
శ్రీనివాసరెడ్డి, ‘వెన్నెల’ కిశోర్, శ్రీను వైట్ల, రఘుబాబు
హాస్యనటుడిగా కొనసాగుతూనే, అవకాశం కుదిరినప్పుడు హీరోగా కెరీర్‌ను పెంచుకుంటున్నారు శ్రీనివాసరెడ్డి. తాజాగా ఆయన ‘ఏ3’ సినిమా షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. హీరోగా కాదు. హాస్యనటునిగానే. ఇంతకీ..‘ఏ3’ అంటే కన్‌ఫ్యూజ్ అవ్వకండి. శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ హీరోగా రూపొందుతున్న ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమానే ‘ఏ3’ అన్నమాట. ఈ సినిమా షూటింగ్‌లోనే జాయిన్ అయ్యారు నటుడు శ్రీనివాసరెడ్డి. ఆల్రెడీ ఈ సినిమాలో రఘుబాబు, ‘వెన్నెల’ కిశోర్ కూడా హాస్య పాత్రలు చేస్తున్నారు. ‘‘ఏ3’ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నాను. ఫస్ట్ డే డైరెక్టర్ శ్రీను వైట్ల, ‘వెన్నెల’ కిశోర్, రఘుబాబులతో’’ అంటూ ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అన్నట్లు.. ఇంకోమాట. శ్రీనివాసరెడ్డి హీరోగా జేబీ మురళీ దర్శకత్వంలో రూపొందిన ‘జంబలకిడిపంబ’ సినిమా జూన్ 14న రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment