనివాసరావు, కృపానందం, వెంకటేశ్వర్లు చర్యలు చేపట్టారు. వరుస దాడులు : ఈ ఏడాదిలో ఏసీబీ అధికారులు 22 కేసులు నమోదుచేసి పలువురిని కటకటాల వెనక్కునెట్టారు. డీఎంహెచ్ఓ కార్యాలయంపై ఏసీబీ దా డులు జరగడం సంచలనం సృష్టించింది. అవినీతికి మారుపేరుగా మారిన ఆర్టీఏ కార్యాలయంపై మా ర్చి 13న మెరుపుదాడి చేశారు. అదే నెల 15న నెల్లూరులోని పరిశ్రమల శాఖ కార్యాలయంపై, 30న సూళ్లూరుపేట రిజిస్ట్రార్ కార్యాలయంపై దాడులు నిర్వహించారు. మార్చి 17వ తేదీన వింజమూరు ఉన్నత పాఠశాల హెచ్ఎం లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు. స్థల విషయమై క్లియరెన్స్ ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసినా ఏఎస్మండలంలోని ఓ సర్వేయర్‌ను ఏప్రిల్ 16న పట్టుకున్నారు. అక్రమంగా నిర్మించిన భవనాన్ని కూల్చకుండా ఉండేందుకు లంచం తీసుకుంటున్న నెల్లూ రు కార్పొరేషన్ టీపీసీ అధికారులను ఏప్రిల్ 22న అరెస్ట్ చేశారు. ఇందిరమ్మ ఇంటి బిల్లు మంజూరు చేసేం దుకు లంచం డిమాండ్ చేసిన హౌసింగ్ అధికారి మేనెలలో ఏసీబీకి దొరికిపోయాడు. జూలై 9న ఓజిలి ఎస్సైని, లెసైన్స్ రెన్యూవల్ విషయంలో వ్యాపారి నుంచి లంచం తీసుకుంటున్న వాణిజ్యపన్నుల శాఖ లోని ఓ అధికారిని జూలై 28న నెల్లూరు లో, ఇందిరమ్మ ఇంటికి పొజిషన్ సర్టిఫికెట్ ఇచ్చేం దుకు లంచం తీసుకుంటున్న నారాయణరెడ్డిపేట వీఆర్వో శ్రీనివాసులును ఆగస్టు 6న పట్టుకున్నారు. కాంట్రాక్టర్‌కు బిల్లు చెల్లింపు విషయంలో రూ.50 వేలు లంచం తీసుకుంటూ అటవీశాఖలోని ఓ అధికారి ఆగస్టు 21న దొరికిపోయారు. వైద్యఆరోగ్య శా ఖ కార్యాలయంలోని సూపరింటెండెంట్ సెప్టెంబ ర్లో ఏసీబీకి చిక్కాడు. అనంతరం నెల్లూరులోని పె ద్దాసుపత్రిపై అధికారులు దాడులు నిర్వహించారు. గత నెల 29న వాకాడులోని ప్రభుత్వ ఐటీఐపై దాడి చేసి భారీ స్థాయిలో నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇలా వరుస దాడులు జరుగుతున్నా అవినీతిపరుల్లో మార్పురాకపోవడం దురదృష్టకరం.