ఈ-పాస్బుక్ విధానంతో రైతులకు తీవ్రనష్టం | YSRCP's farmers' wing president MVS Nagireddy objects E-passbook systerm in andhra pradesh | Sakshi
Sakshi News home page

ఈ-పాస్బుక్ విధానంతో రైతులకు తీవ్రనష్టం

Published Mon, Jun 27 2016 4:30 PM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

YSRCP's farmers' wing president MVS Nagireddy objects E-passbook systerm in andhra pradesh

హైదరాబాద్ : పట్టాదారు పాసు పుస్తకాల రద్దు నిర్ణయం సరైంది కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్
నాగిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఆయన సోమవారమిక్కడ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఈ-పాస్బుక్లంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త విధానాన్ని తీసుకొస్తున్నారని, ఈ విధానంతో రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని అభ్యంతరం వ్యక్తం చేశారు.

పాస్ పుస్తకాల స్థానంలో ప్రవేశపెడుతున్న ఈ-పాస్బుక్ విధానంతో ఎలాంటి ఫలితం ఉండదన్నారు.  రైతులకు తెలియకుండా వారి భూములు మరొకరికి బదలాయించే అవకాశం ఉంటుందని నాగిరెడ్డి పేర్కొన్నారు.  అవగాహన లేకుండా జీవోలు జారీ చేయటం సరైన పద్ధతి కాదన్నారు.  కనుక తక్షణమే ఈ పాస్బుక్ విధానాన్ని ఉపసంహరించుకోవాలని నాగిరెడ్డి డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement