
శ్రీనివాసరెడ్డి, సిద్ధి ఇద్నాని జంటగా రూపొందిన చిత్రం‘జంబలకిడి పంబ’. జె.బి. మురళీకృష్ణ దర్శకత్వంలో రవి, జోజో జోస్, శ్రీనివాసరెడ్డి ఎన్. నిర్మించిన ఈ సినిమా జూన్ 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘మా బ్యానర్‌లో రూపొందిన ‘జంబలకిడి పంబ’ సినిమాతో ప్రేక్షకులు మరోసారి లాఫింగ్ రైడ్ చేయనున్నారు. సినిమా అవుట్‌పుట్ చాలా బాగా వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి.
అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి జూన్ 14న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘ఈవీవీగారు తెరకెక్కించిన ‘జంబలకిడి పంబ’ చిత్రాన్ని ప్రేక్షకులు ఇప్పటికీ మరచిపోలేదంటే కారణం అందులోని కామెడీయే. మరోసారి కడుపుబ్బా నవ్వించే వినోదంతో అదే టైటిల్‌తో మేం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం. బాడీ స్వాపింగ్ అనే కాన్సెప్ట్ వల్ల హీరో, హీరోయిన్స్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారన్నదే కథ. ప్రేక్షకులను ఆద్యంతం నవ్విస్తుంది. గోపీసుందర్ ఐదు అద్భుతమైన పాటలు అందించారు’’ అన్నారు జె.బి.మురళీకృష్ణ. ఈ సినిమాకి కెమెరా: సతీశ్ ముత్యాల, సహ నిర్మాత: బి.సురేశ్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్: సంతోష్.
Comments
Please login to add a commentAdd a comment