అనావృష్టితోనే తెలంగాణలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. దీంతోపాటు గత పాలకుల తీరు వల్ల ఏర్పడిన అస్తవ్యస్త పరిస్థితులు కూడా వారి ఆత్మహత్యలకు కారణమైందని చెప్పారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన అనంతరం రైతుల ఆత్మహత్యలపైనే ప్రధానంగా చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో మంత్రి పోచారం మాట్లాడారు. సాధారణ రుతుపవనాల ఆగమనం 2015 జూన్ 13నే ప్రారంభమవడంతో దాదాపు అన్ని జిల్లాల్లో వర్షాధార పంటలు వేశారని చెప్పారు.