Paritala sunita
-
కాకమ్మ కథలు చెప్పొద్దు.. మీ ఇగో పక్కన పెట్టి ప్రాజెక్ట్ పూర్తి చేయండి
-
పరిటాల సునీతకు ఝలక్..!
ఎన్నికల ప్రక్రియ ఆదిలోనే పరిటాల సునీతకు ఊహించని షాక్ తగిలింది. రాప్తాడు అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ రెబల్‌గా ప్రొఫెసర్ రాజేష్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసి సునీతకు ఝలక్ ఇచ్చారు. నియోజకవర్గ కేంద్రం రాప్తాడులో ఏర్పాటు చేసిన ఆర్ఓ కార్యాలయంలో గురువారం ప్రొఫెసర్ రాజేష్ తన మొదటి సెట్ నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు అందజేశారు. సునీతకు గట్టి దెబ్బే.. కనగానపల్లి మండలం రాంపురం గ్రామానికి చెందిన ప్రొఫెసర్ రాజేష్ టీడీపీ సానుభూతిపరుడు. ఆయన తండ్రి రామన్న గతంలో పరిటాల రవికి ప్రధాన అనుచరుడిగా ఉండేవారు. కనగానపల్లి సర్పంచ్‌గానూ పనిచేశారు. ప్రస్తుతం రాజేష్ పలు రాష్ట్రాల్లో విద్యా సంస్థలు నిర్వహించుకుంటూ ప్రొఫెసర్ వృత్తిలో ఉన్నారు. రెండు సంవత్సరాలుగా రాప్తాడు నియోజకవర్గంలో తిరుగుతూ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో టీడీపీ తరఫున రాప్తాడు అసెంబ్లీకి కానీ, హిందూపురం ఎంపీ స్థానం నుంచి కానీ పోటీ చేయాలని భావించారు. ఈ మేరకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను కూడా కలిసి విజ్ఞప్తి చేశారు. కానీ, ప్రజాదరణ ఉన్న వారిని పట్టించుకోకుండా డబ్బున్న అభ్యర్థుల వైపు చంద్రబాబు చూడడంతో రాజేష్‌కు భంగపాటు తప్పలేదు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన ఆయన రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీకి దిగారు. ఇప్పటికే రాప్తాడులో ప్రజా బలం లేక ఇబ్బందులు పడుతున్న టీడీపీ అభ్యర్థి పరిటాల సునీతకు రాజేష్ కారణంగా గట్టి దెబ్బే తగిలే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇవి చదవండి: నామినేషన్ల మొదలైనా.. తెగని టీడీపీ సీట్ల పంచాయితీ! -
పరిటాల ఫ్యామిలీకి గడ్డు కాలం
తెలుగుదేశంలో వ్యక్తులను బట్టి న్యాయ సూత్రాలు మారిపోతున్నాయి. ఒకొక్క కుటుంబానికి ఒక్కో రూల్ అన్నట్లుగా పార్టీ నడుస్తోంది. తమకు నచ్చితే ఒక విధంగా లేకుంటే ఇంకోవిధంగా రూల్స్ మార్చేసే చంద్రబాబు ఇప్పుడు పరిటాల కుటుంబాన్ని మెల్లగా డైల్యూట్ చేస్తున్నారు. ఒకనాడు అనంతపురంతోబాటు రాయలసీమలో అధికభాగాన్ని ప్రభావితం చేసిన పరిటాల కుటుంబం ఇప్పుడు ఉనికికోసం పోరాడుతోంది. గతంలో పెనుగొండ నుంచి గెలిచిన పరిటాల రవి మంత్రిగా పని చేశారు. జిల్లావ్యాప్తంగానే కాకుండా రాయలసీమ, కోస్తాలో సైతం హవా వెలగబెట్టారు. అయన మరణం తరువాత ఎమ్మెల్యేగా గెలిచిన సునీత సైతం టీడీపీలో మంత్రిగా చేసారు. అయితే ఇప్పుడు ఆ కుటుంబం సునీతతోబాటు కుమారుడు శ్రీరామ్‌కు రెండు టిక్కెట్స్ అడుగుతోంది. కానీ దీనికి చంద్రబాబు వ్యతిరేకంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒక ఫ్యామిలీకి ఒకటే టిక్కెట్ ఇస్తామని, రెండేసి ఇవ్వలేమని, ఇది రాష్ట్రవ్యాప్త పాలసీ అని చెబుతున్నారు. కానీ లోకేష్, చంద్రబాబు, బాలయ్యబాబు మాత్రం ఒకే ఫ్యామిలీ నుంచి ఉండొచ్చా అనే ప్రశ్నలు పరిటాల క్యాంప్ నుంచి వినిపిస్తున్నాయి. ఇక లోకేష్, చంద్రబాబు మాత్రం రెండేసి చోట్ల పోటీ చేస్తారని అంటున్నారు. చంద్రబాబు కుప్పం నుంచి.. లోకేష్ మంగళగిరి నుంచి.. బాలకృష్ణ హిందూపురం నుంచి.. బాల కృష్ణ చిన్న అల్లుడు భరత్.. విశాఖ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తున్నాకానీ మాకు మాత్రం రాప్తాడు, ధర్మవరం రెండు సీట్లు ఇవ్వరా అని పరిటాల కుటుంబం ఆవేదన చెందుతోంది. మరోవైపు శ్రీకాకుళం ఎంపీగా రామ్మోహన్ నాయుడు పోటీ చేస్తుండగా టెక్కలి నుంచి అయన బాబాయ్ అచ్చెన్నాయుడు బరిలో ఉన్నారు. మరి వాళ్ళు మాత్రం ఒకే కుటుంబం కాదా అని పరిటాల కుటుంబం అడుగుతోంది. రాప్తాడు నుంచి పరిటాల రవి సతీమణి సునీత.. కుమారుడు శ్రీరామ్ ఆశిస్తున్నారు కానీ రాప్తాడు వరకూ ఒకే చేసిన చంద్రబాబు ధర్మవరం టిక్కెట్ మాత్రం ఇచ్చేదిలేదని అంటూ అక్కడ వరదాపురం సూరి వైపు మొగ్గు చూపుతున్నారు. యువతకు 40 సీట్లు ఇస్తానని మహానాడులో భారీగా హామీ అయితే ఇచ్చారు కానీ అమల్లోకి వచ్చేసరికి మాత్రం ఆ మాటలను గాలికి వదిలేస్తున్నారు. ఇదిలా ఉండగా ధర్మవరంలో వరదాపురం సూరికి, పరిటాల కుటుంబానికి మధ్య యేళ్ళనాటి వైరం ఉంది. దీంతోబాటు పయ్యావుల కేశవ్, ప్రభాకర్ చౌదరి కూడా పరిటాలను ధర్మవరం రానివ్వడం లేదు. వాళ్ళు అవకాశం వస్తే పరిటాల కుటుంబాన్ని ఓడించడానికి చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇలా జిల్లాలో మూలమూలనా వ్యతిరేకత మూటగట్టుకుని శత్రువులను పెంచుకుంటూ వెళ్లిన పరిటాల కుటుంబాన్ని ఆదరించేందుకు ఎవరూ సిద్ధంగా లేకపోవడంతో రాప్తాడుతో సరిపెట్టేసేందుకు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. - సిమ్మాదిరప్పన్న -
లోకేశ్ తీరుతో టీడీపీలో కొత్త ట్విస్ట్.. తెరపైకి పరిటాల ఫ్యామిలీ పాలిటిక్స్!
నారా లోకేశం పాదయాత్ర తెలుగుదేశం పార్టీలో గందరగోళం రేపుతోంది. ఇప్పటివరకు తాను పర్యటించిన చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించేశారు లోకేశం. చాక్లెట్ల మాదిరి టిక్కెట్లు పంచిపెట్టడాన్ని కొందరు ఆశావహులు తప్పుపడుతున్నారట. చంద్రబాబు ఆదేశాలతో ప్రకటిస్తున్నారా? లేక సొంతంగా ఇచ్చేస్తున్నారా అని సందేహపడుతున్నారని టాక్. నారా లోకేశం కామెడీపై ఓ లుక్కేద్దాం.. తెలుగుదేశం అనే ప్రాంతీయ పార్టీకి జాతీయ ప్రధానకార్యదర్శిగా ఉన్న నారా లోకేష్ పాదయాత్ర ఆ పార్టీ నాయకుల్లోనే టెన్షన్ క్రియేట్ చేస్తోంది. చిన్న పిల్లలకు చాక్లెట్లు ఇచ్చేసినట్లుగా.. అనేక నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించేస్తున్నారు. తనకు కావాల్సినవారి పేర్లు ప్రకటిస్తూ.. వారిని ఆశీర్వదించాలని కేడర్‌ను కోరుతున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో టిక్కెట్లు ఆశిస్తున్న నేతలు లోకేశ్ తీరుతో గందరగోళానికి గురవుతున్నారు. తాజాగా శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం అభ్యర్థిగా పరిటాల శ్రీరాం పేరును నారా లోకేష్ ఖరారు చేశారు. శ్రీరాం చేతిని పట్టుకుని పైకెత్తి మరీ ఆశీర్వదించాలంటూ కోరారు. 2014లో ధర్మవరం ఎమ్మెల్యేగా గోనుగుంట్ల సూర్యనారాయణ అలియాస్ వరదాపురం సూరి గెలిచారు. 2019 ఎన్నికల్లోనూ టీడీపీ నుంచి పోటీ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ చేతిలో ఘోరంగా ఓడిపోయారు. ఆ తర్వాత కొన్ని రోజులకే వరదాపురం సూరి కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ధర్మవరం సీటు పరిటాల శ్రీరామ్‌కు.. ఇక, మళ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ధర్మవరం టిక్కెట్ కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో రహస్యంగా మంతనాలు జరుపుతున్నారు వరదాపురం సూరి. త్వరలోనే వరదాపురం సూరి టీడీపీలో తిరిగి ప్రవేశించబోతున్నారని.. ఆయనకు ధర్మవరం టిక్కెట్ కూడా ఖరారు అయిందని టీడీపీ వర్గాల్లోనే కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇంతలో పాదయాత్రలో భాగంగా ధర్మవరం వచ్చిన నారా లోకేష్ ఏకంగా మాజీ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరాంను అభ్యర్థిగా ప్రకటించేశారు. గత ఎన్నికల్లో రాప్తాడు నుంచి పోటీ చేసిన శ్రీరాం.. వైఎస్ఆర్సీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేతిలో ఘెరంగా ఓటమి చెందారు. వరదాపురం సూరి బీజేపీలోకి వెళ్లిన తర్వాత ఖాళీ అయిన ధర్మవరంలోకి అడుగుపెట్టారు పరిటాల శ్రీరాం. తన తల్లి పరిటాల సునీతకు తిరిగి రాప్తాడు అప్పగించి ధర్మవరం టీడీపీ ఇంఛార్జిగా శ్రీరాం కొనసాగుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో రాప్తాడు నుంచి పరిటాల సునీత, ధర్మవరం నుంచి పరిటాల శ్రీరాం పోటీ చేస్తున్నట్లు నారా లోకేష్ స్పష్టం చేశారు. లోకేశ్ ప్రకటనతో టీడీపీలో చర్చ.. లోకేశ్ ప్రకటన తర్వాత ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరికి రెండు టిక్కెట్లు ఎలా ఇస్తారంటూ తెలుగుదేశం పార్టీలోనే చర్చ జరుగుతోంది. ఇదే నిజమైతే మాకు అలాగే ఇవ్వాలని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కుటుంబం నుంచి డిమాండ్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు జేసీ అస్మిత్ రెడ్డి తాడిపత్రి అసెంబ్లీ నుంచి, దివాకర్ రెడ్డి తనయుడు జేసీ పవన్ కుమార్ రెడ్డి అనంతపురం పార్లమెంటు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వచ్చే ఎన్నికల్లో కేవలం తాడిపత్రికే పరిమితం కావాలని జేసీ కుటుంబానికి చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది. ఇప్పుడు పరిటాల కుటుంబానికి రెండు టిక్కెట్లు ఖరారు కావటంతో తమ గళం వినిపించేందుకు జేసీ ఫ్యామిలీ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. దీనికితోడు పరిటాల కుటుంబానికి రెండు టిక్కెట్లు ఇవ్వటం పట్ల అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలకు చెందిన పలువురు టీడీపీ సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రాధాన్యత పెంచుతూ పోతుంటే.. చంద్రబాబునాయుడు మాత్రం సొంత సామాజిక వర్గానికి మాత్రమే పట్టం కట్టడం ఎంత వరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. దీంతో, మొత్తం మీద చంద్రబాబు తనయుడు లోకేశ్ పాదయాత్ర వల్ల టీడీపీకి లాభం కలిగించకపోగా.. పార్టీ నాయకుల్లోనే విభేదాలు పెంచుతోంది. అసలు లోకేశ్ ప్రకటిస్తున్న టిక్కెట్లు నిజమేనా.. లేక ఉత్తిత్తి టిక్కెట్లా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. -
అనంతలో పరిటాల వర్గీయుల దౌర్జన్యం.. పోలీసులకు గాయాలు!
సాక్షి, అనంతపురం: అనంతపురంలో పరిటాల సునీత వర్గీయులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై, ఇటీవల విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌పై కూడా టీడీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే, అంతకుముందు అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్దమని తోపుదుర్తి వర్గీయులు సవాల్ విసిరారు. ఈ క్రమంలో క్లాక్ టవర్ వద్దకు వెళ్లిన వైఎస్సార్సీపీ శ్రేణులపై పరిటాల వర్గీయలు రాళ్లు విసిరారు. ఈ సమయంలో ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేశారు. టీడీపీ కార్యకర్తలు రాళ్లు విసరడంతో పోలీసు కానిస్టేబుల్ సహా ఇద్దరికీ గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. -
దళిత మహిళపై చెయ్యెత్తిన పరిటాల సునీత
సాక్షి, అనంతపురం(రాప్తాడు): టీడీపీ నాయకురాలు, మాజీమంత్రి పరిటాల సునీత దళిత మహిళపై దౌర్జన్యం చేశారు. ‘ఏయ్..’ అంటూ చెయ్యెత్తి కొట్టేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం మరూరు గ్రామంలో సోమవారం పరిటాల సునీత పర్యటించారు. ఈ సందర్భంగా దళిత మహిళ, ఆశా కార్యకర్త అయిన ఆదిలక్ష్మిని కొట్టేందుకు ఆమె యత్నించారు. పరిటాల సునీత అనుచరుడైన రైటర్ కదిరప్ప భూముల విషయంలో తమను మోసం చేశాడంటూ కదిరప్ప సొంత అన్న నారాయణ కోడలైన ఆదిలక్ష్మి నిలదీసింది. దీన్ని జీర్ణించుకోలేని పరిటాల సునీత తన వెంట ఉండే వ్యక్తి గురించి అలా మాట్లాడతావా అంటూ ఆదిలక్ష్మికి వేలు చూపుతూ బెదిరించడమే కాక.. ‘ఏయ్’ అంటూ గద్దించారు. ఆదిలక్ష్మి కూడా ఏమాత్రమూ తగ్గకుండా అంతే స్థాయిలో ఘాటుగా బదులిచ్చింది. ఇలాంటి మోసగాళ్లను పక్కన పెట్టుకుని తిరిగితే నీ పార్టీ నాశనం అయిపోతుందంటూ మండిపడింది. చదవండి: (యువకుడితో వివాహేతర సంబంధం.. వదిలేయాలని వేడుకున్నా..) -
రాప్తాడు ఎమ్మెల్యే తల్లిపై అనుచిత వ్యాఖ్యలు.. పరిటాల సునీత అనుచరుడు అరెస్ట్
సాక్షి, రాప్తాడు: అనంతపురం జిల్లాలో టీడీపీ నేత, మాజీ మంత్రి పరిటాల సునీత తీరు వివాదాస్పదం అయింది. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తల్లిపై పరిటాల సునీత ముఖ్య అనుచరుడు గంటాపురం జగ్గు అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాయలేని భాషలో బూతులు తిట్టారు. ఈ నేపథ్యంలో గంటాపురం జగ్గును పోలీసులు అరెస్టు చేశారు. ఓ మహిళను కించపరిచేలా మాట్లాడిన గంటాపురం జగ్గును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేయాల్సిన పరిటాల సునీత అందుకు భిన్నంగా వ్యవహరించారు. టీడీపీ నేత గంటాపురం జగ్గును వెంటనే విడుదల చేయాలంటూ చెన్నేకొత్తపల్లి పీఎస్ వద్ద ఆమె తనయుడితో కలిసి హల్చల్ చేశారు. చదవండి: (షిప్ రిపేర్ హబ్‌గా విశాఖ.. అదానీ పోర్ట్స్ నుంచి అమెరికా షిప్స్ వరకూ..) -
పరిటాల సిద్ధార్థ్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు
సాక్షి, హైదరాబాద్: ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత పరిటాల సునీత చిన్న కుమారుడు పరిటాల సిద్ధార్థ్ చుట్టూ ఉచ్చు బిగిస్తుంది. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్‌తో పట్టుబడ్డ సిద్ధార్థ్‌ను వివరణ ఇవ్వాల్సిందిగా ఎయిర్‌పోర్టు పోలీసులు నోటీసులు జారీ చేశారు. సిద్ధార్థ్ లైసెన్స్డ్ గన్‌కు బ్యాగులో దొరికిన బులెట్‌కు వ్యత్యాసం ఉంది. గతంలో పాయింట్ 32 క్యాలిబర్ గన్‌కు లైసెన్స్ పొందిన సిద్ధార్థ్ బ్యాగులో.. 5.56 క్యాలిబర్ బుల్లెట్ లభ్యం అయ్యింది. (చదవండి: పరిటాల సిద్ధార్థ్ వద్ద అక్రమ ఆయుధం?) అయితే సిద్ధార్థ్ వద్ద సాయుధ బలగాలు వాడే ఇన్సాస్ రైఫిల్స్ బుల్లెట్ గుర్తించారు పోలీసులు. ఈ బుల్లెట్ సిద్ధార్థ్‌కు ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై విచారణ జరుపుతున్నారు. అనంతపూర్‌కు చెందిన ఇండో టిబెటెన్ బోర్డర్లో పని చేస్తున్న కానిస్టేబుల్ తూటాగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానిస్టేబుల్‌తో పరిటాల కుటుంబానికి పరిచయాలు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
‘అందుకే ఆత్మహత్యాయత్నం.. నన్ను ఎవరూ బెదిరించలేదు..’
రాప్తాడు: ‘‘ఉద్యోగం పోతుందనే భయంతోనే నేను ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాను. నన్ను ఎవరూ బెదిరించలేదు. దీన్ని ఎవరూ రాజకీయం చేయవద్దండి. పరిటాల సునీత దీన్ని రాజకీయం చేయడం చాలా బాధగా ఉంది’’ అని ఎం.చెర్లోపల్లి గ్రామానికి చెందిన ఆశా కార్యకర్త కపాడం అనిత అన్నారు. బుధవారం ఆమె రాప్తాడులో విలేకరులతో మాట్లాడారు. తాను పది సంవత్సరాలుగా ఆశా కార్యకర్తగా పని చేస్తున్నానని, గ్రామంలో కొందరు టీడీపీ నాయకులు తన ఉద్యోగం పోతుందని చెప్పడంతో భయాందోళనతో ఈ నెల 19న విష ద్రావకం తాగానన్నారు. వెంటనే తనను అనంతపురంలోని ప్రభుత్వ సర్వజనాస్పత్రికి తరలించి చికిత్స చేయించారన్నారు. అయితే తాను ఆస్పత్రిలో ఉన్న సమయంలో మాజీ మంత్రి పరిటాల సునీత పరామర్శించారని, ఆ తర్వాత దీన్ని రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నించారన్నారు. తనను రాజకీయ పావుగా వాడుకునేందుకు ప్రయత్నించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. తనను గ్రామంలోని వైఎస్సార్సీపీ నాయకులు ఎవరూ ఎలాంటి వేధింపులకు గురి చేయలేదన్నారు. ఇంతకు మించి ఈ ఘటనపై రాజకీయ రాద్ధాంతం తగదన్నారు. చదవండి: అవినీతి గని.. నాటి సీఎం రిలీఫ్ నిధి ప్రకృతి ఆరాధన: చెట్టు మానులే దేవతామూర్తులు.. -
ఆశావర్కర్ అనిత కేసు ఓ డ్రామా
సాక్షి, అనంతపురం: టీడీపీ మాజీ మంత్రి పరిటాల సునీత బురద రాజకీయాలు మరోసారి బయటపడ్డాయి. ఆశావర్కర్ అనితను పరామర్శించిన పరిటాల సునీత ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించిన కీలక విషయాలను సీఐ విజయభాస్కర్ వెల్లడించారు. చెర్లోపల్లిలో లైంగిక వేధింపులపై ఆశావర్కర్ అనిత పోలీసులకు ఫిర్యాదు చేసి ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే ఆమె ఉద్దేశపూర్వకంగానే, నలుగురు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేసి వాస్తవాలను వెల్లడించారు. అనిత కేసు ఓ డ్రామాగా ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు పేర్కొన్నారు. ఆమెపై ఎలాంటి లైంగిక వేధింపులు జరగలేదని తెలిపారు. ఉద్యోగం నుంచి తీసేస్తారని అనిత అపోహ పడిందని సీఐ విజయభాస్కర్ తెలిపారు. రాజకీయ ఒత్తిడితో అనిత కేసు పెట్టిందని సీఐ పేర్కొన్నారు. అనిత ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా, ఆమె పాయిజన్ తీసుకోలేదని చెప్పారు. లైంగిక వేధింపుల ఆరోపణలపై ఎలాంటి ఆధారాలు లభించలేదని వెల్లడించారు. ఈ కేసులో రాజకీయ కుట్ర కోణం ఉందని సీఐ విజయభాస్కర్ పేర్కొన్నారు. పరిటాల సునీత మహానటి.. సాక్షి, అనంతపురం: రాప్తాడు మండలం చెర్లోపల్లి ఆశావర్కర్ ఘటనను టీడీపీ మాజీ మంత్రి పరిటాల సునీత రాజకీయం చేయాలనుకోవడం దురదృష్టకరమని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. పరిటాల సునీత చిల్లర రాజకీయాలు మానుకోవాలన్నారు. దౌర్జన్యాలకు కేరాఫ్ అడ్రస్ పరిటాల వర్గమే అని మండిపడ్డారు. తప్పుడు ఆరోపణల ద్వారా రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని తెలిపారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆశా వర్కర్ అనిత టీడీపీ ట్రాప్‌లో పడిందని తెలిపారు. పరిటాల సునీత మహానటి అనే విషయం అందరికీ తెలిసిందేనని, తాజాగా ఆశా వర్కర్ ఘటనను రాజకీయం చేసేందుకు దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారని విమర్శించారు. ఇటీవల జరిగిన పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఘోర ఓటమి నేపథ్యంలో ఉనికి చాటుకునేందుకు ఓ చిరుద్యోగిని అడ్డుపెట్టుకుని రాజకీయానికి సిద్ధమయ్యారన్నారు. జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు శాంతిభద్రతల విషయంలో నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నారనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఆశా వర్కర్ అనిత ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు డాక్టర్లను అడిగి తెలుసుకుంటున్నామని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. ఆశా వర్కర్ కుటుంబం వైఎస్సార్సీపీ సానుభూతి పరులని, తమలో తమకే చిచ్చు పెట్టేందుకు సునీత ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. పరిటాల శ్రీరాంపై మూడు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని.. వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసింది తానేనని శ్రీరాం ఒప్పుకున్నా... ఇప్పటి వరకు అరెస్టు చేయలేదన్నారు. చట్టం తనపని తాను చేసుకుపోతుందనే నమ్మకంతో ఉన్నామన్నారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. చదవండి: చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఎంపీ విజయసాయి రెడ్డి -
పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ సీనియర్లకు ఎదురుదెబ్బ
సాక్షి, అనంతపురం: పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ సీనియర్లకు ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మంత్రులు పరిటాల సునీత, కాల్వ శ్రీనివాస్, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌లకు స్థానిక ఎన్నికలు గట్టి షాకే ఇచ్చాయి. పరిటాల సొంత మండలం రామగిరిలో వైఎస్సార్ సీపీ మద్దతుదారుల పాగా వేయడంతో 26 ఏళ్ల పరిటాల ఆధిపత్యానికి చెక్ పడింది. మండలంలో 7 స్థానాల్లో వైఎస్సార్ సీపీ మద్దతుదారులు గెలిచారు. రామగిరి, పేరూరు, కుంటిమద్ది, పోలేపల్లి, కొండాపురం, గంతిమర్రి, చెర్లోపల్లి, ఎంసీ పల్లి పంచాయతీల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారుల ఘన విజయం సాధించారు. ధర్మవరం నియోజకవర్గంలోని 70 పంచాయతీల్లో 63 వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు గెలుపొందారు. రాయదుర్గం బాధ్యతలు చూస్తున్న మాజీ మంత్రి కాల్వకు ఘోర పరాభవం ఎదురయ్యింది. రాయదుర్గం నియోజకవర్గంలో 87 పంచాయతీ లకు గాను 70 స్థానాల్లో వైఎస్సార్ సీపీ మద్దతుదారుల విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌కు చేదు అనుభవం ఎదురయ్యింది. ఉరవకొండ నియోజకవర్గం బెలుగుప్ప మండలంలో పయ్యావుల పట్టుకోల్పోయారు. బెలుగుప్పలోని 19 పంచాయతీల్లో 15 స్థానాల్లో వైఎస్సార్ సీపీ మద్దతుదారులు జయకేతనం ఎగరవేశారు. కళ్యాణదుర్గం టీడీపీ ఇంఛార్జ్ ఉమామహేశ్వర్‌నాయుడు సొంత పంచాయతీ అంకంపల్లిలో టీడీపీ ఓటమి పాలైంది. (చదవండి: గందరగోళమే లక్ష్యం.. ఓడినా నాదే పైచేయి!) టీడీపీ కంచుకోటలు బద్దలు -
పరిటాల వర్గీయుల హింసా రాజకీయాలు
సాక్షి, అనంతపురం: మాజీ మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్ హింసా రాజకీయాలకు పాల్పడుతున్నారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి విమర్శించారు. గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిన వారిపై పరిటాల అనుచరులు దాడులకు తెగబడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులకు దిగుతున్న పరిటాల వర్గీయులపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలని కోరారు. నసనకోటలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై పరిటాల వర్గీయులు దాడులకు పాల్పడ్డారని, వారిని కఠినంగా శిక్షించాలని ప్రకాశ్‌రెడ్డి పోలీసులకు విజ్ఞప్తి చేశారు. చదవండి: పరిటాల వర్గీయుల బరితెగింపు -
20న ‘చంద్రన్న క్రిస్మస్ కానుక’ ప్రారంభం
అనంతపురం టౌన్ : సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ నెల 20న ’చంద్రన్న క్రిస్మస్ కానుక’ పంపిణీ ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత తెలిపారు. ఆదివారం అనంతపురంలోని తన నివాసంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. విజయవాడలోని ఎనికేపాడులోగల చౌక దుకాణం(నంబర్–6)లో సీఎం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారన్నారు. కోటి 34 లక్షల కార్డుదారులకు ఉచితంగా ఆరు రకాల సరుకులు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. డిసెంబర్ 26 వరకు క్రిస్మస్ కానుకలు, జనవరి 1 నుంచి 15వ తేదీ వరకు చంద్రన్న సంక్రాంతి కానుకలు ఇచ్చేలా ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశామన్నారు. పంపిణీ సమయంలో నాణ్యతలేని సరుకులను తిరస్కరించాలని అధికారులకు సూచించినట్లు చెప్పారు. చంద్రన్న కానుకల కోసం రూ.460 కోట్ల బడ్జెట్ కేటాయించామన్నారు. -
అనంత జిల్లాలో ప్రజాస్వామ్యం ఖూనీ
-
టీడీపీకి ఓటేయకుంటే ప్రాణాలు దక్కవు
-
టీడీపీకి ఓటేయకుంటే ప్రాణాలు దక్కవు
• కనగానపల్లిలోఎంపీటీసీలకు తీవ్రస్థాయిలో మంత్రి బెదిరింపులు • ప్రత్యక్షంగా రంగంలోకి దిగిన పరిటాల సునీత • దౌర్జన్యంగాఎంపీపీ పదవి కైవసం కనగానపల్లి/ రాప్తాడు: అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది. ఈ నియోజకవర్గ పరిధిలోని కనగానపల్లి మండల పరిషత్ అధ్యక్ష స్థానానికి బుధవారం నిర్వహించిన ఎన్నికలో స్వయాన మంత్రే దౌర్జన్యానికి దిగారు. పౌరసరఫరాల మంత్రి పరిటాల సునీత వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులను బెదిరించారు. అనుచరులతో కలసి ఎన్నిక జరిగే ఎంపీడీవో కార్యాలయం వద్ద మోహరించిన మంత్రి భయాందోళనలకు గురిచేశారు. ఎన్నిక ప్రక్రియలో పాల్గొనేందుకు వచ్చిన వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులను ‘మీరు టీడీపీ అభ్యర్థికి ఓటు వేయకుంటే ప్రాణాలతో బయటకు వెళ్లలేరు. ఇక్కడ మా పార్టీ అనుచరులు ఐదు వేల మంది ఉన్నారు. వైఎస్సార్సీపీకి ఓటు వేస్తే బయటకు వెళ్లగానే చంపుతారు..’ అంటూ మంత్రి బెదిరించినట్లు సభ్యులు చెప్పారు. ఎన్నిక సమయంలోనూ వైఎస్సార్సీపీ సభ్యులపై అధికార టీడీపీ సభ్యులు దాడి చేశారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. మంత్రి సునీత అనుచరులు మాజీ ఎంపీపీ బిల్లే రాజేంద్ర, వైస్ ఎంపీపీ పున్నం వెంకట్రామిరెడ్డిలను తమ అధీనంలోకి తీసుకుని వెంట తీసుకెళ్లారు. ఇంత జరిగినా పోలీసులు ప్రేక్షక పాత్రే పోషించారు. కనగానపల్లి మండలంలో 2014 ఏప్రిల్‌లో జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో 11 ఎంపీటీసీ స్థానాలకు గాను వైఎస్సార్ సీపీకి ఆరు, టీడీపీకి ఐదు స్థానాలు దక్కాయి. అప్పట్లో వైఎస్సార్సీపీకి చెందిన కనగానపల్లి, ముత్తువకుంట్ల ఎంపీటీసీ సభ్యులు బిల్లే గంగమ్మ, పద్మగీతలను టీడీపీ నాయకులు ప్రలోభపెట్టి ఎంపీపీ పదవిని చేజిక్కించుకున్నారు. ఎలకుంట్ల ఎంపీటీసీ సభ్యుడు బిల్లే రాజేంద్రను ఎంపీపీ చేశారు. అయితే అప్పటి నుంచే పద్మగీత, ఆమె భర్త ముకుందనాయుడు తమకే ఎంపీపీ పదవి కావాలని మంత్రి పరిటాల సునీతపై ఒత్తిడి తెస్తూ వచ్చారు. ఈ క్రమంలో వారం క్రితం బిల్లే రాజేంద్రతో రాజీనామా చేయించారు. దీంతో మనస్తాపం చెందిన రాజేంద్ర, వైస్ ఎంపీపీ పున్నం వెంకట్రామిరెడ్డి, బిల్లే గంగమ్మ ఈ నెల 11న రాప్తాడు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి నేతృత్వంలో హైదరాబాద్‌లో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఈ పరిణామాన్ని మంత్రి పరిటాల సునీత, ఆమె అనుచరులు జీర్ణించుకోలేక పోయారు. ఈ నేపథ్యంలో బుధవారం ఎంపీపీ ఎన్నిక సందర్భంగా వైఎస్సార్సీపీ సభ్యులు చేతులు ఎత్తకుండానే టీడీపీకే ఓటు వేశారంటూ అధికారులతో చెప్పించి టీడీపీ అభ్యర్థి పద్మగీతను ఎంపీపీగా ప్రకటింపజేశారు. -
పరిటాల నేతృత్వంలో.. ప్రజాస్వామ్యం ఖూనీ
కనగానపల్లి ఎంపీపీ ఎన్నికలో దౌర్జన్యకాండ మంత్రి పరిటాల సునీత ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులపై దాడి టీడీపీ అభ్యర్థికి ఓటేయకపోతే చంపుతామంటూ బెదిరింపులు టీడీపీ అభ్యర్థి ఎంపీపీగా ఎన్నికైనట్లు ఏకపక్ష ప్రకటన మీడియాను దూరం పెట్టి అధికార ‘అరాచకానికి’ సహకరించిన ఎన్నికల అధికారులు, పోలీసులు ‘పరిటాల రౌడీయిజం’పై వైఎస్సార్సీపీ, సీపీఐతో పాటు బీసీ సంఘాల మండిపాటు బీసీ వ్యక్తికి ఎంపీపీ పదవి దక్కకుండా దౌర్జన్యం చేశారంటూ ఆగ్రహం న్యాయ పోరాటం చేస్తామని స్పష్టీకరణ అనంతపురం : పార్టీ అధికారంలో ఉంది. చేతిలో ‘అమాత్య’ పదవి ఉంది. పోలీసులు, అధికారులు కూడా అండగా ఉన్నారు. దౌర్జన్యం చేసినా, రౌడీయిజం చెలాయించినా అడిగేవారు లేరు. ఇంకేముంది.. మంత్రి పరిటాల సునీత ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, ఎన్నిక ప్రక్రియను అపహాస్యం చేస్తూ అరాచక రాజకీయానికి తెరలేపారు. కనగానపల్లి మండల పరిషత్ అధ్యక్ష పదవి అడ్డదారుల్లో టీడీపీకి దక్కేలా చూశారు. గతంలో కనగానపల్లి ఎంపీపీగా ఎన్నికైన బిల్లే రాజేంద్రతో అధికార పార్టీ నాయకులు పది రోజుల క్రితం బలవంతంగా రాజీనామా చేయించారు. బీసీ వర్గానికి చెందిన రాజేంద్ర స్థానంలో ‘తమ సామాజిక వర్గం’ వారిని కూర్చోబెట్టాలన్నది వారి ఆకాంక్ష. అందుకు అనుగుణంగానే రాజేంద్రను పదవి నుంచి తప్పించారు. దీన్ని నిరసిస్తూ రాజేంద్రతో పాటు వైస్ ఎంపీపీ పున్నం వెంకటరామిరెడ్డి, కనగానపల్లి ఎంపీటీసీ సభ్యురాలు బిల్లే గంగమ్మ ఇటీవల వైఎస్సార్సీపీలో చేరారు. ఇదిలావుండగా, బుధవారం కనగానపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో నూతన ఎంపీపీ ఎన్నికను అధికారులు నిర్వహించారు. వైఎస్సార్సీపీ తరఫున బిల్లే రాజేంద్ర, టీడీపీ నుంచి ముత్తువకుంట్ల ఎంపీటీసీ సభ్యురాలు పద్మగీత నామినేషన్ వేశారు. మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఇందులో వైఎస్సార్సీపీకి ఏడుగురు, టీడీపీకి నలుగురు ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు. మెజారిటీ సభ్యులున్న వైఎస్సార్సీపీకే ఎంపీపీ పదవి దక్కాలి. అయితే.. అలా జరగకూడదన్న ఉద్దేశంతో అధికార పార్టీ నేతలు దౌర్జన్యానికి దిగారు. ఇటీవల వైఎస్సార్సీపీలో చేరిన ఇద్దరు ఎంపీటీసీల (రాజేంద్ర, వెంకటరామిరెడ్డి)తో టీడీపీ నాయకులు బలవంతంగా ఓట్లు వేయించారు. 6–5 తేడాతో ఎంపీపీ పదవి టీడీపీకి దక్కినట్లు ప్రకటింపజేసుకున్నారు. ప్రత్యక్షంగా రంగంలోకి దిగిన మంత్రి అధికార టీడీపీకే ఎంపీపీ పదవి దక్కాలన్న ఉద్దేశంతో మంత్రి పరిటాల సునీత ప్రత్యక్షంగా రంగంలోకి దిగి ఎంపీటీసీ సభ్యులను బెదిరించారు. ఆమెను అధికారులు ఎన్నికల నిర్వహణ కేంద్రంలోకి అనుమతించారు. ఎన్నిక పూర్తయ్యే వరకు మంత్రి అక్కడే కూర్చొన్నారు. టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి వెళ్లిన ఎంపీటీసీలు బిల్లే రాజేంద్ర, పున్నం వెంకటరామిరెడ్డి దగ్గరకు వెళ్లిన ఆమె వారిని తీవ్రంగా బెదిరించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు వైఎస్సార్సీపీకి చెందిన మహిళా ఎంపీటీసీలను కూడా ఇటువైపు రావాలంటూ టీడీపీ సభ్యుల చేత లాగించినట్లు చెబుతున్నారు. ఈ సందర్భంలో వైఎస్సార్సీపీకి చెందిన కొందరు ఎంపీటీసీలు ఎదురుతిరిగినా వారిని పోలీసులు, టీడీపీ ఎంపీటీసీలతో కొట్టించేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఇందుకు ఎన్నికల అధికారులు కూడా కొంత సహకారం అందించటంతో దౌర్జన్యంగా ఆరుగురు ఎంపీటీసీ సభ్యులతో టీడీపీ అభ్యర్థి పద్మగీతకు ఓట్లు వేయించుకొని (చేతులెత్తడం) ఎంపీపీ పదవిని తమ పార్టీకి దక్కేలా చేసుకున్నారు. మీడియాను దూరం పెట్టి.. అధికార పార్టీకి కొమ్ముకాసిన అధికారులు చేతులు ఎత్తే విధానంలో ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికకు అధికారులు మీడియాను దూరం పెట్టి అధికార పార్టీకి పరోక్షంగా సహకరించారు. కనగానపల్లి ఎంపీడీఓ కార్యాలయానికి 200 మీటర్ల దూరంలోనే పోలీసులు మీడియా ప్రతినిధులను ఆపారు. తద్వారా ఎన్నికల కేంద్రంలో జరుగుతున్న సంఘటనలు బయటకు రాకుండా చూశారు. ఎన్నిక ప్రక్రియను వీడియో తీయించామని అధికారులు చెబుతున్నారు. కానీ ఎన్నిక సమయంలో జరిగిన సంఘటనలపై పుటేజీని వారు బయటకు విడుదల చేయలేదు. ఎంపీపీ ఎన్నిక పూర్తయిన తర్వాత టీడీపీ నాయకులు, కార్యకర్తలు హంగామా చేయడంలో అప్పుడు మాత్రమే మీడియాను అనుమతించారు. అనంతరం వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులు గంగుల సుధీర్‌రెడ్డి, రామాంజినేయులు తదితరులు బయటకువచ్చి లోపల జరిగిన దౌర్జన్యకాండను మీడియాకు వివరించారు. మీడియా ప్రతినిధులు ఎన్నికల నిర్వహణ కేంద్రంలోకి వెళ్లి చూడగా అక్కడ విరిగిపోయిన కుర్చీలు, సభ్యులు విసురుకొన్న నీళ్ల బాటిళ్లు కనిపించాయి. దీనిపై ఎన్నికల అధికారి, ధర్మవరం ఆర్డీఓ బాలానాయక్‌ను వివరణ కోరగా.. ఎంపీపీ ఎన్నిక పూర్తయిన తర్వాత కొంతమంది సభ్యులు తోసుకున్నారని, దీంతో నాసిరకంగా ఉండే కుర్చీలు విరిగిపోయాయని చెప్పారు. కానీ ప్రతిపక్ష పార్టీ ఎంపీటీసీ సభ్యులు చెబుతున్న ప్రకారం ఎంపీపీ ఎన్నిక సమయంలో మంత్రి సూచన మేరకు అధికార పార్టీ ఎంపీటీసీలతో పాటు పోలీస్ సిబ్బంది కూడా వారిపై దాడి చేసినట్లు అర్థమవుతోంది. -
ఆగడాలకు అడ్డేదీ?
మంత్రి ఇలాకాలో పేట్రేగుతున్న తమ్ముళ్లు రోడ్డు నిర్మాణం పేరుతో పంట పొలాలు ధ్వంసం అధికార పార్టీ నేతల ఆగడాలతో ఠారెత్తుతున్న గ్రామీణులు ఆత్మకూరు : రాష్ట్ర మంత్రి పరిటాల సునీత సొంత నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు పేట్రేగిపోతున్నారు. వారి దౌర్జన్యాలకు అడ్డు లేకుండా పోతోంది. టీడీపీ నేతల ఆగడాలతో గ్రామీణులు ఠారెత్తిపోతున్నారు. ప్రశాంత గ్రామాల్లో రాజకీయం చిచ్చు రేపుతోంది. ఇంతకాలం అభివృద్ధి పేరుతో విపక్ష పార్టీలకు చెందిన వారిని నష్టాలకు గురిచేస్తూ వచ్చిన టీడీపీ నాయకులు, ప్రస్తుతం సాధారణ రైతులను సైతం వదలడం లేదు. రోడ్డు నిర్మాణం పేరుతో పంట పొలాలను ధ్వంసం చేయసాగారు. వారి ఆగడాలతో విసుగెత్తి పోయిన రైతులు పనులు అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళితే... ఆత్మకూరు మండలం సిద్ధరాంపురం గ్రామానికి తారు రోడ్డు నిర్మాణ పనులను టీడీపీ నేత కాంట్రాక్ట్ దక్కించుకున్నారు. పనుల్లో భాగంగా రోడ్డు పక్కన రైతు కె.కొండారెడ్డి పట్టా భూముల్లో సాగు చేసిన వేరుశనగ పంటను ఆయన బుధవారం జేసీబీతో పెకలించసాగాడు. ఇదేమంటూ నిలదీసిన రైతులకు నాబార్డు నిబంధనల ప్రకారం ఇలానే చేయాలని ఉందని బుకాయించాడు. దీంతో రైతులు ఆందోళనకు దిగారు. పనులు అడ్డుకున్నారు. పట్టాభూముల్లో రోడ్డు వేయాలని ఎలా ఆదేశాలిచ్చారంటూ మండిపడ్డారు. భార్యాపిల్లల బంగారు నగలు తాకట్టు పెట్టి, అప్పు చేసి పంట సాగు చేపడితే కనీస సమాచారమైనా ఇవ్వకుండా పట్టాభూములను ఎలా పెకలించారంటూ వాగ్వాదానికి దిగారు. అధికారం ఉందనే దౌర్జన్యంతో రైతుల కడుపు కొట్టేందుకు చూస్తే సహించబోమని హెచ్చరించారు. ఈ విషయంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. -
రేషన్ షాపును ఆకస్మికంగా తనిఖీచేసిన మంత్రి సునీత
వినియోదగారుని ఫిర్యాదు మేరకు పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత ప్రొద్దుటూరులోని రేషన్ షాపును ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రొద్దుటూరు రామేశ్వరం రోడ్డులోని 75వ నంబరుగల రేషన్ దుకాణాన్ని మంత్రి తనిఖీచేసి డీలర్‌ను హెచ్చరించారు. మహబూబ్‌బాషా అనే వినియోగదారుడు రంజాన్ తోపాలో తీసుకున్న గోధుమల్లో 5 కిలోలకు గాను 4 కిలోలు మాత్రమే ఇచ్చారని ప్రొద్దుటూరులో ఒక కార్యక్రమానికి హాజరైన మంత్రికి ఫిర్యాదు చేశాడు. స్పందించిన మంత్రి వెంటనే 75వ నంబరు రేషన్ షాపును తనిఖీ చేశారు. షాపు మూసిఉండడంతో డీలర్‌ను పిలిపించి తెరిపించి సరుకులను తనిఖీ చేశారు. ఎలక్ట్రానిక్ తూనికల యంత్రం ఉన్నా తూకంరాళ్లు ఉండటాన్ని గమనించి డీలర్‌ను హెచ్చరించారు. ఇంకోసారి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. మంత్రి వెంట ఎంపీ సీఎం రమేష్, పౌరసరఫరాల కార్పొరేషన్ చైర్మన్ లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పదేళ్లలో అమరావతిలో అద్భుత కట్టడాల నిర్మాణం
యాక్సిస్ రోడ్డు శంకుస్థాపనలో సీఎం చంద్రబాబు తుళ్లూరు రూరల్: యాక్సిస్ రోడ్డు నిర్మాణాన్ని నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు. శనివారం మండలంలోని వెంకటపాలెం నుంచి బోరుపాలెం వరకు 18కి.మీ మేర ఆరు లైన్ల యా క్సిస్ రోడ్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్న పదేళ్లలో అమరావతిలో అద్భుతమైన కట్టడాలు నిర్మితమవుతాయని, ఈ ప్రాంతం రూపురేఖలు మారిపోతాయని తెలిపారు. రోడ్ల నిర్మాణాలను స్థానిక ప్రజా ప్రతినిధులు పర్యవేక్షించాలన్నారు. అనంతరం రాజధానిలో రోడ్ల నిర్మాణ చిత్రపటాల నమూనాలను పరిశీలించారు. ఆయన వెంట మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, పార్టీ చీఫ్ విప్ నన్నపనేని రాజకుమారి ఇతర మంత్రులు ఉన్నారు. అన్న క్యాంటీన్లతో పేదలకు ప్రయోజనం తుళ్లూరు: తాత్కాలిక సచివాలయ సమీపంలో శనివారం సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ అన్న క్యాం టీన్ను ప్రారంభించారు. ఈ క్యాంటీన్లతో పేదలకు ప్రయోజనమన్నారు. మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ, పరిటాల సునీత, ఎంపీ గల్లా జయదేవ్, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్, సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్, కలెక్టర్ కాంతిలాల్ దండే, జేసీ శ్రీధర్ అన్న క్యాంటీన్లో అల్పాహారం తీసుకున్నారు. అనంతరం తాత్కాలిక సచివాలయంలో ఐదో బ్లాకు నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల జాప్యానికి గల కారణాలను ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట జెడ్పీటీసీ సభ్యుడు బెజవాడ నరేంద్రబాబు, మందడం సర్పంచ్ ముప్పవరపు పద్మావతి తదితరులు ఉన్నారు. ప్రాంతాలవారీగా అన్నా క్యాంటీన్లు : మంత్రి సునీత రాష్ట్రంలో ప్రాంతాలవారీగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి సునీత తెలిపారు. అన్న క్యాంటీన్ ప్రారంభం తర్వాత ఆమె విలేకర్లతో మాట్లాడారు. నెలాఖరుకు తుళ్లూరు, యర్రబాలెంలోనూ అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తామన్నారు. తమిళనాడులో క్యాంటీన్ల నిర్వహణను పరిశీలించి ఇక్కడా మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఉదయం 7.30 నుంచి 9.30 గంటల వరకు టిఫిన్, మధ్యాహ్నం 11.30 నుంచి 2గంటల వరకు భోజనం ఉంటుందని మంత్రి వెల్లడించారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ సేవలు బాగున్నాయని కితాబిచ్చారు. -
పేదలకు కార్పొరేట్ వైద్యం.. ప్రభుత్వ లక్ష్యం
► మంత్రులు పల్లె, పరిటాల ► రోటా వ్యాక్సిన్, చంద్రన్న సంచార చికిత్స ప్రారంభం అనంతపురం మెడికల్ : పేదలకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్ తరహా వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీత అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాల మైదానంలో రోటా వైరస్ వ్యాక్సిన్, చంద్రన్న సంచార చికిత్స వాహనాలను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడారు. పేదలు వైద్యం కోసం 50 శాతం డబ్బు వెచ్చిస్తున్నారన్నారు. దీనిని గ్రహించిన ప్రభుత్వం ఉచితంగా వైద్య సదుపాయాలు అందుబాటులోకి తెచ్చిందన్నారు. చంద్రన్న సంచార చికిత్స పేరుతో పల్లెపల్లెకు వైద్యసేవలు తీసుకెళ్తామన్నారు. ఈ వాహనాల్లో షుగర్, బీపీ, ఆస్తమా, మూర్ఛ, దీర్ఘకాలిక వ్యాధులు తదితర వాటికి ఉచితంగా చికిత్స చేయనున్నట్లు చెప్పారు. డాక్టర్లను కూడా అందుబాటులో ఉంచుతున్నామన్నారు. అనంతరం చిన్నారులకు రోటా వ్యాక్సిన్‌ను వేశారు. ‘చంద్రన్న సంచార చికిత్స’ వాహనానికి మంత్రి సునీత జెండా ఊపగా మంత్రి పల్లె రఘునాథరెడ్డి వాహనాన్ని నడిపి ప్రారంభించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ చమన్‌సాహెబ్, ఎమ్మెల్సీ శమంతకమణి జేసీ-2 ఖాజామొహిద్దీన్, వైద్యవిధాన పరిషత్ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి, డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, డీసీహెచ్ఎస్ డాక్టర్ రమేష్‌నాథ్, జిల్లా క్షయ వ్యాధి నియంత్రణ అధికారి డాక్టర్ రావెల సుధీర్‌బాబు, ఐసీడీఎస్ పీడీ జుబేదాబేగం, జాతీయ ఆరోగ్య మిషన్ డీపీఎంఓ డాక్టర్ అనిల్‌కుమార్, ఎస్ఓలు మారుతిప్రసాద్, ఉమామహేశ్వరరావు, కార్పొరేటర్ లక్ష్మీప్రసన్న తదితరులు పాల్గొన్నారు. -
శ్రీవారి సేవలో చిరంజీవి కుటుంబం
- సినీ రాజకీయ ప్రముఖులు తిరుమల కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వరస్వామి వారిని సోమవారం కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవి కుటుంబం దర్శించుకుంది. చిత్తూరు జిల్లాకు చెందిన ఎన్నారైతో ఇటీవలే వివాహమైన చిన్నకుమార్తె శ్రీజ, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఆయన శ్రీవారికి పూజలు నిర్వహించారు. సోమవారం పలువురు ప్రముఖులు వెంకన్న దర్శనం కోసం వచ్చారు. వీరిలో ఏపీ పౌరసరఫరాల శాఖా మంత్రి పరిటాల సునీత, సీనియర్ నటుడు గొల్లపూడి మారుతీరావు ఉన్నారు. రేపటి నుంచి శ్రీవారి వసంతోత్సవాలు తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం నుంచి శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మూడు రోజులపాటు సాగే ఉత్సవాల్లో స్వామివారు వసంతమండపంలో ప్రత్యేక తిరుమంజన పూజలందుకుంటారు. రెండో రోజున శ్రీవారి స్వర్ణరథోత్సంలో ఊరేగుతూ భక్తకోటికి దర్శనమివ్వనున్నారు. -
నేతలదే పైచేయి!
► హెచ్డీఎస్కు కలెక్టర్ ఆమోదముద్ర ► మొత్తం 11 మందితో కమిటీ ► ప్రజాప్రతినిధుల అనుచరులకు పెద్దపీట ► ముందే చెప్పిన ‘సాక్షి’ అనంతపురం మెడికల్ : సర్వజనాస్పత్రి అభివృద్ధి సొసైటీ(హెచ్‌డీఎస్)లో ప్రజాప్రతినిధుల అనుచరులకు పెద్దపీట వేశారు. రాజకీయ నేతలు సూచించిన వారినే చేర్చారు. ఇందుకు సంబంధించిన ఫైలుకు కలెక్టర్ కోన శశిధర్ ఆమోదముద్ర వేశారు. రాజకీయ నేతలు కాకుండా సంఘ సంస్కర్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను చేర్చాలని జీవో జారీ చేసినా.. అది నామమాత్రంగానే మిగిలిపోయింది. గతంలో కమిటీల్లో రాజకీయ నాయకులకు చోటుండేది. అయితే.. ప్రభుత్వం పారదర్శకత పేరుతో నేతలను తొలగించింది. ఎన్జీఓ ప్రతినిధులు, సంఘ సేవకులకు స్థానం కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. సర్వజనాస్పత్రి అభివృద్ధి కమిటీ ఏర్పాటుకు సంబంధించి గత ఏడాది నవంబర్ 23న ఓ జీవో జారీ చేసింది. దీని ప్రకారం కమిటీకి చైర్మన్‌గా కలెక్టర్, వర్కింగ్ చైర్మన్‌గా ఎన్జీఓ ప్రతినిధి లేదా సంఘ సేవకుడు, మెంబర్ అండ్ కన్వీనర్‌గా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్‌తో పాటు సభ్యులు కలిపి మొత్తం 11 మంది ఉంటారు. కమిటీ నియామకానికి సంబంధించి పూర్తి అధికారాలను కలెక్టర్‌కు కట్టబెట్టింది. రాజకీయ నేతలకు చోటు లేదన్న విషయం తెలిసి సంఘ సంస్కర్తల పేరుతో వారి అనుచరులకు పెద్దపీట వేశారు. కలెక్టర్ ఆమోదముద్ర వేసిన కమిటీని పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. 11 మందితో కమిటీ సర్వజనాస్పత్రి అభివృద్ధి కమిటీలో మొత్తం 11 మంది ఉన్నారు. వర్కింగ్ చైర్మన్‌గా డాక్టర్ వై.రామసుబ్బయ్య (రిటైర్డ్ మెడికల్ సూపరింటెండెంట్), చైర్మన్‌గా కోన శశిధర్ (కలెక్టర్), మెంబర్ కన్వీనర్‌గా డాక్టర్ మైరెడ్డి నీజర (మెడికల్ కళాశాల ప్రిన్సిపల్) ఉన్నారు. సభ్యులుగా రామగిరి మండలం గంగంపల్లికి చెందిన కె.రామ్మూర్తినాయుడు, ఎం.పవన్‌కుమార్ (శాంతిసేన రక్తసహకార బంధువు), అనంతపురంలోని కాయగూరల వీధికి చెందిన కె.వెంకటేశులు, నల్లమాడ మండలం వంకరగుంటకు చెందిన కేశవరెడ్డి, డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వరరావు (సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్), చల్లా ఓబుళేసు (నగర పాలక సంస్థ కమిషనర్)తో పాటు డీఎంఈ, జిల్లా ప్రశాంతి సమాఖ్య అధ్యక్షురాలిని చేర్చారు. వీరిలో నలుగురు సభ్యులు రాజకీయ నేతల అనుచరులు కావడం గమనార్హం. మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి, ఎంపీ జేసీ దివాకరరెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి సూచించిన వారిని కమిటీలో చేర్చారు. హెచ్‌డీఎస్‌లో రాజకీయానిదే పైచేయిగా ఉంటోందంటూ జనవరి 30న ‘ప్రభుత్వానివి ‘ఉత్త’ర్వులే’ శీర్షికతో సాక్షి కథనం ప్రచురించింది. అదే రోజు కమిటీ సభ్యుల వివరాలు వెల్లడించింది. ప్రస్తుతం కలెక్టర్ ఆమోదముద్ర వేసిన కమిటీలో వాళ్లంతా ఉండటాన్ని బట్టి చూస్తే అధికార యంత్రాంగం కూడా నేతలకు తలొగ్గిందన్నది స్పష్టమవుతోంది. కాగా.. ఈ నెలాఖరులోగా కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఫైల్ కలెక్టర్ వద్దకు నేడో, రేపో వెళ్లనుంది. -
గన్‌మెన్‌ను వెనక్కి రప్పించుకున్న పరిటాల సునీత
-
గన్‌మెన్‌ను వెనక్కి రప్పించుకున్న పరిటాల సునీత
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత గన్‌మెన్‌ను వెనక్కి రప్పించుకున్నారు. ఈ రోజు ఉదయం ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశానికి సునీత గన్‌మెన్ రక్షణలో వచ్చారు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం వైఎస్ఆర్ సీపీ నేత ప్రసాద్ రెడ్డి హత్యకేసులో ఇటుకలపల్లి సీఐ, రాప్తాడు ఎస్ఐలను వీఆర్‌కు పంపడంపై మంత్రి పరిటాల సునీతకు కోపం తెప్పించింది. ప్రభుత్వం తనకు కేటాయించిన ముగ్గురు గన్‌మెన్, ఐదుగురు ఎస్కార్ట్ సిబ్బందిని సునీత వెనక్కి పంపిన సంగతి తెలిసిందే. పరిటాల సునీత డీజీపీ, హోంమంత్రితో సంప్రదించిన అనంతరం సీఐ, ఎస్ఐలను వీఆర్‌కు పంపకుండా యధాతథంగా అవే పోస్టుల్లో కొనసాగించారు. దీంతో సునీత గన్‌మెన్‌ను వెనక్కు రప్పించుకున్నారు. -
మంత్రి గారికి కోపం వచ్చింది
వైఎస్ఆర్సీపీ నేత ప్రసాదరెడ్డి హత్యకేసులో ఎస్ఐ, సీఐలను వీఆర్‌కు పంపడంపై మంత్రి పరిటాల సునీత తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ప్రభుత్వం తనకు కేటాయించిన ముగ్గురు గన్‌మెన్, ఐదుగురు ఎస్కార్ట్ సిబ్బందిని వెనక్కి పంపేశారు. ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు చెప్పాలని కూడా ఆమె చెప్పారు. వైఎస్ఆర్సీపీ నేత ప్రసాదరెడ్డి హత్య కేసులో ఇటుకులపల్లి ఎస్ఐ, రాప్తాడు సీఐలను డీఐజీ బాలకృష్ణ వీఆర్‌కు పంపిన విషయం తెలిసిందే. ఈ విషయమే మంత్రి పరిటాల సునీతకు కోపం తెప్పించింది. -
పేదలు సంక్రాంతిని ఘనంగా జరుపుకోవాలి
మంత్రి పరిటాల సునీత తొండూరు : పేద ప్రజలు సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకోవాలని పౌరసరఫరాల శాఖమంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం తొండూరు టీటీడీ కల్యాణ మండపం ఆవరణంలో సర్పంచ్ కుళ్లాయమ్మ అధ్యక్షతన ‘చంద్రన్న సంక్రాంతి కానుక’ సరుకుల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గోధుమపిండి, శనగలు, బెల్లం, పామాయిల్, కందిపప్పు, నెయ్యి సంక్రాంతి పండుగకు ఉచితంగా అందించాలన్న ముఖ్యమంత్రి నిర్ణయం చాలా గొప్పదన్నారు. ఉచిత సరుకులు పంపిణీ చేసేటప్పుడు రేషన్ షాపులలో బ్యానర్లో చంద్రబాబు ఫొటో లేకపోతే రేషన్ షాపులను రద్దు చేస్తామని ఆమె హెచ్చరించారు. కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చెర్మైన్ సతీష్‌రెడ్డి, అనంతపురం జెడ్పీ చైర్మన్ చమన్, జాయింట్ కలెక్టర్ రామారావు, ఆర్డీవో వినాయకం, సింగిల్‌విండో వైస్ ప్రెసిడెంటు చంద్ర ఓబుళరెడ్డి, మాజీ జెడ్పీటీసీ శివమోహన్‌రెడ్డి, తహశీల్దార్ ఎల్.వి.ప్రసాద్, ఎంపీడీవో ప్రభాకర్‌రెడ్డి, డీఎస్వో ప్రభాకరరావు, ఎన్ఫోర్స్మెంట్ డీటీ బాబయ్య, ఎంపీటీసీ లక్ష్మిదేవి తదితరులు పాల్గొన్నారు. పోట్లదుర్తిలో : ఎర్రగుంట్ల: ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలో జరిగిన కార్యక్రమంలో మంత్రి పరిటాల సునీత ‘చంద్ర న్న సంక్రాంతి కానుక’ సరుకలను పంపిణీ చేశారు. తొలుత ఆమె గ్రామంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రామరావు. అనంతపురం జెడ్పీ చైర్మన్ చమన్, గ్రామ సర్పంచ్ వెంకటరంగయ్య, డీఎస్ఓ ప్రభాకర్‌రావు, టీడీపీ నేత సురేష్‌నాయుడు, ఆర్డీఓ లవన్న, మండల ప్రత్యేక అధికారి మధుసూదన్‌రెడ్డి, తహశీల్దార్ బి. మహేశ్వరరెడ్డి, ఎంపీడీఓ మద్దిలేటి, టీడీపీ మహిళ అధ్యక్షురాలు కుసుమకుమారి పాల్గొన్నారు. -
ఏడాదిలోగా హంద్రీ నీవా పూర్తి చేస్తాం
కదిరి: జిల్లాలో అర్ధంతరంగా ఆగిపోయి న హంద్రీ నీవా ప్రాజెక్టును ఏడాదిలోగా పూర్తి చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత స్పష్టం చేశారు. కదిరి రూరల్ పరిధిలోని ముత్యాలచెరువులో రైతులు పెంచిన జొన్నగడ్డి పంపిణీని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అవినీతి రాజ్యమేలిందన్నా రు. వారు ప్రవేశ పెట్టిన పథకాలు కాం గ్రెస్ కార్యకర్తలకు మాత్రమే దక్కాయని విమర్శించారు. గ్రామాల్లో పార్టీలకతీ తంగా మెలిగితేనే ఆ పల్లెలు శాంతియుతంగా ఉంటాయని సూచించారు. వర్షా లు లేక పోవడంతో జిల్లా వ్యాప్తంగా భూ గర్భ జలాలు అడుగంటిపోయాయన్నా రు. 1200 అడుగులు వేసినా బోర్లలో చు క్కనీరు బయటకు రాలేదన్నారు. ము ఖ్యంగా కదిరి ప్రాంతం కరువుతో అల్లాడిపోతోందని చెప్పారు. చెరువుల్లో పూ డికతీత పనులకు త్వరలో ప్రభుత్వం శ్రీకారం చుడుతుందని తెలిపారు. రుణమాఫీ జాబితాలో అర్హులైన రైతులకు అన్యాయం జరిగిందని భావిస్తే ఆర్డీఓ, తహశీల్దార్ లేదా స్థానిక టీడీపీ నాయకుడిని సంప్రదించండని మంత్రి సూచిం చారు. అర్హులైన వారికి పెన్షన్లు రాకపోతే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చే యాలన్నారు. మహిళలు పొలం పనులే కాకుండా ఇంటి పనులు చే యడంతో ఒక్కోసారి వేలిముద్రల్లో తేడాలొస్తుంటాయని తన దృష్టికి వచ్చిందన్నారు. ఒక మహిళగా ఈ విషయం నిజమని తానుకూడా నమ్ముతున్నానని మంత్రి చెప్పా రు. ఈ విషయంలో సంబంధిత అధికారులే ఒక నిర్ధారణకు వచ్చి తగు న్యా యం చేయాలని ఆదేశించారు. అనంత రం మంత్రి ముత్యాలచెరువు గ్రామంలో మంచినీటి ట్యాంకును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధకశాఖ జేడీ డా.శ్యాంమోహన్‌రావ్, ఆర్డీఓ రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, న్యాయవాది వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘ఎన్టీఆర్ భరోసా’తో పేదల బతుకుల్లో వెలుగు
గోరంట్ల,న్యూస్‌లైన్ : ఎన్టీఆర్ భరోసా పథకం పేదల జీవితాల్లో వెలుగులు నింపుతుందని పౌరసరఫరాల మంత్రి పరిటాల సునీత అన్నారు. స్థానిక మండల పరిషత్ ఆవరణలో సర్పంచి మంజుల అధ్యక్షతన శనివారం జన్మభూమి గ్రామసభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి మాట్లాడుతూ రూ. 2 కోట్లతో రాప్తాడు, పెనుకొండ, హిందూపురం నియోజవర్గాల్లోని అన్ని గ్రామాలకు పైప్‌లైన్ ద్వారా తాగునీరు అందిస్తామని తెలిపారు. హంద్రీ-నీవా సుజల స్రవంతి ద్వారా జిల్లాలో చెరువులకు నీరందించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు. ఇప్పటికే 49చెరువులకు నీరందించే కార్యక్రమానికి నిధులు విడుదలయ్యాయని తెలిపారు. పెనుకొండ ఎమ్మెల్యే బి.కె. పార్థసార థి మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు తాగునీరు అందిస్తానని, లేనిపక్షంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టం చేశారు. గోరంట్ల మండలంలోని 100గ్రామాల్లో తాగునీటి ఎద్దడి ఉందని, పీఎబీఆర్తో నీటి సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. జిల్లా పరిషత్ చైర్మన్ చమన్‌సాబ్ మాట్లాడుతూ 149 చెరువులకు హంద్రీ నీవా ద్వారా నీరు అందిస్తామని చెప్పారు. అంతకు ముందు రూ.50లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన పౌరసరఫరాల గోదామును మంత్రి సునీతప్రారంభించారు. అనంతరం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీమంతాలకు హాజరయ్యారు. కార్యక్రమంలో జేసీ సత్యనారాయణ, ఆర్టీవో రామ్మూర్తి, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ వెంకటేశులు, తహశీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో ప్రదీప్‌కుమార్, జెడ్పీటీసీ సభ్యురాలు ఇందిరమ్మ, ఎంపీపీ విద్యాధరణి పాల్గొన్నారు. దళారుల నియంత్రణకే కొనుగోలు కే ంద్రాల ఏర్పాటు హిందూపురం : దళారుల నియంత్రణకే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పరిటాల సునీత తెలిపారు. చిలమత్తూరు మార్కెట్ యార్డు సమీపంలో మార్కెఫెడ్ ఆధ్వర్యంలో వెలుగు మహిళా సంఘాల ద్వారా ఏర్పాటు చేసిన మొక్కజొన్న కోనుగోలు కేంద్రాన్ని మంత్రి శనివారం ప్రారంభించారు. ఎమ్మెల్యే బాలకృష్ణ సూచన మేరకు రైతులకు మేలు జరగాలన్న ఉద్దేశంతో జిల్లాలో క్వింటా రూ.1310 మద్దతు ధరతో ఆరు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో పెనుకొండ ఎమ్మెల్యే బి.కె.పార్థసారథి, మాజీ ఎమ్మెల్యేలు అబ్దుల్ ఘనీ, రంగనాయకులు, జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, వెలుగు శాఖ ఏడీ సుధాకర్ పాల్గొన్నారు. -
పాత లెవీ విధానాన్నే కొనసాగించండి: సునీత
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం రూపొందించిన కొత్త లెవీ విధానంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది. పాత లెవీ విధానాన్నే కొనసాగించాలని కోరింది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత బుధవారం ఢిల్లీలోని కృషిభవన్‌లో కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్‌ను కలసి ఈ మేరకు విన్నవించారు. ఇదిలా ఉండగా బుధవారం సాయంత్రం మంత్రి సునీత కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి అశోక్‌గజపతిరాజుతో భేటీ అయ్యారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఏవియేషన్ అకాడమీ ఏర్పాటుపై మాట్లాడారు. -
ఆ బియ్యం మాకొద్దు
సాక్షి, కడప : పౌరసరఫరాలశాఖ అట్టహాసంగా ప్రారంభించిన జిలకర మసూర కేంద్రాలు అభాసుపాలు అవుతున్నాయి. సాక్షాత్తు రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి పరిటాల సునీత ఆగస్టులో పలు జిలకర మసూర బియ్యం కేంద్రాలను ప్రారంభించారు. బియ్యంలో కల్తీ రావడం, నాణ్యత లోపించడంపై సర్వాత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేవలం రూ. 30కే కేజీ జిలకర మసూర అంటూ ఎంతగా ఊదరగొట్టినా.....కడపలో కొనేవారు కరువయ్యారు. తక్కువ ధరకే ఇస్తున్నప్పుడు ప్రజలు సాధారణంగా ఎగబడి కొనాల్సింది పోయి కేంద్రాలు బోసిపోవడం గమనార్హం. జిలకర మసూర పేరుతో బియ్యంలో కల్తీ కడపలో ప్రారంభించిన కేంద్రాల్లో కల్తీ బియ్యం కనిపించడంతో ప్రజలు కొనడానికి ఆసక్తి చూపడం లేదు. కడపలోని రైతు బజారులో మంత్రి సునీత ఆగస్టులో ఒక కేంద్రాన్ని ప్రారంభించగా, జిల్లా పౌరసరఫరాల అధికారులు మండీబజారులో ఒకటి, చిన్నచౌకు పంచాయతీ కార్యాలయం వద్ద మరొకటి ప్రారంభించారు. అయితే ఏ కేంద్రం వద్ద కూడా బియ్యం కొనడానికి జనాలు ముందుకు రావడం లేదు. జిలకర మసూర బియ్యాన్ని తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నుంచి కడపకు తెప్పిస్తున్నారు. అక్కడ పండే సోనా మసూరితోపాటు మరింత పాలీష్ పట్టించిన స్టోర్ బియ్యం, మరో ఒకట్రెండు రకాల బియ్యాలను కలబోసి ఇక్కడికి పంపుతున్నారని పౌరసరఫరాలశాఖలోనే చర్చ సాగుతోంది. బియ్యంలో నాణ్యత లోపించడం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. జిలకర మసూర బియ్యం సాధారణంగా బయటి మార్కెట్లో 50 కిలోల బస్తా దాదాపు రూ. 2 వేల పైచిలుకు పలుకుతుంటే ఇక్కడ మాత్రం రూ. 1500కే ఇస్తామన్నా ఎవరూ ముందుకు రావడం లేదు. పౌరసరఫరాలశాఖ అధికారులు ఆయా కేంద్రాల్లో అటెండర్లను పెట్టి విక్రయించేందుకు ఏర్పాట్లు చేశారు. మొదట్లో ఒకబస్తాను ఊడదీసి కిలోల ప్రకారం ఇచ్చేవారు. అలా కొనుగోలు చేసేవారు లేకపోవడంతో బస్తా ప్రకారమే ఇస్తామని మెలిక పెట్టారు. ఈ కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన బియ్యంతో వంట చేసిన అన్నం కూడా సక్రమంగా ఉండటం లేదని...ఒకసారి కొనుగోలు చేసిన వారు మరోసారి కొనుగోలుకు ముందుకు రారని పలువురు పేర్కొంటున్నారు. దీంతో కడపలోని కేంద్రాలు కొనుగోలు దారులు లేక వెళవెళబోతున్నాయి. రెండు కేంద్రాలు మూత కడపలోని జిలకర మసూర బియ్యం విక్రయ కేంద్రాలు విజయవంతం కాగానే, జిల్లాలోని అన్ని నియోజకవర్గకేంద్రాల్లో ఏర్పాటు చేయాలని పౌరసరఫరాలశాఖ భావించింది. అయితే కడపలో స్పందన కొరవడటంతో మిగతా ప్రాంతాల్లో కూడా కేంద్రాలను ప్రారంభించలేదు. కడపలో మూడు కేంద్రాలను ఏర్పాటు చేస్తే అందులో రైతు బజారులో ఉన్న కేంద్రం మాత్రమే నడుస్తోంది. చివరకు మిల్లర్లు కూడా జిలకర మసూర పేరుతో ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యం నాణ్యతపై పెదవి విరుస్తున్నారు. రాయలసీమ ప్రాంతంలోనే రైతుల వద్ద నాణ్యమైన బియ్యాన్ని కొనుగోలు చేసి కేంద్రాల్లో ఉంచితే వినియోదారులు బారులు తీరుతారని...ప్రభుత్వం ఈ రకంగానైనా ఆలోచించాలని పలువురు కోరుతున్నారు. 40 టన్నులు తెచ్చినా.... మూడు నెలల క్రితం రెండు లారీల్లో దాదాపు 40 టన్నుల జిలకర మసూర బియ్యాన్ని కాకినాడ నుంచి తెప్పించారు. మూడు నెలలవుతున్నా 40 టన్నులే కొనుగోలు కాకపోవడంతో పౌరసరఫరాలశాఖ అధికారులు మరొకమారు తెప్పించే అంశంపై ఆలోచిస్తున్నారు. 40 టన్నుల్లో మరో నాలుగు టన్నుల బియ్యం మిగిలి ఉన్నాయి. బియ్యంలో కల్తీ వ్యవహారం అధికారులను కూడా ఆందోళనకు గురి చేస్తోంది. ఈ నేపధ్యంలో కొత్తగా స్టాకు తెప్పించడానికి సాహసించడం లేదు. పౌరసరఫరాలశాఖ డీఎం ఏమంటున్నారంటే! పౌరసరఫరాలశాఖకు సంబంధించి ఏర్పాటు చేసిన బియ్యంలో నాణ్యత లోపించడంతోపాటు కేంద్రాలు మూసివేసిన విషయాన్ని ‘సాక్షి ప్రతినిధి’ ఆ శాఖ జిల్లా మేనేజర్ బుల్లయ్య దృష్టికి తీసుకు వెళ్లగా....కొనుగోలు దారులు లేకపోవడంతో ఇటీవలే రెండు కేంద్రాలను మూసివేశామన్నారు.కాకినాడ నుంచి బియ్యం తెప్పిస్తున్నామని...వినియోగదారులు వినియోగించుకోవాలని కోరారు. ఉన్న స్టాకు అయిపోగానే కొత్త స్టాకు తెప్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. బియ్యంలో కల్తీ విషయమై ఆయన మాట దాటవేశారు. -
అబ్బబ్బో.. ఏం సెప్తిరి!
సాక్షిప్రతినిధి, అనంతపురం : ‘పదేళ్లలో పీఏబీఆర్ కుడికాల్వకు నీటిని అందించడంలో ప్రభుత్వం విఫలమైంది. చంద్రబాబు అధికారంలోకి రాగానే చెరువులను నీటితో నింపుతున్నాం. కుడికాల్వ పరిధిలోని చెరువులన్నిటికీ నీటిని సరఫరా చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తాం’ - ఈ నెల 24న మంత్రి పరిటాల సునీత వ్యాఖ్య. మంత్రి మాటలు చూస్తే.. పదేళ్లలో పీఏబీఆర్ కుడికాల్వకు నీరు సరఫరా కాలేదని, చెరువులను నీటితో నింపలేదని, కొత్తగా ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం నీటి విడుదలకు శ్రీకారం చుట్టిందని అర్థమవుతుంది. అయితే వాస్తవ పరిస్థితి ‘నేతి బీరలో నెయ్యి’ చందమని స్పష్టమవుతోంది. పీఏబీఆర్ డ్యాం నుండి కుడికాల్వకు నీటి విడుదల కొన్నేళ్లుగా కొనసాగుతోంది. టీబీ డ్యాంలో నీటి లభ్యత 212 టీఎంసీలు ఉంటే హెచ్చెల్సీ ద్వారా 32 టీఎంసీలు జిల్లాకు కేటాయించారు. అయితే డ్యాంలో పూడికవల్ల నీటి లభ్యత 144 టీఎంసీల (నీటి నిల్వ 100.854 టీఎంసీలు)కు పడిపోయింది. దీంతో జిల్లాకు దామాషా పద్దతిలో 22.5 టీఎంసీలు కేటాయిస్తున్నారు. హెచ్చెల్సీ ద్వారా పీఏబీఆర్ డ్యాంకు ఏటా సగటున 2టీఎంసీల నీరు మాత్రమే అందుతోంది. ఇందులో ఒక టీఎంసీ నీటిని ఏటా కుడి కాల్వకు విడుదల చేస్తున్నారు. ఈ నీటితో ఏటా 5 నుంచి 19 చెరువులను(నీటి సరఫరానుబట్టి) నింపుతున్నారు. 1980 నుంచి ఈ తంతు కొనసాగుతోంది. 20 ఏళ్లలో నాలుగేళ్లు మాత్రమే కుడికాల్వకు నీరు విడుదల చేయలేదు. అదీ టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడే. ఇది మినహా ఏటా కుడికాల్వతో పాటు చెరువులకు నీళ్లు అందుతున్నాయి. కానీ మంత్రి సునీత, ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరి మాత్రం పదేళ్ల తర్వాత ఇప్పుడే కొత్తగా కుడి కాల్వకు నీళ్లు విడుదల చేశామని చెప్పడం గమనార్హం. చెరువుల కోసం ప్రత్యేక జీవో జారీ చేసిన వైఎస్ జిల్లాలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. దీనికి తోడు కోటా మేరకు హెచ్చెల్సీ నీరు జిల్లాకు అందడంలో ఏటా జాప్యం జరుగుతోంది. ఈ క్రమంలో తాగునీటి సమస్యను నివారించేందుకు కేసీకెనాల్ నుంచి 10 టీఎంసీల నీటిని పీఏబీఆర్ డ్యాంకు మళ్లిస్తూ 2006లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జీవో జారీ చేశారు. ఇందులో 4.5 టీఎంసీలతో 49 చెరువులకు, తక్కిన వాటిని తాగునీటికి వినియోగించాలని సూచించారు. ఈ జీవో తర్వాత 2008, 09లో ఆశించిన మేరకు పీఏబీఆర్‌కు నీటి కేటాయింపులు జరిగాయి. వైఎస్ మృతి తర్వాత నీటి విడుదలలో జాప్యం జరుగుతోంది. ఈ నీటిని రప్పించేందుకు ప్రస్తుతం టీడీపీ నేతలు ప్రయత్నించడం లేదు. ప్రస్తుతం హంద్రీ-నీవా నీరే దిక్కు హంద్రీ-నీవా పథకానికి ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు శంకుస్థాపన చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు పథకం నిర్మాణం అసాధ్యమని భావించి, దాన్ని విస్మరించారు. 2004లో వైఎస్ సీఎం అయిన తర్వాత జిల్లాలో తాగు, సాగునీటి సమస్యను నివారించేందుకు హంద్రీ-నీవా నిర్మాణానికి పూనుకున్నారు. చంద్రబాబు అసాధ్యం అన్నదాన్ని వైఎస్ సుసాధ్యం చేశారు. 2012 నుంచి హంద్రీ-నీవా ద్వారా కృష్ణా జలాలు జిల్లాకు చేరుతున్నాయి. గతేడాది 3.5 టీఎంసీల నీళ్లు జిల్లాకు చేరితే.. 25 చెరువులను 30 శాతం నీటితో నింపారు. ఈ ఏడాది 10 టీఎంసీల నీళ్లు కోటాగా నిర్ణయించారు. ఇప్పటి దాకా 5.5 టీఎంసీల నీళ్లు జిల్లాకు చేరాయి. ఈ నీటిని పీఏబీఆర్‌కు మళ్లించి, వాటిని కుడికాల్వకు విడుదల చేశారు. మంత్రి సునీత, ఎమ్మెల్యే సూరి ధర్మవరం ఛానల్‌కు ఈ నెల 24న విడుదల చేసిన నీరు కూడా హంద్రీ-నీవా ద్వారా చేరిందే. అంటే వైఎస్ నిర్మించిన హంద్రీ-నీవా పుణ్యమా అని ఈ రోజు ధర్మవరం కాలువకు నీళ్లొచ్చాయనేది వాస్తవం. దీన్ని పక్కనపెట్టి తామేదో నీటిని జిల్లాకు రప్పించామని సునీత, సూరి గొప్పులు చెప్పుకోవడాన్ని చూసి జనం విస్తుపోతున్నారు. నిజానికి హంద్రీ-నీవా నీటికి ప్రత్యేకంగా జిల్లాలో 3.45 లక్షల ఆయకట్టు ఉంది. ఈ నీటితో చెరువులను నింపుకునేందుకు హక్కు లేదు. ఈ క్రమంలో తుంగభద్ర నీటితో పాటు కృష్ణా జలాలపై జిల్లాకు ‘హక్కు’ దక్కేలా, మిగులు జలాలను కాకుండా నికర జలాలను ఎత్తిపోసుకునేందుకు అధికార పార్టీ నేతలు పోరాడాలి. ఇది పట్టించుకోకుండా తాము చేయని పనిని చేశామని, మదేళ్లలో కుడికాల్వకు నీటి విడుదల జరగలేదని, ఇప్పుడు తామే నీటిని పారిస్తున్నారని చెప్పుకోవడం శోచనీయం. పదేళ్లలోపీఏబీఆర్ కుడికాల్వకు నీటి విడుదల ఇలా.. సంవత్సరం పరిమాణం (టీఎంసీలలో) 2005-06 2.228 2006-07 2.820 2007-08 2.234 2008-09 1.726 2009-10 1.863 2010-11 2.092 2011-12 0 2012-13 0.5 2013-14 3.5 2014-15 (సరఫరా జరుగుతోంది) -
వస్తున్నారు.. వెళ్తున్నారు
సాక్షి ప్రతినిధి, కడప: పళ్లు ఊడగొట్టేందుకు ఏ రాయి అయితేనేం... అన్నట్లుగా మంత్రుల పర్యటనలు సాగుతున్నారుు. అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన ఆమాత్యుల పర్యటనలు విందులకే పరిమితమవుతున్నారుు. టీడీపీ నేతల పరపతి పెంచితే అదే పదివేలు అన్నట్లుగా వారి పర్యటనలు తలపిస్తున్నాయి. పరిటాల సునీత మొదలు డిప్యూటీ సీఎం చిన రాజప్ప వరకూ చేపట్టిన జిల్లా పర్యటన అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. శాఖా పరంగా అభివృద్ధిపై చర్చకంటే అధికారపార్టీ నాయకుల్ని సంతృప్తి పర్చడంతోనే ముగుస్తున్నారుు. జిల్లాలో శరవేగంగా చోటుచేసుకున్న పలు అభివద్ధి పనులు ఆర్ధాంతరంగా నిలిచిపోయాయి. అధికారంలో ఉన్నవారు వాటిని పూర్తి చేసి ప్రజావిశ్వాసం పొందాల్సి ఉంది. అందుకు విరుద్ధంగా అభివృద్ధి పనులపై అధికార పార్టీ నేతలకు శ్రద్ధ ఇసుమంతైనా కన్పించడం లేదు. నాలుగునెలల్లో మంత్రులు పర్యటనలు మినహా జిల్లాకు ఒనగూరిందేమీ లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. తుదకు ఎయిర్‌పోర్టు సామర్థ్యం మేరకు పనులు పూర్తి అయినా ప్రారంభోత్సవానికి కూడా పాలకులు వెనకగుడుకు వేస్తున్న పరిస్థితి. కలెక్టరేట్ భవన సముదాయం, ఐజీ కార్ల్ పశుపరిశోధన కేంద్రం దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్నాయి. శ్రీశైలం రిజర్వాయర్‌లో పుష్కలంగా నీరు ఉన్నా జిల్లాకు తెప్పించుకోలేని దుస్థితి. మైలవరం, గండికోట, వామికొండ, సర్వారాయసాగర్, పైడిపాళెం, బ్రహ్మంసాగర్ రిజర్వాయర్లల్లో సులువుగా 30 టీఎంసీల నీరు నిల్వ చేసుకునే అవకాశం ఉండేది. ఆ దిశగా పాలకపక్షం చర్యలు తీసుకోవడంలో విఫలమైందనే విమర్శలు అధికంగా ఉన్నాయి. ఏమంత్రి పర్యటన ఉన్నా, అధికారపార్టీ నేతలకు తమ ఇళ్లుకు రావాలనే తపన తప్పా, ప్రాంతం అభివద్ధికి యోగ్యం కావాలనే తలంపు కన్పించలేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇసుమంతైనా అభివృద్ధి ఏదీ.... జిల్లాలో ఇప్పటి వరకూ ఏడుగురు మంత్రులు పర్యటించారు. మంత్రుల పర్యటనలను పరిశీలిస్తే అధికార పార్టీ నేతల మెప్పు మినహా ఏమాత్రం అభివృద్ధి ఏదని విశ్లేషకులు పశ్నిస్తున్నారు. అధికార పార్టీ నాయకుల ప్రాభవం కోసం మినహా ప్రాంతాల అభివృద్ధిపై శ్రద్ధ లేదని పలువురు పేర్కొంటున్నారు. జిల్లాలో మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి, రావెళ్ల కిశోర్‌బాబు, శిద్ధా రాఘవరావు, కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావు, డిప్యూటీ ముఖ్యమంత్రి (హోంమంత్రి) చిన రాజప్పలు పర్యటించారు. ఈ ఏడుగురు మంత్రుల పర్యటనలు నాయకుల గ్రామాలు, ఇళ్లతో ముడిపడి ఉంది. శాఖ పరంగా లోటుపాట్లపై సమీక్షలు నిర్వహించడంలో దాదాపు విఫలం అయ్యారనే ఆరోపణలు విన్పిస్తోన్నాయి. ఒకవేళ సమీక్షలు చేపట్టినా అధికార పార్టీ నాయకుల కోసమే అన్నట్లుగా వ్యవహరించారని పరిశీలకులు పేర్కొంటున్నారు. జిల్లాలో మెట్ట సేద్యం అచ్చిరాక, రైతన్నలు అనేక అవస్థలు పడుతున్నారు. పండ్లతోటల రైతుల స్థితి రోజురోజుకూ దీనస్థితిగా మారుతోంది. వారికి శాశ్వత పరిష్కార మార్గంగా అడుగులు పడుతాయనే ఆశలు ఏమాత్రం కన్పించడం లేదని విశ్లేషకులు భావిస్తోన్నారు. ఆయా శాఖలల్లో గ్రిప్ కోసమే.... మంత్రులు పర్యటిస్తే శాఖ పరంగా సమీక్షలు నిర్వహించి ఆశాఖలో జిల్లాకు యోగ్యకరంగా ఉంటారని భావించేవారు. అయితే ఆయాశాఖల్లో తెలుగుతమ్ముళ్లు పరపతి పెంచేందుకు మంత్రులు పర్యటనలు సాగుతున్నారుు. డిప్యూటీ ముఖ్యమంత్రి, హోంమంత్రి చిన రాజప్ప పర్యటన సైతం అందుకు నిదర్శనంగా నిలుస్తోంది. తెలుగు తమ్ముళ్లుకు అండగా నిలవని అధికారులను ఆదిశగా ప్రోత్సహించేందుకే ఆయన పర్యటన ఉన్నట్లుగా పరిశీలకులు ఆరోపిస్తున్నారు. -
బోగస్ కార్డులను ఏరిపారేయండి
అనంతపురం రూరల్: బోగస్ రేషన్ కార్డులను ఏరిపారేయాలని, ప్రతి కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయాలని మంత్రి పరిటాల సునీత అధికారులను సూచించారు. మంత్రి తన నివాసంలో శనివారం డీఎస్ఓ ఉమామహేశ్వరరావు, డీఆర్డీఏ పీడీ నీలకంఠారెడ్డి, మార్కెటింగ్ ఏడీ శ్రీకాంత్‌రెడ్డితో సమావేశమయ్యారు. బోగస్ కార్డుల ద్వారా ప్రభుత్వ ఖజానాకు గండిపడుతోందన్నారు. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. నూతనంగా 37,053 రేషన్ కార్డులు మంజూరయ్యాయన్నారు. 9,97,368 కార్డులు ఆధార్‌తో అనుసంధానమయ్యాయన్నారు. మిగిలినవాటిని అనుసంధానం చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. విద్యార్థులకందించే మధ్యాహ్న భోజన పథకం, వసతి గృహాలకు నాణ్యమైన సన్న బియ్యాన్ని సరఫరా చేయాలన్నారు. కొన్ని పాఠశాలలను సందర్శించినప్పుడు విద్యార్థుల అన్నాన్ని పరిశీలించి ఆశ్చర్యపోయినట్లు తెలిపారు. ప్రత్యేక బ్యాగుల ద్వారా నాణ్యమైన బియ్యం అందజేయాలని ఆదేశించారు. 80 వేల పెన్షన్ల పునఃపరిశీలన : ప్రస్తుత నిలుపుదలలో ఉన్న 80 వేల పెన్షన్ల పునఃపరిశీలన చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. 2.98 లక్షల పింఛన్లనుఅందిస్తున్నామని దీంతో పాటుగా 14,767 పెన్షన్లను ప్రభుత్వం తాజాగా మంజూరు చేసిందన్నారు. 65 ఏళ్ల వయసు పైబడిన పేదలందరికీ పింఛన్ వర్తిస్తుందన్నారు. పెన్షన్లు తొలగించబడిన వితంతువులందరికీ పునరుద్ధరించినట్లు మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 3,250 మంది వితంతువుల జాబితాను తయారు చేశామన్నారు. అనర్హులను తొలగించి, అర్హులైన వారికి పెన్షన్లను అందజేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. రైతు బజారులో వసతుల కల్పనకు రూ 5 లక్షలతో చేపట్టిన పనులను పది రోజుల్లో పూర్తి చేయాలని మార్కెటింగ్ శాఖ ఏడీ శ్రీకాంత్‌రెడ్డిని ఆదేశించారు. రైతు బజార్లో కేవలం నాలుగైదు స్టాల్స్ మాత్రమే నడుస్తున్నాయని, పూర్తి స్థాయిలో రైతులకు అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. -
గ్యాస్‌కు, రేషన్‌కు ఆధార్‌తో ముడిపెట్టొద్దు
అధికారులకు మంత్రి సునీత ఆదేశం విశాఖపట్నం : గ్యాస్‌కు, రేషన్‌కు ఆధార్‌తో ముడిపెట్టొద్దని రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి పరిటాల సునీత అన్నారు. ఎప్పటిలాగే ఈ రెండు నిత్యావసరాలను వినియోగదారులకు అందించాలని పౌరసరఫరాల అధికా రులను ఆదేశించారు. నగరంలోని సిరిపురం జంక్షన్లో గల వాల్తేర్ అప్లేండ్ హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీని శనివారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆధార్‌ను దేనికీ అనుసంధానం చేసేలా ప్రభుత్వం ఇంత వరకూ నిర్ణయం తీసుకోలేదని మంత్రి స్పష్టం చేశారు. బోగస్‌కార్డులు, బోగస్ పెన్షన్లు వెలికితీయడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకు అందేలా ప్రతి ఒక్కరికీ ఆధార్‌కార్డు ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. పట్టణప్రాంతాల్లో ఆధార్ నమోదు సంతృప్తికరంగా ఉన్నా, గ్రామాల్లో, గిరిజన ప్రాంతాల్లో నమోదు మందకొడిగా ఉండటంపై ఆమె విచారం వ్యక్తం చేశారు. ఆధార్ నమెదు తక్కువగా ఉన్న గ్రామాలకు అవసరమైతే మొబైల్ వాహనాలను పంపించి అరందరికీ ఆధార్ నమోదయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. -
67లక్షల మందికి రేషన్ నిలిపివేత
హైదరాబాద్: వచ్చే నెల నుంచి ఏపిలో 67 లక్షల మందికి రేషన్ నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్ కార్డులకు ఆధార్ లింక్ 97 శాతం పూర్తి అయింది. 67 లక్షల కార్డులు బోగస్‌గా గుర్తించారు. వారికి రేషన్ నిలిపివేసే ముందు మరోసారి తనిఖీ చేయాలని పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత జాయింట్ కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో రేషన్ షాపులలో ఈ-పాస్ మిషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి సునీత తెలిపారు. పైలెట్ ప్రాజెక్టుగా కాకినాడలో వంద షాపులలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని షాపులలో ఏర్పాటు చేస్తామన్నారు. బయోమెట్రిక్ విధానం అమలు చేస్తామని చెప్పారు.గూడౌన్లో పని చేసే హమాలీలకు క్వింటల్‌కు 8 రూపాయల నుంచి 12 రూపాయలకు వేతం పెంచుతామని చెప్పారు. దసరా బోనస్ కింద ప్రతి హమాలీకి మూడు వేల రూపాయలు చెల్లిస్తామని చెప్పారు. నకిలీ బంగారాన్ని అరికట్టేందుకు ప్రతి జిల్లాలో ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ నెల 26న ఛత్తీస్‌గఢ్ వెళుతున్నట్లు తెలిపారు. అక్కడ పిడిఎస్ విధానంపై అధ్యయనం చేస్తామని మంత్రి చెప్పారు. ** -
అర్హులందరికి సంక్షేమ పధకాలు అందాలి
అనంతపురం రూరల్: అర్హులైన పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి పరిటాల సునీత అధికారులకు స్పష్టం చేశారు. ఆదివారం ఆమె తన నివాసంలోఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఆమె మాట్లాడుతూ... నిరుద్యోగ యువతకు అండగా ఉండి, ఉపాధి కల్పనకు రుణాలు మంజూరు చేయించాలని సూచించారు. అదే విధంగా ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ప్రకారం దళితులకు కేటాయించిన నిధులను వారి నివాస ప్రాంతాల్లో తాగునీరు, డ్రెయినేజీలు, సీసీరోడ్ల ఏర్పాటు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం, తదితర మౌలిక సదుపాయాల కోసం వినియోగించాలని ఆదేశించారు. అంతేగాకుండా హాస్టళ్లలో కనీస వసతులు లేవని ఫిర్యాదులందుతున్నాయని వాటిపై దృష్టి సారించాలన్నారు. మైనార్టీ శాఖ ద్వారా షాదీఖానాలు, మసీదులు, చర్చిలు, స్మశాన వాటికల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపాలని చెప్పారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ జయరాం, బీసీ కార్పొరేషన్ అధికారి నాగముని, మైనార్టీ కార్పొరేషన్ అధికారి ఖాజామొహిద్దీన్, గిరిజన సంక్షేమాధికారి ప్రేమ్ కుమార్, మైనార్టీ సంక్షేమ శాఖాధికారి దాస్, ఆన్సెట్ సీఈఓ గీతాగాంధీ వాణి, తదితరులు పాల్గొన్నారు. -
చెవిలో పువ్వు!
* ‘అనంత సూపర్ స్పెషాలిటీ’కి చంద్రబాబు రూ.150 కోట్లిచ్చారన్న మంత్రులు సునీత, పల్లె * కేంద్రం రూ.120 కోట్లు, రాష్ట్రం రూ.30 కోట్లు అంటూ అదే వేదికపై మరో మంత్రి కామినేని ప్రకటన * పరస్పర విరుద్ధ ప్రకటనలతో నవ్వులపాలైన అమాత్యులు సాక్షి ప్రతినిధి, అనంతపురం : ‘బొంకరా మల్లన్నా.. అంటే గోల్కొండ మిరపకాయలు తాటి పండంత’ అన్నట్లుగా ఉంది రాష్ట్ర మంత్రుల వ్యవహారం. గురువారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ జిల్లాలోని పెనుకొండ, హిందూపురం తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఆయనతో పాటు జిల్లా మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి ఉన్నారు. మంత్రి పర్యటనలో భాగంగా అనంతపురంలో బోధనాస్పత్రి సమస్యలపై సమావేశం నిర్వహించారు. ఇందులో జిల్లా మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథ రెడ్డి అనంతపురం జిల్లా అభివృద్ధికి తమ నాయకుడు చంద్రబాబు చేస్తున్న కృషిని పోటీ పడి మరీ శ్లాఘించారు. ఈ క్రమంలో ఈ ఇద్దరు మంత్రులూ అనంతపురంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి చంద్రబాబు రూ.150 కోట్లు కేటాయించారని చెప్పారు. వీరి తర్వాత ప్రసంగించిన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి మాత్రం అనంత సూపర్ స్పెషాలిటీకి మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం రూ.120 కోట్లు సమకూరుస్తుందని, మిగతా రూ.30 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. ఒకే వేదికపై మంత్రులు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేయడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. బీజేపీ నుంచి గెలుపొందిన కామినేని శ్రీనివాస్ పొత్తు ధర్మంలో భాగంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి అయ్యారు. మిగిలిన ఇద్దరూ టీడీపీ మంత్రులు. కాబట్టే ఇలా పరస్పర విరుద్ధ ప్రకటనలు చేశారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో కొసమెరుపు ఏమిటంటే... అసలు అనంతపురానికి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఎన్నికలకన్నా ముందే యూపీఏ ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ రూ.120 కోట్లు మంజూరు చేసింది. మిగిలిన రూ.30 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలని 2014 జనవరి 1న కేంద్రం.. రాష్ట్ర సర్కారుకు లేఖ పంపింది. జిల్లా మంత్రులేమో చంద్రబాబు రూ.150 కోట్లు కేటాయించారని.. కామినేని ఏమో తమ కేంద్ర ప్రభుత్వం రూ.120 కోట్లు కేటాయించిందంటూ వాస్తవాన్ని కప్పిపుచ్చి ప్రజల చెవిలో పువ్వు పెట్టే ప్రయత్నం చేశారు. -
జయహో.. దేవరాయ
పండగను తలపించిన రాయల పట్టాభిషేక మహోత్సవాలు రూ.2 కోట్లతో లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునరుద్ధరణ పర్యాటక కేంద్రాలుగా పెనుకొండ, గుత్తి కోట గుప్త నిధుల కేటుగాళ్లపై నిఘా ముగింపు ఉత్సవాల్లో మంత్రి పరిటాల సునీత సాక్షి, అనంతపురం : శ్రీకృష్ణదేవరాయల 504వ పట్టాభిషేక మహోత్సవాలు పండగను తలపించడం సంతోషంగా ఉందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత అన్నారు. పెనుకొండలో రెండు రోజులపాటు నిర్వహించిన ఉత్సవాలు గురువారం ముగిశాయి. పెనుకొండ కోటపై ఎమ్మెల్యే బీకే పార్థసారథి అధ్యక్షతన గురువారం జరిగిన ముగింపు కార్యక్రమంలో, అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. తమ ప్రభుత్వంలో రాయల ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. వచ్చే ఏడాది మరింత ఘనంగా నిర్విహ స్తామన్నారు. ముందుగా కొండపైకి వాహనాలు వెళ్లేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తామన్నారు. కోటలో శిథిలావస్థకు చేరుకున్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని రూ.2 కోట్లతో పునరుద్ధరిస్తామని, ఇస్కాన్ ఆధ్వర్యంలో కోటపై శ్రీకృష్ణుడి ఆలయం నిర్మిస్తామని ప్రకటించారు. రాయల కీర్తి, చారిత్రక నిర్మాణాల గురించి తెలియజేసేందుకు వీలుగా కోటపై మ్యూజియం ఏర్పాటు చేస్తామన్నారు. కోట సంపద పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు. రాయల కీర్తి ప్రతిష్టలను చాటిచెప్పేందుకు, తెలుగు జాతి ఔన్నత్యాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. గుప్త నిధుల కోసం తవ్వకాలు సాగించే వారిపై నిఘా పెంచుతామన్నారు. అనంతరం రాయల ఉత్సవాల్లో ప్రదర్శనలు నిర్వహించిన కళాకారులకు మంత్రి చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేశారు. అంతకు ముందు ఇస్కాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భోజన కార్యక్రమాన్ని మంత్రి సునీత ప్రారంభించారు. కోట పునఃనిర్మాణానికి చర్యలు : హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప మాట్లాడుతూ పెనుకొండ కోటను పునఃనిర్మిస్తామన్నారు. కోటపై విద్యుత్ దీపాలు, రోడ్లు, తాగునీటి వసతి కల్పించేందుకు రూ.25 కోట్లు మంజూరు కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతామని తెలిపారు. రాయలేలిన సీమలో ఫ్యాక్షన్ సంస్కృతిని చెరిపి వేయడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు. రాయలసీమలో రాయల కీర్తి గురించి తప్ప ఫ్యాక్షన్ మాట వినపడడానికి ఆస్కారం లేకుండా చేస్తామన్నారు. పోటెత్తిన కోట : రాయల ఉత్సవాల సందర్భంగా పెనుకొండ కోట జనంతో పోటెత్తింది. కోటపై ఉత్సవాలకు హాజరయ్యే ప్రజలకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తామని ప్రకటించిన అధికారులు చివరకు చేతులెత్తేసినా.. ప్రజలు, విద్యార్థులు మాత్రం తెలుగు జాతి ఔన్నత్వాన్ని చాటిచెప్పేందుకు, రాయలపై ఉన్న అపార గౌరవంతో ఎనిమిది కిలోమీటర్ల మేర కాలినడకన కోటకు చేరుకున్నారు. కోట నలువైపులా కలియ దిరిగారు. చారిత్రక కట్టడాలు శిథిలావస్థకు చేరుకోవడంపై ఆవేదన చెందారు. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు : ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతపురం అరబింద్ ఆర్ట్స్ అకాడమీ కళాకారిణులు చేసిన పలు నృత్య ప్రదర్శనలు, హైదరాబాద్ నృత్య కారిణులు ‘శ్రీకృష్ణ లీలలు’ గేయానికి చేసిన ప్రదర్శన అమితంగా ఆకట్టుకుంది. ముగింపు కార్యక్రమంలో మడకశిర ఎమ్మెల్యే ఈరన్న, జెడ్పీ చైర్మన్ చమన్‌సాబ్, జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, డీఈఓ మధుసూదన్‌రావు, సివిల్ సప్లయీస్ డీఎం వెంకటేశం, డీఆర్డీఏ పీడీ నీలకంఠారెడ్డి పాల్గొన్నారు. -
శ్రీకృష్ణదేవరాయలు పట్టాభిషేక మహోత్సవాలు ప్రారంభం
అనంతపురం: పెనుకొండలో శ్రీకృష్ణదేవరాయలు పట్టాభిషేక మహోత్సవాలను పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత ప్రారంభించారు. శ్రీకృష్ణదేవరాయలు 504వ పట్ట్భాషేక ఉత్సవాలు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ రోజు, రేపు ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా పాల్గొన్నారు. దేశభాషలందు తెలుగు లెస్స అని పలికిన శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సింహాసనం అధిరోహించి 504 సంత్సరాలు పూర్తయ్యాయి. విజయనగర సామ్రాజ్య వైభవం అనంతపురం జిల్లాలో కూడా విస్తరించి ఉంది. అందుకే ఆ మహనీయుడిని తలుచుకుంటూ ఉత్సవ కార్యక్ర మాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. చిత్తూరు జిల్లా చంద్రగిరి దగ్గరలోని దేవకీపురంలో నాగ లాంబ, నరసనాయక దంపతులకు 1471 జనవరిలో శ్రీకృష్ణదేవరాయలు జన్మించి ఉంటారన్నది చరిత్రకారుల భావన. 1510లో శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషేక మహోత్సవం జరిగింది. -
ఇమేజ్ కోసం ఆరాటం
సాక్షి ప్రతినిధి, కడప: అందివచ్చిన అవకాశంతో ప్రాంతాభివృద్ధి కోసం పాటుపడే నేతలు కొందరైతే, అధికారాన్ని అడ్డుపెట్టుకొని వ్యక్తిగత ఇమేజ్ పెంచుకొనేందుకు ఆరాట పడేవారు మరికొందరు. జిల్లాకు చెందిన తెలుగు తమ్ముళ్లు రెండో కోవలోకి చేరుతున్నారు. జిల్లాలోని పెండింగ్ పథకాల పూర్తి కోసం ఏమాత్రం ఆలోచించకుండా వ్యక్తిగత ప్రయోజనాలు చేకూర్చే పనుల పైనే దృష్టి సారిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశాక జిల్లా అభివృద్ధికి గ్రహణం పట్టిందని పలువురు పేర్కొంటున్నారు. జిల్లాలో ఇప్పటి వరకూ వరుసగా రాష్ట్ర మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి, రావెళ్ల కిశోర్‌బాబు పర్యటించారు. మంత్రుల పర్యటనలకు జిల్లా తెలుగుదేశం నేతలు ప్రాధాన్యత ఇచ్చారు. అయితే ఈ ప్రాంతం అభివృద్ధి గురించి ఏ ఒక్కరూ దృష్టి సారించలేదని పలువురు ఆరోపిస్తున్నారు. మంత్రుల పర్యటనలోనూ నాయకులు వారిని అంటి పెట్టుకొని ఉండటం మినహా జిల్లాకు ప్రయోజనం చేకూర్చే ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని వివరించిన దాఖలాలు లేవు. తక్కువ ఖర్చుతో అభివృద్ధి ఫలాలు అందించే పథకాన్ని సైతం గుర్తించలేని దుస్థితిలో తెలుగు తమ్ముళ్లు ఉండటం విచారకరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లా అధికారుల దృష్టిలో మంత్రులకు అత్యంత సన్నిహితులు అన్పించుకునేందుకే వారు ఆరాటపడుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. సన్మానాలతోనే సరి.. జిల్లాలో ముగ్గురు మంత్రులు పర్యటిస్తే జిల్లాకు సంబంధించిన అభివృద్ధి పనుల గురించి అడిగిన, కనీసం వినతిపత్రం ఇచ్చిన నాయకుడు లేడనే విమర్శలు వినవస్తున్నాయి. కొత్త భిక్షగాడు పొద్దు ఎరుగడు అన్నట్లు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన నాయకులు మంత్రులకు సన్మానాలు చేయడం, మెమెంటోలు ఇవ్వడం, అవకాశం దక్కితే డిన్నర్లు ఇవ్వడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. వాస్తవానికి రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన నాయకులు ప్రాంతం కోసం, ప్రజాసేవ కోసం పరితపించాలి. అయితే వ్యక్తిగత ఇమేజ్ కోసం ఆరాటపడుతుండటం విచారకరమని పలువురు పేర్కొంటున్నారు. వర్గరాజకీయాలకు ప్రాధాన్యత.. అధికారం దక్కిందనే ఉద్దేశంతో జిల్లా టీడీపీ నాయకులు వర్గ రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులో భాగంగా పౌరసరఫరాలశాఖ మంత్రి పరిటాల సునీత అండతో జిల్లాలోని డీలర్‌షిప్‌లు మార్చడమే లక్ష్యంగా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. జమ్మలమడుగు డివిజన్లో ఈ తరహా రాజకీయాలకు అధికారపార్టీ నేతలు ప్రాధాన్యత ఇస్తున్నారని పలువురు భావిస్తున్నారు. అలాంటి రాజకీయ సమీకరణలు మినహా, జిల్లా అభివృద్ధి కోసం ఒక్కరంటే ఒక్కరు కూడా సమగ్రమైన వివరాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ల లేదని పలువురు ఆరోపిస్తున్నారు. సీఎంకు సన్నిహితుడిగా చెప్పుకునే మరో ముఖ్య నాయకుడు ఓ సామాజిక వర్గానికి చెందిన అధికారులు జిల్లాలో పనిచేయరాదనే తలంపుతో ఉన్నారని పలువురు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా తన బ్రాండ్ ఉండాలనే లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఇలా ఎవరి పరిధిలో వారు వ్యక్తిగత ఇమేజ్ కోసం తాపత్రయ పడుతుండటం మినహా ప్రాంత అభివృద్ధి.. ప్రజల కోసం పాటుపడేవారు అధికార పార్టీలో మచ్చుకైనా కన్పించడం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
మంత్రి సునీతను నిలదీసిన తెలుగు తమ్ముళ్లు
పేరూరుకే కాదు.. మా చెరువులకూ నీరివ్వండి కళ్యాణదుర్గం : ‘అక్కా... పేరూరు డ్యామ్‌కే కాదు... మొదట మా కళ్యాణదుర్గం చెరువులకూ నీరివ్వండి’ అంటూ పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీతను తెలుగు తమ్ముళ్లు నిలదీశారు. ఆదివారం సివిల్ సప్లై గోదాముల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పేరూరు డ్యామ్‌కి నీరు తీసుకొస్తే రైతు సమస్యలు తీరుతాయని మంత్రి పరిటాల సునీత చెప్పారు. కార్యక్రమం ముగిశాక ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి కుమారుడు మారుతి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు బాదన్నలు కళ్యాణదుర్గం రైతుల కష్టాలు తీరాలంటే మొదట ఈ ప్రాంత చెరువులకు నీరందించాలని మంత్రిని డిమాండ్ చేశారు. ఇక్కడికి నీరిచ్చిన తర్వాతే పేరూర్ డ్యామ్‌కు తీసుకెళ్లండన్నారు. ఇందుకు స్పందించిన మంత్రి ఇది వరకే చేయించిన సర్వే ప్రకారం రూ.800కోట్లు ఖర్చు అవుతుందని, కళ్యాణదుర్గం మీదుగా చెరువులకు నీరు నింపి పేరూరుకు తీసుకెళ్లాలంటే నిధులు రెండింతలు కావాలని తెలపగా.. ఇదే ప్రతిపాదనను అమలు చేయాలని నాయకులు కోరారు. -
ధరలు తగ్గించేందుకు చర్యలు తీసుకున్నాం
శాసనమండలిలో మంత్రి సునీత సాక్షి, హైదరాబాద్: నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి, ప్ర జలు ఇబ్బందులు పడుతున్నారని శాసనమండలి సభ్యులు సోమవారం సభ దృష్టికి తెచ్చారు. ధరలు పెరగడానికి కారణాలేమిటి? వాటి నివారణకు తీసుకుంటున్న చర్యలేమిటి? ధరల స్థిరీకరణ నిధిని ఎప్పుడు ఏర్పాటు చేస్తారని సభ్యులు రత్నాబాయి, రుద్రరాజు పద్మరాజు(కాంగ్రెస్) ఆదిరెడ్డి అప్పారావు(వైఎస్సార్సీపీ) తదితరులు ప్రశ్నించారు. పౌర సరఫరాల మంత్రి పరిటాల సునీత సమాధానమిస్తూ.. రెండు నెలలుగా ఉల్లి, టమటా ధరలు పెరిగాయని, ప్రభుత్వ చర్యలతో ప్రస్తుతం ధరలు తగ్గుముఖం పట్టాయని చెప్పారు. ధరలను అదుపు చేసేందుకు జాయింట్ కలెక్టర్ల వద్ద రూ.15 లక్షల వరకు నిధిని ఏర్పాటు చేశామని చెప్పారు. రైతు బజార్లలో ప్రస్తుతం కూరగాయలు విక్రయిస్తున్న వారిని తొలగించి, కొత్త వారికి అవకాశం కల్పిస్తున్నారని, ఈ విధానానికి స్వస్తి పలకాలని ఆదిరెడ్డి అప్పారావు కోరారు. అలా తొలగిస్తున్నట్లు ఎవరైనా ఫిర్యాదు చేస్తే విచారించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి సునీత చెప్పారు. -
రండి బాబూ రండి..
సాక్షి, కడప : ప్రజలకు పంపిణీ చేసే నిత్యావసర వస్తువుల విషయంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. వీరి నిర్లక్ష్యం కారణంగా గోడౌన్లో రూ. లక్షలు విలువైన సరుకులు మగ్గుతున్నాయి. ఒకరోజు కాదు.. రెండు రోజులు కాదు..ఏకంగా ఏడాది కాలంగా రూ. రూ. 60 లక్షల విలువైన సరుకులు మగ్గుతున్నా ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. కనీసం మిల్లర్లకు అమ్మేందుకు కూడా చొరవ చూపడం లేదు. ఇటీవల జిల్లాకు వచ్చిన పౌరసరఫరాలశాఖ మంత్రి పరిటాల సునీత ఈ విషయంలో తీవ్రంగా మండిపడినా అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఏడాదికి కాలంగా గోడౌన్లో..అమ్మహస్తం సరుకులు... అమ్మహస్తం పథకంలో భాగంగా అప్పటి కిరణ్ సర్కార్ 2013 జనవరిలో 9 వస్తువులకు సంబంధించిన సరుకులను లారీల ద్వారా జిల్లాకు పంపించారు. అప్పట్లో అధికారులు పరిశీలించుకున్నారో లేదో తెలియదుగానీ గోడౌన్లో దించుకుని...తర్వాత తాపీగా చూసుకుంటే ప్రజలకు పంపిణీ చేసే వస్తువుల్లో నాణ్యత లోపించినట్లు స్పష్టమైంది. 2013 జనవరి నుంచి ఇప్పటివరకు గోడౌన్లోనే సరుకులు నిల్వ ఉన్నాయి. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు ఈ విషయాన్ని ఇంతవరకు బయటికి పొక్కనీయకుండా జాగ్రత్తలు తీసుకున్నా.. ఇటీవలే ఓ సమీక్షా సమావేశంలో బహిర్గతమైంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపినా పట్టించుకోలేదని ఇక్కడి అధికారులు పేర్కొంటున్నారు. గోడౌన్లో రూ. 60 లక్షల విలువైన సరుకులు పౌరసరఫరాలశాఖ గోడౌన్లో ఉన్న అమ్మహస్తం సరుకులు నాణ్యతగా లేవని ఏడాది కాలంగా అక్కడే ఉంచారు. చింతపండు 47.690 టన్నులు...దీని విలువ దాదాపు రూ. 33,59,354, కారంపొడి 21.274 టన్నులు..దీని విలువ రూ. 20,64,428, పసుపు 5.474 క్వింటాళ్లు కాగా దీని విలువ రూ. 5,47,900 కలుపుకుంటే దాదాపు రూ. 60 లక్షల విలువైన సరుకులు గోడౌన్లో ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి మందలించినా.... గోడౌన్లో ఉన్న సరుకుల విషయం బయటపడి పౌరసరఫరాలశాఖ మంత్రి పరిటాల సునీత స్వయంగా జిల్లా అధికారులను మందలించినా మార్పు కనిపించడం లేదు. సరుకులను మిల్లర్లకు విక్రయించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. అయినా ఇంతవరకు పురోగతి కనిపించడం లేదు. గతంలో ఎండీ స్థాయి అధికారులకు తెలిపినా పట్టించుకో లేదని.. మా తప్పేమి లేదని..మాకేమి కాదంటూ కొంతమంది అధికారులు కార్యాలయంలోనే కూర్చొని లెక్కలు వేసుకుంటున్నట్లు సమాచారం. అయితే ఎండీ స్థాయి అధికారికి తెలిపినా ఎందుకు అలాగే గోడౌన్లోనే నిల్వ పెట్టించారన్న విషయం అర్థం కావడం లేదు. సరుకులో నాణ్యత లోపించిన సందర్భంలో మిల్లర్లకు విక్రయించడమో, లేకపోతే వెనక్కి తెప్పించుకోవడమో జరుగుతుందని... అలాగే గోడౌన్లో నిల్వ చేయడం వల్ల సరుకులు మరింత క్షీణించి నాణ్యత మరింత తగ్గుతుందని శాఖకు చెందిన సిబ్బందే చెప్పుకుంటున్నారు. అమ్మినా కొనుగోలు చేసేవారు కరువే చింతపండు, కారంపొడి, పసుపు గోడౌన్‌కు వచ్చి ఏడాదిన్నర దాటింది. ఇన్ని రోజులు గోడౌన్లో నిల్వ చేసిన సరుకులలో నాణ్యత ఎంతవరకు ఉంటుందన్నది ప్రశ్నార్థకం. పౌరసరఫరాలశాఖ అధికారులు విక్రయించేందుకు సిద్ధపడినా కొనుగోలు చేసేందుకు మిల్లర్లు రావడం అనుమానంగా మారింది. అధికారులు మాత్రం ఎవరో ఒకరు వస్తే ఎంతో కొంతకు అమ్మేస్తామని పేర్కొంటున్నా....కర్ణాటక, అనంతపురం ప్రాంతాలకు చెందిన కొంతమంది వ్యాపారులు చింతపండును కేవలం కిలో రూ. 16 చొప్పున సరుకులు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపినట్లు తెలిసింది. ప్రస్తుతం వీరు కూడా అనాసక్తి ప్రదర్శిస్తున్నట్లు సమాచారం. జిల్లా మేనేజర్ ఏమంటున్నారంటే! ప్రస్తుతం గోడౌన్లో రూ. 50 లక్షలకు పైగా విలువ చేసే చింతపండు, కారంపొడి, పసుపు నిల్వలున్న ఉన్న మాట వాస్తవమే. నాణ్యత లేకపోవడంతో ఏడాది కాలంగా ఇక్కడే ఉంచాం. ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాం. ఎవరైనా మిల్లర్లు ముందుకొస్తే విక్రయించడానికి సిద్ధంగా ఉన్నాం. - బుల్లయ్య, జిల్లా మేనేజర్, పౌరసరఫరాలశాఖ,కడప నేడు ఎండీతో సమావేశం హైదరాబాదులోని సోమాజిగూడలో ఉన్న సివిల్ సప్లయ్ కార్యాలయంలో ఎండీ అనిల్‌కుమార్‌తో సోమవారం జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులకు సమావేశం జరగనుంది.జిల్లాకు సంబంధించిన గోడౌన్లతోపాటు స్టాకు నిల్వల విషయం, ఇతర అనేక అంశాలపై ఎండీతో జిల్లా అధికారులు చర్చించనున్నట్లు తెలియవచ్చింది. -
త్వరలో అన్ని జిల్లాల్లో అన్నా క్యాంటిన్లు: నారాయణ
హైదరాబాద్: తక్కువ ధరకే ఆహార పదార్థాలను అందించేందుకు త్వరలో అన్ని జిల్లాల్లో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని ఏపీ మంత్రులు పరిటాల సునీత, నారాయణ తెలిపారు. తొలివిడతగా నాలుగు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. విశాఖలో 15, తిరుపతిలో 5, అనంతపురంలో 5, గుంటూరులో 10 క్యాంటీన్ల ఏర్పాటు చేయనున్నట్టు మంత్రులు తెలిపారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ఆస్పత్రిల వద్ద అన్నా క్యాంటిన్లను ఏర్పాటు చేస్తామని, పథకం ఎప్పుడనేది రేపటి కేబినెట్లో నిర్ణయం తీసుకుంటామని నారాయణ మీడియాకు వెల్లడించారు. ఏపీలో అన్నా క్యాంటీన్ల ఏర్పాటుపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో మంత్రులు పరిటాల సునీత, నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావులు పాల్గొన్నారు. ఏపీలో అన్నా క్యాంటిన్ల పథకం సాధ్యాసాధ్యాలపై పౌరసరఫరాల శాఖ అధికారుల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించారు. -
ఆధార్.. బేజార్
సాక్షి, ఒంగోలు : ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆధార్‌కార్డు లింకు పెట్టొద్దని గతంలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కోర్టు తీర్పును కాదంటూ.. ప్రతీ పథకానికి ఆధార్(రం) ఉండాల్సిందేనంటూ పట్టుబడుతోంది. తాజాగా ప్రజా పంపిణీ సరుకులను ఆధార్ నమోదు ద్వారానే కొనసాగించాలని పౌరసరఫరాలశాఖ మంత్రి పరిటాల సునీత ప్రకటించారు. ఈ మేరకు జిల్లా అధికారులు మంత్రి ఆదేశాలను తూ.చా తప్పకుండా అమలుకు సిద్ధపడుతున్నారు. ఇప్పటికే గ్యాస్ బుకింగ్ ఏజెన్సీలు ఆధార్ నమోదు లేకుంటే బుకింగ్ చేయమంటూ వినియోగదారులకు చెబుతున్నాయి. సబ్సిడీ భారం తగ్గించుకునేందుకు ప్రభుత్వం సవాలక్ష మార్గాలను అన్వేషిస్తోందని సర్వత్రా విమర్శిస్తున్నారు. మీ-సేవా కేంద్రాల్లో ఆధార్ సీడింగ్ పాయింట్లు ఏర్పాటు చేసినా వినియోగదారులు వాటిని సద్వినియోగం చేసుకోవడంలో ముందుకురాలేకపోతున్నారు. గతంలో కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఈ కార్డు లేకపోయినా ఫర్వాలేదని భావించారు. మళ్లీ ఆధార్ అనుసంధాన ప్రక్రియ తెరమీదికి తేవడంతో పేదలు మీ-సేవా కేంద్రాలకు పరిగెడుతున్నారు. రిజిస్ట్రేషన్ నంబర్లు వచ్చే వరకూ గ్యాస్ సిలిండర్లతో పాటు ప్రజా పంపిణీ సరుకులు నిలిపివేయరాదని కోరుతున్నారు. సగానికి సగమే.. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు ఆధార్ రిజిస్ట్రేషన్ చేసుకున్న కుటుంబాల సంఖ్య నామమాత్రంగా ఉంది. జిల్లా జనాభా 33 లక్షలకు పైగా ఉండగా గ్రామాల్లో ఐరీష్ పరీక్షతో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారి సంఖ్య తక్కువగా ఉంది. చాలామంది మీ-సేవాకేంద్రాల్లో ఐరీష్ తీయించుకున్నా వారికి ఆధార్‌కార్డులు పోస్టల్ సర్వీసు ద్వారా చేరలేదు. తప్పులతడకతో జారీ అయిన కార్డులను మళ్లీ మార్చుకునే ప్రక్రియ గురించి వినియోగదారులకు సరైన సమాధానమిచ్చే అధికారి కరువయ్యాడు. దీంతో చాలామంది లబ్ధిదారులు ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ఆధార్‌కార్డు అనుసంధానం చేసుకోలేకపోతున్నారు. ఇప్పటి వరకు అనుసంధానమైన కార్డుదారుల వివరాల్లోకొస్తే.. జిల్లాలో మొత్తం 29 లక్షల 9 వేల 116 కుటుంబాలు ఉండగా జూలై ఆఖరు వరకు 16 లక్షల 24 వేల 981 కుటుంబాలు మాత్రమే ఆధార్ అనుసంధానం చేసుకున్నాయి. అంటే 58శాతం మాత్రమే ఈ ప్రక్రియను పూర్తి చేశారు. అదేవిధంగా జిల్లాలో 59 ఎల్పీజీ గ్యాస్ కంపెనీలు ఉండగా వాటి పరిధిలో 6,1,115 మంది వినియోగదారులు ఉన్నారు. వీరిలో 4,81,083 మంది ఆధార్‌ను అనుసంధానం చేసుకున్నారు. జిల్లాలో పూర్తిస్థాయిలో ఆధార్‌కార్డుల ఆనుసంధాన ప్రక్రియను ఈ నెల 15లోగా పూర్తి చేయాలని కలెక్టర్ విజయకుమార్ ఇప్పటికే అధికారులకు ఆదేశాలిచ్చారు. పేదలు మాత్రం ప్రస్తుతం ప్రజాపంపిణీ దుకాణాల నుంచి తీసుకున్న సరుకుల్ని ఆధార్ సాకుతో నిలిపివేయడం ఎంతవరకు సబబంటూ నిలదీస్తున్నారు. అనుసంధాన ప్రక్రియకు తమకు కొద్ది రోజులు గడువుఇవ్వాలని సర్వత్రా కోరుతున్నారు. -
మగ్గిపోయిన రూ.50 లక్షల విలువైన చింతపండు
కడప(వైఎస్ఆర్ జిల్లా): గోడౌన్లలో 50 లక్షల రూపాయల విలువైన చింతపండు మగ్గిపోవడంపై ఏపి పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత అధికారులపై మండిపడ్డారు. పౌరసరఫరాల అధికారులతో మంత్ఉరి ఈరోజు ఇక్కడ సమీక్ష నిర్విహించారు. రాయలసీమ నుంచి కర్ణాటకకు అక్రమంగా బియ్యం రవాణా అవుతున్నాయని, వాటిని నివారించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఆమె అన్నారు. మండలానికో కిరోసిన్ బంక్ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు మంత్రి తెలిపారు. వైఎస్ఆర్ సిపికి చెందిన డీలర్లను కక్ష సాధింపుతో తొలగిస్తున్నారని, పార్టీలకు అతీతంగా వ్యవహరించాలని వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి కోరారు. వృద్ధ్యాప్య పెన్షన్లలో కొత్త విధానం ఇబ్బందికరంగా మారిందని మేయర్ సురేష్ బాబు చెప్పారు. సోమశిల బ్యాక్‌వాటర్ పనులను కొనసాగించాలని కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా కోరారు. ఈ సమీక్షా సమావేశానికి విప్ మల్లికార్జునరెడ్డి, ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. -
ఆర్డీవోలు ఉన్నారా.. లేరా?
అధికారులు సమావేశానికి ఎందుకు హాజరు కాలేదు? డీఆర్వోపై మంత్రి పరిటాల సునీత ఆగ్రహం మదనపల్లె: ‘ముఖ్యమంత్రి సొంత జిల్లా లో అసలు ఆర్డీవోలు ఉన్నారా.. లేరా? ఉంటే వాళ్లేమైనా ప్రతిపక్ష పార్టీకి చెందిన వాళ్లా? సమీక్ష సమావేశానికి ఎందుకు రాలేదు’ అని రాష్ట్ర పౌరసరఫరాల శాఖమంత్రి పరిటాల సునీత డీఆర్వోపై ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం స్థానిక సీఎల్ఆర్సీ భవనం లో ఏర్పాటుచేసిన జిల్లాస్థాయి రెవెన్యూ అధికారుల సమీక్ష సమావేశానికి జిల్లాలోని జాయింట్ కలెక్టర్, ఆర్డీవోల గైర్హాజరుపై మంత్రి అసంతృప్తిని వ్యక్తం చేశారు. సమావేశంలో అధికారులంతా ఉత్సాహంగా లేకపోవడంతో ‘మీరింకా కాంగ్రెస్ ప్రభుత్వ నిద్రనుంచి లేవలే దా.. త్వరగా లేవండి లేచి విధులు సక్రమంగా నిర్వర్తించండి’ అంటూ చలోక్తులు విసిరారు. అంతేకాకుండా వచ్చే సమావేశానికి అధికారులు రాకుంటే నేరుగా వారి ఇళ్లకు వెళ్ళి మాట్లాడుతాన ని ఘాటుగా హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో ఆధార్ అనుసంధానం 90 శాతం జరగడం సంతోషకరమన్నారు. ప్రభుత్వ పంపిణీ వ్యవస్థను ప్రజలకు నేరుగా చేరవేసేలా పౌరసరఫరాల శాఖ కృషి చేయాలన్నారు. పార్టీలకతీతంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికారులం తా నిబధ్ధతతో పనిచేయాలని సూచిం చారు. అధికారులు కార్యాలయాల్లో ఉండకుండా గ్రామస్థాయిలో పర్య టిం చి ప్రజాసమస్యలను తెలుసుకోవాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కిరోసిన్ పంపిణీలో పక్కా మోసం జరుగుతున్నట్లు తమకు సమాచారం ఉందనీ.. మోసా న్ని అరికట్టేందుకు అందరూ సమష్టిగా కృషి చేయాలన్నారు. రేషన్‌షాపుల్లో 9రకాల నిత్యావసర సరుకులను ఒకేసారి సరఫరా చేసేలా తమ శాఖ ప్రణాళికలు రూపొందిస్తుందని చెప్పారు. సరుకుల కేటాయింపులో తప్పులు దొర్లకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చౌకదుకాణాల్లో ఇస్తున్న కొన్ని సరుకుల్లో నాణ్యత లేవని తన దృష్టికి వచ్చిందన్నారు. మహిళలతో చర్చించి వాటి స్థానంలో వేరే వస్తువులను ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా లో ఎలాంటి అవినీతి అక్రమాలు జరిగినా ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో తంబళ్లపల్లె ఎమ్మెల్యే జి.శంకర్‌యాదవ్, మదనపల్లె మున్సిపల్ చైర్మన్ కొడవలి శివప్రసాద్, డీఎస్వో విజయరాణి, డీఆర్వో శేష య్య, రెవెన్యూ, తూనికలు, కొలతలు శాఖ అధికారులు పాల్గొన్నారు. -
రైతు బజార్ల పటిష్టానికి చర్యలు
అనంతపురం అగ్రికల్చర్: రైతు బజార్ల వ్యవస్థ పటిష్టానికి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పౌర సంబంధాల శాఖ మంత్రి పరిటాల సునీత, పౌర సంబంధాలు, ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఉదయం జిల్లా కేంద్రంలోని రైతు బజార్లో బియ్యం విక్రయ కేంద్రాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ... తక్కువ ధరలకే నాణ్యమైన కూరగాయలతోపాటు, నిత్యావసర వస్తువులు అందించాలన్న లక్ష్యంతో జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన రైతుబజార్ నిరుపయోగంగా మారిందన్నారు. జిల్లా కేంద్రంతోపాటు మరో ఏడు మున్సిపాలిటీల్లో సోనామసూరి బియ్యం కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మంత్రి పల్లె మాట్లాడుతూ... వ్యవసాయశాఖ అనుబంధ శాఖలతో పాటు మార్కెటింగ్ అధికారుల సహకారంతో రైతుబజార్ వ్యవస్థను పటిష్టం చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో ఐటీ రంగం అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే ఔత్సాహికులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. శాసనమండలి సభ్యుడు డాక్టర్ గేయానంద్ మాట్లాడుతూ, నిరుపయోగంగా ఉన్న రైతుబజార్‌ను మేజర్ మార్కెట్‌గా తీర్చిదిద్దడానికి మంత్రులు చొరవ తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆర్ట్స్‌కళాశాల అనుబంధంగా ఉన్న వసతిగృహానికి రాయితీపై వంటగ్యాస్ అందించాలని కోరగా ఈ అంశాన్ని పరిశీలించాలని మంత్రి పరిటాల సునీత డీఎస్వోను ఆదేశించారు. రైతుబజార్ల సీఈఓ ఎంకే సింగ్ మాట్లాడుతూ... రాష్ట్రంలో ఉన్న 80 రైతుబజార్లకు పూర్వవైభవం తీసుకువస్తామని భరోసా ఇచ్చారు. ఓపెన్‌ఎయిర్ జైలులో ఖైదీలు పండించే పండ్లు, కూరగాయల ఉత్పత్తులు కూడా ఇక్కడే అమ్ముకునేలా ప్రోత్సహిస్తామని తెలిపారు. బియ్యం నాణ్యతపై మంత్రి అసంతృప్తి కౌంటర్ ద్వారా పంపిణీ చేస్తున్న బియ్యం నాణ్యతపై మంత్రి సునీత నాణ్యతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మట్టిపెల్లలు, కొంచెం పురుగు పట్టిఉండటాన్ని గమనించారు. నాణ్యతపై రాజీపడవద్దంటూ బియ్యం సరఫరా చేసే రైస్‌మిల్లర్ల అసోసియేషన్, మండీమర్చంట్ అసోసియేషన్ నాయకులకు సూచించారు. సమావేశంలో సివిల్సప్ల్సై డీఎం వెంకటేశం, మార్కెటింగ్‌శాఖ ఆర్జేడీ సి.రామాంజినేయులు, ఏడీ బి.శ్రీకాంత్‌రెడ్డి, డీఆర్డీఏ పీడీ కె.నీలకంఠరెడ్డి, ఏపీఎంఐపీ పీడీ వెంకటేశ్వర్లు, ఉద్యానశాఖ ఏడీలు సత్యనారాయణ, బీవీ రమణ, ఆర్డీవో హుస్సేన్, డీఎస్వో ఉమామహేశ్వర్రావు, తహశీల్దార్ లక్ష్మినారాయణ, సీఎస్డీటీలు తదితరులు పాల్గొన్నారు. రైతు బజార్ అభివృద్ధిపై సమావేశం రైతు బజార్ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ‘ప్రాజెక్టు అనంత’ కార్యాలయంలో మంత్రులు, రైతుబజార్ల సీఈఓ, జేసీ , వ్యవసాయ అనుబంధ శాఖలు, మార్కెటింగ్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. సమస్యలపై చర్చించారు. -
అవినీతికి పాల్పడితే....
అనంతపురం: అవినీతికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత హెచ్చరించారు. రేషన్ షాపుల్లో అవినీతికి పాల్పడితే సహించేదిలేదన్నారు. రుణాలు తీసుకున్న రైతులకు, డ్వాక్రా మహిళలకు నోటీసులు ఇవ్వద్దని బ్యాంకర్లను కోరినట్లు మంత్రి సునీత తెలిపారు. ప్రభుత్వం రుణాలు రద్దు చేస్తామని చెప్పి, ఇంతవరకు ఎటువంటి నిర్ణయం ప్రకటించకపోవడంతో బ్యాంకర్లు రుణం తీసుకున్నవారికి నోటీసులు జారీ చేస్తున్న విషయం తెలిసిందే. -
పరిటాల శ్రీరామ్ గృహనిర్బంధం
రాప్తాడులో అమ్మ ఓడిపోతే.. అంతు చూస్తానంటూ ఓటర్లను బెదిరించిన పరిటాల శ్రీరామ్‌ను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. అనంతపురం జిల్లా రాప్తాడులో ఎన్నికల సందర్భంగా శ్రీరామ్ ఓటర్లను బెదిరించేలా ఇంతకుముందు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయన తల్లి పరిటాల సునీత రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా, ఈ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు గాను పోలీసులు వెంకటాపురంలోని ఆయన ఇంట్లోనే శ్రీరామ్‌ను నిర్బంధంలో ఉంచారు. -
సునీతపై పరువునష్టం దావా వేస్తా: తోపుదుర్తి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దొంగనోట్లు పంచుతున్నారంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడంపై రాప్తాడు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. ఎల్లోమీడియా ద్వారా తనపై నిందలు వేస్తున్నారని, తనపై దుష్ప్రచారం చేస్తున్న ఎల్లో మీడియాతో పాటు టీడీపీ అభ్యర్థి పరిటాల సునీతపై పరువునష్టం దావా వేస్తానని ప్రకాష్ రెడ్డి చెప్పారు. దొంగనోట్లు, నకిలీ మద్యం పంపిణీ చేస్తున్నది టీడీపీ నేతలేనని, అది చాలదన్నట్లు దొంగే దొంగ అన్నట్లు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఓటమి భయంతో పరిటాల సునీత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని, న్యాయం ఎవరివైపు ఉందో ప్రజలే నిర్ణయిస్తారని ఆయన అన్నారు. -
'జేసీ పేరు తలవటానికి కూడా ఇష్టపడను'
తిరుపతి : చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేయటానికి తమ ప్రాణాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. ఆమె బుధవారం తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ రాప్తాడు, పెనుకొండ తమకు రెండు కళ్లులాంటివన్నారు. రెండు నియోజకవర్గాల్లోనూ తమ పాత్ర ఉంటుందని సునీత తెలిపారు. కాగా మాజీమంత్రి జేసీ దివాకర్ రెడ్డి తెలుగు దేశం పార్టీలో చేరటంపై తాను ఏమీ వ్యాఖ్యలు చేయనన్నారు. జేసీ దివాకర్ రెడ్డి పేరు తలవటానికి కూడా తాను ఇష్టపడనని సునీత వ్యాఖ్యానించారు. కుమారుడితో కలిసి తిరుపతి వచ్చిన పరిటాల సునీతకు పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.