కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: ఇటీవల ఎన్నికైన కొత్త సర్పంచ్‌లకు అన్ని ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 28 నుంచి శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో వచ్చే నెల 28వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఇందుకు జిల్లా పరిషత్ సహకరిస్తుందని డ్వామా పీడీ హరినాథరెడ్డి తెలిపారు. జిల్లాలో మొత్తం సర్పంచ్‌లు 883 మంది కాగా.. స్త్రీలకు, పురుషులకు వేర్వేరుగా శిక్షణ ఇవ్వనున్నారు.
పురుషులకు ఆరు బ్యాచ్‌లుగా కర్నూలు శివారులోని డ్వామా శిక్షణ కేంద్రంలో.. మహిళలకు తొమ్మిది బ్యాచ్‌లుగా ఓర్వకల్లులోని సీఎల్‌ఆర్‌సీలో శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ఒక్కో బ్యాచ్‌కు మూడు రోజుల పాటు గ్రామ పంచాయతీలకు ఆదాయ వనరులను పెంచడం.. అధికార వికేంద్రీకరణ, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, పారిశుద్ధ్యం, తాగునీరు, ఇంటి పన్నుల మదింపు, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌లో పంచాయతీల పాత్ర, తదితర అంశాలపై సమగ్రంగా శిక్షణ ఇవ్వనున్నట్లు డ్వామా పీడీ వెల్లడించారు. షెడ్యుల్ ప్రకారం సర్పంచ్‌లు శిక్షణకు హాజరై చట్టాలు, ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై అవగాహన పెంచుకొని గ్రామాభివృద్ధికి తోడ్పడాలని ఆయన కోరారు.
నేటి నుంచి సర్పంచ్‌లకు శిక్షణ
Published Thu, Nov 28 2013 6:32 AM | Last Updated on Sat, Sep 2 2017 1:04 AM
Advertisement