ఈ పాస్‌తో రేషన్ దూరం | for E-pass no goods on ration | Sakshi
Sakshi News home page

ఈ పాస్‌తో రేషన్ దూరం

Published Sun, May 24 2015 3:34 AM | Last Updated on Tue, Oct 2 2018 8:49 PM

ఈ పాస్‌తో రేషన్ దూరం - Sakshi

ఈ పాస్‌తో రేషన్ దూరం

ఈ-పాస్  నిరుపేదల పాలిట శాపంగా తయారైంది. వీరి ఆకలి తీర్చే లక్ష్యంతో ప్రారంభించిన ఆహారభద్రత వారికి లేకుండా చేస్తోంది. గత నెలలో శ్రీకారం చుట్టిన ఈపాస్ ఇక్కట్ల వల్ల 80 శాతం కార్డుదారులకు పాత పద్ధతిలోనే సరకులు అందించారు. ఈ నెలలో పూర్తిగా ఈ పాస్ ద్వారానే అమలు చేయాలన్న జిల్లా యంత్రాంగం పట్టుదల కారణంగా ఈసారి పాత  పద్ధతిలో సరుకులివ్వలేదు. దీంతో జిల్లావ్యాప్తంగా రెండున్నర లక్షల కార్డు హోల్డర్లకు  ఈ నెలలో సరకులకు దూరమయ్యాయి.
- జిల్లాలో పదిలక్షల మందికి అందని సరకులు
- గగ్గోలు పెడుతున్న  పేదలు
సాక్షి, విశాఖపట్నం:
జిల్లాలో జీవీఎంసీ పరిధిలోని 412, భీమిలి, అనకాపల్లి, యలమంచలి, నర్సీ పట్నం మున్సిపాల్టీలతో పాటు పది మండలాల పరిధిలో 274 రేషన్‌షాపులో ఏప్రిల్ ఒకటి తేదీ నుంచి ఈ-పాస్ (ఎలక్ట్రానిక్ పేమెంట్ అండ్ అప్లికేషన్ సిస్టమ్) ద్వారా సరుకుల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈపాస్ పుణ్యమాని కేవలం 2,09,982 మందికి మాత్రమే  గత నెలలో సరకులు పంపిణీ చేయగలిగారు. 6,26,548 కార్డుదారులకు పాతపద్ధతి (డిజిటల్ కీ రిజిస్ట్రార్) లోనే  పంపిణీ చేశారు.  ఆ నెలలో 7,389 కార్డుదారులు సరకులు తీసుకెళ్లలేదని గుర్తిం చారు. కాగా ఈ నెలలో నూటికి నూరు శాతం ఈపాస్ ద్వారానే సరకులివ్వాలని జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

ఈ మేరకు డీలర్లపై  ఒత్తిడి తీసుకొచ్చారు. డీలర్లే కావాలని మెషీన్లు పనిచేస్తున్నా పనిచేయడంలేదంటూ పక్కన పెట్టేస్తున్నారంటూ ఒకరిద్దరి డీలర్లపై క్రమశిక్షణ  చర్యలకు సైతం తీసుకున్నారు. ఇంతలా ఒత్తిడితీసుకొచ్చినా చివరకు అతికష్టంమ్మీద ఈనెలలో  6,06,444 కార్డుదారులకు మాత్ర మే ఈ-పాస్ ద్వారా సరకులివ్వగలిగారు.  2,56,245 కార్డుదారులకు అసలు సరుకులే ఇవ్వలేదు. జీవీఎంసీ పరిధిలో 412 షాపుల్లో ఈ-పాస్ అమలుచేస్తున్నారు. ఇక్కడ 3,69,934 కార్డుదారుల్లో  ద్వారా 2,50,888 కార్డుదారులకు మాత్రమే సరఫరా చేయగలిగారు. మరో 1,19,046 మందికి సరకులివ్వలేదు. ఇక రెండు మున్సిపాల్టీలు, ఏడు మండలాలపరిధిలో 4,92,755 కార్డులుండగా, ఈ పాస్‌ద్వారా 3,55, 556 కార్డుదారులకు మాత్రమే సరకులు పంపిణీ చేయగలిగారు. మరో 1,37,199 కార్డుదారులకు అసలు సరకులు పంపిణీ చేయలేదు. అంటే మొత్తమ్మీద 2,56,245 కార్డుదారులకు సరకుల పంపిణీజరగలేదు.ఒకోకార్డులనలుగురు చొప్పున లెక్కేసుకున్నా 10,24,980 మందికి మే నెలలో సరకులు అందని పరిస్థితి నెలకొంది.

ఆహార భద్రత పేరుతో కార్డులోని ఒక్కొక్కరికి నాలుగు కేజీల నుంచి ఐదు కేజీలకు పెంచినా ఈ రెండు నెలల్లో ఏ ఒక్కరూ మనశ్శాంతిగా పూర్తిస్థాయిలో సరుకులు తీసుకున్న పాపాన పోలేదు.  గత నెల 25వ తేదీ వరకు సరకులు పంపిణీ చేసినప్పటికీ ఈ నెలలో 22వ తేదీతోనే  పంపిణీని నిలుపుదల చేశారు. జూన్ నెలలో  లిప్టింగ్ కోసం డీలర్ల నుంచి ఇండెంట్లు తీసుకోవడం మొదలు పెట్టారు. అంటే ఈ నెలలో మిగిలిన కార్డుదారుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.  నెలాఖరు వరకు సరుకులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement