Illegal transfers
-
నగరంలో నిలిచిపోయిన బస్సులు
హైదరాబాద్: అక్రమ బదిలీలకు నిరసనగా.. ఆర్టీసీ కార్మికులు సోమవారం విధులు బహిష్కరించారు. దీంతో నగరంలోని 8 డిపోల పరిధిలో వందల బస్సులు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అకారణంగా బదిలీలు చేపట్టడానికి నిరసిస్తూ సోమవారం టీఎంయూ ఆధ్వర్యంలో ఉద్యోగులు బంద్ పాటిస్తున్నారు. ఉప్పల్ డిపో పరిధిలో కండక్టర్‌గా పని చేస్తున్న రత్నకుమారిని అకారణంగా బదిలీ చేశారని ఆగ్రహించిన తోటి ఉద్యోగులు ఈ రోజు బదిలీకి నిరసనగా బంద్‌లో పాల్గొంటున్నారు. ఈ విషయం పై ఉన్నతాధికారులను సంప్రదించారు. అయితే ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు అందడంతోనే బదిలీ చేశామని అధికారులు చెప్తున్నారు. -
అక్రమ బదిలీలు ఆపకపోతే ఉద్యమం
ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు గుంటూరు ఈస్ట్ : ప్రభుత్వం నిర్వహిస్తున్న అక్రమ బదిలీలను ఆపకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు ఉద్యమిస్తారని ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఫ్యాప్టో ఆధ్వర్యంలో అక్రమ బదిలీలను నిలిపివేయాలంటూ ధర్నా నిర్వహించారు. ధర్నాకు ముఖ్య అతిథిగా విచ్చేసిన బొడ్డు నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నో పోరాటాల తరువాత కౌన్సెలింగ్ విధానం అమలులోకి వచ్చిందన్నారు. 1998 నుంచి నేటి వరకు కౌన్సెలింగ్ ద్వారా బదిలీల ప్రక్రియ చక్కగా కొనసాగిందన్నారు. నేడు ప్రభుత్వం కౌన్సెలింగ్ విధానాన్ని నష్టపరిచే విధంగా బదిలీలు చేస్తోందని విమర్శించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏఎస్.రామకృష్ణ మాట్లాడుతూ అక్రమ బదిలీల వ్యవహారాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామని, ముఖ్యమంత్రి స్పందించి అక్రమ బదిలీలు జరుగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని వివరించారు. ఫ్యాప్టో కోశాధికారి కరీముల్లారావు మాట్లాడుతూ బదిలీల షెడ్యూల్ వెంటనే విడుదల చేయాలని, పీఆర్సీని అమలు చేయాలని, హెల్త్ కార్డులు అమలుచేయాలని కోరారు. యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.హనుమంతరావు మాట్లాడుతూ ప్రభుత్వం దొడ్డిదారిన బదిలీలకు తెర తీసిందన్నారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు నాగమల్లేశ్వరరావు, ఎస్టీయూ నాయకులు బెనహర్‌బాబు, మ రియదాసు, ఏపీటీఎఫ్ నాయకులు చాంద్‌బాషా, నేతాంజనేయప్రసా ద్, ఏపీటీఎఫ్ నాయకులు ఎం.వి.ప్రసాద్, జె.విజయచంద్, డీటీఎఫ్ నాయకులు పి.ప్రసాద్, కె.లూర్ధురెడ్డి, షేక్ అలీం, టి.రవీంద్రబాబు (హెచ్ఎంఎస్అసోసియేషన్), పి.సాం బయ్య, షేక్ అబ్దుల్ ఖాదర్ (ఆర్‌యూపీపీ), కె.నాగభూషణం, ఎం.నాగేశ్వరరావు (పీఈటీఎస్ అ సోసియేషన్), ఎం.సుబ్బారావు, అస్టాంకాబాబు, (హెచ్పీపీటీఏ), శౌరి రాములు, సుశీలకుమారి, టి.వినోద్ (యూటీఎఫ్) పాల్గొన్నారు. -
వైద్య శాఖలో అక్రమ బదిలీలు!
⇒ నిషేధమున్నా సరెండర్ పేరుతో కోరుకున్న చోటుకు ట్రాన్స్ఫర్ ⇒ లంచావతారమెత్తి దొడ్డిదారులు వెతికిన ఓ కీలకాధికారి ⇒ 150 మంది నుంచి రెండు మూడు లక్షల వరకు వసూలు ⇒ నల్లగొండ జిల్లాలో 50 మందికి అక్రమంగా డిప్యుటేషన్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖలోని కీలక అధికారుల్లో ఆయన ఒకరు. ఆరు నెలల కిందట ప్రధానమైన ఆరో జోన్ లో బాధ్యతలు చేపట్టారు. పెద్దఎత్తున ముడుపులు చెల్లించి పోస్టింగ్ తెచ్చుకున్నట్లు ఆయనే ఒకటికి రెండుసార్లు కింది అధికారులతో అంటుం టారు. పెట్టిన పెట్టుబడి రాబట్టుకోవడానికి నిషేధం ఉన్నా సరెండర్(ఉద్యోగిని తిరిగి అప్పగించుట) పేరుతో దొడ్డిదారిలో పని పూర్తి చేస్తున్నారు. ఒక్కొక్కరి నుంచి రెండు మూడు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. సరెండర్ కూడా కుదరకపోతే డిప్యుటేషన్తోనైనా జేబు లు నింపుకొంటున్నారు. రూ. 50 వేల చొప్పున తీసుకుని నల్లగొండ జిల్లాలో దాదాపు 50 మంది ఏఎన్ఎంలకు డిప్యుటేషన్‌పై కోరుకున్న చోట పోస్టింగ్ ఇచ్చేశారు. ఇక ఇదే జిల్లాకు చెందిన ఒక రాష్ట్ర స్థాయి ప్రజా ప్రతినిధి తల్లికి ప్రమోషన్ ఇవ్వడం సాధ్యంకాకపోవడంతో 12 మంది ఏఎన్ఎంలకు పదోన్నతులను కూడా నిలిపివేశారు. వైద్య సిబ్బంది తాజాగా వైద్యారోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి సురేష్చందాకు ఈ విషయాలన్నీ చెప్పారు. అక్రమాలు ఎలా జరిగాయంటే.. ఆరో జోన్ కిందకు వచ్చే నల్లగొండ, రంగారెడ్డి, నిజామాబాద్, మెదక్, హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో బదిలీలు, డిప్యూటేషన్లతోనే సదరు అధికారి జేబు నిండుతోంది. ప్రస్తుతం బదిలీలపై నిషేధం ఉండటంతో అందుకు సరెండర్ విధానాన్ని ప్రత్యామ్నాయంగా మలుచుకున్నారు. సాధారణంగా సరెండర్ అంటే ఏదైనా ఆసుపత్రిలోని పారా మెడికల్ ఉద్యోగిపై విధుల్లో నిర్లక్ష్యం, గైర్హాజరు తదితర ఆరోపణలతో మెమోలు వచ్చినట్లయితే ఆ ఉద్యోగిని ప్రాంతీయ కార్యాలయంలో రిపోర్టు చేయాలని జిల్లా వైద్యాధికారి ఆదేశాలు ఇస్తారు. ఇక అతనిపై ప్రాంతీయ అధికారే నిర్ణయం తీసుకుంటాడు. ఈ సౌలభ్యాన్ని తనకు అనుకూలంగా మలచుకున్న సదరు కీలకాధికారి సరెండర్ల ద్వారా బదిలీలకు తెరదీశారు. జిల్లా వైద్యాధికారుల ద్వారా ఆరోపణలు చేయించడం, అవసరమైతే పాత తేదీలతో రెండు మూడు మెమోలు కూడా సృష్టించడం వంటివి చేసి కొందరు ఉద్యోగులను సరెండర్ చేయించారు.ఇలా దాదాపు 150 మందిని సరెండర్ చేయించి.. వారి నుంచి డబ్బులు తీసుకొని వారికి ఇష్టమైన చోట పోస్టింగ్ ఇచ్చారు. ఉదాహరణకు.. విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నాడని, సెలవులు ఎక్కువగా పెడుతున్నాడని రంగారెడ్డి జిల్లాలో ఒక సూపరింటెండెంట్‌ను సరెండర్ చేయించి అతన్ని ప్రాంతీయ కార్యాలయానికి బదిలీ చేశారు. ఇష్టారాజ్యంగా సరెండర్ చేయడం వల్ల అనేక చోట్ల సిబ్బంది కొరత ఏర్పడింది. ప్రజాప్రతినిధి తల్లి కోసమేనా? నల్లగొండ జిల్లాలో ఓ ప్రజాప్రతినిధి తల్లి ఏఎన్ఎంగా పనిచేస్తున్నారు. అతను ప్రజాప్రతినిధి అయ్యాక అధికారులు ఆమె పనిచేస్తున్న చోటుకు మరొకరిని డిప్యుటేషన్‌పై అదే కేడర్‌లో పంపించడం మరీ విడ్డూరం. అక్కడ మరో ఏఎన్ఎం పోస్టు లేకపోయినా కేవలం ఆ ప్రజాప్రతినిధి తల్లికి పనిచెప్పకూడదనే అలా చేశారు. ఆమెకు ఇంకా రెండేళ్ల సర్వీసు ఉంది. తల్లికి పదోన్నతి కల్పించాలని సదరు ప్రజాప్రతినిధి ప్రయత్నించారు. కానీ పదోన్నతులకు అర్హుల జాబితాలో ఆమె కంటే మరో 12 మంది ముందున్నారు. కారణమేదైనా మొత్తం ప్రక్రియనే పెండింగ్‌లో పెట్టారు. 12 మందికీ పదోన్నతులు నిలిచిపోయాయి. దీనిపై హైదరాబాద్‌లోని ప్రాంతీయ కార్యాలయంలో ఇటీవల కొందరు ఉద్యోగులు ధర్నా కూడా చేశారు. నిబంధనల ప్రకారమే చేశాం: ఆమోస్ సరెండర్ పేరుతో డబ్బులు తీసుకొని ఉద్యోగులను బదిలీ చేయలేదని, నిబంధనల మేరకే చేశామని ఆరో జోన్ ప్రాంతీయ అధికారి ఆమోస్ ‘సాక్షి’కి వివరణ ఇచ్చారు. అక్రమాలు జరిగాయనడం అవాస్తవమన్నారు. అలాగే ఎవరి కోసం కూడా పదోన్నతులు ఆపలేదన్నారు. -
విద్యుత్ శాఖలో అడ్డగోలు బదిలీలు
ఒంగోలు క్రైం: జిల్లాలోని విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీలు అడ్డగోలుగా సాగుతున్నాయి. ఒకపక్క బదిలీలపై నిషేధ ఉత్తర్వులున్నా..వాటిని బేఖాతరు చేస్తూ తిరుపతిలోని ఎస్పీడీసీఎల్ కార్యాలయంలో యథేచ్ఛగా బదిలీలు చేస్తున్నారు. అధికారపార్టీ నాయకుల అనుయాయులు, పార్టీ సానుభూతిపరులు అడిగిన చోట అడిగినట్లుగా బదిలీలు చేయించేందుకు పూనుకున్నారు. తిరుపతి ఎస్పీడీసీఎల్ కార్యాలయంలోని ఉన్నతాధికారి సైతం అధికార పార్టీకి దాసోహమంటూ ఇష్టానుసారంగా బదిలీలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగంలోని సిబ్బంది అభ్యర్థనలు, పరస్పర ఆమోద బదిలీలకు తొలుత అవకాశం ఇచ్చారు. ఈ ప్రక్రియ రెండు నెలల క్రితం మొదలైంది. ఈ విభాగంలో సబ్స్టేషన్లలో పనిచేసే సిబ్బంది మొదలుకొని విద్యుత్ సంస్థలో ఫీల్డ్ స్టాఫ్ అందరికీ బదిలీల అవకాశం కల్పించారు. మొదట్లో ఇంజినీర్లకు బదిలీలు లేవని ప్రకటించారు. ప్రొవెన్షియల్ సిబ్బందిలో కేవలం అకౌంట్స్ విభాగంలో ఉన్న కొంతమందికి అవకాశం ఉందంటూ కూడా మౌఖిక ఆదేశాలిచ్చారు. ఈ ప్రొవెన్షియల్ సిబ్బందిలోనే ఇంజినీర్లు, అకౌంట్స్ ఆఫీసర్లు, యూడీసీలు, ఎల్డీసీలు, కార్యాలయంలో పనిచేసే సిబ్బందికి బదిలీల అవకాశం కల్పించలేదు. అయితే ఆ తరువాత ప్రొవెన్షియల్ విభాగంలో కూడా రిక్వెస్ట్‌లు, మ్యూచ్వల్స్ అవకాశం ఇస్తున్నట్లు తిరుపతి కార్యాలయం నుంచి జిల్లా కార్యాలయానికి సందేశం వచ్చింది. దానికి కొంత గడువు మాత్రమే విధించారు. గత నెలలోనే ఈ గడువు ముగిసింది. అయితే తిరుపతి కార్యాలయంలో మాత్రం ఈనెల 4 లోపు వచ్చిన అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని బదిలీలు చేస్తున్నామని చెప్పుకుంటూ అధికార పార్టీ నాయకుల అడుగులకు మడుగులొత్తుతూ ఇష్టానుసారం బదిలీలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని డీఈల బదిలీలు రెండుసార్లు, ఏఈల బదిలీలు రెండుసార్లు చేసుకుంటూ వచ్చారు. ఉన్నట్లుండి గత సోమవారం జిల్లాలోని ఆరుగురు ఏఈలకు స్థాన చలనం కల్పిస్తూ డిస్కం సీఎండీ హెచ్‌వై దొర జిల్లా కార్యాలయానికి ఉత్తర్వులు పంపారు. వాస్తవానికి 4వ తేదీతోనే ఈ బదిలీల ప్రక్రియకు ఫుల్స్టాప్ పెట్టారు. అయినా వారం రోజులకు కూడా బదిలీలను చేసుకుంటూ పోవడం పట్ల కిందిస్థాయి ఉద్యోగి మొదలుకుని జిల్లా ఉన్నతాధికారుల వరకు కొంత అసంతృప్తితో ఉన్నారు. అధికార పార్టీ నాయకులు ఉన్నతాధికారులపై పట్టుబట్టి బదిలీలు చేయిస్తుండడంతో నోరు మెదపలేని పరిస్థితి నెలకొంది. ప్రాధాన్యత గల స్థానాలపై దృష్టి: అధికార పార్టీ నాయకుల అండదండలు మెండుగా ఉన్న ఈ శాఖలోని కొందరు ఏఈలు ప్రాధాన్యత గల స్థానాలపై దృష్టి సారించారు. అవసరమైతే అధికార పార్టీ నేతలకు రూ.లక్షల కొద్దీ ముట్టజెప్పడానికి కూడా వెనుకాడలేదని సమాచారం. ప్రాధాన్యత గల స్థానాలతోపాటు ఆదాయ వనరులు మెండుగా సమకూరే స్థానాల్లో అధికార పార్టీ నాయకుల అండదండలతో ఇప్పటికే పలు దఫాలుగా బదిలీ అయిన వారు విధుల్లో చేరిపోయారు. మొదటి విడత డీఈల బదిలీల నేపథ్యంలో అధికారుల మధ్య కొంత దుమారం కూడా చెలరేగింది. అప్పట్లో కనిగిరి డీఈని ఒంగోలు డీఈటీగా బదిలీ చేస్తే ఆయన విధుల్లో చేరకుండానే సెలవుపై వెళ్లిపోయారు. అప్పట్లో ఇద్దరు ముగ్గురు డీఈలు విధుల్లో చేరనేలేదు. ఆ తరువాత రెండో దఫా కూడా డీఈలను బదిలీ చేశారు. ఆ తరువాత మొదటి విడత ఏఈలు కొంతమందికి బదిలీ అవకాశం కల్పించారు. ఆ బదిలీల్లోనూ అధికార పార్టీ మార్కు కొట్టొచ్చినట్లు కనపడింది. -
బదిలీల జాతర!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: విద్యాశాఖలో అక్రమ బదిలీలకు తెరలేచింది. ఉపాధ్యాయుల బదిలీలపై నిషేధం ఉన్నప్పటికీ ప్రత్యేక ఉత్తర్వుల పేరిట వ్యవహారం జోరుగా నడుస్తోంది. రెండ్రోజుల్లో జిల్లా వ్యాప్తంగా 41 మంది టీచ ర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. వీరిలో 25 మంది టీచర్లు పరస్పర బదిలీలు కావడం విశేషం. మరోవైపు ఖాళీ లేని పోస్టుకు ఏకంగా నలుగురిని నియమిస్తూ ఆదేశాలిచ్చింది. వాస్తవంగా ఒకేచోట ఎనిమిదేళ్లపాటు పనిచేసిన ప్రతి టీచరుకూ బదిలీ తప్పనిసరి. ఏటా వేసవి సెలవుల్లో చేపట్టే ఉపాధ్యాయ బదిలీల్లో భాగంగా ఈ ఏడాది కూడా కౌన్సెలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎనిమిదేళ్లు పూర్తి చేసుకునే టీచర్లంతా కోరిన చోటుకు బదిలీ అయ్యేందుకు వ్యూహరచన చేసి విజయవంతమయ్యారు. దొడ్డిదారిలో బదిలీ చేసుకుని దర్జాగా విధుల్లో చేరుతున్నారు. పట్టణ రాబడి వదులుకోలేక.. పట్టణ ప్రాంతంలో పనిచేస్తున్న టీచర్లకు 30 శాతం ఇంటి అద్దె భృతితోపాటు ఇతర అలవెన్సులు వస్తాయి. ఒకే చోట ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు తప్పనిసరి బదిలీ కానున్న నేపథ్యంలో.. కౌన్సెలింగ్‌కు ముందే కోరిన చోటుకు బదిలీ అయ్యేందుకు ఎత్తు వేశారు. పట్టణ బడిలో పనిచేయడంతో వచ్చే ప్రత్యేక అలవెన్సులు వదులుకోలేక ముఖ్యమంత్రి స్థాయిలో పైరవీ నడిపించారు. పోస్టులు ఖాళీ లేనప్పటికీ.. ఇద్దరు ఉపాధ్యాయులు పరస్పరం బేరం కుదుర్చుకుని బదిలీకి మార్గం సుగమం చేసుకున్నారు. పరస్పర బదిలీ కేటగిరీలో ఏకంగా 25 మంది టీచర్లకు బదిలీ ఉత్తర్వులు అందడం గమనార్హం. ఖాళీయే లేని చోటుకు నలుగురు.. తాజా బదిలీల ప్రక్రియలో భాగంగా పైరవీలు పెద్దఎత్తున జరుగుతున్నాయి. ఖాళీ లేని చోటికి సైతం నలుగురు టీచర్లను నియమిస్తూ ఉత్తర్వులు ఇవ్వడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. రాజేంద్రనగర్ మండలం బుద్వేల్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడి పోస్టు ఇటీవల భర్తీ అయ్యింది. కానీ తాజా బదిలీ ప్రక్రియలో ఏకంగా నలుగురు టీచర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఖాళీలేని ఘట్కేసర్ మండలం పిర్జాదీగూడ జెడ్పీ పాఠశాల జీహెచ్ఎం పోస్టులో కూడా నలుగురు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం ఈ ఉత్తర్వులు జిల్లా విద్యాశాఖకు అందాయి. ఒకే పోస్టుకు నలుగురు, ఐదురుగు టీచర్లను నియమించడంతో విద్యాశాఖ అధికారులు సైతం తలలు పట్టుకుంటున్నారు. ఆ ఉత్తర్వులు రద్దు చేయాలి: ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రత్యేక ఉత్తర్వులతో బదిలీ అయిన టీచర్లను రిలీవ్ చేయొద్దని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆ ఉత్తర్వులన్నీ రద్దు చేయాలని కోరాయి. జిల్లా స్థాయిలో చేపట్టే బదిలీల కౌన్సెలింగ్ నిబంధనలకు ఈ ఉత్తర్వులు పూర్తి విరుద్ధమని, ఈ తంతును వెంటనే రద్దు చేయకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాణిక్‌రెడ్డి, ఆంజనేయులు, టీయూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కైలాసం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
నేటి నుంచి సర్పంచ్‌లకు శిక్షణ
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: ఇటీవల ఎన్నికైన కొత్త సర్పంచ్‌లకు అన్ని ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 28 నుంచి శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో వచ్చే నెల 28వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఇందుకు జిల్లా పరిషత్ సహకరిస్తుందని డ్వామా పీడీ హరినాథరెడ్డి తెలిపారు. జిల్లాలో మొత్తం సర్పంచ్‌లు 883 మంది కాగా.. స్త్రీలకు, పురుషులకు వేర్వేరుగా శిక్షణ ఇవ్వనున్నారు. పురుషులకు ఆరు బ్యాచ్‌లుగా కర్నూలు శివారులోని డ్వామా శిక్షణ కేంద్రంలో.. మహిళలకు తొమ్మిది బ్యాచ్‌లుగా ఓర్వకల్లులోని సీఎల్ఆర్సీలో శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ఒక్కో బ్యాచ్‌కు మూడు రోజుల పాటు గ్రామ పంచాయతీలకు ఆదాయ వనరులను పెంచడం.. అధికార వికేంద్రీకరణ, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, పారిశుద్ధ్యం, తాగునీరు, ఇంటి పన్నుల మదింపు, ఎన్ఆర్ఈజీఎస్లో పంచాయతీల పాత్ర, తదితర అంశాలపై సమగ్రంగా శిక్షణ ఇవ్వనున్నట్లు డ్వామా పీడీ వెల్లడించారు. షెడ్యుల్ ప్రకారం సర్పంచ్‌లు శిక్షణకు హాజరై చట్టాలు, ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై అవగాహన పెంచుకొని గ్రామాభివృద్ధికి తోడ్పడాలని ఆయన కోరారు. -
బదిలీకి డబ్బు బదిలీ!
సిద్దిపేట అర్బన్, న్యూస్‌లైన్: నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్ శాఖలో సిబ్బందిని డిప్యుటేషన్లకు పంపుతున్నారు. ఇలా చేయడం వల్ల స్థానికంగా సమస్యలు తలెత్తుతున్నాయి. డిప్యుటేషన్‌పై వెళ్లిన ఉద్యోగులు మాత్రం ఎక్కడో విధుల నిర్వహిస్తూ జీతాలు మాత్రం ఇక్కడే పొందుతున్నారు. అయితే వీరికి అవగాహన లేని పనులు చేయిస్తుండడం వల్ల చాలాచోట్ల ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. బదిలీలకు సంబంధించి ఉన్నతాధికారులు ఇచ్చిన మార్గదర్శకాలను పక్కన పెట్టి ట్రాన్స్‌కో జిల్లా అధికారులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని అక్రమ బదిలీలు డివిజన్ పరిధిలో జరిగితే.. మరి కొందరిని ఇతర డివిజన్లకూ బదిలీ చేశారు. వీటిలో చాలావరకు ‘చేతులు తడిపి’ తెచ్చుకున్నవే అని తెలుస్తోంది. ఈ వ్యవహారం మొత్తానికి యూని యన్ నాయకులే ప్రధాన కారణమనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి. ఈ అక్రమ బదిలీలకు సంబంధించి సిద్దిపేటలోని ఈఆర్వోలో పనిచేయాల్సిన శ్రీనివాస్ యూడీసీ, అశోక్ జూనియ ర్ అసిస్టెంట్ ప్రస్తుతం డివిజన్ ఆఫీసులో వి ధులు నిర్వహిస్తున్నారు. సిద్దిపేట డివిజన్ ఆఫీసులో పనిచేయాల్సిన సలీం పాషా ప్రస్తుతం వీఆర్వోలో పనిచేస్తున్నారు. వీరే కాకుండా సిద్దిపేట డివిజన్లో పనిచేయాల్సిన శ్రీనివాస్‌రెడ్డి లైన్ ఇన్స్పెక్టర్ ప్రస్తుతం ఎం ఆర్టీ సిద్దిపేటలో, జేఎల్ఎం బి.శంకరయ్య ప్రస్తుతం ఎంఆర్టీ సిద్దిపేటలో, లైన్‌మన్ గౌస్ ప్రస్తుతం ఎంఆర్టీ సంగారెడ్డిలో, లైన్‌మన్ భూపతిరావు తూప్రాన్‌లో, లైన్ ఇన్స్పెక్టర్ రామచంద్రం జోగిపేటలో, కాంట్రాక్ట్ జేఎల్ఎం శ్రీనివాస్‌రావు ప్రస్తుతం తూప్రాన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. వీరే కాకుండా అక్రమ డిప్యుటేన్లపై జిలాల్లో మొత్తం 33 మంది విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. వీరి డిప్యుటేషన్లను రద్దు చేయాలని 2013 ఫిబ్రవరి 28న సీఎండీ అనిల్‌కుమార్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎస్ఈతో పాటు డీఈలు ఎవరు ఈ ఆదేశాలను పాటించడంలేదన్న ఆరోపణలున్నాయి. నా హయాంలో ఎవరికీ ఇవ్వలేదు ఈ విషయమై సిద్దిపేట డీఈ శ్రీనివాస్‌రెడ్డిని వివరణ కోరగా తాను సిద్దిపేటకు వచ్చినప్పటి నుంచి ఎవరికీ డిప్యుటేషన్లు ఇవ్వలేదని తెలిపా రు. గతంలో ఇచ్చిన వాటిపై తాను జోక్యం చేసుకోనని స్పష్టం చేశారు.