రబీ ఆలస్యమవుతున్న దృష్ట్యా తెలంగాణ సూత్రప్రాయ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గింది. ప్రాజెక్టుల నీటి కేటాయింపులపై కృష్ణా బోర్డు స్పష్టత ఇవ్వకపోవడంతో రబీ పంటల సాగు ఆలస్యమవుతుండటం, రైతుల నుంచి నీటి విడుదల డిమాండ్ పెరుగుతున్న దృష్ట్యా బోర్డు సూచించిన నిర్ణయానికి కట్టుబడాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు 43 టీఎంసీలు తీసుకునేందుకు బోర్డుకు తన సమ్మతి తెలియజేసినట్లుగా సమాచారం. కాగా, తమకు కేటాయించిన 87 టీఎంసీలు సరిపోవని, 103 టీఎంసీలు కేటాయించాలని బుధవారం బోర్టుకు ఏపీ స్పష్టం చేసినట్లుగా తెలిసింది.
ఇటీవల పట్టిసీమ వినియోగ లెక్కలు, మైనర్ కింద వినియోగ లెక్కలను పక్కనబెడుతూ 130 టీఎంసీల లభ్యత జలాల్లో తెలంగాణకు 43, ఏపీకి 87 టీఎంసీలు కేటాయిస్తూ బోర్డు ప్రతిపాదించింది. దీన్ని వ్యతిరేకిస్తూ వచ్చిన తెలంగాణ, ప్రస్తుతం గత్యంతరం లేని పరిస్థితుల్లో 43 టీఎంసీలు తీసుకోవాలని, ఇంకా అవసరమైతే గవర్నర్ సమక్షంలో చర్చించి నిర్ణయానికి రావాలని యోచిస్తోంది.
ఇప్పటికి 43 టీఎంసీలతో సర్దుకుందాం!
Published Thu, Dec 15 2016 1:20 AM | Last Updated on Mon, Sep 4 2017 10:44 PM
Advertisement
Advertisement