- సినీ రాజకీయ ప్రముఖులు
తిరుమల
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వరస్వామి వారిని సోమవారం కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవి కుటుంబం దర్శించుకుంది. చిత్తూరు జిల్లాకు చెందిన ఎన్నారైతో ఇటీవలే వివాహమైన చిన్నకుమార్తె శ్రీజ, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఆయన శ్రీవారికి పూజలు నిర్వహించారు.
సోమవారం పలువురు ప్రముఖులు వెంకన్న దర్శనం కోసం వచ్చారు. వీరిలో ఏపీ పౌరసరఫరాల శాఖా మంత్రి పరిటాల సునీత, సీనియర్ నటుడు గొల్లపూడి మారుతీరావు ఉన్నారు.
రేపటి నుంచి శ్రీవారి వసంతోత్సవాలు
తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం నుంచి శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మూడు రోజులపాటు సాగే ఉత్సవాల్లో స్వామివారు వసంతమండపంలో ప్రత్యేక తిరుమంజన పూజలందుకుంటారు. రెండో రోజున శ్రీవారి స్వర్ణరథోత్సంలో ఊరేగుతూ భక్తకోటికి దర్శనమివ్వనున్నారు.