శ్రీవారిని దర్శించుకున్న సచిన్, చిరు,నాగ్ | Nag, chiru visits tirumala | Sakshi
Sakshi News home page

శ్రీవారిని దర్శించుకున్న సచిన్, చిరు,నాగ్

Published Wed, Jun 1 2016 6:48 AM | Last Updated on Wed, Jul 25 2018 3:13 PM

శ్రీవారిని దర్శించుకున్న సచిన్, చిరు,నాగ్ - Sakshi

శ్రీవారిని దర్శించుకున్న సచిన్, చిరు,నాగ్

హైదరాబాద్ :  తిరుమలలో కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామిని పలువురు ప్రముఖులు బుధవారం దర్శించుకున్నారు. సచిన్ టెండుల్కర్, మెగాస్టార్ చిరంజీవి, హీరో నాగార్జున, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్తో పాటు నిమ్మగడ్డ ప్రసాద్ స్వామివారిని వీఐపీ బ్రేక్ దర్శనంలో దర్శించుకున్నారు. అనంతరం వారిని ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. అంతకుముందు ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికారు.

తిరుమలలో భక్తుల రద్దీ బుధవారం కూడా కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం 15 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, నడక భక్తులకు 4 గంటల సమయం పడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement