నెల్లూరు(టౌన్), న్యూస్‌లైన్: విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వివాదాస్పదమవుతోంది. రాజకీయ పలుకుబడి, డబ్బున్న వారికే ఉద్యోగాలు దక్కుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే పోస్టులకు అభ్యర్థులను ఖరారు చేసి ఓ ప్రహసనంలా రాత పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారని పలువురు నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. జిల్లాలో వర్సిటీ ఏర్పాటుతో ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని జిల్లాలోని నిరుద్యోగులు ఆశపడ్డారు.
వాటి కోసం ఐదేళ్లుగా ఎదురుచూపులు చూశారు. అయితే 2009 నుంచి ఇప్పటి వరకు సుమారు 100 నాన్ టీచింగ్ పోస్టుల్లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులనే కొనసాగిస్తూ వచ్చారు. వీటిలో కొన్ని పోస్టులను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు ఎట్టకేలకు ఇటీవల నోటిఫికేషన్లు విడుదల చేశారు. జూనియర్ అసిస్టెంట్, సీనియర్ ల్యాబ్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, హాస్టల్ స్టీవార్డ్, కుక్, డ్రైవర్, జానియర్ స్టెనో, సీనియర్ అసిస్టెంట్ తదితర నాన్‌టీచింగ్ పోస్టులతో పాటు ఒక డిప్యూటీ రిజిస్ట్రార్, ఒక అసిస్టెంట్ రిజిస్ట్రార్, ఒక సూపరింటెండెంట్ మొత్తం కలిపి 53 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అయ్యాయి.
పలుకుబడికే ప్రాధాన్యం !
సుదీర్ఘ కాలం తర్వాత వీఎస్‌యూలో నాన్‌టీచింగ్ పో స్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడటంతో వేలాది మం ది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో బీటెక్, ఎంటెక్, పీహెచ్‌డీ, పీజీ పట్టభద్రులు కూడా ఉన్నారు. అయితే భర్తీప్రక్రియపై నిరుద్యోగులు పలు అనుమానాలు వ్య క్తం చేస్తున్నారు. జిల్లా మంత్రి సిఫార్సుతో పాటు రూ.6లక్షలు ముట్టజెప్పిన వారికే నాన్ టీచింగ్ పోస్టు దక్కేలా కనిపిస్తోందని ఆరోపిస్తున్నారు. కొన్ని పోస్టులకు ఇప్పటికే అభ్యర్థులను ఎంపిక చేసి నామమాత్రం గా ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారని వాపోతున్నారు.
అభ్యర్థులు లేవనెత్తుతున్న అనుమానాలివే..
జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి బుధవారం ని ర్వహించిన రాతపరీక్ష ఫలితాలను వెబ్‌సైట్‌లో ఉంచా రు. 212 మంది ఉత్తీర్ణులయ్యారని ప్రకటించినా, వారు సాధించిన మార్కులను వెల్లడించలేదు.
యూనివర్సిటీ స్థాయిలో పోస్టుల భర్తీకి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి. కానీ ఇక్కడ ఓఎంఆర్ షీటు లాంటి టెక్నాలజీని ఉపయోగించలేదు. రాతపరీక్షలోనూ హాల్‌టికెట్ నంబర్లను సింగిల్ డిజిట్ నుంచి ప్రారంభించారు. ఈ క్రమంలో పరీక్ష పత్రాలను తారుమారు చేసే అవకాశం ఉంది.
రాజకీయ నేతల సిఫార్సులతో ఇప్పటికే అనేక మంది వర్సిటీలో ఔట్ సోర్సింగ్ సిబ్బందిగా కొనసాగుతున్నారు. వీరిలో ఓ మాజీ మేయర్ సమీప బం ధువు కూడా ఉన్నారు. ప్రస్తుతం భర్తీకానున్న పోస్టులు వారికే దక్కే అవకాశాలు ఉన్నాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
సిఫార్సు, రూ.6 లక్షలతోనే వర్సిటీలో పోస్టు ?
Published Fri, Feb 28 2014 2:55 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement