మధురమైన సమయం! | About Junior NTR and Srinivas Reddy | Sakshi
Sakshi News home page

మధురమైన సమయం!

Published Sun, Jun 10 2018 6:14 AM | Last Updated on Thu, Aug 22 2019 9:35 AM

About Junior NTR and Srinivas Reddy - Sakshi

త్రివిక్రమ్, శ్రీనివాసరెడ్డి, ఎన్టీఆర్‌

అవును... ఎన్టీఆర్‌ సినిమాలో తాను నటించడాన్ని మధురమైన టైమ్‌గా ఫీల్‌ అవుతున్నారు శ్రీనివాసరెడ్డి. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా హారికా హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌. రాధాకృష్ణ నిర్మిస్తున్న సినిమా ‘అరవింద సమేత వీరరాఘవ’. ఈ సినిమాలో హాస్య నటుడిగా శ్రీనివాసరెడ్డి నటిస్తున్నారు. ఈ చిత్రం లొకేషన్‌లో ఎన్టీఆర్, త్రివిక్రమ్‌లతో కలిసి దిగిన ఫొటోను శ్రీనివాసరెడ్డి ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ‘మధురం మధురం ఈ సమయం’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు. సో.. ఎన్టీఆర్‌కు, శ్రీనివాసరెడ్డికి మధ్య ఏవో చిన్నపాటి మనస్పర్థలు ఉన్నాయన్న పుకార్లకు ఈ ఫొటో ఫుల్‌స్టాప్‌ పెట్టింది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను ఈ ఏడాది దసరాకు రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement