Interest-free loan
-
చక్కెర మిల్లులకు వడ్డీరహిత రుణాలపై నిబంధనల ఖరారు
న్యూఢిల్లీ: చెరకు రైతుల బకాయిల చెల్లింపు కోసం చక్కెర మిల్లులకు బ్యాం కుల నుంచి రూ.6,600 కోట్ల మేర వడ్డీరహిత రుణాలిచ్చేందుకు ఓకే చెప్పిన సీసీఈఏ... వీటికి విధివిధానాలను కూడా గురువారంనాటి సమావేశంలో ఆమోదించింది. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న చక్కెర పరిశ్రమకు చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమావేశం అనంతరం ఆహార శాఖ మంత్రి కేవీ థామస్ విలేకలరుతో చెప్పారు. వచ్చే అయిదేళ్లపాటు ఈ మొత్తం రుణంపై రూ.2,750 కోట్ల వడ్డీ భారం పడుతుందని, సుగర్ డెవలప్మెంట్ ఫండ్(ఎస్డీఎఫ్) నుంచి దీన్ని ప్రభుత్వమే భరిస్తుందని ఆయన వెల్లడించారు. నిధులను సక్రమంగా(రైతులకు చెల్లిం పులు) వినియోగిస్తున్నారా లేదా అనేది పరిశీలించేందుకు వీలుగా ఈ రుణాలను ప్రత్యేక బ్యాంక్ ఖాతాద్వారా బ్యాంకులు మిల్లులకు ఇస్తాయి. నోడల్ బ్యాంక్ నియామకం, రుణ ప్రక్రియ నిర్వహణకు తగిన నిబంధనలను ఆర్థిక శాఖ జారీచేయనుందని థామస్ చెప్పారు. కాగా, ఐదేళ్ల వ్యవధిలో వడ్డీలేకుండా మిల్లులు రుణాలను తిరిగి చెల్లించాల్సి ఉంటుందని, తొలి రెండేళ్లు చెల్లింపులపై మారటోరియంను వినియోగించుకోవచ్చని కూడా అధికారిక ప్రకటన పేర్కొంది. అసలు చెల్లింపుల్లో డీఫాల్ట్గనుక అయితే, ఆ వ్యవధికి వడ్డీ రాయితీలేవీ వర్తించకుండా విధివిధానాల్లో చేర్చారు. ప్రస్తుత సీజన్(2013-14, అక్టోబర్-సెప్టెంబర్)లోనే మిల్లులకు ఈ రుణాలు లభిస్తాయి. -
లేహ్యం పేరుతో లూటీ
చీరాల, న్యూస్‌లైన్: వరుస ప్రకృతి వైపరీత్యాలతో అన్ని విధాలా నష్టపోయి అప్పుల ఊబిలో చిక్కుకొని వ్యవసాయానికి దూరమవుతున్న రైతులను సర్కారు విధానాలు మరింత నష్టపరుస్తున్నాయి. సవాలక్ష నిబంధనలతో రుణాలు మంజూరు చేయడంలో రైతులకు ‘చెయ్యి’స్తున్న ప్రభుత్వం చివరకు వారికి ఇవ్వాల్సిన వడ్డీలు కూడా చెల్లించకుండా తాత్సారం చేస్తోంది. గతేడాది రబీ సీజన్‌కు సంబంధించిన రుణాలు వడ్డీతో సహా కట్టినప్పటికీ రైతులకు తిరిగి ఇవ్వాల్సిన వడ్డీ మాత్రం ప్రభుత్వం బ్యాంకులకు జమ చేయలేదు. వివరాల్లోకి వెళితే...ప్రభుత్వం రైతులకు లక్ష రూపాయల్లోపు పంట రుణాలను వడ్డీ లేకుండా అందిస్తామని ఆర్భాటంగా ప్రకటించింది. అయితే ఆచరణలో రుణాల తాలూకు వడ్డీ తిరిగి రైతులకు జమచేయడంలో ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేదు. రైతులు తీసుకున్న రుణాలకు అసలుతో పాటు ఏడు శాతం వడ్డీ కలిపి తిరిగి చెల్లించాలని బ్యాంకు అధికారులు చెప్పారు. రైతులు కట్టిన వడ్డీ నగదు ప్రభుత్వం బ్యాంకులకు పంపించిన వెంటనే తిరిగి వారి ఖాతాల్లో జమచేస్తామని హామీ ఇచ్చారు. దీంతో పంట రుణాలు తీసుకొన్న వారు ఏడాది లోపు వడ్డీతో కలిపి బ్యాంకులకు తిరిగి చెల్లించేశారు. అయితే రుణాలు కట్టి నాలుగు నెలలు గడిచినా ఇంత వరకు వడ్డీ తిరిగి రైతుల ఖాతాల్లోకి చేరలేదు. పంట రుణాలు చెల్లించిన రైతులు బ్యాంకుల చుట్టూ రోజూ ప్రదక్షిణలు చేస్తున్నారు. బ్యాంకు అధికారులు ప్రభుత్వం నుంచి వడ్డీకి సంబంధించిన నిధులు రాలేదంటున్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు * 7 కోట్లు: లక్ష నుంచి * 3 లక్షల లోపు రుణాలకు పావలా వడ్డీ ప్రభుత్వం అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ మేరకు జిల్లాలో సుమారు రెండు లక్షల మంది రైతులకు గత ఏడాది రబీ సీజన్లో * 1200 కోట్ల పంట రుణాలిచ్చారు. రుణాలు తీసుకున్న వారిలో దాదాపు 90 శాతం మంది రైతులు సకాలంలో బ్యాంకులకు ఏడు శాతం వడ్డీతో కలిపి తిరిగి చెల్లించేశారు. రుణాలు చెల్లించి నాలుగు నెలలు గడిచినా ఇంత వరకు వడ్డీ తిరిగి రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయలేదు. ప్రభుత్వం నుంచి రుణాల తాలూకు దాదాపు * 7 కోట్ల వడ్డీ బ్యాంకులకు జమకావాల్సి ఉంది. వడ్డీలేని రుణాల మాట ప్రభుత్వం మరిచిపోయిందని రైతులు విమర్శిస్తున్నారు. వరుస నష్టాలతో అప్పులపాలైన తమను ఆదుకోవాల్సిన ప్రభుత్వం నాటకాలాడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రుణం చెల్లించి నాలుగు నెలలైంది డి.సత్యనారాయణ గత ఏడాది రబీ సీజన్లో వరి సాగు కోసం బ్యాంకులో వ్యవసాయ రుణం తీసుకున్నా. సంవత్సరంలోపు చెల్లిస్తే వడ్డీ ఉండదు. వడ్డీతో కలిపి అక్టోబర్‌లోనే రుణం తిరిగి చెల్లించా. కానీ వడ్డీ ఇంత వరకు ఇవ్వలేదు. బ్యాంకు అధికారులు ఇంకా ప్రభుత్వం నుంచి నిధులు రాలేదంటున్నారు. బ్యాంకు చుట్టూ తిరుగుతున్నా యానాదిరెడ్డి రబీ సీజన్లో వరి సాగుకు బ్యాంకులో రుణం తీసుకున్నాను. ఏడాదిలోపు తిరిగి చెల్లిస్తే వడ్డీ ఉండదన్నారు. ముందుగా వడ్డీతో కలిపి రుణం చెల్లించాలని బ్యాంకు అధికారులు తెలిపారు. దీంతో మొత్తం కట్టాను. నాలుగు నెలలైనా ఇంత వరకు వడ్డీ తిరిగి ఇవ్వలేదు. బ్యాంకు చుట్టూ తిరుగుతున్నాను. గత ఏడాది రబీ రుణాలు వ్యవసాయాధికారులు పర్యవేక్షిస్తున్నారు లీడ్ బ్యాంకు మేనేజర్ ప్రసాద్ గత ఏడాది 2012 నవంబర్ నుంచి 2013 మార్చి వరకు రబీ సీజన్లో రైతులు తీసుకున్న వ్యవసాయ రుణాల వడ్డీ రాయితీ వ్యవహారం వ్యవసాయాధికారులు పర్యవేక్షిస్తున్నారు. బ్యాంకులకు సకాలంలో రుణాలు చెల్లించిన రైతు జాబితాలను ప్రభుత్వం వద్దకు పంపి, వాటి వడ్డీని బ్యాంకులకు జమచేసే బాధ్యత వ్యవసాయశాఖ పైనే ఉంటుంది.