పేదలు సంక్రాంతిని ఘనంగా జరుపుకోవాలి
మంత్రి పరిటాల సునీత
తొండూరు : పేద ప్రజలు సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకోవాలని పౌరసరఫరాల శాఖమంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం తొండూరు టీటీడీ కల్యాణ మండపం ఆవరణంలో సర్పంచ్ కుళ్లాయమ్మ అధ్యక్షతన ‘చంద్రన్న సంక్రాంతి కానుక’ సరుకుల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గోధుమపిండి, శనగలు, బెల్లం, పామాయిల్, కందిపప్పు, నెయ్యి సంక్రాంతి పండుగకు ఉచితంగా అందించాలన్న ముఖ్యమంత్రి నిర్ణయం చాలా గొప్పదన్నారు.
ఉచిత సరుకులు పంపిణీ చేసేటప్పుడు రేషన్ షాపులలో బ్యానర్‌లో చంద్రబాబు ఫొటో లేకపోతే రేషన్ షాపులను రద్దు చేస్తామని ఆమె హెచ్చరించారు. కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చెర్మైన్ సతీష్‌రెడ్డి, అనంతపురం జెడ్పీ చైర్మన్ చమన్, జాయింట్ కలెక్టర్ రామారావు, ఆర్డీవో వినాయకం, సింగిల్‌విండో వైస్ ప్రెసిడెంటు చంద్ర ఓబుళరెడ్డి, మాజీ జెడ్పీటీసీ శివమోహన్‌రెడ్డి, తహశీల్దార్ ఎల్.వి.ప్రసాద్, ఎంపీడీవో ప్రభాకర్‌రెడ్డి, డీఎస్‌వో ప్రభాకరరావు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ బాబయ్య, ఎంపీటీసీ లక్ష్మిదేవి తదితరులు పాల్గొన్నారు.
పోట్లదుర్తిలో : ఎర్రగుంట్ల: ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలో జరిగిన కార్యక్రమంలో మంత్రి పరిటాల సునీత ‘చంద్ర న్న సంక్రాంతి కానుక’ సరుకలను పంపిణీ చేశారు. తొలుత ఆమె గ్రామంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రామరావు. అనంతపురం జెడ్పీ చైర్మన్ చమన్, గ్రామ సర్పంచ్ వెంకటరంగయ్య, డీఎస్‌ఓ ప్రభాకర్‌రావు, టీడీపీ నేత సురేష్‌నాయుడు, ఆర్డీఓ లవన్న, మండల ప్రత్యేక అధికారి మధుసూదన్‌రెడ్డి, తహశీల్దార్ బి. మహేశ్వరరెడ్డి, ఎంపీడీఓ మద్దిలేటి, టీడీపీ మహిళ అధ్యక్షురాలు కుసుమకుమారి పాల్గొన్నారు.