సిద్దిపేట అర్బన్, న్యూస్‌లైన్: నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్ శాఖలో సిబ్బందిని డిప్యుటేషన్లకు పంపుతున్నారు. ఇలా చేయడం వల్ల స్థానికంగా సమస్యలు తలెత్తుతున్నాయి. డిప్యుటేషన్‌పై వెళ్లిన ఉద్యోగులు మాత్రం ఎక్కడో విధుల నిర్వహిస్తూ జీతాలు మాత్రం ఇక్కడే పొందుతున్నారు. అయితే వీరికి అవగాహన లేని పనులు చేయిస్తుండడం వల్ల చాలాచోట్ల ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. బదిలీలకు సంబంధించి ఉన్నతాధికారులు ఇచ్చిన మార్గదర్శకాలను పక్కన పెట్టి ట్రాన్స్‌కో జిల్లా అధికారులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని అక్రమ బదిలీలు డివిజన్ పరిధిలో జరిగితే.. మరి కొందరిని ఇతర డివిజన్లకూ బదిలీ చేశారు.
వీటిలో చాలావరకు ‘చేతులు తడిపి’ తెచ్చుకున్నవే అని తెలుస్తోంది. ఈ వ్యవహారం మొత్తానికి యూని యన్ నాయకులే ప్రధాన కారణమనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి. ఈ అక్రమ బదిలీలకు సంబంధించి సిద్దిపేటలోని ఈఆర్వోలో పనిచేయాల్సిన శ్రీనివాస్ యూడీసీ, అశోక్ జూనియ ర్ అసిస్టెంట్ ప్రస్తుతం డివిజన్ ఆఫీసులో వి ధులు నిర్వహిస్తున్నారు. సిద్దిపేట డివిజన్ ఆఫీసులో పనిచేయాల్సిన సలీం పాషా ప్రస్తుతం వీఆర్వోలో పనిచేస్తున్నారు. వీరే కాకుండా సిద్దిపేట డివిజన్‌లో పనిచేయాల్సిన శ్రీనివాస్‌రెడ్డి లైన్ ఇన్‌స్పెక్టర్ ప్రస్తుతం ఎం ఆర్‌టీ సిద్దిపేటలో, జేఎల్‌ఎం బి.శంకరయ్య ప్రస్తుతం ఎంఆర్‌టీ సిద్దిపేటలో, లైన్‌మన్ గౌస్ ప్రస్తుతం ఎంఆర్‌టీ సంగారెడ్డిలో, లైన్‌మన్ భూపతిరావు తూప్రాన్‌లో, లైన్ ఇన్‌స్పెక్టర్ రామచంద్రం జోగిపేటలో, కాంట్రాక్ట్ జేఎల్‌ఎం శ్రీనివాస్‌రావు ప్రస్తుతం తూప్రాన్‌లో విధులు నిర్వహిస్తున్నారు.
వీరే కాకుండా అక్రమ డిప్యుటేన్లపై జిలాల్లో మొత్తం 33 మంది విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. వీరి డిప్యుటేషన్లను రద్దు చేయాలని 2013 ఫిబ్రవరి 28న సీఎండీ అనిల్‌కుమార్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎస్‌ఈతో పాటు డీఈలు ఎవరు ఈ ఆదేశాలను పాటించడంలేదన్న ఆరోపణలున్నాయి.
నా హయాంలో ఎవరికీ ఇవ్వలేదు
ఈ విషయమై సిద్దిపేట డీఈ శ్రీనివాస్‌రెడ్డిని వివరణ కోరగా తాను సిద్దిపేటకు వచ్చినప్పటి నుంచి ఎవరికీ డిప్యుటేషన్లు ఇవ్వలేదని తెలిపా రు. గతంలో ఇచ్చిన వాటిపై తాను జోక్యం చేసుకోనని స్పష్టం చేశారు.
బదిలీకి డబ్బు బదిలీ!
Published Mon, Nov 25 2013 1:36 AM | Last Updated on Sat, Sep 2 2017 12:57 AM
Advertisement
Advertisement