sugar cane farmers
-
స్పెక్ట్రమ్ వేలానికి కేంద్ర కేబినెట్ ఓకే
న్యూఢిల్లీ, సాక్షి: వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సమావేశమైన కేంద్ర కేబినెట్ తాజాగా పలు నిర్ణయాలు తీసుకుంది. వ్యవసాయం, టెలికం, విద్యుత్ రంగాలకు సంబంధించిన నిర్ణయాలను ప్రకటించింది. కొద్ది రోజులుగా రైతుల ఆందోళనలు ఉధృతమైన నేపథ్యంలో 60 లక్షల టన్నుల చక్కెర ఎగుమతుల సబ్సిడీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తద్వారా ఐదు కోట్లమంది రైతులు, ఐదు లక్షల కార్మికులకు ప్రయోజనం చేకూర్చనున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ పేర్కొన్నారు. సొమ్మును రైతుల ఖాతాలో నేరుగా జమ చేయనున్నట్లు తెలియజేశారు. గత రెండు, మూడేళ్లుగా చక్కెర ఉత్పత్తి మిగులుకు చేరుకున్నందున ధరలు దిగివచ్చినట్లు తెలియజేశారు. ఈ సీజన్(2020-21 అక్టోబర్- సెప్టెంబర్)లో రూ. 3,600 కోట్ల సబ్సిడీలను ప్రతిపాదించినట్లు తెలియజేశారు. (4 నెలల్లో 4 బిలియన్ డాలర్ల దానం) స్పెక్ట్రమ్ వేలం 2016 తదుపరి స్పెక్ట్రమ్ వేలానికి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర ఐటీ, సమాచార శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. 700 ఎంహెచ్‌జెడ్ మొదలు, 800, 900, 2100, 2300, 2500 ఎంహెజెడ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ల స్పెక్ట్రమ్ వేలానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలియజేశారు. 20ఏళ్ల గడువుతో వేలం నిర్వహించనున్నట్లు చెప్పారు. మొత్తం 2,251కుపైగా ఎంహెచ్‌జెడ్ రేడియో తరంగాలను విక్రయానికి ఉంచనున్నట్లు తెలియజేశారు. తద్వారా రూ. 3.92 లక్షల కోట్లకుపైగా లభించవచ్చని అంచనా వేశారు. 2021 మార్చిలో వేలాన్ని చేపట్టే వీలున్నట్లు వెల్లడించారు. వేలం విజేతలు ఒకేసారి లేదా విడతల వారీగా చెల్లింపులు చేపట్టవచ్చని తెలియజేశారు. 5జీ ఇలా టెలికం నియంత్రణ సంస్థ(ట్రాయ్) 5జీ సర్వీసులకు 300 ఎంహెచ్‌జెడ్‌ను ఎంపిక చేసింది. అయితే రక్షణ శాఖ 125 ఎంహెచ్‌జెడ్‌ను వినియోగించుకోనుంది. దీంతో 175 ఎంహెచ్‌జెడ్ స్పెక్ట్రమ్ మాత్రమే అందుబాటులో ఉండవచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కాగా.. దేశవ్యాప్త ప్రాతిపదికన ట్రాయ్ 3300-3600 ఎంహెచ్‌జెడ్ బ్యాండ్‌లో ఒక్కో ఎంహెచ్‌జెడ్‌కుగాను రూ. 492 కోట్లను బేస్ ధరగా సూచించినట్లు తెలుస్తోంది. దీంతో 100 ఎంహెచ్‌జెడ్ 5జీ వేవ్స్‌కుగాను రూ. 50,000 కోట్లు లభించవచ్చని అంచనా. -
నల్లబెల్లం.. ఆశలు పదిలం
రాష్ట్రంలోనే చెరకును అత్యధికంగా సాగు చేసే జిల్లా చిత్తూరు. లక్షలాది మంది రైతులకు ఈ పంటే ప్రధాన జీవనాధారం. చెరకు సాగుతో పాటు స్వంతంగా నల్లబెల్లం తయారు చేయడం ఇక్కడి రైతుల ప్రత్యేకత. ఇక చంద్రబాబు హయాంలో కనీస ప్రోత్సాహం లేక షుగర్ ఫ్యాక్టరీలు పూర్తిగా మూతబడ్డాయి. ఫలితంగా నల్లబెల్లం తయారు చేయడం జిల్లా రైతులకు తప్పనిసరిగా మారింది. అయితే బెల్లం తయారీపై తెలుగుదేశం ప్రభుత్వం భారీగా ఆంక్షలు విధించడంతో రైతులు బతుకులు చేదెక్కాయి. ఈ సమయంలో ప్రజా సంకల్పయాత్రలో భాగంగా జిల్లాకు వచ్చిన వైఎస్. జగన్ మోహన్ రెడ్డి చెరుకు రైతు కష్టాలను స్వయంగా చూశారు. వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. అనంతరం నల్లబెల్లంపై ఉన్న ఆంక్షలను తొలగించడంతో పాటు చంద్రబాబు మూసివేసిన షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని వారికి హామీ ఇచ్చారు. ఫలితంగా అటుగంటుతు న్న ఆశలు జీవం పోసుకున్నాయని జిల్లాలోని చెరుకు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు అగ్రికల్చర్ : జిల్లాలో ప్రధాన వాణిజ్యపంట అయిన చెరుకు సాగుకు.. కనీస ప్రోత్సాహం కరువైంది. అన్ని వర్గాలను ముంచేసినట్లే.. జిలాల్లోని చెరుకు రైతులనూ తెలుగుదేశం ప్రభుత్వం దగా చేసింది. చివరికి చిత్తూరు, గాజులమండ్యం చక్కెర కర్మాగారాలను అర్ధాంతరంగా మూయించి వేసింది. అలాగే నల్లబెల్లంపై ఆంక్షలు విధించడంతో రైతులు చెరకు పంటను సాగు చేయలేని దుస్థితికి చేరారు. పతనం ఇలా.. జిల్లావ్యాప్తంగా రైతులు ఏటా సగటున 27 వేల హెక్టార్ల సాధారణ విస్తీర్ణంలో చెరకు పంటను సాగు చేస్తారు. వర్షాలు బాగా కురిసి భూగర్భ జలాలు సంవృద్ధిగా ఉంటే ఆ ఏడు సాధారణ విస్తీర్ణంకన్నా అధికంగా దాదాపు 40 వేల హెక్టార్ల మేరకు చెరకు పంటను పండిస్తారు. అయితే 2014లో చంద్రబాబు నాయుడు అధికారాన్ని చేపట్టాక చెరకు సాగు విస్తీర్ణం ఏటా తగ్గుముఖం పడుతోంది. రైతులకు కనీస ఆదరణ లేకపోవడంతో పెట్టుబడి కూడా దక్కక నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి. పైగా సాగునీరు అధికంగా వృథా అవుతుందనే పేరుతో.. చెరకు పంటను సాగు పై కొన్ని ఆంక్షలు విధించారు. పైగా నల్లబెల్లం తయారీకి ఇబ్బందులు సృష్టించడం, చిత్తూరు, గాజుల మండ్యం షుగర్ ఫ్యాక్టరీలను మూసివేయడంలో చెరకు రైతులకు దిక్కుతోచని స్థితి ఏర్పడింది. ఫలితంగా 2014 నుంచి ఏటా చెరకు పంట సాధారణ విస్తీర్ణంతో పాటు, సాగు విస్తీర్ణం కూడా గణనీయంగా తగ్గుముఖం పట్టింది. 2014లో 27,705 హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికి గాను 27,004 హెక్టార్లు, 2015లో 27,215 హెక్టార్లకు గాను 20,831 హెక్టార్లు, 2016లో 26,181 హెక్టార్లకు గాను 18,214 హెక్టార్లు, 2017లో 24,291 హెక్టార్లకు గాను 19,564 హెక్టార్లు, 2018లో 22,304 హెక్టార్లకు గాను 17,266 హెక్టార్ల విస్తీర్ణంలో మాత్రమే చెరుకు సాగులోకి తీసుకొచ్చారు. ఉత్పత్తిని బెల్లంగా తయారు చేసి అమ్ముకోవాలన్నా.. రైతులకు కష్టాలు తప్పడం లేదు. దాడుల భయంతో వ్యాపారులు కూడా ముందుకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో కిలో బెల్లం రూ. 21 నుంచి రూ. 23 వరకు మాత్రమే ధర పలుకుతోంది. అయితే కనీసం కిలోకు రూ. 35 వస్తేగానీ గిట్టుబాటు అయ్యే పరిస్థితులు లేవని రైతులు వాపోతున్నారు. వైఎస్.జగన్ భరోసా.. సంకల్పయాత్రలో భాగంగా జిల్లాకు వచ్చిన వైఎస్. జగన్మోహన్రెడ్డి 2018 జనవరి 10వ తేదీ వెదురుకుప్పం మండలం పాతగుంట వద్ద బెల్లం గానుగ వద్దకు వెళ్లి రైతులతో మాట్లాడారు. చెరకు సాగుకు పెట్టుబడి, బెల్లంకు గిట్టుబాటు ధర తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నల్లబెల్లంపై ప్రభుత్వం విధించిన ఆంక్షల విషయాన్ని ఆయన దృష్టికి రైతులు తీసుకొచ్చారు. స్పందించిన జననేత మరుసటి రోజు (2018 జనవరి 11వ తేది) వెదురుకుప్పం బహిరంగ సభలో.. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే నల్లబెల్లంపై ఆంక్షలు ఎత్తివేస్తామని ప్రకటించారు. అలాగే మూతపడిన చిత్తూరు, గాజులమండ్యం షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతుల్లో హర్షాతిరేకలు వ్యక్తమయ్యాయి. ఎన్నికలు నేపథ్యంలో రైతులు నల్లబెల్లంపై ఆంక్షలు ఎత్తివేసే వారికే తమ మద్దతు అంటూ బల్లగుద్ది చెబుతున్నారు. ఏడొందలా..? పెంచునా..! ‘‘ ఏనా.. నిన్నా మొన్నటి వరకు ఓటుకు అయిదు వేలని చెప్పినారు కదనా. ఇప్పుడేందినా ఉన్నట్టుండి ఏడొందలంటా ఉండారు. మావోళ్లకి మాట కూడా ఇచ్చేసినా నా.. ఈటైంమ్లో ఏడొందలంటే మీకు డిపాజిట్లు కూడా రాదునో. ’’ ‘‘ నువ్వు భలే చెబతావ్రా.. సుబ్బా. ఇల్లు కాలి ఒకడు ఏడస్తా ఉంటే.. సుట్టకు నిప్పడిగినాడంట. నీలాంటోడు. పోయినసారి ఎలక్షన్లో ఏదో దేవుడు కరుణించాడు. చిన్న చిన్న అప్పులన్నీ కొట్టేసినా. ఈసారి ఎలక్షన్‌కు ముందే చిన్న ప్లాటొకటకి కొనేదానికి అడ్వాన్సు టోకెన్ వేసినా. ఇంకా 30 లక్షలు కట్టాలి. ఓటుకు అయిదువేలివ్వాలని రేటు కూడా ఫిక్స్ చేసినాం. మొత్తం తల్లకిందులైపోయిందిరా. అయినా నువ్వేం భయపడకు.. పార్టీ నుంచి వచ్చేది. ఆడ ఈడ తీసుకునేంతా పోగేసి సగం నొక్కేయడం ఆ పెద్ద మనిషికి బాగా తెలిసిన విద్యేరా. పంచేదైనా, నొక్కేసేదైనా మన వాటా మాత్రం ఇచ్చేయమని చెప్పేసినా.’’ – చిత్తూరు అర్బన్ ఇప్పుడు ఇప్పమనుయా మూటలు..! ‘ఏనా సేతన్నా.. ఈ నాలుగు దినాలు ఏడా కనిపించనలేదు. మనోడ్ని అడిగితే అమరావతి పోయినావని సెప్పినాడు. మనిషి కూడా బాగా డల్ అయినావే. ఏమైనాది ఏంది..?’ ‘నాకేమైనాది నాయుడు ..! బాగానే ఉండా. ఈ మధ్య ‘అమ్మ’ ఇంటి దగ్గరే ఉండినా. ఏందో ఆమె బాధలు అర్థంకాలే. ఏందినా.. చిత్తూరులో పరిస్థితి ఈమాదిరి అయిపోయినాది. ఏదో అనుకుంటే ఏదేదో జరిగిపోయినాది. అయినా ‘అమ్మ’కు పిచ్చేమైనా ఎక్కినాదా..? ఏంది ‘అమ్మ’కు పిచ్చా..? ఎవరికి ఎక్కించాలో వాళ్లకి ఎక్కిచింనాది నాయుడు పిచ్చి. నాయాల్ది ఆమె ఉన్నన్ని రోజులు ఆడిపోసుకున్నారు కదా మీవోళ్లు. బస్సు పెట్టుకోని మరీ అమరావతిపోయి అమ్మపై చెప్పినారు కదయా, సీటు ఇవ్వొద్దని. అది చేయలేదు, ఇది చేయలేదు, పార్టీని సంపేసినాది అని గ్రూపుల్ని పెట్టి పచా రం చేసినారు కదయా..! అందుకే ఎవుడికి ఏడ చెక్ పెట్టాలో ఆడ పెట్టినాది అమ్మ.’ ఏందినా అట్టా అంటా ఉండావు. పార్టీ పరిస్థితి మా పెద్దాయన సెప్పమంటే, ఉండేది బాబుకు సెప్పినామే తప్ప.. వేరే ఏముందినా.? అవునుయో.. అయిదేళ్ల కింద అమ్మ కాడ ఎవరెవరు ఎంతెంత ఏరకతిన్నారు..? దీంట్లో మీవోళ్ల వాటా ఎంత అంతా తెలుసుయా. ఏడా ఇప్పుడు ఇప్పించినారు కదాయా సీటు మీరు సెప్పినోడికని.. ఇప్పమను మూట సూస్తాము. – చిత్తూరు అర్బన్ జగనన్న హామీతో రైతుల్లో ధీమా.. నల్లబెల్లంపై ఆంక్షలు ఎత్తివేస్తామని జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీతో చెరకు రైతుల్లో ధీమా నెలకొంది. ఇకపై చెరకు సాగు చేయాలనే ఆసక్తి పెరుగుతుంది. ఆంక్షలు ఎత్తివేయడం వల్ల గిట్టుబాటు ధర వచ్చి రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు.– వెంకటమునిరెడ్డి, రైతు,గంగాధరనెల్లూరు మండలం సాగు విస్తీర్ణం పెరుగుతుంది.. చెరకుకు గిట్టుబాటు ధర వస్తే పంట సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతుంది. రైతులతో పాటు కూలీలు, కార్మికుల బతుకులు కూడా బాగుపడతాయి. ఇదంతా జరగాలం టే జగన్‌మెహన్‌రెడ్డి సీఎం కావాల్సిందే. ఆయన హయాంలోనే మాకు మంచి రోజులు వస్తాయి.– దొండపాటి మునికృష్ణమ నాయుడు,పెనుమూరు మండలం -
తీపి తగ్గిన చెరుకు
విజయనగరం, శృంగవరపుకోట : చెరుకు సాగు చేస్తున్న రైతుల పరిస్థితి అమ్ముదామంటే అడవి...కొందామంటే కొరివి అన్నట్టుంది. రైతన్నకు ఆర్థికభరోసా ఇచ్చే చెరకు పంటలో లాభాల తీపి తగ్గుతోంది. కనీస మద్దతు ధర రాకపోవడంతో రైతులు అల్లాడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 13 వేల హెక్టార్లలో చెరుకు సాగు చేస్తున్నారు. ప్రతి ఏటా సుమారు 4 వేల నుంచి 5 వేల హెక్టార్లలో చెరుకును బెల్లం తయారీకి వినియోగిస్తున్నారు. ప్రధానంగా విజయనగరం డివిజన్లో శృంగవరపుకోట, జామి, గజపతినగరం మండలాల్లో.. పార్వతీపురం డివిజన్లో బొబ్బిలి, సీతానగరం, రామభద్రపురం, తెర్లాం, సాలూరు, పాచిçపెంట మండలాల్లో చెరుకు పంట సాగవుతోంది. బెల్లం క్రషర్లపై ఆసక్తి .. భీమసింగి చక్కెర కర్మాగార పరిధిలోని 14 మండలాల్లో సుమారు 10 వేల ఎకరాల్లో.. బొబ్బిలి మండలం లచ్చయ్యపేట ఎన్సీఎస్ చక్కెర కర్మాగార పరిధిలోని 14 మండలాల్లో సుమారు 3 వేల ఎకరాల్లో చెరుకు సాగు చేస్తున్నారు. శృంగవరపుకోట నియోజకవర్గ పరిధిలో ఎస్.కోటలో 578 హెక్టార్లలో.. వేపాడ–160, జామి–76, లక్కవరపుకోటలో 14 హెక్టార్లలో చెరుకు సాగు చేస్తున్నారు. ఈ పంటలో 20 శాతం బెల్లం తయారీకి వినియోగిస్తున్నారు. ఎన్సీఎస్ చక్కెర కార్మగార పరిధిలో బాడంగి, బొబ్బిలి, తెర్లాం మండలాల్లో ఏడాది పొడవునా వాడే కాటు బెల్లం, నాటుసారాకు వాడే నల్లబెల్లం తయారీ విరివిగా ఉంటుంది. బొబ్బిలి నుంచి బెల్లం రాయపూర్, ఒడిశా, కోల్‌కతా ప్రాంతాలకు రవాణా కాగా... ఎస్.కోట, జామి, గజపతినగరం ప్రాంతాల నుంచి బెల్లం నేరుగా అనకాపల్లి, విజయనగరం మార్కెట్లకు తరలిస్తారు. ప్రభుత్వం, కర్మాగార యాజమాన్యాలు కనీస మద్దతు ధర ఇవ్వలేకపోవడంతో రైతులు చక్కెర కర్మాగారాలకు పంట ఇవ్వకుండా బెల్లం క్రషర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. క్రషర్లకు చెరుకు తీసుకెళ్తే రవాణా ఖర్చులు మిగులుతాయి.. అలాగే రోజల తరబడి నిరీక్షించే యాతన తప్పుతుందని రైతులు చెబుతున్నారు. అలాగే సొమ్ము వెంటనే చేతికి వస్తుందన్న ధీమాతో క్రషర్లను ఆశ్రయిస్తున్నారు. కలిసి రావడం లేదు.. చక్కెర కర్మాగారాలు గతేడాది రికవరీ ఆ«ధారంగా మద్దతు ధర నిర్ణయిస్తాయి. గతేడాది రికవరీ శాతం 9గా ఉండడంతో ఈ ఏడాది ఎన్సీఎస్ కర్మాగారం టన్నుకు మద్దతు ధరగా రూ. 2750...భీమసింగి కో ఆపరేటివ్ చక్మెర కర్మాగారం ప్రతినిధులు 2625 రూపాయలుగా నిర్ణయించారు. అయితే సకాలంలో బిల్లులు చెల్లింపులు జరగకపోవడం.. దిగుబడి అప్పగించేందుకు రోజుల తరబడి వేచి ఉండాల్సి రావడం.. ఈ సమయంలో చెరుకు బరువు తగ్గిపోవడం వంటి కారణాల వల్ల చాలామంది రైతులు చెరుకు సాగు పట్ల విముఖత కనబరుస్తున్నారు. మరికొంతమంది రైతులు బెల్లం క్రషర్లవైపు మొగ్గు చూపుతున్నారు. తగ్గిన బెల్లం ధరలు.. ఈ ఏడాది ప్రారంభంలో తెల్లబెల్లం 10 కిలోలు 330 రూపాయల ధర పలికింది. క్రమంగా నెల రోజులుగా తగ్గుతూ ప్రస్తుతం రూ.290కి చేరింది. నల్లబెల్లం పది కిలోల ధర తొలుత రూ.290 కాగా పస్తుతం 250 రూపాయలకు చేరుకుంది. రానున్న పదిహేను రోజుల్లో బెల్లం ధర 10 కిలోలకు రూ.6 నుంచి 7 రూపాయల వరకూ తగ్గే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అటు చక్కెర కార్మాగార ప్రతినిధులు మద్దతు ధర పెంచకపోవడంతో పాటు ఇటు బెల్లం ధరలు తగ్గిపోవడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నట్లు రైతులు వాపోతున్నారు. -
జననేత కోసం విశాఖ చెరకు రైతుల ఎదురు చూపులు
-
ఈ సారీ మద్దతు లేదు
చెరకు రైతులపై కనికరం చూపని ప్రభుత్వం గత ఏడాదిలాగే గిట్టుబాటు ధర రూ.2300లే ఏటా పెట్టుబడులు పెరుగుతున్నందున గిట్టుబాటు కాదంటున్న రైతులు పాత బకాయిలూ చెల్లించని సుగర్ ఫ్యాక్టరీలు తీపిని పంచే చెరకు రైతుకు మాత్రం ఏటా నష్టాల చేదే మిగులుతోంది. పాలకుల అలసత్వం వల్ల అడుగడుగునా చెరకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రెండేళ్లుగా గిట్టుబాటు ధర లేదని గగ్గోలు పెడుతున్న చెరకు రైతుపై ఈ ఏడాది కూడా ప్రభుత్వం కనికరం చూపలేదు. ఏటా పెట్టుబడులు పెరుగుతున్నప్పటికీ అందుకు తగ్గట్టు గిట్టుబాటు ధర పెంచకుండా ఈ సారీ అన్యాయమే చేసింది. చోడవరం: వరి, చెరకు, నూనె గింజలు, అపరాలు ఇతర వ్యవసాయ ఉత్పత్తులపై కేంద్ర ఆహార మండలి ఏటా ఆయా పంటల సాగు గడువుకు ముందే ఫెయిర్అండ్ రెమ్యునిరేటివ్ ప్రైస్ (ఎఫ్ఆర్పీ) గిట్టుబాటు ధర ప్రకటిస్తుంది. కేంద్రం ప్రకటించిన గిట్టుబాటు ధరకు రాష్ట్ర ప్రభుత్వం కొంత జోడించి రైతులకు ఇస్తుంది. ప్రభుత్వాలు ప్రకటించిన ధర రైతులకు గిట్టుబాటు కాకపోయినప్పటికీ కనీసం ఇంత ధర వస్తుందనే ఒక లెక్క ఉండి రైతులు ఆయా పంటల సాగు విస్తీర్ణంపై ఆసక్తి చూపేవారు. ఈ ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరకు రైతులను నిండా ముంచాయనే చెప్పాలి. ఒక పక్క ఏటా వ్యవసాయ పెట్టుబడులు భారీగా పెరిగిపోతున్నాయి. విత్తనం, ఎరువులు, పురుగుల మందులు, కూలీ ధరలు భారీగా పెరిగి పోయాయి. గతేడాదే టన్నుకు రూ.2300 ప్రకటిస్తేనే గిట్టుబాటు కాలేదని రైతన్నలు ఆందోళన వ్యక్తం చేయగా ఈ ఏడాది కనీసం ఒక్క రూపాయి కూడా అద నంగా పెంచకుండా మళ్లీ టన్నుకు రూ.2300గా ఎఫ్ఆర్పీ ప్రభుత్వం ప్రకటించింది. దీనితో చెరకు సాగుపై రైతుల్లో అయోమయం నెలకొంది. 30 శాతం తగ్గిన చెరకు సాగు జిల్లాలో ఏటా లక్షా 80వేల ఎకరాల్లో చెరకు సాధారణ విస్తీర్ణం కాగా గత రెండేళ్లలో విస్తీర్ణం 30 శాతం మేర తగ్గిపోయింది. పంచదార, బెల్లం ధరలు రోజుకో ధర ఉండటంతో చెరకు రైతులు అప్పుల పాలవుతున్నారు. గత ఏడాది టన్నుకు రూ.2300 ఎఫ్ఆర్పీకి రూ.60 ఫ్యాక్టరీలు కలిపి టన్నుకు రూ.2360 కనీస మద్దతు ధర ప్రకటించింది. ఈ ఏడాది కనీసం రూ.2500 ఎఫ్ఆర్పీ ధరను ప్రకటిస్తే మరికొంత ఫ్యాక్టరీలు కలిపి కనీసం టన్నుకు రూ.2700అయినా వస్తుందని రైతులు ఆశించారు. కాని వారి ఆశలు ఆడియాశలయ్యాయి. మరో పక్క గతేడాది బకాయిలు ఇంకా ఫ్యాక్టరీలు రైతులకు ఇవ్వలేదు. జిల్లాలో రూ. 30 కోట్లకు పైబడి బకాయిలు చెల్లించాల్సి ఉంది. రైతులు ప్రత్యామ్నాయంగా సరుగుడు సాగుకు మళ్లిపోతున్నారు. గోవాడ, తాండవ, ఏటికొప్పాక ఫ్యాక్టరీలు ఈ ఏడాది 8.3 లక్షల టన్నుల క్రషింగ్ లక్ష్యం పెట్టుకున్నాయి. ఆ దిశగా ప్లాంటేషన్ చేయాలని రైతులను చైతన్య పరిచినప్పటికీ గిట్టుబాటు ధర ప్రకటన ఆశాజనకంగా లేకపోవడం, పాత బకాయిలు నేటికీ ఫ్యాక్టరీలు చెలించకపోవడంతో రైతులు ప్రత్యామ్నాయ పంటలపైనే ఆసక్తి చూపుతున్నారు. దీంతో అటు రైతులు, ఇటు ఫ్యాక్టరీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
చెరకు సాగు చేదు!
గిట్టుబాటుకాక రైతుల విముఖత ఏటా తగ్గుతున్న సాగు నాలుగేళ్లుగా పడిపోతున్న చక్కెర ఉత్పత్తి సుగర్ ఫ్యాక్టరీల మనుగడ ప్రశ్నార్థకం సుగర్ ఫ్యాక్టరీలు, చెరకు రైతులు ఒకరిపై ఒకరు ఆధారపడి మనుగడ సాగించడం పరిపాటి. కావలసినంత చెరకు రైతులు పండిస్తేనే ఫ్యాక్టరీలు సక్రమంగా నడుస్తాయి. అలాగే ఫ్యాక్టరీలు గిట్టుబాటు ధర కల్పించి సకాలంలో బకాయిలు చెల్లిస్తేనే రైతుల జీవనం సాఫీగా సాగుతుంది. అయితే జిల్లాలో ఇప్పుడు ఈ పరిస్థితి దారి తప్పింది. పెరిగిన పెట్టుడులకు అనుగుణంగా సుగర్ ఫ్యాక్టరీలు ధర చెల్లించలేకపోతున్నాయి. దీనికి తోడు ప్రభుత్వ ప్రోత్సాహం కూడా కరువైంది. దీంతో గిట్టుబాటు కాక రైతులు చెరకు సాగుపై విముఖత చూపుతున్నారు. ఏటా చెరకు సాగు తగ్గుతూ ఉండటంతో చెరకు ఫ్యాక్టరీల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. పాయకరావుపేట: జిల్లాలో సహకార రంగంలో నడుస్తున్న నాలుగు సుగర్ ఫ్యాక్టరీల్లో ఇప్పటికే తుమ్మపాల కర్మాగారం ఈ ఏడాది మూతపడింది. మిగతా ఫ్యాక్టరీల పరిస్థితి కూడా అంతంతమాత్రమే. తాండవ సుగర్ ఫ్యాక్టరీని పరిశీలిస్తే ఇది తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల పరిధిలోని రైతుల భాగస్వామ్యంతో నడుస్తోంది. నాలుగేళ్లుగా చెరకు సాగు విసీర్ణం తగ్గుతూ వస్తుండటంతో ఈ ఫ్యాక్టరీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. చెరకు సాగు గిట్టుబాటు కాక ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు దృషి ్టసారించడమే ఇందుకు ప్రధాన కారణం. దీంతో నిర్దేశించిన లక్ష్యం మేరకు క్రషింగ్ జరగడం లేదు. దీంతో నిర్వహణ భారం పెరిగి ఆర్థిక ఇబ్బందులు నెలకొన్నాయి. రైతులకు సకాలంలో చెల్లింపులు చేయలేకపోతున్నారు. తగ్గిన సాగు విస్తీర్ణం తాండవ ఫ్యాక్టరీ పరిధిలో 5389 మంది రైతులు షేర్ హోల్డర్లుగా ఉన్నారు. 2015-16 సీజన్లో రెండు లక్షల టన్నుల చెరకు క్రషింగ్ లక్ష్యం కాగా 1,57,787 టన్నులు మాత్రమే చేశారు. సుమారు 42 వేల టన్నులు తగ్గింది. 10, 500 ఎకరాల్లో ఉండే చెరకు సాగు విస్తీర్ణం 9482 కు తగ్గిపోయింది. దీంతో పూర్తిస్థాయిలో క్రషింగ్ జరగలేదు. ఉత్పత్తయిన పంచదార నిల్వలను బ్యాంకులో తాకట్టుపెట్టి రైతులకు రూ. 25 కోట్లు చెల్లించారు. 2014-15కు సంబంధించి రైతులటు రూ. 6.4 కోట్ల బకాయిలు ఇంకా చెల్లించాల్సి ఉంది. పెరిగిన పెట్టుబడులు దుక్కు నుంచి విత్తనం, ఎరువులు, నీటి తడులు, కలుపు నివారణ, జడలు కట్టడం, పురుగు మందులు, నరకడం, ఫ్యాక్టరీకి సరఫరా చేసేందుకు ఎకరాకు రూ.65 వేల వరకు పెట్టుబడి అవుతుందని రైతులు చెబుతున్నారు. ఎకరాకు దిగుబడి సాధారణ రకం 25, ఒంటి కన్ను మొక్క వేస్తే 30 టన్నులు వచ్చింది. ఫ్యాక్టరీ టన్నుకు రూ.2391 మద్దతు ధర ప్రకటించింది. 25 టన్నుల దిగబడి వచ్చిన వారికి రూ. 59,775, 30 టన్నులు వచ్చిన వారికి రూ.71,730 వచ్చింది. అంటే ఏడాదంతా కష్టపడినా పెట్టుబడిరాని పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కనీస మద్దతు ధర టన్నుకు రూ. 2500 ఇవ్వాలని డిమాండ్ చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. రికవరీలో ప్రథమం తాండవ ఫ్యాక్టరీ వరసగా రెండేళ్లలో రికవరీలో ప్రథమ స్థానంలో నిలిచింది. సహకార రంగంలో తాండవ సుగర్స్ 2014-15, 2015-16లో 9.61, 9.63 శాతం రికవరీ సాధించింది. -
నిజాం షుగర్స్‌కు రూ.13.80 కోట్లు
* 3 ఫ్యాక్టరీలకు నిధులు మంజూరు చేసిన సర్కారు * మంబోజిపల్లి రైతుల బకాయిలకు త్వరలో మోక్షం సాక్షి, సంగారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలోని మూడు నిజాం షుగర్స్ ఫ్యాక్టరీలలో చెరకు రైతులకు చెల్లించేందుకు రూ.13.80 కోట్లు మంజూరు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మెదక్ జిల్లాలోని మంబోజిపల్లి, నిజామాబాద్ జిల్లా షక్కర్నగర్, కరీంనగర్ జిల్లా మెట్‌పల్లిలోని నిజాం షుగర్స్ ఫ్యాక్టరీల్లో 2014-15 క్రషింగ్ సీజన్లకు సంబంధించి రైతులకు చెల్లించాల్సిన బకాయిల నిమిత్తం ఈ నిధులు మంజూరు చేసింది. అయితే ఏ ఫ్యాక్టరీకి ఎన్ని నిధులు కేటాయించిందీ ఉత్తర్వుల్లో పేర్కొనలేదు. మూడు చక్కెర ఫ్యాకర్టీల్లో రైతులకు సుమారు రూ.27.50 కోట్ల మేర బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రూ. 13.80 కోట్లు మంజూరు కాగా, మిగతా నిధులు మరో విడతలో ఇచ్చే అవకాశం ఉంది. మంబోజిపల్లి చెరకు రైతుకు ఊరట! మెదక్ సమీపంలోని మంబోజిపల్లిలోని నిజాం దక్కన్ షుగర్స్ చెరకు రైతులకు సుమారు రూ.6.60 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. వీటిని చెల్లించాల్సిందిగా రైతులు చాలా కాలంగా కోరుతున్నారు. తాజాగా చెరకు బకాయి నిధులు విడుదల చేసిన నేపథ్యంలో మంబోజిపల్లి రైతులకు బకాయిలు త్వరలో చెల్లించే అవకాశం ఉంది. మూడు చక్కెర ఫ్యాక్టరీలకు సమానంగా నిధులు కేటాయించిన పక్షంలో మంబోజిపల్లి ఫ్యాక్టరీ వాటాగా రూ.4.6 కోట్లు వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి చెరకు రైతులకు కొంత ఊరట లభించనుంది. -
గానుగాడేనా?
రెక్కలు ముక్కలు చేసుకుని తీపిని పంచిన చెరకు రైతు బతుకు చేదెక్కుతోంది. పంట చేతికొచ్చే సమయం దగ్గర పడుతున్నా నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ భవితవ్యం తేలక అగమ్యగోచరంగా మారింది. నేటివరకు ఫ్యాక్టరీ మరమ్మతులు ప్రారంభం కాక... పంట అగ్రిమెంటుకు నోచుకోక... బకాయిలు చేతికి రాక.. గానుగాడే సమయం ముంచుకొస్తుంటే.. చెరకు రైతు ఆందోళనకు గురవుతున్నాడు. అసలే కరువు కాలం.. ఆపై కాస్తోకూస్తో పండిన పంటకు తగిన ప్రతిఫలం ప్రశ్నార్థకంగా మారింది. ఒకరో ఇద్దరో కాదు... రెండువేల మంది రైతుల వేదన ఇది. - ఎన్డీఎస్ఎల్ భవితవ్యం తేలేనా? - సమయం దగ్గర పడుతున్నా కదలిక కరువు - ఆందోళనలో చెరకు రైతులు - సర్కారు నిర్ణయం కోసం ఎదురుచూపులు - రూ.6.64 కోట్ల బాకాయిలపై సందిగ్ధం మెదక్: మెదక్ మంబోజిపల్లి నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ(ఎన్డీఎస్ఎల్) పరిధిలోని 12 మండలాల్లో 2,400 చెరకు రైతులున్నారు. టీడీపీ హయాంలో తీసుకున్న నిర్ణయానికనుగుణంగా ఫ్యాక్టరీ... ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో నడుస్తోంది. నిర్వహణ లోపంతో అంతంత మాత్రంగా నడుస్తున్న ఫ్యాక్టరీ... రైతులకు కోట్ల రూపాయల బకాయిలు పడింది. ఫలితంగా... మంజీరా తీరంలో చెరకు పంట గణనీయంగా తగ్గుతూ వస్తోంది. ఏ ఏడు గానుగకు కేవలం 90 వేల టన్నుల చెరకు పంట మాత్రమే ఉన్నట్టు తెలుస్తోంది. నిర్వహణ కష్టంగా మారిన ఫ్యాక్టరీని ప్రభుత్వ పరం చేసుకోవాలని కొంత కాలంగా రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం సహకార విధానంలో ఫ్యాక్టరీ నడిపితే సత్ఫలితాలొస్తాయన్న నిర్ణయానికొచ్చినట్టు సమాచారం. ఇందులో భాగంగానే... ప్రైవేటు యాజ మాన్యం నుంచి ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకోవాలంటే ఎంత సొమ్ము చెల్లించాలనే విషయమై ఆస్తుల మదింపు ప్రక్రియ చేపట్టింది. ఈ బాధ్యతను ఎఫ్‌బీఐ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్‌కు అప్పగిస్తూ ఉత్తర్వులిచ్చినట్టు తెలిసింది. గానుగాడే సమయం... చెరకు పంట గానుగాడే సమయం దగ్గర పడుతున్నా ఇంత వరకు ఫ్యాక్టరీ భవితవ్యంపై తుది నిర్ణయం ఖరారు కాలేదు. సాధారణంగా పంట గానుగాడటానికి ఆరు నెలల ముందే ఫ్యాక్టరీ యాజమాన్యం రైతులతో పంట కొనుగోలు ఒప్పందాలు చేసుకోవాలి. కానీ మంభోజిపల్లి ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందన్న ప్రచారంతో ఫ్యాక్టరీ ప్రైవేట్ యాజమాన్యం ఎలాంటి కార్యకలాపాలూ చేయడం లేదు. పైగా ఫ్యాక్టరీలో గానుగాడాలంటే కనీసం మూడు నెలల ముందే మరమ్మతులు ప్రారంభించి యంత్రాలను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. మరో రెండు నెలల్లో చెరకు నరికే సమయం వస్తున్నా... ఇంత వరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. గతేడాది చెరకు రైతులకు ఇవ్వాల్సిన బకాయిల్లో సీఎం చొరవతో కొన్ని విడుదలైనప్పటికీ... ఇంకా రూ.6.64 కోట్లు చెల్లించాల్సి ఉంది. అటు ఫ్యాక్టరీ సరిగ్గా నడవక... ఇటు బకాయిలూ రాకపోవడంతో రైతుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలోని ఇతర ఫ్యాక్టరీలకు చెరకు తరలిద్దామనుకున్నా... వారు అనుమతించే అవకాశాలు తక్కువేనంటున్నారు రైతులు. మంభోజిపల్లి ఫ్యాక్టరీలో ఒకప్పడు మూడు లక్షల టన్నుల చెరకు గానుగాడేవారు. ఈ ఏడు ఇది 90 వేల టన్నులకే పరిమితమైంది. కాగా ఇటీవల ఎన్డీఎస్ఎల్ పరిధిలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో సమావేశమైన చెరకు రైతులు... ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్యాక్టరీ మూతపడటానికి వీలు లేదని, ప్రభుత్వం అందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. -
చెరకు రైతులను ఆదుకుంటాం
పరిశ్రమలు, చక్కెర శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సాక్షి, హైదరాబాద్: చెరకు రైతులకు నష్టం కలిగించే ఏ చర్యలనూ సహించేది లేదని రాష్ట్ర పరిశ్రమలు, చక్కెర శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. చక్కెర శాఖలో రైతులకు నష్టం కలిగే విధంగా వ్యవహరించిన అధికారులను, ఉద్యోగులను గుర్తించి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. శెక్కర్ భవన్లో శుక్రవారం మంత్రి శాఖలోని వివిధ అంశాలపై సమీక్ష జరిపారు. షుగర్ కమిషనర్ బధ్రు మాలోత్తో పాటు ఆ శాఖకు చెందిన పలువురు అధికారులు హాజరైన ఈ సమావేశంలో శాఖాపరంగా జరుగుతున్న నిర్లక్ష్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చక్కెర పరిశ్రమలను అధికారులు, ఉద్యోగులు పూర్తిగా భ్రష్టు పట్టించారని, చక్కెర అమ్మిన డబ్బులను చెరకు రైతులకు చెల్లించకుండా మిగతా స్టాక్‌ను విక్రయిస్తూ నష్టం కలిగిస్తున్నారని ధ్వజమెత్తారు. అధికారులు, ఉద్యోగుల పనితీరు వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని, దీన్ని సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. సమీక్ష అనంతరం మీడియాతో జూపల్లి మాట్లాడుతూ ‘నిజాం డెక్కన్ షుగర్ లిమిటెడ్(ఎన్డీఎస్ఎల్) కంపెనీలో రాష్ట్ర ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉన్నా లావాదేవీలకు సంబంధించి సరైన లెక్కలు లేవు. చెరకును క్రష్ చేసిన తరువాత వచ్చిన చక్కెర అమ్మకం డబ్బును రైతులకు చెల్లించడం లేదు. ఈ కంపెనీ యాజమాన్యం 80 వేల క్వింటాళ్ల చక్కెర విక్రయించి బ్యాంకుకు మాత్రం రూ. 10 కోట్లు కట్టింది. మిగతా రూ. 26 కోట్లు ఇతరత్రా వాడడం జరిగింది’ అని అన్నారు. షుగర్ కమిషన్ కింద ఎన్డీఎస్ఎల్లో ప్రభుత్వం తరపున పనిచేస్తున్న అసిస్టెంట్ కమిషనర్లు, కమిషనర్ బాధ్యతగా వ్యవహరించి చక్కెర అమ్మగా వచ్చిన డబ్బును రైతులకు చెల్లించేలా చూడాలని అన్నారు. చెరకు రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి రూ. 11 కోట్లు రైతాంగానికి ఇచ్చారని, అయినా ఇంకా కొంత బకాయిలు ఉన్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం క్వింటాల్‌కు ఇచ్చే ధర రూ. 2,200 అయితే అదనంగా రూ. 400 కలిపి రూ. 2,600 రైతాంగానికి చెల్లిస్తున్నామని మంత్రి చెప్పారు. కాగా విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ బోధన్, సంగారెడ్డి అసిస్టెంట్ కమిషనర్లను మంత్రి మందలించారు. ఈ సమావేశంలో డిప్యూటీ కేన్ కమిషనర్ వీరస్వామి, అసిస్టెంట్ కమిషనర్లు పాల్గొన్నారు. -
ముడిచక్కెర ఎగుమతి సబ్సిడీకి కేంద్రం ఆమోదం
న్యూఢిల్లీ: చక్కెర మిల్లులకు ఊరటనిచ్చే విధంగా ప్రస్తుత మార్కెటింగ్ సీజన్లో (2014 అక్టోబర్-2015 సెప్టెంబర్) దాదాపు 14 లక్షల టన్నుల వరకూ ముడి చక్కెర ఎగుమతులకు సబ్సిడీనివ్వాలని కేంద్రం నిర్ణయించింది. గురువారం జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) ఈ మేరకు ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం టన్నుకు రూ. 4,000 చొప్పున ఎక్స్పోర్ట్ సబ్సిడీ లభిస్తుంది. క్రితం ఏడాది ఆగస్టు-సెప్టెంబర్ కాలంలో నిర్ణయించిన రూ. 3,371 కన్నా ఇది అధికం. చెరకు రైతులకు బకాయిలు చెల్లించలేక సతమతమవుతున్న మిల్లర్లకు తోడ్పాటునిచ్చే దిశగా దాదాపు 40 లక్షల టన్నుల ముడి చక్కెర ఎగుమతులపై గతేడాది ప్రభుత్వం సబ్సిడీనిచ్చింది. ప్రస్తుత మార్కెటింగ్ సంవత్సరానికి పొడిగించకపోవడంతో ఈ స్కీమును గతేడాది సెప్టెంబర్‌తో ముగిసింది. తాజాగా దీన్ని కొనసాగిస్తూ సీసీఈఏ నిర్ణయం తీసుకుంది. తాజా గణాంకాల ప్రకారం మిల్లర్లు రూ. 12,300 కోట్లు బకాయిపడ్డారు. -
'ప్రభుత్వం హామీ ఇచ్చే వరకు ధర్నా'
విజయనగరం: రాష్ట్రంలోని చెరుకు రైతులకు వెంటనే బకాయిలు చెల్లించాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణ రంగారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా సీతా నగరంలోని ఎన్సీఎస్ షుగర్ ఫ్యాకర్టీ వద్ద చెరుకు రైతులు చేపట్టిన మహాధర్నాకు ఆయన మద్దతు ప్రకటించారు. ఎన్సీఎస్ షుగర్ ఫ్యాక్టరీ బకాయిలు చెల్లించకపోవడం దారుణమన్నారు. చెరుకు రైతుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించిన ప్రభుత్వం హామీ ఇవ్వలేదన్నారు. ప్రభుత్వం హామీ ఇచ్చే వరకు ధర్నా కొనసాగిస్తామని సుజయ్ కృష్ణరంగారావు స్పష్టం చేశారు. -
చెరకు రైతుకు శరాఘాతం
బకాయిలను రెండ్రోజుల్లో చెల్లిస్తామని సీఎం హామీ చిత్తూరు షుగర్స్‌లో రూ.12.07 కోట్లు ఎస్వీ షుగర్స్‌లో రూ.8.62 కోట్ల బకాయిలు 2013-14 క్రషింగ్ సీజన్‌కు రూ.9.83 కోట్ల మంజూరు చిత్తూరు షుగర్స్ కార్మికులకు చెల్లించాల్సిన రూ.10.60 కోట్లపై నోరుమెదపని ప్రభుత్వం చెరకు రైతుల బకాయిలను రెండు రోజుల్లోగా చెల్లిస్తానని డిసెంబర్ 11న హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు.. 2013-14 క్రషింగ్ సీజన్ లో బకాయిలను మాత్రమే చెల్లించడానికి రూ.9.83 కోట్లను మాత్రమే మం జూరు చేశారు. 2011-12, 2012-13 క్రషింగ్ సీజన్లో రైతులకు బకాయిల చెల్లింపుపై నోరు మెదపడం లేదు. చిత్తూరు సహకార చక్కెర పరిశ్రమ కార్మికులకు వేతనాలు, ప్రావిడెంట్ ఫండ్ బకాయిల రూపంలో చెల్లించాల్సిన రూ.10.60 కోట్లనూ విడుదల చేయలేదు. సాక్షి ప్రతినిధి, తిరుపతి: జిల్లాలో వేరుశనగ తర్వాత చెరకు ప్రధాన వాణిజ్య పంట. 40 మండలాల పరిధి లో 54 వేల హెక్టార్లలో చెరకు పంటను రైతులు సాగు చేస్తున్నారు. చెరకు పంటపై ఆధారపడి శ్రీవెంకటేశ్వర సహకార చక్కెర కర్మాగారం (ఎస్వీ షుగర్స్), చిత్తూ రు సహకార చక్కెర పరిశ్రమ (చిత్తూరు షుగర్స్), మరో మూడు ప్రైవేటు చక్కెర పరిశ్రమలు నెలకొల్పా రు. 2012-13, 2013-14 క్రషింగ్ సీజన్లలో టన్ను చెరకుకు రూ.2,160 (రూ.1860 చెరకు పరిశ్రమ చెల్లిస్తే.. రూ.300 ప్రభుత్వం చెల్లిస్తుంది)ను ప్రభుత్వం మద్దతు ధరగా నిర్ణయించింది. జిల్లాలో 2012-13లో ఎస్వీ షుగర్స్‌లో 1.46 టన్నులు, చిత్తూరు షుగర్స్‌లో 1.05 లక్షల టన్నుల చెరకును క్రషింగ్ చేశారు. 2013-14 క్రషింగ్ సీజన్లో ఎస్వీ షుగర్స్‌లో 1.20 లక్షలు, చిత్తూరు షుగర్స్‌లో 48 వేల టన్నుల చెరకును క్రషింగ్ చేశారు. చెరకు సరఫరా చేసిన రైతులకు అప్పట్లోనే చిత్తూరు, ఎస్వీ షుగర్స్లు రూ.1860 వంతున చెల్లించాయి. తక్కిన రూ.300 చొప్పున రైతులకు ప్రభుత్వం చెల్లించాలి. ఎస్వీ షుగర్స్‌కు చెరకు సరఫరా చేసిన రైతులకు రూ.8.62 కోట్లను ప్రభుత్వం బకాయిపడింది. చిత్తూరు షుగర్స్‌లో 2011-12 క్రషింగ్ సీజన్లో చెరకు సరఫరా చేసిన రైతులకు రూ.1.42 కోట్లు.. 2012-13, 2013-14 సీజన్లో రైతులకు రూ.8.50 కోట్ల మేర బకాయిపడింది. రైతులకే రూ.20.69 కోట్లను ప్రభుత్వం చెల్లించాలి. చిత్తూరు షుగర్స్ కార్మికులకు 13 నెలల వేతనాల రూపంలో రూ.ఎనిమిది కోట్లు, ప్రావిడెంట్ ఫండ్ రూపంలో రూ.2.60 కోట్లు వెరసి రూ.10.60 కోట్లను ప్రభుత్వం బకాయిపడింది. డిసెంబర్ 11న చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు రూ.31.29 కోట్ల నిధులను విడుదల చేస్తే రైతులు, కార్మికుల బకాయిలను చెల్లించవచ్చు. ఆ హామీకి చంద్రబాబు తూట్లు పొడించారు. కేవలం 2013-14 క్రషింగ్ సీజన్లో రైతులకు చెల్లించాల్సిన బకాయిలను మాత్రమే చెల్లించేందుకు రూ.9.83 కోట్లను విడుదల చేస్తూ పరిశ్రమలశాఖ కార్యదర్శి ఎస్ఎస్ రావత్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. చిత్తూరు షుగర్స్ రైతులకు రూ.5.41 కోట్లు, ఎస్వీ షుగర్స్ రైతులకు రూ.4.42 కోట్లను బకాయిలుగా చెల్లించేందుకు విడుదల చేశారు. 2011-12, 2012-13 క్రషింగ్ సీజన్లో బకాయిల సీజన్ల చెల్లింపుపై ప్రభుత్వం చేతులెత్తేసినట్లేననే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. చిత్తూరు షుగర్స్ కార్మికులకు బకాయిల చెల్లించకుండా ఇప్పటికే ఉద్యోగాల నుంచి తొలగించడంపై కర్షక, కార్మిక లోకం మండిపడుతోంది. -
ముందు మీ కర్మాగారాల బకాయిలు చెల్లించండి
బీజేపీ, జేడీఎస్ నేతలపై రాష్ట్ర చక్కెర శాఖ మంత్రి మహదేవ ప్రసాద్ విమర్శ బెంగళూరు : చెరకు రైతుల ప్రయోజనాల కోసం ధర్నాలకు దిగుతామని ప్రకటిస్తున్న బీజేపీ, జేడీఎస్ నేతలు ముందుగా ఆయా పార్టీలకు చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు చెందిన కర్మాగారాలు రైతులకు బాకీ ఉన్న మొత్తాన్ని చెల్లించాలని రాష్ట్ర చక్కెర శాఖ మంత్రి మహదేవ ప్రసాద్ సలహా ఇచ్చారు. శనివారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ...రాష్ట్రంలోని చెరకు రైతులకు రూ.2,500 మద్దతు ధరను అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. అయితే చక్కెర కర్మాగారాల పరిస్థితిని కూడా దృష్టిలో ఉంచుకొని ఈ మొత్తాన్ని విడతల వారీగా చెల్లించేందుకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. కోతకు సిద్ధంగా ఉన్న చెరకు పంట పొలంలోనే ఎండిపోతే రైతులు మరింతగా ఇబ్బంది పడతారని, అందువల్లే గతనెల 30 నుంచే చెరుకు క్రషింగ్‌ను ప్రారంభించామని గుర్తుచేశారు. అయితే ఈ విషయాలేవి పట్టించుకోకుండా విపక్షాలు కేవలం తమ రాజకీయ ప్రయోజనాల కోసమే సువర్ణసౌధ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టాయని విమర్శించారు. బెళగావి, బీదర్, బిజాపుర వంటి ప్రాంతాల్లో చెరకు రైతులు ఎక్కువగా ఉన్నందున అక్కడ చెరకు రైతులకు మద్దతుగా ధర్నాలకు దిగితే రాజకీయంగా ఎక్కువ లబ్ధి పొందవచ్చనే భ్రమలో ఉన్నారని ధ్వజమెత్తారు. నిజంగా చెరకు రైతుల సంక్షేమాన్ని కోరితే కనుక ముందుగా తమ ఆధీనంలో ఉన్న చెక్కెర కర్మాగారాలకు చెరకు రైతుల బకాయిలు చెల్లించాల్సిందిగా బీజేపీ, జేడీఎస్ పార్టీలు తమ నాయకులను ఆదేశించాలని ఈ సందర్భంగా సూచించారు. -
నేతన్నకు గిట్టుబాటెక్కడ?
VIPరిపోర్టర్ ఆర్.కె. రోజా,నగరి ఎమ్మెల్యే ‘పడకేసిన మగ్గం - చేదెక్కిన చెరకు’ నగరి నియోజకవర్గంలో నేత కార్మికులు, చెరకు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది.ఒకప్పుడు దర్జాగా బతికిన నేతన్న.. ఇప్పుడు ముడిసరుకుల ధర పెరగడం.. గిట్టుబాటు ధర లేకపోవడంతో డీలాపడిపోయాడు. పెట్టుబడిలేక.. ప్రభుత్వాలు ఆదుకోక కూలీగా మారిపోయాడు. చెరకు రైతుల పరిస్థితీ అంతే. పది మందికీ పట్టెడన్నం పెట్టే అన్నదాత పిడికెడు మెతుకుల కోసం వెంపర్లాడుతున్నాడు. ఒక పక్క వర్షాభావం.. మరో పక్క గిట్టుబాటు ధరలేక అల్లాడాల్సి వస్తోంది. వీటిని పరిష్కరించి.. తమ బతుకులు కుదురుకునేదెప్పుడోనని కుమిలిపోతున్నారు. వీరి కష్టాలు.. కన్నీళ్లు తెలుసుకునేందుకు నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్కే.రోజా ‘సాక్షి’ తరపున విలేకరిగా మారారు. నియోజకవర్గంలోని చింతలపట్టెడ, కొత్తపేట, ఏకాంబరకుప్పం, గొల్లపల్లె, తడుకు గ్రామాల్లోని రైతులు, నేతన్నల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఆర్కే రోజా: నమస్తే అన్నా.. నేను ఎమ్మెల్యే రోజాని. ‘సాక్షి’ తరపున విలేకరిగా వచ్చా. ఏం బాగున్నారా.. చేనేతకు ఉచిత కరెంట్ ఇస్తున్నారా? ఉదయన్ (నేతన్న): సుమారు 30 ఏళ్లుగా మగ్గం నేస్తా ఉండా. ఎవరూ మాకు చేసిందేమీ లేదు. ఉచితంగా కరెంటు ఇయ్యడం లేదు. తమిళనాడులో ఇచ్చే విధంగా రెండు నెలలకు 500 యూనిట్లు ఉచితంగా ఇస్తే బాగుంటుంది. అట్లా ఇస్తేనన్నా కరెంటు బిల్లు కట్టే కష్టమన్నా తగ్గుతుంది. ప్రభుత్వం వారు పట్టించుకోవడంలేదు మేడం.. ఆర్కేరోజా: ప్రభుత్వం మీకు ఏం చేయాలని కోరుకుంటున్నారు? ఏం చేస్తే సమస్య తీరుతుంది? జగన్నాథం (నేతన్న): పెభుత్వం వాళ్లు మమ్మల్ని మరమగ్గ కార్మికులమని గుర్తించి గుర్తింపు కార్డులు ఇస్తే మేలు. తమిళనాడులాగా కుటుంబానికి ఒక కార్డు ఇయ్యాల. ఆ కార్డుల ఆధారంగా పింఛన్లు ఇయ్యాల. ఆ కార్డులు గవర్నమెంటు అధికారులే ఇంటింటికీ తెచ్చి ఇయ్యాల. గత పెభుత్వం నేత రుణాలు రద్దు చేస్తామని చెప్పింది. ఇప్పటి వరకూ రూపాయి కూడా రద్దు కాలేదు. బ్యాంకులో కొత్త అప్పులు పుట్టడంలేదు. ఏం చేసేదో అర్థం కావడం లేదు. ఆర్కే రోజా: నూలు అందడంలో ఏవైనా ఆటంకాలు ఉన్నాయా? మీ ప్రాంతంలో ఈటీపీ (రసాయ న నీటి శుద్ధీకరణ ప్లాంటు) కట్టారు కదా? అది మీకు ప్రయోజనకరమేనా? నీలమేఘం (మాస్టర్ వీవర్): వ్యవసాయదారుడు ఎంత ముఖ్యమో నేత కార్మికుడు కూడా అంతే ముఖ్యం. అయితే వ్యవసాయానికి విత్తనాలు సబ్సిడీ పై అందించే ప్రభుత్వం మాకు నూలును మాత్రం ఆ రకంగా అందించడం లేదు. ఈటీపీ ప్లాంటు కట్టడం మంచిదే. అయితే దాన్ని తొందరగా ప్రారంభించాలని కోరుతున్నాను. డైయింగ్ యూనిట్ల నుంచి వచ్చే నీళ్ల కారణంగా నీటి కాలుష్యం అవుతోంది. ఈ నీటిని ప్లాంటులో శుభ్రపరుస్తారు కాబట్టి ఆ సమస్య తీరుతుంది. అయితే డైయింగ్ యూనిట్లకు మీటర్లు ఏర్పాటుచేసి నీటిని తెప్పించి ట్రయల్ రన్ చేస్తామని చెప్పిన అధికారులు ఆ పనులను నానుస్తున్నారు. ఆర్కేరోజా: మహిళా నేత కార్మికుల విషయంలో ప్రభుత్వం ప్రత్యేకసదుపాయాలేమైనా కల్పిస్తోందా? శారద (నేత కార్మికురాలు): అట్టాంటిదే మీ లేదమ్మా. మాకేం ప్రత్యేక సదుపాయాలులేవు. తమిళనాడులో అయితే చాలా చేస్తా ఉండారు. మా అక్క సొరకాయపేటలో ఉం ది. అక్కడ మగ్గం నడిపే ఆడోళ్లకి గర్భం వస్తే ప్రభుత్వమే నెలనెలా డబ్బు ఇస్తుంది. ఇక్కడ అలాంటిదేమీ లేదు. ఎంతకష్టమైనా భార్యాభర్తలిద్దరూ భరించాల్సిందే. ఆర్కేరోజా: పట్టువస్త్రాల తయారీలో లాభాలు ఉన్నాయా? సొంతంగా తయారు చేస్తున్నారా, కూలీకి నేసి ఇస్తున్నారా? ఆలూరు నరసింహులు, సుబ్రమణ్యం (చేనేత కార్మికులు): పట్టువస్త్రాల తయారీకి ఆర్డర్లు తగ్గాయి. ముడిసరకుల ధర పెనుభారంగా మారింది. లాభాలు అనే మాట మరిచిపోయాం. వేలకు వేలు పెట్టుబడి పెట్టి ముడి సరకులు కొనుగోలు చెయ్యలేక అవస్థలు పడుతున్నాం. ఈ కారణంగా చీర ధర పెరుగుతోంది. అమ్మకాలు తగ్గాయి. సొంతంగా తయారుచేయలేక.. ముడిసరకులు ఇచ్చేవారికి కూలికి నేసి ఇస్తున్నాం. ఆర్కేరోజా: దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ నేతన్నలకు పని కల్పించడానికి జనతా వస్త్రాల తయారీ విధానం ప్రవేశపెట్టారు. ప్రస్తుత ప్రభుత్వం అలా పనికల్పిస్తోందా? హరిహరన్ (నేతన్న): ఎన్టీఆర్ కల్పించిన సదుపాయం ఇప్పుడు లేదు. పనిలేని సమయాల్లో నేతకార్మికులు చాలా కష్టపడుతున్నారు. నలుగురూ పనిచేసినా ఇల్లు గడవని పరిస్థితి ఉంది. తమిళనాడులో పనిలేని సమయాల్లో పనికల్పించడం కోసం ప్రభుత్వమే చీరలు, పంచెల ఆర్డర్లు ఇస్తోంది. చేనేత, మరమగ్గ కార్మికులు అనే భేదాభిప్రాయం లేకుం డా అన్ని సదుపాయాలు కల్పిస్తోంది. చిత్తూరు జిల్లాకు చెందిన ఇద్దరు నేతలు సీఎంలుగా పనిచేసినా ఇక్కడి నేతకార్మికులకు ఎలాంటి సదుపాయాలు కల్పించకపోవడం మా దౌర్భాగ్యం. దయనీయంగా చెరకు రైతు ఆర్కేరోజా: ప్రస్తుతం చెరకు పంట సీజన్ నడుస్తోంది కదా? మీ పరిస్థితి ఎలావుంది. పాత బకాయిలను ఫ్యాక్టరీలు చెల్లించాయా? రామూర్తిరెడ్డి (చెరకు రైతు): చెరకు రైతులకు బకాయిలు ఇంకా ఇవ్వలేదు. జిల్లా వాసి చంద్రబాబు సీఎం ఉన్నారు. ఏం ప్రయోజనం.. ఆయనకు చీమకుట్టినట్లు కూడా లేదు. చిత్తూరు కో-ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీలో రైతులకు లక్షలకొద్దీ బకాయిలు నిలిచిపోయాయి. నాకు నాలుగు లక్షలదాకా రావాలి. ఇలా ఉంటే పంట సాగు ఎలా చెయ్యగలం. మేం పండించి ఇచ్చిన పంటను తీసుకున్న ఫ్యాక్టరీ యాజమాన్యం మాకు డబ్బులు ఇవ్వకుండా కాలం వెళ్లదీస్తోంది. ఇది మంచి పద్ధతి కాదు. ఈ పరిస్థితి కొనసాగితే రైతులు ఆత్యహత్యలు చేసుకోవాల్సిందే. ఆర్కేరోజా: వ్యవసాయానికి విద్యుత్ సరఫరా ఏ మేరకు అందుతోంది? 9 గంటల కోతలేని విద్యుత్ అందిస్తున్నారా? శ్రీనివాసులు రెడ్డి (రైతు): అబ్బే లేదమ్మా. రోజుకి 6 గంటలు కూడా సక్రంగా ఇవ్వడం లేదు. అది కూడా అర్ధ రాత్రి ఇస్తున్నారు. కయ్యల్లో నీరు కట్టడానికి నానా తిప్పలు పడుతున్నాం. కూలోళ్లు కూడా రావడం లేదు. దీన్ని వదిలేసి వేరే పని చేసుకుందామనుకున్నా కొత్తగా ఏ పనీ రాకపోయే. మా పరిస్థితి చెప్పుకుంటే ముందు నొయ్యి వెనుక గొయ్యి అన్నట్లు తయారైంది. ఆర్కేరోజా: చెరకురైతు పట్ల ప్రభుత్వ నిర్లిప్తతపై మీరేమంటారు? రవిశేఖర్‌రాజు (రైతు): గతంలో కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రస్తుతం చంద్రబాబు నాయుడు సీఎంలు అయ్యారు. వీరిద్దరూ జిల్లా వాసులే. అయినప్పటికీ రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ఎలాంటి కృషీ చేయలేదు. రెండేళ్లుగా బకాయిలు పేరుకుపోతు న్నా యాజమాన్యాలతో చర్చించలేదు. బకాయిలు అందే విధంగా ఎవ్వరూ చొరవ తీసుకోవడంలేదు. ఇది చాలా బాధకలిగిస్తోంది. మనస్సు కుంగదీస్తోం ది. ఇప్పుడు మళ్లీ క్రషింగ్ మొదలైంది. చెరకు ఏ వి ధంగా వారికి తోలాలని ఆలోచనలో పడ్డాం. ఈ నెల 30న సహకార చక్కెర పరిశ్రమ మేనేజింగ్ డెరైక్టర్లతో సీఎం చంద్రబాబు చర్చిస్తామంటున్నారు. ఆ చర్చలేమైనా ఫలితాన్ని ఇస్తాయో లేదో.. చూడాల్సి ఉంది. లేకుంటే ధర్నాలకు దిగడం తప్ప మరోదారి లేదు. చెరకు రైతుల గోడు నగరి నియోజకవర్గంలో చెరకు రైతులెక్కువ. ఇక్కడ సుమారు 6 వేల హెక్టార్ల వరకు చెరకు పండిస్తారు. గానుగాడలేని వారు సమీపంలోని ఎస్వీ షుగర్స్, ప్రుడెన్షియల్, సాగర్ షుగర్ ఫ్యాక్టరీలకు తరలిస్తుంటారు. కానీ ప్రభుత్వాలు చెరకు రైతులను చిన్నచూపు చూస్తున్నాయి. పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలేదు. దీనికితోడు షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యాలు ఏళ్లతరబడి బకాయిలు చెల్లించకపోవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. నేతన్నల ఆక్రందన నగరి నియోజకవర్గం నేత కార్మికులకు పెట్టింది పేరు. ఇక్కడి వస్త్రాలు దేశ విదేశాలకూ ఎగుమతి అవుతుంటాయి. జిల్లాలో 25 వేల మరమగ్గాలుంటే అందులో నగరి నియోజకవర్గంలోనే 530 క్లస్టర్ యూనిట్లు ఉన్నాయి. వీటిపై 24 వేల మంది కార్మికులు ఆధారపడి జీవిస్తున్నారు. ఏడాదికి 2000 మిలియన్ మీటర్ల వస్త్రాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. వీరికి నేతపని తప్ప మరేపనులూ తెలి యవు. మగ్గమాడితేగాని డొక్కలేవని పరిస్థితి. పక్కనే ఉన్న తమిళనాడు ప్రభుత్వం రైతులకు అన్ని వసతులు కల్పిస్తోంది. కానీ ఇక్కడి పాలకులు ఆదిశగా చర్యలు చేపట్టకపోవడం వారిని మరింత కుంగదీస్తోంది. ఆర్.కె.రోజా హామీలు మీ గ్రామానికి విలేకరిగా వచ్చా. సమస్యలు అడిగి తెలుసుకున్నాను. నేతన్నలు తమిళనాడు తరహాలో తమకు ఎలాంటి సదుపాయాలూ లేవని, ఈ కారణంగా వృత్తిలో ముందడుగు వేయలేక పోతున్నామని చెప్పారు. చక్కెర ఫ్యాక్టరీలు తమకు బకాయిలు చెల్లించడం లేదని, దానికి ప్రభుత్వం చొరవ చూపడం లేదని, విద్యుత్ సరఫరా సక్రమంగా లేదని చెరకు రైతులు నా దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో పోరాడుతా. రైతులకు, నేతన్నలకు అండగా ఉంటా. ప్రెజెంటేషన్: మైనంపాటి అన్నయ్య,కోనేరి చంద్రమోహన్ -
చర్చలు విఫలం!
సంగారెడ్డి అర్బన్: జేసీ డాక్టర్ శరత్ సమక్షంలో గురువారం షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యాలు, చెరకు రైతుల మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. యాజమాన్యాలు టన్నుకు రూ.3500లు చెల్లించినా ఎలాంటి నష్టం రాదని రైతు సంఘాల నేతలు పేర్కొంటున్నారు. షుగర్ ఫ్యాక్టరీ ప్రతినిధులు మాత్రం రూ.3500లు చెల్లించడం కుదరదని తేల్చి చెప్పారు. సాగు కోసం పెట్టుబడులు పెట్టిన నేపథ్యంలో టన్నుకు రూ.2,600లు చెల్లిస్తే ఏ మాత్రం గిట్టుబాటు కాదని రైతులు పేర్కొన్నారు. గిట్టుబాటు ధర చెల్లించేందుకు యాజమాన్యాలు ముందుకు రాకపోతే జిల్లా యంత్రాంగం తదుపరి చర్యలు చేపడుతుందని జేసీ హెచ్చరించారు. రైతు ప్రతినిధులు మాట్లాడుతూ ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లోనే మద్దతు ధరపై నిర్ణయం తీసుకుందామని పలుమార్లు కోరినా యజమాన్యాలు ముందుకు రాలేదని జేసీకి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం టన్నుకు ప్రోత్సాహం కింద చెల్లిస్తున్న రూ.60 ఫ్యాక్టరీ యాజమాన్యాలకు కాకుండా మద్దతు ధరతో పాటు సీటీపీసీల ద్వారా నేరుగా రైతులకే ఇప్పించాలన్నారు. టన్నుకు కనీస మద్దతు ధర రూ.2,800 చెల్లించాలని ఫ్యాక్టరీ ప్రతినిధులను జేసీ కోరారు. ఈ విషయం యాజమాన్యాలతో మట్లాడుతామని ఫ్యాక్టరీల ప్రతినిధులు తెలిపారు. -
షుగర్ ఫ్యాక్టరీలను అమ్మేయడం వీళ్లకు మామూలే
-
షుగర్ ఫ్యాక్టరీని ఆదుకోండి: వైఎస్ జగన్‌కు రైతుల మొర
హుదూద్ తుఫాను కారణంగా అస్తవ్యస్తమైన విశాఖపట్నంలోని తుమ్మపాల ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం పర్యటించారు. ఆయనను కలుసుకున్న చెరుకురైతులు.. అక్కడి షుగర్ ఫ్యాక్టరీని ప్రైవేటు పరం కాకుండా ఆదుకోవాలని మొరపెట్టుకున్నారు. తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీని ప్రైవేటు వ్యక్తులకు అమ్మేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. హుదూద్ తుఫాను కారణంగా ఫ్యాక్టరీకి బాగా నష్టం వాటిల్లిందని వాళ్లు చెప్పారు. దీన్ని కూడా సాకుగా చూపించి.. దాన్ని ప్రైవేటు పరం చేసేందుకు కార్యవర్గం పావులు కదుపుతోందని వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వాళ్లు తెలిపారు. దీన్ని అడ్డుకోవాలంటూ ఆయనకు విజ్ఞప్తి చేశారు. -
బిగుస్తున్న ఉచ్చు..
* ముంబై జైల్లో ఉన్న ఎన్సీఎస్ ఎం.డిని తీసుకురావడానికి ప్రత్యేక బృందం * అక్టోబర్ 13న భూముల వేలం * బినామీ రుణాలపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు బొబ్బిలి : చెరుకు రైతులకు సకాలంలో బిల్లులు చెల్లిం చకపోవడంతో పాటు వివిధ రకాల మోసాలకు పాల్పడిన ఎన్సీఎస్ చక్కెర కర్మాగారం యాజామన్యం చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. బిల్లులు చెల్లించకపోవడంతో రైతు లు కొద్ది రోజుల కిందట ఆందోళనలు చేసిన నేపథ్యం లో కర్మాగారం ఎం.డి నాగేశ్వరరావుతో పాటు డెరైక్టర్లు శ్రీనివాస్, మురళిపై కేసులు నమోదయ్యాయి. ఈ నెల 6న డెరైక్టర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఏడో తేదీన అరెస్టు చేశారు. ప్రస్తుతం వారు విశాఖలోని కేంద్ర కార్యాలయంలో ఉన్నారు. వీరిపై ఇప్పటికే అనేక కేసులు నమోదయ్యాయి. డెరైక్టర్లు పోలీసులకు చిక్కడంతో తాజాగా బినామీ రుణాలపై బ్యాంకు నోటీసులు అందుకున్న రైతులు ఫిర్యాదులు చేయడానికి ముందు కు వస్తున్నారు. ఇప్పటికే పార్వతీపురం పోలీస్ స్టేషన్ లో ఒక రైతు తమ పేరుమీద బినామీ రుణాలు తీసుకు ని మోసం చేశారంటూ ఎన్సీఎస్ యాజమాన్యంపై ఫిర్యాదు చేయగా, తాజాగా సీతానగరం మండలం బూర్జకు చెందిన ఎర్ర చిన్నంనాయుడు, పణుకుపేటకు చెందిన బంకురు తవిటినాయుడు, పూడి సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా విశాఖ సెంట్రల్ జైల్లో ఉన్న డెరైక్టర్లు చేసుకున్న బెయిల్ పిటీషన్‌ను న్యాయమూర్తి తిరస్కరించారు. బిల్లుల చెల్లింపులు, బినామీ రుణాలపై నమోదైన కేసుల నేపథ్యంలో దర్యాప్తు కోసం డెరైక్టర్లను తమకు అప్పగించాలని పోలీసులు చేసుకున్న వినతిని కోర్టు పరిశీలిస్తోంది. కాగా ఈ కేసుతో సంబంధముండి ఇప్పటికే ముంబైలో అరెస్టు అయి ఆర్ధర్ సబ్ జైల్లో ఉన్న ఎం.డి నాగేశ్వరరావును తీసుకురావడానికి పోలీసుల ప్రత్యేక బృందం ముంబై పయనమైంది. బిల్లుల చెల్లింపులకు ఏర్పాట్లు ఒక వైపు యాజమాన్యంను అరెస్టు చేసినా రైతుల ఆందోళనలు చల్లారకపోవడంతో ఇటు రెవెన్యూ అధికారులు అటు పోలీస్ అధికారులు రైతులకు పేమెంట్లు చెల్లించడానికి చర్యలు తీసుకున్నారు. రైతులకు సుమారు 24 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉండగా, మొదటి విడతగా ఆరు కోట్ల రూపాయలను అధికారులు చెల్లిస్తున్నారు. పది వేల రూపాయల లోపున్న 15 వందల మంది రైతులకు ముందుగా బిల్లులు చెల్లిస్తున్నారు. మిగతా వారికి కూడా బిల్లులు చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే నెల 13న భూముల వేలం ఫ్యాక్టరీకి సంబంధించి రెవె న్యూ అధికారులు స్వాధీనం చేసుకున్న భూములను వచ్చే నెల 13న వేలం వేయనున్నారు. సీతానగరం మండల పరిధిలో ఉండే సుమారు 36 ఎకరాల భూమిని వేలం వేస్తున్నట్లు రెవెన్యూ అధికారులు ఈ నెల 8న ప్రకటన కూడా జారీ చేశారు. పార్వతీపురంలోని ఐటీడీఏ గిరిమిత్ర సమావేశ మందిరంలో వేలం వేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. -
ఆగ్రహానికి ఆజ్యం పోసిన అరెస్ట్‌లు
బొబ్బిలి: లచ్చయ్యపేట చక్కెర కర్మాగారం పరిధిలో ఉన్న చెరుకు రైతులు ఆందోళన ఉద్ధృతం చేశారు... జోరువానలోనూ రోడ్డెక్కి నినదించారు. పార్వతీపురం డివిజన్లోని లచ్చయ్యపేట చక్కెర కర్మాగారం పరిధిలో దాదాపుగా అన్ని మండలాల్లో రైతులు పెద్ద ఎత్తున శనివారం రహదారుల దిగ్బంధంలో పాల్గొన్నారు. రైతు సంఘ నాయకులు బయట ఉంటే ఉద్యమం మరింత ఉద్ధృతమవుతుందన్న ఉద్దేశ్యంతో శుక్రవారం అర్థరాత్రి నలుగురు చెరకు రైతు సంఘ నాయకులను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. పార్వతీపురంలో రెడ్డి శ్రీరాంమూర్తిని, సాలూరులో గేదెల సత్యనారాయణను, సీతానగరంలో రెడ్డి ఈశ్వరరావును, రెడ్డియ్యవలసలో రెడ్డి లక్ష్ముంనాయుడులను ఇళ్ల వద్ద నుంచి తీసుకు వెళ్లి అరెస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయాలని నిర్ణయించారు. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నా తడుస్తూనే పోరాటాన్ని కొనసాగించారు. ఆరు గంటల నుంచే ఆందోళన డివిజన్లోని బొబ్బిలి, బలిజిపేట, సీతానగరం, మక్కువ, బాడంగి, తెర్లాం తదితర మండలాల్లో రైతులంతా ఏపీ చెరకు రైతు సంఘం ఇచ్చిన పిలుపుమేరకు శనివారం ఉదయమే నాటుబళ్ల, టైరు బళ్లతో రహదారులపైకి రావడం మొదలుపెట్టారు. పక్కి, చింతాడ, కోమటిపల్లి, కారాడ, అలజంగి, పణుకుపేట, అంటిపేట, కాశయ్యపేట, పిరిడి, లక్ష్మీపురం తదితర ప్రాంతాల్లో నాటుబళ్లనురోడ్డుకు అడ్డంగా పెట్టి ఆందోళనలు చేశారు. బొబ్బిలి మండలం రంగరాయపురం గ్రామానికి చెందిన రైతులు టైరుబళ్లను తీసుకొని బొబ్బిలి ఆర్టీసీ కాంప్లెక్సు వద్దకు చేరుకున్నారు. ఇక్కడ ఏపీచెరుకు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మర్రాపు సూర్యనారాయణ, సీఐటియు నాయకుడు రెడ్డి వేణు,పి శంకరరావు తదితరుల ఆధ్వర్యంలో పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఆ సమయంలో అటుగా వచ్చిన పార్వతీపురం న్యాయమూర్తి కారును అడ్డుకున్నారు. న్యాయమూర్తి వాహనానికి దారి ఇవ్వాలని పోలీసులు కోరినా మాకే న్యాయం లేదని మేం రోడ్డుమీదకు వస్తే మీకు దారికావాలా అంటూ ఆ వాహనం ముందుకు వెళ్లి నినాదాలు చేశారు..దీంతో ఉద్రిక్త పరిస్థితి అక్కడ నుంచి మొదలైంది.. నాయకుల అరెస్టు... పోలీసులతో వాగ్వాదం బొబ్బిలి కాంప్లెక్స్ జంక్షనులో ఆందోళన చేస్తున్న రైతు సంఘం నాయకులనుడీఎస్పీ ఇషాక్ ఆధ్వర్యంలో పోలీసులు అకస్మాత్తుగా అరెస్టు చేశారు.. అప్పటివరకూ మీడియాతో మాట్లాడుతున్న నాయకులను ఒక్కసారిగా పోలీసులు చుట్టుముట్టారు. రైతు సంఘ నాయకుడు మర్రాపు సూర్యనారాయణతో పాటు సీఐటీయూ నాయకుడు రెడ్డి నాయకుడు, రైతు సంఘ నాయకులు ఉడుముల భూషణరావు, తాళ్లపూడి వెంకటరమణలను అరెస్టు చేసి రామభద్రపురం పోలీస్ స్టేషనుకు తరలించారు. దీంతో అక్కడ పోలీసులకు, రైతులకు మధ్య తీవ్రస్తాయిలో వాగ్వాదం జరిగింది. ‘‘మాకు రావలసిన బిల్లులు అడగడం కోసం ఆందోళన చేస్తే మమ్మల్ని అరెస్టు చేస్తున్నారని, అదే మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఎగ్గొట్టిన వారి ఆస్తులకు కాపాలా కాసి, వారికి రాచమర్యాదలు చేస్తున్నారంటూ’’ దుయ్యబట్టారు. రోడ్డుపై బైఠాయించి మేం అందోళనను విరమించము. ఎంతమందిని పట్టుకెళ్తారో పట్టుకెళ్లండంటూ ఎదురుతిరిగారు.. ఒకానొక దశలో పరిస్థితి అదుపు తప్పుతుందనుకున్నారు. అయితే పోలీసులే ఒక అడుగు వెనక్కి వేసి గంట కాలం ఆందోళన చేసుకోమని అనుమతి ఇచ్చి అక్కడ నుంచి వెళ్లి పోయారు. మధ్యాహ్నం రెండు గంటల వరకూ రైతులు ఆందోళనను చేశారు. అప్పటివరకూ వాహనాలు ఎక్కడవక్కడే నిలిచిపోయాయి. అత్యవసర పరిస్థితులపై ఆస్పత్త్రి వెళ్లే వారి వాహనాలను రైతులు విడిచిపెట్టారు. ఇక్కడ బందోబస్తు నిర్వహించేందుక ఆరు వందల మందికి అదనంగా మరికొంత మంది పోలీసులను విశాఖ జిల్ల నుంచి రప్పించారు. -
చెరకు రైతుల డబ్బు బకాయి కింద జమ
* రూ. 218 కోట్లు బదలాయించుకున్న బ్యాంకులు * కృష్ణాలో లబోదిబోమంటున్న రైతులు సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లాలో చెరకు రైతులకు రుణమాఫీ హుళక్కైంది. బ్యాంకర్లు పంట రుణ బాకీలను వసూలు చేసేసుకున్నారు. జిల్లాలో హనుమాన్ షుగర్స్, ఉయ్యూరు కేసీపీ, లక్ష్మీపురం చక్కెర కర్మాగారాలు 2013-14 సీజన్‌కు సంబంధించిన పంట డబ్బును రైతులకు విడుదల చేశాయి. యాజమాన్యాల నుంచి మూడురోజుల క్రితం రైతుల ఖాతాల్లో పడిన పంట డబ్బును బ్యాంకు అధికారులు పంట రుణం కింద జమ చేసేసుకున్నారు. రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్న రైతాంగం ఈ పరిణామంతో నివ్వెరపోరుుంది. ప్రభుత్వం రుణమాఫీపై నాన్చడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు అధికారులు కూడా రుణమాఫీకి సంబంధించి తమకు ఎటువంటి ఉత్తర్వులు రాకపోవటం వల్లే రైతుల రుణ ఖాతాలకు షుగర్ ఫ్యాక్టరీల నుంచి వచ్చిన డబ్బును తాము జమ చేసుకున్నట్లు చెబుతున్నారు. జిల్లాలోని 23,500 మంది చెరకు రైతుల రుణాలకు సంబంధించిన మొత్తం రూ.218 కోట్లను బ్యాంకు అధికారులు ఈ విధంగా జమ చేసేసుకున్నారు. బ్యాంకర్లు రైతులతో ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం, నిబంధనల మేరకే తమకు రావలసిన బకాయిలను జమ చేసుకోవడంతో.. రైతులు కూడా దీనిపై ఏమీ అనలేని పరిస్థితి నెలకొంది. రుణమాఫీపై ప్రభుత్వం సత్వరమే నిర్ణయం తీసుకుని ఉంటే ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదని రైతులు వాపోతున్నారు. -
చెరకు రైతుల బకాయిలకు రూ. 7200 కోట్లు
కేంద్ర మంత్రుల కమిటీ సిఫారసు న్యూఢిల్లీ: చెరకు రైతులకు శుభవార్త. వారి బకాయిల చెల్లింపు కోసం బ్యాంకుల ద్వారా రూ. 7200 కోట్ల వడ్డీరహిత రుణాలను చెరకు మిల్లులకు ప్రభుత్వం అందజేయాలనుకుంటోంది. చెరకు పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్‌పవార్ అధ్యక్షతన ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ ఏర్పాటుచేసిన మంత్రుల కమిటీ శుక్రవారం ఈ మేరకు సిఫారసు చేసింది. 4 మిలియన్ టన్నుల ముడి పంచదారను ఉత్పత్తి చేస్తే ప్రోత్సాహకాలు, బఫర్ స్టాక్ ఏర్పాటుతో పాటు చెరకు మిల్లులు గతంలో తీసుకున్న రుణాల పునర్వ్యవస్థీకరణను కూడా కమిటీ తమ సిఫారసుల్లో చేర్చింది. అలాగే, పెట్రోల్‌లో కలిపే ఇథనాల్‌ను 10 శాతానికి పెంచింది. కమిటీ సిఫారసుల వివరాలను పవార్ విలేకరులకు తెలిపారు. బ్యాంకులు ఇచ్చే రూ. 7200 కోట్ల వడ్డీరహిత రుణం మొత్తాన్ని చెరకు బకాయిల చెల్లింపు కోసమే వాడాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. బ్యాంకులకు చెల్లించే వడ్డీని కేంద్రప్రభుత్వం, సుగర్ డెవలప్మెంట్ ఫండ్(ఎస్డీఎఫ్) భరిస్తాయని, 5 ఏళ్లలోగా బ్యాంకు రుణాన్ని మిల్లులు చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. గత మూడేళ్ల సగటు ఎక్సైజ్, సెస్ సుంకం చెల్లింపు ఆధారంగా మిల్లులకు బ్యాంకులు రుణాలిస్తాయని వెల్లడించారు. తమ సిఫారసులపై తుది నిర్ణయం రెండు, మూడు వారాల్లో కేబినెట్ తీసుకుంటుందన్నారు. చెరకు కొనుగోలుకు అధిక ధర చెల్లించాల్సి రావడంతో పంచదార పరిశ్రమ రైతులకు దాదాపు రూ. 3400 కోట్లు అప్పు పడి ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటోంది. -
గిట్టుబాటు కాని ఫ్యాక్టరీ ధర
భారంగా మారిన బెల్లం తయారీ ఈసారీ చెరుకు రైతులకు గిట్టుబాటు ధర లభించే పరిస్థితి కనిపించడం లేదు. బెల్లం తయూరు చేయూలన్నా నిర్వహణ పెనుభారంగా మారింది. ఈ ఏడాది పలమనేరు వ్యవసాయశాఖ డివిజన్లో ఎనిమిది వేల ఎకరాల్లో చెరుకు సాగు చేశారు. పెట్టుబడి, కోత ఖర్చులు పోను టన్నుకు రూ.వెరుు్య కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఫ్యాక్టరీకి తరలించాలా? వద్దా? అన్న సందిగ్ధంలో రైతులు తలలు పట్టుకుంటున్నారు. పలమనేరు, న్యూస్‌లైన్: ఏడాదిపాటు ఎండనక, వాననక కష్టపడి చెరుకు పంటను సాగు చేసిన రైతులకు కనీస మద్దతు ధర లభించడం లేదు. డివిజన్ పరిధిలో ఎనిమిది వేల ఎకరాల్లో చెరుకు సాగులో ఉంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలోని ప్రైవేటు చెక్కర ఫ్యాక్టరీలో టన్ను చెరుకుకు రవాణా చార్జీలతో కలిపి రూ.2,300 చెలించనున్నారు.(ఈ ధర ఇంకా అధికారికంగా నిర్ణయించలేదు). టన్ను చెరుకును కొట్టి లారీలో లోడ్ చేసేందుకు కూలీలకు రూ.1,200 ఇవ్వాలి. లారీ డ్రైవర్లకు రూ.300 దాకా బత్తా సమర్పించాలి. పెట్టుబడి కింద చెరుకు విత్తనం, భూసారం, తోట చుట్టకం, ఏడాది పాటు సస్యరక్షణ తదితర ఖర్చులు పోను రూ.1000 కూడా గిట్టుబాటయ్యే పరిస్థితి కనిపిం చడం లేదు. చెరుకు సాగుకు అయ్యే ఖర్చులను లెక్కలోకి తీసుకుంటే రైతులకు మిగిలేది అంతంతే. బెల్లం తయారీ... ఫ్యాక్టరీలకు చెరుకు తోలకుండా బెల్లం తయారీ చేసుకుందామన్నా నిర్వహణ పెనుభారంగా మారుతోం ది. సమయానికి కూలీలు దొరక్క, విద్యుత్‌కోతలు, వర్షాల కారణ ంగా గానుగలు చేపట్టేందుకు వీలు కావడం లేదు. కొందరు మాత్రం ముందుగానే గానుగల్లో బెల్లం తయారీకి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం బండి బెల్లం (760 కేజీలు) ధర రూ.22వేల దాకా పలుకుతోంది. బండి బెల్లం తయారు చేసేందుకు రూ.7 వేలు ఖర్చు అవుతోంది. దీంతో టన్నుకు రూ.1,500 మిగులుతుంది. ఆ లెక్కన ఫ్యాక్టరీలకు తరలించే బదులు బెల్లం తయారు చేస్తే టన్నుకు రూ.500 ఆదాయం వస్తుందని రైతులు భావిస్తున్నారు. గానుగలు ఆడలేని పరిస్థితిల్లో గత్యంతరం లేక ఫ్యాక్టరీలకు చెరుకును తరలించేందుకు సిద్ధమవుతున్నారు. పట్టించుకోని ప్రభుత్వం ఐదేళ్లుగా కనీస మద్దతు ధరను కల్పించాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. మద్దతు ధర టన్నుకు రూ.3వేలైనా ఉండాలని రైతు సంఘాలు కోరుతున్నారుు. కానీ ప్రభుత్వం మాత్రం దీనిపై ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. జిల్లాకు చెందిన వ్యక్తే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. ఫలితంగా ఈ ప్రాంతంలో ఏటా చెరుకు సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది. రైతులు ప్రత్యామ్నాయ పనులవైపు మొగ్గు చూపుతున్నారు. 7 నుంచి క్రషింగ్..... పలమనేరు, కుప్పం నియోజకవర్గాలకు సంబంధించి పుంగనూరు సమీపంలోని ఓ ప్రైవేటు చెరుకు ఫ్యాక్టరీ మాత్రమే ఉంది. ఈనెల 7వ తేదీ నుంచి చెరుకు క్రషింగ్ ప్రారంభం కానున్నట్లు ఫ్యాక్టరీ సిబ్బంది వెల్లడించారు.