distribution of goods
-
నేటితో 13వ విడత ఉచిత సరుకుల పంపిణీ పూర్తి
సాక్షి, అమరావతి: కరోనా కారణంగా ఉపాధికి దూరమైన పేద కుటుంబాలకు ప్రభుత్వం ఇస్తున్న ఉచిత సరుకుల 13వ విడత పంపిణీ గురువారం ముగుస్తుంది. ఏప్రిల్ కోటా నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో పేదలకు 13 సార్లు బియ్యంతో పాటు కందిపప్పుగానీ, శనగలుగానీ ఉచితంగా పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. బియ్యం కార్డులోని ప్రతి సభ్యుడికి ఐదు కిలోల బియ్యం, కుటుంబానికి కిలో కందిపప్పు లేదా శనగలు నెలకు రెండుసార్లు ఉచితంగా అందుతున్నాయి. బియ్యం కార్డు లేని అర్హులు దరఖాస్తు చేసుకుంటే విచారించి వెంటనే మంజూరు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పౌరసరఫరాలశాఖ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో బియ్యం కార్డుల సంఖ్య 1.47 కోట్ల నుంచి 1.51 కోట్లకు చేరింది. రద్దుచేసిన కార్డుదారులకు మరో అవకాశం ఉమ్మడి కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి అనో, ఐటీ చెల్లిస్తున్నారనో, ఇతరత్రా కారణాలతోనో రద్దుచేసిన కార్డుదారులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఉదాహరణకు ఆరుగురు కుటుంబ సభ్యులున్న రేషన్ కార్డులో ప్రభుత్వ ఉద్యోగి ఉంటే ఆ కుటుంబ రేషన్ కార్డును అనర్హమైనదని గుర్తించారు. ప్రభుత్వ ఉద్యోగి లేదా ఐటీ చెల్లిస్తున్న వ్యక్తికి పెళ్లి అయివుంటే భార్య పేరును తొలుత కార్డులో నమోదు చేయించాలి. తర్వాత కార్డు నుంచి వారిద్దరి పేర్లను తొలగించడానికి దరఖాస్తు చేసుకుంటే మిగిలిన కుటుంబసభ్యుల పేరిట కొత్తగా బియ్యం కార్డు మంజూరు చేస్తారు. ఇలా వివిధ కారణాలతో రద్దయిన కార్డులను పునరుద్ధరించుకోవడానికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. దీంతో రాష్ట్రంలో బియ్యం కార్డుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. -
‘ఈ-పోస్’ ఢమాల్
► ఇబ్బందులుపడ్డ కార్డుదారులు ► రేషన్ సరుకుల పంపిణీకి ► హడావుడి ఎందుకో.. కార్డుదారుల్లో పెల్లుబుకుతున్న అసహనం నూజివీడు/ విజయవాడ : ఈ-పోస్ విధానంతో కార్డుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శుక్రవారం జిల్లా లో ఉన్న 12.09 లక్షల రేషన్‌కార్డుదారులకు ఈ- పోస్ యంత్రాలు చుక్కలు చూపించాయి. రేషన్ డీలర్లను ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు రేషన్ షాపులు తెరచిఉంచి మూడు రోజుల్లో సరుకుల పంపిణీని పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అయితే ఈ-పోస్ సర్వర్ పనిచేయకపోవడంతో మధ్యాహ్నం 12 గంటల వరకు పం పిణీ జరగలేదు. గతంలో ప్రతి నెలా 20వ తేదీ వరకు రేషన్ సరుకులు ఇచ్చేవారు. దీంతో కార్డుదారులు వారికి అనుకూల సమయంలో ఎలాంటి హ డావుడి లేకుండా సరుకులను తెచ్చుకునేవారు. కొద్ది నెలలుగా జిల్లా కలెక్టర్ సరుకుల పంపిణీపై తేదీలు నిర్ణయించి డీలర్లను హడావుడి పెడుతుండటంతో వారు కార్డుదారులను తొందరపెడుతున్నారు. మొరాయించిన ఈ-పోస్ యంత్రాలు జిల్లాలో 2,163 చౌకధరల దుకాణాలుండగా వాటిలో అధిక భాగం దుకాణాల్లో శుక్రవారం ఈపోస్ యంత్రాలు పనిచేయలేదు. ఈ యంత్రాలను ఆన్ చేస్తే నాట్ యాక్టివేటెడ్ అని చూపిస్తుండటంతో చేసేదేమీ లేక కార్డుదారులు, రేషన్‌డీలర్లు అవి పనిచేసే వరకు వేచిచూస్తూ కాలం గడిపారు. ఈ యంత్రాలు పనిచేయకపోవడంతో జిల్లా వ్యాప్తంగా వేలాది మంది కార్డుదారులు పనులను ఆపుకుని రేషన్‌షాపుల వద్దే ఉండిపోవాల్సి వచ్చింది. గంటల తరబడి వేచిఉన్నా యంత్రాలు పనిచేయకపోవడంతో ఇదేం పద్ధతని, నెలలో మూడు రోజులు మాత్రమే సరుకులు ఇస్తామనడమేమిటని కార్డుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేషన్ డీలర్లు ఉదయం 7 గంటలకు దుకాణాలు తెరిచినప్పటికీ మధ్యాహ్నం 12 గంటలకు కేవలం 8 నుంచి 10 కార్డులకు మాత్రమే సరుకులను అందజేయగలిగారు. ఉదయం 7 గంటలకే వచ్చా ఉదయం ఏడు గంటలకే వచ్చా. మధ్యాహ్నం 12 గంటలైనా బియ్యం ఇవ్వలేదు. మిషన్లు పనిచేయడం లేదని డీలరు చెప్పారు. అందరం అలాగే రేషన్‌షాపు వద్ద కూర్చున్నాం. కూలికెళితే రూ.250 వచ్చేవి. మళ్లీ ఇంకొకరోజు రావాలి. కోట్లపాటి అంజమ్మ, యానాదుల కాలనీ, నూజివీడు ఇబ్బందులు పడుతున్నాం ఈ విధానం వల్ల మేము ఇబ్బందులు పడుతున్నాం. ఉదయం 7 గంటలకు వచ్చినా యంత్రం పనిచేయక అలాగే ఉన్నాం. గతంలో కుటుంబంలో ఎవరు వచ్చినా రేషన్ ఇచ్చేవారు. అలా ఇస్తే తప్పేమిటో మాకు అర్థం కావడం లేదు. గంటల తరబడి నిలబెట్టడం దారుణం. పాటి శ్రీరామమూర్తి, బాపూనగర్, నూజివీడు -
ఈ పాస్‌తో రేషన్ దూరం
ఈ-పాస్ నిరుపేదల పాలిట శాపంగా తయారైంది. వీరి ఆకలి తీర్చే లక్ష్యంతో ప్రారంభించిన ఆహారభద్రత వారికి లేకుండా చేస్తోంది. గత నెలలో శ్రీకారం చుట్టిన ఈపాస్ ఇక్కట్ల వల్ల 80 శాతం కార్డుదారులకు పాత పద్ధతిలోనే సరకులు అందించారు. ఈ నెలలో పూర్తిగా ఈ పాస్ ద్వారానే అమలు చేయాలన్న జిల్లా యంత్రాంగం పట్టుదల కారణంగా ఈసారి పాత పద్ధతిలో సరుకులివ్వలేదు. దీంతో జిల్లావ్యాప్తంగా రెండున్నర లక్షల కార్డు హోల్డర్లకు ఈ నెలలో సరకులకు దూరమయ్యాయి. - జిల్లాలో పదిలక్షల మందికి అందని సరకులు - గగ్గోలు పెడుతున్న పేదలు సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో జీవీఎంసీ పరిధిలోని 412, భీమిలి, అనకాపల్లి, యలమంచలి, నర్సీ పట్నం మున్సిపాల్టీలతో పాటు పది మండలాల పరిధిలో 274 రేషన్‌షాపులో ఏప్రిల్ ఒకటి తేదీ నుంచి ఈ-పాస్ (ఎలక్ట్రానిక్ పేమెంట్ అండ్ అప్లికేషన్ సిస్టమ్) ద్వారా సరుకుల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈపాస్ పుణ్యమాని కేవలం 2,09,982 మందికి మాత్రమే గత నెలలో సరకులు పంపిణీ చేయగలిగారు. 6,26,548 కార్డుదారులకు పాతపద్ధతి (డిజిటల్ కీ రిజిస్ట్రార్) లోనే పంపిణీ చేశారు. ఆ నెలలో 7,389 కార్డుదారులు సరకులు తీసుకెళ్లలేదని గుర్తిం చారు. కాగా ఈ నెలలో నూటికి నూరు శాతం ఈపాస్ ద్వారానే సరకులివ్వాలని జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు డీలర్లపై ఒత్తిడి తీసుకొచ్చారు. డీలర్లే కావాలని మెషీన్లు పనిచేస్తున్నా పనిచేయడంలేదంటూ పక్కన పెట్టేస్తున్నారంటూ ఒకరిద్దరి డీలర్లపై క్రమశిక్షణ చర్యలకు సైతం తీసుకున్నారు. ఇంతలా ఒత్తిడితీసుకొచ్చినా చివరకు అతికష్టంమ్మీద ఈనెలలో 6,06,444 కార్డుదారులకు మాత్ర మే ఈ-పాస్ ద్వారా సరకులివ్వగలిగారు. 2,56,245 కార్డుదారులకు అసలు సరుకులే ఇవ్వలేదు. జీవీఎంసీ పరిధిలో 412 షాపుల్లో ఈ-పాస్ అమలుచేస్తున్నారు. ఇక్కడ 3,69,934 కార్డుదారుల్లో ద్వారా 2,50,888 కార్డుదారులకు మాత్రమే సరఫరా చేయగలిగారు. మరో 1,19,046 మందికి సరకులివ్వలేదు. ఇక రెండు మున్సిపాల్టీలు, ఏడు మండలాలపరిధిలో 4,92,755 కార్డులుండగా, ఈ పాస్‌ద్వారా 3,55, 556 కార్డుదారులకు మాత్రమే సరకులు పంపిణీ చేయగలిగారు. మరో 1,37,199 కార్డుదారులకు అసలు సరకులు పంపిణీ చేయలేదు. అంటే మొత్తమ్మీద 2,56,245 కార్డుదారులకు సరకుల పంపిణీజరగలేదు.ఒకోకార్డులనలుగురు చొప్పున లెక్కేసుకున్నా 10,24,980 మందికి మే నెలలో సరకులు అందని పరిస్థితి నెలకొంది. ఆహార భద్రత పేరుతో కార్డులోని ఒక్కొక్కరికి నాలుగు కేజీల నుంచి ఐదు కేజీలకు పెంచినా ఈ రెండు నెలల్లో ఏ ఒక్కరూ మనశ్శాంతిగా పూర్తిస్థాయిలో సరుకులు తీసుకున్న పాపాన పోలేదు. గత నెల 25వ తేదీ వరకు సరకులు పంపిణీ చేసినప్పటికీ ఈ నెలలో 22వ తేదీతోనే పంపిణీని నిలుపుదల చేశారు. జూన్ నెలలో లిప్టింగ్ కోసం డీలర్ల నుంచి ఇండెంట్లు తీసుకోవడం మొదలు పెట్టారు. అంటే ఈ నెలలో మిగిలిన కార్డుదారుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. నెలాఖరు వరకు సరుకులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. -
పేదలు సంక్రాంతిని ఘనంగా జరుపుకోవాలి
మంత్రి పరిటాల సునీత తొండూరు : పేద ప్రజలు సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకోవాలని పౌరసరఫరాల శాఖమంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం తొండూరు టీటీడీ కల్యాణ మండపం ఆవరణంలో సర్పంచ్ కుళ్లాయమ్మ అధ్యక్షతన ‘చంద్రన్న సంక్రాంతి కానుక’ సరుకుల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గోధుమపిండి, శనగలు, బెల్లం, పామాయిల్, కందిపప్పు, నెయ్యి సంక్రాంతి పండుగకు ఉచితంగా అందించాలన్న ముఖ్యమంత్రి నిర్ణయం చాలా గొప్పదన్నారు. ఉచిత సరుకులు పంపిణీ చేసేటప్పుడు రేషన్ షాపులలో బ్యానర్లో చంద్రబాబు ఫొటో లేకపోతే రేషన్ షాపులను రద్దు చేస్తామని ఆమె హెచ్చరించారు. కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చెర్మైన్ సతీష్‌రెడ్డి, అనంతపురం జెడ్పీ చైర్మన్ చమన్, జాయింట్ కలెక్టర్ రామారావు, ఆర్డీవో వినాయకం, సింగిల్‌విండో వైస్ ప్రెసిడెంటు చంద్ర ఓబుళరెడ్డి, మాజీ జెడ్పీటీసీ శివమోహన్‌రెడ్డి, తహశీల్దార్ ఎల్.వి.ప్రసాద్, ఎంపీడీవో ప్రభాకర్‌రెడ్డి, డీఎస్వో ప్రభాకరరావు, ఎన్ఫోర్స్మెంట్ డీటీ బాబయ్య, ఎంపీటీసీ లక్ష్మిదేవి తదితరులు పాల్గొన్నారు. పోట్లదుర్తిలో : ఎర్రగుంట్ల: ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలో జరిగిన కార్యక్రమంలో మంత్రి పరిటాల సునీత ‘చంద్ర న్న సంక్రాంతి కానుక’ సరుకలను పంపిణీ చేశారు. తొలుత ఆమె గ్రామంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రామరావు. అనంతపురం జెడ్పీ చైర్మన్ చమన్, గ్రామ సర్పంచ్ వెంకటరంగయ్య, డీఎస్ఓ ప్రభాకర్‌రావు, టీడీపీ నేత సురేష్‌నాయుడు, ఆర్డీఓ లవన్న, మండల ప్రత్యేక అధికారి మధుసూదన్‌రెడ్డి, తహశీల్దార్ బి. మహేశ్వరరెడ్డి, ఎంపీడీఓ మద్దిలేటి, టీడీపీ మహిళ అధ్యక్షురాలు కుసుమకుమారి పాల్గొన్నారు. -
పామోనిల్
- ఆరు నెలలుగా అందని పామోలిన్ - ఇక సరఫరా కష్టమేఅంటున్న అధికారులు - పౌర సరఫరాలలో ప్రతిసారీ ఇదే తంతు సాక్షి, కడప: బాబు అధికారంలోకి వస్తే అది చేస్తాం.. ఇది చేస్తాం.. రుణాల మాఫీ నుంచి నిత్యావసర సరుకుల వరకు సక్రమంగా అందిస్తామంటూ ప్రగల్భాలు పలికిన నేతలు ప్రస్తుతం ఏమి చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారు. రెండు నెలలుగా అన్న ఎన్టీఆర్ పేరుతో అమ్మహస్తం పథకాన్ని అమలు చేస్తామని బీరాలు పలుకుతూ వస్తున్నా ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. జిల్లాకు సంబంధించి సరుకుల పంపిణీలో ప్రతిసారి కోత పడుతూనే ఉంది. తాజాగా ప్రభుత్వం పామోలిన్‌కు మంగళం పాడినట్లుగా పౌర సరఫరాల శాఖ అధికారులు పేర్కొంటుండటాన్ని చూస్తే భవిష్యత్తులో పంపిణీ చేస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. సబ్సిడీ రేట్ల దృష్ట్యా పంపిణీ చేయడం కుదరదని అధికారులు చెబుతున్నారు. కానీ పరిస్థితిని పరిశీలిస్తే పామోలిన్ సరుకుల జాబితా నుంచి తొలగిస్తారని సంబంధిత శాఖ అధికారులు చెవులు కొరుక్కుంటున్నారు. ఆరు నెలలుగా పంపిణీకి నోచుకోని పామోలిన్ : అంతకుముందు రాష్ట్రపతి పాలనలో మూడు నెలలు.. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలలు కలుపుకొని దాదాపు ఆరు నెలలుగా పామోలిన్ పంపిణీకి నోచుకోలేదు. అంతకుముందు ఎన్నో ఏళ్ల నుంచి ప్రభుత్వాలు మారినా పామోలిన్ ఆయిల్ మాత్రం సక్రమంగా పంపిణీ జరిగేది. ప్రస్తుతం ఆరు నెలలుగా మండలాల్లోని రేషన్ డీలర్లకు పంపిణీ చేయకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చివరకు పండుగలు వచ్చినా సరుకు పంపిణీకి మాత్రం నోచుకోలేదు. ప్రతి వంటలోనూ నూనె వాడకం తప్పనిసరి. ఇలాంటి పరిస్థితుల్లో పామోలిన్ సరఫరా చేయకపోవడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. చౌక వస్తువుల్లోనూ కోత: జిల్లాలో 1735 రేషన్‌షాపులు ఉండగా 7,48,575 మంది కార్డుదారులు ఉన్నారు. ఈ కుటుంబాలకు సంబంధించి అమ్మహస్తం పథకంలో పంపిణీ చేసే చాలా వస్తువులు ప్రస్తుతం కోత పెట్టారు. ప్రస్తుతం జిల్లాలోని 19 గోడౌన్లకు బియ్యం, చక్కెర మాత్రమే అన్ని గోడౌన్లకు పంపి రేషన్షాపులన్నింటికీ అందించారు. అయితే గోధుమపిండి మాత్రం కడప, చెన్నూరు, ఎర్రగుంట్ల, లక్కిరెడ్డిపల్లి, రాయచోటి, ఒంటిమిట్ట, సిద్ధవటం, పోరుమామిళ్ళ, జమ్మలమడుగు, ముద్దనూరు, పులివెందుల, వేంపల్లికి మాత్రమే అందించగా మిగతా ప్రాంతాలకు గోధుమపిండి కొరత ఏర్పడింది. కందిబేడలకు సంబంధించి కూడా జిల్లాలోని చెన్నూరు, ఎర్రగుంట్ల, రాయచోటి, చిన్నమండెం, ముద్దనూరు, పులివెందుల సెంటర్లకు మాత్రమే పంపించారు. సరుకు ఉన్న మేరకు మాత్రమే పంపండంతో చాలా మండలాలకు కందిపప్పు ప్రస్తుతానికి అందేటట్లు కనిపించడం లేదు. గోధుమలు కూడా కడప, రాయచోటి, ప్రొద్దుటూరు, పులివెందుల తదితర ప్రాంతాల్లో మాత్రమే సరఫరా చేశారు. అమ్మహస్తం పథకంలో భాగంగా 9 వస్తువులను సరఫరా చేస్తూ వస్తున్న ప్రభుత్వం ఈసారికి మాత్రం ఒక్క బియ్యం, చక్కెర పూర్తిగా అన్ని రేషన్‌షాపులకు అందిస్తుండగా మిగతా వస్తువులను మాత్రం పూర్తిస్థాయిలో కోత విధించారు. పౌర సరఫరాల శాఖ డీఎం ఏమంటున్నారంటే ప్రస్తుతం సెప్టెంబర్ నెలకు సంబంధించి నిత్యావసర వస్తువుల విషయంలో కోత పెడుతున్న విషయాన్ని సాక్షి ప్రతినిధి పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ బుల్లయ్య దృష్టికి తీసుకుపోగా.. ప్రస్తుతానికి పామోలిన్ రాలేదని పేర్కొన్నారు. భవిష్యత్తులో రావడం కూడా కష్టమేనని.. పామోలిన్‌ను రేషన్ సరుకుల జాబితా నుంచి తొలగించే అవకాశముందన్నారు. ఈసారి బియ్యం, చక్కెరతోపాటు కొంతమేర స్టాక్ ఉన్న కందిబేడలు, గోధుమపిండి, గోధుమలు మాత్రమే పంపిణీ చేస్తున్నట్లు ఆయన స్పష్టంచేశారు. -
రిక్త హస్తం
- అరకొరగా సరుకుల పంపిణీ - 48 వేల రచ్చబండ కార్డులకు సరుకుల నిలిపివేత - పామాయిల్‌పై రాయితీ ఎత్తేసిన గత ప్రభుత్వం - దీనిపై స్పష్టత ఇవ్వని నూతన ప్రభుత్వం సాక్షి, అనంతపురం : అమ్మహస్తం.. ఈ పేరు వింటేచాలు నిరుపేదలు హడలెత్తుతున్నారు. నెలనెలా అందించే నిత్యావసర సరుకుల్లో కోతలు పెడుతుండడంతో పేదల కడుపునిండడం లేదు. పేదలకు సబ్సిడీపై అందించే తొమ్మిది రకాల నిత్యావసర వస్తువుల పథకం ‘అమ్మ హస్తం’ అమలు అస్తవ్యస్తంగా మారింది. తొమ్మిది సరుకులలో కోత విధిస్తుండటంతో ఉపయోగం లేకుండా పోతోంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలో మొత్తం 2,880 చౌకధరల దుకాణాల పరిధిలో 11.50 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. కార్డుదారులకు ప్రతి నెలా అమ్మహస్తం పథకం కింద పామాయిల్ (లీటర్), కందిపప్పు (కిలో), చక్కెర (అరకిలో), గోధుమ పిండి (కిలో), గోధుమలు (కిలో), అయోడైజ్డ్ ఉప్పు (కిలో), కారంపొడి (250 గ్రాములు), పసుపు (100 గ్రాములు), చింతపండు (అరకిలో) సరఫరా చేయాలి. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు జరిగిన రచ్చబండలో ఇచ్చిన 48 వేల రేషన్‌కార్డులకు రెండు నెలలుగా సరుకులు ఇవ్వడం లేదు. ఇక మిగతాకార్డుదారులకు పామాయిల్, పసుపు పంపిణీ చేయడం లేదు. పామాయిల్‌కు రాయితీ ఎత్తివేత మలేషియా నుంచి పామాయిల్‌ను కాకినాడకు తీసుకువచ్చి అక్కడే ప్యాకింగ్ చేసి జిల్లాకు పంపుతారు. దీనిపై మూడు నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం రాయితీ నిలిపివేసింది. ఆ వెంటనే దిగుమతి కూడా ఆగిపోయింది. రాష్ట్రపతి పాలన అమల్లోకి రావడం, వరుస ఎన్నికలు వచ్చిపడడంతో దీనిపై దృష్టి సారించలేదు. కేంద్రంలో నూతన ప్రభుత్వం కొలువుదీరినా పామాయిల్‌కు రాయితీ కొనసాగింపు విషయంలో ప్రకటన చేయలేదు. దీంతో రెండు నెలలుగా కార్డుదారులు పామాయిల్‌కు నోచుకోలేదు. అంతా గందరగోళమే అమ్మహస్తం సరుకుల సరఫరాలో గందరగోళం నెలకొంది. వీటి కొనుగోలుకు డీలర్ రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు పెట్టుబడులు పెట్టాలి. డీలర్లు అంత మొత్తంలో పెట్టుబడులు పెట్టే సామర్థ్యం లేకపోవడంతో బ్యాంకు రుణాలు తెచ్చుకుంటున్నారు. అయితే అమ్మహస్తం సరుకుల్లో నాణ్యత లోపిస్తుండంతో వీటిలో కొన్నింటిని తీసుకోవడానికి కార్డుదారులు సుముఖత చూపడం లేదు. దీంతో కొన్ని సరుకులు అమ్ముడుపోనందున.. అప్పు చేసి డీడీ తీయాల్సి వస్తుందని డీలర్లు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఆదాయం.. చేసిన అప్పుకు వడ్డీ కట్టేకే సరిపోతుందంటున్నారు. ఈ కారణంతో డీలర్లు కొన్ని సరుకులను సరఫరా చేయడానికి ఆసక్తి చూపడం లేదు. మరోవైపు సరుకులను జిల్లాకు తెప్పించడంలో అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారు. బియ్యంతో పాటే సరుకులను కూడా గోదాముల్లో నిల్వ చేయాలి. బియ్యంతో పాటే రేషను సరుకులు సకాలంలో జిల్లాకు రాకపోవడం, సకాలంలో వచ్చినా రెండింటినీ నిల్వ చేసే సామర్థ్యం గోదాముల్లో లేకపోవడంతో ఆలస్యంగా వచ్చిన సరుకులు గోదాముల్లోనే మూలగాల్సిన దుస్థితి నెలకొంది. పథకం అమలు తీరుపై ఆరా ‘అమ్మహస్తం’ పథకంపై చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఆరాతీస్తున్నట్లు తెలిసింది. ఆ సరుకులు ఎంతవరకు ప్రజల అవసరాలు తీరుస్తున్నాయో పరిశీలించి నివేదికలు పంపాలని ఉన్నతాధికారులను ఆదేశించినట్లు సమాచారం. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్ర బడ్జెట్ రూ.16 వేల కోట్ల లోటుతో ఉంది. ఈ మేరకు లోటును తగ్గించుకోవాలంటే ప్రజలకు పెద్దగా అవసరం ఉండని పథకాలను కొన్నింటిని ప్రభుత్వం రద్దు చేసే యోచనతోనే ఈ విధమైన ప్రతిపాదనలు కోరుతున్నట్లు తెలిసింది. ‘అమ్మహస్తం’లోని తొమ్మిది రకాల వస్తువుల్లో కొన్నింటిని ప్రజలు తీసుకెళ్లడం లేదన్నది బహిరంగ రహస్యం. బియ్యంతో పాటు పామాయిల్, పంచదార, గోధుమలు, కందిపప్పు సరఫరా చేస్తే చాలని పౌరసరఫరాల శాఖ అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు సరుకులలో కొన్నింటిని తొలగించే ప్రమాదం కూడా ఉందని తెలుస్తోంది. -
టీడీపీ పరేషన్
ఓటమి భయంతో ఓటర్లకు ప్రలోభాలు ప్రతీ ఇంటికి బియ్యం, సరకులు పంపిణీ పోటాపోటీగా కాంగ్రెస్ కోట్లు కుమ్మరిస్తున్న అభ్యర్థులు విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : ప్రజా వ్యతిరేకత, రెబెల్స్ పోకడ, అసంతృప్తుల సెగలు తెలుగుదేశం అభ్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అధినాయకులొచ్చి ప్రచారం చేపట్టినా స్పందన కానరాకపోవడంతో ఆ పార్టీ శ్రేణుల్లో నిస్తేజం అలుముకుంటోంది. ఎన్నికలకు ముందే ఓటమి భయం పట్టిపీడిస్తోంది. దీంతో ప్రలోభాలకు పెద్ద పీట వేస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకోవడానికి ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. చావో.. రేవోలా మారిన ఈ ఎన్నికల్లో రూ.కోట్లు కుమ్మరిస్తున్నారు. విశ్వాసపాత్రులను రంగంలోకి దించి పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. స్థానిక అవసరాలు, పరిస్థితులను బట్టి ఓటర్లకు రేషన్ బియ్యం, నిత్యావసరాలు విచ్చలవిడిగా పంపిణీ చేస్తూ ఆకుట్టుకోవడానికి యత్నిస్తున్నారు. జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి యథేచ్ఛగా సాగిపోతోంది. అభ్యర్థుల అనుయాయులు ఇంటింటికి బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. ప్రధానంగా విశాఖ-దక్షిణం, విశాఖ-ఉత్తరం, విశాఖ-తూర్పు, భీమిలి, పెందుర్తి, పాయకరావుపేట, నర్సీపట్నం నియోజకవర్గాల్లో ఈ విధానం జోరుగా సాగుతోంది. విశాఖ వన్‌టౌన్, భీమిలి, పాయకరావుపేట ప్రాంతాల్లో పంపిణీ చేస్తున్న సరుకులను అధికారులు ఇటీవల పట్టుకోవడం ఇందుకు తార్కాణం. అయితే స్కీములు, చిట్టీలు వేసుకొని కొనుగోలు చేసుకుంటున్నామంటూ అభ్యర్థుల అనుచరగణం చెప్పడంతో అధికారులు ఏమీ చేయలేక వాటిని విడిచిపెట్టారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం పరిధిలో వన్‌టౌన్, అల్లిపురం ప్రాంతాల్లో వాసు బ్రాండ్ బియ్యాన్ని ఇంటింటికీ పంపిణీ చేస్తున్నారు. భీమిలి నియోజకవర్గంలో జనాభా ఆధారంగా గ్రామాల్లో యథేచ్ఛగా డబ్బు వెదజల్లుతున్నారు. ఒక్కో గ్రామానికి ఒక రేటును నిర్ణయించి ముట్టుచెపుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అక్కడి టీడీపీ అభ్యర్థి అయిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు నామినేషన్ వేసిన వెంటనే ఉచిత మీల్స్ పేరుతో మెస్ పుట్టుకొచ్చింది. రోజూ వందలు, వేల మందికి ఉచితంగా భోజనాన్ని అందిస్తూ వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే ఆ మెస్‌ను మూయించడంతో పాటు నిర్వాహకునిపై కేసు నమోదు చేశారు. విశాఖ-తూర్పు నియోజకవర్గంలో మద్యం ఏరులై పారుతోంది. ఇతర ప్రాంతాల నుంచి చీప్ లిక్కరును దిగుమతి చేయించి అనుచరుల ద్వారా మందుబాబులకు పీకలదాకా తాగిస్తున్నారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. ఇటీవల విశాఖలోని సీతమ్మధార చెక్‌పోస్టు వద్ద ఒక మాజీ ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న వాహనంలో భారీగా మద్యం కేసులు బయటపడ్డాయి. వాటికి సంబంధించిన బిల్లులు ఉన్నాయంటూ అధికారులు వాటిని విడిచిపెట్టారు. వీరికి దీటుగా కాంగ్రెస్ అభ్యర్థులు పంపకాలు చేపడుతున్నారన్న వాదనలు ఉన్నాయి. టీడీపీ తరహాలోనే ఇంటికో బియ్యం బస్తాతో పాట అదనంగా ఒక బిందె కూడా ఇస్తున్నారు. డబ్బు, మద్యం, సరుకులు...ఇలా ఎన్ని పంపిణీ చేసినా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టే పార్టీకే ప్రజలు పట్టం కడతారన్న వాదన సర్వత్రా వ్యక్తమవుతోంది.