lab assistant
-
కరోనా గుట్టు.. చైనా మెడకు బిగుస్తున్న ఉచ్చు!
వెబ్‌డెస్క్: కరోనా వైరస్ చైనాలోనే పుట్టిందన్న ఆరోపణలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ తరుణంలో చైనా చుట్టూ గట్టి ఉచ్చు బిగించాలని అమెరికా ప్రయత్నిస్తోంది. సార్స్-సీవోవీ-2 వైరస్ కారకం వుహాన్ ల్యాబ్‌లోనే పుట్టిందనే అనుమానాల్ని బలపరిచేలా మరో కీలక ఆధారాన్ని డబ్ల్యూహెచ్‌వో ప్యానెల్ ముందు అమెరికా ఉంచిది. కరోనా విజృంభణ మొదలుకాక ముందు.. నవంబర్ 2019లో వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో పనిచేసే ముగ్గురు పరిశోధకులు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. దీంతో వాళ్లను ఆస్పత్రిలో చేర్పించారు. అయితే వాళ్లు ట్రీట్మెంట్ తీసుకుంటున్నవిషయాన్ని చాలా గోప్యంగా ఉంచింది ల్యాబ్. అంతేకాదు ఆ ఆస్పత్రి బయట గట్టి కాపలా ఉంచింది. అమెరికన్ నిఘా వర్గాలు ఈ వివరాలతో సమగ్రంగా ఒక రిపోర్ట్ తయారు చేశాయి. తాజాగా డబ్ల్యూహెచ్‌వో డెషిషన్ మేకింగ్ బాడీ మీటింగ్‌లో ఈ రిపోర్ట్ ప్రస్తావనకు వచ్చింది. దీంతో కరోనా పుట్టుక గురించి జరుగుతున్న దర్యాప్తులో భాగంగా ఈ రిపోర్ట్‌ను ప్రధానంగా పరిశీలించాలని డబ్ల్యూహెచ్‌వో ప్యానెల్ డిసైడ్ నిర్ణయించుకుంది. ఈ విషయాల్ని ప్రముఖ అమెరికన్ పత్రిక వాషింగ్టన్ డీసీ ప్రచురించింది. అమెరికా అతిచేస్తోంది వుహాన్ ల్యాబ్ సిబ్బంది ముగ్గురూ కోవిడ్19 లక్షణాలతో పాటు సీజనల్ జబ్బులతో ఆస్పత్రుల్లో చేరారని అమెరికన్ ఇంటెలిజెన్సీ రిపోర్ట్ పేర్కొంది. అయితే వాళ్లు ఆస్పత్రుల్లో చేరిన సమయం, చికిత్సను గోప్యంగా ఉంచడం, కొన్నాళ్లకే కరోనా విజృంభించడం.. ఈ అనుమానాలన్నీ ‘కరోనా వైరస్ వుహాన్ ల్యాబ్’ సృష్టే అనే వాదనను బలపరుస్తున్నాయని తెలిపింది. చైనా మాత్రం అమెరికా ఆరోపణలను మొదటి నుంచే ఖండిస్తోంది. ‘అమెరికా అతిచేస్తోందని, ఈ ఆరోపణలు దర్యాప్తును పక్కదారి పట్టించేలా ఉన్నాయ’ని విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. మరోవైపు కరోనా తమ భూభాగంలో పుట్టలేదని, మేరీల్యాండ్‌లో ఫోర్ట్ డెట్రిక్ మిలిటరీ బేస్ మీదే తమకు అనుమానాలు ఉన్నాయని చైనా ఇది వరకే డబ్ల్యూహెచ్‌వోకి ఒక రిపోర్ట్ అందజేసింది కూడా. అయితే వుహాన్ ల్యాబ్ రీసెర్చర్ల ట్రీట్మెంట్ గురించి ట్రంప్ హయాంలోనే రిపోర్ట్ తయారైనప్పటికీ.. బైడెన్ కార్యాలయం మాత్రం ఈ ఇష్యూపై స్పందించట్లేదు. శాంపిల్స్ ఇవ్వట్లేదు శరదృతువు (సెప్టెంబర్ నుంచి డిసెంబర్ నెలల మధ్య) కాలంలో వుహాన్ రీసెర్చలు సీజనల్ జబ్బులు పడడం సర్వసాధారణమని డచ్ వైరాలజిస్ట్ మరియోన్ చెబుతోంది. ఆ ముగ్గురు కొవిడ్ లక్షణాలతోనే చేరారా? అనేది అనుమానం మాత్రమే అని ఆమె ఆంటోంది. ఇక 2019 అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య డెబ్భై ఆరువేల మంది సీజనల్ జబ్బుల బారినపడ్డారు. వాళ్లలో యాంటీ బాడీస్ కోసం 92 మందిని మాత్రమే చైనా పరీక్షించింది. ఈ విషయం డబ్ల్యూహెచ్‌వో దృష్టికి రావడంతో వాళ్ల రిపోర్ట్లు కోరింది. అయితే గోప్యతను సాకుగా చూపెడుతూ చైనా అందుకు నిరాకరించింది. ఇక వుహాన్ ల్యాబ్ బ్లడ్ బ్యాంక్ రిపోర్ట్‌లను సైతం ఇచ్చేందుకు చైనా మొదట అంగీకరించకపోగా.. డబ్ల్యూహెచ్‌వో ఒత్తిడితో దిగొచ్చింది. కానీ, ఇప్పటిదాకా ఎలాంటి రిపోర్టులు సమర్పించలేదని తెలుస్తోంది. -
రోగిపై అత్యాచార యత్నం
ల్యాబ్ అసిస్టెంట్‌పై కేసు నమోదు ఏలూరు అర్బన్ :వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లిన యువతిపై ల్యాబ్ అసిస్టెంట్ అత్యాచార యత్నానికి ఒడిగట్టిన ఉదంతమిది. రూరల్ పోలీసుల కథనం ప్రకారం.. వీరవాసరం గ్రామానికి చెందిన 18 ఏళ్ల యువతి నాలుగేళ్లుగా కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడుతోంది. తల్లిదండ్రులు ఆమెను భీమవరంలోని ఒక వైద్యునికి చూపించి మందులు వాడుతున్నారు. యువతికి మెరుగైన చికిత్స చేయించాలని వైద్యుడు సూచించడంతో ఆమెను ఈనెల 28న ఏలూరులోని ఆశ్రం ఆసుపత్రిలో చేర్చారు. ఈ క్రమంలో గురువారం యువతికి ఎక్స్‌రే తీయించమని అక్కడి వైద్యులు చెప్పడంతో ఆమె తల్లి అందుకు సొమ్ము చెల్లించేందుకు వెళ్లింది. ఇదే అదునుగా రాజు అనే ల్యాబ్ అసిస్టెంట్ ఆ యువతి వద్దకు వెళ్లి మీ అమ్మ రావడం ఆలస్యమవుతుందని చెప్పాడు. ఈలోగా ఎక్స్‌రే తీస్తానని ల్యాబ్‌లోకి తీసుకెళ్లాడు. తలుపులు వేసి ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. ఇది గమనించిన యువతి అతడిని తోసివేసి తలుపులు తెరుచుకుని బయటకు పరుగులు పెట్టింది. ఇదే సమయంలో అటుగా వస్తున్న తల్లి ఏం జరిగిందని అడగ్గా, ఆ యువతి విషయం చెప్పి బావురుమంది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు ల్యాబ్ అసిస్టెంట్ రాజుపై అత్యాచార యత్నం కేసు నమోదు చేసినట్టు ఏలూరు రూరల్ పోలీసులు తెలిపారు. -
ఆయన సినిమాలకు‘అభిమాన్’ను నేను: ‘పద్మశ్రీ’ కె. విశ్వనాథ్
హృషీకేశ్ ముఖర్జీ నాకు చాలా ఇష్టమైన దర్శకుడు. ల్యాబ్ అసిస్టెంట్‌గా మొదలై ఎడిటింగ్, స్క్రీన్‌ప్లే రచనల మీదుగా సినీ దర్శకుడు కావడం హృషీకేశ్జీకి కలిసొచ్చిన అంశం. కలకత్తాలో న్యూ థియేటర్సలో దర్శకుడు బిమల్‌రాయ్ దగ్గర నుంచి పలువురు దర్శకుల శైలినీ, వారి సామర్థ్యాన్నీ దగ్గర నుంచి గమనించే అవకాశం ఆయనకు వచ్చింది. ఒక్కో దర్శకుడికి ఒక్కో శైలి ఉంటుంది. వారిలోని సారాన్ని ఆయన గ్రహించారని నాకు అనిపిస్తుంటుంది. ‘ముసాఫిర్’తో మొదలుపెట్టి ‘అనుపమ’, ‘ఆనంద్’, ‘గుడ్డి’, ‘సత్యకావ్’ - ఇలా దాదాపు 50 చిత్రాలు తీసి, ప్రేక్షక హృదయాలను ఆయన గెలుచుకున్నారు. పద్మవిభూషణ్, ఫాల్కే పురస్కారాలందు కొన్నారు. హృషీకేశ్‌జీ చిత్రాలనగానే నాకు ఠక్కున గుర్తొచ్చేది ‘అభిమాన్’. నాకు ఎంతో ఇష్టమైన సినిమా అది. అందులోని సంగీతం, సున్నితమైన భావోద్వేగాలు, మనసును తాకే ఆ సన్నివేశ పరిమళాలు నా మనసులో ఇప్పటికీ అలా నిలిచిపోయాయి. ప్రతి సినిమాలో ఆయన మానవ సంబంధాలను అద్భుతంగా చూపిస్తారు. ‘అభిమాన్’లో కథానుసారం భార్యాభర్తల్లో ఒకరి ఆధిపత్య భావజాలం, వారి మధ్య నెలకొనే ఘర్షణ - చాలా సహజంగా చూపారు. ఒక సహజమైన భావోద్వేగాన్ని ఎక్కడా అతి చేయకుండా మామూలుగా చెబుతూనే, మనసుపై ముద్ర వేయడమనే హృషీకేశ్‌జీ శైలి నాకు నచ్చుతుంది. కథను తెరకెక్కించడంలో నా స్కూల్ కూడా అదే! అంతా తక్కువ మోతాదులోనే తప్ప, బీభత్సాలు, ఏడుపులు, పెడబొబ్బలు మా చిత్రాల్లో కనపడవు. అలాగే, చుట్టూ ఉన్న మనుషులు, వారి జీవితాలనే తప్ప, జీవితాన్ని మించిపోయిన అసహజమైన కథల జోలి కెళ్ళం. నిజానికి, ‘అభిమాన్’ స్ఫూర్తితో ఒక కథ నా మనసులో ఎప్పటి నుంచో తిరుగుతోంది. దానికెప్పటికైనా తెర రూపమివ్వాలని ఉంది. సినీ రంగంలోని చాలామందికి భిన్నంగా, హృషీకేశ్‌జీ ద్వారా పైకి వచ్చిన నటీనటులకు ఆయనంటే ఎంతో గౌరవం, గురుభావం. నటి జయభాదురి (బచ్చన్) ఒకసారి ‘ఫిల్మ్‌ఫేర్’ పత్రికలో ఇంటర్వ్యూ ఇస్తూ, హృషీకేశ్ పట్ల తనకున్న గౌరవాన్ని ఒక్క ముక్కలో చెప్పారు. ‘హృషీదా గనక ‘రేపటి నుంచి సినిమా ఉంది. నువ్వు నటించాలి’ అంటే చాలు... కథేమిటి, నా పాత్ర ఏమిటి లాంటివేవీ అడగనైనా అడగకుండానే, నా చేతిలో ఉన్న సినిమాలన్నీ క్యాన్సిల్ చేసుకొని మరీ ఆ సినిమాలో నటిస్తాను’ అని ఆమె బాహాటంగా చెప్పారు. ఒక దర్శకుడు తీర్చిదిద్దిన మైనంముద్దల లాంటి ఆర్టిస్టులు ఆ విషయాన్ని అంగీకరిస్తూ, అలా చెప్పడాన్ని మించిన కితాబు ఇంకేముంటుంది!హృషీకేశ్‌జీ మంచి సృజనశీలే కాక మంచి మనిషి కూడా! బొంబాయిలో నేను హిందీ చిత్రాలు తీస్తున్న సమయంలో రెండు మూడుసార్లు ఆయన ఇంటికి వెళ్ళి మరీ కలిశాను. ఇంట్లో మంచం పక్కనే కుక్కలతో ఆయన సరదాగా గడిపేవారు. అప్పటికే హిందీ చిత్రం ‘సర్గమ్’ (‘సిరిసిరిమువ్వ’కు రీమేక్)తో అక్కడివాళ్ళకు నేను తెలుసు. ‘శంకరాభరణం’ దర్శకుడిగా ఆయన నన్నెప్పుడూ గుర్తుపెట్టుకొని మాట్లాడేవారు. చలనచిత్రోత్సవాలు, జాతీయ అవార్డు కమిటీలు, సెన్సార్ బోర్డు లాంటి వాటిలో కీలక బాధ్యతలు నిర్వహించడం వల్ల దక్షిణాదిలో ఆయనకున్న పరిచయాలూ ఎక్కువే. పనుల మీద మద్రాసుకు ఆయన వచ్చినప్పుడూ కలిశాను. ఒకసారి ఆయన ప్రసిద్ధ మలయాళ నటుడు గోపికి ఆరోగ్యం బాగా లేదని తెలిసి, కేరళ వెళ్ళి మరీ చూసిరావడం నాకిప్పటికీ గుర్తే! సందర్భమేమిటో గుర్తులేదు కానీ, దక్షిణ, ఉత్తర భారతీయ సినిమా వాళ్ళం కొందరం కలసి ఒకసారి ఏదో పర్యటనకు వెళ్ళాం. ఆ బృందంలో హృషీకేశ్ ముఖర్జీ, గుల్జార్, నేను - ఇంకొందరం ఉన్నాం. నటి జయభాదురో, షబనా ఆజ్మీయో కూడా ఉన్నారు. ‘దర్శకుడు, రచయిత, నటి - ఇలా మనందరం ఇక్కడే ఉన్నాం కదా! ఇక్కడే ఒక సినిమాకు సన్నాహాలు చేద్దామా’ అని మేమందరం సరదాగా అనుకున్నాం. అవన్నీ తీపి జ్ఞాపకాలు. ఏమైనా, భారతీయ సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళిన హృషీకేశ్ ముఖర్జీ, శ్యామ్‌బెనెగల్, బాసూ భట్టాచార్య, మృణాల్‌సేన్ లాంటి దర్శకులు, వారి చిత్రాలు మన జాతి సంపద. సంభాషణ: రెంటాల జయదేవ -
సిఫార్సు, రూ.6 లక్షలతోనే వర్సిటీలో పోస్టు ?
నెల్లూరు(టౌన్), న్యూస్‌లైన్: విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వివాదాస్పదమవుతోంది. రాజకీయ పలుకుబడి, డబ్బున్న వారికే ఉద్యోగాలు దక్కుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే పోస్టులకు అభ్యర్థులను ఖరారు చేసి ఓ ప్రహసనంలా రాత పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారని పలువురు నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. జిల్లాలో వర్సిటీ ఏర్పాటుతో ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని జిల్లాలోని నిరుద్యోగులు ఆశపడ్డారు. వాటి కోసం ఐదేళ్లుగా ఎదురుచూపులు చూశారు. అయితే 2009 నుంచి ఇప్పటి వరకు సుమారు 100 నాన్ టీచింగ్ పోస్టుల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగులనే కొనసాగిస్తూ వచ్చారు. వీటిలో కొన్ని పోస్టులను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు ఎట్టకేలకు ఇటీవల నోటిఫికేషన్లు విడుదల చేశారు. జూనియర్ అసిస్టెంట్, సీనియర్ ల్యాబ్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, హాస్టల్ స్టీవార్డ్, కుక్, డ్రైవర్, జానియర్ స్టెనో, సీనియర్ అసిస్టెంట్ తదితర నాన్‌టీచింగ్ పోస్టులతో పాటు ఒక డిప్యూటీ రిజిస్ట్రార్, ఒక అసిస్టెంట్ రిజిస్ట్రార్, ఒక సూపరింటెండెంట్ మొత్తం కలిపి 53 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. పలుకుబడికే ప్రాధాన్యం ! సుదీర్ఘ కాలం తర్వాత వీఎస్‌యూలో నాన్‌టీచింగ్ పో స్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడటంతో వేలాది మం ది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో బీటెక్, ఎంటెక్, పీహెచ్డీ, పీజీ పట్టభద్రులు కూడా ఉన్నారు. అయితే భర్తీప్రక్రియపై నిరుద్యోగులు పలు అనుమానాలు వ్య క్తం చేస్తున్నారు. జిల్లా మంత్రి సిఫార్సుతో పాటు రూ.6లక్షలు ముట్టజెప్పిన వారికే నాన్ టీచింగ్ పోస్టు దక్కేలా కనిపిస్తోందని ఆరోపిస్తున్నారు. కొన్ని పోస్టులకు ఇప్పటికే అభ్యర్థులను ఎంపిక చేసి నామమాత్రం గా ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారని వాపోతున్నారు. అభ్యర్థులు లేవనెత్తుతున్న అనుమానాలివే.. జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి బుధవారం ని ర్వహించిన రాతపరీక్ష ఫలితాలను వెబ్సైట్లో ఉంచా రు. 212 మంది ఉత్తీర్ణులయ్యారని ప్రకటించినా, వారు సాధించిన మార్కులను వెల్లడించలేదు. యూనివర్సిటీ స్థాయిలో పోస్టుల భర్తీకి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి. కానీ ఇక్కడ ఓఎంఆర్ షీటు లాంటి టెక్నాలజీని ఉపయోగించలేదు. రాతపరీక్షలోనూ హాల్‌టికెట్ నంబర్లను సింగిల్ డిజిట్ నుంచి ప్రారంభించారు. ఈ క్రమంలో పరీక్ష పత్రాలను తారుమారు చేసే అవకాశం ఉంది. రాజకీయ నేతల సిఫార్సులతో ఇప్పటికే అనేక మంది వర్సిటీలో ఔట్ సోర్సింగ్ సిబ్బందిగా కొనసాగుతున్నారు. వీరిలో ఓ మాజీ మేయర్ సమీప బం ధువు కూడా ఉన్నారు. ప్రస్తుతం భర్తీకానున్న పోస్టులు వారికే దక్కే అవకాశాలు ఉన్నాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.