srinivasareddy
-
సిద్దిపేట బల్దియాకు అవార్డుల పంట
సిద్దిపేటజోన్ : సిద్దిపేట మున్సిపాలిటీ ఆరు అంశాల్లో 2018 స్కోచ్ అవార్డులను కైవసం చేసుకొని ఢిల్లీలో అరుదైన గౌరవం సొంతం చేసుకుంది. శుక్రవారం ఢిల్లీలోని కానిస్ట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా ఆడిటోరియంలో స్కోచ్ గ్రూప్ సీఈఓ గుర్షారాన్ దంజాల్ చేతుల మీదుగా సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి అవార్డులను స్వీకరించారు. గత మూడేళ్లుగా వరుసగా అవార్డులను అందుకున్న సిద్దిపేట బల్దియా ఈ ఏడాది ఏకంగా ఆరు నామినేషన్లలో మెరుగైన ఫలితాలను సాధించి అవార్డులను దక్కించుకుంది. సిద్దిపేట బల్దియా గెలుచుకున్న అవార్డులకు సంబంధించిన అంశాలిలా ఉన్నాయి. 1.ఈ– గవర్నెన్స్ ద్వారా సుస్థిర సేవలు, పరిపాలన అందించండం, 2. స్వచ్ఛ భారత్ మిషన్‌ను పటిష్టంగా అమలు చేసి క్లీన్ సిటీగా మార్చడంలో కృషి చేసినందుకు రజిత స్కోచ్ అవార్డులు పొందింది. 3. సుస్థిరమైన పట్టణం (సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని ప్రజలకు సత్వర సేవలు అందించడం), 4. స్థిరమైన అమృత్ పట్టణ నగరీకరణ, 5. స్థిరమైన పర్యావరణ పరిరక్షణ, సమతుల్యత పాటించడం. 6. సమర్థవంతమైన పాలన, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం లాంటి విభాగాల్లో సిద్దిపేట రజిత స్కోచ్ అవార్డులను అందుకుంది. ఒకే ఏడాదిలో ఆరు స్కోచ్ అవార్డులను కైవసం చేసుకున్న పట్టణంగా సిద్దిపేట చరిత్ర సృష్టించింది. -
మధురమైన సమయం!
అవును... ఎన్టీఆర్ సినిమాలో తాను నటించడాన్ని మధురమైన టైమ్‌గా ఫీల్ అవుతున్నారు శ్రీనివాసరెడ్డి. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా హారికా హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న సినిమా ‘అరవింద సమేత వీరరాఘవ’. ఈ సినిమాలో హాస్య నటుడిగా శ్రీనివాసరెడ్డి నటిస్తున్నారు. ఈ చిత్రం లొకేషన్లో ఎన్టీఆర్, త్రివిక్రమ్‌లతో కలిసి దిగిన ఫొటోను శ్రీనివాసరెడ్డి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘మధురం మధురం ఈ సమయం’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. సో.. ఎన్టీఆర్‌కు, శ్రీనివాసరెడ్డికి మధ్య ఏవో చిన్నపాటి మనస్పర్థలు ఉన్నాయన్న పుకార్లకు ఈ ఫొటో ఫుల్స్టాప్ పెట్టింది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను ఈ ఏడాది దసరాకు రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
ఏ3లో జాయిన్!
హాస్యనటుడిగా కొనసాగుతూనే, అవకాశం కుదిరినప్పుడు హీరోగా కెరీర్‌ను పెంచుకుంటున్నారు శ్రీనివాసరెడ్డి. తాజాగా ఆయన ‘ఏ3’ సినిమా షూటింగ్లో జాయిన్ అయ్యారు. హీరోగా కాదు. హాస్యనటునిగానే. ఇంతకీ..‘ఏ3’ అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి. శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ హీరోగా రూపొందుతున్న ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమానే ‘ఏ3’ అన్నమాట. ఈ సినిమా షూటింగ్‌లోనే జాయిన్ అయ్యారు నటుడు శ్రీనివాసరెడ్డి. ఆల్రెడీ ఈ సినిమాలో రఘుబాబు, ‘వెన్నెల’ కిశోర్ కూడా హాస్య పాత్రలు చేస్తున్నారు. ‘‘ఏ3’ సినిమా షూటింగ్లో పాల్గొన్నాను. ఫస్ట్ డే డైరెక్టర్ శ్రీను వైట్ల, ‘వెన్నెల’ కిశోర్, రఘుబాబులతో’’ అంటూ ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అన్నట్లు.. ఇంకోమాట. శ్రీనివాసరెడ్డి హీరోగా జేబీ మురళీ దర్శకత్వంలో రూపొందిన ‘జంబలకిడిపంబ’ సినిమా జూన్ 14న రిలీజ్ కానుంది. -
నవ్వుల ప్రయాణం
శ్రీనివాసరెడ్డి, సిద్ధి ఇద్నాని జంటగా రూపొందిన చిత్రం‘జంబలకిడి పంబ’. జె.బి. మురళీకృష్ణ దర్శకత్వంలో రవి, జోజో జోస్, శ్రీనివాసరెడ్డి ఎన్. నిర్మించిన ఈ సినిమా జూన్ 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘మా బ్యానర్లో రూపొందిన ‘జంబలకిడి పంబ’ సినిమాతో ప్రేక్షకులు మరోసారి లాఫింగ్ రైడ్ చేయనున్నారు. సినిమా అవుట్‌పుట్ చాలా బాగా వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి జూన్ 14న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘ఈవీవీగారు తెరకెక్కించిన ‘జంబలకిడి పంబ’ చిత్రాన్ని ప్రేక్షకులు ఇప్పటికీ మరచిపోలేదంటే కారణం అందులోని కామెడీయే. మరోసారి కడుపుబ్బా నవ్వించే వినోదంతో అదే టైటిల్‌తో మేం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం. బాడీ స్వాపింగ్ అనే కాన్సెప్ట్ వల్ల హీరో, హీరోయిన్స్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారన్నదే కథ. ప్రేక్షకులను ఆద్యంతం నవ్విస్తుంది. గోపీసుందర్ ఐదు అద్భుతమైన పాటలు అందించారు’’ అన్నారు జె.బి.మురళీకృష్ణ. ఈ సినిమాకి కెమెరా: సతీశ్ ముత్యాల, సహ నిర్మాత: బి.సురేశ్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్: సంతోష్. -
తెలంగాణ యాస వచ్చేసింది – అనసూయ
శ్రీనివాసరెడ్డి, అనసూయ, టిల్లు వేణు ముఖ్యతారలుగా శ్రీధర్‌రెడ్డి యార్వా దర్శకత్వంలో దీపక్ ముఖుత్, ఎన్.ఎం. షాషా నిర్మిస్తున్న సినిమా ‘సచ్చిందిరా... గొర్రె’. ప్రస్తుతం మూడో షెడ్యూల్ జరుగుతోంది. ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ–‘‘ఇష్టపడి, కష్టపడి చేసిన చిత్రమిది. నేను నల్గొండ అమ్మాయినే. కాకపోతే.. హైదరాబాద్‌లో పెరగడం వల్ల ఇక్కడి మాటతీరు వచ్చింది. అయితే.. ఈ సినిమా సెట్స్‌లోకి వెళ్లగానే తెలంగాణ యాస వచ్చేసింది’’ అన్నారు. ‘‘విభిన్న పాత్రలతో వినోదాత్మకంగా సాగే చిత్రమిది’’ అన్నారు శ్రీనివాస రెడ్డి. ‘‘నాలుగేళ్ల క్రితం శ్రీనివాసరెడ్డికి కథ చెప్పా. విభిన్నమైన కథ. తెరపై చూస్తుంటే అందమైన అనుభవంలా ఉంటుంది’’ అన్నారు శ్రీధర్‌రెడ్డి. ‘‘కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాలను నిర్మించాలని వచ్చాం. ఈ సినిమా 50 శాతం పూర్తయింది. డిసెంబర్‌కి మొత్తం పూర్తి చేయాలనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాతలు. నటులు తాగుబోతు రమేష్, టిల్లు వేణు, కాసర్ల శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. -
వెంకన్న దర్శనానికి వెళుతూ..
నలుగురు హైదరాబాదీల దుర్మరణం చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం హైదరాబాద్: అప్పు తీసుకుని తప్పించుకు తిరుగుతున్న వ్యక్తిని పట్టుకుని... అటునుంచి వెంకన్న దర్శనం చేసుకుందామని తిరుపతికి బయలుదేరిన నలుగురు నగరవాసులు తిరిగిరాని లోకాలకు వెళ్లారు. చిత్తూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. హైదరాబాద్ మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్‌కు చెందిన స్నేహితులు హన్మంతరెడ్డి(40), శ్రీనివాస్‌రెడ్డి (35), కిషన్‌రెడ్డి (38) వివిధ జిల్లాల నుంచి వచ్చి నగరంలో స్థిరపడ్డారు. వీరంతా వేర్వేరు పరిశ్రమల్లో పనిచేస్తూ చిన్నపాటి ఫైనాన్స్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఇదే ప్రాంతానికి చెందిన స్నేహితులు తిరుపాల్‌రెడ్డి(38), ప్రేమ్‌సుందర్‌రెడ్డి(42) ఎల్అండ్టీలో పనిచేస్తున్నారు. మరొకరి పరిస్థితి విషమం... కాగా, బుధవారం రాత్రి స్థానికంగా ఓ నిశ్చితార్థ కార్యక్రమానికి హాజరైన వీరు... 7.30 ప్రాంతంలో తిరుపతికి బయలుదేరారు. వీరి వద్ద రూ.10 లక్షల అప్పుతీసుకున్న తిరుపతికి చెందిన వ్యక్తి తప్పించుకు తిరుగుతున్నాడు. ఆచూకీ లభించడంతో అతడి నుంచి బాకీ వసూలు చేసుకుని, అనంతరం తిరుమల వెంకన్న దర్శనం కూడా చేసుకుందామని తిరుపతికి కారులో పయనమయ్యారు. కాగా, గురువారం ఉదయం తిరుపతి–శ్రీకాళహస్తి ప్రధాన రహదారిలో రేణిగుంట మండలం వెదుళ్లచెరువు వద్ద వేగంగా వచ్చిన ఓ లారీ వీరి కారును ఢీకొట్టింది. కారు నుజ్జునుజ్జయింది. ఐదుగురిలో శ్రీనివాస్‌రెడ్డి, కిషన్‌రెడ్డి, ప్రేమ్‌సుందర్‌రెడ్డి అక్కడికక్కడే మృతిచెందారు. తిరుపాల్‌రెడ్డి చికిత్స పొందుతూ మరణించాడు. హన్మంతరెడ్డి తిరుపతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి. కాగా పాకాల మండలంలోని పెరుమాళ్లగుడి పల్లి వద్ద గురువారం ఉదయం ట్యాంకరు ట్రాలీ బోల్తా పడిన మరో ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. వీరు కుక్కలపల్లి హరిజనవాడకు చెందిన సుబ్బరాయలు(54), మధుసూధన్(34). -
'ఆత్మహత్యలు వద్దు.. ప్రభుత్వం మీతోనే'
-
కార్లు చోరీ చేస్తున్న వ్యక్తి అరెస్టు
ఎ.ఎస్‌పేట(నెల్లూరు): నెల్లూరు జిల్లాలో కార్ల దొంగను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని ఎ.ఎస్‌పేట మండలంలో సోమవారం సాయంత్రం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. గుంటూరు జిల్లా చుండూరు మండల కేంద్రానికి చెందిన శ్రీనివాసరెడ్డి, పలు రాష్ట్రాల్లో కార్లు చోరీ చేశాడు. అయితే నిందితుడుని పోలీసులు నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో అదపులోకి తీసుకున్నారు. నిందితుడిని నుంచి రెండు కార్లు స్వాధీనం చేసుకుని ఆత్మకూరు కోర్టులో ప్రవేశపెట్టారు. -
ఆర్డీవో ఘెరావ్
సూర్యాపేట: అకాల వర్షాలకు పంటలను నష్టపోయిన రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో నల్లగొండ జిల్లా సూర్యాపేట పట్టణంలో ఆర్డీవో శ్రీనివాసరెడ్డిని కార్యాలయంలోకి వెళ్లనీయకుండా రైతులు బుధవారం అడ్డుకున్నారు. వర్షాలకు పంటలు దెబ్బతిని రెండు రోజులు దాటిపోతున్నా పంట నష్టంపై పరిశీలన జరిపి ప్రభుత్వానికి నివేదిక పంపకపోవడంపై రైతులు ఆర్డీవో శ్రీనివాసరెడ్డిని నిలదీశారు. దీంతో పంట నష్టంపై తక్షణమే పరిశీలన చేయించి ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామని బాధిత రైతులకు ఆర్డీవో హామీ ఇచ్చినట్టు సమాచారం. -
నిర్లక్ష్యంతోనే రోడ్డు ప్రమాదాలు
కరీంనగర్‌అర్బన్, న్యూస్‌లైన్ : నిర్లక్ష్యంతోనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని డీటీసీ మీరాప్రసాద్ అన్నారు. జిల్లాలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలతో చనిపోతున్నారని, వాహనదారులు, డ్రైవర్లు రహదారి నియమాలు పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చని డీటీసీ పేర్కొన్నారు. రవాణాశాఖ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన 25వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఆర్ట్స్ కళాశాల, తెలంగాణ చౌక్, బస్టాండ్ మీదుగా కళాభారతి వరకు ర్యాలీ తీశారు. మద్యం తాగి, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం వంటివి చేయవద్దని సూచించారు. సీనియర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, వేణు, కిషన్‌రావు, లింగమూర్తి, ఏఎంవీఐలు కవిత, చంద్రశేఖర్, యుగేశ్‌సింగ్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. -
హ్యాట్రిక్ సినిమా!
నితిన్‌తో శ్రేష్ట్ మూవీస్ తీసిన తొలి సినిమా ‘ఇష్క్’... పెద్ద హిట్టు. ఆ తర్వాత వచ్చిన ‘గుండె జారి గల్లంతయ్యిందే’... ఇంకా పెద్ద హిట్టు. ఇప్పుడు ఇదే కాంబినేషన్లో మూడో సినిమా రాబోతోంది. సురేందర్‌రెడ్డి శిష్యుడు శ్రీనివాస్‌రెడ్డి దర్శకునిగా పరిచయం కాబోతున్నారు. నిర్మాత నిఖితారెడ్డి మాట్లాడుతూ -‘‘మంచి కథ కుదిరింది. నితిన్‌తో కచ్చితంగా హ్యాట్రిక్ సాధిస్తాం. ఫిబ్రవరిలో చిత్రీకరణ మొదలవుతుంది’’ అని చెప్పారు. -
బెల్ట్‌షాప్ నిర్వాహకులపై కేసు నమోదు
దౌల్తాబాద్, న్యూస్‌లైన్: దౌల్తాబాద్ మండలం లింగారెడ్డిపల్లి గ్రామంలో బెల్ట్‌షాప్‌లు నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. గ్రామానికి చెందిన చుంచనకోట నర్సాగౌడ్, కీసర అంజాగౌడ్లు వారి హోటళ్లలో మద్యం విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో సోమవారం రాత్రి దాడి చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఆయా హోటళ్లలో మద్యం బాటిళ్లు లభించగా, వాటిని స్వాధీనం చేసుకుని హోటళ్ల యజమానులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
రసాయనాల ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం
మేడ్చల్/మేడ్చల్ రూరల్, న్యూస్‌లైన్: మేడ్చల్ పారిశ్రామిక వాడలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో శనివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రూ. కోటికి పైగా ఆస్తి నష్టం జరిగింది. కంపెనీ యాజమాన్యం, మేడ్చల్ పోలీసుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మేడ్చల్ పారిశ్రామికవాడలోని ఎస్కిటోన్స్ రసాయనాల కంపెనీలో శనివారం రాత్రి ఏడు గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన కార్మికులు వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. నగరంలోని జీడిమెట్ల, సనత్‌నగర్, ప్యారాడైజ్ ప్రాంతాల నుంచి ఫైరింజన్లు వచ్చాయి. అప్పటికే కంపెనీలో ఉన్న రసాయన పదార్ధాలు, తయారీకి వినియోగించే సాల్వెంట్ రియాక్టర్లు పేలిపోయాయి. ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాదంలో రూ. కోటికి పైగా ఆస్తినష్టం జరిగిందని కంపెనీ యాజమాన్యం తెలిపింది. కాగా రసాయనాలను కలిపే సమయంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి పేట్ బషీరాబాద్ ఏసీపీ శ్రీనివాస్‌రావు, పరిశ్రమల శాఖా ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, మేడ్చల్ సీఐ రాంరెడ్డిలు చేరుకొని పరిస్థితిని సమీక్షిచారు. -
బడా నేతల భూములకు సర్కారు నిధులతో రోడ్డు
శంషాబాద్ రూరల్, న్యూస్‌లైన్: చిత్రంలో కనిపిస్తున్న దారి కోసం అధికారులు రూ. 40 లక్షలతో పనులు చేపట్టారు.. ఇందులో విశేషం ఏముంది అనుకుంటున్నారా..? కేవలం నాలుగు ఇళ్లు ఉండి స్థానికంగా ఒక్కరు కూడా నివాసంలేని గ్రామం కోసం రోడ్డు వేస్తున్నారు.. పోనీ ఎవరైనా రోడ్డు కోసం అడిగారా అంటే అదీ లేదు.. పనులు చేపట్టిన శాఖ నుంచి కూడా ఎలాంటి ప్రతిపాదనలు పంపలేదు.. మరి నిధులు ఎలా మంజూరయ్యాయంటే ప్రభుత్వం నుంచి వచ్చాయి అంటూ అధికారుల నుంచి సమాధానం.. అసలు సంగతి ఏమిటంటే.. రోడ్డుకు ఇరువైపులా బడానాయకుల భూములున్నాయి.. ఇంకేముంది వారు తమ పరపతిని ఉపయోగించి నిధులు మంజూరు చేయించుకున్నారు.. చిన్న, సన్నకారు రైతుల పొలాల్లోంచి రోడ్డు ఏర్పాటు చేస్తుండడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. మండలంలోని కవ్వగూడ రోడ్డు నుంచి కొత్వాల్‌గూడ వరకు రోడ్డు ఫార్మేషన్ కోసం పంచాయతీ రాజ్ శాఖ నుంచి జిల్లా పరిషత్ అధికారులు రూ.40 లక్షలు మంజూరు చేశారు. ఈ రోడ్డును మర్లగూడ నుంచి ఏర్పాటు చేస్తున్నారు. కవ్వగూడ అనుబంధంగా ఉన్న మర్లగూడలో కేవలం నాలుగు ఇళ్లు ఉన్నాయి. ఇందులో రెండు ఇళ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. అక్కడ కొన్నేళ్లుగా ఒక్కరు కూడా నివసించడంలేదు. ఈ గ్రామం మీదుగా కొత్వాల్‌గూడ వరకు 4.5 కి.మీ. దూరం మేరకు ఫార్మేషన్ రోడ్డు ఏర్పాటు చేస్తున్నారు. రోడ్డు మధ్యలో ఓ చోట కల్వర్టు కూడా నిర్మించనున్నారు. ఆగస్ట్‌లో నిధులు మంజూరు కాగా వారం రోజులుగా పనులు కొనసాగుతున్నాయి. రైతుల ఆందోళన.. రోడ్డుకిరువైపలా సన్న, చిన్నకారు రైతులు పంటల సాగుతో ఉపాధి పొందుతున్నారు. అధికారులు రోడ్డును 22 అడుగుల వెడల్పుతో ఇరుపక్కలా ఉన్న పొలాల్లోంచి రోడ్లు వేస్తున్నారు. రైతులకు ముందస్తు సమాచారం గానీ, వారి నుంచి అనుమతి గానీ లేకుండానే పనులు మొదలుపెట్టారు. అడ్డు చెబితే మధ్యవర్తుల ద్వారా రైతులను బెదిరించి దారికి తెచ్చుకుంటున్నారు. ఉన్న కొద్ది పాటి పొలం రోడ్డులో పోతే తమకు జరిగే నష్టాన్ని ఎవరు భరిస్తారని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ దారి వెంట కొంతమంది బడా నేతల భూములు ఉండడంతో వారి కోసమే రోడ్డు వేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ దారి పనులను అధికారులు సైతం ఆగమేఘాల మీద కొనసాగిస్తున్నారు. కవ్వగూడ దారి నుంచి మర్లగూడ వరకు ఫార్మేషన్ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఇక్కడి నుంచి కొత్వాల్‌గూడ వరకు రోడ్డు వేయడానికి రైతులు అభ్యంతరాలు తెలుపుతుండడంతో మధ్యవర్తులు చర్చలు జరుపుతున్నారు. గతంలో వేసిన రోడ్డు ఏమైంది.. సుమారు పదేళ్ల కిందట కవ్వగూడ రోడ్డు నుంచి మర్లగూడ వరకు ఫార్మేషన్ పనులు చేశారు. సుమారు రెండు కిలో మీటర్ల దూర వరకు కంకర కూడా వేశారు. ఈ పనులు ఏ నిధులతో చేపట్టారో అధికారుల వద్ద సమాధానం లేదు. ఒకసారి ఫార్మేషన్ చేసిన రోడ్డుకు మరోసారి ఫార్మేషన్ పేరుతో నిధులు మంజూరు చేయడం పట్ల స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యాలు లేక అవస్థలు పడుతుంటే ఇక్కడ బడా బాబుల భూములకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా కవ్వగూడ దారి నుంచి కొద్ది దూరం వరకు పట్టా భూమిలో గతంలో వేసిన కంకర రోడ్డును కాదని మరో పక్క నుంచి కొత్తగా ఫార్మేషన్ పనులు చేపట్టంపై విమర్శలు వినిపిస్తున్నాయి. రైతులు వద్దంటే పనులు ఆపేస్తాం: శ్రీనివాస్‌రెడ్డి, డీఈ, పంచాయతీరాజ్ శాఖ రోడ్డు ఏర్పాటుకు కావాల్సిన స్థలం కోసం పంచాయతీ రాజ్ శాఖ నుంచి రైతులకు ఎలాంటి నష్ట పరిహారం ఇవ్వడం కుదరదని డీఈ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రైతులు అభ్యంతరం చెబితే పనులు ఆపేస్తామన్నారు. గతంలో జరిగిన పనుల వివరాలు తమ వద్ద లేవన్నారు. గతంలో ఉన్న రోడ్డు తక్కువ ఎత్తులో ఉండడంతో ఫార్మేషన్ పనులు మళ్లీ చేపట్టినట్లు ఆయన తెలిపారు. -
బదిలీకి డబ్బు బదిలీ!
సిద్దిపేట అర్బన్, న్యూస్‌లైన్: నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్ శాఖలో సిబ్బందిని డిప్యుటేషన్లకు పంపుతున్నారు. ఇలా చేయడం వల్ల స్థానికంగా సమస్యలు తలెత్తుతున్నాయి. డిప్యుటేషన్‌పై వెళ్లిన ఉద్యోగులు మాత్రం ఎక్కడో విధుల నిర్వహిస్తూ జీతాలు మాత్రం ఇక్కడే పొందుతున్నారు. అయితే వీరికి అవగాహన లేని పనులు చేయిస్తుండడం వల్ల చాలాచోట్ల ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. బదిలీలకు సంబంధించి ఉన్నతాధికారులు ఇచ్చిన మార్గదర్శకాలను పక్కన పెట్టి ట్రాన్స్‌కో జిల్లా అధికారులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని అక్రమ బదిలీలు డివిజన్ పరిధిలో జరిగితే.. మరి కొందరిని ఇతర డివిజన్లకూ బదిలీ చేశారు. వీటిలో చాలావరకు ‘చేతులు తడిపి’ తెచ్చుకున్నవే అని తెలుస్తోంది. ఈ వ్యవహారం మొత్తానికి యూని యన్ నాయకులే ప్రధాన కారణమనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి. ఈ అక్రమ బదిలీలకు సంబంధించి సిద్దిపేటలోని ఈఆర్వోలో పనిచేయాల్సిన శ్రీనివాస్ యూడీసీ, అశోక్ జూనియ ర్ అసిస్టెంట్ ప్రస్తుతం డివిజన్ ఆఫీసులో వి ధులు నిర్వహిస్తున్నారు. సిద్దిపేట డివిజన్ ఆఫీసులో పనిచేయాల్సిన సలీం పాషా ప్రస్తుతం వీఆర్వోలో పనిచేస్తున్నారు. వీరే కాకుండా సిద్దిపేట డివిజన్లో పనిచేయాల్సిన శ్రీనివాస్‌రెడ్డి లైన్ ఇన్స్పెక్టర్ ప్రస్తుతం ఎం ఆర్టీ సిద్దిపేటలో, జేఎల్ఎం బి.శంకరయ్య ప్రస్తుతం ఎంఆర్టీ సిద్దిపేటలో, లైన్‌మన్ గౌస్ ప్రస్తుతం ఎంఆర్టీ సంగారెడ్డిలో, లైన్‌మన్ భూపతిరావు తూప్రాన్‌లో, లైన్ ఇన్స్పెక్టర్ రామచంద్రం జోగిపేటలో, కాంట్రాక్ట్ జేఎల్ఎం శ్రీనివాస్‌రావు ప్రస్తుతం తూప్రాన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. వీరే కాకుండా అక్రమ డిప్యుటేన్లపై జిలాల్లో మొత్తం 33 మంది విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. వీరి డిప్యుటేషన్లను రద్దు చేయాలని 2013 ఫిబ్రవరి 28న సీఎండీ అనిల్‌కుమార్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎస్ఈతో పాటు డీఈలు ఎవరు ఈ ఆదేశాలను పాటించడంలేదన్న ఆరోపణలున్నాయి. నా హయాంలో ఎవరికీ ఇవ్వలేదు ఈ విషయమై సిద్దిపేట డీఈ శ్రీనివాస్‌రెడ్డిని వివరణ కోరగా తాను సిద్దిపేటకు వచ్చినప్పటి నుంచి ఎవరికీ డిప్యుటేషన్లు ఇవ్వలేదని తెలిపా రు. గతంలో ఇచ్చిన వాటిపై తాను జోక్యం చేసుకోనని స్పష్టం చేశారు.