ఎ.ఎస్‌పేట(నెల్లూరు): నెల్లూరు జిల్లాలో కార్ల దొంగను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని ఎ.ఎస్‌పేట మండలంలో సోమవారం సాయంత్రం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. గుంటూరు జిల్లా చుండూరు మండల కేంద్రానికి చెందిన శ్రీనివాసరెడ్డి, పలు రాష్ట్రాల్లో కార్లు చోరీ చేశాడు. అయితే నిందితుడుని పోలీసులు నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో అదపులోకి తీసుకున్నారు. నిందితుడిని నుంచి రెండు కార్లు స్వాధీనం చేసుకుని ఆత్మకూరు కోర్టులో ప్రవేశపెట్టారు.