
67లక్షల మందికి రేషన్ నిలిపివేత
హైదరాబాద్: వచ్చే నెల నుంచి ఏపిలో 67 లక్షల మందికి రేషన్ నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్ కార్డులకు ఆధార్ లింక్ 97 శాతం పూర్తి అయింది. 67 లక్షల కార్డులు బోగస్గా గుర్తించారు. వారికి రేషన్ నిలిపివేసే ముందు మరోసారి తనిఖీ చేయాలని పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత జాయింట్ కలెక్టర్లను ఆదేశించారు.
రాష్ట్రంలో రేషన్ షాపులలో ఈ-పాస్ మిషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి సునీత తెలిపారు. పైలెట్ ప్రాజెక్టుగా కాకినాడలో వంద షాపులలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని షాపులలో ఏర్పాటు చేస్తామన్నారు. బయోమెట్రిక్ విధానం అమలు చేస్తామని చెప్పారు.గూడౌన్లో పని చేసే హమాలీలకు క్వింటల్కు 8 రూపాయల నుంచి 12 రూపాయలకు వేతం పెంచుతామని చెప్పారు. దసరా బోనస్ కింద ప్రతి హమాలీకి మూడు వేల రూపాయలు చెల్లిస్తామని చెప్పారు.
నకిలీ బంగారాన్ని అరికట్టేందుకు ప్రతి జిల్లాలో ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ నెల 26న ఛత్తీస్గఢ్ వెళుతున్నట్లు తెలిపారు. అక్కడ పిడిఎస్ విధానంపై అధ్యయనం చేస్తామని మంత్రి చెప్పారు.
**