సంగారెడ్డి అర్బన్: జేసీ డాక్టర్ శరత్ సమక్షంలో గురువారం షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యాలు, చెరకు రైతుల మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. యాజమాన్యాలు టన్నుకు రూ.3500లు చెల్లించినా ఎలాంటి నష్టం రాదని రైతు సంఘాల నేతలు పేర్కొంటున్నారు. షుగర్ ఫ్యాక్టరీ ప్రతినిధులు మాత్రం రూ.3500లు చెల్లించడం కుదరదని తేల్చి చెప్పారు. సాగు కోసం పెట్టుబడులు పెట్టిన నేపథ్యంలో టన్నుకు రూ.2,600లు చెల్లిస్తే ఏ మాత్రం గిట్టుబాటు కాదని రైతులు పేర్కొన్నారు.
గిట్టుబాటు ధర చెల్లించేందుకు యాజమాన్యాలు ముందుకు రాకపోతే జిల్లా యంత్రాంగం తదుపరి చర్యలు చేపడుతుందని జేసీ హెచ్చరించారు. రైతు ప్రతినిధులు మాట్లాడుతూ ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లోనే మద్దతు ధరపై నిర్ణయం తీసుకుందామని పలుమార్లు కోరినా యజమాన్యాలు ముందుకు రాలేదని జేసీకి ఫిర్యాదు చేశారు.
ప్రభుత్వం టన్నుకు ప్రోత్సాహం కింద చెల్లిస్తున్న రూ.60 ఫ్యాక్టరీ యాజమాన్యాలకు కాకుండా మద్దతు ధరతో పాటు సీటీపీసీల ద్వారా నేరుగా రైతులకే ఇప్పించాలన్నారు. టన్నుకు కనీస మద్దతు ధర రూ.2,800 చెల్లించాలని ఫ్యాక్టరీ ప్రతినిధులను జేసీ కోరారు. ఈ విషయం యాజమాన్యాలతో మట్లాడుతామని ఫ్యాక్టరీల ప్రతినిధులు తెలిపారు.
చర్చలు విఫలం!
Published Thu, Nov 13 2014 11:43 PM | Last Updated on Sat, Sep 2 2017 4:24 PM
Advertisement
Advertisement