un employment
-
ఉద్యోగం రాలేదా..? మీకోసమే ఈ ఉచిత కోర్సులు..
గ్రాడ్యుయేషన్ పూర్తయిన వారిని పక్కింటివారు, మిత్రులు, బంధువులు.. ‘చదువు అయిపోయింది కదా. ఏ ఉద్యోగం చేస్తున్నావు?’ అని సాధారణంగా అడుగుతుంటారు. సరైన స్కిల్స్ లేని వారు ‘ఇంటికి వచ్చినవాళ్లు పనిచూసుకుని వెళ్లిపోక నా గురించి ఎందుకు’ అని మనసులో అనుకొని పైకి నవ్వుతూ ‘ఇంటర్వ్యూలకు హాజరవుతున్నా’ అని చెబుతుంటారు. సరైన నైపుణ్యాలు లేనివారు సైతం ఉద్యోగంలో స్థిరపడేలా నిపుణులు కొన్ని ఉచిత కోర్సులను సూచిస్తున్నారు. ప్రస్తుతం కృత్రిమమేధ రంగానికి ఉన్న డిమాండ్ అందరికీ తెలిసిందే కదా. ఏఐలో సరైన కోర్సులు ఎంచుకుని కష్టపడి చదివితే ఉద్యోగం సాధించవచ్చని చెబుతున్నారు. ఇటీవల నిర్వహించిన ఏడబ్ల్యూఎస్ సర్వే ప్రకారం కింది కోర్సులు చేస్తే మేలు జరుగుతుందని సూచిస్తున్నారు.కంపెనీలు ఏఐ నైపుణ్యాలున్న వారికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఏడబ్ల్యూఎస్ సర్వే ప్రకారం.. 73 శాతం కంపెనీలు ఏఐ నిపుణులను నియమించుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయి. కానీ, దాదాపు ఇంటర్వ్యూకు హాజరయ్యే ప్రతి నలుగురిలో ముగ్గురు కంపెనీ అంచనాలను చేరుకోవడం లేదు. ఏఐ రంగంలో అపార అవకాశాలున్నాయి. క్రిటికల్ థింకింగ్, క్రియేటివ్ థింకింగ్, డేటా అనాలసిస్, జనరేటివ్ ఏఐ, ప్రాంప్ట్ ఇంజినీరింగ్, ఏఐ టూల్స్.. వంటి విభాగాల్లో నిపుణుల కొరత ఉంది.స్ప్రింగ్‌బోర్డ్ స్టేట్ ఆఫ్ ది వర్క్‌ప్లేస్ స్కిల్స్ గ్యాప్ 2024 నివేదిక ప్రకారం..చాలా కంపెనీల్లో 70 శాతం మంది ఉన్నతస్థాయి ఉద్యోగుల్లో నైపుణ్యాల కొరత ఉంది. సరైన స్కిల్స్ లేని ఉద్యోగులతోనే చాలా కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. వాటిలో పనిచేస్తున్న మూడో వంతు ఉద్యోగులతో పరిమిత ఆవిష్కరణలు జరిపి వృద్ధిని నమోదు చేస్తున్నాయి. దాదాపు 40 శాతం మంది కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు తమ సంస్థలో నైపుణ్యాల అంతరం పెరిగిందని అంగీకరిస్తున్నారు.ఇదీ చదవండి: ప్రముఖ సంస్థకు రూ.9.5 కోట్ల ట్యాక్స్ నోటీసులు!ఈ వార్త చదువుతున్న సమయంలో ప్రపంచంలో ఎక్కడోచోట కొత్త ఆవిష్కరణకు నాందిపడి ఉండవచ్చు. టెక్నాలజీ ఇంత వేగంగా వృద్ధి చెందుతున్న క్రమంలో అందుకు అనువుగా స్కిల్స్ వృద్ధి చేసుకోకపోతే ఉద్యోగం రావడం కషం. నిపుణులు సూచించే కింది ఉచిత కోర్సుల గురించి పూర్తిగా తెలుసుకుని సరైన విధంగా కష్టపడితే ఉద్యోగం వచ్చే అవకాశాలు అధికం.1. ఆర్ఐటీ(ఎక్స్)-రోచెస్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అందిస్తున్న క్రిటికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కోర్సు. ఇది ఎడెక్స్(edX)లో అందుబాటులో ఉంది.ఔ2. ఇంపీరియల్ కాలేజ్ లండన్ క్రియేటివ్ థింకింగ్ అందిస్తున్న టెక్నిక్స్ అండ్ టూల్స్ ఫర్ సక్సెస్ కోర్సు కోర్సెరాలో అందుబాటులో ఉంది.3. అరిజోనా స్టేట్ యూనివర్శిటీ అందిస్తున్న స్ట్రాటజిక్ థింకింగ్ ఫర్ ఎవ్రీవన్ స్పెషలైజేషన్ కోర్సు. దీన్ని కోర్సెరాలో నేర్చుకోవచ్చు.4. కోర్సెరాలో ఐబీఎం అందిస్తున్న ఇంట్రడక్షన్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ).5. వాండర్బిల్ట్ విశ్వవిద్యాలయం రూపొందించిన ప్రాంప్ట్ ఇంజినీరింగ్ స్పెషలైజేషన్. ఇది కోర్సెరాలో ఉంది. 6. గూగుల్ డేటా అనలిటిక్స్ ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ కోర్సు. ఇది కూడా కోర్సెరాలో నేర్చుకోవచ్చు.పైన తెలిపిన కోర్సులు కేవలం కొత్తగా ఉద్యోగాల్లో స్థిరపడాలనుకునేవారికే కాదు. ఉద్యోగం మారాలనుకునేవారికిసైతం ఎంతో ఉపయోగపడుతాయని నిపుణులు చెబుతున్నారు. -
సీఎంకు నిరుద్యోగ జేఏసీ కృతజ్ఞతలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిరుద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా గ్రూప్–1, గ్రూప్–2లో 1,000 పోస్టుల భర్తీకి అనుమతించిన సీఎం వైఎస్ జగన్‌కు ఏపీ నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు హేమంత్ కుమార్ గురువారం ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ/వార్డు సచివాలయాల్లోనూ బదిలీలకు అవకాశం కల్పించడంపై హర్షం వ్యక్తం చేశారు. గతంలో సచివాలయాల్లో చేపట్టినట్టే భారీ ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని కోరారు. ఇటీవల పరీక్షలు రాసిన ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు ప్రశ్నాపత్రంలోని దోషాలను అధిగమించేలా గ్రేస్ మార్కులు ఇవ్వాలని అభ్యర్థించారు. (చదవండి: ఎప్పటి నీటి లెక్కలు అప్పటికే...) -
Pakistan: భారత్ పట్ల వ్యతిరేకతే కొంప ముంచిందా?
దాయాది దేశం పాకిస్తాన్లో స్వాతంత్య్రానంతరం రాజ్యం, పాలనా వ్యవస్థా, ప్రజాస్వామ్య స్ఫూర్తీ నిర్వీర్యం అవుతూ వచ్చాయి. భారత్ వ్యతిరేక విధానమే అక్కడి రాజకీయ పార్టీలు అధికారంలోకి రావడానికీ, వచ్చిన ప్రభుత్వం స్థిరంగా నిలబడక పోవటానికీ ప్రాతిపదికగా ఉంది. అందుకే భారత్‌లో మత, ప్రాంతీయ విద్వేషాలను రగిలిస్తోంది. ఉగ్రవాదుల్ని తయారుచేసి సరిహద్దులు దాటిస్తోంది. భారత్‌పై మూడుసార్లు యుద్ధం చేసింది. అవకాశం దొరికిన ప్రతిసారీ భారత్‌ను ఛిన్నాభిన్నం చేయాలనేది దాని ప్రధాన ధ్యేయం. ఇందుకోసం పెంచిపోషించిన ఉగ్రవాదులే ఆ దేశానికి ఇప్పుడు ప్రమాదకరంగా తయారయ్యారు. పాక్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న దురవస్థకు నేపథ్యం ఇదే. పొరుగు దేశాన్ని అస్థిర పరచడంలో ఉన్న శ్రద్ధ సొంత ప్రజల బాగోగులపై లేకపోవడంతో చివరికి పాక్ మును పెన్నడూ లేని తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఇరుక్కుంది. ప్రకృతి శక్తులు ఈ స్థితిని మరింత దిగజారుస్తున్నాయి. దీంతో ప్రస్తుతం అక్కడ బియ్యం, గోధుమలు, వంటగ్యాస్ వంటి కనీస అవసరాల కోసం ప్రజలు అర్రులు చాచాల్సి వస్తోంది. గత సంవత్సరంతో పోల్చి చూస్తే... గ్యాస్ సిలిండర్ ధర అప్పుడు రూ. 2,373 ఉండగా, ఇప్పుడు రూ. 2,680కి చేరింది. పెసర పప్పు కిలో రూ. 172 ఉండగా నేడు రూ. 260గా ఉంది. అలాగే కేజీ చికెన్ రూ. 203 ఉండగా, ఈ ఏడాది రూ. 366కు పెరిగింది. 20 కిలోల గోధుమ పిండి ధర రూ.1,112 ఉండగా, ఈ ఏడాదికి రూ.1,812కు చేరింది. పరిస్థితి తీవ్రతకు ఈ ధరవరలు అద్దం పడుతున్నాయి. ప్రస్తుతం విదేశీ మారకం నిల్వలు 4.5 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరడంతో మూడు వారాలకు సరిపడా దిగుమతులకు మాత్రమే అవకాశం ఉంది. దీంతో ఆ దేశం ఆర్థిక సహాయం కోసం యూఏఈ, సౌదీ అరేబియా లాంటి దేశాల వైపు చూస్తోంది. పాకిస్తాన్లో 2010 నుంచి 2020 వరకు ఎకనామిక్ గ్రోత్ కేవలం 1.5 శాతం మాత్రంగానే ఉంది. ద్రవ్యోల్బణం రేటు 28.7 శాతంగా ఉంది. అప్పులు కూడా పుట్టడం లేదు. తమది చెప్పుకోవడానికి అణ్వస్త్ర దేశమైనా అప్పుల కోసం అడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్వయంగా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వాపోయారు. గత 70 ఏళ్ల కాలంలో ప్రభుత్వాలు ఆర్థిక పరమైన సవాళ్లను ఎదుర్కోలేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. పాకిస్తాన్ స్వయంగా పెంచి పోషించిన ‘తెహ్రీక్ ఇ తాలిబాన్’ పాకిస్తాన్‌కు కొత్త తలనొప్పిగా మారింది. తాలిబన్లు పాకిస్తాన్‌కు అత్యంత కీలక ప్రాంతాలైన ఖైబర్ఫక్తున్ఖ్వా, బెలూచిస్తాన్, పంజాబ్ లాంటి ప్రదేశాల్లో.. సైన్యం, పోలీ స్లు టార్గెట్‌గా పనిచేస్తూ అనేక ఉగ్రవాద సంస్థలను తమలో కలుపుకొని పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఇక్కడ చెప్పవలసిన మరో అంశం ఏంటంటే పాకిస్తాన్‌లోని ‘బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ’ని తాలిబన్లు తమ సంస్థలో విలీనం చేసుకున్నట్లు కూడా పాకిస్తాన్ నిఘా వర్గాలు పేర్కొన్నాయి. పాకిస్తాన్ యువకులనూ తాలిబన్లు సైన్యంలో చేర్చుకుంటూ, ఆయుధ శిక్షణ కూడా అందిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఒకవేళ తాలిబన్ల మీద పాకిస్తాన్ యుద్ధం చేయాల్సి వస్తే ఎదుర్కోలేని దుస్థితి ప్రస్తుతం నెలకొంది. అఫ్ఘానిస్తాన్‌ను వదిలి వెళ్లేటప్పుడు నాటో దళాలు సుమారు 22,000 వాహనాలు, 64,000 మిషన్‌గన్స్‌ను అక్కడే వదిలి వెళ్లాయి. ఎమ్ 16, ఏకే 47 రకానికి చెందిన ఆయుధాలు సుమారుగా మూడు లక్షలకు పైగా అక్కడ ఉన్నట్లుగా సమాచారం. కాబట్టి ఇంత ఆధునికమైన ఆయుధాలు, కమ్యూనికేషన్ వ్యవస్థ కలిగిన తాలిబన్ల మీద పాకిస్తాన్ సైన్యం ఏ విధంగా విజయం సాధించగలదు? తినడానికి తిండి లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తాలిబన్లను ఎదిరించగలరా? అనే ప్రశ్న తలెత్తుతోంది. గణాంకాల ప్రకారం పాక్‌లో కేవలం 68 శాతం మంది పిల్లలు మాత్రమే ప్రాథమిక విద్యను పూర్తిచేసినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. వీటితో పాటుగా ప్రపంచంలోనే అతి తక్కువగా అక్షరాస్యత కలిగిన దేశాల్లో ఒకటిగా తయారయింది. అక్కడ 34.8 శాతం యువత తీవ్రవాదం వైపు ఆకర్షితులు అవుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పొరుగున ఉన్న భారత్‌తో సత్సంబంధాలు ఏర్పరచుకోవటమే పాకిస్తాన్‌కు మంచిదని రక్షణ నిపుణులు పాక్‌కు సలహా ఇస్తున్నారు. నరేంద్ర మోదీ నేతృత్వంలో భారతదేశం ఎంతో అభివృద్ధి చెందిందనీ, అక్కడి మీడియా కూడా ప్రశంసిస్తోంది. మోదీ నాయకత్వంలో భారత్ అంతర్జాతీయ స్థాయిలో తనదైన ముద్ర వేసుకుంటోందని పాకిస్తాన్ దినపత్రిక ‘ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’ కీర్తించింది. అమెరికా, రష్యాలు కూడా భారత్‌తో బలమైన సంబంధాలు కోరుకుంటున్నాయని పేర్కొంది. స్వాతంత్య్ర కాలం నుంచి కశ్మీర్ పాకిస్తాన్‌దే అంటూ నానాయాగీ చేసిన పాకిస్తాన్... కశ్మీర్ అంశంపైన సామరస్య పూర్వకంగా ఒక నిర్ణయానికి రావాలనీ, తద్వారా రెండు దేశాలూ అభివృద్ధి సాధిస్తాయనీ పాక్ కొత్త హితవచనం అందుకుంది. భారత్‌తో మూడు యుద్ధాల్లో తలపడటం వల్ల కష్టాలూ, పేదరికం, నిరుద్యోగం మిగిలాయి. మూడు యుద్ధాలతో ఇప్పుడు తాము పాఠాలు నేర్చుకున్నాం అంటున్నారు పాక్ నాయకులు. ఇప్పుడు శాంతియుతంగా జీవించాలని అనుకుంటున్నామనీ, కశ్మీర్ వంటి సమస్యలపై భారత ప్రధాని మోదీతో నిజాయతీగా చర్చలు జరపాలనీ పాక్ ప్రధాని పిలుపునిచ్చారు. నిజంగా ఈ పిలుపు సాకారమైతే కేవలం పాక్ మాత్రమే కాదు... ఇండియా కూడా లాభపడుతుంది. (క్లిక్ చేయండి: హేతువాదమే మౌఢ్యానికి విరుగుడు) - డాక్టర్ ఎ. కుమార స్వామి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఫ్యాకల్టీ, నిజాం కాలేజ్ -
బీజేపీ చేతిలో కేసీఆర్ జుట్టు!
సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణకు నష్టం కలిగిం చేలా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నప్పటికీ సీఎం కేసీఆర్ స్పందించడం లేదని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. కేసీఆర్ జుట్టు బీజేపీ చేతుల్లో ఉందని, అందుకే ఆ పార్టీతో అంటకాగుతున్న సీఎం కేంద్రానికి వ్యతిరేకంగా ఏమీ మాట్లాడటం లేదన్నారు. నిరుద్యోగ దీక్షలో పాల్గొనడానికి వైఎస్ షర్మిల మంగళవారం వరంగల్ నగరానికి వచ్చారు. తొలుత హనుమకొండ కేయూ జంక్షన్లో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. సుమారు 4 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన అనంతరం హయగ్రీవాచారి గ్రౌండ్స్ సమీపంలో షర్మిల దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘తెలంగాణ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని పది వారాలుగా దీక్షలు చేస్తున్నా ఈ సర్కారుకు చీమకుట్టినట్లయినా లేదు. నిరుద్యోగుల కలల సాకారం కోసం ఎన్ని వారాలైనా దీక్షలు చేస్తా. ముఖ్యమంత్రి కేసీఆర్ మెడలు వంచేదాకా దీక్షలు కొనసాగిస్తా’ అని స్పష్టం చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగాలు చేసిన కుటుంబాలకు ఉద్యో గాలు ఇవ్వని కేసీఆర్, ఎంతమంది త్యాగం చేశారని ఆ కుటుంబంలో ఐదుగురికి పదవులు ఇచ్చుకున్నా రని షర్మిల నిలదీశారు. ఏళ్ల తరబడి వేచిచూస్తున్నా ఉద్యోగాల నోటిఫికేషన్ రావడం లేదని, నిరాశతో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీక్షలో వైఎస్ఆర్టీపీ రాష్ట్ర, జిల్లా నాయకులు ఏపూరి సోమన్న, ఎన్.భరత్‌రెడ్డి, నాడెం శాంతికుమార్, అప్పం కిషన్, కళ్యాణ్, సుజాత తదితరులు పాల్గొన్నారు. -
ఆరు నెలల్లో ‘సింగరేణి’ ఖాళీల భర్తీ: ఎన్.శ్రీధర్
సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల సంస్థలో ఉన్న ఖాళీలన్నీ మరో ఆరు నెలల్లో భర్తీ చేస్తామని సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ తెలిపారు. గత ఐదేళ్లలో ప్రత్యక్ష, కారుణ్య, అంతర్గత నియామకాల పద్ధతుల్లో 16 వేలకు పైగా ఖాళీ పోస్టులను భర్తీ చేశామన్నారు. చాలా గనుల్లో ఖాళీగా ఉన్న టెక్నికల్ స్టాఫ్, సూపర్ వైజర్లు, మెడికల్ సిబ్బంది, స్పెషలిస్టు డాక్టర్లు తదితర పోస్టులను వెంటనే భర్తీ చేసి రక్షణతో కూడిన ఉత్పత్తి పెంచాలని ఉద్యోగ సంఘాలు చేసిన సూచనలపై ఆయన స్పందించారు. సింగరేణి యాజమాన్యం, మైన్స్ సేఫ్టీ డీజీ, గుర్తింపు, ప్రాతినిధ్య కార్మిక సంఘాలు/అధికారుల సంఘం ప్రతినిధులతో మంగళవారం హైదరాబాద్ సింగరేణి భవన్లో జరిగిన 46వ రక్షణ త్రైపాక్షిక సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు కొత్తగా భర్తీ చేయనున్న పోస్టుల్లో ఇంటర్నల్ కోటా పెంచి అర్హులందరికీ అవకాశం కల్పిస్తామన్నారు. ఖర్చుకు వెనుకాడకుండా కార్మికుల రక్షణ విషయంలో పరికరాల కొనుగోలుకు సింగరేణి అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగంపై ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి, ఉద్యోగ క్యాలెండర్‌ను ప్రకటించాలని ప్రభుత్వాన్ని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ డిమాండ్ చేశారు. ‘తెలంగాణ ప్రజల బతుకు దెరువు నిలబెట్టాలి, రాష్ట్రాన్ని కాపాడాలి’అన్న నినాదంతో జనవరి 3, 4 తేదీల్లో 48 గంటలపాటు నాంపల్లిలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో నిరాహార దీక్ష చేస్తామని ప్రకటించారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 2018 నుంచి ఉద్యోగాల భర్తీ చేయకపోవడంతో యువత గ్రామాల్లో ఉంటూ ఉపాధి హామీ పనులకు వెళ్తున్నారని వాపోయారు. నిరుద్యోగ భృతి చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించి రెండేళ్లు కావస్తున్నా ఇప్పటివరకు దాని ఊసెత్తలేదని విమర్శించారు. కరోనా అనంతరం అన్ని వ్యాపార సంస్థలను ప్రోత్సహించిన ప్రభుత్వం బడ్జెట్ స్కూళ్ల విషయంలో ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఎల్ఆర్ఎస్ పేరుతో రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రభుత్వం పూర్తిగా ముంచేసిందన్నారు. -
కరోనా: గతం కంటే ఘోరం..
జెనీవా : ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ సంక్షోభం కారణంగా పెద్ద సంఖ్యలో కార్మికులు ఉపాధి కోల్పోయి నిరుద్యోగులుగా మారవచ్చని అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్ఓ) మంగళవారం పేర్కొంది. 2020 సంవత్సరం ద్వితీయార్థం ప్రపంచ కార్మిక మార్కెట్లో తీవ్ర అనిశ్చితి తప్పదని తాజా నివేదికలో తెలిపింది. కరోనా కారణంగా కోల్పోయిన ఉద్యోగాల స్థాయిని వైరస్ వ్యాప్తికి ముందు ఉన్న స్థితికి ఈ సంవత్సరంలో తీసుకు రాలేమని పేర్కొంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందడం వల్ల పని గంటలు, వేతనాలు తగ్గుతాయని ఐఎల్ఓ హెచ్చరించింది.(లాక్‌డౌన్‌తో 12 కోట్ల మంది నిరుద్యోగులు) కరోనా సంక్షోభం మరింత తీవ్రరూపం దాల్చడంతో కార్మిక మార్కెట్లకు జరిగిన నష్టం అంచనాలను గతం కంటే గణనీయంగా పెంచామని ప్రపంచ కార్మిక సంస్థ డైరెక్టర్ జనరల్ గై రైడర్ అన్నారు. ఈ పరిస్థితి నుంచి ఇప్పట్లో కోలుకోలేమన్నారు. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పరిస్థితులు మరింత దిగజారుతున్నాయన్నారు. ఇప్పటికీ 93 శాతం మంది కార్మికులు పని ప్రదేశాలు మూసివేసిన దేశాల్లోనే నివసిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కరోనా ప్రభావం మహిళా కార్మికులపై అధికంగా ఉందన్నారు. ప్రపంచ ఆరోగ్య సంక్షోభం మాత్రమే కాదు, ఆర్థిక సంక్షోభం.. ఇది ప్రజలను ఎక్కువగా ప్రభావితం చేస్తుందన్నారు. వైరస్ నేపథ్యంలో నిరుద్యోగాన్ని ఎదుర్కోవటానికి ప్రపంచం కూడా సిద్ధంగా ఉండాలని, ఈ పరిస్థితులను నివారించడానికి ప్రపంచవ్యాప్తంగా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం వుందని ఐఎల్ఓ పేర్కొంది. (చైనాపై మరింత కోపంగా ఉన్నాను: ట్రంప్) ప్రపంచ పని గంటలు తగ్గడంతో గతంలో అంచనా వేసిన దానికంటే ఈ సంవత్సరం మొదటి భాగంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఐఎల్ఓ తన తాజా నివేదికలో తెలిపింది. కరోనా సంక్షోభం ప్రభావం అమెరికాపై అత్యధికంగా ఉందని, అగ్రరాజ్యం దాదాపు 18.3 శాతం పని గంటలను కోల్పోయిందని వెల్లడించింది. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా రెండవ త్రైమాసికంలో 14 శాతం పని గంటలు వృధా అయ్యాయని, ఇది 40 కోట్ల ఫుల్ టైం ఉద్యోగాలకు సమానమని అంచనా వేసినట్లు ఐఎల్ఓ తెలిపింది. ఈ నష్టాలు నాల్గవ త్రైమాసికంలోనూ కొనసాగి దాదాపు 14 కోట్ల ఫుల్ టైం ఉద్యోగాలకు సమానమైన 4.9 శాతం పని గంటలు కోల్పోయే అవకాశముందని అంచనా వేసింది. మహమ్మారి రెండో దశగా పరిగణిస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ సంఖ్య 11.9 శాతం లేదా 340 మిలియన్ ఉద్యోగాలకు పెరగవచ్చని తెలిపింది. (కరోనా : అమెరికాకు కొత్త హెచ్చరిక) -
మరో పోరాటానికి సిద్ధమైన వైఎస్సార్సీపీ
-
ఉద్యోగాల భర్తీని మరచిన కేసీఆర్ : శ్రీకాంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న సీఎం కేసీఆర్ సర్కారు ఖాళీల భర్తీని విస్మరించిందని తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ఉద్యోగాల భర్తీ కోసం వైఎస్సార్ సీపీ నాయకులు ధర్నాలు చేపట్టారు. హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద చేపట్టిన ఉద్యోగ ధర్నాలో పాల్గొన్న శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఆయన కుటుంబ సభ్యులకు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని మండిపడ్డారు. మూడు నెలల్లోగా ఖాళీగా ఉన్న లక్షన్నర ఉద్యోగాలను భర్తీ చేయాలని, లేదంటే నిరుద్యోగుల పక్షాన వైఎస్సార్ సీపీ పోరాడుతుందని హెచ్చరించారు. ఈ మేరకు కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. జిల్లాల్లో ఇలా.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా : జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వ శాఖల్లో 1,50,000 ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా జరిగింది. ఈ మేరకు డీఆర్వో మోహన్ లాల్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు నాడేమ్ శాంత కుమార్, భూపాలపల్లి వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు అప్పమ్ కిషన్, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం నాయకుడు రామకృష్ణ, వైఎస్సార్ సీపీ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా : మహబూబాబాద్ పట్టణంలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వ శాఖల్లో 1,50,000 ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ కలక్టరేట్ ముందు ధర్నా చేసిన వైఎస్సార్ సీపీ నాయకులు ఏవో పి.సురేష్ బాబుకి వినతిపత్రం అందజేశారు. కరీంనగర్ జిల్లా : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షా 50 వేల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని కలెక్టరేట్ ముందు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నగేష్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఖమ్మం జిల్లా : జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ నందు, వైఎస్సార్ సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఉద్యోగ ధర్నా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యాతిధిగా వైఎస్సార్ సీపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు లక్కినేని సుధీర్ బాబు విచ్చేశారు. పెద్దపల్లి జిల్లా : ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని పెద్దపల్లిలో కలెక్టరేట్ ముందు వైఎస్ఆర్సీపి జిల్లా అధ్యక్షులు గోవర్ధన శాస్త్రి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి, అనంతరం ధర్నా చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా : లక్షా 50 వేల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని సిరిసిల్లలో కలెక్టరేట్ ముందు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు రామ్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. -
నిరుద్యోగ ఆంధ్రాగా మార్చారు
రాజాం : ఆంధ్రప్రదేశ్‌ని నిరుద్యోగ ఆంధ్రాగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుదేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు అన్నారు. ఆదివారం రాజాంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో చిరుద్యోగులంతా రోడ్డున పడ్డారని ఆరోపించారు. నాలుగేళ్ల పాలనలో సుమారు తొమ్మిది వేల మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయారని చెప్పారు. ఈ పాపం టీడీపీ నేతలకు తగలకతప్పదన్నారు. జిల్లాలో 900 మంది ఆదర్శ రైతులు, 300 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగాలు కోల్పోయారని గుర్తు చేశారు. పార్టీ వివక్ష చూపించి 238 మంది రేషన్ డిపో డీలర్లను తొలగించారని, వెలుగుశాఖలో చిరుద్యోగులుగా ఉన్న 390 మంది సీఎఫ్‌లను తొలగించారని పేర్కొన్నారు. 650 మంది సాక్షరాభారత్ కోఆర్డినేటర్లపై వేటు వేశారని తెలిపారు. కేజీబీవీలు, ప్రభుత్వ పాఠశాలలు, ఆదర్శ పాఠశాలల్లో వలంటీర్లు, స్వీపర్లు, నైట్ వాచ్మెన్లుగా పనిచేస్తున్న 280 మందిని తొలగించారని దుయ్యబట్టారు. ఇదే కోవలో మధ్యాహ్న భోజన నిర్వాహకులు, గృహనిర్మాణశాఖలో ఔట్సోర్సింగ్ ద్వారా పనిచేసిన 230 మంది వర్క్ ఇన్స్పెక్టర్లు, 600 మంది కంప్యూటర్ బోధకులు, పంచాయతీల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్లు, వివిధ శాఖల్లో ఔట్సోర్సింగ్ ద్వారా విధులు నిర్వహిస్తున్న 1700 మంది ఉద్యోగులను తొలగించి అన్యాయం చేశారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ వైపు కేంద్రాన్ని తిడుతూ మరో వైపు ప్రధానమంత్రితో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చే సత్తా వైఎస్ జగన్మోహన్రెడ్డికి మాత్రమే ఉందన్నారు. -
ఏపీలో లక్షన్నర ఉద్యోగాలు ఖాళీ..!
-
ఏపీ నిరుద్యోగులకు శుభవార్త!
-
సిఫార్సు, రూ.6 లక్షలతోనే వర్సిటీలో పోస్టు ?
నెల్లూరు(టౌన్), న్యూస్‌లైన్: విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వివాదాస్పదమవుతోంది. రాజకీయ పలుకుబడి, డబ్బున్న వారికే ఉద్యోగాలు దక్కుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే పోస్టులకు అభ్యర్థులను ఖరారు చేసి ఓ ప్రహసనంలా రాత పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారని పలువురు నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. జిల్లాలో వర్సిటీ ఏర్పాటుతో ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని జిల్లాలోని నిరుద్యోగులు ఆశపడ్డారు. వాటి కోసం ఐదేళ్లుగా ఎదురుచూపులు చూశారు. అయితే 2009 నుంచి ఇప్పటి వరకు సుమారు 100 నాన్ టీచింగ్ పోస్టుల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగులనే కొనసాగిస్తూ వచ్చారు. వీటిలో కొన్ని పోస్టులను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు ఎట్టకేలకు ఇటీవల నోటిఫికేషన్లు విడుదల చేశారు. జూనియర్ అసిస్టెంట్, సీనియర్ ల్యాబ్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, హాస్టల్ స్టీవార్డ్, కుక్, డ్రైవర్, జానియర్ స్టెనో, సీనియర్ అసిస్టెంట్ తదితర నాన్‌టీచింగ్ పోస్టులతో పాటు ఒక డిప్యూటీ రిజిస్ట్రార్, ఒక అసిస్టెంట్ రిజిస్ట్రార్, ఒక సూపరింటెండెంట్ మొత్తం కలిపి 53 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. పలుకుబడికే ప్రాధాన్యం ! సుదీర్ఘ కాలం తర్వాత వీఎస్‌యూలో నాన్‌టీచింగ్ పో స్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడటంతో వేలాది మం ది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో బీటెక్, ఎంటెక్, పీహెచ్డీ, పీజీ పట్టభద్రులు కూడా ఉన్నారు. అయితే భర్తీప్రక్రియపై నిరుద్యోగులు పలు అనుమానాలు వ్య క్తం చేస్తున్నారు. జిల్లా మంత్రి సిఫార్సుతో పాటు రూ.6లక్షలు ముట్టజెప్పిన వారికే నాన్ టీచింగ్ పోస్టు దక్కేలా కనిపిస్తోందని ఆరోపిస్తున్నారు. కొన్ని పోస్టులకు ఇప్పటికే అభ్యర్థులను ఎంపిక చేసి నామమాత్రం గా ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారని వాపోతున్నారు. అభ్యర్థులు లేవనెత్తుతున్న అనుమానాలివే.. జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి బుధవారం ని ర్వహించిన రాతపరీక్ష ఫలితాలను వెబ్సైట్లో ఉంచా రు. 212 మంది ఉత్తీర్ణులయ్యారని ప్రకటించినా, వారు సాధించిన మార్కులను వెల్లడించలేదు. యూనివర్సిటీ స్థాయిలో పోస్టుల భర్తీకి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి. కానీ ఇక్కడ ఓఎంఆర్ షీటు లాంటి టెక్నాలజీని ఉపయోగించలేదు. రాతపరీక్షలోనూ హాల్‌టికెట్ నంబర్లను సింగిల్ డిజిట్ నుంచి ప్రారంభించారు. ఈ క్రమంలో పరీక్ష పత్రాలను తారుమారు చేసే అవకాశం ఉంది. రాజకీయ నేతల సిఫార్సులతో ఇప్పటికే అనేక మంది వర్సిటీలో ఔట్ సోర్సింగ్ సిబ్బందిగా కొనసాగుతున్నారు. వీరిలో ఓ మాజీ మేయర్ సమీప బం ధువు కూడా ఉన్నారు. ప్రస్తుతం భర్తీకానున్న పోస్టులు వారికే దక్కే అవకాశాలు ఉన్నాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.