అక్రమ బదిలీలు ఆపకపోతే ఉద్యమం | MLC boddu Nageswara Rao fires on government | Sakshi
Sakshi News home page

అక్రమ బదిలీలు ఆపకపోతే ఉద్యమం

Published Tue, Jun 30 2015 11:39 PM | Last Updated on Sun, Sep 3 2017 4:38 AM

MLC boddu Nageswara Rao fires on government

ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు

 గుంటూరు ఈస్ట్ : ప్రభుత్వం నిర్వహిస్తున్న అక్రమ బదిలీలను ఆపకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు ఉద్యమిస్తారని ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఫ్యాప్టో ఆధ్వర్యంలో అక్రమ బదిలీలను నిలిపివేయాలంటూ ధర్నా నిర్వహించారు. ధర్నాకు ముఖ్య అతిథిగా విచ్చేసిన బొడ్డు నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నో పోరాటాల తరువాత కౌన్సెలింగ్ విధానం అమలులోకి వచ్చిందన్నారు. 1998 నుంచి నేటి వరకు కౌన్సెలింగ్ ద్వారా బదిలీల ప్రక్రియ చక్కగా కొనసాగిందన్నారు. నేడు ప్రభుత్వం కౌన్సెలింగ్ విధానాన్ని నష్టపరిచే విధంగా  బదిలీలు చేస్తోందని విమర్శించారు.

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏఎస్.రామకృష్ణ మాట్లాడుతూ అక్రమ బదిలీల వ్యవహారాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామని, ముఖ్యమంత్రి స్పందించి అక్రమ బదిలీలు జరుగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని వివరించారు. ఫ్యాప్టో కోశాధికారి కరీముల్లారావు మాట్లాడుతూ  బదిలీల షెడ్యూల్ వెంటనే విడుదల చేయాలని, పీఆర్సీని అమలు చేయాలని, హెల్త్ కార్డులు అమలుచేయాలని కోరారు. యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.హనుమంతరావు మాట్లాడుతూ ప్రభుత్వం దొడ్డిదారిన బదిలీలకు తెర తీసిందన్నారు.

కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు నాగమల్లేశ్వరరావు, ఎస్టీయూ నాయకులు బెనహర్‌బాబు, మ రియదాసు, ఏపీటీఎఫ్ నాయకులు చాంద్‌బాషా, నేతాంజనేయప్రసా ద్, ఏపీటీఎఫ్ నాయకులు ఎం.వి.ప్రసాద్, జె.విజయచంద్, డీటీఎఫ్ నాయకులు పి.ప్రసాద్, కె.లూర్ధురెడ్డి, షేక్ అలీం, టి.రవీంద్రబాబు (హెచ్‌ఎంఎస్‌అసోసియేషన్), పి.సాం బయ్య, షేక్ అబ్దుల్ ఖాదర్ (ఆర్‌యూపీపీ), కె.నాగభూషణం, ఎం.నాగేశ్వరరావు (పీఈటీఎస్ అ సోసియేషన్), ఎం.సుబ్బారావు, అస్టాంకాబాబు, (హెచ్‌పీపీటీఏ), శౌరి రాములు, సుశీలకుమారి, టి.వినోద్ (యూటీఎఫ్) పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement