గ్రాడ్యుయేషన్ పూర్తయిన వారిని పక్కింటివారు, మిత్రులు, బంధువులు.. ‘చదువు అయిపోయింది కదా. ఏ ఉద్యోగం చేస్తున్నావు?’ అని సాధారణంగా అడుగుతుంటారు. సరైన స్కిల్స్ లేని వారు ‘ఇంటికి వచ్చినవాళ్లు పనిచూసుకుని వెళ్లిపోక నా గురించి ఎందుకు’ అని మనసులో అనుకొని పైకి నవ్వుతూ ‘ఇంటర్వ్యూలకు హాజరవుతున్నా’ అని చెబుతుంటారు. సరైన నైపుణ్యాలు లేనివారు సైతం ఉద్యోగంలో స్థిరపడేలా నిపుణులు కొన్ని ఉచిత కోర్సులను సూచిస్తున్నారు. ప్రస్తుతం కృత్రిమమేధ రంగానికి ఉన్న డిమాండ్ అందరికీ తెలిసిందే కదా. ఏఐలో సరైన కోర్సులు ఎంచుకుని కష్టపడి చదివితే ఉద్యోగం సాధించవచ్చని చెబుతున్నారు. ఇటీవల నిర్వహించిన ఏడబ్ల్యూఎస్ సర్వే ప్రకారం కింది కోర్సులు చేస్తే మేలు జరుగుతుందని సూచిస్తున్నారు.
కంపెనీలు ఏఐ నైపుణ్యాలున్న వారికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఏడబ్ల్యూఎస్ సర్వే ప్రకారం.. 73 శాతం కంపెనీలు ఏఐ నిపుణులను నియమించుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయి. కానీ, దాదాపు ఇంటర్వ్యూకు హాజరయ్యే ప్రతి నలుగురిలో ముగ్గురు కంపెనీ అంచనాలను చేరుకోవడం లేదు. ఏఐ రంగంలో అపార అవకాశాలున్నాయి. క్రిటికల్ థింకింగ్, క్రియేటివ్ థింకింగ్, డేటా అనాలసిస్, జనరేటివ్ ఏఐ, ప్రాంప్ట్ ఇంజినీరింగ్, ఏఐ టూల్స్.. వంటి విభాగాల్లో నిపుణుల కొరత ఉంది.
స్ప్రింగ్‌బోర్డ్ స్టేట్ ఆఫ్ ది వర్క్‌ప్లేస్ స్కిల్స్ గ్యాప్ 2024 నివేదిక ప్రకారం..చాలా కంపెనీల్లో 70 శాతం మంది ఉన్నతస్థాయి ఉద్యోగుల్లో నైపుణ్యాల కొరత ఉంది. సరైన స్కిల్స్ లేని ఉద్యోగులతోనే చాలా కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. వాటిలో పనిచేస్తున్న మూడో వంతు ఉద్యోగులతో పరిమిత ఆవిష్కరణలు జరిపి వృద్ధిని నమోదు చేస్తున్నాయి. దాదాపు 40 శాతం మంది కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు తమ సంస్థలో నైపుణ్యాల అంతరం పెరిగిందని అంగీకరిస్తున్నారు.
ఇదీ చదవండి: ప్రముఖ సంస్థకు రూ.9.5 కోట్ల ట్యాక్స్ నోటీసులు!
ఈ వార్త చదువుతున్న సమయంలో ప్రపంచంలో ఎక్కడోచోట కొత్త ఆవిష్కరణకు నాందిపడి ఉండవచ్చు. టెక్నాలజీ ఇంత వేగంగా వృద్ధి చెందుతున్న క్రమంలో అందుకు అనువుగా స్కిల్స్ వృద్ధి చేసుకోకపోతే ఉద్యోగం రావడం కషం. నిపుణులు సూచించే కింది ఉచిత కోర్సుల గురించి పూర్తిగా తెలుసుకుని సరైన విధంగా కష్టపడితే ఉద్యోగం వచ్చే అవకాశాలు అధికం.
1. ఆర్‌ఐటీ(ఎక్స్)-రోచెస్టర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అందిస్తున్న క్రిటికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కోర్సు. ఇది ఎడెక్స్(edX)లో అందుబాటులో ఉంది.ఔ
2. ఇంపీరియల్ కాలేజ్ లండన్ క్రియేటివ్ థింకింగ్ అందిస్తున్న టెక్నిక్స్ అండ్ టూల్స్ ఫర్ సక్సెస్ కోర్సు కోర్సెరాలో అందుబాటులో ఉంది.
3. అరిజోనా స్టేట్ యూనివర్శిటీ అందిస్తున్న స్ట్రాటజిక్ థింకింగ్ ఫర్ ఎవ్రీవన్ స్పెషలైజేషన్ కోర్సు. దీన్ని కోర్సెరాలో నేర్చుకోవచ్చు.
4. కోర్సెరాలో ఐబీఎం అందిస్తున్న ఇంట్రడక్షన్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ).
5. వాండర్‌బిల్ట్ విశ్వవిద్యాలయం రూపొందించిన ప్రాంప్ట్ ఇంజినీరింగ్ స్పెషలైజేషన్. ఇది కోర్సెరాలో ఉంది.
6. గూగుల్ డేటా అనలిటిక్స్ ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ కోర్సు. ఇది కూడా కోర్సెరాలో నేర్చుకోవచ్చు.
పైన తెలిపిన కోర్సులు కేవలం కొత్తగా ఉద్యోగాల్లో స్థిరపడాలనుకునేవారికే కాదు. ఉద్యోగం మారాలనుకునేవారికిసైతం ఎంతో ఉపయోగపడుతాయని నిపుణులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment